తిరువనంతపురం: కేరళలో అయ్యప్ప దర్శనాలు జరుగుతున్న వేళ బ్రెయిన్ ఫీవర్ టెన్షన్ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. కేరళలో స్నానాలు చేసే వేళ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వైద్యులు సైతం తగు సూచనలు చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. కేరళలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ కారణంగా బ్రెయిన్ ఫీవర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో, అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రభుత్వం, వైద్య నిపుణులు కీలక సూచనలు చేశారు. దర్శనం సమయంలో స్నానాలు చేసే ముందు భక్తులు జాగ్రత్తా ఉండాలి. నీళ్లు ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా మెదడులోకి చేరుతుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఒకవేళ అమీబా మొదడులోకి చేరితే ఈ పరిస్థితి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందన్నారు. అయితే, ఈ ఇన్ఫెక్షన్ మాత్రం ఒకరి నుంచి మరొకరికి సోకదని వైద్యులు వెల్లడించారు. అధిక జ్వరం ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.
Advisory for Sabarimala Pilgrims !!
Kerala has reported cases of Amoebic Meningoencephalitis (Brain Fever). As a precaution, all devotees are advised to follow basic water-safety measures during the pilgrimage:
🔸 Prevent river water from entering the nose
🔸 Use only boiled… pic.twitter.com/o7rbMaeria— Sreekanth B+ve (@sreekanth324) November 17, 2025
ఇదిలా ఉండగా.. కేరళలో గత 11 నెలల్లో దాదాపు 170 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. వారిలో 41 మంది మరణించారు. ఇక, ఒక్క నవంబర్ నెలలోనే 17 మంది ఈ వ్యాధి బారినపడగా.. వారిలో ఎనిమిది మంది మృతి చెందినట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అమీబా వల్ల కలిగే మరణాలకు మూలాన్ని కనుగొనడానికి ఆరోగ్య శాఖ అధ్యయనం ప్రారంభించినట్టు వైద్యశాఖ తెలిపింది. ఈ అధ్యయనం మలప్పురం, కోజికోడ్, కొల్లం, తిరువనంతపురం వైద్య కళాశాలలపై నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఈ బ్రెయిన్ ఫీవర్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- అధిక జ్వరం.
- తీవ్రమైన తలనొప్పి, వాంతులు.
- నిద్రలేమి సమస్య.
- ముక్కులోకి నీళ్లు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఉడికించిన లేదా సురక్షితమైన తాగునీటిని మాత్రమే తీసుకోవాలి.
- భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి.


