breaking news
kerala
-
కేరళలో 9 లక్షల ఓటర్ల పేర్లు తొలగింపు
తిరువనంతపురం: కేరళలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే తర్వాత తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ముద్రించింది. 9 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగిస్తూ తుది జాబితాను ముద్రించారు. దీంతో తుది జాబితాలో స్థానం సంపాదించుకున్న మొత్తం ఓటర్ల సంఖ్య 2.69 కోట్లు దాటింది. http:// electoralsearch.eci.gov.in వెబ్సైట్లో కేరళ ఓటర్లు తమ పేరును సరిచూసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది అక్టోబర్‌లో ఎస్ఐఆర్ సర్వే మొదలెట్టక ముందు 2,78,50,855 ఓటర్లు ఉండగా తుది జాబితాలో 2,69,53,644 మందికి చోటు దక్కిందని ఈసీ పేర్కొంది. ఎస్ఐఆర్లో ఓట్ల ప్రక్షాళన తర్వాత 8,97,211 పేర్లు తొలగించారు. తాజాగా కేరళ మొత్తం ఓటర్లలో పురుషులు 1,31,26,048 మంది ఉండగా మహిళలు 1,38,27,319 ఉన్నారు. ట్రాన్స్జెండర్లు కేవలం 277 మంది ఉన్నారు. విదేశాల్లో ఉంటున్న ఓటర్ల సంఖ్య 2,23,558గా తేలింది. సరీ్వస్ ఓటర్ల సంఖ్య 54,110కు చేరుకుంది. తప్పులు, సవరణలు, ఇతరత్రా కారణాలతో వివరణ కోరుతూ 36.88 లక్షల ఓటర్లకు నోటీస్‌లు జారీచేశామని వీళ్లలో 53,229 మంది పేర్లను తనిఖీ తర్వాత చేర్చామని ఈసీ పేర్కొంది. తుది జాబితాను వెరిఫికేషన్ కోసం రాజకీయ పార్టీలకూ అందజేయనున్నారు. శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు చివరితేదీలోపు వరకూ ఓటర్ల జాబితాలోకి కొత్త ఓటర్లను చేర్చేందుకు ఆస్కారముందని ఈసీ అధికారులు స్పష్టంచేశారు. -
సోలార్ పడవలొచ్చాయ్
తిరునంతపురం: కేరళ ప్రభుత్వం మరో అరుదైన ఘనతను సాధించింది. దేశంలో తొలిసారిగా వైకోమ్ పట్టణంలో సోలార్‌తో నడిచే పడవల్ని అందుబాటులోకి తెచ్చింది. తద్వారా కేరళ ప్రభుత్వం పర్యావరణహిత రవాణా రంగంలో కీలక అడుగు వేసినట్లైంది. కేరళ.. ప్రకృతి అందాలకు నెలవు. పర్యావరణ పరంగా కేరళలో సరస్సులు, కాల్వలు, సముద్రతీరపు నీటి మార్గాలు ఎక్కువ. అందుకే అక్కడ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే పడవ ప్రయాణం తప్పని సరి. అదే సమయంలో కొబ్బరిపీచు, జీడిపప్పు, ఇటుక తయారీ, చేపల వేట వంటి సంప్రదాయ వృత్తులు సైతం నీటి మార్గాల పక్కన ఎక్కువగా ఉండంటం వల్ల రవాణా అవసరాలు పడవల ద్వారా జరుగుతుంటాయి. రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, పర్యావరణహిత రవాణా మార్గంగా పడవ ప్రయాణాలు సజావుగా జరిగేలా ప్రభుత్వం పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దింది. ఇందులో భాగంగా వైకోమ్ పట్టణంలో ఇంధనంతో నడిచే పడవల స్థానంలో సోలార్‌తో నడిచే పడవల్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి సి.బి. గణేష్ కుమార్ మాట్లాడుతూ.. వైకోమ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ హబ్‌గా అవతరించింది. ఇది కేరళ పర్యావరణహిత రవాణా రంగానికి మరో కలికితురాయి’అని పేర్కొన్నారు.ఇక ఈ జల రవాణా కేంద్రంలోని ఒక్కో పడవలో 75 మంది ప్రయాణించొచ్చు. 3.15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ పడవలు 80 కిలోవాట్ల శక్తి సామర్థ్యంతో నడుస్తాయి. మొత్తం 10.8 కిలోమీటర్ల మార్గంలో ఈ పడవలు సేవలు అందించనున్నాయి. రోజుకు 15 ప్రయాణాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గి, పర్యాటక రంగానికి కూడా ఊతం లభించనుంది. 2017లో వైకోమ్లో మొదటి సౌర పడవను ప్రవేశపెట్టిన తర్వాత, ఇప్పుడు ఈ కేంద్రం పూర్తిగా సౌరశక్తి ఆధారితంగా మారడం కేరళలో స్థిరమైన రవాణా పరిష్కారాల వైపు ఒక పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు. -
రూ. 20 కోట్ల లాటరీ దక్కింది.. టిక్కెట్ పోయింది!
తిరువనంతపురం: కేరళలో అత్యంత విచిత్ర ఉదంతం చోటు చేసుకుంది. ఒక మాజీ పోలీసు అధికారికి లాటరీ రూపంలో అదృష్టం వరించినా.. అది చేజారిపోవడంతో ఇప్పుడు ఆయన పోలీసులను, చివరకు కోర్టును ఆశ్రయించారు. పిరవం ప్రాంతానికి చెందిన రిటైర్డ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) కేకే సజిమోన్, కేరళ క్రిస్మస్-న్యూ ఇయర్ బంపర్ లాటరీలో రూ. 20 కోట్ల భారీ బహుమతి గెలుచుకున్న టికెట్ (నెం. XC 138455) తనదేనని అంటున్నారు. జనవరి 24న వెలువడిన ఈ ఫలితాల్లో తన టికెట్‌కే మొదటి బహుమతి వచ్చిందని, అయితే పొరపాటున ఆ టికెట్ వేరే వారికి చేరిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పోలీసు విభాగం నుంచి రిటైరైన తర్వాత సజిమోన్ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నారు. అతనికి చెందిన వాహనంలో ఇటీవల విశాఖపట్నం నుంచి వచ్చిన అయ్యప్ప భక్తులు శబరిమల యాత్ర చేశారు. అయితే వారు తిరిగి వెళుతున్నప్పుడు పొరపాటున తమ నెయ్యి డబ్బాను సజిమోన్ వాహనంలోనే మరిచిపోయారు. కాగా జనవరి 30న ఆ భక్తులు ఈ విషయాన్ని సజిమోన్‌కు తెలియజేయడంతో అతను ఆ నెయ్యి డబ్బాను విశాఖకు కొరియర్ చేశారు. అయితే తన వాహనంలోని నెయ్యి డబ్బా కింద భద్రంగా దాచిన రూ. 20 కోట్ల లాటరీ టికెట్‌ను తాను గమనించకుండా ఆ డబ్బాతో పాటే కొరియర్ పార్శిల్లో పంపేశానని సజిమోన్ చెబుతున్నారు.ఫిబ్రవరి 1న తన పొరపాటు గ్రహించి, కొరియర్ ఏజెన్సీని సంప్రదించినప్పటికీ, ఫిబ్రవరి 4 నాటికే ఆ పార్శిల్ విశాఖకు చేరిపోయిందదని తెలిసింది. తన బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు కంజిరపల్లిలో ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేశానని, టికెట్ వెనుక తన పేరు, చిరునామా కూడా రాశానని సజిమోన్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఆయన పిరవం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కొరియర్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. అలాగే కొరియర్ ఆఫీసులోని సిసిటివి ఫుటేజీని పరిశీలించాలని కోరుతూ ఆయన పిరవం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు.ఈ వివాదంపై సమగ్ర విచారణ జరిపి, లాటరీ శాఖ వద్ద ఉన్న టికెట్‌ను సరిచూడాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సజిమోన్ తన వాదనను గట్టిగా వినిపిస్తున్నప్పటికీ, ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ.20 కోట్ల బహుమతి గెలుచుకున్న అసలు టికెట్‌ను ఇప్పటికే ఒక వ్యక్తి తిరువనంతపురంలోని లాటరీ కార్యాలయంలో సమర్పించినట్లు సమాచారం. దీంతో సజిమోన్ చెబుతున్నది నిజమా లేక ఇందులో ఏదైనా మోసం దాగి ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: మహిళ కడుపులో కత్తెర.. ఐదేళ్ల తర్వాత గుర్తించడంతో.. -
ది కేరళ స్టోరీ-2 మేకర్స్‌కు షాక్..!
ది కేరళ స్టోరీ నిర్మాతలకు షాక్ తగిలింది. ఈ సినిమా రిలీజ్ నిలిపేయాలంటూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కేంద్ర సమాచారశాఖతో పాటు సెన్సార్ బోర్డ్, నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా ట్రైలర్ తనను ఆశ్చర్యానికి గురిచేసిందని.. కేరళ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ శ్రీదేవ్ అనే బయాలజిస్ట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.సుదీప్తో సేన్ డైరెక్షన్లో వచ్చి ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదా శర్మ కీలక పాత్రలో తెరకెక్కంచిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఎన్ని విమర్శలొచ్చినా కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ముగ్గురు హిందూ అమ్మాయిల కథగా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహంచారు. -
60 సెకన్లలో కేరళ ట్రూ స్టోరీ : ఒట్టపాలెం కథ కావాలి స్ఫూర్తి!
సోషల్ మీడియా రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. దాన్ని ఎపుడు ఎలా వినియోగించుకుంటున్నా మన్నదానిమీదే మనుషుల విజ్ఞత ఆధారపడి ఉంటుంది. సరైన సమయంలో సరిగ్గా వాడుకోవాలి. ముఖ్యంగా ప్రమాదాల సమయంలో బాధితులను సాయం అందించేందుకు ముందుకు రావాలి తప్ప, వీడియోలు తీస్తూ కాలయాపన చేయకూడదు. క్రైసిస్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ఈ విషయాన్నే ఇటీవల కేరళలో జరిగిన బస్సు ప్రమాద ఘటన నిరూపించింది. క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఎలా ఉండాలి? అతి క్లిష్టమైన సమయంలో పౌర సమాజం తక్షణమే స్పందించి బాధ్యతగా ఎలా ప్రవర్తించాలనే దానిపై ఒక వీడియో నెట్టింట ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి.పాలక్కాడ్‌లోని ఒక చిన్న పట్టణం ఒట్టపాలెం, కానీ అక్కడ జరిగిన ఉదంతాన్ని ఉదాహరిస్తూ సంక్షోభ నిర్వహణలో ఒక మాస్టర్ క్లాస్ అంటూ ఎక్స్‌లో ఒక వీడియో షేర్ అయింది. దీని ప్రకారం కదులుతున్న బస్సుకు మంటలు అంటుకున్నాయి. పౌరసమాజం స్పందించిన తీరు, చూపింని ధైర్యసాహసాలను 60 సెకన్ల వీడియో చూడవచ్చు.థాయ్‌లాండ్‌లో అరుదైన దృశ్యం : ఇలా వచ్చి..అలా! True Kerala Story in 60 Seconds.Ottapalam a small town in Palakkad, but what happened there is a masterclass in crisis management.A moving bus caught fire & you can see a 60 second display of citizen bravery.10th Second: The bus doors opened. People started coming out.… pic.twitter.com/7usNBTGhyZ— FeverChills🥴 (@RebelR3volution) February 18, 202610వ సెకన్: బస్సు తలుపులు తెరుచుకున్నాయి. జనం బయటకు రావడం ప్రారంభించారు.30వ సెకన్: స్థానికంగా ఉన్న ఏ ఒక్కరూ ఈ సంఘటనను రికార్డ్ చేయడానికి రాలేదు. ప్రమాదంలో ఉన్న వారిని ఆదుకునేందుకు అగ్నిమాపక యంత్రంతో వచ్చాడు.35వ సెకన్: అగ్నిమాపక యంత్రంతో మరో ముగ్గురు నలుగురు మంటల్ని ఆర్పుతున్నారు. 50వ సెకన్: ప్రతీ ప్రయాణికులు సురక్షితంగా, క్షేమంగా బయటికి వచ్చాడు.60వ సెకన్: మంటలు ఆరిపోయాయి. ఏం జరిగిందంటే..కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో మంగళవారం (ఫిబ్రవరి 17) ఒట్టపాలెంలో ఈ ఘటన జరిగింది. పాలక్కాడ్ నుండి గురువాయూర్కు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకుంది. వెనుక ఉన్న డోర్ తెరుచుకుంది కానీ ముందు ఆటోమేటిక్ తలుపు మూసుకుపోయింది. దీంతో తీవ్ర ఆందోళన రేగింది. ఒక పొక్క చుట్టు ముడుతున్న పొగ మరోపక్క ప్రాణాపాయంలో పదుల సంఖ్యలో ప్రయాణీకులు. అటుగా వచ్చిన డెలివరీ ఏజెంట్ ఇది చూసి వెంటనే స్పందించాడు తలుపును పగలగొట్టడంతో పెను ముప్పు తప్పింది. సమీపంలోని ఆటో-రిక్షా డ్రైవర్లు ,దుకాణదారులు అగ్నిమాపక యంత్రాలతో సాయుధంగా సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసేందుకు కృషి చేశారు. బస్సు సిబ్బంది, ఇతర స్థానికులు సహాయక చర్యల్లో చేరి, సకాలంలో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలునోట్ : అక్కడున్న ఎవ్వరూ తమ మొబైల్‌తో వీడియోలను తీయడం లేదంటూ ఒక ముఖ్యమైన సందేశాన్ని చెప్పకనే చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు సాధారణంగా అందరూ చేసేది స్మార్ట్‌ఫోన్‌తో వీడియో తీసే పనిలో మునిగిపోతారు. నిజానికి అది కాదు చేయాల్సింది. వెంటనే బాధితులను ఆదుకునేందుకు, ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు తమ వంతు సాయం చేయాలి. ఇలా చేస్తూనే సంబంధిత అధికారులకు సమాచారాన్ని చేయడం. తత్ఫలితంగా చాలా ప్రాణాలను కాపాడవచ్చు. ఎన్నో కుటుంబాలు అనాథలు కాకుండా కాపాడవచ్చు. ఏమంటారు? -
'ది కేరళ స్టోరీ-2'పై సీఎం పినరయి విజయన్ ఆగ్రహం
ది కేరళ స్టోరీ మూవీ విడుదల సమయంలో ఎలాంటి అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పడు 'ది కేరళ స్టోరీ-2' చిత్రంపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్రంలో మతపరమైన విభజనతో పాటు ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మించినట్లు అర్థమవుతుందన్నారు. ‘లవ్ జిహాదీ’ అంశాన్ని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, హోం మంత్రిత్వశాఖ కూడా తిరస్కరించినప్పటికీ.. ఇదే అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకువచ్చి మతపరమైన విభజన సృష్టించేందుకు కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని విజయన్ మండిపడ్డారు. కేరళ రాష్ట్రాన్ని ప్రపంచం ముందు అవమానించేందుకే మరోసారి ఈ మూవీని తెరపైకి తీసుకొచ్చారన్నారు. అక్షరాస్యతలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తమ రాష్ట్రాన్ని ఇలా అప్రతిష్టపాలు చేసేందుకు సినిమాల పేరుతో కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని వాటిని ఐక్యంగా ప్రజలు తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. 'ది కేరళ స్టోరీ-2' సినిమా ‘విద్వేషపూరిత ప్రోపగాండా’ అంటూనే రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని ఆయన అన్నారు. శాంతియుత వాతావరణంతో అందరూ కలిసిమెలసి ఉన్న కేరళను ఉగ్రవాదానికి కేంద్రంగా చూపించేందుకు ఈ మూవీని వాడుకుంటున్నారని ఆయన అన్నారు. ఫిబ్రవరి 27న విడుదల కానున్న ఈ చిత్రంపై అధికార ఎల్.డి.ఎఫ్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. -
ఈ చిన్నారి.. వారిలో బతికే ఉంది!
పది నెలల వయసున్న ఆలిన్ షెరిన్ అబ్రహం అనే పసి పాప కేరళలో అతి పిన్న వయస్కురాలైన అవయవదాతగా నిలిచింది. మల్లపల్లి గ్రామానికి చెందిన ఆలిన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. తల్లి, తాతలతో కలిసి కొట్టాయం నుండి తిరువల్లకు వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఆస్పత్రిలో కొన్ని రోజుల చికిత్స తరువాత ఆలిన్ షెరిన్‌ను బ్రెయిన్ డెడ్‌గా వైద్యులు ప్రకటించారు.పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని తండ్రి అరుణ్ అబ్రహం, తల్లి షెరిన్ ఆన్జాన్ తమ చిన్నారి అవయవాలను దానం (Organ Donation) చేయడానికి అంగీకరించారు.ఆలిన్ షెరిన్ అబ్రహం (Alin Sherin Abraham) గుండెను తిరువనంతపురంలోని శ్రీ చిత్ర ఇనిస్టిట్యూట్‌కు, కాలేయాన్ని, ప్రభుత్వ వైద్య కళాశాలకు, కళ్లు ఐ బ్యాంక్‌కు డొనేట్ చేశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పది సంవత్సరాల బాలిక అనిన్కు ఆలిన్ షెరిన్ మూత్రపిండాలను మార్పిడి చేస్తారు. తిరువనంతపురంలో చికిత్స పొందుతున్న ఆరు నెలల పాపకు ఆలిన్ షెరిన్ కాలేయాన్ని అమర్చుతారు.చదవండి: సింకోప్ సమస్య.. పడి లేచే ప్రమాదం -
30 ఏళ్ల కృషి, ఉద్యోగులకు రూ. 20 కోట్ల లగ్జరీ కార్లు
కార్పొరేట్ కంపెనీలు భారీ బహుమతులతో ఉద్యోగులను సర్ప్రైజ్ చేస్తుంటాయి. భారీగా నగదు, కార్లు, ఇళ్లు లాంటి కానుకలతో వార్తల్లో నిలుస్తాయి. తాజాగా తన వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా తన ఉద్యోగులకు రూ. 20 కోట్ల విలువైన 47 కార్లను బహుమతిగా ఇచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.కోజికోడ్‌కు చెందిన కంపెనీ హైలైట్ గ్రూప్ తన 30 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ సిబ్బందికి భారీ బహుమతులలిచ్చి వార్షికోత్సవ సంబరాలకు మరింత వన్నె తీసుకొచ్చింది. గత మూడు దశాబ్దాలుగా కంపెనీ అభివృద్ధిలో సిబ్బంది చేసిన కృషికి గుర్తింపుగా రూ.20 కోట్ల విలువ చేసే 47 కార్లు అందించినట్టు కంపెనీ ప్రకటించింది.బిజినెస్‌లైన్ నివేదిక ప్రకారం ఈ కార్లలో ప్రీమియ , ప్రసిద్ధ మోడళ్ల కార్లున్నాయి. ముఖ్యంగా రేంజ్ రోవర్లు, ఆడి క్యూ8, ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్లు ఉండటం విశేషం. ఈ జాబితాలో టాటా హారియర్, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, స్కోడా కైలాక్ మోడళ్లు, ఇతర కార్లతో పాటు ఉన్నాయి. భారీ భవిష్యత్ ప్రణాళికలుహైలైట్ గ్రూప్ ఛైర్మన్ పి.సులైమాన్ ఈ సందర్బంగా భవిష్యత్ ప్రణాళికలను కూడా ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మరో పది మాల్స్ అభివృద్ధిలో ఉన్నాయని తెలిపారు. దాదాపు 10వేల మందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీ 2030 నాటికి సంస్థను విస్తరించి 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సులైమాన్ వెల్లడించారు.హైలైట్ గ్రూప్ విస్తరణహైలైట్ గ్రూప్ 1996లో కోజికోడ్లోస్థాపించబడింది. రిటైల్ అండ్ కమర్షియల్ వాణిజ్య అభివృద్ధితో ప్రారంభమై, నివాస, ఐటీ, మిశ్రమ వినియోగ ప్రాజెక్టులుగా విస్తరించింది. మూడు దశాబ్దాల ప్రయాణంలో హైలైట్ సంస్థ రిటైల్ స్పేస్ రంగంలో కేరళలో అగ్రగామిగా నిలిచింది. తరువాత కంపెనీ కోజికోడ్‌లో హైలైట్ మాల్, త్రిస్సూర్‌లోని హైలైట్ మాల్‌ను అభివృద్ధి చేసింది. క్రమంగా అంతర్జాతీయ వ్యాపారాలు,భాగస్వామ్యాలను ఆకర్షించే లక్ష్యంతో కోజికోడ్‌లో 12.5 మిలియన్ చదరపు అడుగుల వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం అంచనా వేసిన పెట్టుబడి సుమారు 680 మిలియన్ డాలర్లు (రూ. 623.06 కోట్లు) ఇదీ చదవండి: బ్లింకిట్‌కు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులుఇదీ చదవండి : పెళ్లి కూతురిపై రూ. 8.5 కోట్ల వర్షం, కట్ చేస్తే! -
శబరిమల గోల్డ్ చోరీ కేసు.. తంత్రి రాజీవరుకు బెయిల్
తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారంలో చోరీ కేసులో ఆలయ సీనియర్ తంత్రి (మాజీ ప్రధాన పూజారి) కందరారు రాజీవరుకు బెయిల్ మంజూరైంది. రాజీవరుకు నేడు కొల్లం విజిలెన్స్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బంగారం చోరీకి సంబంధించిన రెండు కేసుల్లో ఆయనకు బెయిల్ లభించడంతో ఆయన రిమాండ్ నుంచి బయటకు రానున్నారు.కాగా శబరిమల బంగారు తాపడాల చోరీ కేసులో ఆలయ అర్చకులు కందారారు రాజీవరును సిట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాజీవరను సిట్ అధికారులు జనవరి తొమ్మిదో తేదీన అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టితో, రాజీవరుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. విచారణలో రాజీవరు కూడా నిందితుడు అని తేలడంతో ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో, ఆయన 41 రోజులుగా పోలీసులు రిమాండ్‌లోనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయనకు కొల్లం విజిలెన్స్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. కోర్టు ఆయనపై ఉన్న ఆరోపణలను పూర్తిగా తేల్చలేదు.. కేవలం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో రాజీవరు ఏ6గా ఉన్నారు. ఇక, ఈ కేసులో ఆయన అరెస్టు 11వది కావడం విశేషం. ఏమిటి ఈ కేసు?2019లో శబరిమల గర్భగుడి ముందున్న బంగారు పూత విగ్రహాలను మరమ్మత్తుల నిమిత్తం తొలగించారు. అనంతరం వాటిని మరమ్మత్తు చేసి తిరిగి ప్రతిష్ఠించారు. బంగారు పలకలను ఇవ్వడంలో గోల్మాల్ జరిగిందని క్రితంతో పోలిస్తే బంగారం తగ్గిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో కేరళ హైకోర్టు సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. -
4 రాష్ట్రాల ఎన్నికలకు మార్చిలో షెడ్యూల్
ఢిల్లీ: పలు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. నాలుగు రాష్ట్రాలు, ఒకే కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు మార్చి మధ్యలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు మంగళవారం ఈ మేరకు వెల్లడించాయి. కీలకమైన పశ్చిమ బెంగాల్, తమిళనాడుతో పాటు కేరళ, అస్సాం అసెంబ్లీల గడువు మేలో, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ గడువు జూన్‌లో ముగియనున్నాయి.వాటన్నిటికీ వచ్చే ఏప్రిల్‌లోనే ఎన్నికలు జరపాలని ఈసీ భావిస్తోంది. ఇందుకు సంబంధించి మార్చిలో షెడ్యూల్ విడుదల చేస్తామని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల సన్నద్ధతను అంచనా వేయడంతో పాటు ముందస్తు ఏర్పాట్ల నిమిత్తం ఈసీ బృందాలు ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాయి. సర్ ప్రక్రియ అనంతరం అస్సాం, పుదుచ్చేరిల్లో తుది ఓటర్ల జాబితాను ఈసీ ఇప్పటికే విడుదల చేసింది.తమిళనాడులో బుధవారం, కేరళలో ఫిబ్రవరి 21న, కీలకమైన పశి్చమబెంగాల్లో 28న ఓటర్ల జాబితాలు వెలువడనున్నాయి. 2021లో పశి్చమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఏకంగా 8 విడతల్లో జరిగాయి. ఆ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విడతల్లో పోలింగ్ జరిగిన ఎన్నికలుగా అవి రికార్డులకెక్కాయి! ఇక తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో, తీవ్రవాద ప్రభావిత అస్సాంలో 2 విడతల్లో పోలింగ్ జరిగింది.అస్సాంలో ఈసీ పర్యటన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్, కమిషనర్లు సుఖ్బీర్సింగ్ సంధు, వివేక్ జోషితో కూడిన ఈసీ బృందం మంగళవారం రెండో రోజు కూడా అస్సాంలో పర్యటించింది. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించింది. -
ఒక్కో ఉద్యోగికి రెండు కోట్ల కారు
-
భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని మూడేళ్ల ముందే తెలుసు: శ్రీశాంత్
మాజీ భారత క్రికెటర్ S. Sreesanth ‘Rooted For Life’ పోడ్కాస్ట్లో తన జీవిత ప్రయాణాన్ని వివరించారు. Dr. Pradeep Sethi గారితో జరిగిన ఈ సంభాషణ క్రికెట్‌కి మాత్రమే పరిమితం కాకుండా జీవితం, నమ్మకం, మనోబలం వంటి ఎన్నో అంశాలపై సాగింది. చిన్ననాటి కష్టాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, వ్యక్తిగత ఆలోచనలు, ప్రపంచ కప్ వరకు తీసుకెళ్లిన సూత్రాలు – అన్నింటినీ శ్రీశాంత్ మనస్ఫూర్తిగా పంచుకున్నారు.ఎపిసోడ్ ప్రారంభంలోనే శ్రీశాంత్ అందరినీ – మతం, కులం అనే తేడా లేకుండా గౌరవించాలనే తన నమ్మకాన్ని చెప్పారు. జీవితం ఎత్తుపల్లాలు చూపినప్పుడు నిలబడటానికి ఒక బలమైన “బేస్” ఉండాలి అని ఆయన అభిప్రాయం. వినయం, ఆత్మగౌరవం రెండూ కలిసి నడవాలి, ప్రతి ఒక్కరిని సమానంగా చూడటం గొప్పతనానికి మూలం అని స్పష్టం చేశారు.ఈ పోడ్కాస్ట్లో హృదయాన్ని తాకే భాగం ఆయన చిన్నప్పటి ఆరోగ్య సమస్యల గురించి. మొదటిసారి తనకు వచ్చిన ట్యూమర్ శస్త్రచికిత్స, ఆ సమయంలో తన తండ్రి చూపిన అచంచలమైన భక్తి గురించి శ్రీశాంత్ గారు భావోద్వేగంగా చెప్పారు.Ettumanoor Mahadeva Temple వద్ద ఒక రూపాయి కానుక, చేసిన ప్రార్థన తన జీవితాన్ని మార్చేసిందని, అది తనకు ఒక అద్భుతం లాంటిదని వివరించారు. భగవాన్ శివుడితో తన ఆధ్యాత్మిక అనుబంధం గురించి చెబుతూ, తన చేతిపై త్రిశూలం ఆకారంలో ఉన్న జన్మమచ్చను కూడా ప్రస్తావించారు.తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ, డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది సహా అందరినీ కుటుంబ సభ్యుల్లా గౌరవించాలనే విలువలు తన తండ్రి నేర్పారని చెప్పారు. మహాబలి కథ, ఓనం పండుగ ఉదాహరణగా తీసుకుని, మతం కంటే మానవత్వమే గొప్పదని పేర్కొన్నారు.సంతోషం, ఆనందం మధ్య తేడా గురించి మాట్లాడుతూ – విజయం వల్ల వచ్చే సంతోషం తాత్కాలికం కావొచ్చు, కానీ అంతరానందం మనలో నుంచే వస్తుందని అన్నారు. మంచి అయినా చెడు అయినా ప్రతి అనుభవం మనకు “తజుర్బా” ఇస్తుందని, అది మనల్ని మరింత బలంగా తయారు చేస్తుందని చెప్పారు.ICC World Twenty20 విజయానికి వెనుక ఉన్న “సీక్రెట్” గురించి మాట్లాడినప్పుడు, కప్ గెలవబోతున్నామనే నమ్మకం తనలో ముందే ఉన్నదని చెప్పారు. ట్రోఫీని చేతిలో పట్టుకున్నట్టు మూడు సంవత్సరాల ముందే ఊహించుకున్నానని వెల్లడించారు. ఆ టోర్నమెంట్లో తన కెరీర్‌కి మలుపుతిప్పిన క్యాచ్ గురించి కూడా గుర్తుచేసుకున్నారు.PRIDE – అంటే “Personal Responsibility in Delivering Excellence” – అనే తత్వం తన జీవితానికి ఆధారం అని చెప్పారు. జట్టులోంచి తప్పించబడిన సందర్భాలు, ఓటములు ఎదురైనప్పుడు కూడా క్రమశిక్షణ, రొటీన్, పాజిటివ్ సెల్ఫ్-టాక్ తనను నిలబెట్టాయని వివరించారు. తాత్కాలిక ప్రతిభ కంటే అలవాట్లు, క్రమబద్ధతే విజయానికి మూలం అని అన్నారు.తన పోటీ స్వభావం గురించి మాట్లాడుతూ, క్రీడల్లో ధైర్యం మరియు అజాగ్రత్త మధ్య ఉన్న సన్నని రేఖను వివరించారు. అస్టిగ్మాటిజం సమస్య, ఫాస్ట్ బౌలింగ్‌లో ఉన్న శారీరక ఒత్తిడి, అవుట్‌స్వింగ్ యార్కర్ సాధనలో చూపిన పట్టుదల గురించి పంచుకున్నారు.మైదానంలో తన సంబరాలు ఈగో వల్ల కాదు, ఆటపై ఉన్న నిజమైన ప్రేమ, ఉత్సాహం వల్లేనని చెప్పారు. విజయం ప్రయాణంలో ఇతరులను కూడా భాగస్వాములను చేయడం, పాజిటివ్ సందేశాలు పంచడం ఎంత ముఖ్యమో వివరించారు.ఈ పోడ్కాస్ట్లో కుటుంబం ప్రాధాన్యం, ప్రజా జీవితంలో మేనేజర్ల కంటే కుటుంబ సభ్యుల పాత్ర, ప్రపంచానికి ప్రేమ, పాజిటివ్ వైబ్స్ పంచాల్సిన అవసరం వంటి అంశాలు కూడా చర్చించబడ్డాయి. చివరగా తన నానమ్మ నేర్పిన జీవన పాఠాలు, యోగా ద్వారా సమతుల్యతను ఎలా కాపాడుకోవాలో శ్రీశాంత్ గారు సూచనలు ఇచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో కేరళ యువతి దుర్మరణం
వల్లూరు (చెన్నూరు): కడప పట్టణంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేరళ యువతి రిషిక(23) దుర్మరణం చెందింది. వివరాల్లోకెళ్తే.. కేరళకు చెందిన రిషిక, ఎమీ సుశాన్, అభి, అనుగ్రహ, భావ్యతో పాటు విశాఖ పట్టణానికి చెందిన ఠాగూర్ రెడ్డి తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) కళాశాలలో బీఎస్‌ఎమ్‌ఎస్ కోర్సు నాలుగో సంవత్సరం చదువుతున్నారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో వీరు రెండు ద్విచక్ర వాహనాల్లో శనివారం ఉదయం వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోటకు విహారయాత్రకు బయలుదేరారు. కడప పట్టణం సమీపంలోని ఆలంఖాన్ పల్లె వద్ద ఉన్న ఇర్కాన్ సర్కిల్ వద్ద ఠాగూర్‌రెడ్డి నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఓ ట్యాంకర్ ఢీకొట్టింది. వెనుక కూర్చొన్న రిషిక రోడ్డుపై పడిపోగా ట్యాంకర్ ఆమెపై నుంచి వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నూరు పోలీసులు తెలిపారు. -
కేరళ విద్యార్థుల ఘనత...మొక్కల కోసం యాప్
మీ స్కూల్ గ్రౌండ్లో ముక్కులున్నాయా? వాటి పేర్లేంటి? ఇంకా అక్కడ ఎలాంటి మొక్కలుంటే బాగుంటుంది? అక్కడ ఏయే మొక్కల ద్వారా ఏయే ప్రయోజనాలున్నాయి? వాటిని రక్షించుకోవడం ఎలా? ఇలాంటివి తెలుసుకునేందుకు కేరళలోని కార్యవట్టం ప్రభుత్వ కళాశాల బీఎస్సీ భౌగోళిక శాస్త్ర విద్యార్థుల బృందం ఓ వెబ్ అప్లికేషన్‌ను తయారు చేసింది. ఇది విద్యార్థులకు ఎంతో అనుకూలమైనది. సెకండరీ పాఠశాల విద్యార్థులు తమ పాఠశాల క్యాంపస్‌లలో మొక్కల వైవిధ్యాన్ని మ్యాప్ చేసేందుకు ఈ యాప్ వీలు కల్పిస్తుంది. యాండ్రాయిడ్ ఫోన్ లేదా వెబ్ బ్రౌజర్ ఉంటే చాలు ఈ అప్లికేషన్ పనిచేస్తుంది. దీనికి ఇన్స్టాలేషన్ కూడా అవసరం లేదు. ఇదీ చదవండి: డ్యాన్సర్ నోట్లో బలవంతంగా నాణేలు : పరిస్థితి విషమంఈ యాప్ అందరూ వాడొచ్చు. సాధారణ ఫీల్డ్ సర్వేలను నిర్వహించడానికి ప్రాథమిక కార్టోగ్రాఫిక్ అంశాలతో జీవవైవిధ్య మ్యాప్‌లను తక్షణమే రూపొందించడానికి ఈ యాప్ పనికొస్తుందని దీన్ని తయారు చేసిన విద్యార్థులు అంటున్నారు. భౌగోళిక శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రతీప్ కుమార్ మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ రూపొందించారు. తరగతి గదుల్లో డిజిటల్ బోధనను ప్రోత్సహించే కేరళ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (ఓఐఖీఉ) లక్ష్యాలకు అనుగుణంగా ఈ యాప్ తయారు చేశారు. టెక్నాలజీపై కనీస అవగాహన ఉన్న పాఠశాల విద్యార్థులంతా దీన్ని సులభంగా ఉపయోగించవచ్చు.పాఠశాల విద్యార్థులలో డిజిటల్ విద్య, పర్యావరణ అభ్యాసం, జియోస్పేషియల్ నైపుణ్య అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఉపయోగ పడుతుంది. ఇలాంటి యాప్స్ తయారీపై విద్యార్థులు దృష్టి పెట్టాలి.ఇదీ చదవండి: టొమాటో..టొమాటో నీది ఏ దేశం? మీకు తెలుసా? -
శెభాష్ బామ్మ..! ఆ ధైర్యమే అందరికీ కావాల్సింది..
కొన్ని విషయాలు చూడటానికి సాధారణ చిన్న చిన్న తప్పులుగా కనిపిస్తున్నా ..అవే ఒకరకంగా ఘోర ప్రమాదాలకు మూలం కూడా. పోనీలే అని వదిలేయడం కూడా ఒక కారణం. ఎవ్వరు అనడం లేదు కదా మనం ఒక్కరమే వ్యతిరేకించడం దేనికని వదిలేస్తుంటాం. కానీ కొందరు విభిన్నంగా ఉంటారు. డిఫెరెంట్‌గా ఆలోచించడమే కాదు..ఒక్కరిగా.. హీరోలా వీరోచితంగా పోరాడి శెభాష్ అని ప్రశంసలందుకుంటారు. ఔను కదా..! మనమెందుకు అలా చేయలేకపోయాం అని ఆలోచింపచేసేలా స్ఫూర్తిని కలిగిస్తారు కూడా. ఇంతకీ ఏం జరిగిందంటే..కేరళకు చెందిన ఓ వృద్ధ మహిళ రద్దీగా ఉండే రోడ్డుకి ఒకపక్కను ఉన్న ఫుట్‌పాత్‌పై నడుస్తుంటుంది. ఇంతలో ఒక ద్విచక్ర వాహనదారుడు స్కూటీపై దర్జాగా ఫుట్‌పాత్‌పై వచ్చేస్తుంటాడు. అది గమనించిన మహిళ అతడిని వెళ్లనివ్వకుండా అడ్డగిస్తుంది. పాదాచారులు నడవకుండా మీది నుంచి వెళ్లిపోతావా అని అరుస్తూ అతడిని వెళ్లనివ్వకుండా అడ్డుకునే యత్నం చేస్తుంది. ఇక్కడ ఆ స్కూటర్ రైడర్ కూడా ఏదో విధంగా ఆమెను తప్పించి వెల్లిపోయే సాహసం చేస్తుంటాడు ఓ పక్కన. అయితే ఆ వృద్ధ మహిళ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అతడి స్కూటర్ని ఫోటోతీసి భయపెట్టి ప్రయత్నం చేస్తుండగా..దెబ్బకు చేసేది లేక వెనక్కి తగ్గి.. నెమ్మదిగా స్కూటర్ని టర్న్ చేసుకుంటూ రోడ్డ మీదకు వెళ్లిపోతాడు. చివర్లో బొటనవేలుని చూపిస్తూ..యాహు గెలిచా..! అన్నట్లుగా చిరునవ్వు చిందించింది ఆ బామ్మ. అలా మనలో ఎంతమంది సాహసం చేయగలం అని ఆలోచిస్తే..సమాధానమే రాదు కదా..!. నిజానికి మనందరికీ కావాల్సింది ఇలాంటి ధైర్యమే అప్పుడు పెను రోడ్డు ప్రమాదాలను కొంతైనా నివారించగలుగుతాం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కానీ చాలామంది అవతల వ్యక్తి దూకుడుగా ప్రవర్తిస్తే మనం ఇబ్బదుల్లో పడే అవకాశం లేకపోలేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. చాలామటుకు ఇలా చేయడం వల్ల కాస్త భయంతో అయినా..అలా ఫుట్‌పాత్‌పై వెళ్లేందుకు జంకుతారని కొందరు వాదిస్తూ పోస్టులు పెట్టారు. కాగా, ఫుట్‌పాత్‌పై ద్విచక్ర వాహనాన్ని నడపడం చట్టవిరుద్ధం. ఫుట్‌పాత్‌లు కేవలం పాదచారుల కోసం మాత్రమే. దీన్ని ఉల్లంఘిస్తే..జరిమానా, ఆరు నెలల పాటు లైసెన్స్ సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ కేరళ మోటార్ వాహనాల నియమాలు, 1989 ప్రకారం, ఫుట్‌పాత్‌పై ద్విచక్ర వాహనాన్ని నడపడం చట్టవిరుద్ధం కూడా. View this post on Instagram A post shared by Aflah E (@aflu__stories_) (చదవండి: గిఫ్ట్‌గా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు..! ఎక్కడంటే..) -
టెన్షన్ లేని లైఫ్ కావాలి..అందుకే భారత్‌కి వచ్చేశా..!
విదేశాలకు వెళ్లడం అక్కడే స్థిరపడటం చాలామంది డ్రీమ్. 'దూరపు కొండలు నునుపు' అన్నట్లుగా విదేశాల్లోని అక్కడి సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం రా..రమ్మని ఆకర్షిస్తుంటుంది. తీరా వెళ్లాక గానీ తెలియదు. అక్కడి సమస్యలు..పరిస్థితులు. ఇక్కడొక భారత మహిళకు కూడా అలా అనిపించే తక్షణమే భారత్‌కు కుటుంబంతో సహా వచ్చి వాలిపోయింది. ఎందువల్ల తాను ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. కానీ ఆమె చెబుతున్న మాటలు ఆలోచింపదగినవిగానూ విదేశాలకు చెక్కేద్దామనే ఔత్సాహుకులకు గొప్ప పాఠాలుగానూ ఉన్నాయి. మరి ఇంతకీ ఎందవల్ల ఇలా కుటుంబంతో సహా ఆమె భారత్‌కు వచ్చేసిందో తెలుసా..!?..లీబా సుబిన్ అనే మహిళ కుటుంబం దుబాయ్ నుంచి భారత్‌లోని తన స్వస్థలం కేరళకు వచ్చేసింది. తాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంది. ఆమె కారణాన్ని వివరిస్తూ..ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, మానసిక ప్రశాంతత కోసం ఇలా చేశానని అంటోంది. ఈ నిర్ణయాన్ని సమయా పాలన, మానసిక శాంతికి సంబంధించిన విషయంగా పేర్కొంది. అదీగాక తమ ఫ్యామిలీ వీసా రెన్యువల్, అలాగే ఇంటి అద్దె రెన్యువల్ చేయాల్సి ఉండగానే.. చకచక ఈ నిర్ణయం తీసుకుని వచ్చేసినట్లు తెలిపారు. అలాగని ఏదో హడావిడిగా తీసుకున్న నిర్ణయం అయితే కాదని, బాగా ఆలోచించి, తన భాగస్వామితో, పిల్లలతో మాట్లాడి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఇలా వెనక్కి వచ్చేసి కేరళలో తమ సొంతింటిలో నివశించడం వల్ల దుబాయ్‌లోని అద్దె టెన్షన్ తగ్గింది, అలాగే ఇక్కడి సమాజంలో నివశించడం వల్ల సామాజిక సంబంధాలు పునరుద్ధరింపబడతాయి. పైగా ఎలాంటి అప్పులు, ఈఎంఐల బెడద లేకుడా మానసిక ప్రశాంతతో గడపొచ్చు అని చెప్పుకొచ్చిందామె. పైగా పిల్లవాడికి కేరళలో అంతర్జాతీయ స్కూల్ ఇంటికి సమీపంలోనే ఉంది పదినిమిషాల్లో వెళ్లొచ్చు. కానీ దుబాయ్‌లో 90 నిమిషాలు ప్రయాణించాల్సి వస్తుందని జోడించారామె. బహుశా మాకు అనిపించింది..మీకు వర్కౌట్ కాకపోవచ్చు, పైగా మీరు విదేశాల్లోనే కంఫర్ట్ లైఫ్‌ని లీడ్ చేస్తుండొచ్చని, అది వారి వ్యక్తిగత విషయమని తేల్చి చెప్పింది. అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడూ..మొత్తం కుటుబ సభ్యులు కలసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావడం అన్ని విధాల శ్రేయస్కరం అంటూ తన పోస్ట్‌ని ముగించింది లీబా సుబిన్. చాలా మంది నెటిజన్లు ఆమె నిర్ణయంతో ఏకభవించారు, పైగా తిరిగి వెళ్లకూదనుకుంటున్న ఆమె నిర్ణయానికి స్వాగతం, శుభాకాంక్షలు అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by leeba (@unfilteredvoiceswithinme) (చదవండి: ఆ హోటల్ కోసం..ఆ బామ్మ తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్! -
కొనసాగుతున్న భారత్ బంద్.. ఈ రాష్ట్రాల్లో..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా పది ప్రధాన కార్మిక సంఘాలు నేడు (ఫిబ్రవరి 12) దేశవ్యాప్త భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు దాదాపు 30 కోట్ల మంది కార్మికులు, రైతులు, అసంఘటిత రంగ నిపుణులు మద్దతు పలుకుతున్నారు. పారిశ్రామికరంగ కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులు బంద్‌కు మద్దతు ప్రకటించడంతో చాలా చోట్ల సమ్మె ప్రభావం కనిపిస్తోంది. కొత్త కార్మిక చట్టాలను రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఒడిశా, కేరళలో.. బంద్ ప్రభావం ఒడిశా, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో అత్యధికంగా కనిపిస్తోంది. ఒడిశాలో దాదాపు పూర్తిస్థాయి షట్‌డౌన్ వాతావరణం నెలకొంది. హోల్‌సేల్ మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా సేవలు స్తంభించాయి. కేరళలో కార్మిక యూనియన్ల బలం ఎక్కువగా ఉండటంతో బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. స్థానిక మార్కెట్లు మూతపడ్డాయి. అస్సాంలో కూడా పట్టణ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారగా, పశ్చిమ బెంగాల్లో బ్యాంకింగ్ సేవలకు ఆటంకం కలిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బంద్ ప్రభావం కనిపించలేదు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో కూడా పాఠశాలల మూసివేతపై ఎటువంటి ఆదేశాలు రాలేదు. అయితే నిరసనల కారణంగా రోడ్లపై రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఢిల్లీ పరిధిలోని కొన్ని జిల్లాల్లో స్థానిక పరిస్థితులను అనుసరించి, ప్రైవేట్ పాఠశాలలు సెలవు ప్రకటించుకున్నాయి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆస్పత్రులు, అంబులెన్స్ సేవలు, ఇతర అత్యవసర వైద్య సేవలకు బంద్ నుండి మినహాయింపు ఇచ్చారు. మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ఇప్పటివరకు సేవల నిలిపివేతపై ఎటువంటి వార్తలు అందలేదు. -
రారండి.. కేరళ (ఫొటోలు)
-
సర్వీసెస్ సూపర్...
గువాహటి: జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీలో సర్వీసెస్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సర్వీసెస్ 1–0 గోల్స్ తేడాతో కేరళపై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. సంతోష్ ట్రోఫీలో సర్వీసెస్ జట్టు విజేతగా నిలవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. సర్వీసెస్ స్ట్రయికర్ అభిõÙక్ పవార్ (109వ నిమిషంలో) మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్ చేశాడు. నిర్ణీత సమయంలో ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లగా... అందులో సర్వీసెస్ సత్తా చాటింది. 2012–13లోనూ ఈ రెండు జట్ల మధ్యే సంతోష్ ట్రోఫీ ఫైనల్ జరగగా... అప్పుడు కూడా సర్వీసెస్‌నే విజయం వరించింది. ఆ మ్యాచ్‌లోనూ నిర్ణీత సమయంలో గోల్స్ నమోదు కాకపోగా... పెనాల్టీ షూటౌట్లో ఫలితం తేలింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన ఫైనల్లో అలాంటి ప్రదర్శనే పునరావృతం అయింది. అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో ఇరు జట్లు రక్షణాత్మక ధోరణి అవలంభించాయి. కేరళ జట్టు కొన్ని ప్రయత్నాలు చేసినా... సర్వీసెస్ గోల్‌కీపర్ గగన్‌దీప్ సింగ్ వాటిని చక్కగా అడ్డుకున్నాడు. అదనపు సమయంలో అభిõÙక్ గోల్‌తో సర్వీసెస్ ఖాతా తెరవగా... ఆఖర్లో స్కోరు సమం చేసేందుకు కేరళ ఎంత ప్రయతి్నంచినా ఫలితం లేకపోయింది. గ్రూప్ దశలోనూ ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిõÙక్ ఏకైక గోల్ చేసి సర్వీసెస్‌ను గెలిపించగా... ఇప్పుడూ అదే సీన్ రిపీట్ చేశాడు. -
చుక్..చుక్..చుక్.. రైలు కాదండోయ్ ఇళ్లు..!
జీవిత చరమాంకంలో చాలా మంది తాము అప్పటి వరకూ చేసిన పనులను గుర్తు చేసుకుంటూ ఉంటారు. వాటి గురించే ఇతరులకు చెప్పుతు లేదా తమలో తామే ఆలోచిస్తూ బాధ పడడమే లేక సంబరపడడమే చేస్తుంటారు. అయితే ఇక్కడ రైల్వేశాఖ మాజీ ఉద్యోగి మాత్రం విభిన్నంగా ఆలోచించారు. తను ఇంతకాలం పనిచేసిన జ్ఞాపకాలకు మనసులో కాకుండా కళ్లెదుట చూడాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా ఆ నిర్మాణం చేపట్టారు.తమ జ్ఞాపకాలను వదలకుండా ఉండడానికి.. చాలా పనులు చేస్తుంటారు. అయితే ఇక్కడ ఒక రైల్వే ఉద్యోగి ఇంతకాలం తను పని చేసిన సంస్థను వీడలేకపోయాడు. అవే జ్ఞాపకాలతో అను నిత్యం తనతో ఉండాలనుకున్నాడు ఇంకేంటి అనుకున్నదే తడువుగా తన ఇంటినే రైల్వే కోచ్‌గా మార్చాడు. దీని నిర్మాణం కోసం తన స్వహస్తాలతో రైలు నమూనాను చెక్కాడు.కేరళ, కాసరగోడ్ రవనీశ్వరం-చల్లింగల్ రహదారిపై వెళుతుంటే ఎవరి కన్నైనా సరే ఒకసారి ఆ ఇంటిపై పడాల్సిందే. ఎంటబ్బా ఈ నిర్మాణం అని అనాల్సిందే? ఎందుకంటే అది సాధారణ ఇళ్లు కాదుగా మరి.. పురాతన రైల్వే కోచ్ మోడల్‌కు చెందిన నమూనా.. అందుకే దాని నిర్మాణం చూసి ఎవరైనా ఔరా అనాల్సిందే..టీ. దామోదరన్ అనే వ్యక్తి రైల్వేలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించారు. 20 ఏళ్ల క్రితమే ఆయన తన వృత్తికి స్వచ్ఛంగ విరమణ ప్రకటించారు. అయితే అంతకాలం రైల్వేలో పనిచేయడం ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేయడంతో ఆయన మదిలో ఎప్పుడూ రైలు జ్ఞాపకాలే మెదిలాడేయి. దీంతో ఆయన తన ఇంటినే రైలుగా మార్చాలని నిశ్చయించుకున్నాడు. దీంతో అనుకున్నదే తడవుగా ఆ నిర్మాణం చేపట్టారు.రెండేళ్ల క్రితం ఇండియన్ రైల్వే బ్యాన్ చేసిన ALCO లోకోమోటివ్ మోడల్లో దాని నిర్మాణం చేపట్టారు. దీని నిర్మాణంలో సహాజాకృతి రావాలని స్వయంగా ఆయనే 'రేక్వాల్' స్ప్రింగ్స్, వీల్స్ తదితరవన్ని కర్రతో తానే చెక్కినట్లు తెలిపారు. తాపీవారికి ఆ పని అప్పగిస్తే అంత సులభంగా చేయలేరని తానే ఆ పని చేసినట్లు దామోదరన్ అన్నారు.ఇక్కడితో కథ ముగియలేదు. తను ఎంతో కష్టపడి నిర్మించిన తన జ్ఞాపకాల గుర్తుకు తనను పెంచి పెద్దచేసిన తన మాతృమూర్తి పేరు మీద "ఆచా కోచ్" అని పెట్టాడు. తన మాతృమూర్తి తనను ఎంతో గొప్పవాడు కావాలని కలలు కందని దానికోసం ఎంతో తపించిందని అందుకోసమే తన పేరు పెట్టినట్లు తెలిపారు.తన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో తనకు ఏ జాబు రాలేదని అందుకే సేల్స్‌మాన్‌గా చేరానని ఆ సమయంలోనే తనకు రైల్వేస్ నుంచి ఉద్యోగం ఆఫర్ వచ్చిందని దామోదరన్ తెలిపారు. అయితే తాను వెళ్లడానికి నిరాకరించడంతో తన యజమాని వెళ్లాల్సిందని పట్టుబట్టినట్లు తెలిపారు. 1977లో రైల్వేలో ఉద్యోగంలో చేరగా 1996లో పదవీ విరమణ పొందినట్లు తెలిపారు. ఫిబ్రవరి 21న రైలు ఇళ్లును ప్రారంభించే ఫంక్షన్ ఘనంగా చేయనున్నట్లు దామోదరన్ తెలిపారు. -
చూడాలని వచ్చి.. భారతీయురాలిగా మారి..
ఆమె బ్రిటన్‌లో జన్మించారు. భారతదేశంపై ప్రేమ పెంచుకుని ఇక్కడే ఉండిపోయారు. కేరళలో స్థిర నివాసం ఏర్పరుచుకుని, అనేక రచనలు చేయడంతో పాటు, స్థానిక కళల ప్రాచుర్యానికి పాటుపడ్డారు. ఈ నేపధ్యంలో భారత పౌరసత్వం పొందాలని ఆమె తాపత్రయ పడ్డారు. ఎట్టకేలకు ఆమె తన కలను నెరవేర్చుకున్నారు. ఆమె మరెవరో కాదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత పెపిటా సేథ్ (84). తాజాగా ఆమె అధికారికంగా భారత పౌరసత్వాన్ని పొందారు.గత 50 ఏళ్లుగా కేరళలోనే ఉంటున్న పెపిటా సేథ్.. 2024లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా త్రిశూర్ జిల్లా కలెక్టర్ అర్జున్ పాండియన్ చేతుల మీదుగా ఆమె పౌరసత్వ ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. సహజసిద్ధ పౌరసత్వ విధానం ద్వారా ఆమెకు ఈ గుర్తింపు లభించిందని అధికారులు వెల్లడించారు. తనకు భారత పౌరసత్వం రావడంపై పెపిటా సేథ్ హర్షం వ్యక్తం చేశారు. ‘నేను ఇక్కడ ఉన్నందుకు, భారత పౌరురాలిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా చిరకాల స్వప్నం’ అని ఆమె పేర్కొన్నారు. #WATCH | Thrissur, Kerala | Padma Shri awardee Pepita Seth says, "I was born and brought up in UK. I came to India and gradually, I arrived in Kerala... Slowly I grew interested in the culture here and wrote many books... I stayed here for nearly 12 years..." (06.02) https://t.co/96oBzpVFuP pic.twitter.com/8aHrpsBeSu— ANI (@ANI) February 7, 2026యూకేలో పుట్టి పెరిగిన ఆమె తొలుత భారత్‌ను సందర్శించేందుకు వచ్చారు. ఢిల్లీ, ముంబై తదితర నగరాలను సందర్శించిన తర్వాత ఆమె కేరళకు చేరుకున్నారు. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఆమెను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఆమె కేరళనే తన నివాసంగా మార్చుకున్నారు. కేరళలోని కథాకళి, తెయ్యం వంటి కళారూపాలతో పాటు స్థానిక ఉత్సవాలైన మేళాలు, ఉత్రాలిక్కావు వంటి కార్యక్రమాలపై పెపిటా సేథ్ ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. ఉత్తర కేరళలో ప్రసిద్ధి చెందిన 'తెయ్యం' అనే నృత్యంపై ఆమె పరిశోధన చేసి, పలు పుస్తకాలు కూడా రచించారు.గత 12 ఏళ్లుగా త్రిస్సూర్‌లో నివసిస్తున్న ఆమె, ఈ ప్రాంతాన్ని తన పరిశోధనలకు, ప్రయాణాలకు కేంద్ర బిందువుగా మార్చుకున్నారు. ఫోటోగ్రఫీ ద్వారా కేరళ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. కళ, సాంస్కృతిక రంగాల్లో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా, భారత ప్రభుత్వం 2012లో ఆమెను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. పర్యాటకురాలిగా వచ్చి, భారతీయతను అలవరచుకున్న పెపిటా సేథ్ ఇప్పుడు అధికారికంగా భారతీయురాలిగా మారారు.ఇది కూడా చదవండి: రిటైర్మెంట్పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు -
శబరిమల బంగారం చోరీ కేసులో బిగ్ ట్విస్ట్
తిరువనంతపురం: కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టికి కేరళ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతని అరెస్టు జరిగిన 90 రోజులలోపు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలమవడంతో ఈ బెయిల్ లభించింది. దీంతో, అతడి బెయిల్ అంశం చర్చనీయాంశంగా మారింది.కాగా, శబరిమలలో శ్రీకోవిల్ (గర్భగుడి) తలుపుల ఫ్రేముల నుండి బంగారం అదృశ్యం కావడానికి సంబంధించిన రెండో కేసులో ఉన్నికృష్ణన్ పొట్టికి బెయిల్ మంజూరైంది. అంతకంటే ముందు.. సంబంధిత ద్వారపాలక విగ్రహం కేసులో కూడా అతనికి బెయిల్ లభించింది. కొల్లాంలోని విజిలెన్స్ కోర్టు గురువారం అతడికి బెయిల్ మంజూరు చేసింది. ఫలితంగా శబరిమల బంగారం చోరికి సంబంధించిన రెండు ప్రధాన కేసులలో ఆయనకు బెయిల్ లభించడంతో జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు.. బెయిల్ షరతులలో భాగంగా పొట్టి ఒక్కొక్కటి రూ. 2 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలి. కేరళ విడిచి వెళ్లకూడదు. శబరిమల ఆలయం ఉన్న పతనంతిట్ట జిల్లాలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు. అతను ప్రతి మంగళవారం, శుక్రవారం దర్యాప్తు అధికారులకు రిపోర్ట్ చేయాలి.ఇదిలా ఉండగా, ఉన్నికృష్ణన్‌కు బెయిల్ మంజూరు కావడం కేరళలో రాజకీయ వేడిని మరింత పెంచింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ స్పందిస్తూ.. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై పదేపదే ఆరోపణలు చేశాం. సిట్ కేసును తప్పుదోవ పట్టించే విధంగా దర్యాప్తు పద్ధతిని అనుసరిస్తోందని ముందే చెప్పాం. పలుమార్లు హెచ్చరించాం. మా ఆరోపణ ఇప్పుడు నిజమైంది. వారందరికీ బెయిల్ వస్తుందని మేము చెప్పాం. సరిగ్గా అదే జరుగుతోంది. వారు కనీసం ప్రాథమిక చార్జిషీట్ కూడా దాఖలు చేయలేదు అని మండిపడ్డారు. ఇప్పుడు సీపీఐ(ఎం) నాయకులు జైలు నుండి బయటకు రావడం ప్రారంభిస్తారు. మాజీ దేవస్వం మంత్రి, ప్రస్తుత దేవస్వం మంత్రి సహా చాలా మంది ఇప్పటికే క్యూలో ఉన్నారు. వారిని అరెస్టు చేయాలి. మేము ఇప్పటికే మంత్రి రాజీనామాను డిమాండ్ చేశాం అని వ్యాఖ్యలు చేశారు. -
తీరు మారని సంజూ శాంసన్.. హోం గ్రౌండ్లోనూ
టీ20 వరల్డ్‌కప్-2026కు ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో కూడా సంజూ దారుణ ప్రదర్శన కనబరిచింది. సొంత ప్రేక్షకుల ముందు శాంసన్ అట్టర్ ప్లాప్ అయ్యాడు.6 బంతులు ఎదుర్కొన్న శాంసన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి తీవ్ర నిరాశపరిచాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో జాకబ్స్‌కు క్యాచ్ ఇచ్చి సంజూ ఔటయ్యాడు. ఈ సిరీస్ మొత్తంగా శాంసన్ కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు.తిలక్ వర్మ పునరాగమనం చేస్తే తుది జట్టులో సంజూ స్ధానం గల్లంతే అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. గాయం కారణంగా న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ.. త్వరలోనే జట్టులో చేరనున్నాడు. తిలక్ జట్టులోకి వస్తే ఇషాన్ కిషన్ లేదా సంజూ శాంసన్‌లో ఎవరో బెంచ్‌కే పరిమితమవ్వాలి. అయితే ఇషాన్ తన రీఎంట్రీలో సత్తాచాటుతున్నాడు. శాంసన్ కంటే ఈ జార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అంతేకాకుండా ఓపెనర్‌గా కూడా కిషన్‌కు మంచి రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో సంజూపై వేటు పడడం ఖాయమన్పిస్తోంది. ఇషాన్ కిషన్.. అభిషేక్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశముంది.అంతకుముందు శుభ్‌మన్ గిల్ టీ20ల్లో రీఎంట్రీ ఇవ్వడంతో సంజూను బెంచ్‌కే పరిమితం చేశారు. ఆసియాకప్, సౌతాఫ్రికా సిరీస్‌లో ఇదే సీన్ రిపీట్ అయింది. దీంతో టీమ్‌మెనెజ్‌మెంట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో గిల్‌ను టీ20ల నుంచి తప్పించి మళ్లీ ఓపెనర్‌గా శాంసన్‌కు అవకాశమిచ్చారు. కానీ తనకు వచ్చిన ఛాన్స్‌ను ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఉపయోగించుకోలేకపోయాడు. -
శబరిమల కేసులో నటుడు జయరామ్ విచారణ
శబరిమల బంగారం చోరీ కేసులో సీనియర్ నటుడు జయరామ్‌ని సిట్ విచారించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టితో కలిసి జయరామ్ పలు పూజల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి మధ్య సంబంధం గురించి సిట్ ఆరా తీసినట్లు సమాచారం. శుక్రవారం చెన్నైలోని జయ్‌రామ్ నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు.. ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఉన్నికృష్ణన్ పొట్టితో సంబంధం ఏంటి?. ఎలా పరిచయం? ఇద్దరి మధ్య ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా? అని ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేశారు. మలయాళంలో సీనియర్ నటుడు అయిన జయరామ్.. తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల ప్రేక్షకులకూ సుపరిచితుడే. శబరిమల ప్రధాన ఆలయం ద్వారపాలక (కాపలాదారు) విగ్రహాలు మరియు శ్రీకోవిల్ (గర్భగృహం) తలుపు ఫ్రేమ్‌ల నుండి బంగారం పోయినట్లు ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త ఉన్నికృష్ణన్ పొట్టి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే.. పొట్టితో కలిసి నటుడు జయరామ్ పలు పూజల్లో పాల్గొన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పూజలు బంగారం పూత మాయం అయిన తర్వాతే జరిగాయని నిర్ధారించుకున్న సిట్.. ఇద్దరి మధ్య సంబంధాలపై ఆరా తీసినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటిదాకా ఈ కేసులో మొత్తం 12 మందిని అరెస్ట్ చేసింది సిట్. ఇక.. ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు పాలక మండలి మాజీ సభ్యులు మురారి బాబు, శ్రీకుమార్‌లు బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. నిర్ణీత కాల వ్యవధిలో(90 రోజుల) సిట్ వీళ్లపై అభియోగాలకు చార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడంతో బెయిల్ మంజూరు అయ్యింది. మరోవైపు ప్రధాన నిందితుడు పొట్టికి కూడా బెయిల్ లభించినప్పటికీ.. మిగతా కేసుల కారణంగా ఇంకా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదీ చదవండి: శబరిమల గోల్డ్ కేసు.. ఏపీకి లింకు! నటుడ్ని ప్రశ్నించే చాన్స్ -
పీటీ ఉష భర్త హఠాన్మరణం
రాజ్యసభ ఎంపీ, భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషా ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త వెంగలిల్ శ్రీనివాసన్(63) గుండెపోటుతో కన్నుమూశారు.గురువారం అర్ధరాత్రి దాటాక.. 12.30 గంటల ప్రాంతంలో తిక్కోడి పెరుమాళ్‌పురంలోని నివాసంలో శ్రీనివాసన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను పెరుమాళ్‌పురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఉష ఢిల్లీలో ఉన్నారు. భర్త మరణంతో ఆమె హుటాహుటిన కేరళ బయల్దేరారు. శ్రీనివాసన్ సీఐఎస్ఎఫ్ (Central Industrial Security Force)లో ఇన్స్పెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. పరుగుల రాణి, పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌గా పేర్లున్న పీటీ ఉష.. 1991లో దగ్గరి బంధువైన శ్రీనివాసన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఉజ్జ్వల్ విఘ్నేష్ అనే కుమారుడు ఉన్నాడు. శ్రీనివాసన్ మృతి గురించి సమాచారం అందిన ప్రధాని నరేంద్ర మోదీ పీటీ ఉషతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. శ్రీనివాసన్ మృతికి సంతాపం తెలిపినట్లు తెలుస్తోంది. మరోవైపు.. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సైతం ఉష కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
‘90 నిమిషాలు ఏం మాట్లాడుకున్నారో’..
సాక్షి,ఢిల్లీ: ఆపరేషన్ సింధూర్‌తో పాటు పలు అంశాలపై ప్రధాని మోదీని ప్రశంసిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత,ఎంపీ శశి థరూర్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీకి మధ్య దూరం పెరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఆ ప్రచారానికి శశి థరూర్ చెక్ పెట్టారు.పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో సుమారు 90 నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, ఇతర వ్యక్తిగత అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ ద్వారా పార్టీతో తన అనుబంధం బలంగా ఉందని, విభేదాల ఊహాగానాలకు తావు లేదని థరూర్ స్పష్టంచేశారు.శశి థరూర్ ఇటీవల కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేలా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను సమర్ధించినట్లు చెప్పారు.ఆ తర్వాత పలు పత్రికల్లోని గెస్టు కాలమ్స్‌లో ఆపరేషన్ సిందూర్‌ను కీర్తించారు.దీంతో పార్టీ అధినాయకత్వం ఆయనపై అసంతృప్తి వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో విభేదాలు మరింత పెరిగాయని, ముఖ్యంగా కేరళ యూనిట్లో అసమ్మతి ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆయన రాహుల్, ఖర్గేలను కలవడం ద్వారా పార్టీ లోపల ఉన్న అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం జరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు. సమావేశం అనంతరం థరూర్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ లోపల ఎలాంటి విభేదాలు లేవని, తాను ఎప్పటికీ కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో తనకు ఎలాంటి వ్యక్తిగత సమస్యలు లేవని, పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ వర్గాలు కూడా ఈ భేటీని సానుకూలంగా చూస్తున్నాయి. రాహుల్ గాంధీ, ఖర్గేలు థరూర్‌తో చర్చలు జరిపి, పార్టీ ఐక్యతను కాపాడుకోవడం అత్యవసరమని స్పష్టం చేసినట్లు సమాచారం.ముఖ్యంగా కేరళలలో జరగబోయే ఎన్నికల దృష్ట్యా, కాంగ్రెస్‌లోని అన్ని వర్గాలు ఒకే దిశగా కదలాలని ఈ సమావేశం సంకేతం ఇస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
పట్టాలు తప్పని పారిశుధ్యం!
సాధారణంగా మన ఊళ్లలో రైల్వే స్టేషన్ అంటే ఎలా ఉంటుంది? ప్లాట్‌ఫాం నిండా పల్లీల తొక్కలు, పాన్‌పరాగ్ ఉమ్ములు, పట్టా ల మీద ప్లాస్టిక్ కవర్లు, దుర్గంధం.. ప్రయాణికులకు అనుభవమే. కానీ, సోషల్ మీడియాలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న ఒక వీడియో చూస్తే.. ‘ఇది మన దేశంలోనేనా?’.. అని ముక్కున వేలేసుకోవడం ఖాయం! మచ్చుకైనా కానరాని చెత్త అస్సాంకు చెందిన రేజావుల్ అనే యువకుడు కేరళలోని కన్నూర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లినప్పుడు అక్కడి దృశ్యాలు చూసి ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయాడు. వెంటనే కెమెరా తీసి ప్లాట్‌ఫాం నుంచి రైలు పట్టాల వరకు మొత్తం వీడియో తీశాడు. ప్లాట్‌ఫాం మీద అద్దంలా మెరుస్తున్న పలకలు ఒకెత్తయితే, సాధారణంగా చెత్తాచెదారంతో నిండిపోయే పట్టాల మీద.. కనీసం చిన్న కాగితం ముక్క కూడా కనిపించకపోవడం విశేషం. ‘ఏక్ భీ కచ్రా నహీ మిలేగా’ (ఇక్కడ ఒక్కటంటే ఒక్క చెత్త ముక్క కూడా మీకు దొరకదు!)’అని ఆ కుర్రాడు తన వీడియోలో కొనియాడాడు. మిలియన్ల వ్యూస్.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో గంటల్లోనే వైరలై మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టింది. ఇది కేవలం రైల్వే అధికారుల ఘనత మాత్రమే కాదు, అక్కడి ప్రజల పౌర బాధ్యత (సివిక్ సెన్స్)కు నిదర్శనమని నెటిజన్లు నీరాజనాలు పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసి నా, ప్రజలు సహకరించకపోతే ఏ ప్రాంతం శుభ్రంగా ఉండదని ఈ వీడియో నిరూపించింది. శుభ్రత అనేది వనరుల మీద కాదు, మనుషుల ఆలోచనా విధానం మీద ఆధారపడి ఉంటుందని కేరళ ప్రజలు చాటిచెప్పారు. మిగతా రాష్ట్రాల వారు కూడా కన్నూర్ స్టేషన్‌ను ఆదర్శంగా తీసుకోవాలంటూ నెటిజన్లు వ్యాఖ్యలతో హోరెత్తిస్తున్నారు. పాలనా యంత్రాంగం పని కాదిది.. మన అందరి బా ధ్యతని కన్నూర్ స్టేషన్ గట్టిగా నినదిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పంపాలో పేరుకుపోయిన భక్తుల దుస్తులు.. మండిపడ్డ కేరళ హైకోర్టు
సాక్షి, కేరళ: శబరిమల యాత్ర ముగిసిన తర్వాత పంపా నదిలో భక్తులు వదిలేసిన దుస్తులతో చెత్తకుప్పలా మారింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం అధికారుల తీరుని తప్పుపబట్టింది. అలాగే ఈ దుస్తులను తొలగించడంలో విఫలమైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానికి శబరిమల సీజన్ ముగిసిన తర్వాత పంపా నదిని శుభ్రం చేయాలని గతంలోనే హైకోర్టు ఆదేశించినా అధికారులు నిర్లక్ష్యం వహించడంపై జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కె.వి. జయకుమార్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నదిలో పేరుకుపోయిన బట్టల కుప్పలు పర్యావరణానికి, జలచరాలకు ముప్పుగా మారుతుందని స్పష్టం చేసింది. చాలామంది భక్తులు దీన్ని ఆచారంగా భావిస్తున్నారు..కానీ ఇది శబరిమల సంప్రదాయంలో భాగం కానేకాదని, అదొక అపోహని పేర్కొంది. భక్తులకు దీనిపై అవగాహన పెంచాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుకు సూచించింది. నిజానికి ఇలా నదిలో వదిలేసిన బట్టలు కుళ్లిపోయి దుర్వాసన రావడమే గాక, ఇది ప్రజారోగ్యానికి చాలా ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేసింది. పైగా ఈ వ్యర్థాల వల్ల చేపలు వంటి జలచరాలు మృత్యువాతపడుతున్నాయని పేర్కొంది. కేవలం నదిలో తేలే బట్టలను మాత్రమే కాకుండా, నది అడుగున పేరుకుపోయిన వ్యర్థాలను కూడా తొలగించాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే సుచిత్ర మిషన్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, పంతినం తిట్ట జిల్లా యంత్రాంగం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు పంపా నదిని యథాస్థితికి తీసుకురావడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని దేవస్వం బోర్డును ఆదేశిస్తూ కేసును తదుపరి విచారణకు వాయిదా వేసింది కేరళ హైకోర్టు. కాగా, ఈ పంపా నది కేరళలో మూడవ అతి పొడవైన నది. దక్షిణ గంగగా పూజలందుకుంటోంది. ఇడుక్కిలోని పీర్మేడు పీఠభూమిలోని పొగమంచుతో నిండిన పులచిమలై కొండల నుంచి ఉద్భవించి, అరుదైన ఔషధ వృక్షజాలంతో సమృద్ధిగా ఉన్న అడవుల గుండా ప్రవహించే ఈ పవిత్ర నది ప్రతి అలలోనూ ఇతిహాసాలు, గొప్ప చరిత్రను దాచుకుంది. ఒకప్పుడూ స్వచ్ఛతకు ప్రతీకగా నిలిచిన అవే జలాలు ఇలా భక్తులు వదిలేసిన బట్టలు, పూసల మాలలు వంటి వాటితో కలుషితమవుతోంది. ఉనికిలోని ఆచారంతో పవిత్రమైన నదిని కాస్తా అపవిత్రంగా మారుస్తుండటం బాధకరం.(చదవండి: దేవకి అమ్మ 40 ఏళ్ల కృషి..'తపోవనం'!) -
దేవకి అమ్మ 40 ఏళ్ల కృషి..'తపోవనం'!
అడవి అంటే సహజసిద్ధంగా ఏర్పడేదనేది తెలుసు అందరికి. కానీ చేతితో సృష్టించిన వనం గురించి విన్నారా. ఔను ఇది నిజం. చేతితో అడవిని సృష్టించడమా? అని ఆశ్చర్యం వేసినా..నమ్మకతప్పని సత్యం ఇది. అది కూడా ఓ 92 ఏళ్ల వృద్ధురాలి చేతి నుంచి పరుచుకన్న పచ్చదనం. అది ఆమె ఆరాటం నుంచి పుట్టుకొచ్చిన ప్రకృతి తపోవనంలా అచ్చంత ఆహ్లాదభరితంగా అలారారుతుంది. వాతావరణ మార్పు కోసం గత కొన్నేళ్లుగా పచ్చదనం అనే మంత్రం జపిస్తున్నాం కానీ..అంతకుమునుపు నుంచే ఈ దేవకి అమ్మ పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తించి..అందుకోసం కృషి చేశారామె. చెట్టు విలువ తెలసిన అమ్మ ఈమె. ఆమె పెంచిన అడవిలో ఉండే మొక్కలు గురించి విన్నా..విస్తుపోవాల్సిందే..!. అసలు ఈ దేవికి అమ్మ ఎవరు..? అడవిని సృష్టించాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటే..కేరళలోని అలప్పుజలోని ఓ చిన్న గ్రామానికి చెంది దేవికి అమ్మ నలబై ఏళ్ల కృఫి ఫలితమే ఈ తపోవనం. ఇది ఆమె చేతితో సృష్టించిన అడవి. ఇక్క ఎన్నో ఔషధ మోక్కలు, చేపలు, పక్షుల సందడితో ఆహ్లాదభరితమైన పర్యావరణ సమతుల్యత కనిపిస్తుంది. మనకు కలిగిన శారీరక కష్టానికి కాసింత కలత చెంది..ఆరోగ్యంగా ఉండేందుకు యత్నిస్తాం. కానీ ఈ దేవికి అమ్మ అలా కాదు..తాను అనుభవించిన శారీరక బాధకు ఉపశమన మొక్కలుగా భావించడం విశేషం. అనుకోని ఓ ప్రమాదం కారణంగా అంగవైకల్యంతో మంచానికే పరిమితమైంది దేవకి. బాధకు ఉపశమనంగా చెట్ల పెంపకం..దాంతో ఎప్పటికీ వరిపొలం పనులు చేసే అవకాశం లేకుండాపోయింది. ఏళ్లుగా వ్యవసాయాన్ని నమ్ముకున్న దేవకీ..ఆ పనులకు స్వస్తిచెప్పక తప్పలేదు. తనంతట తాను నడవలేని దైన్యస్థితితో చాలా పోరాడింది. చివరికి చికిత్స తీసుకుంటూనే తన పనులు తను చేసుకునేలా ఉండాలన్న సంకల్పం..కర్ర ఊతంతో నడవగలిగే శక్తిని అందించింది. ఆ కాసింత శక్తితోనే ఏదో ఒకటి చేయాలని ఆరాటపడింది. ఎలాగో ఈ శారీరక వైకల్యంతో వ్యవసాయం అంటే కష్టమే అందుకని..తన ఇంటి వెనుక ఉన్న బంజరు భూమిలో మొక్కలు నాటాలని నిర్ణయించుకుంది. రోజుకు ఒక మొక్క చొప్పున నాటడం, దానితో కాసేపు గడపడం వంటి పనులతో తన శారీరక రుగ్మత నుంచి బయటపడే యత్నం చేసింది. ఇలా నాలుగు దశబ్దాలుగా తన రోజువారీ దినచర్యలో మొక్కలు నాటడం అనేది భాగంగా మారింది. అలా చూస్తుండగానే ఐదు ఎకరాల్లో పరుచుకున్న సహజసిద్ధమైన అడవిగా రూపాంతరం చెందింది. ఈ అడవిలో వివిధ జాతుల చెట్లు,పొదలు, ఔషధ మొక్కలకు నిలయం.ఇక్కడ ప్రత్యేక చెట్లలో ఒకటి కమండలు. దీన్ని కాలాబాస్ చెట్టు అని కూడా పిలుస్తారు. ఋషులు తపస్సు నిమత్తమై వినియోగించే కమండలం కోసం ఈ చెట్టునే వినియోగిస్తారు. అందుకే దీన్ని కమండలు వృక్షం అనిపిలుస్తారు. అంతేగాదు ధ్యాన సమయంలో ఈ చెట్టు కొమ్మలనే ఆధారం చేసుకుంటారు. ఇదేగాక నెమలి మొక్క..అని మరో ప్రత్యేకమైన మొక్క ఉంది. దీని ఆకులు నెమలి ఈకను పోలి ఉంటాయి. ఇవేగాక అంజూర చెట్లు, ఇండియన్ బ్లాక్‌బెర్రీ, జాక్‌ఫ్రూట్, మామిడి, అడవి బెర్రీలు, వేసవిలో ఆకురాల్చు బుద్ధచెట్టు తదితరాలు ఉన్నాయి. ఈ పచ్చదనం మధ్యలో క్యాట్‌ఫిష్ వంటి చేపలు, స్నేక్‌హెడ్ ముర్రెల్తో నిండిన చిన్న చెరువు వంటివి ఉన్నాయి. ఈ చేపలు తినే పక్షులు, ఈగల్, వేటాడే పక్షులు కిలకిలరావాలతో మరో ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నట్లుగా ఉంటుంది. సముద్రానికి సమీపంలో బ్యాక్‌వాటర్స్(ఉప్పునీరు లాంటి చిన్న చెరువులు) మధ్య ఇలాంటి అడవినా..! అని అక్కడకు వచ్చే జనాలు విస్తుపోతుంటారు. తెల్లటి ఇసుక, చుట్టూ ఉప్పు నీరు మధ్య పచ్చదనం అనేది చాలా కష్టం. కానీ దేవికి అమ్మ పట్టుదల..ఈ వృక్ష సంపదకు మూలం. ఆ అమ్మ చుట్టు పక్కల వాళ్లకు ఉచితంగా ఆ అడవిలోని మొక్కలను అందిస్తుంది. అంతేగాదు అందరు వచ్చి సందర్శించొచ్చు కూడా. అందుకు ఎలాంటి రుసుము తీసుకోదామె.ఇది ప్రకృతి ప్రసాదమని అవి అందరి హక్కు అని అంటుంటారామె. ఒక చెట్టును నాటడం అనేది కార్బన్ పాదముద్రను తొలగించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఇక్కడ ఈ దేవికి అమ్మ అదే చేశారు. అందుకే భారత ప్రభుత్వం ఆమె నిస్వార్థ సేవను గుర్తించి ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అన్సంగ్ హీరోస్ విభాగంలో పద్మశ్రీతో సత్కరించింది. అంతేగాదు అడవుల పెంపకం, పరిరక్షణకు సంబంధించి పర్యావరణ బాధ్యత ఎలా ఉంటుందో చేతల ద్వారా చూపించి ఆదర్శంగా నిలిచింది ఈ దేవకి అమ్మ..!.(చదవండి: వెయ్యి కోట్ల కంపెనీని నిర్మించిన మాజీ పైలట్: ఆ ప్రమాదం ఆకాశం నుంచి..) -
'చల్లటి ఫలుడా'ని ఆస్వాదిస్తున్న సునీతా విలియమ్స్..!
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇటీవల కేరళను సందర్శించారు. అక్కడ ఆమె వెర్మిసెల్లి(సేమ్యాలు)తో చేసిన చల్లటి డెజర్ట్‌ని ఆస్వాదిస్తునన్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సునీతా పీచ్‌రంగు టీ షర్ట్ ధరించి తన చుట్టూ ఉన్న వ్యక్తులతో సరదాగా గడుపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోని ఫలుడా నేషన్ అనే అవుట్లెట్ స్టోర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..ఈ క్షణం ఎప్పటికీ మర్చిపోలేం. సునీతా విలియమ్స్‌ని ఫలూడాకు స్వాగతించడం ఎంత గౌరవం. అంతరిక్షం నుంచి మా స్టోర్‌కి ఆ ఆలోచన మమ్మల్ని విస్మయానికిలోను చేస్తోంది.ఆమె మా రుచులన పంచుకోవడం..అదోక గొప్ప వరంగానూ, గర్వంగానూ ఉంది". అని పోస్ట్‌లో పేర్కొంది. ఈ వీడియోకి మిలియన్స్‌కు పైగా వ్యూస్ రావడమే గాక, ఆకామంత ఎత్తుగా కలలు కనడం నేర్పిన వ్యక్తి అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. కాగా, సునీతా 27 ఏళ్ల సేవల అనంతరం ఇటీవలే నాసా నుంచి పదవీ విరమణ చేశారు. ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో మూడు మిషన్లు పూర్తి చేసిన ఘనత ఆమెది. అలాగే ఆమె కెరీర్లో మానవ అంతరిక్ష ప్రయాణ రికార్డులను నెలకొల్పారామె. View this post on Instagram A post shared by Falooda Nation (@faloodanation.in) (చదవండి: ఇంటిపేరే ‘బెంగళూరు’..!) -
ఐదుసార్లు చలాన్లు పడితే లైసెన్స్ రద్దే?
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాలని నివారించడమే లక్షంగా కేంద్ర మోటారు వాహన చట్టాన్ని మరింత కఠినతరం చేయనున్నట్లు ప్రకటించింది. ఒక వ్యక్తిపై సంవత్సరంలో ఐదు కంటే ఎక్కువ సార్లు చలాన్లు ఉంటే అతని లైసెన్సును రద్దు చేసే విధంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రోడ్డు భద్రతా చర్యలలో భాగంగా కేరళ ప్రభుత్వం వాహన చట్టంలో కీలక మార్పులు చేసింది. వాహనానికి చలాన్లు పడ్డ 45 రోజుల్లోపు వాటిని చెల్లించకుంటే సదరు వాహనాలను జప్తు చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఆ వాహనం ఎవరి పేరు మీద ఉందో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. వెహికిల్‌పై చలాన్ పడ్డ సమయంలో దానిని వేరే వారు నడుపుతున్నట్లయితే దానిని నిరూపించాల్సిన బాధ్యత సదరు వాహన యజమానిపై ఉంటుందని తెలిపింది.వెహికిల్‌కు సంబంధించిన పెండింగ్ చలాన్లు చెల్లించాలు పరివాహన్ అనే అధికారిక వెబ్సైట్ ద్వారానే చెల్లించాలని తెలిపింది. అదేవిధంగా పెండింగ్ చలాన్లపై ఎవైనా ఫిర్యాదులుంటే సదరు వాహనదారుడు కోర్టును సంప్రదించవచ్చని పేర్కొంది. -
అది ముస్లింలీగ్ మావోయిస్టు కాంగ్రెస్
తిరువనంతపురం: విపక్ష కాంగ్రెస్ అధికారం కోసం సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తోందని, ముస్లిం లీగ్‌తో అంటకాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ముస్లింలీగ్ మావోయిస్టు కాంగ్రెస్(ఎంఎంసీ)గా మారిపోయిందని ఆరోపించారు. శుక్రవారం కేరళ రాజధాని తిరువనంతపురంలో భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ దుష్ట రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. వారి దుర్మార్గ వ్యూహాలకు కేరళను ప్రయోగశాలగా వాడుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్‌కు అభివృద్ధి అజెండా లేదన్నా రు. మావోయిస్టులను మించిన కమ్యూ నిస్టులుగా, ముస్లింలీగ్‌ను మించిన మతతత్వవాదులుగా మారిపోయారని కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. సీపీఎం నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ తీరుపై మండిపడ్డారు. శబరిమలలో అయ్యప్ప ఆలయ సంప్రదాయాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. అయ్యప్ప బంగారాన్ని సైతం చోరీ చేశారని విమర్శించారు. కేరళలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే బంగారం చోరీపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. దోషులను గుర్తించి జైలుకు పంపిస్తామన్నారు. ఇదీ మోదీ గ్యారంటీ అని స్పష్టంచేశారు. రాష్ట్రంలో వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఒక్కటేనని విమర్శించారు. అవినీతికి చరమగీతం పాడి అభివృద్ధికి బాటలు వేసే బీజేపీని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కేరళ ప్రజలకు పిలుపునిచ్చారు. మన నినాదం ‘వికసిత్ కేరళం’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మార్పునకు ఇదే సరైన సమయమని వెల్లడించారు. గుజరాత్లో నాలుగు దశాబ్దాల క్రితం తొలుత అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పాగా వేసి, క్రమంగా రాష్ట్రమంతటా విస్తరించామని అధికారం దక్కించుకున్నామని మోదీ గుర్తుచేశారు. అదే తరహాలో కేరళలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌ను గెల్చుకు న్నామని, ఇక రాష్ట్రంలో అధికారంలోకి రాబోతు న్నామని ధీమా వ్యక్తంచేశారు. గుజరాత్ ఫలితం కేరళలో పునరావృతం అవుతుందన్నారు. తిరువ నంతపురం మేయర్‌గా ఎన్నికైన వి.వి.రాజేశ్‌ను బహిరంగ సభ వేదికపై ప్రధాని మోదీ అభినందించారు. ఆయనతో కలిసి చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేశారు. తిరువనంతపురం మున్సిపల్ కార్పొ రేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల మోదీ హర్షం వ్యక్తంచేశారు. డిప్యూటీ మేయర్ ఆశానాథ్.. మోదీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం అందుకున్నారు. ప్రధాని మోదీ కేరళలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. -
చందమామ అందలేదు
కోజికోడ్: నాలుగు అంతరిక్ష యాత్రలు! అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏకంగా 608 రోజులు! 62 గంటలకు పైగా స్పేస్ వాక్‌లు!!! ఇన్ని ఘనతలు సాధించినా, చంద్రునిపై కాలు పెట్టలేకపోయానన్న వెలితి తనకెప్పటికీ ఉంటుందని ఇటీవలే రిటైరైన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (60) చెప్పారు. ‘‘చంద్రునిపైకి వెళ్లాలని ఎవరికి మాత్రం ఉండదు! అసలు నేను నాసాలో చేరిందే చంద్రునిపై కాలు పెట్టే లక్ష్యంతో’’ అని వెల్లడించారు. ‘‘కనుక మూన్ మిషన్‌లో భాగం కాలేకపోయాననే వెలితి ఉంటుంది. కాకపోతే, నా తోటి వ్యోమగాములు త్వరలోనే మరోసారి ఆ ఘనత సాధించబోతున్నారు. అది తలచుకుంటేనే ఎంతో ఉత్కంఠగా ఉంది’’ అని చెప్పారు. కోజికోడ్‌లో జరుగుతున్న కేరళ సాహితీ సదస్సులో సునీత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాసాలో తన 27 ఏళ్ల కెరీర్ గురించిన ఆసక్తికర విషయాలెన్నింటినో పంచుకున్నారు. ‘‘అంతరిక్ష యాత్రల బిజీలో భూమిపై ఉన్న ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను ఇప్పటిదాకా చూడలేకపోయా. వాటిలో కేరళ ఒకటి. ఇకపై వాటన్నింటినీ ఒక్కొక్కటిగా పర్యటిస్తా.ఆ అనుభూతులకు దూరం...అంతరిక్షంలో ఉన్న సమయంలో చిన్న చిన్న అనుభూతులకు దూ రమైన వెలితి మాత్రం బాగా బాధించేదని సునీత గుర్తు చేసు కున్నారు. ‘‘నా కుటుంబీకులతో వీడియో కాల్స్ ద్వారా టచ్‌లో ఉండేదాన్ని. భూమిపై ఎక్కడేం జరుగుతున్నదీ లేటెస్ట్ న్యూస్‌తో సహా ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉండేది. కానీ తొలి చినుకుల స్పర్శ, ముఖానికి పిల్లతెమ్మెరల మృదువైన తాకిడి, బీచ్‌లో కాళ్లకింద మెత్తగా జారిపోయే ఇసుక వంటివి అంతరిక్షంలో కలలోని అనుభూతులే. వీటన్నింటికీ మించి నా బుజ్జి పెంపుడు కుక్కలకు దూరంగా గడపాల్సి వచ్చేది. తల్లి వంటి భూమికి, ఆ వాతావరణానికి, అక్కడి అనుభూతులకు, చెట్లు, చేపలు తదితరాలకు దూరంగా ఉండటం బాధించేది’’ అని చెప్పుకొచ్చారు. తొలి అంతరిక్ష యాత్ర సందర్భంగా నాన్న తనకు ఫోన్ చేసి, భారత్‌వ్యాప్తంగా అందరూ తాను క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారని చెబితే నమ్మలేకపోయానని కూడా సునీత గుర్తు చేసుకున్నారు. ‘‘నేను నమ్మను పొమ్మన్నా. కానీ అది నిజమేనని తిరిగొచ్చాక పత్రికల్లో వార్తలు, వ్యాసాలు చూస్తే తెలిసింది. ఎక్కడో హిమాలయాల్లో ప్రాథమిక స్కూల్లో పని చేసే నా స్నేహితురాలు ఫోన్ చేసి, ‘మా స్కూల్లో నీ ఫొటో ఉంది తెలుసా!’ అని చెప్పినప్పుడు చెప్పలేని అనుభూతి కలిగింది. భారత్ నన్ను నిజంగా సొంత కూతురిలా అక్కున చేర్చుకుంది’’ అంటూ హర్షం వెలిబుచ్చారు.భయమే అన్పించలేదుఅంతరిక్ష యాత్రల్లో ఏనాడూ భయం తన దరిదాపుల్లోకి కూడా రాలేదని సునీత గుర్తు చేసుకున్నారు. సునీత, బచ్ విల్మోర్లతో బయల్దేరిన బోయింగ్ తొలి అంతరిక్ష నౌక స్టార్‌లైనర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమయ్యే క్రమంలో సాంకేతిక వైఫల్యాలను ఎదుర్కొనడం, 8 రోజుల యాత్ర కాస్తా 286 రోజుల పాటు సాగడం తెలిసిందే. ‘‘అప్పుడు కూడా అస్సలు భయం అనిపించలేదు. నాసా సైంటిస్టులపై పూర్తి నమ్మక ముంచా. నా సహచరుడు విల్మోర్, నేను కూడా మా పరస్పర సామర్థ్యాలను పూర్తిగా నమ్మాం. మా దృష్టినంతా సమస్యను ఎలా పరిష్కరించాలా అన్నదానిపైనే కేంద్రీకరించాం’’ అని ఆమె వివరించారు. కేరళ సాహితీ సదస్సులో సాహిత్యం నుంచి సినిమాల దాకా పలు రంగాలకు చెందిన హేమాహేమీలు పాల్గొంటున్నారు. -
రాహుల్‌కు ఝలక్.. మోదీకి శశిథరూర్ సపోర్ట్?
తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడటం లేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సమావేశాన్ని డుమ్మా కొట్టి.. కేరళలోనే ఉండటం చర్చనీయాంశంగా మారింది. అది కూడా మోదీ పర్యటిస్తున్న సమయంలో ఆయన కేరళలోనే ఉండటం మరోసారి అనుమానాలను పెంచింది.కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కీలక వ్యూహాత్మక సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి సీనియర్ నేత శశిథరూర్ హాజరుకాలేదు. ఆయన నియోజకవర్గం తిరువనంతపురంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్న సమయంలో ఆయన కేరళలోనే ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఆయన కార్యాలయం స్పందిస్తూ.. కొలికోడ్‌లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్ట్‌లో పాల్గొనేందుకే థరూర్ రాష్ట్రంలో ఉన్నారని తెలిపింది.ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌లో సీనియర్ నేత, నాలుగుసార్లు ఎంపీగా ఉన్న థరూర్.. ఇటీవల పలు సందర్భాల్లో ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించడం ఆ పార్టీని ఇబ్బందికి గురిచేస్తోంది. దీంతో రాష్ట్ర నాయకులు కూడా పార్టీ వ్యవహారాల్లో ఆయన్ను పక్కన పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల కొచ్చిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ తనతో సరిగా వ్యవహరించకపోవడంపై థరూర్ తీవ్ర కలత చెందినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయన అధిష్ఠానం దృష్టికీ తీసుకెళ్లినట్లు తెలిసింది. -
కేరళపై బీజేపీ మాస్టర్ ప్లాన్.. మోదీ గ్యారంటీ అంటూ..
తిరువనంతపురం: దక్షిణాది రాష్ట్రం కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఇది వికసిత కేరళ సమయం.. రానున్నది ఎన్డీఏ ప్రభుత్వానికి సమయం అంటూ వ్యాఖ్యలు చేశారు.బీజేపీ ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘కేరళలో అవినీతి అభివృద్ధిని తీవ్రంగా అడ్డుకుంది. ఎల్డీఎఫ్ హయాంలో బ్యాంకుల్లో జమ చేసిన పొదుపు కూడా ప్రభావితమైంది. సహకార బ్యాంకు కుంభకోణం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బు దోపిడీకి గురైంది. బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి. దోపిడీదారుల నుండి ప్రతి రూపాయిని తిరిగి తీసుకునేలా మేము చూస్తాం. అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)ల అవినీతిని అంతం చేస్తాం. రాబోయే ఎన్నికలు రాష్ట్ర పరిస్థితులను మార్చేస్తాయి. ఇప్పటివరకు మీరు ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌ల పాలన మాత్రమే చూశారు. అవి రాష్ట్రాన్ని నాశనం చేశాయి. మూడోవైపు ఉంది. అది బీజేపీ అభివృద్ధి, సుపరిపాలనను అందిస్తుంది. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్లకి వేర్వేరు జెండాలు ఉన్నప్పటికీ.. వాటి అజెండా ఒక్కటే. అదే అవినీతి, జవాబుదారీతనం లేకపోవడం. ఇప్పుడు ప్రజల అభివృద్ధికి తోడ్పడే ప్రభుత్వం అవసరం, ఆ పని మేం చేస్తాం. కేరళ ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచి.. మాతో చేతులు కలపాలి అని కోరారు.#WATCH | Thiruvananthapuram, Kerala: At a BJP rally, PM Modi says, "The upcoming elections will be the ones to change the condition and direction of Kerala. When it comes to the future of Kerala, you have seen just two sides so far. On one side, there is LDF, and on the other… pic.twitter.com/DmLIEmghQV— ANI (@ANI) January 23, 2026ఇదే సమయంలో శబరిమల ఆలయంలో బంగారు చోరీ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. మొత్తం దేశానికి, మనందరికీ అయ్యప్ప స్వామిపై అచంచలమైన విశ్వాసం ఉంది. అయితే, ఎల్డీఎఫ్ ప్రభుత్వం శబరిమల ఆలయ సంప్రదాయాలను దెబ్బతీయడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు, ఇక్కడ బంగారం దొంగతనం జరిగినట్లు నివేదికలు వస్తున్నాయి. స్వామివారి పక్కనుండే ఆలయం నుండి బంగారం దొంగిలించబడినట్లు నివేదికలు వస్తున్నాయి. నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. కేరళలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరుగుతుంది. దోషులను జైలుకు పంపిస్తాం. దీనిపై విచారణ జరిగేలా చూడటం ‘మోదీ గ్యారెంటీ’ అని పేర్కొన్నారు.కాగా, కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ భారీ విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ కేరళలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ ఎన్నికలలో బీజేపీ.. 45 సంవత్సరాల తర్వాత ఎల్డీఎఫ్ నుండి తిరువనంతపురం కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. ప్రధాని ఈ విజయాన్ని అసాధారణమైనదిగా, చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూ ఇది కేరళలో బీజేపీ ప్రభుత్వానికి పునాది వేసిందని అన్నారు. ఇక, కేరళ అసెంబ్లీలోని 140 స్థానాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. -
వీడియో: చిన్నోడా.. అలసిపోయి ఉంటావ్!
ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటనలో ఇవాళ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. బహిరంగ సభకు హజరైన జనాల్లో ఓ పిల్లాడు చేసిన పని మోదీ దృష్టిని ఆకర్షించింది. అంతే.. ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. తిరువనంతపురంలో శుక్రవారం ప్రధాని మోదీ సభ జరిగింది. అయితే ఒక చిన్న పిల్లాడు ప్రధాని మోదీ డ్రాయింగ్ ఫోటోను ఎత్తిపట్టి చాలా సేపు నిలబడి ఉన్నాడు. అది గమనించిన ప్రధాని మోదీ.. తన ప్రసంగాన్ని ఆపి ఆ బాలుడిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘చిన్నోడా, నువ్వు చాలా సేపు ఫోటో పట్టుకుని నిలబడ్డావు. అలసిపోయి ఉంటావ్. ఆ ఫోటోను నాకు ఇవ్వు. దాని వెనకాల నీ చిరునామా రాయు. నేను నీకు వ్యక్తిగతంగా లేఖ రాస్తాను’’ అని అన్నారు. ఈ క్రమంలో.. ఆ పిల్లాడి చేతుల్లోని ఫొటోను జాగ్రత్తగా తీసుకోవాలని తన ప్రత్యేక రక్షణ బృందం (SPG)కి సూచించారు. అది ఆ బాలుడి ప్రేమ, ఆశీర్వాదాల ప్రతీక. దాన్ని జాగ్రత్తగా తీసుకోండి అంటూ వ్యాఖ్యానించారాయన. దీంతో సభ ఒక్కసారి చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ సమయంలోనే.. మరో మహిళ ఓ పెద్ద పుస్తకాన్ని ఎత్తి మోదీ వైపు ప్రదర్శించింది. మోదీ ఆమెను కూడా గుర్తించి.. ఆమె కూడా నాకు ఏదో ఇవ్వాలని అనుకుంటున్నారు. పెద్ద పుస్తకం తయారు చేసి తీసుకొచ్చారు అని అనడంతో నవ్వులు పూశాయి. ఇక కేరళ సభలో మోదీ రాజకీయ ప్రసంగంలో.. సీపీఐ(ఎం), కాంగ్రెస్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేరళలో మార్పు అవసరమని.. అందుకు బీజేపీని ఆశీర్వదించాలని కేరళ ప్రజలను ఆయన కోరారు. ఇప్పటికే ఆ మార్పు మొదలైందని.. ప్రజల ఆశీస్సులతోనే కేరళలో కమల వికాసం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారాయన. ఈ పర్యటనలోనే ఆయన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, కొత్త రైలు సేవలను ప్రారంభించారు. కేరళ అభివృద్ధి కోసం కేంద్రం చేస్తున్న కృషిని కేరళ ప్రజలు గుర్తిస్తున్నారని వ్యాఖ్యానించారాయన. प्रधानसेवक मोदी जी के प्रति केरला के बच्चों का प्रेम pic.twitter.com/u0tKKimQsw— Dr Neetu Dabas 🇮🇳 (@INeetuDabas) January 23, 2026 -
కేరళని ధ్వంసం చేసింది వారే : మోదీ
కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే శబరిమల అయ్యప్ప దేవాలయంలో గోల్డ్ చోరీ నిందితులని అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో ఈ సారి అధికార మార్పు తప్పనిసరని పేర్కొన్నారు. ఈ రోజు (శుక్రవారం) కేరళలో మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా అధికార కమ్యూనిస్టుల ప్రభుత్వంపై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. తిరువనంతపురంలో LDF, UDF ప్రభుత్వాలు ఇంతకాలం చేసిన అవినీతిని బీజేపీ అంతం చేస్తుందని తెలిపారు. మోదీ కేరళ పర్యటన సందర్భంగా ఇటీవల తిరువనంతరంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఆయన ప్రస్థావించారు. కేరళ ప్రజలు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అందుకు నిదర్శనం ఇటీవల తిరువనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడమేనని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న LDF, UDF కూటములకు ప్రత్యామ్నయంగా బీజేపీ ఎదిగిందన్నారు.ప్రధాని మోదీ మాట్లాడుతూ "రాబోయే ఎన్నికలు కేరళ స్థితిని గతిని రెండింటిని మారుస్తాయి. ఇప్పటివరకూ మీరు కేరళని రెండువైపుల నుంచే చూశారు. LDF, UDF రెండు కూటములు కేరళని ధ్వంసం చేశాయి. కానీ మూడోవైపు కూడా ఉంది అదే అభివృద్ధి, పరిపాలన అదే బీజేపీ" అని ఆయన అన్నారు. ఇంతకాలం ఈ రెండుకూటములు అవినీతి, లంచగొడితనం చేసి రాష్ట్రాన్ని బాగుపడకుండా చేశాయన్నారు. ఇక్కడ కాంగ్రెస్ "ముస్లీం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్" గా మారిందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని వికసిత్ కేరళగా మార్చే హామీ తనదని అన్నారు. LDF, UDF కూటములు ఒకే నాణానికి రెండు వైపుల్లాంటివి ఆ రెండింటి పాలన ఒకే విధంగా ఉంటుందన్నారు. ఐదు లేదా పది సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుందని వారికి తెలుసని మారేది ప్రభుత్వమే.. పాలన కాదు ఆ రెండు పార్టీల విధానం ఒకటేనని తెలిపారు. ప్రస్తుతం ప్రజలకు మేలు చేసి అభివృద్ధి చేసే ప్రభుత్వం రావాలని అది బీజేపీ పార్టీనేనని మోదీ స్పష్టం చేశారు.ఇటీవల తిరువనంతపురం ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు అద్భుతమని అక్కడ పాలించడానికి బీజేపీని ప్రజలు ఆదరించారని తెలిపారు. రాష్ట్ర యువతకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని మోదీ విమర్శించారు. ప్రస్తుతం ప్రపంచంలోని ఎన్నో దేశాలతో ఇండియా భారీ ఒప్పందాలు చేసుకుంటుందని అందుకే కేరళలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. -
మారని శశిథరూర్ తీరు..!
తిరువనంతపురం: కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ మరోసారి పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేయనున్నారా?, కాంగ్రెస్‌తో అంటీ ముట్టనట్లు, బీజేపీతో అత్యంత దగ్గరగా ఉండే శశిథరూర్.. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ఏదొక వంకతో కాంగ్రెస్‌ను దూరం పెడుతూనే ఉన్నారు. తాజాగా కేరళ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు సమావేశం కావడానికి సమయం ఫిక్స్ చేశారు. ఈరోజు(శుక్రవారం, జనవరి 23వ తేదీ) మధ్యాహ్నం గం. 2.30 ని.లకు సమావేశం కానున్నారు. అయితే దీనికి కేరళ సీనియర్ కాంగ్రెస్ నేత, నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన శశిథరూర్ దూరంగా ఉండనున్నారట.తనను ఒకానొక సందర్భంలో రాహుల్ గాంధీ నుంచి అవమానం ఎదురైందనే భావనలో ఉన్నారు శశిథరూర్. ఇటీవల కేరళ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ.. తనకు తగినంత గౌరవం ఇవ్వలేదని శశిథరూర్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అందుచేతనే ఆయన.. కేరళ కాంగ్రెస్ సీనియర్ నేతలతో ఏఐసీసీ నేతల సమావేశానికి హాజరు కావడం లేదని సదరు వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ కారణంగా శశిథరూర్.. కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందే జరిగే ఈ సమావేశానికి శశిథరూర్ దూరంగా ఉండటం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సీడబ్యూసీ సమావేశానికి వెళ్లిన శశిథరూర్.. రాహుల్ గాంధీ సమావేశాలకు మాత్రం డుమ్మా కొడుతున్నారు. ఇదే ఇప్పుడు కేరళ కాంగ్రెస్‌లో అలజడికి కారణమైంది. ఎన్నికలు వచ్చిపడుతున్న వేళ.. శశిథరూర్ తీరు కాంగ్రెస్ నేతలకు అంతు చిక్కడం లేదు. -
మన అమృత్ భారత్ రైలు నేడు ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా నాలుగు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రారంభించనున్నారు. అందులో భాగంగా తెలంగాణకు కేటాయించిన చర్లపల్లి–తిరువనంతపురం సూపర్‌ఫాస్ట్ రైలు కూడా ఉంది. ఇప్పటికే చర్లపల్లి–ముజఫర్‌పూర్ మధ్య అమృత్ భారత్ రైలు నడుస్తుండగా, ఇది రాష్ట్రానికి రెండో రైలు. రాష్ట్రానికి మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. రైలు వేళలు ఇలా... 17041 నంబరుతో ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7.15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 17042 నంబరుతో బుధవారం సాయంత్రం 5.30కు తిరువనంతపురం నుంచి బయలుదేరి గురువారం రాత్రి 11.30కి చర్లపల్లికి చేరుకుంటుంది.ఈ రైలు నల్లగొండ, గుంటూరు, తెనాలి, గూడూ రు, రేణిగుంట, కాటా్పడి, ఈరోడ్ – కోయంబత్తూరు, పాలక్కాడ్, ఎర్నాకులం టౌన్, కొ ట్టాయం, కాయంకులం రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనుంది. ప్రస్తుతం ఇదే రూట్లో శబరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉంది. కొత్తగా ప్రారంభం కానున్న అమృత్‌భారత్ వల్ల అయ్యప్ప భక్తులకు భారీ ఊరట లభించనుంది. నల్లగొండ, మిర్యాలగూడ రైల్వే స్టేషన్లలో హాలి్టంగ్ సదుపాయం ఉంది.ఈ ట్రైన్లో 11 సాధారణ బోగీలు, 8 స్లీపర్ బోగీలు ఉన్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించొచ్చు. -
సోషల్ మీడియాలో ఓ మహిళ పెట్టిన వీడియోతో వ్యక్తి ఆత్మహత్య
-
సోషల్ మీడియా పోస్ట్.. యువతి అరెస్ట్
కొద్దిరోజుల క్రితం కేరళలో బస్సులో లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి వీడియో పోస్ట్ చేసి సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేసింది. దీంతో ఇది వైరల్‌గా మారడంతో అవమాన భారంతో ఆయువకుడు బలవన్మరణానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా కేరళ పోలీసులు ఆ వీడియో పోస్ట్ చేసిన యువతిని అరెస్టు చేశారు.గత శుక్రవారం దీపక్(42) అనే వ్యక్తి కన్నూర్ వెళ్లడానికి బస్సుఎక్కాడు. ఆసమయంలో బస్సులోనే ఉన్న శింజితా ముస్తాఫా (35) అనే మహిళ తనను దీపక్ తనను అసభ్యంగా తాకాడంటూ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టింది. ఇది కాస్త అక్కడ వైరల్‌గా మారడంతో అవమానభారంతో ఆ దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయువకుడి తప్పేమి లేదని యువతి ఫేమస్ కావాలనే ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని యువకుడు తరపు బంధువులు కేసు పెట్టారు.దీంతో ముస్తాఫా పరారైంది. తాజాగా ఆమెను తన బంధువుల ఇంటివద్ద అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె సామాజిక మాధ్యమాలలో షేర్ చేసిన వీడియో ఎడిటడ్‌దని ఆ పూర్తి వీడియోని సైబర్ విభాగం రివవరీ చేసి చూస్తుందని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ ఘటనకు సంబంధించిన సీసీటీవీ పుటేజ్ వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై గతంలో శింజితా ముస్తాఫా స్పందిస్తూ " నేను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు అతడు నన్ను అదేపనిగా తాకాడు. అది అపార్థంగా అనుకోకుండా జరిగింది కాదు. కావాలనే అలా చేశాడు ఇది ఖచ్చితంగా తప్పే నాకు అతను తాకడం ఇబ్బందిగా అనిపించిన తర్వాత రికార్డింగ్ చేయడం ప్రారంభించాను అయినప్పటికీ అతను తాకాడు" అని తెలిపింది.అయితే ఈ వివాదం రెండురోజుల తర్వాత దీపక్ తన ఇంటివద్ద ఉరివేసుకొని చనిపోయాడు. దీంతో అతను చాలా అమాయకుడని అన్యాయంగా తన కొడుకుపై అపనింద వేశారని అతని తల్లిదండ్రులు రోదించారు. దీనిపై కేరళ మానవహక్కుల సంఘం సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. దీనిపై సమగ్రవిచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది. -
11 లైసెన్సులు, 75 ఏళ్లు : ఆమెకు ప్రతీ దారి ఒక పాఠం!
కుటుంబాన్ని పోషించుకునేందుకు, గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు మహిళలు ఎంతటి సాహసాని కైనా పూనుకుంటారు. క్లిష్టమైన డ్రైవర్ వృత్తిలో రాణిస్తూ 75 ఏళ్ల మహిళ శభాష్ అనిపించు కుంటోంది. ఒకపుడు డ్రైవింగ్‌ను జీవనోపాధిగా చూసేవారు, అదీ పురుషులకు మాత్రమే పరిమితమని భావించేవారు. కానీ ప్రస్తుతం ఎలాంటి లింగ భేదాలు లేకుండా డ్రైవింగ్‌ను ఒక అభిరుచిగా కొనసాగిస్తున్నారు. స్త్రీలైనా, పురుషులైనా, డ్రైవింగ్ ఒక అవసరం. కేరళకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు రాధామణి మరింత ప్రత్యేకం. రాధామ ఏకంగా చీరలోదుబాయ్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ నడుతూ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతిభకు వయసుతో పనిలేదని నిరూపిస్తూ అత్యంత నిష్ణాతులైన డ్రైవర్లలో ఒకరిగా అరుదైన ఖ్యాతిని సంపాదించింది. వాహనంఏదైనా...ఆమె చేతికి స్టీరింగ్ వచ్చిందంటే.. రయ్ రయ్‌మని దూసుకుపోవాల్సిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష మందికి పైగా అనుచరులున్న మణి అమ్మ లేదా డ్రైవర్ అమ్మగా ప్రసిద్ధి చెందిన రాధామణి అమ్మ, లగ్జరీ కార్లు మ్తాత్రమే కాదు లగ్జరీ కార్లను మాత్రమే కాదు,రోడ్ రోలర్లు, క్రేన్లు, బస్సులు, JCB వంటి ఎక్స్కవేటర్లు, ట్రక్కులు, ఫోర్క్‌లిఫ్ట్‌లు ఇతర భారీ యంత్రాలతో సహా 11 వేర్వేరు డ్రైవింగ్ లైసెన్స్‌లను కలిగి ఉండటం విశేషం. విదేశాలకు డ్రైవింగ్ చేసేందుకు అవసరమైన అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్‌ను సాధించింది. కేరళలో డ్రైవింగ్ స్కూల్ నడుపుతోంది. అందుకే మణి అమ్మ ‘ది డ్రైవర్ అమ్మ’గా నెటిజన్స్ అభివర్ణిస్తున్నారు. ‘‘ప్రతి దారి ఒక కొత్త పాఠం లాంటిది. ఆత్మవిశ్వాసం, శ్రద్ధ, ప్రేమ- ఇవే నా ప్రయాణానికి బలాలు. రోడ్లు ఎలా తిరిగినా సాగిపోతూనే ఉండే ధైర్యం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు’’ మణి అమ్మకేరళలో డ్రైవింగ్ స్కూల్ బస్సు, ట్రక్ డ్రైవర్లకు శిక్షణ1978లో డ్రైవింగ్ స్కూల్ తెరవమని ఆమె భర్త ఆమెను ప్రోత్సహించాడట. 2004లో ఆమె భర్త మరణించిన తర్వాత ఇంటిని నడపడానికి ఆమె ఈ పాఠశాల బాధ్యతను చేపట్టింది. వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఇబ్బందులను ఎదుర్కొంది. కానీ ఎక్కడా బెదరలేదు. వెనకడుగు వేయలేదు. కేరళలో మహిళలు భారీ వాహనాలను నడపడమే గగనమైన సమయంలోనే A2Z ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్స్కు సహ-వ్యవస్థాపకురాలిగా, డిఫరెంట్ కరియర్‌ను ఎంచుకోవడంలో మహిళలను బాగా ప్రోత్సహించింది. రాధామణి తన ప్రయాణాన్ని నలభయ్యేళ్లకు పైగా కొనసాగించింది. తన భర్త సూచనమేరకే డ్రైవింగ్‌లోకి అడుగుపెట్టి 1981లో తన ఫోర్-వీలర్ లైసెన్స్‌ను , 1984లో తన హెవీ వెహికల్ లైసెన్స్‌ను పొందింది. డ్రైవింగ్ వృత్తిలో కొనసాగేందుకు ఆమె చేసిన పోరాటం కూడా గొప్పదే. ఈ లైసెన్సులు పొందడానికి పడ్డ కష్టాలు, ఆమె పేరు మీద కేరళలో మొట్టమొదటి హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్‌ను స్థాపించడానికి చట్టపరమైన పోరాటాలు కూడా అవసరమని కూడా ఆమె తన అనుభవాలను గుర్తు చేసుకుంది.ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు 70 ఏళ్ల వయసులో డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందిన మహిళగా రాధామణి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి గుర్తింపు పొందింది. 2022లో ఆమె 'ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్'గా కూడా ఎంపికైంది. డెబ్బైల ప్రారంభంలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేయడం మరో విశేషం. సోషల్ మీడియా అంతా మహిళలు వస్త్రధారణమీద తీవ్ర చర్చ నడుపుతున్న ప్రస్తుత తరుణంలో నైపుణ్యాలకు, వృత్తికి లింగభేదం లేదని రాధామణి నిరూపించారు..నిజంగా ఏదైనా సాధించాలన్న సంకల్పం ఉంటే, అంకితభావం, నమ్మకంతో ప్రయత్నిస్తే కచ్చితంగా సాధించగలరు అంటారు ఆమె. తన దృష్టిలో నేర్చుకోవడం అనేది "ఒక శాశ్వత ప్రయాణం" అని కూడా అంటారు. View this post on Instagram A post shared by The Logical Indian (@thelogicalindian) -
కేరళలో కొత్త ట్రెండ్.. పురుష ప్రయాణికుల అవస్థలు
-
సోషల్ మీడియాలో ఇదేం తొండాట(డబుల్ గేమ్)?!
పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం అనే సామెత ఒకటి ఉంటుంది. కేరళ ఘటనలో తప్పెవరిది అనేది తేలకున్నా.. ఇప్పుడు చాలామంది ఈ సామెతను అన్వయింపజేస్తున్నారు. బస్సులో తనను లైంగికంగా వేధించాడని ఓ ఇన్ఫ్లుయెన్సర్ పోస్టు చేసిన వీడియో.. ఒకరి ప్రాణం పోయేందుకు కారణమైన సంగతి తెలిసిందే కదా.. ఈ ఘటనలో ఏం జరిగిందో మరోసారి చూద్దాం. కోజికోడ్‌కు చెందిన దీపక్(42) బస్సులో వెళ్తున్నప్పుడు ఓ యువతి పక్కనే నిలబడి వీడియో తీసింది. అందులో దీపక్ తనను అసభ్యంగా తాకాడంటూ ఆ వీడియోను తన ఫాలోవర్స్‌కు చేరవేసింది. అంతే.. సదరు వ్యక్తిని తిట్టిపోస్తూ ట్రెండింగ్ నడిచింది. ఈ విషయం తనదాకా చేరడంతో ఆ వ్యక్తి భరించలేకపోయాడు. శుక్రవారం(జనవరి 16) ఈ ఘటన జరిగింది. శనివారం దీపక్ పుట్టినరోజునే ఈ వీడియో వైరల్ కావడంతో మనస్తాపం చెందాడు. ఆదివారం బలన్మరణానికి పాల్పడి ఈ తతంగాన్ని ఇంతటితో ముగిద్దాం అనుకున్నాడు. కానీ, నెటిజన్స్ మాత్రం ఊరుకోలేదు. తిట్టిపోసిన అదే సోషల్ మీడియా ఈసారి ప్రాణాలతోలేని దీపక్‌కు మద్దతు ప్రకటించింది. సదరు యువతి ఫాలోయింగ్‌ను పెంచుకోవాలనే అలా చేసి ఉంటుందా?... పాపులారిటీ కోసం పాకులాడిందా? అనే అనుమానాలతో చర్చ మొదలుపెట్టారు. అయితే దీపక్ ఫ్యామిలీ ఈ డబుల్ గేమ్ సపోర్టును తిరస్కరించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంటర్నెట్లో అలా ఎలా విచారణ జరుపుతారని.. తమ బిడ్డది తప్పని తేలుస్తారని దీపక్ తల్లి అంటోంది. ఆ యువతి కంటే నెటిజన్లే డేంజర్ అని అంటోంది. షిమ్జితా ముస్తాఫా.. యాక్టివిస్ట్‌గానూ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గానూ గుర్తింపు దక్కించుకుంది. దీపక్ వేధింపుల వీడియోను పోస్ట్ చేశాక.. ఆమెకు అభినందనలు కురిశాయి. అయితే.. దీపక్ మరణం తర్వాత ఆమె ట్రోలింగ్‌కు గురైంది. పలువురు నెటిజన్లు ఆమెను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఆమె ఆ వీడియోను తొలగించింది. తన చర్యను సమర్థించుకుంటూ మరో వీడియోను పోస్ట్ చేసింది(దానికి కామెంట్లు చేయకుండా ప్రైవసీ పెట్టుకుంది). పైగా ఈ విషయంలో తనకు పోలీసుల సపోర్ట్ లభించిందని చెప్పుకొచ్చింది. కానీ.. మగ ప్యాసింజర్లకు, మగ కండక్టర్లకు ఇవి తప్పవా?మూడు రోజుల క్రితం చేయని తప్పుకు తన మీద వీడియో తీసి తనను అవమానించినందుకు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నేపథ్యంగా, కేరళ బస్సుల్లో మగవారు అట్టపెట్టెలను అడ్డం పెట్టుకుని బస్సులో వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. pic.twitter.com/AXUEYp5Dfc— greatandhra (@greatandhranews) January 20, 2026కేరళ పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. షిమ్జితా నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని క్లారిటీ ఇచ్చారు. పైగా ఆత్మహత్యకు ఉసిగొల్పిందంటూ దీపక్ కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుతో షిమ్జితాపైనే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది. ఆమె కోసం స్పెషల్ టీంలు గాలింపు జరుపుతున్నాయి. ఆమె దొరికితేనే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోవచ్చని పోలీసులు అంటున్నారు. మరోవైపు.. నెటిజన్ల దెబ్బకు ఆమె సోషల్ మీడియా అకౌంట్లు కూడా డిలీట్ చేసేసుకుందని తెలుస్తోంది. ఆన్లైన్ వేధింపులు ఎంతటి విషాదాలకు దారి తీస్తుందో ఈ ఘటన ఉదాహరణగా నిలిచిందని అంటున్నారు. కేరళ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. కొందరు పురుషులు (వయసు తారతమ్యం లేకుండా పెద్దవాళ్లతో సహా..) బస్సుల్లో ఎక్కి ఆడవాళ్ల మధ్యలో నిల్చుని తమను అనుమానించొద్దు అంటూ సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. -
టాటా సియెర్రా కారు కొన్న మంత్రి
టాటా సియెర్రా ఎస్యూవీ డెలివరీలు జనవరి 15 నుంచి అధికారికంగా ప్రారంభమయ్యాయి. NATRAX పరీక్షా కేంద్రంలో తన సామర్థ్యాలను ప్రదర్శించిన అనంతరం ఈ ఎస్యూవీ కేరళకు చేరుకుంది. రాష్ట్ర రవాణా మంత్రి కె.బి. గణేష్ కుమార్ కేరళలో తొలి యూనిట్‌ను స్వీకరించిన మొదటి గ్రహీతగా నిలిచారు.కేరళ రవాణా మంత్రి కె.బి. గణేష్ కుమార్ రాష్ట్రంలోని ప్రముఖ టాటా డీలర్‌షిప్‌లలో ఒకటైన శ్రీ గోకులం మోటార్స్ నుంచి సియెర్రా కారును డెలివరీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది. సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉన్నప్పటికీ.. టాటా డిజైన్ లాంగ్వేజ్‌కు ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్‌తో 12-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు.వాహనం అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది 4.6 మీటర్ల వీల్ బేస్ తో 2.7 మీటర్ల వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా ఆరు ఎక్స్టీరియర్, మూడు ఇంటీరియర్ కలర్ స్కీమ్‌లలో వస్తోంది.ఈ కొత్త తరం టాటా సియెర్రాలో సరికొత్త 1.5-లీటర్ జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 158 బీహెచ్పీ శక్తి, 255 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఆరు-స్పీడ్ ఏటీ గేర్బాక్సతో మాత్రమే వస్తుంది. ఇక సియెర్రా 1.5-లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ 105 బీహెచ్పీ శక్తి, 145 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే డీజిల్ 1.5-లీటర్ ఇంజన్ 116 బీహెచ్పీ శక్తి, 260 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ ఎంటీ లేదా ఏడు-స్పీడ్ డీసీటీతో లభిస్తుంది. View this post on Instagram A post shared by Sree Gokulam Motors & Services (@gokulammotors) -
ఇవాల్టితో శబరిమల దర్శనం ముగియనుంది..!
శబరిమలలోని భక్తుల దర్శనం ఈరోజు రాత్రి 10 గంటలకు ముగుయనుంది. భక్తులను పంప నుంచి సాయంత్రం 5 గంటల వరకే బయలుదేరడానికి అనుమతిస్తారు. ఉదయం కొద్ది మొత్తంలో డబ్బుతో అభిషేకం జరుగుతుంది. నెయ్యాభిషేకం నిన్న ముగిసింది. హరివరాసనం మంత్రోచ్ఛారణతో నాదం ముగిసిన తర్వాత, రాజ ప్రతినిధి సమక్షంలో గురుతి మణిమండపం ముందు ప్రారంభమవుతుంది.రేపు (జనవరి 20), రాజ ప్రతినిధికి మాత్రమే దర్శనం ఉంటుంది. గణపతి హోమం తర్వాత, తిరువాభరణం తిరుగు ప్రయాణం పండలం శ్రాంపిక్కల్ ప్యాలెస్‌కు బయలుదేరుతుంది. రాజ ప్రతినిధి దర్శనం తర్వాత, ప్రధాన పూజారి అయ్యప్ప విగ్రహానికి విభూతి అభిషేకం చేసి, ఆలయాన్ని మూసివేయడానికి హరివరాసనం పఠిస్తారు. ప్రధాన పూజారి ఆలయ తాళం చెవులను రాజప్రతినిధికి అప్పగిస్తారు. ఇది కూడా ఒక పద్ధతిలో నియమానుసారంగా జరుగుతుంది. 18వ మెట్టు దిగిన తర్వాత ప్రధాని పూజారి దేవస్వం బోర్డు ప్రతినిధులు, శబరిమల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు తాళలను అప్పగిస్తారు. నెలవారి పూజ ఖర్చులు చెల్లించిన తర్వాత అతను పండలం ప్యాలెస్‌కు తిరిగి వస్తాడు.ఇదిలా ఉండగా, శబరిమల దర్శనం కోసం స్పాట్ బుకింగ్ కౌంటర్లు నేటి వరకు పనిచేస్తాయి, అప్పటి వరకు అయ్యప్ప భక్తులను దర్శనం చేసుకోవడానికి అనుమతిస్తారు. పంప, నీలక్కల్, ఎరుమేలిలలో స్పాట్ బుకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. జనవరి 19 వరకు వర్చువల్ క్యూ బుకింగ్ అందుబాటులో ఉంటుంది. జనవరి 19న, వర్చువల్ క్యూ ద్వారా 30 వేల మందిని, స్పాట్ బుకింగ్ ద్వారా 5 వేల మంది భక్తులను అనుమతించినట్లు సమాచారం. ఇవాళ మలికప్పురం గురుతిఇవాళ, మలికప్పురం మణిమండపం ముందు శబరిమల యాత్ర ముగుస్తుంది. సన్నిధానం నాదం హరివరాసనం పారాయణంతో ముగిసిన తర్వాత, పండలం రాజప్రతినిధి సమక్షంలో వేడుక జరుగుతుంది. సాయంత్రం గురుతికి సన్నాహాలు ప్రారంభమవుతాయి. మణిమండపం ముందు వాఝపూల, కురుత్తోల ఉపయోగించి ఐదు 64 నేత్రాల కలాలు తయారు చేస్తారు. మధ్యలో ఒక లాంతరు వెలిగిస్తారు. తర్వాత దీపాలు, పూల దండలతో అలంకరిస్తారు.ఈ గురుతి తంతు కూడా ఒకేసారి మలికప్పురం కన్నిమూల ప్రాంతంలో, కోచుకదత్త ముందు, మలికప్పురం గోపురం తూర్పున జరుగుతుంది. మలికప్పురంలోని రాజప్రతినిధి సాయంత్రం సన్నిధానానికి తిరిగి వస్తారు. అక్కడ హరివరాసనం పూర్తి అయ్యి.. రాజప్రతినిధి తిరిగి వచ్చాక ఈ వేడుక ప్రారంభమవుతుంది. అయితే భక్తులు గురుతి మొదటి వేడుకను మాత్రమే చూడగలరు. గురుతికి ముందు, మలికప్పురం మేల్శాంతి కూడా సన్నిధానానికి తిరిగి వస్తారు.మలికప్పురం గురుతి (Malikappuram Guruthi) అంటే శబరిమల అయ్యప్ప దేవాలయం దగ్గర ఉన్న మలికప్పురం దేవతకు నిర్వహించే ఒక ముఖ్యమైన, వార్షిక పూజా కార్యక్రమం. అయ్యప్ప ఆలయానికి మలికప్పురం దేవత (మాలిక్కపురత్తమ్మ) ఉంటుంది. ఇక్కడ గురుతి పూజ అనేది తీర్థయాత్ర ముగింపులో నిర్వహించే సంప్రదాయ ఆచారం. దీనిలో భాగంగా కొండ దేవతల ఆశీస్సుల కోసం ప్రార్థనలు చేస్తారు. ఈ ఘట్టాన్ని.. అయ్యప్పను సందర్శిన అనంతరం చాలా శుభప్రదంగా భావిస్తారు అయ్యప్ప భక్తులు. (చదవండి: రేపటితో శబరిమల ఆలయం మూసివేత.. ఆదాయం ఎంతంటే?) -
2017 మణిమండపం పునర్నిర్మాణంలో ఉన్నికృష్ణన్ పొట్టి పాత్ర ఉందా?
పతనంతిట్ట: శబరిమల బంగారం దొంగతనం కేసులో అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టి, గతంలో శబరిమల ఆలయంలో స్పాన్సర్‌గా వ్యవహరించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. అడ్వకేట్ కమిషనర్ హైకోర్టుకు సమర్పించిన పత్రాలలో ఈ వివరాలు బయటపడ్డాయి.ద్వారపాలక ఫలకాలను ఏర్పాటు చేయడానికి ముందు, పొట్టి మాలమండపం (ప్రస్తుతం మణిమండపం) నిర్మాణానికి స్పాన్సర్‌గా ఉన్నారని నివేదికలో తేటతెల్లమైంది. 2017లో మణిమండపంలోని స్తంభాలు, గంటలు పునర్నిర్మించబడ్డాయి. పవిత్రమైన పతినేట్టం పడి (పద్దెనిమిది మెట్లు) సమీపంలోని రెండు స్తంభాలు, గంటల పునరుద్ధరణలో ఆయన సహకారం అందించినట్లు సమాచారం.ఉల్లాటన్ యోధునితో సంబంధం ఉన్న ఈ మండపం అసలు పేరు ‘మాల’ కాగా, మొదట మాలమండపం అని పిలిచేవారు. తరువాత దీనిని మణిమండపం అని పిలవడం ప్రారంభమైంది. ఈ ఏర్పాటుకు స్పాన్సర్ కోఆర్డినేటర్‌గా పరుమల అంతన్ ఆచారి వ్యవహరించారు. నివేదిక ప్రకారం, పొట్టి తన సొంత డబ్బు ఖర్చు చేయలేదు. తమిళనాడుకు చెందిన వ్యాపారులు ఈ నిధులను అందించారని, స్పాన్సర్షిప్ కోసం అడ్వకేట్ కమిషనర్‌కు ఇమెయిల్ పంపినట్లు పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, శ్రీ అయ్యప్ప తిడంబులో చేసిన మార్పులపై భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భారత జనాభా లెక్కల్లో ఇది పురాతన తిడంబుగా పరిగణించబడుతున్నప్పటికీ, ప్రస్తుతం కనిపిస్తున్నది కొత్తగా ఉందని వారు ప్రశ్నిస్తున్నారు. దేవస్వం అధికారులకు ఈ మార్పుల గురించి సమాచారం ఉందా అనే అంశంపై భక్తులు సమాధానాలు కోరుతున్నారు. -
మరోసారి బర్డ్‌ఫ్లూ కలకలం..
కన్నూర్: కేరళలో మరోసారి బర్డ్‌ఫ్లూ కలకలం రేపుతోంది. కన్నూర్ జిల్లా ఇరిట్టిలోని ఎడక్కనడం ప్రాంతంలో కాకుల్లో హెచ్5ఎన్1 లక్షణాలు గుర్తించారు. కన్నూర్ రీజినల్ డయాగ్నస్టిక్ లాబొరేటరీ హెచ్5ఎన్1 లక్షణాలు ధృవీకరించింది. అయితే, ఇప్పటివరకు పెంపుడు పక్షులలో (కోళ్లు, బాతులు) ఎటువంటి కేసులు నమోదు కాలేదని, ప్రస్తుత దశలో పక్షులను చంపాల్సిన అవసరం లేదని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. హెచ్5ఎన్1 గుర్తింపు నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అరుణ్ కే. విజయన్ ఆ ప్రాంతంలో ముందస్తు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.ఇరిట్టి మున్సిపాలిటీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా వైద్యాధికారి, స్థానిక అధికారులను ఆదేశించారు. కేవలం ఒక కాకిలో మాత్రమే ఈ ఇన్ఫెక్షన్ గుర్తించినందున, ఎటువంటి ఔట్‌బ్రేక్, సర్వైలెన్స్ జోన్ ప్రకటించలేదని, అలాగే పక్షులను చంపాల్సిన అవసరం లేదని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.ఒకవేళ పక్షుల కళేబరాలు కనిపిస్తే, భద్రతా నిబంధనలను పాటిస్తూ మున్సిపల్ ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో కాల్షియం కార్బోనేట్‌ను ఉపయోగించి వాటిని తగిన లోతులో పూడ్చిపెడతారని పేర్కొంది. ఈ పారిశుధ్య ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది తప్పనిసరిగా గ్లోవ్స్, మాస్క్‌లు మరియు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ధరించాలని సూచించారు. ఆ ప్రాంతంలోని ప్రజల్లో ఎవరికైనా కారణం తెలియని జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉంటే, ఆ కేసులను నిశితంగా గమనించి నివేదించాలని ఆరోగ్య శాఖను కలెక్టర్ ఆదేశించారు. -
వ్యక్తి ప్రాణం తీసిన.. యువతి పోస్ట్
కేరళలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. తన తప్పు లేకపోయినా ఓ మహిళ తనను తీవ్రంగా అవమానించిందనే బాధతో ఓ యువకుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తనను దూషిస్తూ వీడియో చేసి సామాజిక మాద్యమాలలో పోస్ట్ చేసి తన పరువు తీసిందనే మనస్థాపంతో తనువు చాలించాడు.గోవిందపురంకు చెందిన దీపక్ అనే యువకుడు కోజికోడ్‌లో ఓ వస్త్రాల దుకాణంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తన వ్యక్తిగత పనిమీద కన్నూర్ వెళ్లడానికి బస్సుఎక్కాడు. ఆసమయంలో బస్సులో ఉన్న ఓయువతి తనను దీపక్ అసభ్యంగా తాకాడని ఆరోపిస్తూ వీడియో చేసింది. అది కాస్త ఇన్‌స్టాలో వైరలయ్యింది.దీంతో దీపక్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అనంతరం తీవ్ర అవమాన భారంతో ఆదివారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందులో తన తప్పేం లేదని శనివారం తన స్నేహితులతోనూ మాట్లాడినట్లు వారు పేర్కొన్నారు. దీపక్ చాలా మంచి వాడని అతని స్నేహితులు తెలిపారు. ఏడు సంవత్సరాలుగా తన వద్ద పనిచేస్తున్నాడని ఇప్పటివరకూ అతని గురించి ఒక్క చెడుమాట కూడా వినలేదని అతని పనిచేస్తున్న షాపు యజమాని పేర్కొన్నారు. అయితే ఈ ఘటన గురించి ఆ మహిళను సంప్రదించారు. బస్సులో తనతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు తన ఉద్దేశం ఏంటని ప్రశ్నించానని ఆమె తెలిపింది. వీడియో చిత్రీకరించిన సమయంలోనే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడుతుందని తెలిపానని అయితే అతను ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని ఆమహిళ పేర్కొంది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై మరింత లోతైన విచారణ చేయనున్నట్లు తెలిపారు. -
రేపటితో శబరిమల ఆలయం మూసివేత.. ఆదాయం ఎంతంటే?
తిరువనంతపురం: కేరళలోని శబరిమలలో రేపటి(సోమవారం)తో ఆలయంలోకి దర్శనాలు ముగుస్తున్నాయి. మకరవిళక్కు ఉత్సవం ముగింపు దశకు చేరడంతో రేపు రాత్రి 10 గంటల తర్వాత భక్తులను ఆలయంలోకి అనుమతించరు. రాత్రి సారంకుతికి ఊరేగింపు ఉంటుంది. ఈ సంవత్సరం మకరవిళక్కు యాత్ర సాయంత్రం పూజ తర్వాత గురుతితో ముగుస్తుంది.శబరిమల శ్రీ ధర్మశాస్తా సన్నిధానం రేపు (సోమవారం) వరకు భక్తుల దర్శనం కోసం తెరిచి ఉంటుంది. రాత్రి 10 గంటలకు జరగనున్న అథాళ పూజ వరకు యాత్రికులకు ప్రార్థనలు చేయడానికి అనుమతి ఉంటుంది. సాయంత్రం 6 గంటలలోపు పంబ చేరుకున్న యాత్రికులను దర్శనం కోసం సన్నిధానం వద్దకు వెళ్లడానికి అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. ఆలయాన్ని పవిత్ర ఆభరణాలతో (తిరువాభరణం) అలంకరించిన తర్వాత ప్రత్యేక దర్శనం నిన్న పూర్తయింది. పందలం కుటుంబ ప్రతినిధి పునర్థం నల్ నారాయణన్ వర్మ హాజరైన ఉచ్చ పూజ సందర్భంగా తిరువాభరణాన్ని అలంకరించారు. సాయంత్రం దీపారాధన కూడా తిరువాభరణంతో జరిగింది.ఈ పుణ్యకాలం నాటి నెయ్యాభిషేక ఆచారం ఈరోజుతో ముగుస్తుంది. నెయ్యభిషేకం ఉదయం 10 గంటల వరకు మాత్రమే జరుగుతుంది. ఆ తర్వాత, పండళం కుటుంబ ప్రతినిధి సమక్షంలో జరిగే కలభాభిషేకానికి సన్నాహకంగా గర్భగుడి మరియు ఆలయ ప్రాంగణాన్ని కడిగి శుభ్రం చేస్తారు. తంత్రి కందరారు మహేష్ మోహనరు నేతృత్వంలో కలభ పూజ, తరువాత కలభాభిషేకం జరుగుతుంది.నిన్న సాయంత్రం దీపారాధన తర్వాత , పవిత్ర పడి పూజ జరిగింది. పర్వతారోహణ పూర్తి చేసిన యాత్రికులు సాయంత్రం 5 గంటల నుండి దిగువ ఆలయ ప్రాంగణంలో ఈ ఆచారాన్ని చూడటానికి వేచి ఉన్నారు. సాయంత్రం 6.30 గంటలకు ప్రాంగణం పూర్తిగా రద్దీగా మారింది. పడి పూజ తర్వాత పవిత్ర పద్దెనిమిది మెట్లను ఎక్కడానికి భారీ రద్దీ ఏర్పడింది. వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా 30,000 మంది యాత్రికులకు మరియు స్పాట్ బుకింగ్ ద్వారా 5,000 మంది యాత్రికులకు దర్శన అనుమతి మంజూరు చేయబడింది. అయితే , దర్శనం కోసం ఆలయానికి భక్తులు గణనీయంగా పెద్ద సంఖ్యలో రావడంతో రద్దీ పెరిగింది.రికార్డు ఆదాయం..ఇక, ఈ ఏడాది శబరిమలకు రికార్డు సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 52 లక్షల మంది అయ్యప్ప భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్టు తెలిసింది. అలాగే, 2026లో శబరిమల యాత్ర చరిత్రలోనే అత్యధికంగా రూ.435 కోట్లు ఆదాయం వచ్చింది. గతేడాది కంటే ఈ సంవత్సరం ఆలయం ఆదాయం దాదాపు 70-80 కోట్ల వరకు పెరిగినట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. మకర సంక్రాంతి సందర్భంగా జ్యోతి దర్శనం కోసం భారీగా భక్తులు తరలి వచ్చిన విషయం తెలిసిందే. జ్యోతి దర్శనంతో వేలాది మంది భక్తులు పులకించిపోయారు. హరిహర సుతుడైన స్వామి అయ్యప్పను స్మరిస్తూ స్వామియే శరణం అయ్యప్ప అన్న శరణుఘోషలతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతకుముందు పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతి నిచ్చారు. ఆ వెంటనే క్షణాల్లో చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమైంది. -
నటి శారదకు అత్యున్నత పురస్కారం
అభినేత్రి శారద పేరు తెలుగు పరిశ్రమలో ఎప్పటికీ చెరిగిపోని పేరు. ఆమె ఒక నట గ్రంథాలయం. ఆరు పదుల సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన పాత్రలకు జీవం పోశారు. ‘కల్యాశుల్కం’ చిత్రంతో వెండితెరకు పరిచమైన శారద.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించి ఎనలేని అభిమానులను సంపాదించుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని మన పెద్దలు చెబుతారు. అయితే, శారద మాత్రం ముందు రచ్చ గెలిచి ఆ తరువాతే ఇంట గెలిచారు. శారద తెలుగు నటే కానీ, మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ రేంజ్‌కు చేరుకున్నారు. జాతీయ స్థాయి ఉత్తమ నటిగా పేరుపొందిన ఆమెకు పుట్టిల్లయిన తెలుగు చిత్ర పరిశ్రమ తన ప్రతిభకు పట్టాభిషేకం చేసింది. 'జేసీ డానియల్ అవార్డు - 2024'కు శారద ఎంపిక తాజాగా కేరళ ప్రభుత్వం శారదను గౌరవించనుంది. మలయాళ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలకు గుర్తుగా కేరళ ప్రభుత్వం అందించే అత్యున్నత సినిమా పురస్కారం 'జేసీ డానియల్ అవార్డు - 2024'కు ఆమె ఎంపికయ్యారు. జనవరి 25న తిరువనంతపురంలో కేరళ రాష్ట్ర చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని శారద అందుకుంటారు.ఈ వార్త తెలిసిన వెంటనే శారద స్పందించారు. ఈ అవార్డ్‌కు తనను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తనపై మలయాళ చిత్రసీమతో పాటు అక్కడి ప్రేక్షకులు చూపిన ప్రేమను తన ఆఖరి శ్వాస వరకు మర్చిపోనని ఆమె అన్నారు. మలయాశ ప్రేక్షకులు లేకపోతే తన కెరీర్ లేదని పేర్కొన్నారు. తన సినీ కెరీర్ ఆరంభంలో తెలుగులో కొన్ని చిత్రాల్లో కామెడీ వేషాలు మాత్రమే దక్కాయని, ఆ పాత్రలు కూడా ఈ అమ్మాయికి సరిగా చేయడం లేదని చాలామంది మేకర్స్ అన్నారని గుర్తుచేసుకున్నారు. సినిమా ఛాన్స్‌లు లేని సమయంలో మలయాళంలో ‘శాకుంతల’ అనే సినిమా తనకు ఊపరిపోసిందన్నారు. అలా జాతీయ అవార్డ్ అందుకునే రేంజ్‌కు మలయాళ పరిశ్రమ తనను తీసుకెళ్లిందని ఆమె అన్నారు. మలయాళ ప్రముఖ దర్శక నిర్మాత కుంజాకో తన ప్రతిభను గుర్తించారని ఆయన్ను ఎప్పటికీ మరిచిపోలేనని శారద తెలిపారు. తెలుగులో అమ్మ రాజీనామా, మేజర్ చంద్రకాంత్, దాన వీర శూర కర్ణ, తెనాలి రామకృష్ణ, స్వయంవరం ,నిమజ్జనం , జస్టిస్ చౌదరి, సర్దార్ పాపారాయుడు, స్టాలిన్, యోగి వంటి ఎన్నో మంచి పాత్రలు చేసిన సినిమాలు ఉన్నాయి. -
గడ్డకట్టిన సరస్సులో : గుండెలు పగిలే విషాదం వీడియో వైరల్
అరుణాచల్ ప్రదేశ్‌లో పండగ వేళ విషాదం చోటు చేసుకుంది. తవాంగ్ జిల్లాలోని సేలా గడ్డకట్టిన సరస్సులోజారిపడి కేరళకు చెందిన ఇద్దరు పర్యాటకులు మునిగిపోయారు. గౌహతి మీదుగా తవాంగ్‌కు వచ్చిన ఏడుగురు మిత్ర బృందంలో మహాదేవ్ సరస్సులో దిగి ఇద్దరు ప్రాణాలుకోల్పోవడంతో అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు.పోలీసుల సమాచారం ప్రకారం, శుక్రవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలో గడ్డకట్టిన సెలా సరస్సులో కేరళకు చెందిన ఇద్దరు పర్యాటకులు జారిపడిమరణించారు. ఒకరి మృతదేహం లభించింది, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది. గడ్డకట్టిన సరస్సులో మహాదేవ్ (24) జారిపడి మునిగిపోతూ ఉండటాన్ని గమనించిన స్నేహితుడు దీను, మరొకరు మహాదేవ్ సరస్సులోకి దిగాడు. మూడో పర్యాటకుడు సురక్షితంగా బయటకు రాగలిగినప్పటికీ, మిగిలిన ఇద్దరూ కొట్టుకుపోయారు. బాధితుడు దీను (26)గా ఆచూకీ ఇంకా లభించలేదని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి.డబ్ల్యూ.థోంగాన్ తెలిపారు. రెండో పర్యాటకుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.Heartbreaking tragedy 💔Frozen lakes can be highly deceptive and extremely dangerous.Two Kerala tourists drowned after slipping into frozen Sela Lake in Arunachal Pradesh’s Tawang district. One body recovered, search continues.pic.twitter.com/N16EeuFCYw— Manas Muduli (@manas_muduli) January 17, 2026 ఈ సంఘటనతో పర్యాటకులు గడ్డకట్టిన సరస్సులపై జాగ్రత్త వహించాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. గడ్డకట్టిన సరస్సులపై నడవవద్దని సందర్శకులకు స్పష్టంగా సూచిస్తూ సేలా సరస్సు, ఇతర పర్యాటక ప్రదేశాలలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. గడ్డకట్టిన సరస్సులు, లేక్‌లు సురక్షితం కాదని, మంచు అస్థిరంగా ఉండవచ్చని , మానవ బరువును మోయలేకపోవచ్చని పర్యాటకులను హెచ్చరిస్తూ జిల్లా యంత్రాంగం డిసెంబర్లో ఒక సలహా జారీ చేసిందని ఆయన తెలిపారు.సేలా సరస్సు ప్రాముఖ్యతసముద్ర మట్టానికి 13,700 అడుగుల ఎత్తులో ఉండే సేలా ఒక అందమైన, పవిత్రమైన సరస్సు ఇది శీతాకాలంలో మంచుతో గడ్డకట్టుకుపోయి అద్భుతమైన దృశ్యాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కటి ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఈ సీజన్లో పర్యాటకులు అక్కడికి క్యూకడతారు. కానీ తీవ్రమైన చలి , మంచు పొర కారణంగా శీతాకాలంలో ఇది తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుంది. 1962 లో భారత చైనా యుద్ధం సందర్భంలో, అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన నూరనాంగ్ యుద్ధంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికుడు, 72 గంటలు ఆకలిదప్పులతో ఉండి,300 మంది చైనీయులను మట్టుబెట్టి వీర మరణం పొందిన జస్వంత్ సింగ్ రావత్‌కు సహాయం చేస్తూ మరణించిన ‘‘సెలా" అనే మహిళ పేరును దీనికి పెట్టినట్టు చెబుతారు. -
ప్రధాని కార్యక్రమానికి వేదిక ఇచ్చేదే లేదు: తేల్చిచెప్పిన కేరళ సర్కారు?
తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే ఓ కార్యక్రమానికి వేదికను ఇచ్చేదే లేదని కేరళలోని పినరయి విజయన్ సర్కారు తేల్చిచెప్పింది. ఈ నెల 23న ప్రధాని మోదీ పలు రైల్వే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి తిరువనంతపురం రానున్నారు. దీంతో.. ఆయన కోసం ఓ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ భావించింది. ఈ క్రమంలో తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియం అనువైనదిగా భావించింది. ఆ మేరకు కేరళ సర్కారుకు ఓ లేఖ రాసింది.రైల్వే శాఖ అభ్యర్థనను రాష్ట్ర ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించింది. గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో ఆ స్టేడియాన్ని ప్రధాని కార్యక్రమానికి ఇచ్చేదేలేదని స్పష్టం చేసింది. ‘‘అదేంటి? గణతంత్ర వేడుకలకు మూడ్రోజుల సమయం ఉంటుంది కదా?’’ అని రైల్వే అధికారులు ప్రశ్నించగా.. రిహార్సల్స్ ఉంటాయని పేర్కొంది. దాంతో చేసేది లేక.. రైల్వే అధికారులు వెనుదిరిగారు. కేరళ సర్కారు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు.. పుతారికండం మైదానంలో ప్రధాని సభను ఏర్పాటు చేస్తామని వివరించారు. అటు రైల్వే అధికారులు కూడా ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టారు. గ్రీన్‌ఫీల్డ్ స్టేడియాన్ని పరిశీలించినా.. అక్కడ క్రికెట్ మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యి ఉండడంతో బీజేపీ సూచించిన పుతారిఖండం మైదానానికి ఓకే చెప్పారు. నిజానికి సెంట్రల్ స్టేడియం అయితే.. ఎస్పీజీ భద్రత అనుమతులు సులభమవుతాయి. మిగతా ప్రాంతాల్లో ప్రధాని కార్యక్రమాన్ని నిర్వహిస్తే.. కాస్త ఇబ్బందికర పరిణామాలుంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
మకరవిళక్కు మహోత్సవం: నాయట్టు పిలుపు అంటే..
మకరవిళక్కు మహోత్సవం సందర్భంగా శబరిమలలో ప్రాచీన వామ్మోళి సంప్రదాయాలతో నాయట్టు పిలుపు నిర్వహించబడుతోంది. మకరవిళక్కు దినం నుంచి వరుసగా ఐదు రోజుల పాటు నాయట్టు పిలుపు జరుగుతుంది.పద్దెనిమిదవ మెట్టుకి దిగువనున్న నిలపాట్తర నుంచి దక్షిణ దిశగా చూస్తూ నాయట్టు పిలుపు నిర్వహిస్తారు. చివరి రోజు ఈ కార్యక్రమం శరంకుట్టిలో జరుగుతుంది.అయ్యప్ప స్వామికి కాపలాదారులైన భూతగణాలు మరియు మలదేవతలు మకరవిళక్కు మహోత్సవ సమయంలో శబరిమల నుంచి అడవుల్లోకి వెళ్తారని విశ్వాసం. వారిని అయ్యప్ప స్వామి స్వయంగా పిలిచి తిరిగి శబరిమలకి తీసుకొస్తాడని నమ్మకం ఉంది. అందుకోసమే నాయట్టు పిలుపు బృందం శరంకుట్టికి వెళ్తుంది.పద్యరూపంలో చక్కగా రూపొందించిన అయ్యప్ప చరిత్ర , ఇతిహాసాలను ద్రావిడ మలయాళ భాషలో తరతరాలుగా వామ్మోళి సంప్రదాయంగా అందిస్తూ వస్తున్న ఆచారమే నాయట్టు పిలుపు.అయ్యప్ప స్వామి ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని మొత్తం 576 శీలాలు నాయట్టు పిలుపులో భాగంగా ఉంటాయి. శబరిమల దేవాలయ ప్రారంభ కాలం నుంచే కొనసాగుతున్న ఈ ఆచారంలో , నాయట్టు పిలుపు చెప్పే వ్యక్తి ప్రతి శీలం ముగించిన వెంటనే, అతనితో పాటు ఉన్నవారు “ఈ హూయి” అని ఘోషిస్తారు.భగవాన్ అయ్యప్ప యొక్క మకరమాస మహోత్సవం జరుగుతోందని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తెలియజేయడానికే “ఈ హూయి” అనే పిలుపు. పద్దెనిమిదవ మెట్టుకి దిగువన ఉన్న అయ్యప్ప స్వామి, పైభాగంలోని శ్రీ ధర్మశాస్తా ను దర్శించుకునే సందర్భం కూడా ఇదే నాయట్టు పిలుపుగా భావిస్తారు.నాయట్టు పిలుపు బృందంలో నాయట్టు పిలుపు కురుప్పు సహా మొత్తం 12 మంది ఉంటారు. రాన్నీ – పెరునాడ్ ప్రాంతానికి చెందిన వెల్లాళ కులానికి చెందిన పున్నమూటిల్ కుటుంబానికి నాయట్టు పిలుపు చేసే వారసత్వ హక్కును పందళం రాజు అప్పగించినట్లు చెబుతారు. ప్రస్తుతం పున్నమూటిల్ పి.జి. మహేష్ నాయట్టు పిలుపులో శీలాలను ఉచ్ఛరిస్తున్నారు.(చదవండి: అయ్యప్ప స్వామి దివ్య ఆభరణాల పవిత్ర యాత్ర) -
నేడు శబరిమలలో పడిపూజ ప్రారంభం
శబరిమల మకరవిళక్కు తీర్థయాత్ర కాలంలో నిర్వహించే అత్యంత విశిష్టమైన పడిపూజ నేడు (జనవరి 16) ప్రారంభం కానుంది. కఠినమైన వ్రత నియమాలను పాటిస్తూ , ఇరుముడి ధరించిన భక్తులు పాదాలు మోపే ఆ పవిత్రమైన పద్దెనిమిది మెట్లను (పతినెట్టాంపడి) పూలతోనూ , పట్టు వస్త్రాలతోనూ , దివ్యమైన దీపాలతోనూ అలంకరించి ఈ పూజను నిర్వహిస్తారు.పూజా విశేషాలునేటి సాయంత్రం దీపారాధన అనంతరం 6:45 గంటలకు పడిపూజ ప్రారంభమవుతుంది. ప్రధాన తంత్రి కంఠరారు మహేష్ మోహనరు , మేల్శాంతి ఇ.డి. ప్రసాద్ నంబూతిరిల నేతృత్వంలో సుమారు ఒక గంట పాటు ఈ క్రతువు కొనసాగుతుంది. పడిపూజ జరుగుతున్న సమయంలో భక్తులకు మెట్ల ద్వారా ప్రవేశం ఉండదు.పద్దెనిమిది మెట్లలోని ప్రతి మెట్టులోనూ దైవిక చైతన్యం కొలువై ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శబరిమల సహా పద్దెనిమిది కొండలకు ఈ మెట్లు ప్రతిరూపాలని భావిస్తారు. దీప కాంతులతో ధగధగలాడుతూ , పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పద్దెనిమిది మెట్ల ఆ అపూర్వ దృశ్యం భక్తులకు కనువిందు చేయడమే కాక , మనసుకి ఎనలేని ఆధ్యాత్మిక తృప్తిని ప్రసాదిస్తుంది.ఇది కూడా చదవండి: Mumbai: మేయర్ పీఠం ఎవరిది?.. కాసేపట్లో ఉత్కంఠకు తెర! -
శబరిమలలో మకరజ్యోతి దర్శనం
తిరువనంతపురం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నాంబల మేడుపై మకరజ్యోతి దర్శనమిచ్చింది. మకరజ్యోతి దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. దాంతో శబరిమల స్వామియే శరణం అయ్యప్ప శరణుఘోషతో మార్మోగిపోయింది. శబరిమలలో ప్రతి ఏడాది దర్శనమిచ్చే మకరజ్యోతికి ప్రత్యేకత ఉంది. ప్రతి ఏడాది సంక్రాంతి వేళ శబరిమల కొండలకు ఎదురుగా ఉన్న పొన్నాంబలమేడుపై మకరజ్యోతి దర్శనమివ్వనుంది. ఈ ఏడాది జనవరి 14న మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. ఈరోజు సాయంత్రం 6:30 నుంచి 6:45 గంటల మధ్య మకరజ్యోతి కనిపించింది.అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు పొందడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మకరజ్యోతిని ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది అయ్యప్ప భక్తులు శబరిమలలో చూసి చివరకు మకరజ్యోతిని దర్శించుకున్నారు. మరొకవైపు కోట్లాది మంది భక్తులు వివిధ మాధ్యమాల ద్వారా పరోక్షంగా వీక్షించారు. #makarajyothy #MakaraSankranti pic.twitter.com/cAiW4lec1n— Lokesh journo (@Lokeshpaila) January 14, 2021 -
ఆ రాష్ట్రంలో బంగారు నిక్షేపాలు.. తవ్వాలంటే..
ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరినీ ఆకర్షించే స్వర్ణ లోహం ఘనత వెనుక కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. భూమిపై అత్యంత విలువైనదిగా భావించే ఈ లోహం కేవలం ఆభరణాలకే పరిమితం కాలేదు. ఇదొక అద్భుతమైన రసాయన మూలకంగా గుర్తింపు పొందింది. దీని మెరుపును చూసిన ప్రాచీన గ్రీకులు ‘షైనింగ్ డాన్ (ప్రకాశించే ఉషోదయం) అని అభివర్ణించారు. అలాంటి బంగారం ఇప్పుడు కేరళ భూముల్లో నిక్షిప్తం కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.భూమిలో ఆవిర్భావం..భూమి ఆదిలో ద్రవ రూపంలో ఉన్నప్పుడు, దానిలోని గురుత్వాకర్షణ శక్తి వల్ల బంగారం వంటి బరువైన లోహాలన్నీ కేంద్ర భాగం (Core) వైపు వెళ్లిపోయాయి. తదుపరి కాలంలో అంతరిక్షం నుంచి పడిన ఉల్కాపాతం వల్లే భూమి ఉపరితలంపై బంగారం చేరిందని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. అందుకే భూమి పైపొర అయిన 'క్రస్ట్' భాగంలో బంగారం లభ్యత చాలా తక్కువగా ఉంటుందని అంటారు. భూమి లోపలి పొరల నుంచి బంగారం ఉపరితలానికి చేరుకోవడానికి అగ్నిపర్వత ప్రక్రియలు, మాగ్మా ప్రధాన కారణాలుగా నిలుస్తాయి. భూగర్భంలోని వేడి ద్రవాలు, వాయువులు కలిసి శిలల మధ్య ఖాళీల్లోకి చొచ్చుకుపోతాయి. మాగ్మా చల్లబడినప్పుడు, అందులోని సల్ఫైడ్ ఖనిజాలతో కలిసి బంగారం స్ఫటికాలుగా లేదా స్వచ్ఛమైన లోహంగా మారుతుంది.టన్ను మట్టిలో..కేరళ కేవలం ప్రకృతి సోయగాలకే కాదు, భూగర్భ నిధులకు కూడా నిలయమని ఇటీవలి పరిశోధనల్లో నిరూపితమైంది. ముఖ్యంగా రాష్ట్రంలోని నిలంబూర్, వయనాడ్, అట్టప్పాడి, పునలూర్, పలు తీర ప్రాంతాల్లో స్వర్ణ నిక్షేపాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. నిలంబూర్-పంతలూర్ బెల్ట్ బంగారానికి పెట్టింది పేరు. ఇక్కడ టన్ను మట్టి లేదా రాయిని వెలికితీస్తే సుమారు 0.5 నుంచి 4.5 గ్రాముల బంగారం లభించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. బ్రిటిష్ కాలంలోనే ఇక్కడి పున్నప్పుళ, కరక్కోడ్ వంటి ప్రాంతాల్లో మైనింగ్ జరిగేది. ఇప్పటికీ అక్కడి నదుల్లో బంగారు రేణువుల కోసం స్థానికులు అన్వేషణ సాగిస్తుండటం గమనార్హం.వాయనాడ్, అట్టప్పాడిలో పసిడి జాడలుకేరళలోని వయనాడ్ ప్రాంతంలోని మానంతవాడి, మేప్పాడి, తరియోడ్ వంటి చోట్ల స్వర్ణ నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే అట్టప్పాడిలోని భవానీ నదీ తీర ప్రాంతాల్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరిపిన పరిశోధనల్లో టన్నుకు 1.2 గ్రాముల వరకు బంగారం దొరకవచ్చని తేలింది. అలాగే అలప్పుజ, చవర తదితర తీర ప్రాంతాల్లో సముద్రపు ఇసుకలో కూడా అత్యల్ప పరిమాణంలో పసిడి రేణువులు కనిపించడం విశేషం.మైనింగ్‌కు అడ్డంకులు కేరళలో బంగారం నిక్షేపాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, మైనింగ్ చేయడం ఆర్థికంగా లాభదాయకమా కాదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. చాలా చోట్ల బంగారం పరిమాణం చాలా తక్కువగా ఉండటం, పర్యావరణపరంగా ఇబ్బందులు ఏర్పడే ప్రాంతాలు కావడంతో తవ్వకాలు జరపడం అనేది సవాలుతో కూడుకున్న పనిగా మారింది. ఏదిఏమైనప్పటికీ కేరళ భూగర్భంలో దాగున్న ఈ స్వర్ణ సంపద శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.ఇది కూడా చదవండి: దేశమంతటా నువ్వుల నైవేద్యాలు.. రహస్యం ఇదే! -
నేడు మకరజ్యోతి దర్శనం.. శబరిలో భక్తుల రద్దీ
తిరువనంతపురం: కేరళలోని శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు శబరికి తరలివెళ్లారు. మకరవిలక్కు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) అరుణ్ ఎస్ నాయర్ తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా బారికేడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాల పనులు కూడా పూర్తి అయ్యాయి.ప్రతీ సంవత్సరం మకర సంక్రాంతి రోజున శబరిమల కొండలకు ఎదురుగా ఉన్న పొన్నాంబలమేడుపై మకరజ్యోతిని వెలిగిస్తారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు మాలధారణ, ఇరుముడితో శబరిమలకు చేరకుంటారు. కాగా కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు, ఉత్సవాల రద్దీని నియంత్రించేందుకు దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యపై అధికారులు కఠినమైన పరిమితులను విధించారు. భక్తులు ఇబ్బంది పడకుండా ముందస్తుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కల్పించారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నారు. భక్తుల భద్రత కోసం శబరిమల మార్గాల్లో, సన్నిధానం వద్ద అదనపు పోలీసు బలగాలను, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు.కాగా, మకరవిలక్కు(మకరజ్యోతి) పర్వదినం సందర్భంగా భక్తుల సంఖ్యను అధికారులు క్రమబద్ధీకరించారు. జనవరి 13న వర్చువల్ క్యూ ద్వారా 35,000 మందికి, స్పాట్ బుకింగ్ ద్వారా 5,000 మందికి అవకాశం కల్పించారు. ఈరోజు వర్చువల్ క్యూ ద్వారా 30,000 మంది భక్తులకు పరిమితం చేశారు. ఇక జనవరి 15 నుండి 18 వరకు ప్రతిరోజూ 50,000 మందికి వర్చువల్ క్యూ ద్వారా, 5,000 మందికి స్పాట్ బుకింగ్ ద్వారా అనుమతి కల్పించారు. జనవరి 19న తిరిగి భక్తుల సంఖ్యను 30,000కు తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.పందళం నుండి జనవరి 12న ప్రారంభమయ్యే తిరువాభరణ ఊరేగింపు జనవరి 14న సన్నిధానానికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటల నుండి నిలక్కల్-పంబ మార్గంలో, ఉదయం 11 గంటల నుండి పంబ-సన్నిధానం మార్గంలో భక్తుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. అలాగే జనవరి 12 ఉదయం నుండి జనవరి 15 మధ్యాహ్నం వరకు హిల్ టాప్ వద్ద ప్రైవేట్ వాహనాల పార్కింగ్‌ను నిషేధించారు. దీంతో భక్తులు తమ వాహనాలను నిలక్కల్ వద్దే పార్క్ చేయాల్సి ఉంటుంది. ఎరుమేలి అటవీ మార్గంలో కూడా జనవరి 13 సాయంత్రం రాకపోకలపై ఆంక్షలు విధించారు.నిరంతర తనిఖీలు..భక్తుల రద్దీని తట్టుకునేందుకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అల్పాహారం, తాగునీటి సౌకర్యాలను కల్పిస్తోంది. పోలీస్ విభాగం భారీ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్‌ను రూపొందించగా, ఆర్ఏఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తదితర కేంద్ర బలగాల మద్దతుతో అదనపు సిబ్బందిని మోహరించారు. భక్తుల రవాణా కోసం సుమారు వెయ్యి కేఎస్ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచారు. అటవీ ప్రాంతాల్లో అనధికారిక గుడిసెలు వేయడం, వంట చేయడంపై కఠిన నిషేధం విధించామని, పోలీస్, అటవీ, ఫైర్ ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని ఏడీఎం తెలిపారు. -
అయ్యప్ప స్వామి దివ్య ఆభరణాల పవిత్ర యాత్ర
పథనంతిట్ట (కేరళ) : తండ్రి ప్రేమ, దైవభక్తి స్వచ్ఛమైన, మేలిమి బంగారంలా మేళవించే 'తిరువాభరణాలు' (స్వామివారి పవిత్ర ఆభరణాలు) తీసుకువెళ్లే వార్షిక ఉత్సవ యాత్ర ఆదివారం పథనంథిట్టలోని పందలంలో ఒక ఆలయంలో నుంచి శబరిమలకు బయలుదేరింది. ఆ పవిత్ర ఆభరణాలను ఈ నెల 14న, ‘మకరవిళక్కు’ ఉత్సవం రోజు స్వామి అయ్యప్పకు అలంకరించనున్నారు. ట్రావన్కూర్ దేవస్వమ్ బోర్డ్ (టీడీబీ) ప్రతినిధులతో పాటు అనేక మంది అయ్యప్ప భక్తులు కూడా ‘తిరువాభరణం ఘోషాయాత్ర’ వెంట శబరిమల ఆలయానికి సాగారు.దశాబ్దాలుగా పాటిస్తున్న సంప్రదాయం ప్రకారం, పందలంలోని శ్రంబిక్కల్ ప్యాలెస్‌లోని ఖజానా నుంచి పక్కన ఉన్న వలియకోయిక్కల్ సంస్థ ఆలయానికి ఉదయం భక్తుల దర్శనార్థం తిరువాభరణాన్ని తరలించారు. టీడీబీ అధికారులు ప్యాలెస్ అధికారుల నుంచి ఆభరణాలు స్వీకరించి సంస్థ ఆలయానికి తీసుకువెళ్లారు. వాటిని తిలకించి, పూజలు చేసేందుకు అనేక మంది భక్తులు అక్కడికి చేరారు. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అనే శరణు ఘోషల మధ్య సాంప్రదాయక తంతు, పూజలు నిర్వహించిన తదుపరి పవిత్ర ఆభరణాలను చెక్క పేటికలలో పెట్టి శబరిమలకు తీసుకువెళ్లారు. ఇది జీవింతంలో ఒక్కసారైన చూడవల్సిన పవిత్రమైన ఆధ్యాత్మిక క్షణాలు.తిరువాభరణాలు పవిత్ర యాత్ర అంటే:అయ్యప్ప స్వామికి సంబంధించిన పవిత్రమైన ఆభరణాలను పందళం రాజకుటుంబం నుంచి మకరజ్యోతి సమయంలో శబరిమలకు ఊరేగింపుగా తీసుకెళ్లే ఒక ముఖ్యమైన, సంప్రదాయబద్ధమైన యాత్ర. ఈ యాత్రలో, ఆభరణాలను పందళంలోని వలియాకోయిక్కల్ ధర్మశాస్తా ఆలయం నుంచి గురుస్వామి తలపై పెట్టుకుని ఊరేగింపుగా, కాలినడకన 83 కిలోమీటర్ల దూరం శబరిమల సన్నిధానానికి తీసుకెళ్తారు, ఇది అయ్యప్ప భక్తులకు అత్యంత పవిత్రమైన ఘట్టం(చదవండి: జనవరి 12న తిరువాభరణం ఆభరణాల ఊరేగింపు) -
ప్రమాదంలో కేరళ భద్రత
తిరువనంతపురం: కేరళలో శాంతి భద్రత పైకి సాధారణంగా కన్పిస్తున్నా లోపల అనేక ముప్పులు క్రమేపీ పెరుగుతున్నాయని హోం మంత్రి అమిత్ షా అన్నారు. భవిష్యత్తులో ఇవి ప్రమాదకరంగా మారనున్నాయని హెచ్చరించారు. మలయాళ పత్రిక కేరళ కౌముది ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ‘‘పీఎఫ్ఐ, జమాతె ఇస్లామీ, ఎస్డీపీఐ వంటి రాజకీయ పార్టీలు కేరళను సురక్షితంగా ఉండనిస్తాయా? ఇటువంటి బెడదలను ముందుగానే గుర్తించి, తొలగించడం బాధ్యత కలిగిన ప్రభుత్వం చేయాల్సిన పని’ అని అన్నారు. పీఎఫ్ఐ కేడర్ మొత్తాన్నీ కటకటాల్లోకి నెట్టేసి, దేశాన్ని తాము సురక్షితంగా ఉంచామని చెప్పారు. తెరవెనుక ఉన్న ముప్పులను తొలగించినప్పుడే కేరళ సురక్షితంగా ఉండగలదని అమిత్ షా అన్నారు. బీజేపీ వల్లనే అది సాధ్యమని చెప్పారు. పద్మనాభుని సన్నిధిలో పూజలుకేరళలో ఒక్క రోజు పర్యటనకు గాను శనివారం రాత్రి తిరువనంతపురం చేరుకున్న అమిత్ షా ఆదివారం ఉదయమే అనంత పద్మనాభుని ఆలయానికి చేరుకున్నారు. సంప్రదాయ ధోవతి, సిల్కు శాలువాతో వచ్చిన అమిత్ షాకు ట్రావెన్కోర్ రాచ కుటుంబ సభ్యుడు ఆదిత్య వర్మ, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అమిత్ షాకు ఆలయ అధికారులు పద్మనాభస్వామికి అంకితమిచ్చే సంప్రదాయ విల్లును బహూకరించారు. . కేరళ, బెంగాల్‌లలో ఒకేసారి ఎన్నికలుఅనంతరం కేంద్ర మంత్రి అమిత్ షా నూతనంగా ఎన్నికైన తిరువనంతపురం బీజేపీ కౌన్సిలర్ల సమావేశంలో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే కేరళలోనూ ఎన్నికలు జరుగుతాయని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శబరిమల ఆలయంలో బంగారు తరుగు కేసుపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని హోంమంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. అసలైన దోషులను కాపాడేందుకు అధికార ఎల్డీఎఫ్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఆలయ ఆస్తులనే కాపాడలేని వారు ప్రజల విశ్వాసాలను ఎలా పరిరక్షించగలరంటూ ప్రశ్నించారు. -
పునాదుల్లో భారీగా బంగారం.. విద్యార్థి చొరవతో..
గదగ్: కర్ణాటకలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గదగ్ జిల్లా, లక్కుండి గ్రామంలో ఒక ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా కూలీలు పునాదుల కోసం భూమిని తవ్వుతుండగా అనూహ్యంగా బంగారు నిధి లభ్యమయ్యింది. పునాదుల్లో పసిడి ఆభరణాలు బయటపడటంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది. పాతకాలపు రాగి బిందెలో దాచి ఉంచిన ఈ విలువైన సంపదను చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.ఈ నిధిని స్థానికంగా ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రజ్వల్ రిత్విక్ అనే విద్యార్థి గుర్తించాడు. భూమిలో కనిపిస్తున్న రాగి బిందెను గమనించిన ఆ బాలుడు, వెంటనే గ్రామ పెద్దలకు ఆ సమాచారం అందించాడు. ఆ రాగి బిందెను తెరిచి చూడగా, అందులో వివిధ రకాల బంగారు ఆభరణాలు కనిపించాయి. బాలుడి నిజాయితీని గ్రామస్తులు మెచ్చుకున్నారు. విషయం తెలుసుకున్న గదగ్ జిల్లా ఎస్పీ రోహన్ జగదీష్ నేతృత్వంలో పోలీసుల బృందం, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.అధికారులు ఆ బంగారాన్ని పరిశీలించి, అది సుమారు 470 గ్రాముల బరువు ఉన్నట్లు నిర్ధారించారు. ఆ రాగి బిందెలో మొత్తం 22 రకాల బంగారు వస్తువులు ఉన్నాయని, వాటిలో గొలుసులు, చెవి కమ్మలు వంటి విలువైన ఆభరణాలు ఉన్నట్లు ఎస్పీ మీడియాకు తెలిపారు. అధికారులు ఈ బంగారు నిధిని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. నిబంధనల ప్రకారం లభ్యమైన 470 గ్రాముల బంగారాన్ని ప్రభుత్వ ట్రెజరీకి తరలించారు. పురావస్తు శాఖ నిపుణులు ఈ ఆభరణాల చారిత్రక నేపథ్యాన్ని పరిశీలించే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: కేరళలో అమిత్ షా.. ‘స్వామి కార్యం.. స్వకార్యం’ -
కేరళలో అమిత్ షా.. ‘స్వామి కార్యం.. స్వకార్యం’
తిరువనంతపురం: కేరళ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అటు అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించడంతో పాటు పార్టీ (బీజేపీ) కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. నేడు (ఆదివారం) పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించిన అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం రాత్రి కేరళ చేరుకున్న ఆయన ఆదివారం ఉదయం రాష్ట్ర బీజేపీ నాయకులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయబద్ధంగా పట్టు వస్ల్రాలు ధరించిన అమిత్ షాకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఆరేళ్లకు ఒకసారి జరిగే ‘లక్షదీపం’ ఉత్సవానికి ఆలయం సిద్ధమవుతున్న తరుణంలో అమిత్ షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 14న ఆలయంలో లక్ష దీపాలను వెలిగించే మహోత్సవం జరగనుంది.ఆలయ దర్శనం అనంతరం అమిత్ షా రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా గడపనున్నారు. ఇటీవల కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త ప్రతినిధులతో ఆయన సమావేశమై, వారికి దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం ఒక ప్రత్యేక సదస్సులో పాల్గొన్న అనంతరం, సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నాయకులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పార్టీ శ్రేణులకు ఆయన మార్గనిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.కేరళ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అమిత్ షా ‘మిషన్ 2026’ను ఈ పర్యటన ద్వారా లాంఛనంగా ప్రారంభించనున్నారు. 2025లో ఆయన ప్రారంభించిన ‘మిషన్ 2025’ వ్యూహం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో 2026 శాసనసభ ఎన్నికల్లో చారిత్రాత్మక మార్పు తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీతో అమిత్ షా జరిపే చర్చలు అత్యంత కీలకం కానున్నాయి. కేరళలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది.ఇది కూడా చదవండి: ‘మకర జ్యోతి’కి సర్వం సిద్ధం.. భక్తుల నియంత్రణ ఇలా.. -
ఆరు దశాబ్దాల ఎడారి జీవితం.. ఆ జ్ఞాపకాలే ఖరీదంటోన్న మలయాళీ.!
ఐదు దశాబ్దాల క్రితం గల్ఫ్‌లోని ఎడారిలో జీవితాన్ని ప్రారంభించిన మలయాళీ ముహమ్మద్ కుంజి (77). మత్స్యకారులైన పొన్నిచి ముసాన్, ఒలకోన్ సారా దంపతుల కుమారుడైన కుంజి 21 సంవత్సరాల వయసులో దుబాయ్‌కు ఓడ ఎక్కాడు. అతని తండ్రి సంపాదన అంతంత మాత్రమే కావడంతో అతని కుటుంబం ఆకలి కూడా తీర్చలేకపోయేవాడు. మడాయిలోని ముత్తోంలోని కొవ్వప్పురానికి చెందిన పొన్నిచి ముసాన్ ఇక జీవించడానికి అతనికి వేరే మార్గం లేకపోవడంతో.. ఐదవ తరగతిలో చదువు మానేసి బీడీ కార్మికుడిగా పనికి వెళ్లేవాడు.కానీ అతని సోదరుడు ముస్తఫా మాత్రం మొదట దుబాయ్‌కి వెళ్ళాడు. ముస్తఫా అక్కడ టీ దుకాణం నడుపుతున్నాడు. తన సోదరులను దుబాయ్‌కు తీసుకువస్తేనే కుటుంబంలో పేదరికం తొలగిపోతుందని తెలిసుకున్న ముస్తఫా.. వీసా వచ్చాక ముహమ్మద్ కుంజిని అక్కడికి రమ్మని కోరాడు. అలా మహమ్మద్ కుంజి మార్చి 3, 1967న దుబాయ్‌లో అడుగుపెట్టాడు.అలా మహమ్మద్ కుంజిని దుబాయ్ తీసుకువచ్చాడు ముస్తఫా. అక్కడికి వెళ్లిన కుంజి టీ, స్వీట్లు తయారు చేయడం నేర్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అలా ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే వ్యాపారం.. రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగేది. తాను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని నేను దాచుకునేవాడు. ఇంట్లో ఆకలితో అలమటిస్తున్న నా తండ్రి, తల్లి, తోబుట్టువుల కోసం పంపేవాడు. అప్పట్లో తమ అదృష్టాన్ని వెతుక్కుంటూ దుబాయ్‌కు వచ్చిన వారిలో ఎక్కువ మంది మలయాళీలు, బలూచిస్తానీలే ఎక్కువ. కుంజి దుబాయ్‌లో తొమ్మిది సంవత్సరాలు పనిచేశాజు.అప్పట్లో దుబాయ్ కరెన్సీ దిర్హామ్‌కి మన డబ్బుల్లో 2 రూపాయలు. ఆ తర్వాత 1976లో అబుదాబి పోలీస్ ఉద్యోగం వచ్చింది. పోలీస్ శాఖలో వంటవాడిగా కెరీర్ ప్రారంభించాడు. అప్పట్లో కుంజి జీతం 900 దిర్హామ్‌లు. అలా జీతం నుంచి కొంత మొత్తాన్ని ఆదా చేసుకుని మిగిలిన మొత్తాన్ని ఇంటికి పంపేవాడినని తెలిపారు. అప్పుడు కేవలం ఉత్తరాల ద్వారానే కమ్యూనికేషన్ ఉండేది. పనిలో భాగంగా ఒక చిన్న ప్రమాదం జరగడంతో నా ఉద్యోగాన్ని కోల్పోయి టీ అమ్మడం మొదలుపెట్టాను. నాకు ఉద్యోగం వచ్చే వరకు అది కష్టమైన పని. ఆ తర్వాత 1987లో అబుదాబి సైన్యంలో ఉద్యోగం. అక్కడ కూడా నా ఉద్యోగం వంట. జీతం 1800 దిర్హామ్‌లు. అప్పుడు ఇంటికి ఎక్కువ డబ్బు పంపగలిగానని కుంజి వెల్లడించారు. నేను మొదట మా ఊరికి వచ్చినప్పుడు, నేను కోటీశ్వరుడిననని నా కుటుంబం, స్థానికులు చాలా ఆశలు పెట్టుకునేవారని తెలిపారు.నేను అబుదాబి సైన్యంలో చేరిన తర్వాత వివాహం చేసుకున్నానని తెలిపారు. నేను అప్పట్లో గల్ఫ్ గురించి చెబితే ప్రజలు నన్ను నమ్మలేదు. అప్పట్లో అరబ్బులకు కూడా చిన్న ఇళ్లే ఉండేవి. మేమందరం చిన్న గుడిసెలలో నివసించామని.. స్నానం చేయడానికి గాడిదలపై టిన్ డబ్బాల్లో తెచ్చిన నీటికి డబ్బు చెల్లించాల్సి వచ్చేదన్నారు. కేవలం ప్రతి నాలుగైదు రోజులకు నీరు వస్తుందన్నారు. కుటుంబ ఉత్తరం కోసం వేచి ఉన్న సమయం చాలా బాధాకరంగా ఉండేదని అన్నారు.నేను రాడో వాచ్‌ను 1987లో కొన్నాను. లడఖ్‌లో ఉద్యోగం వచ్చినప్పుడు నా మొదటి జీతంతో కొన్నానని తెలిపారు. ఈ వాచ్ ధర 2025 దిర్హామ్లని వెల్లడించారు. ఈ గడియారం నా గల్ఫ్ జీవితాన్ని గుర్తు చేస్తుందని అన్నారు. అప్పటి నుండి, నా కుటుంబం. ఈ గడియారం నాతోనే ఉన్నాయని తెలిపారు. ఒకరోజు నేను ఒక గడియార దుకాణానికి వెళ్లి రాడో వాచ్ ధర ఎంత అడిగా.. అర మిలియన్ రూపాయలు అన్నారు. కానీ నాకు, దాని విలువ కంటే జ్ఞాపకాలే చాలా రెట్లు ఎక్కువ అనిపించిందన్నారు.నా వయస్సు 60 సంవత్సరాల వరకు అబుదాబిలో పనిచేశానని.. తరువాత నా ప్రవాసాన్ని ముగించానని కుంజి వెల్లడించారు. నా కుమార్తెలు ఆయేషా, అమీనా వివాహం చేసుకున్నారు. మనదేశానికి తిరిగి వచ్చి ఎలక్ట్రికల్ వస్తువులు అమ్మే దుకాణాన్ని ప్రారంభించానని తెలిపారు. నేను ఖాళీగా ఉన్నప్పుడు, గల్ఫ్ జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని.. అప్పుడు ఈ గడియారాన్ని ఎల్లప్పుడూ చూస్తానని పేర్కొన్నారు. -
అయ్యప్ప భక్తులకు అలర్ట్.. ఆ మార్గాల్లో నో ఎంట్రీ
మకర విలక్కు పండుగ సందర్భంగా శబరిమలలో ఆంక్షలు విధించారు. తాజా నిబంధనల ప్రకారం జనవరి 12 నుంచి పంబాలో ఎలాంటి వాహనాల పార్కింగ్‌కు అనుమతి లేదని కేరళ పోలీసులు స్పష్టం చేశారు. అలాగే జనవరి 14న ఉదయం 9 గంటల తర్వాత నీలక్కల్ నుంచి పంబాకు ఎలాంటి వాహనాలు ప్రయాణించడానికి వీల్లేదని పోలీసులు ఆదేశించారు. అదే రోజు ఉదయం 10 గంటల తర్వాత పంబ నుంచి సన్నిధానం వరకు ఎటువంటి వాహనాలను అనుమతించేది లేదన తేల్చి చెప్పారు.కాగా.. మకర సంక్రాంతికి అయ్యప్ప మాల భక్తులు పెద్దఎత్తున శబరిమల చేరుకుంటారు. మకరజ్యోతి దర్శనం కోసం వేలాది మంది అయ్యప్పస్వాములతో ఆలయం కిటకిటలాడుతుంది. అత్యంత రద్దీ ఉండే రోజులు కావడంతో భక్తులు వెళ్లే మార్గాల్లో వాహనాలకు అనుమతులు నిలిపేశారు. ఈ విషయాన్ని శబరిమల అయ్యప్ప భక్తులు గమనించాలని కేరళ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి
నలభై ఏళ్ల ప్రేమ అరవై ఏళ్ల వయసులో నెరవేరడం నిజంగా అదృష్టం. 65 ఏళ్ల వయసులో జయప్రకాష్ అనే వ్యక్తి, తన టీనేజ్ ప్రియురాలు యాభై తొమ్మిదేళ్ల రష్మిని పెళ్లాడాడు. ఇది కేవలం ప్రేమకథ కాదు. అనేక ట్విస్టు అండ్ టర్న్ మధ్య వారి చిరకాల ప్రేమసంతోషం, ఆనందం గెలిచిన రోజు. ఒకనాడు విధికి తలవంచిన ఈ జంట, మళ్లీ ఆ విధి చేసిన వింతలో భాగంగానే పిల్లల అనుమతితో ఒకటయ్యారు. అలనాటి ప్రేమికులు జయప్రకాష్ , రష్మిల అందమైన, అరుదైన ఈ పెళ్లి కథ గురించి తెలుసుకోవాలని ఉందా.. అయితే పదండి! కేరళలో జరిగిన ఆసక్తికరమైన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి:-కేరళలోని కొల్లం ముందక్కల్‌కు చెందినవారు జయప్రకాష్, రష్మి. వీరిద్దరూ పొరుగువారే. చాలా చిన్న వయసులోనే ప్రేమించు కున్నారు. కానీ వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. విధి వారిద్దరినీ మరొకరి జీవితంలోకి ప్రవేశించేలా చేసింది. దీంతో ఇద్దరూ తమ ప్రేమను త్యాగం చేసి, పెద్దలు చెప్పిన పెళ్లిళ్లు చేసుకొని వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు. రష్మికి ఆమె తల్లిదండ్రులు వేరే వ్యక్తితో వివాహం జరిపించారు.ప్రేమ విఫలం కావడంతో జయప్రకాష్ ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లి, పెళ్లి చేసుకున్నాడు. జయప్రకాష్‌కు ఇద్దరు కుమారులు, రష్మికి ఇద్దరు కుమార్తెలున్నారు. పిల్లలు, మనవరాళ్ళు, మునిమనవళ్లు వారి కుటుంబాలు నిండుగా సంతోషంగా ఉన్నాయి. అయితే జయప్రకాష్, రష్మి ఇద్దరూ కూడా తమతమ జీవిత భాగస్వాములను కోల్పోయారు. రష్మి భర్త పదేళ్ల క్రితం అకస్మాత్తుగా మరణించగా, జయప్రకాష్ భార్య 5 సంవత్సరాల క్రితం మరణించింది. అప్పటి నుంచి వారు తమ పిల్లలే తమ ప్రాణమని భావించి తిరిగి వివాహం చేసుకోకుండానే జీవించారు. దీంతో వారిద్దరూ ఒంటరిగా మారారు. షార్ట్ ఫిలిం కలిపిన ప్రేమభర్తను కోల్పోయిన బాధను మర్చిపోయేందుకు రష్మి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేది. ఆమె షార్ట్ ఫిల్మ్‌లలో కూడా నటించేది. ఈలోగా జయప్రకాష్ రష్మి నటించిన ఒక షార్ట్ ఫిల్మ్ చూశాడు. తన చిన్ననాటి ప్రియురాలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించినట్టు తెలిసి సంబరపడిపోయారు. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ వద్ద రష్మి కుమార్తె సెల్ ఫోన్ నంబర్ తీసుకుని, రష్మితో మాట్లాడారు. ఈ క్రమంలోనే జీవిత భాగస్వాములు చనిపోయారని పరస్పరం తెలుసుకున్నారు. మరోవైపు భార్య చనిపోవడంతో పిల్లల పట్టుబట్టడంతో జయప్రకాష్ కూడా తిరిగి వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. తాను తిరిగి వివాహం చేసుకోవాలని భావిస్తున్నానని జయప్రకాష్ రష్మికి చెప్పాడు. అలా ఇద్దరిమధ్య పాత ప్రేమ మళ్లీ చిగురించింది. పిల్లల అంగీకారంతో ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చని కూడా ప్రపోజ్ చేశాడు. రష్మి తన కూతురు, అల్లుడికి ఆ విషయం చెప్పింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారు. ఇంకేముంది పెళ్లి సందడి వేళ అయ్యింది.పిల్లలే పెద్దలుగా జయప్రకాష్-రష్మి సమీప బంధువుల సమక్షంలో దంపతులుగా మారారు. యవ్వనంలో ప్రేమలో పడిన ఈ జంట 60 ఏళ్ల తర్వాత కలిసి "నిజమైన ప్రేమ ఒకరోజు తప్పకుండా గెలుస్తుంది" అని నిరూపించారు. నూతన వధూవరులు రష్మి, జయప్రకాష్ మలేషియాకు హనీమూన్ వెళ్లాలని నిర్ణయించు కున్నారు. జయప్రకాష్, రష్మిల వివాహ ఫోటోను రష్మి కుమార్తె సోషల్ మీడియాలో షేర్ చేసి, "ఈ అదృష్టం ఏ పిల్లలకు లభిస్తుంది?" అని పేర్కొనడం విశేషంగా నిలిచింది.ఇదీ దచవండి: అమ్మానాన్నల్ని ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరప్పా! -
‘డబ్బులుంటే చాలు.. అమెరికా కాదు.. మిమ్మల్ని అంతరిక్షానికే పంపిస్తాం’?!
తిరువనంతపురం: రండి బాబు రండి అమెరికాకు వెళ్లాలనుకుంటున్నారా? మీకు విద్యార్థత లేదు. మరేం ఫర్లేదు. డబ్బులు ఉంటే చాలు.. అమెరికాకు కాదు.. అంతరిక్షానికైనా పంపిస్తామంటూ పలువురు కేటు గాళ్లు అమాయకులకు వల వేస్తున్నారు. కోరుకున్న జీవితం, కోరుకున్న జీతం రావడంతో పలువురు నమ్మి మోసపోతున్నారు. వలసదారులపై ట్రంప్ విధిస్తున్న ఆంక్షలకు బలవుతున్నారు. కాళ్లు,చేతులకు సంకెళ్లు వేయించుకుని మరీ స్వదేశాలకు వస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఉదంతమే అందుకు ఉదాహరణనల్లగొండ జిల్లా పరేపల్లిగూడేనికి చెందిన పకీర్ గోపాల్‌రెడ్డి నకిలీ విద్యార్హత పత్రాలతో అమెరికా వెళ్లి ఉద్యోగం పొందాడనే ఆరోపణలపై అక్కడి అధికారులు అతడిని డిపోర్ట్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆర్జీఐఏ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. గోపాల్‌రెడ్డి మధురై కామరాజ్ యూనివర్శిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ పూర్తి చేశానని నకిలీ సర్టిఫికెట్ పొందాడు. దీని ఆధారంగా స్టూడెంట్ వీసా తీసుకుని 2023 సెప్టెంబర్‌లో అమెరికా వెళ్లి, డల్లాస్‌లోని వెబ్‌స్టర్ యూనివర్సిటీలో మాస్టర్స్‌లో చేరాడు. కానీ అతడు సమర్పించిన డిగ్రీ నకిలీదని తేలడంతో అమెరికా అధికారులు అతడిని తిరిగి పంపించారు. విచారణలో గోపాల్‌రెడ్డి ఆ సర్టిఫికెట్‌ను రూ.80 వేలకే కొనుగోలు చేశానని అంగీకరించాడు.ఈ కేసు తీగ లాగిన సైబరాబాద్ పోలీసులు కేరళలోని మలప్పురం జిల్లా పొన్నానిలో ఉన్న మార్క్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్పై దాడి చేశారు. అక్కడి పోలీసులు వేల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్ విలువ దాదాపు రూ.750 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మార్క్ సంస్థ నిర్వాహకుడు అర్షద్‌ను పట్టుకున్న పోలీసులు విచారించగా, ఈ సర్టిఫికెట్లు తిరుర్‌లోని ఫోర్సా మాల్లో ఉన్న ఎడుహబ్ కన్సల్టెన్సీ నుంచి వస్తున్నాయని బయటపెట్టాడు. అక్కడి నుంచి వందల సర్టిఫికెట్లు సీజ్ చేశారు. ఈ తయారీలో పయ్యనంగడికి చెందిన అబ్దుల్ నిస్సార్ కీలక పాత్ర పోషించినట్లు తేలడంతో అతడినీ అరెస్టు చేశారు.ఈ ముఠా దేశవ్యాప్తంగా వేల మందికి నకిలీ విద్యార్హత పత్రాలు సరఫరా చేసింది.ఎస్సెస్సీ, ప్లస్ టూ, బీఏ, బీకాం, ఎంబీఏ, ఎంకామ్, బీఎస్సీ, బీఈడీ, బీటెక్‌లతో పాటు ఎల్ఎల్బీ, పీజీ కోర్సులు, పీహెచ్డీ వరకు అన్ని స్థాయిలలో సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయించారు. ఒక్కో సర్టిఫికెట్‌ను రూ.25 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు అమ్మారు. తిరూర్ ఈస్ట్‌లోని చెంబ్రాకు చెందిన ధనీష్ ధర్మన్ ఈ రాకెట్‌కు నాయకుడు. అతడు ‘డానీ’ అనే పేరుతో నకిలీ సర్టిఫికెట్ల వ్యాపారం నడిపాడు. తమిళనాడులోని శివకాశీలో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసి, ఉద్యోగులకు రెగ్యులర్ జీతాలు, పీఎఫ్, ఇతర సౌకర్యాలు కూడా కల్పించాడు. శివకాశీ ప్రింటింగ్ ప్రెస్‌కు చెందిన జైనుల్ అబీదీన్ అరెస్టుతో డానీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ధనీష్ 2011లో కూడా నకిలీ సర్టిఫికెట్ల కేసులో పట్టుబడ్డాడు. అప్పట్లో బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ ఈ దందా మొదలుపెట్టాడు.ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.20 వేల రూపాయలు వసూలు చేస్తూ, ధనీష్ 10 ఏళ్లలో రూ.100 కోట్లకు పైగా సంపాదించాడు. ఈ సంపాదనతో పుణే, దుబాయ్‌లో వ్యాపారాలు ప్రారంభించాడు. చివరకు కారవాన్‌లో ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. మొత్తంగా, ఈ నకిలీ సర్టిఫికెట్ల రాకెట్ కేరళ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించి, వందల కోట్ల రూపాయల స్కామ్‌గా మారింది. గోపాల్‌రెడ్డి కేసు ద్వారా ఈ భారీ నెట్వర్క్ గుట్టు రట్టు కావడం, విద్యార్హత పత్రాల మోసంపై పెద్ద ఎత్తున దర్యాప్తుకు దారితీసింది. -
శబరిమలలో సిబ్బంది కొరత.. హుండీ లెక్కింపు ఆలస్యం
తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మరోవైపు.. శబరిమలలో మకరవిళక్కు పూజలు ఘనంగా జరుగుతున్నాయి. దీంతో మకర జ్యోతి వేడుకలకు శబరిమల సర్వంగా సుందరంగా ముస్తాబవుతోంది. జనవరి 14న లక్ష మందికి పైగా భక్తులు జ్యోతి దర్శనం కోసం వస్తారని దేవస్థానం బోర్డు అంచనా వేసింది. ఇక, తొలిసారిగా ఫోటోలతో కూడిన పాస్‌లు, 900 బస్సులను భక్తుల కోసం అందుబాటులో ఉంచుతున్నారు. జనవరి 14న 35,000 మందికే అనుమతి ఉండటంతో రద్దీ నియంత్రణకు స్పాట్ బుకింగ్ నిలిపివేశారు. భక్తులకు అన్నదానం, వసతి సౌకర్యాలు కల్పించారు.ఇదిలా ఉండగా.. శబరిమల ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో కానుకలు, హుండీ లెక్కింపులు జరుగుతున్నాయి. దేవస్థానం ఖజానాలో నాణేలు కొండలా పేరుకుపోయాయి. ప్రతిరోజూ, కానుకల హుండీలోని నోట్ల నుండి నాణేలను వేరు చేసి ఖజానాలోని ఒక భాగంలో ఉంచుతున్నారు. మండల కాలం నుండి మరియు మకరవిళక్కు పండుగ ప్రారంభమైన తర్వాత వచ్చిన నాణేలు కొండలా పేరుకుపోతున్నాయి. అయితే, దేవస్థానంలో డబ్బులు, నాణేలు లెక్కించడానికి తగిన సిబ్బంది లేకపోవడంతో లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతోంది.వేధిస్తున్న ఉద్యోగుల కొరత.. ప్రస్తుతానికి దేవస్థానం ఖజానాలో 175 మంది ఉద్యోగుల కొరత ఉంది. సిబ్బందిని నియమించుకోవడానికి దేవస్థానం ఉద్యోగులు అందుబాటులో లేరు. దీనికి బదులుగా తాత్కాలిక ఉద్యోగులను నియమించి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించినప్పటికీ, వారు కూడా లభించడం లేదు. అందువల్ల, డబ్బు లెక్కించడం అసాధ్యంగా మారింది. తీర్థయాత్రల సీజన్లో, సన్నిధానం, పంపా మరియు నిలక్కల్‌లో సేవ చేయడానికి ప్రతి సంవత్సరం 2000 మంది తాత్కాలిక ఉద్యోగులను నియమిస్తారు. మరోవైపు.. భద్రతా సిబ్బంది కోసం ఈసారి కేవలం 1750 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1632 మందిని నియమించారు. వారిలో 50 మంది సన్నిధానం చేరుకున్న తర్వాత తిరిగి వెళ్లిపోయారు. దీంతో సిబ్బంది సరిపోక అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కాగా, తాత్కాలిక ఉద్యోగులకు రోజుకు రూ. 650, ఉచిత వసతి, భోజనం ఇస్తామని హామీ ఇచ్చారు. భద్రతా విధులకు జీతం రోజుకు రూ. 900. వసతి, భోజనం అదనంగా ఉండనుంది.నాడు రోబోలతో లెక్కింపు.. మకరవిళక్కు కోసం ఆలయం తెరిచిన తర్వాత, యాత్రికుల రద్దీ భారీగా పెరిగింది. దీనితో పాటు, కానుకల ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరిగింది. అదే ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. ప్రస్తుత పరిస్థితిలో, మకరవిళక్కు తర్వాత ఆలయం మూసివేసినా, కానుకలను లెక్కించడం సాధ్యం కాదు. 2023లో, రోబోల సహాయంతో కానుకలను లెక్కించే ప్రణాళికను అమలు చేయడానికి దేవస్థానం బోర్డు ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. అప్పటి దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె. అనంతగోపన్ తిరుపతిని సందర్శించి ఒక అధ్యయనం నిర్వహించారు. అది విజయవంతమైందని తేలింది. ఇక్కడ కూడా దానిని అమలు చేయాలని నిర్ణయించారు. అప్పటికే అనంతగోపన్ పదవీకాలం ముగిసింది. తర్వాత వచ్చిన దేవస్థానం బోర్డు దీనిపై ఆసక్తి చూపకపోవడంతో అది అమలు కాలేదు.ఈ కారణంగా, గత 2 సంవత్సరాలుగా, నాణేలను లెక్కించడానికి ఖజానాలో తాత్కాలిక సిబ్బందిని నియమిస్తున్నారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో సన్నిధానంలోని ప్రతి డ్యూటీ పాయింట్ నుండి 10 మంది సిబ్బందిని ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు నాణేలను లెక్కించడానికి ఖజానాకు పంపాలని దేవస్వం కార్యనిర్వహణాధికారి ఆదేశించారు. -
బిచ్చగాడిలా బతికాడు, చనిపోయాక డబ్బు కట్టలు చూసి అందరూ షాక్!
బిచ్చగాళ్లు, వారి సంపద గురించి చాలానే విన్నాం. బిచ్చగాళ్లుగా కొనసాగుతున్నప్పటికీ, ఖరీదైన ఇళ్లలో జీవించే వారి గురించి గతంలో అనేక కథనాలు చూశాం. కానీ ఇదొక బిచ్చగాని విషాద గాథ. కేరళలోని అలప్పు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 50 ఏళ్ళ బెగ్గర్ వద్ద లభించిన నోట్ల కట్టలు చూసి అంతా అయ్యో అనుకున్నారు. ప్రస్తుతం ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది.ఆహారం కోసం కేరళలోని అలెప్పూ వీధుల్లో అడుక్కునే బిచ్చగాడి వద్ద విదేశీ కరెన్సీతో సహా ఏకంగా రూ.4.5 లక్షలకు పైగా నగదు లభ్యం కావడంతో స్థానికులు, అధికారులు ఆశ్చర్య పోయారు. ఈ నగదులో రద్దైన రూ.2,000 నోట్లు కూడా ఉండటం దిగ్భ్రాంతికి గురిచేసింది. చారుమూట్ , సమీప ప్రాంతాలలో ఇతను అందరికీ సుపరిచితుడే. సోమవారం సాయంత్రం స్కూటర్‌పై వెళ్తుండగా ఒక వాహనం ఢీకొనడంతో గాయపడ్డాడు. స్థానికులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రికార్డుల ప్రకారం అతను తనను తాను అనిల్ కిషోర్‌గా పరిచయం చేసుకుని, స్థానిక చిరునామా ఒకటి ఇచ్చాడు. తలకి తీవ్రమైన గాయాలయ్యాయని ప్రత్యేక చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. కానీ వారి మాటల్ని అతను పట్టించుకోలేదు. మంగళవారం ఉదయానికి, అతని మృతదేహం కడతిన్నల్ ప్రాంతంలోని ఒక దుకాణం వెలుపల కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపి, అతని సమీపంలో దొరికిన వస్తువులను పరిశీలించగా డబ్బుల విషయం వెలుగు చేసింది.డబ్బు కట్టలుఅతని దగ్గర ఉన్న డబ్బాను స్థానిక పంచాయతీ సభ్యుడి సమక్షంలో పోలీస్ స్టేషన్లో తెరిచి, అధికారులే ఆశ్చర్యపోయారు. దాని లోపల ప్లాస్టిక్ డబ్బాలలో నిల్వ చేసి, టేప్‌తో చుట్టబడిన డబ్బు కట్టలు ఉన్నాయి. మొత్తం నగదు రూ.4.5 లక్షలకు పైగా ఉంది. ఆ నోట్లలో రద్దు చేయబడిన రూ.2,000 నోట్లు ,సౌదీ రియాలు కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, వీడియో వైరల్అతను భిక్షాటనపైనే జీవించేవాడని, తరచుగా ఆహారం కొనడానికి చిన్న మొత్తంలో డబ్బు అడిగేవాడని స్థానికులు చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు, అదీ విదేశీ కరెన్సీ ఉంటుందని ఎవరూ ఊహించలేదన్నారు. ఏమీ లేని వ్యక్తిగా జీవించే వ్యక్తి దగ్గర ఇంత మొత్తం ఉండటం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసిందని ఒక పంచాయతీ సభ్యుడుపేర్కొన్నాడు.కాగా అతడు తమ బంధువు అనిచెప్పి, మృతదేహం లేదా డబ్బు కోసం ఇంతవరకూ ఎవరూరాలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో చట్ట ప్రకారం నగదును కోర్టుకు అప్పగిస్తారు. దర్యాప్తు అధికారులు ఇప్పుడు కిషోర్ నేపథ్యాన్ని ఆ డబ్బు అతనికి ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.ఇదీ చదవండి: పెద్ద కళ్ల తోటి.. ఎక్కడ చూసినా ఆమే.. ఎవరీమె? -
హీరో కాబోయి జీరో
అమ్మాయి ప్రేమ కోసం ‘యాక్సిడెంట్’ డ్రామా..ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలి.. తన దృష్టిలో హీరోగా నిలిచిపోవాలి.. ఇదీ ఒక యువకుడి పిచ్చి ఆలోచన. దీనికోసం అతను వేసిన ప్లాన్ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. రోడ్డుపై ఘోర ప్రమాదండిసెంబర్ 23వ తేదీ సాయంత్రం 5.30 గంటలు. కోచింగ్ క్లాస్ ముగించుకుని ఓ యువతి తన స్కూటర్‌పై ఇంటికి వెళ్తోంది. పతనంతిట్ట సమీపంలోని వళ ముట్టం ఈస్ట్ వద్దకు రాగానే, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు ఆమె స్కూటర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి ఆమె గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయింది. కారు ఆగకుండా మెరుపు వేగంతో వెళ్లిపోయింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను చూసి స్థానికులు భయబ్రాంతులయ్యారు.‘రక్షకుడు’ ఎంట్రీఏం చేయాలో తెలియక జనం తత్తరపడుతున్న సమయంలో.. అక్కడికి ఒక ఇన్నోవా కారు వచ్చి ఆగింది. అందులో నుంచి రంజిత్ రాజన్ అనే యువకుడు కంగారుగా దిగాడు. ‘నేను ఆమె భర్తను’.. అంటూ అందరినీ నమ్మించాడు. ఎంతో ఆవేదన నటిస్తూ ఆమెను హుటాహుటిన కొన్నీలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. అందరూ అతన్ని ‘దేవుడు పంపిన రక్షకుడు’ అని మెచ్చుకున్నారు.విస్తుపోయే నిజం!ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య తనిఖీల్లో.. ఆ యువతికి తీవ్ర గాయాలైనట్లు తేలింది. కుడి చేయి ఎముక పక్కకు జరగడం, వేలు విరగడంతో పాటు ఒళ్లంతా గాయాలయ్యాయి. మొదట ఇది సాధారణ హిట్ అండ్ రన్ కేసు అని పోలీసులు భావించారు. కానీ, విచారణ ముదిరే కొద్దీ పోలీసులకు అనుమానం కలిగింది. రంజిత్ మాటల్లో పొంతన లేకపోవడంతో లోతుగా ఆరా తీశారు. అప్పుడు బయటపడింది అసలు గుట్టు.పక్కా ప్రణాళికతో..ఆ ప్రమాదం అనుకోకుండా జరిగింది కాదు.. రంజిత్ పక్కాగా ప్లాన్ చేసి చేయించాడు.. అదెలా అంటే.. ‘యువతిని తన స్నేహితుడు అజాస్ కారుతో గుద్దిస్తాడు. వెంటనే తనే అక్కడికి చేరుకుని కాపాడినట్టు నటించాలి. యువతికి, ఆమె కుటుంబానికి తనపై విపరీతమైన ప్రేమ, కృతజ్ఞత కలిగేలా చేయాలి. మళ్లీ ఆమెను తన దారిలోకి తెచ్చుకోవాలి..’పారని సైకో ప్రేమికుడి పాచికప్రేమ పేరుతో ప్రాణాల మీదకు తెచ్చిన ఈ ‘సైకో’ ప్రేమికుడి పాచిక పారలేదు. పోలీసులు రంజిత్‌తో పాటు అతడికి సహకరించిన అజాస్ ను అరెస్ట్ చేశారు. సాధారణ యాక్సిడెంట్ కేసు కాస్తా ఇప్పుడు ‘హత్యాయత్నం’ కేసుగా మారింది. నకిలీ ‘ప్రేమల’ వెనుక దాగున్న ఇలాంటి క్రూరత్వాలపై అప్రమత్తంగా ఉండాల్సిందే..– సాక్షి, నేషనల్ డెస్క్ -
శబరిమలలో మరో చోరీ.. ఏకంగా రూ. 16 లక్షలు..
సాక్షి, పథనంతిట్ట: శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ జరుపుతుండగా మరో చోరీ వెలుగు చూసింది. ఈసారి ‘ఆదియ శిష్టం నెయ్యి’ (నెయ్యాభిషేకం నైవేద్యం నుంచి మిగిలిపోయిన నెయ్యి) అమ్మకంలో అక్రమాలు బయటపడ్డాయి. సాధారణంగా నెయ్యభిషేకానికి అవకాశం లేని యాత్రికులు ఈ ఆదియ శిష్టం నెయ్యిని కొనుగోలు చేస్తారు. దీనిని వంద మిల్లీలీటర్ల పౌచ్‌లలో విక్రయిస్తారు. దీని ధర ప్యాకెట్‌కు రూ. 100. దేవస్వం విజిలెన్స్ దర్యాప్తులో సుమారు రూ. 16 లక్షల విలువైన 16 వేల నెయ్యి ప్యాకెట్లు మాయమైనట్లు తేలింది. సాధారణంగా ఆలయ ప్రత్యేక అధికారి స్టాక్‌ని స్వీకరించి సంబంధిత కౌంటర్లకు అమ్మకానికి అప్పగిస్తారు. అయితే అందుకున్న ప్యాకెట్లకు చెల్లించాల్సిన మొత్తం దేవస్వం ఖాతాకు జమ అవ్వలేదని విజిలెన్స్ తనిఖీలో బయటపడింది. ప్రస్తుతం మండల సీజన్లో అమ్ముడైన నెయ్యి ప్యాకెట్లకు, వచ్చిన ఆదాయానికి మధ్య వ్యత్యాసం ఉండటంతోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిజానికి నెయ్యి పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి. దేవస్వం బోర్డు పరిధిలోని వివిధ దేవాలయాల పూజారులకు ఈ కౌంటర్లలో విధులు అప్పగిస్తారు. అయితే అమ్మకానికి జారీ చేసేవి, విక్రయం అయినవి, మిగిలిన స్టాక్ వంటి వివరాలు రిజస్టర్‌లో సరిగా నమోదు కాలేదన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. గతేడాది కూడా ఇలాంటి అవతవకలే జరిగాయన వెల్లడైంది. కానీ వాటిని తరుచుగా అకౌంటింగ్ లోపాలుగా తోసిపుచ్చుతుండటం గమనార్హం. ఈ నెయ్యి ప్యాకెట్ల పంపిణికి సంబంధించి సరైన రిజిస్టర్లు లేకపోవడంతోనే ఇలా తరుచుగా అవతవకలు జరుగుతున్నాయనే వాదనలు గట్టిగా వినిపిస్తునన్నాయి. ఓ పక్క విజిలెన్స్ దర్యాప్తు జరుపుతున్నప్పటికీ అధికారిక స్థాయిలో ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా పరిష్కరించుకునే యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, దేవస్వం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓజీ బిజు మాట్లాడుతూ..తమ దృష్టికి ఈ విషయం రాగానే విజిలెన్స్‌కు సమాచారం అందించాం. దయ చేసి నిజం బయటకు రానివ్వండి లేదంటే ఎవ్వరికి రక్షణ లేకుండా పోతుందని అన్నారు. (చదవండి: శబరిమలలో ఫుల్‌రష్..! దర్శనం కోసం బారులు తీరిన భక్త జనసంద్రం..) -
విష్ణు వినోద్ విధ్వంసకర సెంచరీ.. 14 సిక్స్‌లతో వీర విహారం! వీడియో
విజయ్ హాజారే ట్రోఫీ 2025-26లో కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ విష్ణు వినోద్ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం అహ్మదాబాద్ వేదికగా పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో వినోద్ విధ్వంసం సృష్టించాడు. 248 పరుగుల లక్ష్య చేధనలో ఆకాశమే హద్దు చెలరేగాడు. ఈ క్రమంలో అతడు కేవలం 63 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.32 ఏళ్ల విష్ణు వినోద్ సెంచరీ సాధించాక మరింత చెలరేగిపోయాడు. అతడిని ఆపడం ప్రత్యర్ధి బౌలర్ల తరం కాలేదు. ఓవరాల్‌గా 84 బంతులు ఎదుర్కొన్న వినోద్.. 13 ఫోర్లు, 14 సిక్స్‌లతో 162 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు బాబా అపరాజిత్(63) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా లక్ష్యాన్ని కేరళ రెండు వికెట్లు కోల్పోయి కేవలం 29 ఓవర్లలోనే చేధించింది.అంతకుముందు బ్యాటింగ్ చేసిన పుదుచ్చేరి 47.4 ఓవర్లలో 247 పరుగులకే కుప్పకూలింది. అజయ్ రోహరా(53), జశ్వంత్(57) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగితా ప్లేయర్లంతా విఫలమయ్యారు. కేరళ బౌలర్లలో నిదేష్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఈడెన్ యాపిల్ టామ్, అనికేత్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. అయితే కేరళ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మాత్రం విఫలమయ్యాడు.గైక్వాడ్ రికార్డు బ్రేక్..ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన వినోద్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక సిక్సులు బాదిన రెండో ప్లేయర్‌గా అతడు నిలిచాడు. ఈ దేశవాళీ వన్డే టోర్నీలో వినోద్ ఇప్పటివరకు 106 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు రుతురాజ్ గైక్వాడ్(105) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో గైక్వాడ్‌ను వినోద్ అధిగమించాడు. ఈ జాబితాలో కర్ణాటక ఆటగాడు మనీష్ పాండే(108) అగ్రస్ధానంలో ఉన్నాడు. విష్ణు వినోద్ ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నాడు.విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక సిక్సులు బాదిన ప్లేయర్లు వీరే..1 - మనీష్ పాండే: 99 ఇన్నింగ్స్‌లలో 108 సిక్సులు2 - విష్ణు వినోద్: 53 ఇన్నింగ్స్‌లలో 106 సిక్సులు3 - రుతురాజ్ గైక్వాడ్: 55 ఇన్నింగ్స్‌లలో 105 సిక్సులు4 - యూసుఫ్ పఠాన్: 56 ఇన్నింగ్స్‌లలో 91 సిక్సులు5 - ఇషాన్ కిషన్: 50 ఇన్నింగ్స్‌లలో 85 సిక్సులుచదవండి: బంగ్లాదేశ్ మరో సంచలన నిర్ణయం!💯 up in style as well 👌Vishnu Vinod brings up his century in just 63 balls 👏A brilliant attacking knock from the Kerala batter 🔥Scorecard ▶️ https://t.co/szHbOWqpZK#VijayHazareTrophy | @IDFCFIRSTBank pic.twitter.com/r18j0PEvMC— BCCI Domestic (@BCCIdomestic) January 6, 2026 -
రెండేళ్ల నిరీక్షణ.. రూ.24 లక్షలు గెల్చుకున్నాడు
దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. లాటరీలో ఒకటీ రెండూ కాదు ఏకంగా పాతిక లక్షల రూపాయలను గెల్చుకున్నాడు. గత రెండేళ్లుగా లాటరీ టికెట్లను కొనుగోలు చేస్తున్న 57 ఏళ్ల బషీర్‌ను ఎట్టకేలకు అదృష్టదేవతవరించింది.కేరళకు చెందిన బషీర్ కైపురత్ గత పాతికేళ్లుగా యూఏఈలో నివసిస్తున్నాడు. అతని వృత్తి డ్రైవర్. ఏదో ఒక రోజు ఫలితం దక్కకపోతుందా అనే ఆశతో ప్రతీ నెలా క్రమం తప్పకుండా బిగ్ టికెట్ టిక్కెట్లను కొనుగోలు చేయడం అతనికి అలవాటు. చివరికి రెండేళ్లకు పైగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అతని కల ఫలించింది. బిగ్ టికెట్ ఈ-డ్రాలో 276640 నంబర్ టిక్కెట్‌తో Dh100,000 (సుమారు రూ. 24 లక్షలు) గెలుచుకున్నాడు. చదవండి: అధికారులే షాక్ : పౌర్ణమి, గుప్త నిధులు, 8 నెలల బాలుడుఆసక్తికర విషయం ఏమిటంటే.. 'రెండు కొంటే మూడు ఉచితం అనే పరిమిత కాల ఆఫర్ కింద దీన్ని కొనుగోలు చేశాడు. ఈ నిర్ణయం అతని జీవితాన్ని మార్చేసింది. ఈ డ్రా గెల్చుకున్నట్టు ఫోన్ రాగానే తొలుత తాను అస్సలు నమ్మలేదని ఆ గెలుపును ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా అంటూ పట్టరాని సంతోషాన్ని ప్రకటించాడు. ఈ డబ్బులో కొంత భాగాన్ని భారతదేశంలోని తన కుటుంబానికి ఇవ్వాలని భావిస్తున్నాడు. ఓపిక, పట్టుదల తప్పకుండా గెలుస్తాయంటున్నాడు. అంతేకాదు భవిష్యత్తులో కూడా డ్రాలలో కూడా పాల్గొంటానని చెప్పాడు.ఇంతకు ముందు గుజరాత్‌కు చెందిన 52 ఏళ్ల కంప్యూటర్ టీచర్ రితేష్ ధనక్ సుమారు రూ. 25 లక్షలు గెలుచుకున్నాడు. గత 30 సంవత్సరాలుగా తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో నివసిస్తున్న రితేష్, దశాబ్దానికి పైగా క్రమం తప్పకుండా బిగ్ టిక్కెట్లను కొనుగోలు చేసే అలవాటున్న రితేష్ తన స్నేహితులతో కలిసి దీన్ని కొనుగోలు చేసి, గెల్చుకున్నాడు. ఇదీ చదవండి: గాయని చిత్ర అయ్యర్ సోదరి దుర్మరణం, ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌కాగా బిగ్ టికెట్ యూఏఈలోని అత్యంత ప్రజాదరణ పొందిన రాఫెల్ డ్రాలలో ఒకటి. ఇందులో గెలుపొందిన విజేతలు భారీ నగదు బహుమతులు, లగ్జరీ కార్లను దక్కించుకోవచ్చు. ఇది అబుదాబిలో ఉన్నప్పటికీ, దుబాయ్‌తో సహా దేశవ్యాప్తంగా ఇది ఆకర్షిస్తుంది. ఈ డ్రాలు నెలవారీగా జరుగుతాయి. 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు న్నవారు ఈ టిక్కెట్లను అధికారిక బిగ్ టికెట్ వెబ్సైట్ ద్వారా లేదా అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం, లేదా ఎంపిక చేసిన అధీకృత అవుట్లెట్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు. -
అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ‘మకరవిళక్కు’కు 900 బస్సులు
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధిలో అత్యంత వైభవంగా జరిగే ‘మకరవిళక్కు’ మహోత్సవానికి కేరళ ప్రభుత్వం భారీగా రవాణా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా పంబకు వచ్చే భక్తుల రాకపోకల కోసం 900 బస్సులను సిద్ధం చేసినట్లు రవాణా శాఖ మంత్రి కె.బి. గణేష్ కుమార్ వెల్లడించారు.శ్రీరామసాకేతం హాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి గణేష్ కుమార్ మాట్లాడుతూ, భక్తుల రద్దీని అనుసరించి డిమాండ్ పెరిగిన పక్షంలో మరో 100 బస్సులను అదనంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. బస్సు సర్వీసుల సంఖ్యను పెంచుతున్నందున పంబ హిల్‌టాప్ వద్ద అదనపు పార్కింగ్ వసతులను కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడాది శబరిమల యాత్ర సీజన్ ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ప్రశాంతంగొ కొనసాగుతున్నదని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా పంబలోని అయ్యప్ప భక్తులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (కేఎస్ఆర్టీసీ)అందిస్తున్న సేవల పట్ల భక్తులు పూర్తి సంతృప్తితో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎలాంటి రహదారి ప్రమాదాలు చోటుచేసుకోకపోవడం ఊరటనిచ్చే అంశమని గణేష్ కుమార్ అన్నారు. రవాణా శాఖ తీసుకున్న ముందస్తు జాగ్రత్తల కారణంగా రోడ్డు ప్రమాదాలను నివారించగలిగామని, భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రవాణా వ్యవస్థను పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వివరించారు.జనవరి 14న ‘మకరవిళక్కు’ శబరిమలలో మకరవిళక్కు వేడుకలు 2026, జనవరి 14న జరగనున్నాయి. ఈ సందర్భంగా మకర జ్యోతి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నదని, అందుకే అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సీజన్లో ఇప్పటికే 36 లక్షల మందికి పైగా భక్తులు శబరిమలను దర్శించుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. గత డిసెంబర్ 30న ఆలయాన్ని తిరిగి తెరిచినప్పటి నుండి భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్నదానం, తాగునీరు, వైద్య సదుపాయాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఇది కూడా చదవండి: ‘రెహమాన్ తప్పేంటి?’.. బీసీసీఐపై శశి థరూర్ నిప్పులు -
శబరిమలలో భక్తుల రద్దీ..! ఏకంగా పంబా నది వరకు..
బరిమల ఆలయంలో ప్రస్తుతం (జనవరి 2026 మొదటి వారంలో) మకరవిళక్కు తీర్థయాత్ర సందర్భంగా భక్తుల రద్దీ భారీగా ఉంది. లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తున్నారు, దీంతో నిర్వహణ సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ ద్వారా రోజుకు సుమారు 70,000 నుంచి 90,000 మందికి పైగా భక్తులను నియంత్రిస్తున్నారు. అయినప్పటికీ రద్దీ, వేచి ఉండే సమయం ఎక్కువగా ఉంది. మరోవైపు భక్తుల కిటకిటలతో శబరిమల (Sabarimala) కొండలు అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో దర్శన క్యూలైన్లు కిలోమీటర్ల మేర విస్తరించాయి. సన్నిధానం (ఆలయం) నుంచి మొదలైన క్యూలైన్లు కొండ కింద ఉన్న పంబా నది (Pamba River) వరకు చేరుకోవడం అక్కడి రద్దీ తీవ్రతకు అద్దం పడుతోంది. దేవస్వం బోర్డు కూడా ఈ రద్దీని నియంత్రించేందుకు అదనపు సిబ్బందిని నియమించి.. క్యూ కాంప్లెక్స్‌లలో విశ్రాంతి సౌకర్యాలను కల్పించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం అయ్యప్ప భక్తులకు స్వామి దర్శనానికి దాదాపు 12 గంటలకు పైగా సమయం పడుతోందని అధికారులు చెబుతున్నారు. కాగా ఇప్పటి వరకు సుమారు ఐదు లక్షల మందికిపైగా భక్తులు దర్శనం చేసుకున్నారు.(చదవండి: ఇవాళ నుంచే అయ్యప్ప స్వామి తిరువాభరణాల దర్శనం..!) -
సతీశన్‌పై సీబీఐ విచారణ జరిపించాలి
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌పై విజిలెన్స్ అండ్ యాంటీ–కరప్షన్ బ్యూరో (వీఏసీబీ).. సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. పునరావాస గృహనిర్మాణ ప్రాజెక్టు ‘పునర్జని’ నిధుల సేకరణలో అవకతవకలకు పాల్పడ్డారని, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ)ను ఆయన ఉల్లంఘించారని నివేదిక పేర్కొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు నివేదికను వీఏసీబీ అందజేసింది. సొంత నియోజకవర్గం ఉత్తరపరవూర్లో 2018 వరదల్లో ఇళ్లు కోల్పోయిన కుటుంబాల కోసం గృహనిర్మాణ ప్రాజెక్టు ‘పునర్జని’ పేరుతో సతీశన్ విదేశాల నుంచి నిధులు సేకరించారు. అయితే సతీశన్ వ్యక్తిగత పర్యటన కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ నిధులు సేకరించి, వాటిని కేరళలోని ఖాతాలకు బదిలీ చేశారని ఆరోపణలు వచ్చాయి. మనప్పట్ పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌కు విదేశాల నుంచి డబ్బు అందిందని, యూకేలోని వివిధ వ్యక్తుల నుంచి 22,500 పౌండ్లు వసూలు చేసినట్లు విజిలెన్స్ గుర్తించింది. భారత పౌరులు విదేశీ విరాళాలు స్వీకరించడాన్ని నిషేధించే ఎఫ్సీఆర్ఏ చట్టం–2010ని సతీశన్ ఉల్లంఘించారని వీఏసీబీ ఆరోపించింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని వీడీ సతీషన్ తెలిపారు. నాలుగైదేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసు నిలబడదని గ్రహించే విజిలెన్స్ వదిలేసిందన్నారు. తన చర్యలు వంద శాతం సరైనవని, అందుకు తగ్గ ఆధారాలున్నాయని, ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధమని సతీశన్ స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలోనే తనపై కేసు పెట్టారని, దాన్ని రాజకీయంగా, చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. -
Kerala: రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం
త్రిసూర్: కేరళలోని త్రిసూర్ రైల్వేస్టేషన్ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 200కి పైగా బైక్‌లు దగ్ధమయ్యాయి. స్టేషన్‌కు అనుకుని ఉన్న పెయిడ్-పార్కింగ్ ప్రదేశంలో ఇవాళ ఉదయం(ఆదివారం జనవరి 4) 6.45 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. కరెంట్ తీగ బైక్‌లపై తెగిపడడంతో మంటలు వ్యాపించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన ప్లాట్‌ఫాం నంబర్ 2 సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో జరిగింది.నిత్యం పార్కింగ్ షెడ్లో 500కిపైగా వాహనాలు పార్కింగ్ చేస్తారు. వాహనాల్లోని ఇంధనం కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో కొన్ని నిమిషాల్లోనే తీవ్ర నష్టం కలిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, సుమారు అరగంటలో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. తమ వాహనాలు బూడిదగా మారిన దృశ్యం చూసి యజమానులు షాక్‌కు గురయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు నిర్థారణ కాలేదు.Thrissur, Kerala: A massive fire broke out at Thrissur Railway Station. The blaze originated in the bike parking area near the station’s rear entrance, destroying several motorcycles. Preliminary reports indicate that more than 600 bikes were parked in the affected area pic.twitter.com/XQoSURUtUB— IANS (@ians_india) January 4, 2026ఈ ప్రమాదం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, ఇంధన లీక్, ఇతర కారణాల వల్ల జరిగిందా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, ఈ ఘటన రైలు సేవలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. గురువాయూర్ వైపు వెళ్లే ట్రాక్‌కు సమీపంలోనే పార్కింగ్ ప్రదేశం ఉన్నప్పటికీ, సమయానికి చర్యలు తీసుకోవడంతో రైల్వే మౌలిక వసతులకు మంటలు వ్యాపించలేదు. రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. -
సంజూ శాంసన్ సూపర్ సెంచరీ.. 312 టార్గెట్ హాంఫట్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో కేరళ మూడో విజయాన్ని అందుకుంది. శనివారం అహ్మదాబాద్ వేదికగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేరళ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. కుమార్ కుశాగ్ర (137 బంతుల్లో 143 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ శతకం సాధించాడు. అనుకూల్ రాయ్ (72 బంతుల్లో 72; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. నిధీశ్ 4, బాబా అపరాజిత్ 2 వికెట్లు తీశారు.రోహన్, సంజూ సెంచరీలుఅనంతరం 312 పరుగుల భారీ లక్ష్యాన్ని కేరళ కేవలం రెండే వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలోనే చేధించింది. కెప్టెన్ రోహన్ కున్నుమ్మాళ్ (78 బంతుల్లో 124; 8 ఫోర్లు, 11 సిక్స్‌లు), సంజూ సామ్సన్ (95 బంతుల్లో 101; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు)ల మెరుపు శతకాలు సాధించారు. సంజూ కాస్త ఆచితూచి ఆడినప్పటికి.. రోహన్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అహ్మదాబాద్ మైదానంలో అతడు సిక్సర్ల వర్షం కురిపించాడు. వీరిద్దరితో పాటు బాబా అపరాజిత్ (41 నాటౌట్; 1 ఫోర్), విష్ణు వినోద్ (40 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఇక సంజూ విషయానికి వస్తే.. టీ20 వరల్డ్‌కప్ సన్నాహకాలగా ఈ దేశవాళీ టోర్నీని ఉపయోగించుకుంటున్నాడు. టీ20 జట్టులో శుభ్‌మన్ గిల్ లేకపోవడంతో శాంసన్ ఓపెనర్‌గా మరోసారి బరిలోకి దిగనున్నాడు. శాంసన్‌కు ఇది నాలుగో లిస్ట్-ఎ సెంచరీ కావడం గమనార్హం.చదవండి: IPL 2026: వారు తొలిగిస్తే నేనేం చేయగలను? -
IND vs NZ: సెలక్షన్ రోజే విఫలమైన ఇషాన్ కిషన్!
స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆల్ ఫార్మాట్ సిరీస్‌లు ముగించుకున్న టీమిండియా.. తదుపరి సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో వన్డే, టీ20లు ఆడనుంది. జనవరి 11 - జనవరి 31 మధ్య భారత్- కివీస్ జట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే, ప్రపంచకప్-2026కు ఎంపిక చేసిన జట్టునే కివీస్‌తో టీ20 సిరీస్‌కూ ఫైనల్ చేసింది బీసీసీఐ.వన్డేల్లోనూ పునరాగమనం!అయితే, వన్డేలకు మాత్రం శనివారం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ ముహూర్తం ఖరారు చేసింది. అనూహ్య రీతిలో టీ20 ప్రపంచకప్‌తో టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన జార్ఖండ్ డైనమైట్.. వన్డేల్లోనూ పునరాగమనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వికెట్ కీపర్ కోటాలోని రిషభ్ పంత్ వరుస వైఫల్యాల(VHT) నేపథ్యంలో.. కేఎల్ రాహుల్‌కు బ్యాకప్‌గా ఇషాన్ రేసులోకి వచ్చాడు.ఈ నేపథ్యంలో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో.. శనివారం నాటి మ్యాచ్‌లో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ప్రదర్శన ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. కర్ణాటకతో మ్యాచ్‌లో 33 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తాజాగా కేరళతో మ్యాచ్‌లో మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.సెలక్షన్ రోజు విఫలంకివీస్తో వన్డేలకు భారత జట్టు సెలక్షన్ రోజు ఇషాన్ (Ishan Kishan).. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 21 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. జార్ఖండ్ తరఫున కెప్టెన్ ఇషాన్ విఫలం కాగా.. కుమార్ కుశాగ్రా అజేయ, భారీ శతకం (143)తో అదరగొట్టగా.. అనుకూల్ రాయ్ (72) కూడా ఆకట్టుకున్నాడు.వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా జార్ఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేయగలిగింది. కాగా ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఫెయిలైనా కివీస్‌తో వన్డేలకు అతడు ఎంపికయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాగా దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో ఇషాన్ కిషన్ ఇరగదీసిన విషయం తెలిసిందే.ఏకంగా ప్రపంచకప్ జట్టులోకిజార్ఖండ్ సారథిగా.. బ్యాటర్‌గా సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్.. జట్టుకు తొలి దేశీ టీ20 టైటిల్ అందించాడు. 500కు పైగా పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గానూ నిలిచాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి రిషభ్ పంత్‌ను కాకుండా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు. సంజూ శాంసన్‌కు బ్యాకప్ కీపర్, ఓపెనర్‌గా అతడు ఉపయోగపడతాడన్న ఆలోచనతో రీఎంట్రీ ఇచ్చే అవకాశం కల్పించారు. కాగా క్రమశిక్షణా రాహిత్యం కారణంగా రెండేళ్లకు పైగా ఇషాన్ టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. అయితే, తన అద్భుత ఆట తీరు, నైపుణ్యాలతో తిరిగి జట్టులో స్థానం సంపాదించాడు. చదవండి: శతక్కొట్టిన హార్దిక్ పాండ్యా.. కెరీర్లో ‘తొలి’ సెంచరీ! -
యువ దంపతుల విషాదం
ఒక్కోసారి అంతే. జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో అనుకోని విధంగా ఏదైనా జరిగితే జీవితం తలకిందులవుతుంది. అంతా చీకటి అవుతుంది. రేష్మ జీవితంలోనూ అలాగే జరిగింది. ఊహించని విధంగా భర్త చనిపోవడంతో ఆమె బాగా కుంగిపోయింది. తన భర్త మరణానికి కారణం తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో విరక్తితో తాను కూడా అర్థాంతరంగా తనువు చాలించింది. ఎవరీ రేష్మ, ఆమె కథేంటి?అసలేం జరిగింది?కేరళ (Kerala) వయనాడ్‌లోని కొలయాడి గ్రామానికి చెందిన 32 ఏళ్ల రేష్మ విషం తాగి బుధవారం (డిసెంబర్ 31) మరణించింది. 5 నెలల క్రితం ఆమె భర్త జినేష్ సుకుమారన్ (38) ఇజ్రాయెల్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయాడు. గత జూలైలో జెరూసలేంకు సమీపంలో ఉన్న మెవాస్సెరెట్ పట్టణంలోని ఓ అపార్ట్మెంట్లో ఉరేసుకుని చనిపోయినట్టు అక్కడి పోలీసులు గుర్తించారు. అక్కడే 80 ఏళ్ల వృద్ధురాలు కూడా కత్తి గాయాలతో చనిపోయి కనిపించింది. మంచాన పడిన ఆ మహిళ భర్తను చూసుకోవడానికి సంరక్షుడిగా జినేష్ ఉద్యోగం చేసేవాడు. కాగా, వృద్ధురాలిని చంపి అతడు ఆత్మహత్య చేసుకున్నాడన్న అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఆరోపణలను రేష్మ తోసిపుచ్చింది.వీడని మిస్టరీ..తన భర్త మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు రేష్మ శతవిధాలా ప్రయత్నించింది. జినేష్ మరణం వెనుకున్న మిస్టరీని ఛేదించాలని పలుమార్లు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయానికి వెళ్లి స్వయంగా విన్నవించుకుంది. ఈ కేసులో కోర్టు పరిధిలో ఉందని ఆమెకు సమాధానం వచ్చేది తప్పా ఎటువంటి పురోగతి లభించలేదు. జినేష్ అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని కనిపించగా, ఆ వృద్ధురాలు కత్తిపోట్ల గాయాలతో మరణించినట్టు మాత్రమే ఆమెకు రాయబార కార్యాలయం తెలిపింది. వయనాడ్‌కు తిరిగి వచ్చిన తర్వాత భారత ప్రభుత్వంతో పాటు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. నెలలు గడుస్తున్నా ఎటువంటి పురోగతి లేకపోవడంతో నిరాశతో రేష్మ బలవన్మరణానికి పాల్పడింది. తల్లితండ్రులు ఇద్దరూ చనిపోడంతో పదేళ్ల వారి కుమార్తె అనాథగా మిగిలింది.ఇజ్రాయెల్‌కు వెళ్లిన 2 నెలలకే.. ఊహించని విధంగా భర్త ప్రాణాలు కోల్పోవడంతో రేష్మ బాగా కుంగిపోయిందని కొలయాడి పంచాయతీ మాజీ సభ్యురాలు సుజా జేమ్స్ తెలిపారు. “జినేష్ మరణం తర్వాత రేష్మ తీవ్ర నిరాశకు గురైంది. వృద్ధురాలిని చంపిన తర్వాత తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె అస్సలు నమ్మలేదు. తన భర్త హత్య చేసేంత కర్కోఠకుడు కాదని ఆమె నమ్మకం. అసలేం జరిగిందో కనిపెట్టాలని అధికారులకు చాలా ఆమె ఈ-మెయిళ్లు పంపింది, కానీ ప్రయోజనం లేకపోయింది” అని మీడియాతో చెప్పారు.చదవండి: ఇండియా అబ్బాయి.. జపాన్ అమ్మాయి!ఇజ్రాయెల్‌కు వెళ్లడానికి ముందు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా జినేష్ పనిచేశాడని, గ్రాడ్యుయేట్ అయిన రేష్మ ఇంట్లోనే ఉండేదని సుజా జేమ్స్ తెలిపారు. కొలయాడిలో కట్టుకున్న ఇల్లు అప్పులు తీర్చడానికే జినేష్ ఇజ్రాయెల్‌కు వెళ్లినట్టు వెల్లడించారు. వీసా కోసం చాలా డబ్బులు ఖర్చు చేశాడని కూడా తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి రేష్మకు ఎటువంటి పరిహారం అందలేదు. జినేష్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా అక్కడి అధికారులు నమోదు చేశారు. జినేష్ ఇజ్రాయెల్‌కు వెళ్లి కేవలం రెండు నెలలు మాత్రమే అవడంతో ఎటువంటి పరిహారం దక్కలేదని వివరించారు. -
శబరిమల అప్డేట్.. 2,92,555 మంది అయ్యప్ప భక్తులు..
మకరవిలక్కు: కేరళలోని శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం(శుక్రవారం) వరకు 2,92,555 మంది అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం చేసుకున్నారు. జనవరి 14వ తేదీన మకరజ్యోతి దర్శనం ఉన్న నేపథ్యంలో భారీ సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరికి చేరుకునే అవకాశం ఉంది.శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎటుచూసినా భక్తజనులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. స్వామి అయ్యప్ప నామస్మరణతో శబరిమల ఆలయం భక్తి వాతావరణంతో నిండిపోయింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలి వెళ్తున్నారు.ఇక, డిసెంబర్ 30న మకరవిలక్కు తెరిచినప్పుడు 57,256 మంది భక్తులు అయ్యప్పను దర్శనం చేసుకున్నారు. అలాగే, జనవరి ఒకటో తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి జనవరి రెండో తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు 75,267 మంది భక్తులు ఆలయ దర్శనం చేసుకున్నారు. మొత్తంగా మకరవిలక్కు మహోత్సవ సందర్భంగా డిసెంబర్ 30న నుంచి నిన్న సాయంత్రం వరకు 2,92,555 మంది అయ్యప్ప భక్తులు ఆలయానికి విచ్చేశారు.మకరజ్యోతి దర్శనం.. ఇదిలా ఉండగా.. శబరిమలలో మకర జ్యోతి దర్శనం జనవరి 14, 2026 సాయంత్రం సుమారు 6:30 PM నుండి 6:55 PM (IST) మధ్య జరుగుతుందని అంచనా. ఈ సమయంలో భక్తులు పొన్నంబలమేడు వద్ద ఆకాశంలో కనిపించే దివ్యమైన జ్యోతిని దర్శిస్తారు. ఈ జ్యోతి అయ్యప్ప స్వామి ఆశీస్సులను సూచిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.ఆధ్యాత్మిక ప్రాముఖ్యతమకర జ్యోతి శబరిమల యాత్రలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక ఘట్టం. ఈ జ్యోతి అయ్యప్ప స్వామి దివ్య సాన్నిధ్యాం తోపాటు ఆధ్యాత్మిక శక్తిని, శాంతిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ సమయం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఈ సందర్భంగా భక్తులు కఠినమైన వ్రత దీక్షను పాటిస్తూ, 41 రోజుల పాటు నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని ఆరాధిస్తారు.ప్రధాన ఆకర్షణగా స్వామి తిరువాభరణ ఊరేగింపు..మకర జ్యోతి రోజున పందళం మహారాజుల మహల్ నుంచి మూడు పెట్టెల్లో పవిత్ర తిరువాభరణాలు శబరిమలకి తీసుకువస్తారు. ఆ రోజు సాయంత్రం అయ్యప్ప స్వామికి తిరువాభరణ అలంకారం చేస్తారు. అనతరం దీపారాధన నిర్వహిస్తారు. ఇక ఈ రోజు పొన్నంబలమేడులో మకర జ్యోతి మూడు సార్లు దర్శనం ఇస్తుంది.మకర జ్యోతి దర్శనం కనబడే ప్రదేశాలుసన్నిధానంపాండితావళంమాలికాపురం ప్రాంతం – అట్టతోడునీలిమలపుల్మేడుశరణ్ గుత్తిమరకూట్టంభక్తులకు సూచనలు..మకర జ్యోతి దర్శనం కోసం వెళ్లే భక్తులు ముందుగానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అలాగే భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని, అధికారుల సూచనలను పాటించాలి. చివరగా ఈ మకర జ్యోతి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం తోపాటు అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులను పొందే గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది.కొత్త ఏడాదిలో ఈ పవిత్ర క్షణాన్ని దర్శించేందుకు భక్తులంతా సిద్ధంగా ఉండాలి. కాగా, భక్తులకు జనవరి 19, 2026 రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అవకాశం ఉంటుంది. జనవరి 20, 2026 శబరిమల ఆలయాన్ని తిరిగి మూసివేస్తామని దేవస్వం బోర్డు పేర్కొంది. -
గురువాయూరప్ప స్వామికి ‘బంగారు’ నైవేద్యం
తిరువనంతపురం: నూతన సంవత్సరం శుభ సందర్భంగా కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లాలో ఉన్న గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలోని గురువాయూరప్పకు ఒక అద్భుతమైన బంగారు కిరీటాన్ని వినయపూర్వకమైన "వాజిపాడు"గా సమర్పించారు. 218 గ్రాముల (27 సార్వభౌములు) బరువున్న ఈ కిరీటాన్ని తిరువనంతపురంలోని వజుతచౌడ్కు చెందిన ఒక భక్తుడు సమర్పించారు.ఉచ్చ పూజ (మధ్యాహ్న ప్రార్థన) తర్వాత ఆలయాన్ని మూసివేయడానికి ముందు ఈరోజు పవిత్ర సమర్పణ జరిగింది. కొడిమారం (పవిత్ర స్తంభం) పాదాల వద్ద జరిగిన వేడుకలో దేవస్వం చైర్మన్ ఆలయం తరపున బంగారు కిరీటాన్ని భక్తిపూర్వకంగా స్వీకరించారు. -
ఇవాళ నుంచే అయ్యప్ప స్వామి తిరువాభరణాల దర్శనం..!
అయ్యప్ప స్వామి తిరువాభరణాల దర్శనం అంటే, మకర సంక్రాంతి రోజున శబరిమల అయ్యప్ప విగ్రహానికి పందళ మహారాజు పంపిన దివ్య స్వర్ణాభరణాలను అలంకరించి, ఆ అద్భుతమైన రూపంలో స్వామిని దర్శించుకోవడం. ఇది భక్తులకు అత్యంత పవిత్రమైన అనుభూతిని ఇస్తుంది. ఈ దర్శనం మకర జ్యోతి దర్శనానికి ముందు జరుగే తంతు. ఇక పందలం శ్రాంబికల్ కొట్టారంలోని తిరువాభరణ మాళిగ ఇవాల్టి (డిసెంబర్ 31) నుంచి భక్తుల దర్శనం కోసం తెరవబడుతుంది. ఈ రోజు(డిసెంబర్ 31) నుంచి జనవరి 11 వరకు ప్రతిరోజూ ఉదయం 5:30 నుండి రాత్రి 8:00 గంటల వరకు భక్తులు తిరువాభరణాలను దర్శించుకోవచ్చు. అలాగే జనవరి 12న తెల్లవారుజామున 4:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పందలం వలియ కోయిక్కల్ శ్రీ ధర్మశాస్త్ర క్షేత్రంలో తిరువాభరణాల దర్శనం ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం సరిగ్గా 1:00 గంటకు రాజప్రతినిధి నేతృత్వంలో తిరువాభరణాల పేటికలు శబరిమలకు పయనమవుతాయి. సాధారణంగా మండల కాలంలో (నవంబర్ నుంచి జనవరి వరకు) భక్తులు ఈ ఆభరణాలను దర్శించుకోవడానికి వీలు కల్పిస్తారు, ప్రత్యేకించి డిసెంబర్ 31 నుండి జనవరి 11 వరకు దర్శనం ఉంటుంది.పందలం శ్రాంబికల్ కొట్టారంలోని తిరువాభరణ మాళిగ అంటే..అయ్యప్ప స్వామి పవిత్ర ఆభరణాలు (Thiruvabharanam) భద్రపరిచే ప్రదేశం, దీని సంరక్షణ భాద్యత పందలం రాజకుటుంబం వారిది. ఆ ఆభరణాలు మకరజ్యోతి పండుగ సమయంలో శబరిమలకి ఊరేగింపుగా తీసుకెళ్లి..ఆ తర్వాత తిరిగి ఇక్కడికే వస్తాయి. ఈ మాళిగను మండలకాలంలో భక్తులు దర్శించుకోవచ్చు.(చదవండి: మండల పూజ సీజన్లో శబరిమల కొత్త ఆదాయ రికార్డు) -
శబరిమల బంగారం మాయం కేసు: మాజీ మంత్రి పాత్రపై విచారణ
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలో ఆరేళ్ల క్రితం వెలుగుచూసిన బంగారం అపహరణ కేసులో మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారించింది. ఈ కేసులో దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు పలువురు అరెస్ట్ కాగా, తాజాగా ఇది దేవస్థానం శాఖ మంత్రిగా పని చేసిన కడకంపల్లి సురేంద్రన్ వద్దకు చేరింది. గత శనివారం కడకంపల్లి సురేంద్రన్ను సిట్ బృందం విచారించింది. శబరిమల ఆలయానికి సంబంధించి తలుపులకు పూసి ఉన్న బంగారం మాయం కావడాన్ని ప్రధానంగా ప్రశ్నించింది. ఈ కేసులో ఆయన నేరుగా పాలు పంచుకున్నారనేందుకు ఎటువంటి ఆధారాలు లేకపోయినా, సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో సిట విచారణ చేపట్టింది. అయితే దేవస్థానం(దేవస్వం శాఖ) పాలసీ నిర్ణయాలు మాత్రమే తీసుకుంటుందని, బంగారం పూత తొలగించడం, చెన్నైలోని ప్రైవేట సంస్థకు పంపడం వంటి నిర్ణయాలు టీడీబీ(ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు) స్వతంత్రంగా తీసుకుంటుందన్నారు. కేసు వివరాలుశబరిమల ఆలయంలోని విగ్రహాలు, తలుపులపై ఉన్న బంగారు పూతలో కొంత భాగం కనిపించకుండా పోయింది.మాజీ దేవస్వం మంత్రి కడకంపల్లి సురేంద్రన్, మాజీ టీడీబీ అధ్యక్షులు ప్రశాంత్, పద్మకుమార్ తదితరులు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు SIT 10 మందిని అరెస్టు చేసింది, వీరిలో ఇద్దరు మాజీ టీడీబీ అధ్యక్షులు కూడా ఉన్నారు.ఈ కేసును విచారించేందుకు సిట్‌కు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. కొత్త సాక్ష్యాలు, సంబంధాలు వెలుగులోకి వస్తే మరిన్ని అరెస్టులు జరగవచ్చు.బంగారం కనిపించకుండా పోయిన ఈ ఘటన 2019లో జరిగింది. -
ఎన్నికల రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్..!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇటీవల నియమితులైన నితిన్ నబిన్ అప్పుడే కార్యరంగంలోకి దూకారు. వచ్చే ఏడాదిలో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సంసిద్ధం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రా పార్టీ ఇన్ఛార్జీలు, కీలక నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీని తిరిగి నిలబెట్టడం, బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ఓటు శాతాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘జాతీయ పార్టీ అయినా, స్థానికంగానే ఆలోచించాలి’అన్న విధానంతో రాష్ట్రానికో ప్రణాళిక రూపొందించే పనిలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మూడు రాష్ట్రాల్లో పట్టుకోసం.. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన నబిన్ ఐదు రాష్ట్రాల ఎన్నికలతో తొలి పరీక్ష ఎదుర్కోనున్నారు. ఇందులో ముఖ్యంగా గడిచిన దశాబ్ధాల కాలంగా అధికారం అందుకోలేకపోతున్న బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పాగా వేయడం అంత సులభమయ్యేది కాదు. దీనికి తోడు ఇప్పటికే రెండుమార్లు అధికారంలో ఉన్న అస్సాంలో పార్టీని తిరిగి నిలబెట్టడం కత్తిమీద సాములాంటిదే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను నబిన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రణాళికలు, భవిష్యత్ వ్యూహాలపై ఆయన ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శులు బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్, తరుణ్ ఛుగ్, వినోద్ తావ్డే, అరుణ్ సింగ్, దుష్యంత్ గౌతమ్ తదితరులతో చర్చించారు. ఈ సందర్భంగానే ప్రతి బూత్‌కు ఒక ఇన్‌ఛార్జి, ఒక డేటా వలంటీర్, ఒక సోషల్ మీడియా వలంటీర్లను సిధ్దం చేయాలనే సూచనలు వచ్చాయి. ‘ఎన్నికలను స్టేజ్ మీద కాదు..బూత్ వద్ద గెలుస్తాం’అన్న విధానాన్ని అవలంబిస్తూనే..యువత, మహిళలను క్రియాశీలకం చేయాలని నిర్ణయించారు. స్థానిక సామాజిక సమీకరణలపై సర్వేలు, ప్రాంతాల వారీగా అధికంగా ఉండే వర్గాల మ్యాపింగ్, చిన్నచిన్న సమావేశాలు, స్థానిక భాషల్లో పార్టీ కంటెంట్ ప్రచారం వంటి దృష్టి సారించాల్సిన అంశాలపై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటు అంశాన్ని నబిన్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్న బన్సల్ నుంచి నివేదిక కోరినట్లు సమాచారం. కాయస్థ కులస్థుడైన నబిన్ సామాజిక వర్గానికి చెందిన జనాభా పశి్చమ బెంగాల్లో గణనీయమైన రాజకీయ, సామాజిక ప్రభావాన్ని కలిగి ఉంది. కోల్‌కతా, అసన్సోల్, సిలిగురి వంటి నగరాల్లోని బిహారీ వలసదారుల జనాభా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం నుంచే తన తొలి రాష్ట్ర పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. జాతీయ భద్రత, జీవనోపాధి, శాంతిభద్రతలు, వలసలు వంటి అంశాలతో రాష్ట్రంలోకి చొచ్చుకెళ్లేలా, టీఎంసీకి బలమున్న చోట బీజేపీ ఓటు శాతం పెంచేలా, గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లతో పార్టీకి అనుబంధం పెంచేలా చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఇప్పటికే రోడ్‌మ్యాప్ ఖరారైనట్లు చెబుతున్నారు. సంక్రాంతి తర్వాత నబిన్ బెంగాల్ పర్యటన ఉంటుందని అంటున్నారు. ఇక తమిళనాడులో బలమైన ప్రాంతీయ పార్టీలతో కూటమి..స్థానిక భాష, సంస్కృతి మీద గౌరం చూపేలా ప్రచారం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలతో బూత్ స్థాయి వరకు పార్టీని చేర్చాలన్నది లక్ష్యంగా నిర్ణయించారు. జనవరి తొలి వారంలో నబిన్ ఇక్కడ పర్యటించేలా షెడ్యూల్ ఖరారైంది. ఇక కేరళలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పాగా వేయడాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని నబిన్ భావిస్తున్నారు. తిరువనంతపురం మున్సిపల్ మేయర్ పీఠాన్ని కైవసం అంశాన్ని భవిష్యత్ ఎన్నికలకు పునాదిగా మలుచుకోవాలని నిర్ణయించారు. తొలిసారి ఓటువేసే యువతకు తమ వైపు తిప్పుకోవడంతో పాటు..ఉద్యోగాలు, విద్య అంశాలపై ప్రచారం చేస్తూ ఓటు శాతాన్ని గణనీయంగా పెంచితే గెలుపు సాధ్యమన్నది నబిన్ ఆలోచనగా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక అస్సాంలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పనితీరును హైలెట్ చేయడం, స్థానిక నాయకులను అప్రమత్తం చేయడం, కాంగ్రెస్‌పై మరింత పదునుగా విమర్శలకు దిగేలా ఇప్పటికే రాష్ట్ర పర్యటన సందర్భంగా నేతలకు నబిన్ మార్గదర్శనం చేశారు. ఇప్పటికే పుదుచ్చేరిలోనూ పర్యటించిన నబిన్, పారీ్టకి ఉన్న బలాన్ని నిలుపుకునే అంశాలపై నేతలకు కీలక సూచనలు చేశారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీని నిలబెడుతూనే, కొరగరానికొయ్యగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే బలమైన పట్టుదలతో నబిన్ ముందుకెళ్తున్నారు. -
చలో కేరళ
కేరళ కాలింగ్ అంటున్నారట హీరో నాగార్జున. ఆయన కెరీర్‌లోని వందో సినిమా ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆల్రెడీ చిత్రీకరణ మొదలైంది.కాగా ఈ సినిమా కోసం ఓ షెడ్యూల్‌ని కేరళలో ప్లాన్ చేశారట మేకర్స్. ఇందుకోసం నాగార్జున త్వరలోనే కేరళ వెళ్తారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. జనవరి మొదటివారంలో కేరళ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందట. నాగార్జునపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని టాక్. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా 2026లో విడుదల అవుతుందని తెలిసింది. -
మకరజ్యోతి దర్శనం ఎప్పుడంటే..?
హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. ఈ పవిత్రమైన పండుగ రోజున అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలలో కనిపించే మకర జ్యోతి దర్శనం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ మకర జ్యోతిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి శబరిమలకు వస్తుంటారు. పవిత్రమైన మకర జ్యోతి దర్శనం అనేది అందరికీ కలిగే భాగ్యం కాదు.. ఎంతో పుణ్యం .. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే గానీ ఆ జ్యోతి దర్శన భాగ్యం కలుగదనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేగాదు అపురూప దృశ్యం కోసం గంటల కొద్దీ క్యూ లైన్లో వేచి ఉంటారు. అలాంటి పవిత్ర ఘడియ మకర జ్యోతి 2026లో ఎప్పుడంటే..శబరిమలలో మకర జ్యోతి దర్శనం జనవరి 14, 2026 సాయంత్రం సుమారు 6:30 PM నుండి 6:55 PM (IST) మధ్య జరుగుతుందని అంచనా. ఈ సమయంలో భక్తులు పొన్నంబలమేడు వద్ద ఆకాశంలో కనిపించే దివ్యమైన జ్యోతిని దర్శిస్తారు. ఈ జ్యోతి అయ్యప్ప స్వామి ఆశీస్సులను సూచిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.ఆధ్యాత్మిక ప్రాముఖ్యతమకర జ్యోతి శబరిమల యాత్రలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక ఘట్టం. ఈ జ్యోతి అయ్యప్ప స్వామి దివ్య సాన్నిధ్యాం తోపాటు ఆధ్యాత్మిక శక్తిని, శాంతిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ సమయం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఈ సందర్భంగా భక్తులు కఠినమైన వ్రత దీక్షను పాటిస్తూ, 41 రోజుల పాటు నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని ఆరాధిస్తారు.ప్రధాన ఆకర్షణగా స్వామి తిరువాభరణ ఊరేగింపు..మకర జ్యోతి రోజున పందళం మహారాజుల మహల్ నుంచి మూడు పెట్టెల్లో పవిత్ర తిరువాభరణాలు శబరిమలకి తీసుకువస్తారు. ఆ రోజు సాయంత్రం అయ్యప్ప స్వామికి తిరువాభరణ అలంకారం చేస్తారు. అనతరం దీపారాధన నిర్వహిస్తారు. ఇక ఈ రోజు పొన్నంబలమేడులో మకర జ్యోతి మూడు సార్లు దర్శనం ఇస్తుంది.మకర జ్యోతి దర్శనం కనబడే ప్రదేశాలుసన్నిధానంపాండితావళంమాలికాపురం ప్రాంతం – అట్టతోడునీలిమలపుల్మేడుశరణ్ గుత్తిమరకూట్టంభక్తులకు సూచనలు..మకర జ్యోతి దర్శనం కోసం వెళ్లే భక్తులు ముందుగానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అలాగే భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని, అధికారుల సూచనలను పాటించాలి. చివరగా ఈ మకర జ్యోతి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం తోపాటు అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులను పొందే గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. కొత్త ఏడాదిలో ఈ పవిత్ర క్షణాన్ని దర్శించేందుకు భక్తులంతా సిద్ధంగా ఉండాలి. కాగా, భక్తులకు జనవరి 19, 2026 రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అవకాశం ఉంటుంది. జనవరి 20, 2026 శబరిమల ఆలయాన్ని తిరిగి మూసివేస్తామని దేవస్వం బోర్డు పేర్కొంది.(చదవండి: శబరిమల మండల పూజ ఆదాయం రూ. 332 కోట్లు..!) -
శబరిమల మండల పూజ ఆదాయం రూ. 332 కోట్లు..!
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో 41 రోజుల పాటు కొనసాగిన మండల పూజ శనివారం భక్తిశ్రద్ధలతో విజయవంతంగా ముగిసింది. ఈ ఒక్కరోజే సుమారు 30.56 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని ట్రావేన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్ వెల్లడించారు. మండల పూజ సమయంలో ఆలయానికి మొత్తం రూ.332.77 కోట్ల ఆదాయం లభించిందని ఆయన తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.35.70 కోట్లు పెరగడం విశేషమన్నారు. మొత్తం ఆదాయంలో భక్తులు సమర్పించిన కానుకల రూపంలోనే రూ.83.17 కోట్లు వచ్చాయని, మిగిలిన ఆదాయం ప్రసాదాల విక్రయం, ఇతర వనరుల ద్వారా సమకూరినట్లు వివరించారు. కాగా, శనివారం రాత్రి 10 గంటలకు హరివరాసనం అనంతరం గుడిని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తెలిపింది. మకరవిళక్కు పండుగ కోసం ఈ నెల 30న సాయంత్రం 5 గంటలకు ఆలయం తిరిగి తెరుచుకోనుంది.(చదవండి: శబరిమలకు పోటెత్తిన భక్తులు) -
శబరిమలకు పోటెత్తిన భక్తులు
అయ్యప్పస్వామి మండల దీక్ష పూజకు సమయం సమీపిస్తున్న వేళ శబరిమలకు భక్తుల రద్దీ పెరుగుతుంది. మణికంఠ స్వామిని ఇప్పటివరకూ దర్శించుకున్న భక్తుల సంఖ్య 30 లక్షలు దాటినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. అయ్యప్పస్వామి అభరణాల ఊరేగింపు "తంగాఅంకి" సందర్భంగా నేడు ( శుక్రవారం) నుంచి పలు ఆంక్షలు విధించినట్లు అధికారులు ప్రకటించారు.అయ్యప్పస్వామి మండలి పూజ డిసెంబర్ 27న జరగనుంది. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధానానికి భక్తుల రద్దీ పెరిగింది. డిసెంబర్ 25, 2025 నాటికి స్వామివారిని 30,01,532 మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే గతేడాది ఈ సంఖ్య 32,49,756 గా ఉందని పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య కొద్దిమేర తగ్గినట్లు తెలిపారు.కాగా అయ్యప్పస్వామికి అభరణాల ఊరేగింపు ఉత్సవానికి అక్కడి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. కుంబజా, పలమారుర్ వంచిప్పాడి, పులిముక్కు, ఇలకొల్లూర్ తదితర ప్రాంతాలలో స్వామివారి అభరణాల ఊరేగింపు సందర్భంగా స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాగా రేపు శబరిమల అయ్యప్ప సన్నిధానంలో మండల పూజ ముగింపు కార్యక్రమం ఉంటుంది. -
పిల్ల కాల్వలతోనూ విద్యుత్తు.. కేరళ సర్కారు వినూత్న ఆలోచన
కరెంట్..! విద్యుదయస్కాంత తరంగాలను.. అదే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని కట్ చేస్తే కరెంటు ఉత్పత్తి అవుతుందని మనం చదువుకున్నాం. జలవిద్యుత్తు, థర్మల్ విద్యుత్తు, అణు విద్యుత్తు, సౌరవిద్యుత్తు గురించి మనకు తెలుసు. జల విద్యుదుత్పత్తికి నదులపై ఆనకట్టలు అవసరం. కానీ.. ఇవేమీ లేకుండానే కేరళ సర్కారు పిల్ల కాల్వలతో కూడా స్థానిక జనాభాకు సరిపడా విద్యుత్తును ఉత్పత్తి చేసే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పిల్లకాల్వలతో విద్యుత్తును ఎలా ఉత్పత్తి చేస్తారని అనుకుంటున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే.. చదివేయండి..కేరళ రాష్ట్రం.. భారత్‌లోనే సామ్యవాద భావజాలాలను మెండుగా కలిగి ఉన్న ప్రాంతం. అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం..! పేదరికానికి చరమగీతం పాడి.. ఐక్య రాజ్య సమితి మన్ననలు పొందిన రాష్ట్రం..! మహిళలకు నెలసరి సెలవులు.. సమానత్వ భావజాలంతో ముందుకు దూసుకుపోతున్న రాష్ట్రం..! సంక్షేమంలోనూ.. ముఖ్యంగా ప్రజలకు విద్య, వైద్యం అందడంలో కేరళను మించాలంటే.. ఇతర రాష్ట్రాలకు దాదాపుగా అసాధ్యమే..! అలాంటి కేరళ రాష్ట్రం విద్యుదుత్పత్తిలోనూ వినూత్నంగా ముందుకు వెళ్లింది. పిల్లకాల్వలపైనా జలవిద్యుత్తు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది.కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు కన్నిమారి వంతెన సమీపంలో ఉన్న ఓ చిన్న కాల్వపై ప్రయోగాత్మకంగా విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. ఈ చిన్న ప్రాజెక్టుతో స్థానికులకు నీటిసరఫరాతో పాటు.. విద్యుత్తు అందుతోంది. పౌరులకు నీరు-వెలుగులను అందించే ఈ పైలట్ ప్రాజెక్టు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. విద్యుదుత్పత్తికి ఉవ్వెత్తున ప్రవహించే భారీ జలపాతాల మాదిరి నీరు అవసరం లేదని ఈ ప్రాజెక్టు నిరూపించింది. పాలక్కాడ్ జిల్లా సరిహద్దు గ్రామం వండితవళం సమీపంలోని పట్టంచేరి పంచాయతీ ఈ ఘనతకు కేంద్ర బిందువైంది.ఒక కాల్వ ద్వారా 100 కుటుంబాలకు విద్యుత్తును అందించాలనే లక్ష్యంతో కేఎస్ఈబీ ఏడాది క్రితం ఈ ప్రాజెక్టును చేపట్టింది. అయితే.. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైనా.. కేంద్రం నుంచి దీనికి పూర్తిస్థాయిలో సాంకేతిక అనుమతులు రావాల్సి ఉంది. ఒకవేళ కేంద్రం పచ్చజెండా ఊపితే.. కేరళ వ్యాప్తంగా ఈ తరహా ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. మారుమూల ప్రాంతాల్లోనూ కరెంటు కొరత అనేది లేకుండా చేయడమే కేరళ సర్కారు ప్రధానోద్దేశం. నిజానికి కేరళలో వాతావరణం పూర్తి భిన్నంగా ఉంటుంది. కొండప్రాంతాలు ఎక్కువగా ఉండడం వల్ల.. సౌరవిద్యుత్తు సాధ్యం కాదు. దీంతో.. పిల్లకాల్వల ద్వారా విద్యుదుత్పత్తి అక్కడి మారుమూల ప్రాంతాలకు ఆశాజ్యోతిగా నిలుస్తోంది.పిల్ల కాల్వలపై విద్యుదుత్పత్తి ఎలా సాధ్యమవుతుంది? పెద్దపెద్ద హైడల్ పవర్ జనరేషన్ కేంద్రాల వద్ద ఉన్నట్లుగానే.. సూక్ష్మ వ్యవస్థలను పిల్లకాల్వలపై ఏర్పాటు చేశారు. అంటే.. పెద్ద ప్రాజెక్టుల వద్ద జనరేషన్ హౌస్ ఉన్నట్లే.. ఇక్కడ 10 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న చిన్న జనరేషన్ సెటప్‌ను ఏర్పాటు చేశారు. దాని నుంచి నేరుగా గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. పవర్ జనరేషన్ తర్వాత ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వంటివి సంప్రదాయ పద్ధతుల్లోనే కేఎస్ఈబీ చేపట్టింది.3.5 క్యూబిక్ మీటర్ల నీటి ప్రవాహం.. అంటే.. సెకనుకు 3,500 లీటర్ల మేర నీటి ప్రవాహం ఉంటే.. రోజుకు సమీపంలోని 100 కుటుంబాలకు సరిపడా జలవిద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని కేఎస్ఈబీ ఇంజనీర్లు చెబుతున్నారు. ఈ చర్య వల్ల మారుమూల ప్రాంతాల్లో స్థిరమైన వోల్టేజీతో నాణ్యమైన విద్యుత్తును అందజేయవచ్చంటున్నారు. పిల్లకాల్వల ద్వారా ఏడాదంతా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని వివరిస్తున్నారు.పైలట్ ప్రాజెక్టుకు అయిన వ్యయం కేవలం 23 లక్షల రూపాయలేనని పేర్కొంటున్నారు. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు కావడంతో.. నిత్యం ఇంజినీరింగ్ సాంకేతిక బృందం దీనిని పర్యవేక్షిస్తోందని చెబుతున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టుకు పర్యావరణ, సాంకేతిక అనుమతులు వస్తే.. కేరళలోని మిగతా ప్రాంతాల్లోనూ విద్యుత్తు ఉత్పత్తి వేగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు-మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ -
కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర
కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ రాష్ట్రంలో తొలిసారిగా మేయర్ పదవికి కైవసం చేసుకుంది. కేరళ రాజధాని తిరువనంతపురం మేయర్ పదవిని దక్కించుకుని కాషాయ పార్టీ నవ శకం ఆరంభించింది. బీజేపీకి చెందిన వివి రాజేష్ మేయర్‌గా ఎన్నికయ్యారు. తిరువనంతపురం నగర చరిత్రలో బీజేపీ పార్టీ అభ్యర్థి మేయర్ పదవిని అధిష్టించడం ఇదే మొదటిసారి. శుక్రవారం జరిగిన మేయర్ ఎన్నికల్లో రాజేష్‌కు 51 ఓట్లు వచ్చాయి. ఎల్డీఎఫ్ అభ్యర్థి ఆర్పీ శివాజీకి 29, యూడీఎఫ్‌కు చెందిన కేఎస్ సబరినాథన్‌కు 19 ఓట్లు వచ్చాయి. తిరువనంతపురం కార్పొరేషన్లో మొత్తం 101 వార్డులు ఉన్నాయి. తిరువనంతపురం నగర అభివృద్ధికి శక్తివంచన లేకుండా పాటుపడతానని మేయర్ రాజేష్ అన్నారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరినీ కలుపుకుని ముందుకు సాగుతానని, 101 వార్డులన్నింటినీ సమానంగా చూస్తామని చెప్పారు. కాగా, శుక్రవారం ఉదయం జరిగిన మేయర్ ఎన్నికల్లో 99 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్వతంత్ర కౌన్సిలర్ పి. రాధాకృష్ణన్ మద్దతు తెలపడంతో బీజేపీకి 51కి ఓట్లు వచ్చాయి. స్వతంత్ర కౌన్సిలర్ ఒకరు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.ఎవరీ రాజేష్?వృత్తిరీత్యా న్యాయవాది అయిన 50 ఏళ్ల రాజేష్ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. గతంలో తిరువనంతపురం జిల్లా అధ్యక్షుడిగా, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల జరిగిన తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో కొడుంగనూర్ వార్డు నుండి 515 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఆయన కౌన్సిలర్‌గా ఎన్నిక కావడం ఇది రెండోసారి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వట్టియూర్కావు నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ(ఎం)కి చెందిన వికె ప్రశాంత్ చేతిలో 21,515 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రశాంత్‌కు 61,111 ఓట్లు, రాజేష్‌కు 39,596 ఓట్లు వచ్చాయి. చదవండి: మమ్మల్ని జైల్లో పెట్టండి -
హీరో మహేశ్ నేర్చుకుంటున్న కలరిపయట్టుతో..ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!
వారణాసి’మూవీతో ప్రేక్షకుల ముందుకురానున్నారు హీరో మహేశ్ బాబు. ఆ మూవీ కోసం ప్రాచీన భారత యుద్ధ కళ కలరిపయట్టు (Kalarippayattu) నేర్చుకున్నారు. ఆయనకు శిక్షణ ఇచ్చిన ట్రైనర్ పెట్టిన పోస్ట్‌తో ఈ విషయం బయటకు వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేశ్‌బాబు ‘రుద్ర’ పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ పవర్ఫుల్ పాత్ర కోసం ఆయన కలరిపయట్టు నేర్చుకుంటున్నట్లు సమాచారం. ఇక కలరిపయట్టు ఇటీవల చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా ఎంతో ఇష్టంతో నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఫిట్నెస్ కోసం, మానసిక రుగ్మతల నుంచి బయటపడేందుకు దీన్ని నేర్చుకునేందుకు మక్కువ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలేంటి కలరియపట్టు యుద్ధ కళ? ఇది ఫిట్నెస్కి ఎలా ఉపకరిస్తుంది సవివరంగా తెలుకుందాం.!.ఇంతకముందు ఈ కలరిపయట్టుని సైనా నెహ్వాల్ బయోగ్రఫీలో కథానాయకిగా తన నటనతో మెప్పించి తెలుగువారి అభిమానాన్నీ పొందిన బాలీవుడ్ నటి పరిణితిచోప్రా కూడా నేర్చుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా వెల్లడించారు కూడా. దీన్ని సాధన చేస్తే..బాడీ ఎంతో యాక్టివ్‌గా ఉన్నట్లు ఉంటుందని చెప్పుకొచ్చారామె. కలరిపయట్టు అంటే.కళరిపయట్టు లేదా కళరి అనేది కేరళ రాష్ట్రంలో ఆవిర్భవించిన ఒక ద్రవిడ యుద్ధ క్రీడ. దీన్ని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ క్రీడగా అభివర్ణిస్తారు. దీన్ని కేరళ, తమిళనాడు, శ్రీలంక, మలేషియాలో ఉండే మలయాళీలు తప్పక ప్రదర్శిస్తారట. కలరిపయట్టు శిక్షణలోని వేగవంతమైన కదలికలు ప్రతిచర్యలు, కంటి-చేతి ఏకీకరణ వంటివి ప్రాథమిక మోటార్ నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. అంతేగాదు మన శరీరం, మనస్సును అప్రమత్తంగా, చురుకుగా ఉంచుతాయి.ఎలా శిక్షణ ఇస్తారంటే..కలరి'గా పిలిచే ఒక ప్రత్యేక శిక్షణా స్థలంలో ఈ యుద్ధ కళ నేర్పుతారు. పోటీ పడుతున్న ప్రత్యర్థి కలరి అభ్యాసకుడికి కొత్త పోరాట కదలికలను నేర్పిస్తుంటాడు. శిక్షణ పొందే వ్యక్తి ఈ కొత్త విధానాలను గుర్తించి, వాటికి అనుగుణంగా ప్రతిఘటించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సి ఉంటుంది. దీన్ని తమిళ రాజ్యాలతో యుద్ధాల చేసే సమయంలో మళయాళులు దీన్ని ఉపయోగించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాలు..కలరిపయట్టు శిక్షణలో బలం, ఓర్పు ప్రాముఖ్యతను నేర్పిస్తుంది. ఇది శరరీ ధృడ్వత్వాన్ని పెంచుతుంది. హృదయనాళ ఆరోగ్యం మెరుగుపడుతుంది : ఇందులో వుండే వేగవంతమైన ఏరోబిక్ కదలికలు, శక్తివంతమైన దాడులు హృదయ స్పందన రేటును పెంచుతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగ్గా ఉంటుందిప్రాథమిక మోటారు వ్యవస్థకు సంబంధించిన డిజార్డర్‌తో బాధపడేవారికి, నరాల సమస్యలతో బాధపడేవారికి కలరిపయట్టుని నిపుణుల సమక్షంలో తర్ఫీదు పొందితే మంచి ఫలితం ఉంటుందట. అలా పలువురి విషయంలో నిరూపితమైందట కూడా. అంతేగాదు ఈ ప్రాచీన యుద్ధ విద్య పనిలో ఏకాగ్రత, నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుందట. ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కలరియపట్టుని నేర్చుకుని..ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుదాం. View this post on Instagram A post shared by kalari Hyderabad (@a_martialarts_space) (చదవండి: పదేళ్లుగా బాధపడ్డ ఆ వ్యాధితో..!భారత్ ఆరోగ్య సంరక్షణపై ఎన్నారై ప్రశంసల జల్లు) -
‘కొట్టి చంపిన తర్వాతే అతని నిజాయితీ బయటపడింది’
తిరువనంతపురం: కేరళలోని పళక్కాడ్ జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. అనుమానం ఓ వలస కార్మికుడి ప్రాణం తీసింది. పనికోసం వచ్చిన రామనారాయణ్ భగేల్ దొంగతనం చేశాడని భావించి స్థానికులు కొట్టి చంపారు. కానీ ఆ తర్వాతే అతని నిజాయతి బయటపడింది. రామనారాయణ్ దొంగతనం చేయలేదని అమాయకుడని పోలీసులు నిర్ధారించారు.ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రామనారాయణ్ భగేల్ (31) అనే వలస కార్మికుడు. ఇటీవలే కేరళలోని వాలయార్ ప్రాంతానికి పని కోసం వచ్చాడు. ఒక దుకాణం నుంచి ఆహార ప్యాకెట్ దొంగిలించాడని అనుమానంతో స్థానికులు అతనిపై దాడి చేశారు.దాడిలో తీవ్రంగా గాయపడిన రామనారాయణ్‌ను ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న వాలయార్ పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో రామనారాయణ్ దొంగతనం చేయలేదని, అతని వద్ద ఏమీ దొరకలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసి, మరో పదిమందిని అదుపులోకి తీసుకున్నారు.రామనారాయణ్ ఛత్తీస్‌గఢ్‌లోని సక్తి జిల్లాకు చెందినవాడు. నిర్మాణ పనుల్లో రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, తల్లి అతని మీద ఆధారపడి జీవిస్తున్నారు. మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు. -
ఈ నెల 27న ఘనంగా మండల పూజ,హరివరాసనం..ఆలయం మూసివేత
శబరిమల (Shabarimala) అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 27న మండల పూజ అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన పూజారి కందరారు మోహనారు ప్రకటించారు. తిరిగి మకరవిళక్కు ఉత్సవం కోసం 30న సాయంత్రం 5 గంటలకు గుడిని తెరుస్తాం’ అని ఆలయ ప్రధాన పూజారి కందరారు మోహనారు తెలిపారు.మండల పూజ సమయాలు, జరిగే ఆచారాలు..మండల పూజ 27న ఉదయం 10:10AM నుండి 11:30AM వరకు జరిగే అవకాశముంది. 26న రాత్రి 6:30PM సమయంలో, పవిత్ర బంగారు వస్త్రాలు శబరిమలకి చేరుకుంటాయి. ఈ వస్త్రాలు స్వామి అలంకరణకు ఉపయోగిస్తారుఈ వస్త్రాలతో దీపారాధన నిర్వహిస్తారు. దీపారాధన తర్వాత స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఘనంగా హరివరాసనం, ఆలయ మూసివేతపూజ అనంతరం, 27న రాత్రి 11:00PMకి హరివరాసనం పూర్తి అవుతుంది. హరివరాసనం శబరిమలలో(Shabarimala) జరిగే మహత్తరమైన ఉత్సవాలలో ఒకటిగా పేర్కొంటారు. దీని అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు.ఆలయ కార్యక్రమాల సమగ్ర వివరాలు:పవిత్ర బంగారు వస్త్రాలు శబరిమలకు చేరవేత: 26న రాత్రి 6:30PM.దీపారాధన: 26న పూజ అనంతరం.మండల పూజ: 27న ఉదయం 10:10AM నుంచి 11:30AM.హరివరాసనం: 27న రాత్రి 11:00PM.ఆలయ మూసివేత: హరివరాసనం తర్వాత, 27న రాత్రి.మకరవిళక్కు ఉత్సవం: 30న సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరుస్తారుమండల పూజకు నెయ్యభిషేకం సమయాలుశబరిమల య్యప్ప సన్నిధానంలో మండల పూజా ఏర్పాట్లలో భాగంగా శబరిమల వద్ద నెయ్యభిషేకం సమయాలు పరిమితం చేశారు. పవిత్ర నైవేద్యం డిసెంబర్ 26న ఉదయం 10:30 గంటల వరకు ఉండగా, డిసెంబర్ 27న ఉదయం 9:30 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నారు.అందువల్ల నెయ్యభిషేకం ప్లాన్ చేసుకునే భక్తులు ముందుగానే చేరుకుని, తదనుగుణంగా దర్శనం చేసుకోవాలని సూచించారు. మండల పూజ సమయంలో ఆచారాలు సజావుగా జరిగేలా ఆలయ అధికారులతో సహకరించాలని కోరారు.(చదవండి: ఇవాళే ధంక అంగి ఊరేగింపు..! ఏడాదికి ఒక్కసారే..) -
ఏఐ గ్లాసులతో అనంత పద్మనాభస్వామి ఆలయంలోకి.. తరువాత ఏమైందంటే
తిరువనంతపురం: కేరళ తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయంలోకి సింగపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఏఐ సాంకేతికత కలిగిన గ్లాసులు ధరించి వచ్చారు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అతనిని అరెస్టు చేశారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా సాంకేతికత కలిగిన కలిగిన వస్తువులతో ఆలయంలోకి వచ్చినందుకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు శేషనాగుపై పడుకున్నరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి అధికారులు ఐదెంచెల భద్రత కల్పిస్తారు. డ్రోన్, స్మార్ట్ సెన్సార్లు వంటి ఆధునాతన పరికారలతో నిరంతంరం నిఘా నేత్రాలలో ఉంచుతారు. అయితే ఆలయంలోకి మెుబైల్స్, కెమెరాలు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడానికి అనుమతులు లేవు.ఈ నేపథ్యంలోనే ఏఐ మెటా సాంకేతికత కలిగిన గ్లాసులను ధరించి వచ్చిన విదేశీ భక్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆలయ నిబంధనలు తెలియక తాను గ్లాసులు ధరించానని ఆ భక్తుడు తెలిపినట్లు పేర్కొన్నారు. అనంతరం అతనిని కోర్టులో హాజరు కావాల్సిందిగా చెప్పి వదిలి వేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అరస్టైన వ్యక్తి పేరు తిరుపనీన్ అని ప్రస్తుతం ఆయన శ్రీలంక సంతతికి చెందిన వ్యక్తి కాగా ప్రస్తుతం సింగపూర్‌లో నివాసం ఉంటున్నారని తెలిపారు. -
శబరిమలలో ఫుడ్ సేఫ్టీ డ్రైవ్
కేరళ శబరిమల సన్నిధానం పర్యవేక్షణకు అధికారులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. సన్నిధానం పరిసరాల్లోని షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఫుడ్ కాంప్లెక్స్‌లు ఇతర వ్యాపార సముదాయాలలో అధికారులు సేఫ్టీ డ్రైవ్ చేపట్టారు. పరిశుభ్రత లేకపోవడంతో పాటు సరైన నిబంధనలు పాటించిన వ్యాపార సముదాయాలకు జరిమానా విధించారు. అయ్యప్ప సన్నిధాన పవిత్రతను కాపాడడానికి దేవస్థానం బోర్టు కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇది వరకే శబరిమలలో ప్లాస్టిక్ వాడకంపై పూర్తిగా నిషేదం విధించారు. ఈ నేపథ్యంలో శబరిమలలోని హోటళ్లు, ఫుడ్‌కోర్టులు, ఇతర వ్యాపార సముదాయాలలో అధికారులు సేప్టీ డ్రైవ్ చేపట్టారు. పరిశుభ్రత లేకుండా నిబంధనలకు అనుగుణంగా లేని వాటిపై దాదాపు రూ. 98 వేల జరిమానా విధించారు.భక్తులు రద్దీని దృష్టిని ఉంచుకొని అధిక ధరలకు వస్తువుల అమ్మడం, సరైన పరిశుభ్రత పాటించకపోవడం తదితర అంశాలను ఆరా తీశారు. ఆహార పదార్థల ధరలను పట్టికలో పొందుపర్చాలని వాటిని ఎట్టి పరిస్థితుల్లో అధిక ధరలకు అమ్మకూడదని తెలిపారు. చలి తీవ్రత దృష్ట్యా భక్తులకు కచ్చితంగా వేడినీటినే సరఫరా చేయాలని కూల్ వాటర్ ఇవ్వకూడదని తెలిపారు. అదే విధంగా దేవస్థానం ఉద్యోగస్థుల పేరుతో మోసం చేసే వారిపై నిఘా ఉంచాలని పేర్కొన్నారు. -
శబరిమల యాత్రికులకు సాంప్రదాయ కేరళ సద్య..!
అన్నదానం కార్యక్రమంలో భాగంగా , శబరిమల వద్ద అయ్యప్ప భక్తులకు సాంప్రదాయ కేరళ సద్య పంపిణీ ఈ నెల డిసెంబర్21 నుంచి ప్రారంభమైంది. దేవస్వం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ OG బిజు ఉత్సవ దీపం వెలిగించి , అయ్యప్ప స్వామికి సద్యను నివేదించి మరి సేవను ప్రారంభించారు.ఈ విందు కేరళ అసలైన రుచిని ప్రతిబింబిస్తుంది. ఇందులో పరిప్పు , సాంబార్ , రసం , అవియల్ , తోరన్ , ఊరగాయ , పప్పడం, పాయసం ఉంటాయి. వైవిధ్యం, తాజాదనాన్ని కాపాడుకోవడానికి , అవియల్, తోరన్లను ప్రతిరోజూ భిన్నంగా తయారు చేస్తారు. అయితే మోర్ , రసం లేదా పులిస్సేరిని ఒకరోజు విడిచి ఒకరోజు వడ్డిస్తారు. అలాగే ప్రతిరోజూ కొత్త రకం పాయసం కూడా అందిస్తారు.పర్యావరణ అనుకూల పద్ధతులకు అనుగుణంగా , స్టీల్ ప్లేట్లు, గ్లాసులను ఉపయోగించి ఆహారాన్ని వడ్డిస్తారు. ప్రతి మధ్యాహ్నం సుమారు 5 వేల మందికి పైగా యాత్రికులకు భోజనం అందిస్తారు. సాంప్రదాయ సద్య, పులావ్‌ను ప్రత్యామ్నాయ రోజులలో వడ్డిస్తారు.ప్రారంభ సాంకేతిక జాప్యాలను పరిష్కరించిన తర్వాత, అధికారులు ఇప్పుడు ఈ గొప్ప సేవను కొనసాగించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. కేరళ గొప్ప వంటకాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ సేవను ప్రారంభించారు. (చదవండి: చెత్తను కొనుగోలు చేసే తొలి గ్రామం..అందుకోసం ఏకంగా యాప్..!) -
సంజూ శాంసన్ కీలక నిర్ణయం
టీ20 వరల్డ్‌కప్-2026కు ఎంపికైన భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ-2025లో ఆడేందుకు శాంసన్ సిద్దమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ కోసం కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన జట్టులో సంజూకు చోటు దక్కింది.ఈ జట్టుకు యువ ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరపున రాణించిన స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ ఈ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. కేరళ జట్టులో ఎండీ నిదీష్, విష్ణు వినోద్, మహ్మద్ అజారుద్దీన్, వంటి అనుభవం ఉన్న ప్లేయర్లు ఉన్నారు. ఈ టోర్నీలో కేరళ జట్టు గ్రూపు-ఈలో ఉంది. ఈ గ్రూప్‌లో కేరళతో పాటు త్రిపుర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, పాండిచ్చేరి, తమిళనాడు జట్లు ఉన్నాయి.వన్డే జట్టులోకి వచ్చేందుకు..భారత టీ20 టీ20 జట్టులో తన స్ధానాన్ని పదిలం చేసుకున్న సంజూ శాంసన్.. ఇప్పుడు వన్డే జట్టులోకి కూడా రావాలని తహతహలాడుతున్నాడు. వాస్తవానికి సంజూకు వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటివరకు భారత్ తరపున 16 వన్డేలు ఆడి 56.67 సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ విజయ్ హజారే ట్రోఫీలో సంజూ రాణిస్తే, భారత వన్డే జట్టులోకి రీఎంట్రీకి మార్గం సుగమం అవుతుంది. కాగా ఈ ఏడాది దేశవాళీ వన్డే టోర్నీలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆడనున్నారు.విజయ్ హజారే ట్రోఫీకి కేరళ జట్టు:రోహన్ కున్నుమ్మల్ (కెప్టెన్), సంజు శాంసన్, విష్ణు వినోద్ (వికెట్ కీపర్), మహమ్మద్ అజహరుద్దీన్ (వికెట్ కీపర్), అహమ్మద్ ఇమ్రాన్, సల్మాన్ నిజార్, అభిషేక్ జె. నాయర్, కృష్ణ ప్రసాద్, అఖిల్ స్కారియా, అభిజిత్ ప్రవీణ్ వి, బిజు నారాయణన్, అంకిత్ శర్మ, బాబా అపరాజిత్, విఘ్నేష్ పుత్తూర్, నిదీష్ ఎండి, ఆసిఫ్ కెఎమ్, అభిషేక్ పి. నాయర్, షరాఫుద్దీన్ ఎన్ఎమ్, ఎడెన్ ఆపిల్ టామ్.చదవండి: 'అతడి రీ ఎంట్రీ చాలా సంతోషంగా ఉంది' -
శబరిమల: ఎయిర్‌పోర్టు పనులకు ముందడుగు
కేరళ, ఎరుమేలిలో కేంద్రం నిర్మించబోయే శబరిమల గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు పనులలో ముందడుగు పడింది. విమానాశ్రయ నిర్మాణానికి భూసేకరణ, పరిహార అంచనా తదితర పనులను సంబంధిత రెవెన్యూశాఖ ప్రారంభించింది. రెవిన్యూ అధికారులు స్థలసేకరణ, భవనాలు, చెట్లు తదితర పరిహారానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.ఏటా అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి దేశవ్యాప్తంగా భక్తులు పెద్దఎత్తున కేరళకు వస్తుంటారు. అయితే భక్తుల సౌకర్యం దృష్ట్యా స్వామివారి దర్శనానికి భక్తులకు దగ్గరగా ఉండే విధంగా ఎరుమలిలో ఎయిర్‌ఫోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. తాజాగా అధికారులు దానికి సంబంధించి స్థల సేకరణ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం చెరువల్లి ఎస్టేట్‌లో భూమిసేకరణలో భాగంగా చెట్లు, భవనాల విలువని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో మెుత్తం 916.27 హెక్టార్లు భూమి సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు. అందులో 121.876 హెక్టార్లు స్థలంలో భవనాలు, నిర్మాణాలు ఉన్నాయని గుర్తించారు. వాటి విలువ సేకరించిన అనంతరం పరిహారం నిర్ణయించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కేరళలో కేంద్రం ప్రతిపాదించిన శబరిమల గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 2025 జూలైలో ఆమోదం తెలిపింది. దీని అంచనా వ్యయం రూ.7,047 కోట్లు కాగా నిర్మాణం కోసం ఎరుమెలి,చెరువల్లి ఎస్టేట్లలో 2,570 ఎకరాల భూమి అవసరం కానుంది. ఈ మేరకు అధికారులు భూమి సేకరణ పనులు ప్రారంభించారు. -
శబరిమలకు ఆధునిక సాంకేతికత.!
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించేలా శబరిమలలో సాంకేతిక మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయనున్నారు. యాత్రికులు నీలక్కల్‌కు చేరుకున్నప్పటి నుండి వారు తిరిగి వచ్చే సమయం, సన్నిధానంలో అభిషేకం, ప్రసాదాలు , బుకింగ్ గదులు వరకు అన్ని ఏర్పాట్లను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా ఈ సమగ్ర ప్రణాళిక. ప్రస్తుతం, వర్చువల్ క్యూలు మరియు ప్రసాదాల బుకింగ్ మాత్రమే ఆన్లైన్ వ్యవస్థ ద్వారా జరుగుతాయి. సాంకేతిక వ్యవస్థలు ఏయే ప్రాంతాల్లో అవసరమో, వాటిని ఏ విధంగా అమలు చేయాలో తెలుసుకోవడానికి RFPని సిద్ధం చేయనున్నారు. విప్రో, ఇన్ఫోసిస్ వంటి సంస్థల సహాయంతో దీనిని తయారు చేస్తారు. దీంతోపాటు దేవస్వం బోర్డు అన్ని కార్యాలయాలను డిజిటల్‌గా మార్చనున్నారు. కాగా, శబరిమల వద్ద రద్దీని నియంత్రించడానికి శాస్త్రీయ చర్యలు తీసుకోవాలని, తదుపరి తీర్థయాత్ర నిమిత్తం మౌలిక సదుపాయాలు, జనసమూహ నిర్వహణ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అధ్యక్షుడు కె. జయకుమార్ అధ్యక్షతన జరిగిన దేవస్వం బోర్డు సమావేశం తదనంతరం ఈ సాంకేతిక మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.(చదవండి: శబరిమలకు రికార్డు స్థాయిలో ఆదాయం) -
శబరిమల బంగారం చోరీ కేసులో పురోగతి
శబరిమల బంగారం చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కొంత పురోగతి సాధించింది. ఈమేరకు ఒక ప్రవాస వ్యాపారి వాంగ్మూలాన్ని నమోదు చేయగలిగింది. నిన్న సాయంత్రం బుధవారం(డిసెంబర్ 18) పండలం స్థానికుడైన ప్రవాస వ్యాపారి నుంచి వివరణాత్మక వాంగ్మూలం సేకరించింది సిట్ బృందం. ఆ తర్వాత ఆ సమాచారాన్ని ప్రవాస దర్యాప్తు బృందంతో పంచుకున్నారు. దాంతోపాటు కొంతమంది వ్యక్తుల నంబర్లను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వాంగ్మూలం ఆధారంగా SIT తదుపరి దర్యాప్తుకు సిద్ధమవుతోంది.ఇటీవల, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితల శబరిమల బంగారు దోపిడీ వెనుక అంతర్జాతీయ పురాతన వస్తువుల స్మగ్లింగ్ ముఠా ఉందని తనకు సమాచారం అందిందని ఆరోపణలు, ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆయన ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడిగా ఉన్న దుబాయ్ వ్యాపారవేత్త నుంచి సిట్ గతంలో వాంగ్మూలం నమోదు చేసింది కూడా. దోపిడీలో పాల్గొన్న ఒకరితో తనకున్న వ్యక్తిగత అనుభవాల గురించి ఆ వ్యాపారవేత్త చెప్పాడు కానీ అందుకు సంబంధించి.. ఎటువంటి పత్రాలను ఇంతవరకు అతడు సమర్పించలేదు.ఇదిలా ఉండగా, డిసెంబర్ 6న రమేష్ చెన్నితల సిట్‌కి లేఖ రాస్తూ, బంగారు దోపిడీలో పురాతన వస్తువుల స్మగ్లింగ్ ముఠాకు ఉన్న సంబంధాన్ని దర్యాప్తు చేయాలని, రూ.500 కోట్ల లావాదేవీ జరిగిందని పేర్కొన్నారు. అలాగే ఆయన సిట్ ముందు హాజరై తన వాంగ్మూలం కూడా ఇచ్చారు. శబరిమల బంగారు దోపిడీలో రాష్ట్రంలోని కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారని చెన్నితల లేఖలో ఆరోపించారు. అలాగే ఆయన ఆ లేఖలో ఇలా వివరించారు.'పురాతన వస్తువులను దొంగిలించి బ్లాక్ మార్కెట్లో విక్రయించే ముఠాల గురించి ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తి నాకు తెలుసు. అతను ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలను వెల్లడించడానికి సిద్ధంగా లేడు. కానీ అతను దర్యాప్తు బృందం, కోర్టు ముందు వచ్చి తన వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. స్వతంత్రంగా దర్యాప్తు చేసిన తర్వాత నేను అలాంటి మాటలు చెబుతున్నాను. రాష్ట్రంలోని కొంతమంది పారిశ్రామికవేత్తలకు, ఈ ముఠా రాకెట్లకు బంగారు దొంగతనంతో సంబంధం ఉంది. దేవస్వం బోర్డులోని కొంతమంది ఉన్నత స్థాయి అధికారులకు ఈ రాకెట్‌తో సత్సంబంధాలు ఉన్నాయా లేదా అనేదానిపై దర్యాప్తు చేయాలి. అలాగే పురావస్తు సమూహాలను కూడా దర్యాపు పరిధిలోకి తీసుకురావాలి' అని రమేష్ చెన్నితల లేఖలో డిమాండ్ చేశారు.(చదవండి: శబరిమల: అటవీ మార్గంలో వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక పాస్‌లు) -
శబరిమల: అటవీ మార్గంలో వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక పాస్‌లు
పతనంతిట్ట: ఎరుమేలి మీదుగా సాంప్రదాయ (పెద్దపాదం) అటవీ మార్గం గుండా శబరిమల పుణ్యక్షేత్రానికి చేరుకునే భక్తులకు రేపటి నుంచి(డిసెంబర్ 18, గురువారం) ప్రత్యేక పాస్‌లను అటవీ శాఖ అందించనుంది. ముకుళి వద్ద ఈ పాస్‌ల పంపిణీ చేయనున్నారు.ప్రత్యేక పాస్‌లు పంపిణీ చేయాలని భక్తులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సన్నిధానం చేరుకోవడానికి 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడిచిన భక్తులు.. గంటలు తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. ప్రత్యేక పాస్ ప్రవేశపెట్టడంతో భక్తుల ఇబ్బందులు తొలగనున్నాయి.అటవీ మార్గం ద్వారా వచ్చే భక్తులను మరకూట్టం నుంచి చంద్రనందన్ రోడ్డు, నడపండల్ ద్వారా ప్రత్యేక క్యూలలో పంపిస్తారు. తద్వారా వారు నేరుగా 18 పవిత్ర మెట్లను ఎక్కడానికి అనుమతిస్తారు. ఈ వ్యవస్థ రేపటి నుండి సన్నిధానంలో అమల్లోకి వస్తుంది. -
పుస్తకాల మధ్య ప్రాణవాయువు.. ‘అతుల్’ కష్టం ఎవరికీ వద్దు!
చెట్టికులంగర: ఆ ఆరోతరగతి పిల్లాడి స్కూల్ బ్యాగులో పుస్తకాల కంటే ప్రాణాన్ని నిలబెట్టే పరికరాలే ఎక్కువ.. కేరళలోని చెట్టికులంగరకు చెందిన పసివాడు అతుల్ కథ వింటే ఎవరికైనా కన్నీరు రాకమానదు. తోటి పిల్లలంతా ఆటపాటల్లో మునిగిపోతుంటే, అతుల్ మాత్రం తన రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించే గ్లూకోమీటర్, ప్రాణాలను నిలబెట్టే ఇన్సులిన్ సిరంజితో నిత్యం యుద్ధం చేస్తున్నాడు. ఇంత చిన్న వయసులోనే రోజుకు మూడుసార్లు సూది నొప్పిని భరిస్తూ, తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న ఈ బాలుడి జీవన పోరాటం అత్యంత హృదయవిదారకం.తీవ్రమైన దాహం, వివరించలేనంత అలసట, అకస్మాత్తుగా తగ్గిపోతున్న బరువు.. అతుల్ శరీరంలో వచ్చిన ఈ మార్పులు అతని తల్లిదండ్రులను విపరీతంగా కలవరపెట్టాయి. పరీక్షల అనంతరం అతుల్‌కు ‘టైప్ 1 డయాబెటిస్’ ఉందని తేలడంతో వారి ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలింది. అతుల్ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి జరగడం లేదని..అతను బతకాలంటే బయటి నుండి ఇన్సులిన్ తీసుకోవడమే ఏకైక మార్గమని వైద్యులు చెప్పారు. ఈ మాటవినగానే బాలుని తల్లిదండ్రుల గుండె ముక్కలైంది. నాటి అతుల్ బాల్యం ఇంజెక్షన్లు, రక్తపరీక్షల మధ్యే నలుగుతోంది.అతుల్ తండ్రి ఒక వెల్డర్. రోజువారీ సంపాదనతోనే ఇల్లు గడవడం కష్టంగా ఉన్న తరుణంలో, అతుల్ మందుల ఖర్చు నెలకు రూ. ఐదు వేలకుపైగానే అవుతోంది. ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ, కొడుకు ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ తండ్రి పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో పేరు నమోదు చేసుకున్నప్పటికీ, నేటికీ ఆ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. పథకాలు కాగితాలకే పరిమితమైతే, పేదవాడి ప్రాణం గాలిలో దీపంలా మారుతుందనడానికి అతుల్ పరిస్థితే నిదర్శనం.ఇన్ని కష్టాలు ఉన్నా అతుల్ చదువుపై మక్కువను వదులుకోలేదు. స్కూల్ ఆఫీసు రూమ్‌లో భోజన సమయంలో ఇన్సులిన్ తీసుకుంటూ, తన దినచర్యను అత్యంత బాధ్యతగా నిర్వహిస్తున్నాడు. తన స్నేహితులు చాక్లెట్లు, స్వీట్లు తింటుంటే, అతుల్ మాత్రం కఠినమైన ఆహార నియమాలను తప్పకుండా పాటిస్తున్నాడు. ఈ చిన్నారి ధైర్యం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ పసివాడు తాను త్వరలోనే కోలుకుంటానని ఆశపడుతున్నాడు. ఇది కూడా చదవండి: లోక్‌సభలో ‘ప్రియాంకం’.. అన్న లేని లోటు తీరుస్తూ.. -
'అందరికీ ఫిర్యాదురహిత, సౌకర్యవంతమైన దర్శనం'
సాక్షి శబరిమల: "అందరికి ఫిర్యాదురహిత సౌకర్యవంతమైన దర్శనం" అనే పోలీసుల విజన్‌ని అమలు అయ్యేలా చేశామని కేరళ ఏడీజీపీ శ్రీజిత్ అన్నారు. శబరిమల యాత్ర ప్రారంభమైన 28 రోజుల తర్వాత గత ఏడాది కంటే సుమారు 4.5 లక్షల మందికి పైగా ఎక్కువ మంది యాత్రికులు దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. సింపుల్‌గా చెప్పాలంటే సగటున రోజుకి దాదాపు 80 వేల మందికి పైగా వచ్చారని అన్నారు. గత సోమవారం అత్యధిక సంఖ్యలో ఏకంగా ఒక లక్ష మందికి పైగా యాత్రికలు దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. నవంబర్ 24న కూడా ఇలా భక్తుల సంఖ్య లక్ష దాటిందని గుర్తు చేశారు.ఇదంతా అయ్యప్ప మహిమే..దర్శనం చేసుకున్న యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తులెవ్వరూ దర్శనం కోసం ఎక్కువసేపు వేచి ఉండటం లేదా ఫిర్యాదు చేయడం వంటివి చేయలేదని అన్నారు. ఇదంతా అయ్యప్ప స్వామి దయ వల్లనే అని చెప్పారు. నిజానికి అధికారులెవ్వరూ యాత్రికులెవరిని ఆపరు, ఇబ్బంది పెట్టరని, కూడా చెప్పారు. భక్తులను పర్వతం ఎక్కడానికి అవకాశం ఇస్తే..భక్తలు ఎవరూ వేచి ఉండాల్సి అవసరం ఏర్పడదు, అలాగే వాళ్లు నేరుగా పుణ్యక్షేత్రానికి చేరుకుని 18వ మెట్టు ఎక్కి ఆ హరిహరసుతుడిని ఎలాంటి ఫిర్యాదుల లేకుండా సౌకర్యవంతంగా దర్శనం చేసుకోగలుగుతారని అన్నారు..అదెలా సాధ్యమన్నది అతుపట్టడం లేదు..కాగా మకరవిళక్కు వరకు ప్రతిరోజూ వర్చువల్ క్యూ బుకింగ్‌లు పూర్తయ్యాయని చెప్పారు. అలాగే ప్రతిరోజూ వర్చువల్ క్యూ ద్వారా దర్శనం చేసుకుంటున్నారని అన్నారు. ఈసారి ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే శనివారం ఆదివారం రద్దీ తక్కువగా ఉంటుందని, బదులుగా, సోమవారం, మంగళవారం రద్దీ ఎక్కువయ్యిందని చెప్పారు. చెప్పాలంటే బుధవారం మధ్యాహ్నం నాటికి రద్దీ తగ్గుముఖం పడుతోందని అన్నారు. విచిత్రం ఏంటంటే చాలా బుకింగ్‌లు ఉన్నప్పటికీ అలా ఎలా స్వామి కైంకర్యాలకు ఆటంకం లేకుండా, అటు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సవ్యంగా జరిగిపోతోందో మాకు కూడా తెలియడం లేదని ఆనందంగా చెప్పుకొచ్చారు. అయితే తామే ఎక్కడకక్కడ పోలీసులతో మోహరించి భక్తులెవ్వరూ దర్శనం కోసం వేచి ఉండకుండా పకడ్బందీగా చేయగలిగినన్నీ ఏర్పాట్లు చేశామని కూడా చెప్పారు. స్పాట్ బుకింగ్ పెంపు ఎప్పుడంటే..సన్నిధానం వద్ద జనసమూహం ఎక్కువగా లేనప్పుడు, పోలీసు ప్రత్యేక అధికారి, ప్రత్యేక కమిషనర్, దేవస్వం కార్యనిర్వాహక అధికారులను సంప్రదించి స్పాట్ బుకింగ్ పెంచుతామని అన్నారు. జనసమూహం తక్కువగా ఉన్న రోజుల్లో, 10 వేలకు పైనే స్పాట్ బుకింగ్‌లు ఇస్తామని అన్నారు. అయితే యాత్ర మూడోరోజున యాత్రికులు ఎందుకు ఇబ్బంది పడ్డారో కూడా వివరించారు.ఆ రోజు యాత్రికులు క్యూలో ఉన్నప్పుడు షెడ్ స్థంభం దెబ్బతినడంతో దాన్ని తొలగించడంతో కాస్త సమస్యలు రావడంతోనే భక్తులు ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. సాధ్యమైనంతవరకుఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు కేరళ పోలీసు అత్యున్నతాధికారి శ్రీజిత్.(చదవండి: ఆ హరిహరసుతుడి అరవణ ప్రసాదం డబ్బాల కొరత..) -
సంచలన విజయం.. ఎవరీ శ్రీలేఖ?
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. ఒంటరిగా పోటీ చేసి విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 101 వార్డులకు జరగిన ఎన్నికల్లో 50 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో తిరువనంతపురం మేయర్ పీఠం తొలిసారిగా కాషాయ పార్టీకి దక్కింది. అయితే మేయర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మేయర్ రేసులో సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారి ఆర్. శ్రీలేఖ (R. Sreelekha) ముందంజలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. 64 ఏళ్ల శ్రీలేఖ శాస్త్ర మంగళం వార్డు నుంచి ఎల్డీఎఫ్ కూటమి అభ్యర్థిపై 700 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.మోదీ స్ఫూర్తితో పొలిటికల్ ఎంట్రీ1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శ్రీలేఖ కేరళలో తొలి మహిళా ఐపీఎస్‌గా రికార్డుకెక్కారు. ఉద్యోగ జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న ఆమె, వివాదస్పద అధికారిగా పేరుగాంచారు. 2020లో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి అనేక అంశాలపై బహిరంగంగా స్పందిస్తూ వస్తున్నారు. 2024, అక్టోబర్‌లో ఆమె బీజేపీలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. “నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఉన్నాను. పదవీ విరమణ తర్వాత, ప్రజలకు సేవ చేయడానికి ఇదే ఉత్తమ మార్గమని నేను నమ్ముతున్నాను,” అని ఆమె అన్నారు.లెక్చరర్ టు ఐపీఎస్శ్రీలేఖ తిరువనంతపురంలోనే పుట్టిపెరిగారు. 1960 డిసెంబర్ 25న ప్రొఫెసర్ ఎన్. వేలాయుధన్ నాయర్, బి. రాధమ్మ దంపతులకు ఆమె జన్మించారు. కాటన్ హిల్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యాభాస్యం ప్రారంభించారు. ఆ తర్వాత ఉమెన్స్ కాలేజ్ నుంచి ఆంగ్ల సాహిత్యంలో తన బ్యాచిలర్ డిగ్రీ చేశారు. యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుంచి మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్న తర్వాత లెక్చరర్‌గా ఉద్యోగ జీవితం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొద్దిరోజులు రిజర్వ్ బ్యాంక్‌లో కూడా పనిచేశారు. 1987, జనవరిలో కేరళ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా పోలీసు సర్వీసులో చేరారు. మహిళలు పోలీసు ఉన్నత ఉద్యోగాల్లో చేరడానికి ఆమె ప్రేరణగా నిలిచారు.తల్లి ప్రోత్సాహంమహిళా ఐపీఎస్ అధికారిగా మొదటి పదేళ్లు చాలా సవాళ్లు ఎదుర్కొన్నానని గతంలో ఓ ఇంటర్య్వూలో చెప్పారు. మహిళా పోలీసు అధికారికి స్నేహపూర్వకంగా లేని వ్యవస్థతో పోరాడటానికి తాను రెట్టింపు కష్టపడ్డానని పేర్కొన్నారు. అయితే ఎంతో మంది యువతులు తనను స్ఫూర్తిగా తీసుకోవడం ఆనందం కలిగించే విషయమని చెబుతూ... వేరే రాష్ట్రానికి చెందిన ఒక యువ మహిళా ఐపీఎస్ తనలాగే కావాలని ఆకాంక్షిస్తున్నా ఆశీర్వాదం కోసం తన వద్దకు వచ్చిన క్షణాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహం కారణంగానే తాను ఐపీఎస్ సాధించానని శ్రీలేఖ వెల్లడించారు. కాగా, పోలీసు శాఖలో మహిళల ప్రాతినిథ్యం పెంచడానికి శ్రీలేఖ కృషి చేశారు. పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాల్లో 'పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి' అనే నిబంధనను తొలగించాలని కోరుతూ ఆమె నిరంతరం లేఖలు రాసేవారు. ఆమె కాలంలో 4 శాతం ఉన్న మహిళా ప్రాతినిధ్యం, నేడు పోలీసు బలగంలో 9 శాతానికి పైగా పెరిగింది.'రైడ్ శ్రీలేఖ'చేర్తలా, త్రిస్సూర్, పతనంతిట్ట, అలప్పుజ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు శ్రీలేఖ. తన పనితీరుతో 'రైడ్ శ్రీలేఖ'గా ఆమె ప్రాచుర్యం పొందారు. సీబీఐలో నాలుగేళ్లు పనిచేశారు. న్యూఢిల్లీలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌గానూ సేవలు అందించారు. డిఐజీ, ఐజీ, ఏడీజీపీగా ఆమె విజిలెన్స్, అవినీతి నిరోధక బ్యూరో, క్రైమ్ బ్రాంచ్‌కు నాయకత్వం వహించారు. ఆర్థిక నేరాల కేసుల విచారణలో భాగంగా దాడులు చేయడానికి ఏమాత్రం ఆలోచించే వారు కాదు. ఆమె నాయకత్వంలో పోలీసు బృందాలు ఆకస్మిక దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున అవినీతిని బట్టబయలు చేశాయి. అందుకే ఆమెకు 'రైడ్ శ్రీలేఖ' అనే పేరు వచ్చింది. 2007లో కేరళ ప్రభుత్వం ఆమెను విశిష్ట సేవా పురస్కారంతో సత్కరించింది.నిందితురాలికి చెంపదెబ్బకేరళ సంచలనం రేపిన 2003 నాటి కిలిరూర్ లైంగిక వేధింపుల కుంభకోణంలో ప్రధాన నిందితురాలైన లతా నాయర్‌ను చెంపదెబ్బ కొట్టి వార్తల్లో నిలిచారు శ్రీలేఖ. ఇలా కొట్టడం చట్టవిరుద్ధమైనప్పటికీ తన చర్యను సమర్థించుకున్నారామె. మైనర్ బాలికల లైంగిక దోపిడీపై దర్యాప్తులో భాగంగా ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితురాలు ఒకరిని అప్పట్లో శ్రీలేఖ కలిశారు. తమకు ఈ గతి పట్టించిన దుర్మార్గులను పట్టుకుని రెండు చెంపదెబ్బలు కొట్టమని ఆమెను బాధితురాలు వేడుకుంది. ఆమె కోరిక మేరకు నిందితురాలిని చెంపదెబ్బ కొట్టారు. “ఇంకొకటి మిగిలి ఉంది. రెండో చెంపదెబ్బ కొట్టనందుకు బాధ పడుతున్నాను” అని తర్వాత అన్నారు. పోలీసు విభాగంలో స్త్రీ ద్వేషం, లైంగిక వేధింపులను కూడా ఆమె బహిరంగంగానే ప్రతిఘటించారు.చదవండి: సివిల్స్ విజేతల్లో ఎక్కువ మంది వారే!చిన్ననాటి స్నేహితుడే భర్తశ్రీలేఖ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె భర్త డాక్టర్ సేతునాథ్ తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పీడియాట్రిక్ సర్జరీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. సేతునాథ్ ఆమె చిన్ననాటి స్నేహితుడు కావడం విశేషం. వీరి కుమారుడు గోకుల్ ఎంబీఏ చదువుతున్నాడు. శ్రీలేఖ రచయిత్రి కూడా. 'మరణదూతన్' అనే డిటెక్టివ్ నవల సహా తొమ్మిది పుస్తకాలు రాశారు. -
శబరిమలలో ముమ్మరంగా ఆహార భద్రతా శాఖ తనిఖీలు
శబరిమలకి వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆహార భద్రతా శాఖ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భక్తులకు నాణ్యమైన ఆహారం అందేలా పంబా, సన్నిధానంలలో పనిచేస్తున్న ప్రత్యేక ఆహార భద్రతా బృందాలు ఆహార సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో పంబలో 328 , సన్నిధానంలో 302 తనిఖీలు పూర్తయ్యాయి.పంబలో లోపాలు గుర్తించిన సంస్థలపై 6 కాంపౌండ్ ఫుడ్ నోటీసులు, 21 సవరణ నోటీసులు జారీ చేశారు. సన్నిధానంలోని 24 సంస్థలకు సవరణ నోటీసులు పంపించారు. మొత్తం ఆరు ఫిర్యాదులు పరిష్కరించబడగా , కాంపౌండ్ ఫుడ్ విధానం ద్వారా నాలుగు సంస్థల నుంచి రూ.30,000 జరిమానా వసూలు చేశారు.పంబ, సన్నిధానంలోని ఆహార వ్యాపారులకు ఆహార సరఫరా సంబంధిత అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రాథమిక నాణ్యత పరీక్షల కోసం పంబాలో 69 ఆహార నమూనాలు, సన్నిధానంలో 62 ఆహార నమూనాలను పరీక్షలకు పంపించారు.ఆహార భద్రతకు సంబంధించిన టోల్ - ఫ్రీ నంబర్లను అన్ని సంస్థల్లో స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో కూడా తనిఖీలు కొనసాగుతాయని ఆహార భద్రతా అధికారులు తెలిపారు. కాగా, సరిగ్గా మూడేళ్ల క్రితం శబరిమల అయ్యప్పస్వామి అరవణ పాయసంలో వాడే యాలకుల్లో పురుగు మందు అవశేషాలున్నట్లు తేలడం తోపాటు ఇటీవల అయ్యప్పస్వామి అభిషేకానికి, ప్రసాదాల తయారీకి ఉపయోగించే తేనెలో సైతం లోపాలున్నట్లు విజిలెన్స్ తేల్చడం తదితర కారణాల రీత్యా శబరిమలలో ఆహారభద్రతా శాఖ తనిఖీలు ముమ్మరంగా చేపట్టింది.(చదవండి: ఆ హరిహరసుతుడి అరవణ ప్రసాదం డబ్బాల కొరత..) -
కేరళ రాజధానిలో కమల వికాసం.. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం
కేరళ రాజధానిలో కమల వికాసం.. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం -
ఆ హరిహరసుతుడి అరవణ ప్రసాదం డబ్బాల కొరత..
సాక్షి శబరిమల: శబరిమలలో అరవణ ప్రసాద కొరత తీవ్రంగా ఉన్నట్లు దేవస్వం బోర్డు పేర్కొంది. ప్రస్తుతాని అధిక సంఖ్యలో ప్రసాదాలు అందుబాటులో లేనట్లు స్పష్టం చేసింది. అంతేగాదు ప్రతి భక్తుడు 20 ప్రసాదం డబ్బాలకు మించి కొనుగోలు చేయానికి వీల్లేదని సమాచారం. దీనికి ప్రధాన కారణం గతేడాది(జనవరి 2024) అరవణ ప్రసాదంలో వినియోగించే యాలకుల్లో పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్లు కలకలం రేగిన ఘటనే. ఆ సమయంలో లక్షలాది డబ్బాలను అధికారులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.అదీగాక ఇటీవలే సరిగ్గా అలాంటి లోపాలే అయ్యప్పస్వామి అభిషేకానికి, ప్రసాదాల తయారీకి ఉపయోగించే తేనెలో కూడా ఉన్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) విజిలెన్స్ విభాగం గుర్తించింది. అంతేకాదు.. అయ్యప్ప స్వామి ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలను పకడ్బందీగా తనిఖీ చేయడానికి పంపాబేస్‌లో ఏర్పాటు చేసిన ‘ఫుడ్ సేఫ్టీ ల్యాబ్’ ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఆ నేపథ్యంలోనే ఈ అరవణ ప్రసాదం డబ్బాల కొరత ఏర్పడింది, అలాగే భక్తులకు కూడా పరిమితులు విధించారు ఆలయ అధికారులు. ఇక శబరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓజీ బైజు కూడా ప్రస్తుతానికి కొత్త స్టాక్ వినియోగాన్ని నిలిపివేశామని, అయ్యప్ప అభిషేకాలకు, ప్రసాదాల తయారీకి ఇప్పటికే స్టోర్‌లో నిల్వ ఉన్న స్టాక్‌ను వినియోగిస్తున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. (చదవండి: శబరిమలలో మరో అపచారం) -
శబరిమల.. భక్తులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్
శబరిమల సన్నిధానం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. భక్తుల గుంపుపైకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఇవాళ సాయంత్రం(డిసెంబర్ 13, శనివారం) 6:10 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు సహా తొమ్మిది మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.ప్రమాదానికి గురైన ట్రాక్టర్ వ్యర్థాలను తీసుకెళ్తోంది. భారీ వర్షం కారణంగా ట్రాక్టర్ అదుపు తప్పి భక్తులపైకి దూసుకుపోయింది. సన్నిధానం పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని సన్నిధానం ఆసుపత్రికి రిఫర్ చేశారు. క్షతగాత్రులందరినీ పంబలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారు. -
కేరళలో బీజేపీ గ్రాండ్ విక్టరీ
కమ్యూనిస్టుల ఖిల్లాలో కాషాయ జెండా రెపరెపలాడింది. 45 సంవత్సరాలుగా ఎల్డీఎప్ పాలిస్తున్న కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజెపీ తొలిసారిగా సంచలన విజయం సాధించింది. కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటింది. ఈ విజయంపై ప్రధాని మోదీ సైతం సంతోషం వ్యక్తం చేశారు. కేరళ ప్రజలకు ధన్యవాదాలని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.కేరళ ఈపేరు వింటేనే కమ్యూనిస్టుల కంచుకోటగా చెబుతుంటారు. దేశవ్యాప్తంగా లెప్ట్ పార్టీల ప్రభావం క్షీణిస్తున్నా కేరళలో మాత్రం వారి ఉనికి కాపాడుకుంటూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా తన ప్రభంజనం చూపిస్తూ ప్రతిచోట స్వయంగానో లేదా తన కూటమిద్వారానో అధికారం హస్తగతం చేసుకుంటున్న కాషాయదళం ఇంతకాలం కేరళలో మాత్రం తమ ప్రభావం చూపలేక పోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో బోణీకొట్టలేకపోయిన ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒక సీటుతో సరిపెట్టుకుంది. దీంతో కేరళలో బీజేపీ పోటీలోనే లేనట్లు భావించారు. అయితే ప్రస్తుతం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ అనూహ్య విజయం సాధించింది.ఎన్డీఏ కూటమి తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. 101 స్థానాలున్న కార్పొరేషన్లో బీజేపీ ఒంటరిగా 50 స్థానాల్లో గెలుపొందింది. ఎల్డీఎఫ్ కూటమి 29 సీట్లు సాధించగా కాంగ్రెస్‌కు చెందిన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 19 స్థానాల్లో విజయం సాధించింది. 2 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. అంతేకాకుండా బీజేపీ ఎర్నాకులం జిల్లాలోనిత్రిపునితురా మున్సిపాలిటితో పాటు పాలక్కడ్‌లోనూ జయకేతనం ఎగురవేసింది.అయితే ఈ విజయంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు ఇది "కేరళలో ఇది అద్భుతమైన రోజు రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. యూడీఎఫ్ కూటమికి హృదయపూర్వక శుభాకాంక్షలు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఇది మంచి పరిణామం. కార్యకర్తల కష్టం, అవినీతిపై వ్యతిరేకత వీటన్నిటితో 2020 ఫలితాలతో పోల్చితే మరింత మెరుగయ్యాము. అదే విధంగా తిరువనంతపురంలో సంచలన విజయం సాధించిన బీజేపీకి కృతజ్ఞతలు. ఆ ప్రాంతంలో 45 సంవత్సరాల పాలనకు వ్యతిరేకంగా నేను ప్రచారం నిర్వహించాను. కానీ ప్రజలు అక్కడ వేరే పార్టీని ఎన్నుకున్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిందే" అని శశిథరూర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో గత నాలుగు దశాబ్దాలుగా కమ్యూనిస్టుల కూటమే విజయం సాధిస్తూ వస్తుంది. అటువంటి చోట ప్రస్తుతం కాషాయ జెండా ఎగరడం అక్కడ పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. కాగా ఈ నెల 9,11 తేదీలలో కేరళలో స్థానికసంస్థలకు ఎన్నికలు జరిగాయి. -
రాష్ట్రపతి అంటే లెక్కే లేదా?
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవలి కేరళలో పర్యటించారు. అక్టోబరులో పర్యటన సందర్బంగా శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇరుముడితో వచ్చి అయ్యప్పకు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రపతి వెంట భద్రతాధికారులు, సిబ్బంది సైతం ఉన్నారు. అయితే, రాష్ట్రపతి ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా.. హెలిప్యాడ్ కుంగిపోయింది. దీంతో ఆమె రోడ్డు మార్గంలో పంబకు వచ్చి.. అక్కడి నుంచి శబరిమల అయ్యప్ప సన్నిధానానికి చేరుకున్నారు. కాగా, తాజాగా హెలిప్యాడ్ కుంగిపోవడానికి గల కారణాలు ఆర్టీఐ దరఖాస్తుతో బయటకు వచ్చాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..అయితే, సామాజిక కార్యకర్త రషీద్ అనప్పర దాఖలు చేసిన సమాచార హక్కు (ఆర్టీఐ) దరఖాస్తు మేరకు రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన వివరాలను కలెక్టరేట్, పతనంతిట్ట పబ్లిక్ వర్క్స్ భవన విభాగం సమాధానాలను వెల్లడించింది. ఈ క్రమంలో.. శబరిమల సందర్శనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోసం మూడు హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. మొదట రాష్ట్రపతిని నిలక్కల్‌లో దించాలని నిర్ణయించారు. కానీ.. భారీ వర్షం, పొగమంచు కారణంగా చివరి నిమిషంలో ల్యాండింగ్‌ను ప్రమదానికి మార్చారు.అయితే, రాత్రికి రాత్రే అక్టోబర్ 22వ తేదీన హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. సాధారణ నేల ఉపరితలంపై పెద్ద హెలికాప్టర్ దిగితే కూరుకుపోతుందని కారణంతో సుమారు ఒక అడుగు ఎత్తులో మెటల్ చిప్స్ వేసి దానిపై కాంక్రీట్ పోశారు. రాష్ట్రపతికి రాకకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో హెలిప్యాడ్‌పై వేసిన కాంక్రీట్ సరిగా పొడిబారలేదు. ఈ కారణంగా రాష్ట్రపతి కోసం వచ్చిన ఆర్మీ హెలికాప్టర్ హెలిప్యాడ్ వద్ద మట్టిలో కూరుకుపోయింది. కాగా, రాష్ట్రపతి పర్యటన కోసం ప్రమదంలో నిర్మించిన మూడు హెలిప్యాడ్ల కోసం రూ. 20.7 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఖర్చు మొత్తాన్ని పరిపాలనా ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపారు. దీన్ని వీఐపీ పర్యటనల కోసం కేటాయించిన నిధుల నుండి తీసుకున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.SCARY 🚨 President Droupadi Murmu’s Helicopter wheels sink into newly concreted landing pad in Kerala.pic.twitter.com/s1jcvJNjZy— News Algebra (@NewsAlgebraIND) October 22, 2025హెలిప్యాడ్ నిర్మాణం – సాంకేతిక విశ్లేషణహెలిప్యాడ్కు అవసరమైన ప్రాథమిక ప్రమాణాలు పాటించాలి. హెలిప్యాడ్ నిర్మాణం సాధారణ కాంక్రీట్ స్లాబ్ కాదు. ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాల్సిందే.a) నేల బలం (Soil Bearing Capacity–SBC)హెలికాప్టర్ బరువు + డైనమిక్ లోడ్‌ను తట్టుకునేలా నేల బలం ఉండాలి.సాధారణంగా 15–20 టన్నుల వరకు లోడ్‌ను తట్టుకునేలా SBC పరీక్షలు చేస్తారు.b) ఉపరితల సమతలీకరణ (Leveling)1–2% కంటే ఎక్కువ స్లోప్ ఉండకూడదు.హెలికాప్టర్ దిగేటప్పుడు చిన్న unevenness కూడా ప్రమాదకరం.c) కాంక్రీట్ గ్రేడ్సాధారణంగా M30 లేదా M35 గ్రేడ్ కాంక్రీట్ వాడాలి.ఇది అధిక బలం, కంప్రెషన్‌కు తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది.d) రీన్ఫోర్స్మెంట్ (Steel Mesh)8mm–12mm స్టీల్ మెష్ తప్పనిసరి.ఇది కాంక్రీట్ క్రాక్ అవకుండా, లోడ్‌ను సమానంగా పంపిణీ చేస్తుంది.కాగా, కేరళలో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ విషయంలో రాజకీయంగా కూడా విమర్శలకు దారి తీసింది. హెలిప్యాడ్ నిర్మాణం సరిగా చేయకపోవడం నిర్లక్ష్యమే అని అటు రాజకీయ నేతలు, ఇటు నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రభుత్వ పనితీరులో ప్రణాళికల లోపం ఉందని ఆరోపించారు. రాష్ట్రపతి వంటి వారు వచ్చినప్పుడు కూడా సురక్షిత ఏర్పాట్లు చేయలేకపోయారని విమర్శలు చేశారు. పబ్లిక్ మనీ వృథా అయ్యిందని కామె. రాష్ట్రపతి పర్యటనలో అపశృతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. అధికార పక్షం మాత్రం ప్రతిపక్ష నేతల వాదనలను తోసిపుచ్చింది. ఇది అత్యవసర పరిస్థితి, వాతావరణ మార్పుల వల్ల హెలిప్యాడ్‌ను త్వరగా సిద్ధం చేయాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చింది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించడం వల్ల ఏ ప్రమాదం జరగలేదని వెల్లడించింది. -
మలయాళ నటి కేసులో ఆరుగురికి 20 ఏళ్ల జైలు శిక్ష
కొచ్చి: కేరళలో 2017లో సంచలనం సృష్టించిన బహుభాషా నటిపై గ్యాంగ్ రేప్ ఘటనలో కోర్టు ఆరుగురికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో మరో నిందితుడ, మలయాళ నటుడు దిలీప్‌కు కోర్టు ఇటీవలే బయటపడటం తెల్సిందే. ఎర్నాకులం జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి హనీ ఎం వర్గీస్ శుక్రవారం సునీల్ ఎన్ఎస్ అలియాస్ పల్సర్ సునీ, మార్టిన్ ఆంటోనీ, మణికందన్, విజేష్, సలీం, ప్రదీప్ అనే వారికి గ్యాంగ్ రేప్‌నకు పాల్పడిన నేరానికి గాను 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. వీరికి వివిధ నేరాలకు పాల్పడినందుకు గాను అదనంగా జైలు శిక్షలు, వేర్వేరు జరిమానాలు సైతం విధించారు. అశ్లీల వీడియోను ఇతరులకు షేర్ చేసిన నేరానికి గాను సునీకి అదనంగా మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా, సాక్ష్యాన్ని నాశనం చేసిన నేరానికి మార్టిన్‌కు మూడేళ్ల జైలు, రూ.25 వేల జరిమానా విధించారు. ఈ శిక్షలను ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని, బెయిల్‌కు ముందు రిమాండ్‌లో కలిపిన కాలాన్ని కూడా శిక్షలో భాగంగానే పరిగణించాలని స్పష్టం చేశారు. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారమివ్వాలని, లైంగికదాడి దృశ్యాలున్న పెన్‌డ్రైవ్‌ను విచారణాధికారి కస్టడీలో ఉంచాలని జడ్జి తెలిపారు. నిర్భయ కేసులో సుప్రీంకోర్టు తెలిపిన అంశాలనే ఈ కేసుకు కూడా వర్తింప జేసినట్లు చెప్పారు. ఈ తీర్పు తమకు నిరుత్సాహం కలిగించిందని, దోషులందరికీ కోర్టు యావజ్జీవ కారాగారం విధిస్తుందని భావించామని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అజా కుమార్ చెప్పారు. దీనిపై త్వరలో కేరళ హైకోర్టుకు వెళతామన్నారు. ఈ నెల 8వ తేదీన ఇదే కేసులో నటుడు దిలీప్ సహా నలుగురిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
శబరిమలలో దొంగల గుర్తింపునకు డ్రోన్లతో నిఘా
సాక్షి శబరిమల: శబరిమలలో మండల పూజల సీజన్ ఈ నెల 27తో ముగియనుంది. ఆ వెంటనే మకరవిళక్కు సీజన్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ‘సందట్లో సడేమియా’లా భక్తుల రద్దీని అవకాశంగా మలచుకుంటున్న దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వారికి చెక్ పెట్టేందుకు అధికారులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో శబరిమల పరిసరాల్లో నకిలీ పత్రాలతో.. గుర్తింపు కార్డులతో సేవకు వచ్చే వారి కోసం తనిఖీలను ముమ్మరం చేశారు. రాష్ట్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పంపాబేస్ నుంచి సన్నిధానం వరకు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు, నిఘా పెంచినట్లు వెల్లడించారు.అలాగే భద్రత దృష్టా అధికారులు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుతో సహా తాత్కాలిక ఉద్యోగుల పత్రాలను తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. కొందరు నకిలీ గుర్తింపు కార్డులను చూపిస్తూ వివిధ ప్రదేశాలలో పనిచేస్తున్నారని కూడా పేర్కొన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయా వ్యక్తుల కోసం పోలీసులు, బోర్డు సమాచారాన్ని పరస్పరం సమాచారాన్ని పంచుకుంటాని చెప్పారు. అయితే ఒక్కోసారి నకిలీ సర్టిఫికెట్లతో వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, వారి పరిస్థితి దృష్ట్యా సాధారణంగా ప్రశ్నించి విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. ఇదిలా ఉండగా, శబరిమల అటవీ ప్రాంతాల్లో పోలీసులు, అటవీ శాఖ సంయుక్తంగా వైమానిక నిఘా కూడా నిర్వహిస్తున్నాయి. "రద్దీ పెరిగినప్పుడు దొంగలు, సంఘ వ్యతిరేక శక్తులు , యాచకులు తరచుగా శబరిమలకు వస్తారు. వారు పోలీసులను, అటవీ శాఖను పట్టించుకోకుండా శబరిమల మార్గంలోని అడవుల్లోనే ఉంటారు. అలాంటివారు నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు వంటి పత్రాలతో వస్తారు. వారి రాక భద్రతా ముప్పుని సృష్టిస్తోంది" అని ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు. అయ్యప్ప భక్తులను మోసగించి రద్దీ సమయాల్లో అడవిలోకి ప్రవేశించడం వారి నేరశైలి అని తెలిపారు. ఈ నేపథ్యంలో నీలిమల, అప్పచిమేడు, శరణ్గుత్తి తదితర ప్రాంతాల పరిసర అడవులలో డ్రోన్ నిఘాను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. అలాగే పోలీసుల రిజిస్టర్లలో నమోదుకాని కార్మికులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పంపా, సన్నిధానంలో రెవెన్యూ శాఖ స్క్వాడ్, పోలీసు షాడో బృందం 24 గంటలు మోహరించి ఉంటాయని వెల్లడించారు.(చదవండి: శబరిమలలో 50% మంది తెలుగు భక్తులే) -
Sabarimala: ‘ఉరక్కుళి జలపాతం వైపు వెళ్లొద్దు’
శబరిమల యాత్రకు అయ్యప్ప భక్తుల రద్దీ కొనసాగుతోంది. లక్షల మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో.. అటవీశాఖ అధికారుల భక్తులకు కీలక సూచన చేశారు. ఉరక్కుళి జలపాతం వైపుగా వెళ్లకూడదని మంగళవారం ఆంక్షలు జారీ చేశారు. ఉరక్కుళి జలపాతం ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. అక్కడ ఏనుగులు, అడవి పందులు, చిరుతలు తరచుగా సంచరిస్తుంటాయి. గతంలో కొంతమంది యాత్రికులు అక్కడికి వెళ్లి వన్యప్రాణుల దాడికి గురైన సంఘటనలు నమోదయ్యాయి. అదనంగా, జలపాతం ప్రాంతం రాళ్లతో నిండినదిగా ఉండటం వల్ల జారి పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా భక్తుల ప్రాణ భద్రత కోసం అటవీశాఖ ఈ హెచ్చరికను జారీ చేసింది.అయ్యప్ప సన్నిధానానికి అటవీ మార్గంలో వెళ్లే కొందరు భక్తులు.. పంపా పరిసర ప్రాంతాల్లోని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా పర్యాటక ఆకర్షణగా ఉన్న ఉరక్కుళి జలపాతం వైపు వెళ్తుంటారు. అయితే, ఇటీవల వన్యప్రాణుల కదలికలు పెరగడం, ప్రమాదకర సంఘటనలు చోటుచేసుకోవడం వల్ల కేరళ అటవీశాఖ భక్తులకు అక్కడికి వెళ్లొద్దు అని విజ్ఞప్తి చేసింది.శబరిమల యాత్రికులు పంపా సన్నిధానం మార్గం మాత్రమే ఉపయోగించాలని అధికారులు స్పష్టం చేశారు. అడవుల్లోకి వెళ్లడం, జలపాతం సందర్శన లాంటి ప్రయత్నాలు చేసి రిస్క్‌లో పడొద్దని కోరుతుతున్నారు. ‘‘శబరిమల యాత్ర ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణం. దానిని సురక్షితంగా, నియమ నిబంధనలకు లోబడి కొనసాగించడం ప్రతి భక్తుడి బాధ్యత. ఉరక్కుళి జలపాతం వంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా.. అధికారుల సూచనలను పాటించడం ద్వారా యాత్ర మరింత సాఫీగా, భద్రంగా సాగుతుంది’’ అని ప్రకటనలో అధికారులు కోరారు.పోటెత్తిన అయ్యప్ప స్వాములుశబరిమలలో డిసెంబర్ 8న సన్నిధానం, పంబా ప్రాంతాలు తిరిగి భక్తులతో కిక్కిరిశాయి. సాయంత్రం 4 గంటల వరకు లెక్క ప్రకారం 73,679 మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. వీళ్లలో స్పాట్ బుకింగ్ ద్వారా వచ్చిన వాళ్లు.. 11,999 మంది. పథినెట్టాంపడి(18 మెట్లు) ఎక్కడానికి 4 గంటల సమయం పట్టింది. -
తీర్పు ఏదైనా...పోరుకు ప్రశంస
శక్తిమంతులతో పోరాడే సమయంలో పోరాటమే విజయంతో సమానం. ఆ తర్వాత దక్కిన న్యాయం సంతృప్తిని ఇవ్వొచ్చు ఇవ్వకపోవచ్చు. కేరళ సూపర్‌స్టార్ దిలీప్ తనపై అత్యాచారం చేసేందుకు ఒక గ్యాంగ్‌తో కుట్ర పన్నాడని ఆరోపించి సుదీర్ఘకాలం పోరాడిన నటి (తెలుగులో కూడా నటించింది) చివరకు డిసెంబర్ 8న జడ్జిమెంట్ వినగలిగింది. మొత్తం 15 మంది నిందితులున్న ఈ కేసులో 1 నుంచి 6 వరకు ఉన్న నిందితులను కోర్టు దోషులుగా ఖరారు చేసి 8వ నిందితుడైన దిలీప్‌ను నిర్దోషిగా విడుదల చేసింది. దీనిపై వ్యాఖ్యలు వినిపిస్తున్నా కేరళను కంపింప చేసి ఎన్నో సవాళ్లు తట్టుకుని పోరాడిన నటిని ముందు ప్రశంసించాల్సి ఉంది.తాను పని చేసే రంగంలో అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని ఒక బాధితురాలు విశ్వసిస్తే ఆమె చేసే పోరాటానికి ఎన్ని అవరోధాలు ఉంటాయి? మలయాళ సూపర్‌స్టార్ దిలీప్ పన్నిన కుట్ర వల్లే తన మీద అత్యాచారం జరిగిందని న్యాయపోరాటానికి దిగిన మలయాళ నటి ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని చివరకు ‘తీర్పు’ను సాధించింది. అయితే ఆ తీర్పులో తనకు దక్కిన న్యాయం పాక్షికమా? సంపూర్ణమా అనేది చర్చే అయినా... ఇంతవరకూ ఆమె వెరవక నిలబడటం చాలా గొప్ప సంగతి. స్ఫూర్తిదాయకమైన పోరాటం.→ అసలేం జరిగింది?మలయాళ నటి ‘ఎం’ (కథనం కోసం పెట్టిన పేరు) ఫిబ్రవరి 17, 2017న త్రిషూర్లోని తన ఇంటి నుంచి కొచ్చి వెళుతున్నప్పుడు రాత్రి వేళ ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనంతో ఢీకొట్టిన కొంతమంది ఆమె వాహనంలోకి జొరపడ్డారు. ఆ తర్వాత కొచ్చి అంతా తిప్పుతూ ‘ఎం’ను దుర్బాష లాడారు. వారిలో పల్సన్ సుని అనే పాత నేరస్తుడు ఆమె మీద అత్యాచారం చేయడమే కాదు అదంతా వీడియో తీశాడు. ఆ తర్వాత ఒక దర్శకుడి ఇంటి ముందు ఆమెను పడేసి ఉడాయించాడు. దర్శకుడి సహాయంతో అదే రోజు ‘ఎం’ కేసు నమోదు చేసింది.→ తర్వాత ఏం జరిగింది?మొదట పోలీసులు ఇదో బ్లాక్మెయిల్ దందా చేసే వారి పని అని భావించారు. అయితే అత్యాచార సమయంలో పల్సర్ సుని ‘ఎం’తో ‘నేను కొటేషన్ అందుకోవడం వల్లే ఈ పని చేస్తున్నాను’ అన్నాడు. కొటేషన్ అంటే సుపారీ. అయితే ఈ సుపారీ సంగతి వెంటనే పోలీసుల దృష్టికి రాలేదు. బాధితురాలు ఇది కీలకమైన కామెంట్‌గా గమనించలేదు.→ అరెస్టులుపోలీసులు వరుసగా అరెస్టులు చేశారు. వీరిలో పల్సర్ సునితో పాటు ‘ఎం’ వాహన డ్రైవర్ ఇంకా ఆరు గురు ఉన్నారు. మే 1, 2017 నాటికి ‘ది విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ పేరుతో మలయాళ నటీమణులు ఒక బృందంగా ఏర్పడి ముఖ్యమంత్రిని కలిసి మలయాళ పరిశ్రమలో సెక్సువల్ హరాస్మెంట్ గురించి చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. జూన్, 2017 నాటికి విష్ణు అనే వ్యక్తి తాను పల్సర్ సునీ జైల్మేట్నని జైలులో అతడు ఈ కేసు వెనుక నటుడు దిలీప్ ఉన్నాడన్న సంగతి చెప్పాడని బయటకు వెల్లడి చేయడంతో గగ్గోలు మొదలైంది. మరోవైపు ‘కొటేషన్ డబ్బు బేలెన్స్ చెల్లించమని’ పల్సర్ సుని రాసినట్టుగా చెప్పే లెటర్ బయటకు ‘లీక్ అయ్యింది’. దాంతో ఈ అత్యాచారం కుట్రలో దిలీప్ ఉన్నాడన్న విషయం బయటకు వచ్చి కేరళలో కంపనలు పుట్టాయి. జనం రెండుగా చీలి వాదులాడుకున్నారు. ‘ఎం’ను దుర్బాషలాడారు. జూన్ 24, 2017న దిలీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు.→ దిలీప్‌పై ఆరోపణ ఎందుకు?నటుడు దిలీప్, నటి మంజు వారియర్ 2012లో వివాహం చేసుకున్నారు. అయితే దిలీప్‌కు మరో నటి కావ్య మాధవన్‌తో సంబంధం ఉన్నట్టు మంజుకు అనుమానం వచ్చింది. కాని ఏ ఆధారం దొరకలేదు. అయితే దిలీప్‌కు, కావ్యా మాధవన్‌కు ఉమ్మడి స్నేహితురాలైన ‘ఎం’కు ఈ విషయం తెలిసి ఉండొచ్చనే ఉద్దేశంతో మంజు ‘ఎం’ను నిలదీసింది. ‘ఎం’ ఆ సంబంధాన్ని బయట పెట్టిందని సమాచారం. తనకు స్నేహితురాలిగా ఉంటూ తన పెళ్లిలో చిచ్చు పెట్టిన ‘ఎం’ మీద ఆనాటి నుంచి కోపం పెట్టుకున్న దిలీప్ సమయం కోసం ఎదురు చూశాడని ఆరోపణ. ఈలోపు 2015లో మంజు, దిలీప్‌లు విడాకులు తీసుకున్నారు. 2016లో దిలీప్, కావ్య వివాహం చేసుకున్నారు. 2017లో ‘ఎం’ మరికొన్ని రోజుల్లో ఎంగేజ్మెంట్ చేసుకోనున్నదనగా ఈ ఘటన జరిగింది. ఈ పూర్వరంగం అంతా ‘ఎం’ను దిలీప్ దీని వెనుక ఉన్నాడని విశ్వసించేలా చేసింది. అయితే దిలీప్ ముందు నుంచీ ఇదంతా తన ప్రతిష్టను తట్టుకోలేని శక్తులు చేసిన కుట్రగా కొట్టేస్తూ వచ్చాడు. 84 రోజులు జైలులో ఉండి బయటకు వచ్చిన దిలీప్ తనే ఈ కేసులో సి.బి.ఐ. విచారణ జరిపించాలని సుప్రీం కోర్టు వరకూ వెళ్లాడు.→ 2018లో విచారణ మొదలుఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో హనీ ఎం.వర్గీస్ అనే మహిళా న్యాయమూర్తి నేతృత్వంలో 2018లో విచారణ మొదలైంది. అయితే ఈ జడ్జి మీద తనకు విశ్వాసం లేదని బాధిత నటి కేరళ హైకోర్టు కూ, సుప్రింకోర్టుకూ వెళ్లి న్యాయమూర్తిని మార్చమని అభ్యర్థించింది. అయితే న్యాయమూర్తి మార్పు జరగలేదు. విచారణలో స్వచ్ఛతపై అసంతృప్తితో 2022 నాటికి ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఒకరి తర్వాత ఒకరుగా కేసు నుంచి తప్పుకున్నారు. చాలా మంది సాక్షులు మొదట బాధితురాలి పక్షాన స్టేట్మెంట్స్ ఇచ్చి కాలక్రమంలో అడ్డం తిరిగారు. సత్వర విచార జరగాల్సిన కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వెళ్లింది. దిలీప్ ఉపయోగించిన ఫోన్లు, ఇతర ఫోన్లు ‘టాంపర్’ అయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. అత్యాచార దృశ్యాలు చిత్రీకరించిన ఫోను ‘మాయమైంది’. వీటన్నింటి మధ్య కేసు నత్తనడక నడవగా స్వయంగా సుప్రిం కోర్టు రంగంలో దిగి కేసును తొందరగా ముగించమని హెచ్చరించాల్సి వచ్చింది. చివరకు 2022లో ‘ఎం’ తనకు తానే బయటకు వచ్చి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి జరిగిన అన్యాయాన్ని మొరపెట్టుకుంది. కేరళ ప్రభుత్వం విధించిన హేమ కమిటీ మలయాళ పరిశ్రమలో స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలను బయటకు వెల్లడి చేయడంతో మరో దుమారం లేచింది. ఇవన్నీ అయ్యాక తుదకు డిసెంబర్ 8, 2025న తీర్పు వెలువడింది. ఇందులో ఆరుగురు నిందితులను దోషులుగా కోర్టు తేల్చింది. 7 నుంచి 15 వరకూ ఉన్న నిందితులను వదిలిపెట్టింది. 8వ నిందితుడైన దిలీప్‌కు ప్రస్తుతానికి విముక్తి దొరికింది. అయితే దీని మీద విస్తృతంగా వ్యాఖ్యలు, విమర్శలు వినపడుతున్నాయి. కేరళ ప్రభుత్వం ఈ తీర్పును చాలెంజ్ చేస్తామని చెప్పింది. బాధిత ‘ఎం’ కూడా పై కోర్టుకు వెళ్లవచ్చు. తదుపరి పరిణామాలు ఎలా ఉన్నా బలవంతులపై బాధిత మహిళల పోరాటం ఆగవలసిన అవసరం లేదని ‘ఎం’ నిరూపించింది. ఆమె స్థయిర్యం వల్లే ఇంతవరకైనా వచ్చింది. ఇక మీదట ఆమె చేయబోయే పోరాటం మరో తీర్పును ప్రసాదించవచ్చు. వేచి చూద్దాం. -
శ్రీకర్ భరత్ మెరుపులు
లక్నో: ఓపెనర్ శ్రీకర్ భరత్ (28 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో... దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు ఐదో విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా శనివారం జరిగిన పోరులో ఆంధ్ర జట్టు 7 వికెట్ల తేడాతో కేరళపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేరళ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ సామ్సన్ (56 బంతుల్లో 73 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో సత్తాచాటగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సామ్సన్ చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. రోహన్ కున్నుమ్మల్ (2), మొహమ్మద్ అజహరుద్దీన్ (6), క్రిష్ణ ప్రసాద్ (5), అబ్దుల్ బాసిత్ (2), సల్మాన్ నిజార్ (5), షర్ఫుద్దీన్ (3) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు, సౌరభ్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు 12 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 123 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ భరత్ దంచేయగా... అశ్విన్ హెబ్బర్ (27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), పైల అవినాష్ (20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అతడికి సహకరించారు. గ్రూప్ ‘ఎ’లో ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆంధ్ర జట్టు ఐదు విజయాలు, ఒక పరాజయంతో 20 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంలో కొనసాగుతోంది. చివరి గ్రూప్ మ్యాచ్‌లో సోమవారం విదర్భతో ఆంధ్ర జట్టు తలపడనుంది. అభిషేక్ అదరహో..సాక్షి, హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (34 బంతుల్లో 62; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు; 2/8)... సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతు న్నాడు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 73 పరుగుల తేడాతో సర్వీసెస్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. పంజాబ్ కెప్టెన్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అభిషేక్ దంచికొట్టగా... ప్రభ్‌సిమ్రన్ సింగ్ (28 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), నమన్ ధీర్ (22 బంతుల్లో 54; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) ధనాధన్ హాఫ్‌సెంచరీలు నమోదు చేసుకున్నారు. సర్వీసెస్ బౌలర్లలో అభిషేక్ తివారి, విశాల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో సర్వీసెస్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్ తివార టరి(30 బంతుల్లో 40; 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలినవాళ్లువిఫలమయ్యారు. బౌలింగ్‌లో అభిషేక్, సాన్వీర్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్ తలా 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో పాండిచ్చేరి 81 పరుగుల తేడాతో బెంగాల్‌పై, గుజరాత్ 1 వికెట్ తేడాతో హిమాచల్ ప్రదేశ్‌పై హర్యానా 8 పరుగుల తేడాతో బరోడాపై విజయాలు సాధించాయి.హైదరాబాద్ ‘టాప్’ షోబిహార్పై ఘనవిజయంకోల్కతా: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన హైదరాబాద్ జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా... శనివారం జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు 7 వికెట్ల తేడాతో బిహార్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బిహార్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. పియూశ్ సింగ్ (30 బంతుల్లో 34; 3 ఫోర్లు), బిపిన్ సౌరభ్ (19 బంతుల్లో 31 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 3, చామా మిలింద్ రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో హైదరాబాద్ 12.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (42 బంతుల్లో 67; 11 ఫోర్లు, 1 సిక్స్), ప్రజ్ఞయ్ రెడ్డి (15 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) సత్తాచాటారు. గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ 6 మ్యాచ్‌లాడి 5 విజయాలు, ఒక పరాజయంతో 20 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానంలో ఉంది. -
ఇంటి వద్దకే శబరిమల అయ్యప్ప ప్రసాదం..! ఇలా ఆర్డర్ చేయండి..
శబరిమల అయ్యప్ప ప్రసాదం ఇష్టపడని వారుండరు. అంతటి ప్రత్యేకత కలిగిని అరవణ ప్రసాదం ఇంటి వద్దకే నేరుగా వచ్చేస్తుంది. అదికూడా శబరిమలకు వెళ్లక్కర్లేకుండానే అయ్యప్ప ప్రసాదాన్ని నేరుగా పొందొచ్చు. అదెలాగంటే..మనం ఉన్న చోటు నుంచే పోస్టాఫీసుల ద్వారా ఆర్డర్ చేస్తే సులభంగా శబరిమల అరవణ ప్రసాదం పొందొచ్చు. దీనికోసం ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు పోస్టల్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తోంది. శబరిమలలోని పోస్టాఫీస్ శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించలేని భక్తుల కోసం ఇంటి నుంచే అరవణ ప్రసాదం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసింది. భారతదేశంలో అన్ని పోస్టాఫీసులు నుంచి ఈ శబరిమల అయ్యప్ప ప్రసాదం కొనుగోలు చేసుకోవచ్చని దేవస్వం బోర్డు పేర్కొంది. భారతదేశంలోని అయ్యప్ప భక్తులందరికీ శబరిమల అయ్యప్ప ప్రసాదం అందేలా చేయడమే తమ లక్ష్యమని శబరిమల పోస్టాఫీస్ అధికారులు తెలిపారు. దీనికోసం ప్రసాదాన్ని ఇంటింటికి చేరవేసే ప్రాజెక్టును పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రారంభించింది. ఈ ప్రసాదంలో నెయ్యి, అరవణ ప్రసాదం, పసుపు, కుంకుమ, విభూతి, అరచనై ప్రసాదం తదితరాలు ఉంటాయి. ధరల వివరాలు..టిన్ కవర్‌తో కూడిన ప్రసాదం కిట్ కొనడానికి రూ.520లు రుసుము చెల్లించాలి4-టిన్ అరవాణ ప్రసాదం కిట్ కోసం రూ.960లు10-టిన్ అరవాణ ప్రసాదం కిట్ కోసం రూ.1,760 చెల్లించాలిపోస్టాఫీసులో ప్రసాదం ధర చెల్లస్తే..రాబోయే కొద్ది రోజుల్లోనే శబరిమల అయ్యప్ప ప్రసాదం స్వయంగా మీ ఇంటికి వచ్చి తీరుతుందని అధికారులు తెలిపారు. ప్రతి ఏడాది అయ్యప్ప ఆలయం మకర సంక్రాంతి జ్యోతి దర్శనం నిమిత్తం తెరిచి..కొద్దిరోజుల అనంతరం మూతబడుతుంది. ఆ తర్వాత శబరిమల పోస్టాఫీస్ కూడా లాక్ చేయబడుతుంది. అలాగే వచ్చిన స్టాంప్‌లను పంపాలో సురక్షితంగా ఉంచుతారు. అంతేగాదు భారతదేశంలో రాష్ట్రపతి తర్వాత ప్రత్యేకమైన పిన్‌కోడ్ (689713) కలిగి ఉన్న ఏకైక దైవం శబరిమల అయ్యప్ప స్వామి. వార్షిక మకరజ్యోతి ప్రారంభం కాగానే శబరిమల అయ్యప్ప ఆలయానికి వివిధ లేఖలు అందుతాయి. ఆ భక్తుల లేఖలు అయ్యప్ప పాదాల వద్ద ఉంచడం అనేది అక్కడొక ఆచారం. ఇక్కడి పోస్టాఫీసు ద్వారానే భక్తుల ఇళ్లకు ప్రసాదం పంపిణీ చేయబడుతుంది.(చదవండి: అయ్యప్ప దర్శనం కోసం బారులు తీరిన జనం..నాడ మూసివేత..) -
అయ్యప్ప దర్శనం కోసం బారులు తీరిన జనం..నాడ మూసివేత..
సాక్షి శబరిమల: సన్నిధానం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఈ రాత్రికి నాడ మూసివేస్తే రేపు తెల్లవారుజామున 3 గంటల వరకు యాత్రికులను 18వ మెట్టు ఎక్కడానికి అనుమతించరు. ఆ తర్వాత భద్రతలో భాగంగా, పోలీసులు, కేంద్ర దళాలు CRPF, RAF, NDRF, యాంటీ టెర్రర్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సంయుక్తంగా రూట్ మార్చ్ నిర్వహించనున్నారు.నాడ మూసివేత అంటే..నాడ అంటే శబరిమల అయ్యప్ప ఆలయానికి వచ్చే ప్రధాన మర్గం. ఇది అయ్యప్ప భక్తులకు, ముఖ్యంగా దీక్షధారులకు అతి ముఖ్యమైనది. సింపుల్‌గా చెప్పాలంటే అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునే మెట్ల మార్గం. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచే ఆలయ ప్రవేశ మార్గం. అందువల్ల ఈ మెట్లమార్గం గుండా ఉండే ప్రధాన ద్వారాన్ని మూసివేస్తే..భక్తులను 18వ మెట్టు ఎక్కడానికి అనుమతించరు. ఇక్కడే స్వామివారికి ఆలయ పూజారులు విశేష పూజలు జరుపుతారు. భక్తులు తెచ్చే ఆవునేతితో అయ్యప్పకు అభిషేకం చేస్తారు.ఇదిలా ఉండగా, సన్నిధానం పంపా, నీలక్కల్ వద్ద అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. రాత్రి నాడ మూసివేశాక, తిరుముట్టం, దాని పరిసరాలు ప్రత్యేక పోలీసుల రక్షణలో ఉంటాయి. ఎప్పుడైతే నాడ మూసివేస్తారో ఆ తదనంతరం యాత్రికులను పాపంతల్ వద్ద క్యూలో నిలబెడతారు. రేపు తెల్లవారుజామున 3 గంటలకు నాడ తెరిచిన తర్వాత మాత్రమే భక్తులను 18వ మెట్టు ఎక్కడానికి అనుమతిస్తారు. సన్నిధానం వైపు ట్రాక్టర్ల తరలింపును రెండు రోజులుగా పరిమితం చేశారు. ట్రాక్టర్లలో తీసుకువచ్చిన వస్తువులను కూడా తనిఖీ చేస్తారు. గుర్తింపు కార్డు లేకుండా ఎవరిని సిబ్బంది ద్వారం గుండా తిరుముట్టంలోకి ప్రవేశించడానికి అనుమతించరు. ఈ ప్రాంతంలో నిఘా ముమ్మరంగా ఉంటుంది. ఇక ఫుట్‌పాత్ వద్ద దర్శనం ప్రారంభంలో స్కానర్లు డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, హోల్డ్ మెటల్ డిటెక్టర్లు ఉపయోగించే స్రీనింగ్ తనిఖీ తదితరాలు పర్యవేక్షణ ఉంటుంది.(చదవండి: పులిమేడు రూట్లో భక్తుల రద్దీ) -
ఒకటేసారి పుట్టి.. ఒకే చోట చదివి.. ఒకటే శాఖల జాబ్ కొట్టిండ్రు
-
పళనిలో తెలుగు భక్తుడిపై దాడి.. మాల తెంచేసిన వ్యాపారి.. అయ్యప్పల ధర్నా
పళని(తమిళనాడు): శబరిమలో యాత్రలో భాగంగా తమిళనాడులోని పళని సుబ్రమణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఓ తెలుగు భక్తుడిపై దాడి జరిగిన ఉదంతమిది. తోటి అయ్యప్పలు, పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయ్యప్ప స్వాముల బృందం శబరిమల దర్శనానికి వెళ్తూ.. మార్గమధ్యంలో పళనిలోని సుబ్రమణ్య స్వామి క్షేత్రానికి చేరుకుంది.ఈ క్రమంలో ఓ భక్తుడు సమీప దుకాణంలో వాటర్ బాటిల్, కూల్‌డ్రింక్స్ కొనుగోలుకు వెళ్లారు. గరిష్ఠ చిల్లర ధర(ఎంఆర్పీ) రూ.30గా ఉండగా.. దుకాణుదారుడు రూ.40 డిమాండ్ చేశాడు. అదేంటని భక్తుడు నిలదీయగా.. తమిళంలో తిట్ల పర్వం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా.. గాజు సీసాతో అయ్యప్ప భక్తుడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడి తలకు తీవ్ర రక్తగాయమైంది. అంతటితో ఆగని సదరు వ్యాపారి, బాధిత భక్తుడి మెడలోని అయ్యప్ప దీక్షామాలను తెంచేశాడు.ఈ సమాచారం అందుకున్న తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులు ఒక్కొక్కరుగా ఘటనాస్థలికి చేరుకున్నారు. అయ్యప్ప భక్తుడిపై దాడి చేసిన దుకాణుదారుడిని నిలదీశారు. ఈ క్రమంలో స్థానికులు ఆ వ్యాపారికి అండగా నిలిచి, వాగ్వాదానికి దిగారు. చూస్తుండగానే తెలుగు భక్తులు పెరిగిపోయారు. ఆ వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. అక్కడే ఆందోళన నిర్వహించారు.తమ ఆందోళనపై స్పందన లేకపోవడంతో.. రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి.. ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఓ దశలో వ్యాపారికి సపోర్ట్ చేస్తూ.. తెలుగు భక్తులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. తెలుగు రాష్ట్రాల భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో.. నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. -
శబరిమల: అయ్యప్పస్వాముల కారులో మంటలు
పతనంతిట్ట: శబరిమల యాత్రికులకు తృటిలో ప్రమాదం తప్పింది. శబరిమల యాత్రికులతో వెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. పంపా చలకాయం సమీపంలో కారు నుంచి పొగలు వస్తున్నట్లు గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తయ్యారు.కారును నిలిపివేసి భక్తులను అలర్ట్ చేయడంతో వారు కారు నుంచి వెంటనే బయటకు దిగిపోయారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలం వద్దకు చేరుకున్న ఫైర్ సిబ్బంది కారులో చెలరేగిన మంటలను ఆర్పివేశారు. ఈ కారులో హైదరాబాద్ భక్తులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
పులిమేడు రూట్లో భక్తుల రద్దీ
సాక్షి శబరిమల: శబరిమలకు వెళ్ళే భక్తులకు ప్రత్యామ్నాయ మార్గం అయిన అటవీ మార్గం పులిమేడులో యాత్రికుల రద్దీ బాగా పెరిగింది. ఈ మార్గంలో ప్రతిరోజూ సుమారు 1,500 మంది నుంచి రెండు వేల మంది దాక యాత్రికులు తరలివస్తున్నట్లు అటవీశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పెరియార్ పులుల అభయారణ్యం మీదుగా వెళ్లేఈ అటవీమార్గంలో భక్తుల సంరక్షణార్థం ముమ్మరంగా అన్ని ఏర్పాట్లు చేసింది. సత్రం నుంచి సన్నిధానం వరకు సుమారు 12 కి.మీ దూరం ఉంటుంది. అయితే అక్కడి వాతావరణాన్ని అనుసరించి యాత్రికులకు ఈ అటవీ మార్గం గుండా ప్రయాణించేందుకు అనమతి ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు యాత్రికులకు సత్రం నుంచి సన్నిధానం చేరుకోవడానికి అనుమతి ఉంది. అలాగే ఉదయం 8 నుంచి 11 గంటలలోపు యాత్రికులు తిరిగి సత్రానికి ప్రయాణించటానికి అనుమతి ఉంది. అలాగే దేవస్వం బోర్డు సత్రంలో కూడా స్పాట్ బుకింగ్ కోసం ఏర్పాట్లు చేసింది. ఇక్కడ నుంచి ఉన్న అనుమతిని ఆధారం ప్రయాణానికి అనుమతి ఉంటుంది. సత్రాన్ని వదిలి సన్నిధానం వరకు వెళ్లే యాత్రికుల బృందాలతో తమ శాఖ అధికారులు వెళ్తారని అటవీ శాఖ వెల్లడించింది. దీంతో పాటు యాత్రికులు భద్రతా, ఇతర ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు సుమారు 35 మంది అటవీ శాఖ అధికారులు 35 మంది ఎకో గార్డులు ఉన్నారని పేర్నొంది. అలాగే అదనంగా ఈ మార్గంలో ఎలిఫెంట్ స్క్వాడ్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏనుగులు, గేదెలు, అడవి జంతువులు లేవని నిర్థారించడానికి అటవీగార్డు బృందం సదా అప్రమత్తమై ఉండటమే గాక, జంతువులు లేవని నిర్ధారణ అయితేనే యాత్రికులను ప్రయాణించడానికి అనుమతిస్తామని అఝుతా రేంజ్ ఆఫీసర్ డి. బన్నీ తెలిపారు. వర్షం పడితే ఈ అటవీ మార్గం గుండా ప్రయాణించడం చాలా కష్టం. ఎందుకంటే కఝుతాకుళి నుంచి కొన్ని మైళ్ల తర్వాత అంతా బురదమయంగా ఉంటుంది. అందువల్ల ఈ మార్గం గుండా వెళ్లడం చాలా కష్టం. సత్రాన్ని సందర్శించే యాత్రికుల పత్రాలను ఉప్పుపారలోని పోలీసు అవుట్‌పోస్ట్‌లో తనిఖీ చేస్తారు. అలాగే ఈ అటవీ గార్డుల తోపాటు పోలీసు, ఆరోగ్య శాఖల సేవలను కూడా ఈ మార్గంలో ఏర్పాటు చేశారు. ఇవేగాక ఈ అటవీ మార్గంలో ఇరికప్పర, సీతకులం, జీరో పాయింట్ వద్ద పరిశుభ్రమైన నీరు , ఉప్పుపార బేస్ వద్ద టీ , స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ అటవీ మార్గం గుండా వచ్చే యాత్రికుల వివరాలను సన్నిధానం పక్కన ఉన్న అటవీ శాఖ, పోలీసు చెక్‌పోస్టులలో కూడా నమోదు చేస్తారు. (చదవండి: 16 రోజుల్లో శబరిమలకు 13.5 లక్షల మంది.. ఆదాయం ఎంతంటే..) -
బరిలో ‘సోనియాగాంధీ’ అయోమయంలో కాంగ్రెస్
కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ 9 - 11 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో మున్నార్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిగా సోనియా గాంధీ (అవును మీరు చదవింది నిజమే) కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది.ఎవరీ సోనియా గాంధీకేరళలోని నల్లతన్ని కల్లార్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ విధేయుడు, సీనియర్ నాయకుడు దివంగత దురే రాజ్ కుమార్తె సోనియా గాంధీ. సోనియా గాంధీ పట్ల అభిమానంతో, ఆమెకు ఆ పేరు పెట్టుకున్నారట.అయితే బీజేపీలో చురుకైన కార్యకర్తగా ఉన్న సుభాష్‌ను సోనియా వివాహం చేసుకున్నారు . ప్రస్తుతం పంచాయతీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అంతేకాదు పాత మున్నార్ మూలక్కడ వార్డులో జరిగిన ఉప ఎన్నికలో ఆమె బీజేపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. తన భర్త రాజకీయ మార్గాన్ని అనుసరిస్తూ ఇప్పుడు మళ్లీ బీజేపీ తరపున బరిలోకి దిగారు. చదవండి: జస్ట్ రూ. 200తో మొదలై రూ. 10 కోట్లదాకా ఇంట్రస్టింగ్ సక్సెస్ స్టోరీమరోవైపు మున్నార్‌లో సోనియా గాంధీ పోటీ కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి మంజుల రమేష్‌కు ఇక్కడ సంకట పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే కాంగ్రెస్ అధినేతగా సోనియా గాంధీ పేరు అందరికీ సుపరిచితమే. ఆ పేరున్న వ్యక్తం పోటీ చేయడంతో సోనియా పేరు తక్షణమే ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో రమేష్ ఆందోళన పడుతున్నారు. డిసెంబర్ 13న లెక్కింపు జరుగుతుంది.ఇదీ చదవండి: అపూర్వ ఘట్టం, అరుదైన ఘనత : ప్రధాని మోదీ ప్రశంసలు -
16 రోజుల్లో శబరిమలకు 13.5 లక్షల మంది.. ఆదాయం ఎంతంటే.
సాక్షి శబరిమల: కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప క్షేత్రానికి ఈ ఏడాది మండల-మకరవిలక్కు సీజన్లో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. కేవలం 16 రోజుల్లోనే రూ.92 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) వెల్లడించింది. ఈ ఏడాది మండల- మకరవిళక్కు (Mandala Makaravilakku) వేడుకలు గత నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అంటే ఈ సీజన్ తొలి 16 రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఆదాయం రావడం విశేషం. గతేడాది ఇదే సీజన్‌తో పోలిస్తే ఈ దఫా ఆదాయం 33.33 శాతం పెరిగినట్లు టీడీబీ పేర్కొంది. అయితే గతేడాది కేవలం రూ.69 కోట్లు మాత్రమే వసూలైనట్లు దేవస్వం బోర్డు తెలిపింది. ఈ ఏడాది ఆదాయంలో అత్యధికంగా అయ్యప్ప ప్రసాదం విక్రయాల నుంచే వచ్చినట్లు వెల్లడించింది. అంతేగాదు దాదాపు రూ.47 కోట్లు ప్రసాదాల విక్రయాల ద్వారే సమకూరినట్లు బోర్డు వివరించింది. ఇక మండల-మకరవిలక్కు సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు(16 రోజుల తర్వాత) సుమారు పదమూడున్నర లక్షల మందికి పైగా భక్తుల అయ్యప్పను దర్శించుకున్నట్లు దేవస్వం బోర్డు పేర్కొంది. శని, ఆదివారాల్లో రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ..సోమవారం మధ్యాహ్నం నుంచి రద్దీ పెరిగింది. సోమవారం గురుపవనపురి ఏకాదశి సందర్భం తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దాదాపు 90 వేల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించారు. అలాగే కేరళ అన్నదాన సద్య పథకం నేడు ప్రారంభం కాదని దేవస్వం బోర్డు తెలిపింది. కాగా, పంపా నుంచి సన్నిధానం వెళ్లే మార్గంలో 12 ప్రదేశాల్లో తాగునీరు, స్నాక్స్, అత్యవసర ఆరోగ్య సేవలను ఏర్పాటు చేశారు.(చదవండి: శబరిమలలో తగ్గిన భక్తుల రద్దీ ..!) -
ఇరుముడితో శబరిమలకు బయల్దేరిన వరుణ్ సందేశ్.. (ఫోటోలు)
-
షాకిస్తున్న కేరళ ‘హెచ్ఐవీ’.. నెలకు 100 కొత్త కేసులు
తిరువనంతపురం: దేశంలోనే అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలు, అధిక నాణ్యత గల ఆసుపత్రులు, అగ్రశ్రేణి అక్షరాస్యత రేటుతో ఆరోగ్య రంగంలో అగ్రగామిగా నిలిచిన కేరళ ఇప్పుడు హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవీ)పెరుగుదలను చవిచూస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్ఐవీ నిర్మూలన లక్ష్యానికి చేరుకోవాలని చూస్తున్న తరుణంలో.. కేరళలో మాత్రం ప్రతి నెలా సగటున 100 కొత్త హెచ్ఐవీ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.కేరళలో ముఖ్యంగా 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతలో హెచ్ఐవీ వ్యాప్తి కనిపిస్తోంది. ఇది కేరళలోని ఆరోగ్య నమూనాకు సవాలు విసురుతోంది. కేరళలో మొత్తం హెచ్ఐవీ కేసుల సంఖ్య జాతీయ సగటు (0.20%) కంటే తక్కువగా (0.07%) ఉన్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత మూడు ఏళ్లలో ఎర్నాకుళం జిల్లాలో అత్యధికంగా 850 కేసులు నమోదయ్యాయి. దీనికి ప్రధానంగా వలస కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉండటం, వారిలో మాదకద్రవ్యాల వాడకం వంటివి కారణాలుగా నిలుస్తున్నాయి.కేరళలో ఎర్నాకుళం తర్వాత తిరువనంతపురం (555), త్రిస్సూర్ (518) జిల్లాల్లో అధిక కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులలో 3,393 మంది పురుషులు, 1,065 మంది మహిళలు, 19 మంది ట్రాన్స్‌జెండర్, 90 మంది గర్భిణులు ఉన్నారు. ఇది వ్యాధి అన్ని సమూహాలలో వ్యాపిస్తున్న విషయాన్ని తెలియజేస్తుంది. కేరళ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (కేఏసీఎస్) హెచ్ఐవీ కేసుల పెరుగుదలకు ముఖ్య కారణాలను తెలిపింది. ఇవి యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొంది.అసురక్షిత సంభోగం ఇది ఇన్ఫెక్షన్ వ్యాప్తికి గల ప్రధాన కారణాలలో ఒకటి. డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయాలు పెరిగి, నేపథ్యం తెలియని వ్యక్తులతో కండోమ్ వాడకుండా, సంభోగంలో పాల్గొనడం ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తుంది.ఇంజెక్టబుల్ డ్రగ్స్ వాడకం డ్రగ్స్ ఇంజెక్ట్ చేయడానికి ఒకే సిరంజిలను వాడటం. ఇది మలప్పురం తదితర జిల్లాల్లో కూడా కేసుల పెరుగుదలకు దారితీసింది.కలుషితమైన టాటూ సూదుల వాడకం సరైన పరిశుభ్రత పాటించని టాటూ కేంద్రాలలో కలుషితమైన సూదుల ద్వారా కూడా హెచ్ఐవీ వ్యాప్తి చెందుతోంది.వలస కార్మికులు ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కార్మికులు, వారిలో కొంతమంది డ్రగ్స్ వాడకం వల్ల కూడా కేసులు పెరుగుతున్నాయి.నివారణ- నియంత్రణ చర్యలుఈ పెరుగుతున్న కేసులను అరికట్టేందుకు సత్వర చర్యలు అవసరం. ఇందుకోసం కేఏసీఎస్ కొన్ని పరిష్కార మార్గాలను సూచించింది.ముందస్తు పరీక్ష-చికిత్సవైరస్ బారిన పడే అవకాశం ఉన్నవారికి త్వరగా పరీక్షలు నిర్వహించి, చికిత్స ప్రారంభించాలి.గర్భిణులకు పరీక్షలు తల్లి నుండి బిడ్డకు వైరస్ సంక్రమించకుండా నిరోధించేందుకు గర్భం దాల్చిన మూడు నెలల్లోపు సిఫిలిస్, హెచ్ఐవీ పరీక్షలను తప్పనిసరి చేయాలి.చికిత్స కొనసాగింపు ఇన్ఫెక్షన్ గుర్తించిన తర్వాత యాంటీరెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ)ని క్రమం తప్పకుండా కొనసాగించాలి.సురక్షిత పద్ధతులు కండోమ్‌ల వాడకం, సురక్షితమైన లైంగిక పద్ధతులు, అధీకృత కేంద్రాల నుండి మాత్రమే రక్త మార్పిడి సేవలను తీసుకోవడంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి.ఇది కూడా చదవండి: AIDS Day: హెచ్ఐవీ నయం అవుతుందా? తాజా పరిశోధనల్లో.. -
శబరిమలలో తగ్గిన భక్తుల రద్దీ ..!
సాక్షి శబరిమల: మొన్నటివరకు జసందోహంతో కిటకిటలాడిన శబరిమల ఈ రోజు చాలా ఖాళీగా దర్శనమిచ్చింది. వర్చువల్ క్యూ ద్వారా బుక్ చేసుకున్న వారిలో దాదాపు 15% మంది దాక రాలేదు. అందువల్ల గత రెండు రోజులుగా అయ్యప్ప స్వామి దర్శనానికి రద్దీ తగ్గింది. స్పాట్ బుకింగ్ పరిమితిని పెంచుకోవచ్చని కేరళ హైకోర్టు చెప్పినా.. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి సన్నిధానంలోని నడపండాల్, పదునెట్టాంబడి(18 మెట్లు), అయ్యప్ప ఆలయ ప్రాంగణం, మాలికాపురోత్తమ్మ మంజుమాత ఆలయం వద్ద రద్దీ తక్కువగా ఉండటం గమనార్హం. అలాగే 18వ మెట్టు ఎక్కడానికి క్యూలైన్ నిన్నమొన్నటి వరకు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయింది. సగటున నిమిషానికి 85 మంది భక్తులు 18 మెట్లను అధిరోహించారు. సోమవారం మాత్రం ఇక్కడి క్యూలైన్లలో భక్తులు తక్కువగా కనిపించారు. పంపా నుంచి వచ్చిన వారు వేచి ఉండకుండా నేరుగా మెట్లు ఎక్కి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే ఈరోజు ఉదయం 7.30 గంటలకు పూజ సమయం కావడంతో 18వ మెట్టు ఎక్కడానికి అరగంటపాటు నిలిపివేసినా కూడా అంతగా రద్దీ లేదు. ఇదిలా ఉండగా, డిసెంబరు 27తో వర్చువల్ క్యూబుకింగ్ పూర్తయింది. ఒకవేళ బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. అక్కడ ఎరుపు రంగులో కనిపిస్తుంటుంది. అంటే దీని అర్థం మండలకాలం ముగిసేవరకు ఎవరూ కొత్త స్లాట్ బుక్ చేసుకోలేరు. ఇక ప్రతి రోజు శబరిమల సన్నిధానం రద్దీ ఆధారంగా స్పాట్ బుకింగ్‌లకు అనుమతివ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నీలక్కల్లో, వండిపెరియార్ వద్ద మాత్రమే స్పాట్ బుకింగ్ కౌంటర్లు ఉన్నాయి. ఈ స్పాట్ బుకింగ్ అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుంది. అదంతా గంటలోపు పూర్తవుతుంది. దాంతో ఇరుముడితో వచ్చే యాత్రికులు నిరాశతో నీలక్కల్ చుట్టూ తిరగాల్సి వస్తోంది. కాగా, గతేడాది ఇరుముడితో వచ్చే భక్తులను ఎవ్వరిని వెనక్కి పంపకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఆ వైఖరిని మార్చడం గమనార్హం..! దీనివల్ల యాత్రికులకు చాలా ఇబ్బందులు ఎదురవ్వుతున్నాయి. అయితే దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ మాత్రం తగ్గుతోంది. ఈ ఉదయం వరకు ఉన్న గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 12.13 లక్షల మంది అయ్యప్పలు ఆలయాన్ని సందర్శించారు.(చదవండి: ఆ హరిహరసుతుడికి పిండిచేసిన పాయసం నుంచి నువ్వుల పాయసం వరకు..!) -
శబరిమల అయ్యప్పకు అర్పించే నైవేద్యాలివే..!
శబరిమల అయ్యప్పస్వామి అనగానే నోరూరించే అరవణ ప్రసాదమే గుర్తొస్తుంటుంది. ఆ ప్రసాదం ఇష్టపడని భక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ ఒక్క ప్రసాదమే కాదు నాలుగు రకాల పాయసాలను ఆ హరిహరసుతుడికి నివేదిస్తారు. అవన్నీ ఆయుర్వేద పరంగా ఔషధ గుణాలు కలిగినవి. తక్షణ శక్తిని ఇచ్చేవి. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి అరవణ పాయసంతోపాటు సమర్పించే ఇతర నైవేద్యాల వివరాలు, వాటి ప్రత్యేకత గురించి సవివరంగా తెలుసుకుందాం.⇒ ఉషః కాలంలో ఉదయం 7.30 గంటల సమయంలో కొబ్బరి పిండితో చేసిన పాయసాన్ని నివేదిస్తారు. దీని పేరుకు తగ్గట్టుగా ఈ పాయసం కొబ్బరికాయను చూర్ణం చేసి.. ఆ పిండికి, రెండు గ్లాసుల కొబ్బరి పాలకు బెల్లం జోడించి తయారు చేస్తారు. ⇒ మధ్యాహ్నం 12 గంటల పూజ కోసం అరవణ పాయసాన్ని నివేదిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. ఇది రైస్, ఎండు కొబ్బరి ముక్కలు, నెయ్యి, ఎండు ద్రాక్ష, తాటిబెల్లం, శొంఠిపొడి, యాలకుల పొడి, పచ్చ కర్పూరంతో తయారవుతుంది. ⇒ ఇక మిగతా పూజాసమయాల్లో తెల్ల నైవేద్యాన్ని నివేదిస్తారు. రాత్రి 9.15 గంటలకు సాయంత్రం పూజ కోసం నువ్వుల పాయసం నివేదిస్తారు. ఈ మేరకు శబరిమల తంత్రి కంఠరార్ మహేష్ మోహనార్ మాట్లాడుతూ.. ‘‘నువ్వుల పాయసం నిజానికి పాయసం రూపంలో ఉండదు.. నువ్వులే’’ అని చెప్పుకొచ్చారు. సాయంత్రం పూజ కోసం అయ్యప్పకు పానకం, అప్పం, అడ అనే పానీయం నివేదిస్తారు. ఇక్కడ పానకం అనేది జీలకర్ర, బెల్లం, పసుపు, నల్ల మిరియాలు కలిపిన ఔషధ మిశ్రమం.అత్యంత స్పెషల్ పంచామృతం..తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తెరిచినప్పుడు అభిషేకానికి ఈ పంచామృతాన్ని వినియోగిస్తారు. స్పటికబెల్లం, బెల్లం, అరటి పండు, ఎండు ద్రాక్ష(కిస్మిస్), నెయ్యి, తేనె, యాలకుల పొడి, లవంగాల పొడి, తదితర ఎనిమిది పొడులను కలిపి పంచామృతం తయారు చేస్తారు. పాయసాలలో అరవణ తర్వాత పంచామృతం అత్యంత రుచికరమైన ప్రసాదంగా భక్తులు చెబుతుంటారు. అంతేాకాదు శబరిమలలో ఈ అరవణ ప్రసాదంతోపాటు అచ్చం అరవణ టన్ మాదిరి సగం సీసాలో ఈ పంచామృతాన్ని విక్రయిస్తారు. దీని ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ.125లు పలుకుతుంది. అయ్యప్ప స్వామి పూజా విధానాలే కాదు నివేదించే నైవేద్యాలు కూడా అత్యంత ప్రత్యేకమే కదా..!.(చదవండి: దేవస్వం బోర్డు మైదానంలో పార్కింగ్‌పై ఫిర్యాదులు..!) -
దేవస్వం బోర్డు మైదానంలో పార్కింగ్‌పై ఫిర్యాదులు..!
సాక్షి ఎరుమేలి: దేవస్వం బోర్డు యాత్రికుల వాహనాల పార్కింగ్‌పై ఫిర్యాదుల కలకలం. దేవస్వం బోర్డు ఒప్పందం కుదుర్చకున్న మొత్తం కంటే అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై తక్కణమే రెవెన్యూ శాఖ చర్యలు తీసుకోవాలంటూ మండిపడితున్నారు యాత్రికులు. నిజానికి దేవస్వం బోర్డు ప్రయాణికులు వాహనాల పార్కింగ్ ఫీజును రూ. 75గా నిర్ణయించగా, కర్ణాటకు చెందిన యాత్రికుల వాహనాలకు అధిక మొత్తంలో రూ. 250 వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. హిందూ సంస్థలు, పోలీసులు జోక్యం మేరకు అదనపు మొత్తాన్ని తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. అదీగాక కొంతమొంది యాత్రికులు పోలీసు కంట్రోల్ రూమ్‌కి ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు వచ్చి రెవెన్యూ కంట్రోల్ రూమ్ బృందానికి ఫోన్ చేశారని, అలాగే వసూలు చేసిన అధిక మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించారే గానీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదని హిందూ సంస్థ ఆఫీస్ బేరర్లు ఆరోపించారు. ఈ మేరకు అయ్యప్ప సేవా సమాజం రాష్ట్ర కార్యదర్శి ఎస్. మనోజ్ నేతృత్వంలో కొందరూ సంఘటన స్థలానికి చేరుకుని అధిక రుసుములు వసూలు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధిక రుసుములు వసూలు చేసినట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించినప్పటికీ, చర్యలు తీసుకోవాల్సింది తాము కాదని చెప్పడం గమనార్హం. అదీగాక లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనా చర్యలు తీసుకుంటామనేది పోలీసుల వాదన. గత వారంన్నర కాలంలో యాత్రికుల వాహనాల నుంచి సుమారు మూడు రెట్లు పార్కింగ్ రుసుము వసూలు చేసినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. కనీసం దేవస్వం బోర్డు సైతం చర్యలు తీసుకోవడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఆఖరికి తిరిగి వెళ్లేటప్పుడూ కూడా ..దేవస్వం బోర్డు మైదానంలోని కాంట్రాక్టర్లు బిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగించి పార్కింగ్ రుసుము వసూలు చేస్తారు. పైగా దేవస్వం బోర్డు ఒప్పందం ప్రకారం, పార్కింగ్ రుసుముకు రశీదు ఇవ్వాలి. అంతేగాదు దోపిడీ పెరగడంతో, దేవస్వం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీలు వేసిన రశీదును జారీ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది కూడా. అదీగాక వాహనాలు పార్కింగ్ మైదానంలోకి ప్రవేశించిన వెంటనే రశీదు జారీ చేయాలన్న ఆదేశం. అయితే అందుకూ విరుద్ధంగా వాహనాలు పార్కింగ్ మైదానం నుంచి తిరిగి వెళ్లిపోతున్నప్పుడు డబ్బు వసూలు చేస్తున్నాట్లు సమాచారం.నోటీసులు జారీ ..యాత్రికుల వాహనాలకు అధిక పార్కింగ్ ఫీజులు వసూలు చేయడానికి ప్రయత్నించిన కేసులో కాంట్రాక్టర్‌కు దేవస్వం బోర్డు నోటీసులు జారీ చేస్తుంది. అలాగే ఒప్పంద ఉల్లంఘనకు గానూ తగిన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొంది. (చదవండి: బుకింగ్ పాస్‌లు ఉన్నవారికే శబరిమలకు అనుమతి..! హైకోర్టు) -
శబరిమల యాత్రలో ఆ రెండుచోట్ల గుండెపోటు ముప్పు!
శబరిమల యాత్రికులకు రెండుచోట్ల గుండెపోటు ముప్పు పొంచి ఉంది! సముద్రమట్టానికి ఎత్తయిన ప్రాంతంలోకి వెళ్తుండడం.. ఉపవాసాలు, డీహైడ్రేషన్, ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉండడం వంటి కారణాలతో ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. స్వయానా కేరళ వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్న విషయమిది. పంపా బేస్ నుంచి శబరిమలకు వెళ్లే చిన్నపాదం మార్గంలో అత్యంత కఠినమైనదిగా పిలిచే నీలిమలతోపాటు.. కొండ శిఖరాగ్రంలో ఉండే అప్పాచిమేడు వద్ద భక్తులకు గుండెపోట్లు ఎక్కువగా సంభవిస్తున్నట్లు ఆరోగ్యశాఖ జారీ చేసిన హెచ్చరికల్లో స్పష్టమవుతోంది. ప్రతిఏటా పెరుగుతున్న మరణాల సంఖ్య ప్రతిఏటా నీలిమల, అప్పాచిమేడు ప్రాంతాల్లో గుండెపోటుతో భక్తులు కుప్పకూలిపోతున్న ఉదంతాలు.. మరణాలు నమోదవుతున్నట్లు ట్రావెన్కోర్ దేవోస్వం బోర్డు(టీడీబీ), కేరళ వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు క్రైం డేటా రికార్డ్ బ్యూరో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన ఏడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. 2017–18 సీజన్లో 281 మంది గుండెపోటు బారినపడగా, వారిలో 36 మంది మృతి చెందారు. 2018–19లో 173 గుండెపోటు కేసులు నమోదుకాగా, 24 మంది మరణించారు, 2019–20లో 19, 2022–23లో 24, 2023–24లో మరో 24, 2024–25లో 40 గుండెపోటు మరణాలు నమోదయ్యాయి. 2025–26 సీజన్ ప్రస్తుతం కొనసాగుతుండగా.. ఇప్పటివరకు ఓ మహిళ గుండెపోటు కారణంగా మృతిచెందినట్లు పోలీసు రికార్డులు చెబుతుండగా, 8 మరణాలు నమోదైనట్లు నాలుగు రోజుల క్రితం ఓ జాతీయ ఆంగ్ల పత్రికలో కథనం ప్రచురితమైంది. 2020–22లో మాత్రం కొవిడ్ ఆంక్షల కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు. ఆ సీజన్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. అక్కడే ఎందుకు? సముద్ర మట్టానికి ఎత్తులో ఉండడం, ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండడం వంటి కారణాలతో నీలిమల, అప్పాచిమేడు ప్రాంతాల్లో గుండెపోట్లు అధికంగా సంభవిస్తున్నాయి. నీలిమల కొండ నిటారుగా, చాలా ఎత్తుగా ఉంటుంది. శబరియాత్రలో పెద్దపాదంలో ముక్కు కొండగా పిలిచే కరిమల కొండ తర్వాత.. చిన్నపాదంలో దాదాపు అదే స్థాయిలోనే నీలిమల ఉంటుంది. నీలిమలను అధిరోహించేందుకు ట్రావెన్కోర్ దేవోస్వం బోర్డు ఏర్పాటు చేసిన మెట్లు ఉన్నప్పటికీ భక్తులు ఈ ఒక్క కొండను అధిరోహిస్తే ఇబ్బందులు దూరమవుతాయనే ఉద్దేశంతో నడకలో వేగాన్ని పెంచుతారు. లేదంటే.. ముందు నడిచివెళ్లే తమ బృందంలోని సభ్యులను అందుకోవాలనే ఉద్దేశంతో వడివడిగా నడుస్తారు. దాంతో హార్ట్ బీట్‌లో మార్పులు చోటుచేసుకుంటాయి. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండడంతో ఆక్సిజన్ తగ్గుతుంది. డిమాండ్ పెరగడం.. అందుకు అనుగుణంగా ప్రాణవాయువు అందకపోవడంతో శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలు క్రమంగా పడిపోతాయి. హార్ట్‌బీట్‌లో హెచ్చుతగ్గులకు తోడు.. ఆక్సిజన్ స్థాయిలు తగ్గడంతో గుండెకు రక్త సరఫరా నెమ్మదిస్తుంది. ఈ కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదాలుంటాయని వైద్య నిపుణులు విశ్లేíÙస్తున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి రుగ్మతలు, కొలె్రస్టాల్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి నీలిమల అధిరోహించేప్పుడు వేగాన్ని పెంచడం ప్రమాదకరమని చెబుతున్నారు. ఇక అప్పాచిమేడు ప్రాంతంలో కొండ ఎత్తుగా లేకున్నా.. అది శిఖరాగ్రం కావడంతో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయని వివరిస్తున్నారు. అందుకే కేరళ వైద్య ఆరోగ్య శాఖ ఈ ప్రాంతాల్లో ఆక్సిజన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ మరణాలు ప్రతిఏటా పెరుగుతూనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన కారణాలివే.. → దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలో గుండెపోటు సమస్యలను పక్కనపెడితే.. ఆరోగ్యకరంగా ఉన్నవారు కూడా బాధితులుగా మారుతున్నట్లు కేరళ వైద్య ఆ రోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దీనికి కూడా కారణాలున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. → శబరియాత్ర కోసం భక్తులు రేయింబవళ్లు ప్రయాణంలోనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో రాత్రంతా ప్రయాణాలు చేస్తుంటారు. భోజనం కూడా సమయానికి తీసుకోరు. సామూహికంగా వంట చేసుకున్నప్పుడో.. శాకాహార హోటళ్లు అందుబాటులో ఉన్నప్పుడో ఆహారం తీసుకుంటారు. కంటినిండా నిద్ర, కడుపునిండా భోజనం లేకపోవడంతో శరీరం అలసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. → ఇలాంటి వారిలో డీహైడ్రేషన్ పెరుగుతుంది. గ్లూకోజ్ స్థాయులు, ఎలక్ట్రోలైట్లు తగ్గిపోతా యి. ఫలితంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. → ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ లభ్యత తగ్గితే.. గుండెపోట్లు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. → చాలామంది భక్తులు పంపా బేస్‌లోని హోటళ్లలో భోజనం చేయగానే.. కొండను అధిరోహించడం చేస్తుంటారని, ఇది కూడా ప్రమాదకరమని నిపుణులు వివరిస్తున్నారు. భోజనం తర్వాత రక్తప్రసరణ ఎక్కువగా జీర్ణాశయం వైపు వెళ్తుందని, ఫలితంగా గుండెపై రెట్టింపు ఒత్తిడి ఉంటుందని పేర్కొంటున్నారు. కడుపు నిండుగా ఉన్నప్పుడు గుండెపోటు సంభవిస్తే.. రిస్క్ ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. → ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రెకింగ్ చేసేప్పుడు డీహైడ్రేషన్ సంభవించడం చాలా ప్రమాదకరమని పేర్కొంటున్నారు. – సాక్షి డిజిటల్ డెస్క్ -
కొచ్చి ఎయిర్‌పోర్టులో అయ్యప్పలకు ఉచిత బస
కొచ్చి: కొచ్చి విమానాశ్రయంలో అయ్యప్ప భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఏసీ ఉచిత వసతి, స్పాట్ బుకింగ్, రవాణా సౌకర్యాలు అందిస్తున్నారు. కొచ్చి విమానాశ్రయంలో శబరిమల యాత్రికుల కోసం దేశంలోనే మొదటి ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. యాత్రికులు విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే శబరిమల దర్శనానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.రాత్రి 8 గంటలకు విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2.30కి పంబా చేరతాయి. భక్తుల కోసం మార్గమధ్యలో ఏర్పాటు చేసిన తాత్కాలిక విశ్రాంతి కేంద్రాల(ఎడతవలం) వద్ద సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఆహారం, నీరు అందిస్తున్నారు.కాగా, విమానంలో శబరిమలకు వెళ్లే స్వాములకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇరుముడిని తమతో పాటు తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో చెక్ఇన్ లగేజీగా పంపేలా ఇంతకాలం ఉన్న ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీంతో కేబిన్ బ్యాగేజీగా తమ వెంట తీసుకెళ్లడానికి స్వాములకు వీలు కలగనుంది. తాజా నిర్ణయంతో.. శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు, ఎయిర్‌పోర్టు భద్రతా తనిఖీలను పూర్తి చేసిన అనంతరం, తమ ఇరుముడిని చేతి సామానుగా విమాన క్యాబిన్లో తమతో పాటు తీసుకువెళ్ళవచ్చు. భక్తుల విశ్వాసానికి విలువ ఇస్తూ.. సంబంధిత భద్రతా శాఖలతో సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు. జనవరి 20వ తేదీ వరకు ఇది వర్తిస్తుందని అన్నారాయన.శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని (కొబ్బరికాయతో సహా) ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లుకునే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పించనున్నారు. ఇప్పటివరకు అమలులో ఉన్న భద్రతా నియమావళి ప్రకారం ఇరుముడిని తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజీగా పంపాల్సి రావడం వల్ల భక్తులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొంటూ వచ్చారు. ఈ కారణంగానే చాలామంది స్వాములు విమాన ప్రయాణాలకు దూరంగా ఉంటూ వచ్చేవారు. -
అభిషేక్ శర్మ అట్టర్‌ఫ్లాప్.. సంజూ శాంసన్ ఫెయిల్
టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్.. అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 ఎలైట్ రెండో రౌండ్లో ఇద్దరూ విఫలమయ్యారు. దీంతో అభిషేక్ శర్మ సారథ్యం వహిస్తున్న పంజాబ్ జట్టుకు.. సంజూ కెప్టెన్‌గా ఉన్న కేరళ జట్టుకు ఓటములు ఎదురయ్యాయి.ఎలైట్ గ్రూప్-‘సి’లో భాగంగా హైదరాబాద్ వేదికగా పంజాబ్- హర్యానా (Punjab Vs Haryana ) శుక్రవారం తలపడ్డాయి. జింఖానా మైదానంలో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హర్యానా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 207 పరుగులు సాధించింది.సరిగ్గా 207 పరుగులే చేసి..హర్యానా కెప్టెన్ అంకిత్ కుమార్ (26 బంతుల్లో 51), వన్‌డౌన్ బ్యాటర్ నిషాంత్ సింధు (32 బంతుల్లో 61) మెరుపు అర్ధ శతకాలతో అదరగొట్టగా.. ఆఖర్లో సుమిత్ కుమార్ (14 బంతుల్లో 28) వేగంగా ఆడాడు. ఫలితంగా హర్యానా ఈ మేర స్కోరు సాధించింది.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కూడా 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి సరిగ్గా 207 పరుగులే చేసింది. కెప్టెన్, విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్ శర్మ (Abhishek Sharma- 5 బంతుల్లో 6) దారుణంగా విఫలమైనా.. అన్మోల్ప్రీత్ సింగ్ (37 బంతుల్లో 81), సన్వీర్ సింగ్ (16 బంతుల్లో 36 నాటౌట్) అదరగొట్టారు.ఇక స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించగా హర్యానా గెలుపొందింది. సన్వీర్ సింగ్ (0), రమణ్‌దీప్ సింగ్ (1) విఫలం కావడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.కేరళకు పరాభవంమరోవైపు.. తొలి మ్యాచ్‌లో ఒడిశాను పది వికెట్ల తేడాతో చిత్తు చేసిన కేరళ.. శుక్రవారం నాటి రెండో మ్యాచ్‌లో మాత్రం విఫలమైంది. లక్నోలో రైల్వేస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది.నామమాత్రపు లక్ష్యంతో ఛేదనకు దిగిన కేరళకు ఆదిలోనే షాకులు తగిలాయి. గత మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన ఓపెనర్లు సంజూ శాంసన్, రోహన్ కణ్ణుమ్మల్ ఈసారి చేతులెత్తేశారు. సంజూ 25 బంతుల్లో కేవలం 19 పరుగులు చేయగా.. రోహన్ 14 బంతుల్లో 8 పరుగులే చేసి అవుటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన అహ్మద్ ఇమ్రాన్ (12) సహా అబ్దుల్ బాసిత్ (7), సల్మాన్ నిజార్ (18), అఖిల్ స్కారియా (16), షరాఫుద్దీన్ (6) విఫలమయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎనిమిది వికెట్లు కోల్పోయిన కేరళ కేవలం 117 పరుగులే చేసింది. దీంతో రైల్వేస్ చేతిలో 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.ఇద్దరూ విఫలం కావడంతో..ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఇలా విఫలం కావడం ఆందోళనకరంగా పరిణమించింది. తదుపరి మ్యాచ్‌లలో ఇద్దరూ సత్తా చాటి ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా డిసెంబరు 9- 19 వరకు భారత్- సౌతాఫ్రికా మధ్య ఐదు టీ20లు జరుగనున్న విషయం తెలిసిందే. -
బుకింగ్ పాస్‌లు ఉన్నవారికే శబరిమలకు అనుమతి..!
వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ పాస్‌లు ఉన్నవారిని మాత్రమే శబరిమలలోకి అనుమతించాలని కేరళ హైకోర్టు పేర్కొంది. అలాగే పాస్‌లోని తేదీ, సమయాన్ని అనుసరించాలని జస్టిస్ వి రాజా విజయరాఘవన్, జస్టిస్ కే వి జయకుమార్లతో కూడిన దేవస్వం బెంచ్ కూడా ఆదేశించింది. అధిక రద్దీ కారణంగా ఏదైనా అనుచిత ఘటన జరిగితే సహించబోయేది లేదని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుని, పోలీసులను గట్టిగా హెచ్చరించింది ధర్మాసనం. పరిపాలన నిర్లక్ష్యం లేదా అమలులో లోపాల కారణంగా నివారించదగిన అత్యవసర పరిస్థితులకు లక్షలాదిమంది యాత్రికులును బలి చేయకూడదని స్పష్టం చేసింది. అలాగే నకిలీ పాస్‌లతో వచ్చేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని కూడా ఆదేశించింది. కనీసం తేదీని పాటించకుండా వచ్చేవారిని సన్నిధానంలోకి కూడా అనుమతించకూడదని స్పష్టం చేసింది. ముఖ్యంగా బుకింగ్ విధానాన్ని తూచా తప్పకుండా పాటించాలని పేర్కొంది. నిజానికి వర్చువల్ క్యూ ద్వారా బుకింగ్‌లపై ఆంక్షలు ఉన్నప్పటికీ గత కొన్ని రోజులుగా సుమారు లక్ష మంది యాత్రికులు పుణ్యక్షేత్రానికి చేరుకున్నారనే శబరిమల స్పెషల్ కమిషనర్ నివేదిక ఆధారంగా కోర్టు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఇలా ఆదేశాలు జారీ చేసింది. అదీగాక హైకోర్టు కూడా యాత్రికుల సంఖ్యపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే వర్చువల్ క్యూ బుకింగ్‌లు 70,000, స్పాట్ బుకింగ్‌లు 5000 వద్ద ఉన్నాయని, కానీ తనిఖీ చేసేటప్పుడూ..సుమారు 7877 పాస్‌లపై స్పష్టమైన సమాచారం లేదని, స్పెషల్ కమిషనర్ హైకోర్టుకి నివేదించారు. అలాగే కొందరు నకిలీ పాస్‌లతో వస్తున్నట్లుకూడా హైకోర్టుకి సమాచారం అందింది. ముఖ్యంగా గుంపులు గుంపులుగా వచ్చే చాలామంది యాత్రికుల వద్ద పాస్‌లు లేవని, అమికస్ క్యూరీ తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే కేరళ హైకోర్టు స్వయంగా ఈ కేసుని పరిగణలోనికి తీసుకుని విచారించి ఇలా ఆదేశాలు జారీ చేసింది.(చదవండి: పంపా నుంచి అంతర్రాష్ట్ర కేఎస్ఆర్టీసీ సేవలకు అనుమతి) -
విమానంలో శబరిమల వెళ్లే స్వాములకు శుభవార్త
సాక్షి, ఢిల్లీ: విమానంలో శబరిమలకు వెళ్లే స్వాములకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇరుముడిని తమతో పాటు తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో చెక్ఇన్ లగేజీగా పంపేలా ఇంతకాలం ఉన్న ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీంతో కేబిన్ బ్యాగేజీగా తమ వెంట తీసుకెళ్లడానికి స్వాములకు వీలు కలగనుంది. తాజా నిర్ణయంతో.. శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు, ఎయిర్‌పోర్టు భద్రతా తనిఖీలను పూర్తి చేసిన అనంతరం, తమ ఇరుముడిని చేతి సామానుగా విమాన క్యాబిన్లో తమతో పాటు తీసుకువెళ్ళవచ్చు. భక్తుల విశ్వాసానికి విలువ ఇస్తూ.. సంబంధిత భద్రతా శాఖలతో సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు. జనవరి 20వ తేదీ వరకు ఇది వర్తిస్తుందని అన్నారాయన.శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని (కొబ్బరికాయతో సహా) ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లుకునే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పించనున్నారు. ఇప్పటివరకు అమలులో ఉన్న భద్రతా నియమావళి ప్రకారం ఇరుముడిని తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజీగా పంపాల్సి రావడం వల్ల భక్తులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొంటూ వచ్చారు. ఈ కారణంగానే చాలామంది స్వాములు విమాన ప్రయాణాలకు దూరంగా ఉంటూ వచ్చేవారు.అయితే భక్తుల ఇక్కట్ల నేపథ్యంలో ప్రత్యేక మినహాయింపు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రత్యేక సడలింపు ఈ రోజు నుంచే(నవంబర్ 28, 2025) అమల్లోకి వస్తూ, మండల పూజల కాలం నుంచి మకర విలక్కు ముగిసే జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తుందని, భక్తులు సహకరించాలని పౌర విమానయాన విజ్ఞప్తి చేసింది. -
‘కేంద్రం లేబర్ కోడ్స్ మాకొద్దు’.. అందులో ఏముంది?
కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన లేబర్ కోడ్స్‌ను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని కేరళ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న మొత్తం నాలుగు లేబర్ కోడ్స్‌ను ఇటీవల నోటిఫై చేసింది. దశాబ్దాలుగా ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకొచ్చారు.లేబర్ కోడ్స్‌లో చేసిన ముఖ్యమైన మార్పులుతొలిసారిగా గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం.దేశవ్యాప్తంగా కార్మికులందరికీ చట్టబద్ధమైన కనీస వేతనాలు అమలు.ఉద్యోగులందరికీ తప్పనిసరి నియామక పత్రాలు.అన్ని రంగాల్లో ఏకరీతి వేతన చెల్లింపు నియమాలు తీసుకురావడం.కేరళ వైఖరికేరళ కార్మిక శాఖ మంత్రి వి.శివన్ కుట్టి కేంద్ర కార్మిక కోడ్స్‌ను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టం చేశారు. కేరళ ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న సీపీఐ(ఎం) ఈ కోడ్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ కోడ్స్ కార్మికుల దీర్ఘకాలిక హక్కులు, రక్షణలను పలుచన చేసేలా ఉన్నాయని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఈ కోడ్స్ కంపెనీల యజమానులకు అనుకూలంగా ఉండేలా రూపొందించినట్లు చెబుతోంది.ఈ కోడ్లు ఉపాధిని పెంచుతాయనే కేంద్ర ప్రభుత్వ వాదనను కేరళ ప్రభుత్వం తిరస్కరించింది. ఈ కోడ్స్ లక్ష్యం కార్మిక హక్కులను రద్దు చేయడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం అని పేర్కొంది.ఈ కోడ్స్ కార్మికులు సమ్మె చేసే హక్కును హరించడానికి ప్రయత్నిస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా మంత్రి శివన్ కుట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక వైఖరిని తీసుకోదని తెలిపారు. కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం జరుపుతున్నట్లు చెప్పారు. డిసెంబర్ మూడో వారంలో తిరువనంతపురంలో కార్మిక సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని చెప్పారు.లేబర్ కోడ్స్‌పై నిపుణులు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కార్మిక సంఘాలు, కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.తొలగింపు నియమాలు సడలింపు300 మంది వరకు కార్మికులు ఉన్న సంస్థలకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే లే-ఆఫ్‌లు లేదా తొలగింపు చర్యలు తీసుకోవడానికి అనుమతిస్తుంది. గతంలో ఈ పరిమితి 100 మంది కార్మికులుగా ఉండేది. దీనివల్ల సంస్థలు ఇష్టానుసారం ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది.సమ్మె హక్కుపై పరిమితులుసమ్మెకు వెళ్లే ముందు 14 రోజుల నోటీసు తప్పనిసరి. ఈ నియమాలు సమ్మె హక్కును పరిమితం చేస్తాయని కార్మిక సంఘాల సామూహిక బేరసారాల శక్తిని బలహీనపరుస్తాయని ఆందోళన వ్యక్తం అవుతోంది.సామాజిక భద్రతపై అస్పష్టతగిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తున్నప్పటికీ ఈ నిధుల్లో కంపెనీల విరాళం చాలా తక్కువ (ఆదాయంలో 1-2%) ఉంది. ఇది వారి అవసరాలకు సరిపోదని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.పని గంటలుఈ కోడ్ పని గంటలను రోజుకు 8 నుంచి 12 గంటలకు పెంచడానికి అనుమతిస్తుంది (వారానికి మొత్తం పని గంటల్లో మార్పు లేకపోయినా). ఇది కార్మికుల ఆరోగ్యం, శ్రేయస్సుకు హానికరం.స్థిర కాల ఉపాధిఉద్యోగులను ఏ రకమైన పనికైనా నిర్దిష్ట కాలానికి నియమించడానికి ఈ కోడ్లు అనుమతిస్తాయి. దీనివల్ల సంస్థలు రెగ్యులర్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు (గ్రాట్యుటీ, పెన్షన్ వంటివి) ఎగవేసి, ఎక్కువ మంది కార్మికులను తాత్కాలికంగా నియమించుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రిచ్‌గా కనిపిస్తున్నారా? రిచ్‌గా మారుతున్నారా? -
సంజూ శాంసన్ ధనాధన్.. రోహన్ విధ్వంసకర సెంచరీ
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 సీజన్లో కేరళ తొలి మ్యాచ్‌లోనే దుమ్ములేపింది. ఎలైట్ గ్రూప్-‘ఎ’లో భాగంగా ఒడిషా (Kerala Vs Odisha)తో జరిగిన మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఒడిషా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు స్వస్తిక్ సమాల్ (14 బంతుల్లో 20), గౌరవ్ చౌదరి (15 బంతుల్లో 29) మెరుగ్గా రాణించారు.176 పరుగులుమిగతా వారిలో వన్‌డౌన్ బ్యాటర్ సుభ్రాంషు నేనాపతి (15) నిరాశపరచగా.. కెప్టెన్ సమంత్రయ్ (41 బంతుల్లో 53) మెరుపు అర్ధ శతకంతో సత్తా చాటాడు. అతడికి తోడుగా సంబిత్ ఎస్ బరాల్ (32 బంతుల్లో 40) రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఒడిషా ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు సాధించింది. కేరళ బౌలర్లలో నిధీశ్ నాలుగు వికెట్లు తీయగా.. ఆసిఫ్ రెండు, అంకిత్ శర్మ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.బౌండరీల వర్షంఇక ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళకు ఓపెనర్లు కెప్టెన్ సంజూ శాంసన్, రోహన్ కణ్ణుమ్మల్ అదిరిపోయే ఆరంభం అందించారు. ఆది నుంచే ఒడిషా బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీల వర్షం కురిపించారు. సంజూ 41 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 51 పరుగులు సాధించాడు.సంజూ ధనాధన్.. రోహన్ విధ్వంసకర సెంచరీమరోవైపు.. రోహన్ విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొని 121 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండటం విశేషం. సంజూ, రోహన్ అజేయంగా నిలవడంతో 16.3 ఓవర్లలోనే కేరళ వికెట్ నష్టపోకుండా 177 పరుగులు సాధించి జయభేరి మోగించింది.ఇదిలా ఉంటే.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో తొలి వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన ఓపెనింగ్ జంటగా సంజూ శాంసన్, రోహన్ కణ్ణుమ్మల్ రికార్డు సాధించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.కావాల్సినంత ప్రాక్టీస్కాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో టీమిండియా వన్డే, టీ20 సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే, వన్డే జట్టులో మరోసారి సంజూకు చోటివ్వలేదు సెలక్టర్లు. ఇక దేశీ టీ20 టోర్నీలో ప్రదర్శన ఆధారంగానైనా టీ20 జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్-2026కు సన్నద్ధమయ్యే క్రమంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా కావాల్సినంత ప్రాక్టీస్ దొరకనుంది.చదవండి: Gautam Gambhir: అందరూ నన్నే నిందిస్తారు.. బీసీసీఐదే తుది నిర్ణయం -
పంపా నుంచి అంతర్రాష్ట్ర కేఎస్ఆర్టీసీ సేవలకు అనుమతి
సాక్షి శబరిమల: పంపా నుంచి అంతర్రాష్ట్ర కేఎస్ఆర్టీసీ బస్ సర్వీసులకు అనుమతి లభించింది. ఈ మేరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు కొత్త సర్వీసులను ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చారు. ముఖ్యంగా తమిళనాడులో ఏడు కేంద్రాలకు కొత్త సర్వీసులు అనుమతించగా, మొత్తం 67 బస్సులకు అనుమతులు లభించినట్లయ్యింది. వాటిలో చెన్నై, కోయంబత్తూర్, పళని, తేంకాశి, కన్యాకుమారి, కంబం, తిరునెల్వేలి తదితర ఏడు ప్రాంతాలలో త్వరలో సర్వీసులు ప్రారంభంకానున్నాయి.అలాగే కర్ణాటకలోని బెంగళూరుకు కూడా కొత్త సర్వీసు ప్రారంభంకానుంది. శబరిమల అయ్యప్ప సన్నిధానం తెరుచుకుని వారం రోజులు కావడంతో..ఈ నేపథ్యంలోనే కేఎస్ఆర్టీసీ శబరిమలకు వచ్చే యాత్రికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు పంపాకు వెళ్లి-రావడానికి యాత్రికుల కోసం సుమారు 3,710 సర్వీసులు నడిపింది. గత ఆదివారం నాటికి రికార్డు స్థాయిలో రూ. 4 కోట్లుపైన ఆదాయం రావడం విశేషం. ఇక పంపా నుంచి నిలక్కల్‌కు 1,831 సర్వీసులు నడపగా, వివిధ ప్రాంతాల నుంచి 1,879 బస్సులు పంపాకు చేరాయి. నిలక్కల్–పంపా చైన్ సర్వీసులు కూడా విజయవంతంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 15,860 చైన్ సర్వీసులు నిర్వహించారు. అంతేగాదు చెంగన్నూరు, ఎర్నాకుళం, కోట్టాయం, తిరువనంతపురం వంటి ప్రాంతాలకు ఎక్కువ బస్సులు నడుస్తున్నాయి. మొత్తం 15 బస్ స్టేషన్ల నుంచి 502 బస్సులు పంపాకు ప్రత్యేక సేవలు అందిస్తున్నాయి. అలాగే వీటితోపాటు కేఎస్ఆర్టీసి అంబులెన్స్ వాన్ కూడా సేవలందించేందుకు అందుబాటులో ఉంది. కాగా, ఈ సీజన్ ప్రారంభమైన వారం రోజుల్లోనే ఆరున్నర లక్షలకు పైగా యాత్రికులు ఈ కేఎస్ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారు. పైగా ఈసారి పంపా డ్యూటీకి కూడా ఆసక్తి ఉన్నవారికే ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా మద్యం అలవాటు లేనివారిని, పనితీరు నిరూపించుకునేవారినే నియమించింది.(చదవండి: ఇలా బుక్ చేసుకుంటే.. కన్నిస్వాములకు శబరిమల యాత్ర ఉచితం..!) -
శబరిమలలో మళ్లీ పెరిగిన రద్దీ
పథనంతిట్ట: శబరిమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. వారం క్రితం మాదిరిగా.. శబరిమల సన్నిధానంలో ఇసుకేస్తే రాలనంతగా అయ్యప్ప భక్తులు కనిపిస్తున్నారు. దీంతో.. అయ్యప్ప స్వామి దర్శనానికి 4-5 గంటల సమయం పడుతోంది. మండల పూజ సీజన్లో భాగంగా ఈ నెల 16న శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకోగా.. తొలి నాలుగు రోజుల్లో రికార్డు స్థాయిలో భక్తులు దర్శనానికి తరలివచ్చారు. వారం రోజుల్లో ఆరున్నర లక్షల మంది అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. కోళిక్కోడ్‌కు చెందిన ఓ వృద్ధురాలు రద్దీ కారణంగా శరణ్గుత్తి వద్ద మృతిచెందడంతో.. కేరళ హైకోర్టు కల్పించుకుంది. రోజువారీ స్పాట్ బుకింగ్‌లను ఐదు వేలకు పరిమితం చేసింది.భక్తుల దర్శనానికి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) కోర్టుకు చెప్పడంతో.. శనివారం నాటి విచారణ సందర్భంగా స్పాట్ బుకింగ్‌లపై విధించిన ఆంక్షలను తొలగించింది. దీంతో.. ఆదివారం నుంచి స్పాట్ బుకింగ్‌లు పెరిగాయి. నిజానికి రోజుకు 70 వేల మంది భక్తులు దర్శించుకునేలా ఆన్లైన్ స్లాట్లు విడుదలవ్వగా.. మండల సీజన్‌తో పాటు.. మకరవిళక్కు వరకు కూడా స్లాట్లు బుక్ అయిపోయాయి. దీంతో.. స్పాట్ బుకింగ్‌కు డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా బుధవారం ఉదయం నుంచి శబరిమలలో భక్తుల రద్దీ పెరిగింది. పంపాబేస్ నుంచే భక్తులు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పంపా వద్ద రద్దీ సాధారణంగా కనిపించినా.. 4 గంటల నుంచి పెరుగుతూ వచ్చింది. దీని ప్రభావం మధ్యాహ్నానికి నీలిమల, శరణ్గుత్తి ప్రాంతాల్లో కనిపించింది. నిటారు కొండపై భక్తులు గంటల కొద్దీ వేచిచూసిన దృశ్యాలను ‘సాక్షి డిజిటల్’ యూట్యూబ్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రచురించింది. నడపండాల్ క్యూలైన్లలో కూడా భక్తులు వందల సంఖ్యలో వేచిచూసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. భక్తులు శరణ్గుత్తి నుంచి సన్నిధానం చేరుకోవడానికి నాలుగు గంటల సమయం పడుతోంది. నడపండాల్ నుంచి 18 మెట్లను ఎక్కడానికి మరో అరగంట.. అక్కడి నుంచి ఫ్లైఓవర్ మీదుగా అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఇంకో అరగంట పడుతోందని శబరిమల యాత్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన భక్తులు ‘సాక్షి’కి వివరించారు. -
S.I.Rను ఆపలేం, కానీ..: సుప్రీం కోర్టు
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను నిలిపివేయాలన్న పిటిషనర్లకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. పలు రాష్ట్రాల్లో ప్రక్రియ కొనసాగుతున్నందున నిలుపుదల చేయలేమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశాశారు. అయితే పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆయన ఆదేశించారు.పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లను బుధవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా.. ఎస్ఐఆర్ విషయంలో రాజకీయ పార్టీలు లేనిపోని భయాందోళనలు కలిగిస్తున్నాయి ఈసీ పేర్కొంది. ఈ క్రమంలో.. కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం డిసెంబర్ 1వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను వివరణ కోరింది. తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఎస్ఐఆర్ విషయంలో కేరళ ప్రభుత్వం రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. ఎస్ఐఆర్ను సవాల్ చేస్తూ వేరుగా పిటిషన్లో ఇప్పటికే(నవంబర్ 21వ తేదీన) సుప్రీం కోర్టు ఈసీకి నోటీసులు జారీ చేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేదాకా ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని వేసిన మరో పిటిషన్‌పైనే ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్ 9-11 తేదీల మధ్యలో కేరళలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది.తమిళనాడు నుంచి ఎస్ఐఆర్కు అన్నాడీఎంకే మద్దతుగా అప్లికేషన్‌ను సమర్పించింది. అధికార డీఎంకే సహా అన్ని పార్టీలు వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. పుదుచ్చేరి నుంచి ప్రతిపక్ష నేత ఆర్ శివ వేరుగా పిటిషన్ వేశారు. అలాగే.. పశ్చిమ బెంగాల్ నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ కమిటీ పిటిషన్లు వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ డిసెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. అయితే.. అదే తేదీన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా విడుదల కావాల్సి ఉందని విషయం ధర్మాసనం దృష్టికి వెళ్లగా.. అవసరమైతే ఆ గడువును(డ్రాఫ్ట్ రోల్స్ ప్రచురణ) పొడిగించవచ్చని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.‘‘అవసరమని తేలితే ఎన్నికల సంఘాన్ని తేదీ పొడిగించమని ఆదేశించవచ్చు. ఆ తేదీ(డిసెంబర్ 9) కారణంగా కోర్టుకు అధికారమే లేదని చెప్పలేం. కోర్టు ఎప్పుడైనా తేదీ పొడిగించమని చెప్పగలదు’’ అని అన్నారాయన. ఎస్ఐఆర్ ఉద్దేశ్యంఎస్ఐఆర్ అనేది ఓటర్ల జాబితా ఖచ్చితత్వం కోసం ఎన్నికల సంఘం చేపట్టే ప్రత్యేక సవరణ ప్రక్రియ. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఇది వివాదాస్పదమై, సుప్రీం కోర్టుకు చేరింది. దీని ఉద్దేశం.. ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేయడంకొత్తగా అర్హులైన ఓటర్లను చేర్చడంమరణించిన లేదా అర్హత కోల్పోయిన వారిని తొలగించడంస్థానిక ఎన్నికలు లేదా ముఖ్యమైన ఎన్నికల ముందు జాబితా ఖచ్చితత్వం పెంచడం ఎస్ఐఆర్ ప్రక్రియలో.. డ్రాఫ్ట్ రోల్స్ ప్రచురణ.. ప్రస్తుత ఓటర్ల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచడం.అభ్యంతరాలు/సవరణలు స్వీకరణ.. ప్రజలు తమ పేర్లు లేకపోవడం, తప్పులు ఉండడం వంటి అంశాలను తెలియజేయవచ్చు.ఫీల్డ్ వెరిఫికేషన్.. అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు ధృవీకరిస్తారు.ఫైనల్ రోల్స్ ప్రచురణ – సవరణల తర్వాత తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు -
ఇలా బుక్ చేసుకుంటే.. కన్నిస్వాములకు శబరిమల యాత్ర ఉచితం..!
మండలం-మకరవిలక్కు పూజలతో శబరిమల జనసందోహంగా మారింది. భక్తులు నిరంతరం పంపాలో స్నానం చేసి శబరిగిరిపైకి చేరుతారు. ఈ సమయంలో లక్షల మంది భక్తులు అయ్యప్ప దర్శనం కోసం తరలివస్తారు. ముఖ్యంగా మొదటి సారి మాలధారణ చేసి, ఇరుముడితో కొండకు వచ్చే కన్ని స్వాములు శరణ్గుత్తిలో బాణం/శరం గుచ్చి, అయ్యప్పను దర్శించుకున్నాక.. మాలికపురోత్తమ మంజుమాత ఆలయానికి చేరుకుంటారు. ఇందుకు అనేక కారణాలున్నాయి.మహిషిని అయ్యప్ప సంహరించాక.. ఆమె మాలికాపురోత్తమ(మాలికాపురం) లేదా మంజుమాతగా అవతరించినట్లు చెబుతారు. ఆమె అయ్యప్పను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఆజన్మ బ్రహ్మచారి అయిన అయ్యప్ప.. ఆమె ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. అయితే.. మాలికాపురోత్తమ నొచ్చుకోవడంతో.. ఏటా తన దర్శనానికి కన్నిస్వాములు రాని సంవత్సరం తాను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి కన్ని స్వాములు ఏటా ఎరుమేలిలో వేటతుళ్లి ఆడేప్పుడు శరం/బాణం తీసుకుని, దాన్ని తమవద్దే భద్రపరుచుకుంటారు. పంపాస్నానం తర్వాత శబరిపీఠం దాటాక.. శరణ్గుత్తి వద్ద గుచ్చుతారు. ఏటా మకరవిళక్కు పర్వదినానికి ముందు మంజుమాత అయ్యప్ప సన్నిధి సమీపంలోని ఆలయం నుంచి ఏనుగు అంబారీపై శరణ్గుత్తి వరకు రావడం.. కన్నిస్వాములు వచ్చారనడానికి గుర్తుగా అక్కడ బాణాలు ఉండడం చూసి, నిరాశగా వెళ్లడం ఏటా జరిగే తంతులో భాగమే.అందుకే కన్నిస్వాములకు అయ్యప్ప యాత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్ఆర్టీసీ) కూడా కన్నిస్వాముల కోసం ప్రత్యేక సేవలు అందిస్తోంది. కేఎస్ఆర్టీసీ వెబ్సైట్లో బుక్ చేసుకునే కన్ని స్వాములకు కేవలం ఒక్కరూపాయి చార్జీతో.. తిరువనంతపురం సెంట్రల్ నుంచి పంపాబేస్ వరకు రవాణా సౌకర్యాన్ని కల్పించింది. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఈ బస్సు తిరువనంతపురం సెంట్రల్ నుంచి బయలుదేరుతుంది. (చదవండి: ఆ ఇద్దరు అప్పుడు క్లాస్మేట్స్..ఇవాళ శబరిమలలో..!) -
ఆస్పత్రి ఎమర్జెన్సీ గదిలో వివాహం
-
శబరిమలలో వర్చువల్ ఆన్లైన్ బుకింగ్ సంఖ్య మళ్లీ పెంపు
సాక్షి, తిరువనంతపురం: శబరిమలలో రేపటివరకు (24వ తేదీ) తక్షణ దర్శనానికి అనుమతించే బుకింగ్ సంఖ్యను 5 వేలుగా పరిమితం చేయాలని కేరళ హైకోర్టు ముందుగా ఆదేశించింది. దీనిపై దేవస్వం బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు, పరిస్థితులను బట్టి తక్షణ బుకింగ్ సంఖ్యను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీన్ని అనుసరించి నిన్నటి నుంచి వర్చువల్ బుకింగ్ సంఖ్య పెంచింది. ప్రస్తుతం ఒక నిమిషానికి 85 మంది భక్తులు వరకు 18వ మెట్టుకు ఎక్కడానికి అనుమతి ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది దేవస్వం బోర్డు.(చదవండి: శబరిమల యాత్రికుల వాహనాలకు ఎంవీడీ అత్యవసర సహాయం) -
ఆ ఇద్దరు అప్పుడు క్లాస్మేట్స్..ఇవాళ శబరిమలలో..!
ఒకప్పుడు వాళ్లిద్దరూ కలిసి చదువుకున్నారు. సాధారణంగా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత..ఉన్నత చదువుల రీత్యా లేదా మరేదైనా కారణాల వల్ల విడిపోవడం అనేది కామన్. అలానే ఈస్నేహితులు వారి లక్ష్యాల దృష్ట్యా వేరయ్యారు ఆ మిత్రులు. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు శబరిమల సన్నిధానంలో తారసపడి..వేర్వేరుగా విధులు నిర్వహిస్తున్నారు. అది కూడా ఒకరు భద్రతా బాధ్యతలైతే మరొకరు స్వామి సేవలో తరిస్తుండటం విశేషం.ఆ స్నేహితులే ప్రసాద్ నంబూద్రి, షోజులు. ఎరన్నూర్లోని చాలకుడికి చెందిన ప్రసాద్ నంబూద్రి, మేలూర్కి చెందిన షోజులిద్దరూ. 1997 నుంచి 99 వరకు ఐటీఐలో కలిసి చదువుకున్నారు. రెండు సంవత్సరాల అనంతరం పై చదువుల దృష్ట్యా ఎవరి దారిన వాళ్లు వెళ్లారు. కట్ చేస్తే..26 ఏళ్లకు అదే స్నేహితులు అయ్యప్పస్వామి సేవలో తరిస్తుండటం చూస్తే..ఎవరిని ఎప్పుడూ కలపాలో అప్పుడే కలుపుతాడు అనేందుకు ఈ ఫ్రెండ్సే ఉదాహరణ. ఈ ఇద్దరు యాదృచ్ఛికంగా శబరిమలలోనే విధులు నిర్వరిస్తుండటం అత్యంత ఆసక్తికర అంశం. ఇక్కడ షోజు ఏఎస్ఐగా శబరిమలలో భద్రతా బాధ్యతలు చూసుకుంటే..నంబూద్రి యాత్రికులను నియంత్రించడం, స్వామి దర్శనం అయ్యేలా చూసే మేల్శాంతిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అంటే ఇక్కడ షోజు తన స్నేహితడు మేల్శాంతిగా విధులు నిర్వర్తిస్తున్న నంబూద్రికే భద్రత కల్పిస్తూన్నాడు. ప్రస్తుతం షోజు త్రిస్సైర్ జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తుండగా, అదేసమయంలో నంబూద్రి శబరిమల మేల్శాంతిగా ఎన్నికయ్యారు. దాంతో ఆయనకు సెక్యూరిటీగా యాదృచ్ఛికంగా చిన్ననాటి స్నేహితుడు షోజునే నియమాకం అయ్యాడు. అలాగే నంబూద్రి వచ్చే ఏడాది వరకు ఈ పదివిలో కొనసాగనున్నారు. దాదాపు 26 ఏళ్ల తర్వాత విధుల రీత్యా ఒకచోటే ఆ ఇద్దరు నేస్తాలు కలిసి ఉండటం అనేది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం కాదు కదూ..!. తంత్రి, మేల్శాంతి అంటే..'తంత్రి', 'మేల్శాంతి' అనే పదాలు ఆలయ పూజలో అత్యున్నత స్థానాలను సూచిస్తాయి. ముఖ్యంగా శబరిమల వంటి ఆలయాలలో. 'తంత్రి' అంటే ప్రధాన పూజారి. ఆయన ఆలయ నిర్వహణ, నియామకాల తోపాటు ముఖ్యమైన క్రతువులకు బాధ్యత వహిస్తారు. 'మేల్శాంతి' అంటే ప్రధాన పూజారి సహాయకుడు లేదా ముఖ్య పూజారి అని అర్థం. ఈయన ప్రధాన పూజారి సమక్షంలో రోజువారీ పూజలు, ఆచారాలను నిర్వహిస్తారు.Source: manorama news(చదవండి: శబరిమల యాత్రికుల వాహనాలకు ఎంవీడీ అత్యవసర సహాయం) -
శబరిమల యాత్రికుల వాహనాలకు ఎంవీడీ అత్యవసర సహాయం
సాక్షి పథనంతిట్ట: మండల మకరవిళక్కు(మండల దీక్ష) మహోత్సవం సందర్భంగా శబరిమల యాత్రికులు ప్రయాణించే వాహనాలకు మోటారు వాహనాల శాఖ(MVD) అత్యవసర సహాయం అందించనుంది. ఆ నిమిత్తమైన ఎంవీడీ రహదారుల పక్కనే సేవను ప్రారంభించింది కూడా. పథనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల ద్వారా శబరిమలకు ప్రయాణించే యాత్రికుల వాహనం చెడిపోయినా లేదా ప్రమాదం/ఇంకేదైన అత్యవసర పరిస్థితుల్లో ఈ సేవను పొందవచ్చునని ఎంవీడీ పేర్కొంది. అంతేగాతు 24 గలంటల హైల్ప్‌లైన్ నంబర్లను ప్రారంభించింది. ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకునే యాత్ర మార్గంలో భక్తులకు ఎలాంటి అవాంతరాలు ఎదుర్వకుండా ఉండేలా సహాయం చేయడానికి ఎంవీడీ సదా సన్నద్ధంగా ఉంటుందని వెల్లడించింది. దీంతోపాటు ఎంవీడీ 24 గంటల శబరిమల సేఫ్ జోన్ హెల్ప్‌లైన్ నంబర్లను కూడా ప్రారంభించింది. ఇలవుంకల్, ఎరుమేలి, కుట్టిక్కనం వంటి ప్రాంతాల్లో MVD కంట్రోల్ రూమ్‌ల నుంచి నిరంత అత్యవసర సహాయం అందుబాటులో ఉంటుందని కూడా తెలిపింది. అలాగే వాహనాల బ్రేక్‌లు విఫలమై ప్రమాదాలు జరిగినప్పుడూ తక్షణ క్రేన్ సహాయం, అంబులెన్స సేవలు అన్నివేళలా అందుబాటులో ఉంటాయని తెలిపింది. పైగా ఈ తీర్థయాత్ర సీజన్‌ను సజావుగా సురక్షితంగా చేయడానికి అందరం కలిసి పనిచేయడమే గాక, సురక్షితమైన తీర్థయాత్రగా సిద్ధం చేద్దాం అంటూ పిలుపునిచ్చింది కూడా. ఇక శబరిమలలో ఆయా సేప్జోన్ కంట్రోల్ రూమ్ నంబర్లు... ఇలవుంకల్: 9400044991, 95623181, ఎరుమెలి: 9496367974, 8547639173 కుట్టిక్కనం: 9446037100, 8547639176'. అలాగే యాత్రికుల సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం..మెయిల్ ఐడీ safezonesabarimala@gmail.comని సంప్రదించవచ్చు.(చదవండి: శబరిమల యాత్రికుల భద్రతపై..కేరళ ప్రధాన కార్యదర్శికి లేఖ..) -
అయ్యప్ప భక్తులు అప్రమత్తంగా ఉండాలి
విజయవాడ: కేరళలోని శబరిమల పంపానదితోపాటు చుట్టుపక్కల సరస్సులు, జలాశయాల్లో మెదడును తినే అమీబా ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్న దృష్ట్యా జిల్లా నుంచి కేరళ వెళ్లే అయ్యప్ప భక్తులు, టూరిస్టులు అప్రమత్తంగా ఉండాలని ఎనీ్టఆర్ జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ మాచర్ల సుహాసిని శనివారం సూచించారు. పంపానది, చుట్టుపక్కల సరస్సులు, జలాశయాల్లో స్నానము ఆచరిస్తే ‘మెదడు తినే అమీబా’ బారిన పడే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నట్లు ఆమె తెలిపారు. దీనిని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని పిలుస్తారని తెలిపారు. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందదని స్పష్టం చేశారు. కేవలం జలాశయాలు, నదుల్లో స్నానం చేసినప్పుడు ముక్కు, నోటి ద్వారా మాత్రమే శరీరంలోకి ప్రవేశించి అమీబిక్ మీనింగో ఎన్ సఫిలిటీస్ అనే రక్తాక్రమ వ్యాధి రావడానికి కారణమవుతుందన్నారు. ఈ వ్యాధికి పూర్తిస్థాయి చికిత్స లేదన్నారు. ఐదు రోజుల్లో ప్రభావం.. ఈ మెదడు తినే అమీబా సోకిన వారిలో ఐదు రోజుల తర్వాత తీవ్రమైన తలనొప్పి, జ్వరం, ముక్కులో శ్వాసకు ఆటంకం ఏర్పడటం, వాంతులు, మెడనొప్పి, మెడ భాగంలో మంట, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని డీఎంహెచ్‌వో తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే బాధితులు కోమాలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. జాగ్రత్తలు ఇలా.. నదులు, జలాశయాల్లో స్నానం చేసేటప్పుడు ముక్కు, నోరు మూసుకోవాలి. నోటిలోకి నీరు వెళ్లకుండా తగు జాగ్రత్తలు పాటించాలి. కేరళ వెళ్లే పర్యాటకులు, శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు ఈ ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని డీఎంహెచ్‌వో సుహాసిని సూచించారు. -
కేరళ వెళ్లే భక్తులకు అలర్ట్.. మెదడులోకి ప్రాణాంతక అమీబా
తిరువనంతపురం: కేరళలో అయ్యప్ప దర్శనాలు జరుగుతున్న వేళ బ్రెయిన్ ఫీవర్ టెన్షన్ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. కేరళలో స్నానాలు చేసే వేళ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వైద్యులు సైతం తగు సూచనలు చేస్తున్నారు.వివరాల ప్రకారం.. కేరళలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ కారణంగా బ్రెయిన్ ఫీవర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో, అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రభుత్వం, వైద్య నిపుణులు కీలక సూచనలు చేశారు. దర్శనం సమయంలో స్నానాలు చేసే ముందు భక్తులు జాగ్రత్తా ఉండాలి. నీళ్లు ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా మెదడులోకి చేరుతుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఒకవేళ అమీబా మొదడులోకి చేరితే ఈ పరిస్థితి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందన్నారు. అయితే, ఈ ఇన్ఫెక్షన్ మాత్రం ఒకరి నుంచి మరొకరికి సోకదని వైద్యులు వెల్లడించారు. అధిక జ్వరం ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.Advisory for Sabarimala Pilgrims !! Kerala has reported cases of Amoebic Meningoencephalitis (Brain Fever). As a precaution, all devotees are advised to follow basic water-safety measures during the pilgrimage:🔸 Prevent river water from entering the nose🔸 Use only boiled… pic.twitter.com/o7rbMaeria— Sreekanth B+ve (@sreekanth324) November 17, 2025ఇదిలా ఉండగా.. కేరళలో గత 11 నెలల్లో దాదాపు 170 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. వారిలో 41 మంది మరణించారు. ఇక, ఒక్క నవంబర్ నెలలోనే 17 మంది ఈ వ్యాధి బారినపడగా.. వారిలో ఎనిమిది మంది మృతి చెందినట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అమీబా వల్ల కలిగే మరణాలకు మూలాన్ని కనుగొనడానికి ఆరోగ్య శాఖ అధ్యయనం ప్రారంభించినట్టు వైద్యశాఖ తెలిపింది. ఈ అధ్యయనం మలప్పురం, కోజికోడ్, కొల్లం, తిరువనంతపురం వైద్య కళాశాలలపై నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ బ్రెయిన్ ఫీవర్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అధిక జ్వరం.తీవ్రమైన తలనొప్పి, వాంతులు.నిద్రలేమి సమస్య.ముక్కులోకి నీళ్లు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఉడికించిన లేదా సురక్షితమైన తాగునీటిని మాత్రమే తీసుకోవాలి.భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి. -
శబరిమల యాత్రికుల భద్రతపై..కేరళ ప్రధాన కార్యదర్శికి లేఖ..
శబరిమలలో భక్తుల భద్రతను నిర్థారించాలని కోరుతూ కేరళ ప్రధాన కార్యదర్శికి కర్ణాటక ప్రభుత్వం లేఖ పంపింది. శబరిమల వచ్చే భక్తులకు తగిన భద్రత,రవాణా సౌకర్యాలు కల్పించాలని లేఖలో పేర్కొంది. లక్షలాదిమంది అయ్యప్ప భక్తులు కర్ణాటకకు వస్తున్నారని, అందువల్ల వారి భద్రత కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని కర్ణాట ప్రభుత్వం లేఖలో కోరింది. ఈ లేఖను కర్ణాటక కార్యదర్శి కేరళ ప్రధాన కార్యదర్శికి పంపారు. ఇదిలా ఉండగా, శబరిమల యాత్ర నిమిత్తమై దేవస్వం బోర్డుభక్తులకు ఎలాంటి ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించ లేదంటూ అఖిల భారతీయ అయ్యప్ప సేవా సంఘం విమర్శలు ఎక్కుపెట్టింది. అంతేగాదు భక్తుల భద్రతా విషయమై ముందస్తుగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేపోయిందని దేవస్వం బోర్డుపై ధ్వజమెత్తింది. గతంలో అఖిల కేరళ అయ్యప్ప సేవా సంఘం దాదాపు 4 వేల మంది వాలంటీర్లతో శబరిమలలో తాగునీరు, ఉచిత ఆహారం ఇతర సేవలను అందించింది. అయితే, దేవస్వం బోర్డు కోర్టును ఆశ్రయించిన తర్వాత రెండేళ్లుగా ఇది నిలిపేశారు. అవినీతికి మార్గం సుగమం చేయడానికి అయ్యప్ప సేవా సంఘాన్ని అక్కడి నుంచి బహిష్కరించాలని కొంతమంది దేవస్వం బోర్డు అధికారులు కోర్టును ఆశ్రయించారని వాదనలు కూడా వినిపించాయి. అయితే అఖిల భారతీయ అయ్యప్ప సేవా సంఘం మాత్రం అవకాశం ఇస్తే..ఇప్పుడైనా అన్ని సేవలను ఉచితంగా అందిస్తామని పేర్కొనడం గమనార్హం.(చదవండి: శబరిమలలో భక్తుల రద్దీ దృష్ట్యా..రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందం..) -
శబరిమల గోల్డ్ చోరీ కేసు.. మాజీ మంత్రికి ఉచ్చు?
శబరిమల ఆలయం బంగారం దొంగతనం కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తాజాగా సీపీఎం నేత, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ డైరెక్టర్ పద్మకుమార్ ఈ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన ఇచ్చిన వాంగ్మూలంతో దేవస్వం(దేవాదాయ శాఖ)మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రను విచారించే యోచనలో సిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కేరళనాట తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.శబరిమల గర్భగుడి శిల్పాలకు బంగారు పూత వేయడానికి వ్యాపారవేత్త ఉన్నికృష్ణన్ పొట్టి స్పాన్సర్‌గా ముందుకు వచ్చారని.. ఈ ప్రతిపాదన ఆనాటి దేవస్వం మంత్రికి కూడా తెలిసిందని.. సురేంద్రన్ కూడా లేఖ ద్వారా ఆసక్తి వ్యక్తం చేశారని పద్మకుమార్ వాంగ్మూలంలో ఉంది. ఈ వాంగ్మూలం ఆధారంగా సురేంద్రన్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసే అవకాశం ఉంది. అయితే.. పద్మకుమార్ విచారణ పూర్తైన తర్వాతే ఏదనే నిర్ణయం తీసుకుంటామని సిట్ వర్గాలు చెబుతున్నాయి. పూజారి నుంచి వ్యాపారవేత్తగా మారిన ఉన్నికృష్ణన్ పొట్టి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 1998లో బంగారు పూత వేసిన ద్వారపాలక శిల్పాలపై తిరిగి పనులు చేయడానికి పొట్టికి అనుమతి ఇచ్చిన సమయంలోనే బంగారం చోరీ జరిగినట్లు సిట్ గుర్తించిన సంగతి తెలిసిందే. రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులతో పొట్టి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని.. ఆ చొరవ వల్లే ఆయనకు ప్రత్యేక అనుకూలత లభించిందని, చోరీ చేశాడని ఆరోపణలు ఉన్నాయి.ఈ కేసులో ఇప్పటిదాకా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నికృష్ణన్ పొట్టి తోపాటు మురారి బాబు (మాజీ దేవస్థానం బోర్డు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్), డీ సుధీశ్ కుమార్ (మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్), ఎన్. వాసు (మాజీ దేవస్థానం కమిషనర్, అధ్యక్షుడు) అరెస్ట్ అయ్యారు. వాసు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా గురువారం నాలుగు గంటలపాటు మాజీ ఎమ్మెల్యే, మాజీ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పద్మకుమార్‌ను విచారించి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. Watch: In the Sabarimala gold theft case, former Travancore Devaswom Board president A. Padmakumar has been arrested by the SIT. The arrest was recorded after he was questioned at the State Police Headquarters. Padmakumar was the Devaswom Board president in 2019, when the gold… pic.twitter.com/4wVDWqrANy— Jist (@jist_news) November 20, 2025అయితే.. విచారణ లోతుల్లోకి వెళ్లే కొద్దీ అధికార పక్షం నేతల పేర్లు ఒక్కొక్కటిగా తెర మీదకు వస్తున్నాయి. సీపీఎం నేతలైన దేవస్వం కమిషనర్ ఎన్. వాసు, తరువాత ఎ. పద్మకుమార్ అరెస్టు కావడం.. ఇప్పుడు మాజీ మంత్రి పేరు రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ఆ పార్టీ సీనియర్ నేతల పాత్రలపై సమగ్ర దర్యాప్తు జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై సీఎం పినరయి విజయన్ స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ కోరుతున్నారు.పొట్టి వెనుక భారీ శక్తులుండొచ్చు: హైకోర్టుశబరిమల బంగారం దోపిడీ కేసులో ఏదైనా కుట్ర జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు కేరళ హైకోర్టు సూచించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ పొట్టి వెనుక భారీ శక్తులే ఉన్నాయనే అనుమానం వ్యక్తంచేసింది. దర్యాప్తును వేగవంతం చేయాలని జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కె.వి.జయకుమార్‌ల ధర్మాసనం ఆదేశించింది. మరోవైపు దర్యాప్తు గోప్యతను కాపాడేందుకు సుమోటోగా కొత్త పిటిషన్‌ను నమోదు చేయాలని హైకోర్టు నిర్ణయించింది. -
రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేం
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీలు ఆమోదించి పంపే బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్లు ఆమోదం తెలిపే అంశంపై న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల నడుమ తలెత్తిన పెను సంక్షోభానికి అత్యున్నత న్యాయస్థానం ఎట్టకేలకు సామరస్యపూర్వకంగా తెరదించింది. ‘‘ఈ విషయంలో సుప్రీంకోర్టుతో సహా ఏ న్యాయస్థానమూ వారికి ఎలాంటి గడువూ విధించజాలదు. అలా చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఇది కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాలను న్యాయవ్యవస్థ తన గుప్పెట పట్టడమే అవుతుంది. దీన్ని రాజ్యాంగం ఏ రూపంలోనూ అనుమతించలేదు’’ అని తేల్చిచెప్పింది. అంతేగాక సదరు బిల్లులకు ఆమోదం తెలపడం, రిజర్వులో ఉంచడంపై న్యాయ సమీక్ష కూడా కుదరదని స్పష్టం చేసింది. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి, గవర్నర్లకు మూడు నెలల గడువు విధిస్తూ ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో సంచలన తీర్పు వెలువరించడం, అది రెండు కీలక వ్యవస్థల నడుమ సంక్షోభానికి దారితీయడం తెలిసిందే. మూడు నెలల్లోపు నిర్ణయం వెలువరించని పక్షంలో సదరు బిల్లులకు ఆమోదం లభించినట్టే భావించాలని కూడా ఆ తీర్పు పేర్కొంది. ఈ రెండు అంశాలూ చెల్లుబాటు కాబోవని సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ అంశంపై గురువారం ఈ మేరకు ఏకగ్రీవంగా 111 పేజీల తుది తీర్పు వెలువరించింది. ‘‘రాష్ట్రపతి, గవర్నర్లకు ఇది కార్యనిర్వాహక వ్యవస్థ విధుల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడమే అవుతుంది. అది రాజ్యాంగ విరుద్ధం’’అని వ్యాఖ్యానించింది. 142వ అధికరణంలోని ప్రత్యేక అధికారాలను వినియోగించుకుంటూ ద్విసభ్య ధర్మాసనం వెలువరించిన ఆ తీర్పును కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే బిల్లులకు ఆమోదాన్ని గవర్నర్లు నిరవధికంగా పెండింగ్‌లో పెట్టడం మాత్రం ఎంతమాత్రమూ సబబు కాదని సీజేఐ ధర్మాసనం ఈ సందర్భంగా విస్పష్టంగా పేర్కొంది. ‘‘రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా అంతులేని జాప్యం చేస్తే కోర్టులు చూస్తూ ఊరుకోబోవు. వాటిపై పరిమిత న్యాయసమీక్ష జరపవచ్చు’’అని పేర్కొంది. అయితే, ‘‘అప్పుడు కూడా వీలైనంత త్వరగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించాలే తప్ప రాష్ట్రపతికి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించడానికి వీల్లేదు’’అని స్పష్టం చేసింది. అంతేకాదు, ‘‘బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్ర మంత్రిమండలి సలహాకు గవర్నర్ కట్టుబడాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో విచక్షణ మేరకు వ్యవహరించే అధికారం రాజ్యాంగమే కల్పించింది’’అని కూడా గుర్తు చేసింది. రాజ్యాంగ ధర్మాసనంలో సీజేఐతో పాటు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్ ఉన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హర్షం ఈ తీర్పుపై వెలిబుచ్చారు. చరిత్రాత్మక తీర్పు వెలువరించినందుకు రాష్ట్రపతి తరఫున సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. దీనిపై డీఎంకే సర్కారు స్పందించలేదు. ఆపితే తిప్పి పంపాల్సిందే.. ఏ నిర్ణయమూ తీసుకోకుండా గవర్నర్లు సుదీర్ఘకాలం పాటు బిల్లులను పెండింగ్‌లో పెట్టడం కుదరదని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అది సబబు కూడా కాదని పేర్కొంది. ‘‘ఏ బిల్లునైనా ఆపితే దాన్ని కచ్చితంగా అసెంబ్లీకి వెనక్కి పంపాల్సిందే. రాజ్యాంగంలోని 200 అధికరణ ప్రకారం బిల్లుల విషయంలో గవర్నర్ల ముందున్నది మూడు దారులు. వాటిని ఆమోదించడం, రాష్ట్రపతికి నివేదించడం, లేదా పునఃసమీక్ష నిమిత్తం అసెంబ్లీకి తిప్పి పంపడం’’అని సీజేఐ పేర్కొన్నారు. వాటిని ఆమోదించకుండా గవర్నర్ తన వద్దే అట్టిపెట్టుకోవచ్చన్న కేంద్రం వాదనను తోసిపుచ్చారు. ‘‘అలా చేయడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఆపేయాలనుకున్న బిల్లులను అసెంబ్లీకి పంపడం ఆప్షన్కాదు, నిబంధన’అని చెప్పారు. న్యాయమూర్తి పేరు లేదు! రాజ్యాంగ ధర్మాసనం తరఫున తీర్పు రాసిన న్యాయమూర్తి పేరును అందులో పేర్కొనకపోవడం విశేషం. ఇలా అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది. 2019లో రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదం కేసుపై కూడా ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఆ తీర్పు రాసిన న్యాయమూర్తి పేరును కూడా అందులో పేర్కొనలేదు. ఇదీ నేపథ్యం...! అసెంబ్లీ పంపే బిల్లుల ఆమోదంలో గవర్నర్ల మితిమీరిన జాప్యం కొన్నేళ్లుగా వివాదాలకు దారితీస్తూ వస్తోంది. ముఖ్యంగా విపక్షాల పాలనలో ఉన్న తమిళనాడు, కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఈ సమస్య తరచూ తలెత్తుతోంది. సుప్రీంకోర్టు తాజా తీర్పుకు కారణంగా నిలిచిన కేసు కూడా బిల్లుల ఆమోదం విషయమై తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ ఎన్.రవి మధ్య తలెత్తిన వివాదానికి సంబంధించినదే. అసెంబ్లీ ఆమోదించి పంపిన 10 బిల్లులను ఆమోదించకుండా ఆయన సుదీర్ఘంగా జాప్యం చేయడాన్ని సవాలు చేస్తూ ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాంతో, చట్టసభలు ఆమోదించి పంపే బిల్లులపై గవర్నర్లతో పాటు రాష్ట్రపతి కూడా మూడు నెలల్లోగా ఏ నిర్ణయమూ తీసుకోవాలంటూ జస్టిస్ జేబీ పార్డీవాలా ద్విసభ్య ధర్మాసనం గత ఏప్రిల్ 8న సంచలన తీర్పు వెలువరించింది. అది తీవ్ర కలకలానికి దారితీసింది. ఆ తీర్పు ఆధారంగా గవర్నర్ ఆమోదించకుండా పక్కన పెట్టిన 10 బిల్లులను చట్టాలుగా నోటిఫై చేస్తూ తమిళనాడు ప్రభుత్వం గెజిట్ కూడా జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన అపీళ్లను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరిచడంతో కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు మధ్య విభేదాలు మరింత తీవ్రతరమయ్యాయి. దాంతో నేరుగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అంశంలో జోక్యం చేసుకున్నారు. బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతికి, గవర్నర్లకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను కాదని కోర్టులు ఇలా గడువులు పెట్టవచ్చా అంటూ నేరుగా సుప్రీంకోర్టునే నిలదీశారు. ఈ విషయమై పలు సందేహాలు లేవనెత్తుతూ 14 ప్రశ్నలు సంధించి వాటికి బదులు కోరారు. 143(1)వ అధికరణం రాష్ట్రపతికి కట్టబెట్టిన విశేషాధికారాలను ఉపయోగించుకుంటూ ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఆమె లేఖ రాశారు. దాంతో దీనిపై విచారణకు సీజేఐ సారథ్యంలో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. గడువును వ్యతిరేకిస్తూ కేంద్రం, సమరి్థస్తూ తమిళనాడు సహా కేరళ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలు వాదనలు విని్పంచాయి. అనంతరం గత సెపె్టంబర్ 11న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్రపతి వేసిన 14 ప్రశ్నల్లో పదకొండింటిపై తాజా తీర్పులో తమ అభిప్రాయం వెలిబుచి్చంది. మిగతా మూడింటినీ ఈ అంశంతో సంబంధం లేనివిగా పేర్కొంది. ‘‘గవర్నర్లు బిల్లుపై తమ నిర్ణయాన్ని రిజర్వు చేసిన ప్రతిసారీ రాష్ట్రపతి ఇలా 143వ అధికరణ కింద సుప్రీంకోర్టు అభిప్రాయం కోరాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొంది. -
శబరిమలలో భక్తుల రద్దీ దృష్ట్యా..రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందం..
శబరిమలలో నెలకొన్న భక్తుల రద్దీ విషయమై ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శబరిమలలో తొలి జాతీయ విపత్తు నిర్వహణ దళం (NDRF) విధుల్లోకి చేరింది. ఈ మేరకు ప్రాంతీయ రిస్పాన్స్ సెంటర్‌కు చెందిన 4వ బెటాలియన్‌లోని 30 మంది సభ్యుల బృందం నవంబర్ 19న సన్నిధానానికి చేరుకుంది. ప్రస్తుతం వారు మెట్లు ప్రాంతం మరియు నడక మార్గాల వద్ద మోహరించారు. ఒకేసారి ప్రతి ప్రాంతంలో ఐదుగురు చొప్పున విధుల్లో ఉన్నారు. చెన్నై నుంచి వచ్చిన 38 మంది సభ్యుల మరో బృందం కూడా నిన్న రాత్రి చేరుకుంది. యాత్రికులకు సీఆర్పీ సహా అత్యవసర వైద్య సహాయం అందించేలా ప్రత్యేక శిక్షణ తీసుకున్న బృందం. అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్లు, స్ట్రెచర్లు తదితర సామగ్రిని సిద్ధం చేశారు కూడా. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించడంతో పాటు, రక్షణ కార్యక్రమాలను సమన్వయం చేసేలా అప్రమత్తంగా ఉన్నారు. అలాగే ఈ బృందం శబరిమల ఏడీఎం పోలీసుల ప్రత్యేక అధికారి ఇచ్చే సూచనల మేరకు పనిచేస్తుందని ఇన్స్పెక్టర్ జీసీ ప్రసాద్ తెలిపారు. కట్టుదిట్టమైన ఆంక్షలు..ప్రస్తుతం శబరిమలలో మరిన్ని ఆంక్షలు విధించారు. స్పాట్ బుకింగ్ 20 వేల మందికి పరిమితం చేశారు. పంపా చేరుకున్న భక్తులు తమ శబరిమల దర్శనాన్ని పూర్తి చేసుకుని నిర్ణీత సమయంలోపు తిరిగి వస్తారు. అధికంగా వచ్చే వారికి మరుసటి రోజు దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారుల పేర్కొన్నారు. నీలక్కల్ నుంచి పంపా వరకు ప్రవేశం పరిమితం చేసినట్లు తెలిపారు. భక్తులకు నీలక్కల్లో వసతి సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొంది ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు.(చదవండి: ఒక్క నిమిషంలో 80 మంది.. జరగరానిది జరిగితే ఏం చేస్తారు?) -
ఒక్క నిమిషంలో 80 మంది.. జరగరానిది జరిగితే ఏం చేస్తారు?
తిరువనంతపురం: శబరిమలలో నెలకొన్న భక్తుల రద్దీపై కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ జరగరానిది జరిగితే ఏం చేస్తారంటూ ప్రభుత్వం, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుపై ధ్వజమెత్తింది. పవిత్ర వృశ్చిక మాసంలో మండల-మకరవిళక్కు వార్షిక తీర్థయాత్ర ఆదివారం సాయంత్రం మొదలైంది. కొండకు అయ్యప్ప భక్తులు పోటెత్తగా.. ఓ భక్తురాలు మంగళవారం క్యూ లైన్లోనే స్పృహ కోల్పోయి మృతి చెందింది. ఈ దరిమిలా భక్తుల రద్దీపై విచారణ జరిపిన హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆలయం తెరిచిన 48 గంట్లోనే సుమారు 2 లక్షల మంది శబరిమలకు చేరుకున్నారు. వాళ్లలో పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. ఒక్కసారిగా భక్తులు రావడంతో రద్దీపై నియంత్రణ కోల్పోయినట్లైంది. భక్తులను అలా హడావిడిగా లోపలికి, బయటకు పంపడమేంటి?.. కేవలం ఒక్క నిమిషంలో 80 మందిని దర్శనానికి అనుమతించాల్సిన అవసరం ఏంటి?. రద్దీకి తగ్గ ఏర్పాట్లు చేయలేకపోతే విపత్తు తప్పదు. అసలు ఆరు నెలల ముందు నుంచే ఏర్పాట్లు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు?.. అని ప్రశ్నించింది. దీనిపై శుక్రవారం లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అదే సమయంలో వర్చువల్ క్యూ స్లాట్లు తగ్గించకపోవడాన్ని సైతం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. స్పాట్ బుకింగ్ ద్వారా భక్తుల సంఖ్యను నియంత్రించాల్సి ఉన్నా.. అధికార యంత్రాంగం ఆ విషయంలో ఘోరంగా విఫలమైంది. అదనంగా 10 వేల మంది కొండ ఎక్కారని స్వయంగా దేవస్వం బోర్డే అంగీకరించింది. ఇది భద్రతా ప్రమాణాలకు విరుద్ధమే కదా. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రభుత్వాన్ని, TDBని ప్రశ్నించింది. భక్తుల భద్రతకు ముప్పు కలిగే విధంగా అనవసర రద్దీని ప్రోత్సహించకూడదని స్పష్టం చేసింది. ఇది స్వప్రేరిత (suo motu) విచారణ లేదంటే ఎవరైనా వేసిన పిటిషన్‌పై విచారణనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.Every year Sabarimala arrangements get worse, but this year was a new low:⏩ No drinking water for devotees⏩ No cleanliness - filth everywhere⏩ Live electric cables lying on the floor⏩ KSEB work right in the middle of pilgrim movement⏩ 15+ hour queuesFor Communists,… pic.twitter.com/J7UHAiSoGa— Anoop Antony Joseph (@AnoopKaippalli) November 18, 2025


