
దేశ సేవలో తరిస్తున్న యువత ● సరిహద్దులో పహారా కాస్తున్న
కాణిపాకం: సాంకేతిక యుగంలో యువత సాఫ్ట్‌వేర్ వైపు చూస్తోంది. కొద్దోగొప్పో సంపాదించి జీవితంలో త్వరగా స్థిరపడాలని ఉబలాటపడుతోంది. అయితే పూతలపట్టులోని పలు గ్రామాలకు చెందిన యువకులు దేశ సేవకు అంకితమవుతున్నారు. దేశ రక్షణలో దగ్గరగా ఉంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. డబ్బుకన్నా దేశ రక్షణకు తమ తొలి ప్రాధాన్యమని చాటి చెబుతున్నారు. ఏ ఇంట చూసినా స్వాతంత్య్ర సమరవీరుల చిత్రపటాలే కనిపిస్తాయి. ప్రతి ఇంటి నుంచి ఒకరిద్దరు భారత సైన్యంలో ఉండటం విశేషం!
యాదమరి మండలం, దళవాయిపల్లిలో దాదాపు నలభై కుటుంబాల నుంచి 80 మంది వరకు భారత సైన్యంలో పనిచేస్తున్నారు. 30 మంది వరకు దేశ సేవలో అలుపెరగని పోరాటం చేసి ఉద్యోగ విరమణ చెందారు. వయస్సు పైపడినా దేశ భక్తి నరనరాన జీర్ణించుకుపోయి.. ఇప్ప టికీ తమలో చేవ తగ్గలేదని చెబుతున్నారు. దేశానికి సేవ చేయడం గర్వకారణమని, అదో గొప్ప అనుభూతి అని అభిప్రాయపడుతున్నారు. దేశానికి సేవ చేసే భాగ్యం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. దేశానికి అందించిన సేవ తమతోనే ఆగిపోకూడదనే భావనతో తమ తరువాతి తరం వారిని సైతం భారత సైన్యంలోకి పంపుతున్నారు. యువత కూడా ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు. హవాల్దార్లుగా, నాయక్, లాన్స్ నాయక్, జేసీఓ, సుబేదార్‌గా వివిధ హోదాల్లో దేశ రక్షణలో పాలుపంచుకున్నారు. ఇలా యాదమరిలోని పలు గ్రామాల్లో ఉద్యోగ విరమణ పొందిన, ప్రస్తుతం పనిచేస్తున్న వారు 120 మంది వరకు ఉన్నారు. అలాగే పూతలపట్టు మండలం, చిన్నబండపల్లెలో 75 మంది ఆర్మీ ఉద్యోగులున్నారు. దీంతో పాటు మండల వ్యాప్తంగా వంద మందికిపైగా జవాన్లు ఉంటారని అధికారులు అంచనా వేశారు. అలాగే బంగారుపాళ్యంలో 150 మంది, తవణంపల్లెలో 30 మంది, ఐరాల మండలంలో మాజీ సైనికులతో పాటు 60 మంది ఉన్నారు.
నిద్రలేని రాత్రుల్లో...
తాటిపైకి తీసుకొచ్చిన పదం. ఉగ్రమూకలు చెలరేగుతున్న వేళ.. అమాయకులను పొట్టన పెట్టుకుంటున్న తరుణంలో సైన్యం ఎక్కుపెట్టి న తుపాకీ ప్రతి ఒక్కరిలో దేశభక్తిని రగిల్చింది. మనమంతా గుండెల మీద చేయి వేసుకుని హా యిగా నిద్రపోతున్నామంటే.. సరిహద్దులో సైనికులు నిద్రలేని రాత్రులు గడుపుతుండడంతోనే సాధ్యమవుతోంది. అక్కడ ఏం జరుగుతుందో.. వాళ్లు ఎలా ఉంటున్నారో.. ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటో.. కదనరంగం దృశ్యాలను చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. బుల్లెట్ల మోత.. విరుచుకుపడే మిసైళ్లు.. దూసుకొ చ్చే డ్రోన్లు.. అత్యాధునిక ఆయుధాలకు ఎదురొడ్డి నిలుస్తున్న సైనికులను చూస్తే కన్నీళ్లతో సె ల్యూట్ చేయాలనిపిస్తోంది. సరిహద్దులో ఉద్రిక్తతల వేళ పూతలపట్టులోని పలు గ్రామాలు నిద్రలేని రాత్రులను గడిపాయి.