breaking news
Anantapur Latest News
-
రెవెన్యూ సమస్యలే అధికం
● పరిష్కార వేదికకు వినతుల వెల్లువ అనంతపురం అర్బన్: కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు వెల్లువెత్తాయి. కలెక్టర్ ఆనంద్‌తోపాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునరెడ్డి ప్రజల నుంచి 497 వినతులు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ అంశాలకు సంబంధించి 255 అర్జీలు కాగా.. ఇతర సమస్యలపై 242 అందాయి. కార్యక్రమానికి ముందు అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అర్జీలను ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదన్నారు. సంతృప్తి చెందేలా సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించడంతో పాటు ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. ఇసుక రీచ్ ఏర్పాటు చేయొద్దు యల్లనూరు మండలం మల్లాగుండ్ల సమీపాన చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో ఇసుక రీచ్ ఏర్పాటు చేయవద్దని చుట్టుపక్కల ఏడు గ్రామాల రైతులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అసలే కరువు పరిస్థితులు, అరకొర నీటితో పంటలను అసంపూర్తిగా పండించుకుంటున్నామని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇసుక రీచ్ ఏర్పాటు చేస్తే తాము మరింత నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోయారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ పరిశీలించి... న్యాయం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ‘స్థానిక’ ఎన్నికల సామగ్రి వచ్చేసింది!అనంతపురం న్యూటౌన్: జిల్లాలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే మండల పరిషత్ ప్రాదేశిక, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు క్షేత్రస్థాయిలో పూర్తి కావస్తున్నాయి. సోమవారం ఎన్నికల సిబ్బందికి సంబంధించిన వివిధ రకాల హ్యాండ్ బుక్కులు జెడ్పీ కార్యాలయానికి చేరుకున్నాయి. ఇందులో ఎన్నికల చోట్ల నియమావళి మాన్యువల్, రిటర్నింగ్ అధికారులు అనుసరించాల్సిన నిబంధనావళి, ప్రిసైడింగ్ అధికారుల పుస్తకాలు, సూచనల సంకలనాలు, ఎన్నికల్లో పోటీ చేసే అఽభ్యర్థుల నియమావళి పుస్తకాలు, నామినేషన్ ఫారాలు, విత్‌డ్రా ఫారాలు, ఏజెంట్ నియామక ఫారాలు, పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు, ఇతర ఎన్నికల ఫారాలు కలిపి మొత్తంగా 20 రకాల పత్రాలు, పుస్తకాలు తదితర సామగ్రి వచ్చినట్లు జిల్లాపరిషత్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
నిధుల కోసమేనా ఈ ఆరాటం?
● ఎస్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ జోక్యం ● మేం చెప్పినవారినే చైర్మన్లుగా పెట్టాలంటూ ‘పచ్చ’ నేతల హుకుం ● హెచ్ఎంలు, ఎంఈఓలపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు ● నిధులపై కన్నేసి.. కమిటీలను గుప్పిట్లో పెట్టుకునే యత్నం! ● నేడు జిల్లాలోని 1,723 పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలకు ఏర్పాట్లుఅనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు రాజకీయ జోక్యంతో వివాదాస్పదంగా మారుతున్నాయి. విద్యా వ్యవస్థలో తల్లిదండ్రులు, సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన కమిటీల్లోనూ అధికార పార్టీ నేతలు తమ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘మేం చెప్పిన పేర్లనే ఖరారు చేయాలి.. మేం సూచించిన వారినే చైర్మన్, వైస్ చైర్మన్లుగా నియమించాలి’ అంటూ ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు నేరుగా హెచ్ఎంలు, ఎంఈఓలకు ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు, ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిన తాము రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గాలా.. లేక నిష్పాక్షికంగా వ్యవహరించాలా.. అన్న సందిగ్ధంలో పడుతున్నారు. ఓటర్ల జాబితాలపైనా నేతల కన్ను ఎన్నికల నిర్వహణలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రుల ఓటరు జాబితాలను సిద్ధం చేసి నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు. అయితే ఆ జాబితాలను తమకు పంపాలని కొందరు ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ‘తల్లిదండ్రుల ఓటరు జాబితాలు సిద్ధమైన వెంటనే మాకు పంపండి.. ఎమ్మెల్యే అడిగారు.. ఆయనకు అందజేయాలి’ అంటూ ఓ ఎంఈఓ స్వయంగా హెచ్ఎంల కాన్ఫరెన్స్‌లో చెప్పినట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు కొందరు ప్రజాప్రతినిధులు నేరుగా ప్రధానోపాధ్యాయులకు ఫోన్లు చేసి తమకు అనుకూలమైన వ్యక్తుల పేర్లను ఖరారు చేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటించాల్సిన అధికారులపై ఇలాంటి ఒత్తిళ్లు రావడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనలు ఒకవైపు.. నేతల ఆదేశాలు మరోవైపు ఎస్ఎంసీ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా, సమ్మిళితంగా నిర్వహించాలని ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. కమిటీలో 75 శాతం మంది తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచే ఉండాలి. మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం కల్పించాలి. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లిదండ్రులకూ తగిన ప్రాతినిధ్యం ఉండాలి. అర్హులైన తల్లిదండ్రుల మధ్య ఎన్నికలు నిర్వహించి, అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఓటింగ్ చేపట్టాలి. తల్లిదండ్రుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన చోట నేతల సూచనలే తుది నిర్ణయాలుగా మారే పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు ఎస్ఎంసీ ఎన్నికలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం 1,723 పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతోపాటు అవసరమైన ఏర్పాట్లు చేపట్టింది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాలల్లో నిర్వహణ, అభివృద్ధి పనులపై పర్యవేక్షణతోపాటు నిధుల వినియోగంలోనూ ఎస్ఎంసీలు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ‘నాడు–నేడు’ రెండో విడత పనులు చేపడుతున్న పాఠశాలల్లో నిధుల వినియోగానికి సంబంధించి కమిటీల నిర్ణయాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో తమకు అనుకూలమైన వారిని చైర్మన్, వైస్ చైర్మన్లుగా నియమించుకోవడం ద్వారా భవిష్యత్తులో పాఠశాలల అభివృద్ధి పనులు, నిధుల ఖర్చుపై పరోక్షంగా పట్టు సాధించవచ్చనే ఉద్దేశంతోనే కొందరు నేతలు పావులు కదుపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఉద్యోగులపైనే లాఠీచార్జ్ చేస్తారా?
● చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత మండిపాటు అనంతపురం : విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శించిన దమన కాండను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఖండించారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ న్యాయమైన హక్కులు, డిమాండ్ల సాధన కోసం ఉద్యమించిన సచివాలయ ఉద్యోగులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, మహిళా ఉద్యోగులని కూడా చూడకుండా స్టేషన్లలో నిర్బంధించడం పాశవిక చర్యగా అభివర్ణించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ప్రతి ఇంటికీ సంక్షేమం అందించేందుకు 1.35 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల ద్వారా పాలన సాగించామని గుర్తుచేశారు. ఎన్నికలకు ముందు వలంటీర్లకు రూ.10 వేల జీతం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే వారిని విధుల నుంచి తొలగించారన్నారు. సచివాలయ ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయిస్తూ, అదనపు పనిభారంతో వేధిస్తున్నారని విమర్శించారు. నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ విధానం, జీఓ 11 రద్దు, జీఓ 5 పునఃసమీక్ష కోరడమే ఉద్యోగులు చేసిన తప్పా అని ప్రశ్నించారు. వంచనకు గురైన ఉద్యోగులు గత రెండున్నరేళ్లుగా ఉద్యోగులకు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పీఆర్సీ చైర్మన్‌ను కూడా నియమించలేదని అనంత విమర్శించారు. ఎన్నికల హామీలైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి అందించకుండా ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. స్థానిక ఎన్నికల్లో ఓట్లను రాబట్టుకునేందుకు కొత్త పింఛన్ల డ్రామా ఆడుతోందని ధ్వజమెత్తారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా అక్రమాలను ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని దుయ్యబట్టారు. డివిజన్ల విభజన అసంబద్ధం అనంతపురం నగరపాలక సంస్థలో ఉన్న 50 డివిజన్లను 62 డివిజన్లుగా పెంచిన తీరు అసంబద్ధంగా ఉందని అనంత వెంకటరామిరెడ్డి తప్పు పట్టారు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా కాకుండా టీడీపీ నేతల స్వలాభం కోసం డివిజన్లను మార్పులు, చేర్పులు చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల గుర్తింపు ప్రక్రియను క్రాస్ చెక్ చేసి, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్‌ను కోరారు. ఇన్ఫ్లుయెన్సర్ పాలసీపై విమర్శలు టీడీపీ కార్యకర్తలకు ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టేందుకే ‘ఇన్ఫ్లుయెన్సర్ పాలసీ’ తీసుకొచ్చారని, గతంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన సోషల్ మీడియా ఐడీలపై అక్రమ కేసులు పెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు తన అసత్య ప్రచారాలకు రూ.కోట్లు ఖర్చు చేస్తోందని విరుచుకుపడ్డారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, మాజీ కార్పొరేటర్ గుణశేఖర్ బాబు, ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి అనిల్‌కుమార్ గౌడ్, సాంస్కృతిక విభాగం నగర కార్యదర్శి కేశవరెడ్డి పాల్గొన్నారు. -
జిల్లా అంతటా సోమవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. ఉక్కపోత పెరిగింది. వాయువ్య దిశగా గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
భగ్గుమంటున్న భానుడు ● ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అనంతపురం అగ్రికల్చర్: భానుడు మళ్లీ భగ్గుమంటున్నాడు. జిల్లా వ్యాప్తంగా సోమవారం ఎండలు బాగా పెరిగాయి. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల మేర గరిష్టంగా నమోదయ్యాయి. దీంతో మండే ఎండలతో పాటు ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ సెప్టెంబర్ మొదటి వారంలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత మార్క్‌ను చేరుకోవడం ఆందోళన కలిగించాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదు కావడంతో అంతుచిక్కని వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నెల మొదటి నుంచి 18వ తేదీ వరకు ఎండలు మండిపోయాయి. తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఐదారు రోజులు వర్షాలు కురవడంతో పరిస్థితి కుదుటపడేలా కనిపించింది. అయితే వర్షాలు ఆగిపోగానే మళ్లీ సూరీడు ప్రతాపం చూపిస్తుండటం గమనార్హం. వేసవిని తలపించేలా గ్రీష్మతాపం కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు ఈసారి సకాలంలో ప్రవేశించినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్, జూలై మాసాల్లో 20 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండలు మండిపోయాయి. మధ్య మధ్యలో తేలికపాటి మినహా ఎక్కడా మంచి వర్షాలు నమోదు కాలేదు. దీంతో ఖరీఫ్ సాగు అస్తవ్యస్తం కాగా.. ప్రత్యామ్నాయ పంటల సాగు చిన్నబోయింది. ఆశలు పెట్టుకున్న రబీ ఏ మాత్రం ఆదుకుంటుందనేది అక్టోబర్ వర్షాలపై ఆధారపడి ఉంది. -
వాయుగుండంతో ఊరట
అనంతపురం అగ్రికల్చర్: మూడు నెలల పాటు వర్షం జాడలేక అల్లకల్లోలంగా మారిన ‘అనంత’ను వాయుగుండం ఆదుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఈనెల 20 నుంచి 25 తేదీల మధ్య జిల్లాలో వర్షాలు కురిశాయి. లేదంటే పరిస్థితి భయానకంగా తయారయ్యే దశకు చేరుకునేది. జూన్ ఒకటి నుంచి మొదలైన కీలకమైన ఖరీఫ్‌లో సెప్టెంబర్ 19వ తేదీ నాటికి సాధారణం కన్నా ఏకంగా 52 శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. జూన్‌లో సాధారణ వర్షం కురిసినా... జూలైలో 71 శాతం, ఆగస్టులో 60 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ 19 వరకు తీవ్ర వర్షాభావం కొనసాగింది. ఆరు రోజుల్లో 88 మి.మీ సగటు.. ఈనెల 19 వరకు తీవ్ర వర్షాభావం నెలకొనగా... వాయుగుండం ప్రభావంతో 20 నుంచి మంచి వర్షాలు కురిశాయి. 20న 43 మి.మీతో ఈ సీజన్లోనే అత్యధిక సగటు వర్షపాతం నమోదైంది. ఐదారు మండలాలు మినహా జిల్లా అంతటా చెప్పుకోదగ్గ వర్షాలు కురిశాయి. అలాగే 21న 7.5 మి.మీ, 22న 17 మి.మీ, 23న 6 మి.మీ, 24న 11.8 మి.మీ, 25న 3 మి.మీ... వరుసగా ఆరు రోజుల పాటు వర్షం పడటంతో 88 మి.మీ సగటు నమోదైంది. యాడికి, నార్పల, బొమ్మనహాళ్, పామిడి, తాడిపత్రి, పెద్దవడుగూరు, యల్లనూరు, ఆత్మకూరు, గార్లదిన్నె, ఉరవకొండ, పుట్లూరు, వజ్రకరూరు, గుత్తి, కణేకల్లు మండలాల్లో మంచి వర్షాల కురిశాయి. దీంతో సెప్టెంబర్ 19 నాటికి 265.5 మి.మీ గానూ 127.1 మి.మీ నమోదైంది. సాధారణం కన్నా 52 శాతం లోటు ఏర్పడింది. వాయుగుండంతో కురిసిన వర్షాల తర్వాత 303.4 మి.మీ గానూ 212.9 మి.మీ నమోదైంది. దీంతో వర్షపాతం లోటు 30 శాతంతో కొనసాగుతోంది. కొన్ని మండలాల్లో తేలికపాటే.. ఐదారు రోజులు విస్తారంగా వర్షాలు కురిసినా... కొన్ని మండలాల్లో తేలికపాటి నమోదుకావడం గమనార్హం. రాయదుర్గం మండలంలో 115 మి.మీ గానూ కేవలం 14.6 మి.మీ నమోదైంది. ఈ మండలంలో 73 శాతం తక్కువగా వర్షం కురిసింది. గుమ్మఘట్టలో 58.8 మి.మీ గానూ 77 శాతం తక్కువగా 22.4 మి.మీ, బ్రహ్మసముద్రంలో 85.9 మి.మీ గానూ 60 శాతం తక్కువగా 35.1 మి.మీ, డి.హీరేహాళ్‌లో 70.6 మి.మీ గానూ 67 శాతం తక్కువగా 23.3 మి.మీ మాత్రమే నమోదైంది. రాప్తాడు, బుక్కరాయసముద్రం తదితర మరో నాలుగైదు మండలాల్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. ఓవరాల్‌గా జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు ఈ సీజన్లో 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. పెద్దవడుగూరు మినహా మిగతా అన్ని మండలాల్లోనూ సాధారణం కన్నా తక్కువగానే వర్షాలు కురిశాయి. నాలుగు నెలల కాలంలో కేవలం 19 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు ప్రభుత్వం కరువు జాబితాలో కొర్రీలు వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అందులో నాలుగు మండలాలు దోబూచులాడుతున్నట్లు తెలుస్తోంది. 20 నుంచి 25వ తేదీ మధ్య 88 మి.మీ సగటు వర్షపాతం ఓవరాల్‌గా 30 శాతం లోటు వర్షమే ఇటీవల కురిసిన వర్షాలతో కరువు మండలాలకు కొర్రీ...? -
త్వరపడకుంటే.. బండ బాదుడే
అనంతపురం అర్బన్: వంట గ్యాస్ కనెక్షన్‌ను ఈ–కేవైసీ చేసుకోకపోతే వినియోగదారులు భారీగా నష్టపోతారు. అక్టోబరు ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇప్పటికీ గ్యాస్ కనెక్షన్ ఈ–కేవైసీ చేసుకోనివారు ఈ నెల 30వ తేదీలోగా చేసుకోవాలి. చేసుకోని డొమెస్టిక్ (గృహావసరాల) కనెక్షన్లు ఇకపై కమర్షియల్ (వాణిజ్య) కనెక్షన్లుగా మారిపోతాయి. అంటే వాణిజ్య ధరతో సిలిండర్‌ను కొనాల్సి ఉంటుంది. అంటే అదనపు భారం భరించక తప్పదు. రెండుసార్లు గడువు పొడిగింపు.. వంట గ్యాస్ కనెక్షన్ ఈ–కేవైసీ చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు కొన్ని నెలలుగా చెబుతూనే ఉన్నాయి. అదే క్రమంలో ఎప్పటికప్పుడు గడువును పొడిగిస్తూనే ఉన్నాయి. తొలుత జూన్ 30 వరకు ఉన్న గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించారు. అయితే ఈ దఫా ఈ–కేవైసీ గడువును పొడిగించే సూచనలు కనిపించడం లేదని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. కమర్షియల్ ధరతో... గృహావసర వంట గ్యాస్ సిలిండర్ (14.2 కిలోలు) ధర ప్రస్తుతం రూ.1,020 ఉంది. ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు సిలిండర్‌పై ప్రత్యక్షంగా రూ.50 సబ్సిడీ ఇస్తున్నాయి. ఇదే క్రమంలో డొమెస్టిక్ సిలిండర్లపై ఆయిల్ కంపెనీలు దాదాపు రూ.300 నుంచి రూ.400 భరిస్తున్నట్లు సమాచారం. ఈ–కేవైసీ చేసుకోని గ్యాస్ కనెక్షన్లను కమర్షియల్ కేటగిరీ కిందకు మార్పు చేస్తారు. అలా మారిన కనెక్షన్లకు సంబంధించి సిలిండర్ ధర రూ.1,300 నుంచి రూ.1,400 వరకు ఉంటుందని చెబుతున్నారు. డెలివరీ బాయ్స్ చేస్తున్నారు... జిల్లాలో సాధారణ, దీపం పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్లు 6,76,273 ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 85 శాతం మేర ఈ–కేవైసీ జరిగినట్లు సమాచారం. ఈ–కేవైసీ కోసం వినియోగదారులు ఏజెన్సీలకు వెళ్లాల్సిన అవసరం లేదు. డెలివరీ బాయ్స్ తమ మొబైల్ యాప్‌లోనే వినియోగ దారుని ఈ–కేవైసీ చేస్తున్నారు. వినియోగదారు తమ ప్రాంత డెలివరీ బాయ్‌ని సంప్రదించి ఈ–కేవైసీ చేసుకోవచ్చు. అదే విధంగా ఆయిల్ కంపెనీలకు చెందిన వెబ్ పోర్టల్, మొబైల్ యాప్, వాట్సాప్ చాట్‌బాట్ లేదా ఐవీఆర్ఎస్ ద్వారా తమ ఆప్షన్‌ను నమోదు చేసుకోవచ్చు. సరెండర్‌తో తగ్గిన కనెక్షన్లు.. జిల్లాలో ఈ ఏడాది మార్చిలో 7,12,473 డొమెస్టిక్ (గృహావసర) గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే బహుళ కనెక్షన్లు కలిగిన వారు ఒకటి ఉంచుకుని మిగిలిన కనెక్షన్లను సరెండర్ చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలో హెచ్చరించింది. దీంతో పలువురు తమ కనెక్షన్లను సరండర్ చేశారు. అదే విధంగా అక్రమంగా కలిగిన కనెక్షన్లను ఆయిల్ కంపెనీలు తొలగించాయి. దీంతో జిల్లావ్యాప్తంగా 36,200 డొమెస్టిక్ కనెక్షన్లు తగ్గడంతో ప్రస్తుత కనెక్షన్ల సంఖ్య 6,76,273గా ఉంది. అక్టోబరు 1 నుంచి కొత్త నిబంధనలు ఈ–కేవైసీ చేసుకోనివారికి ‘కమర్షియల్’ ధరతోనే సిలిండర్ జిల్లాలో 6.76 లక్షల కనెక్షన్లలో 85 శాతం ఈ–కేవైసీ పూర్తి -
ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలి
మడకశిర: దేశవ్యాప్తంగా ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు, మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.ఎన్నికల ప్రక్రియపై వస్తున్న అనేక ఆరోపణలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరిపించి.. ప్రజల్లో నెలకొన్న అనుమానాలను తొలగించాల్సిన అవసరముందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) చర్యలు, నిర్ణయాలకు వ్యతిరేకంగా మడకశిర మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని గాంధీజీ విగ్రహం ఎదుట ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ సర్ ప్రక్రియ ద్వారా ఓట్లను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు సీఈసీ ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్కుమార్గుప్తా ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు చేసే జాతీయ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు లేఖలు రాసినట్లు రఘువీరా తెలిపారు. సీడబ్ల్యూసీ నేత ఎన్.రఘువీరారెడ్డి -
ఆంక్షలు అధిగమించి ఆందోళనకు
అనంతపురం క్రైం: డిమాండ్ల సాధన కోసం సచివాలయ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చారు. అయితే ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసుల ద్వారా విశ్వప్రయత్నాలు చేసింది. ఉద్యోగులను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ఆంక్షలు విధించింది. అయినా జిల్లా నుంచి సచివాలయ ఉద్యోగులు ఆంక్షలను.. అడ్డంకులను అధిగమించి విజయవాడ ధర్నా చౌక్‌కు చేరుకున్నారు. ఇందు కోసం పోలీసుల కంట పడకుండా ఉండేందుకు వివిధ రకాల వేషధారణల్లో బయల్దేరారు. ధర్నా చౌక్‌కు చేరుకుని తమ నిరసన గళం విప్పారు. ఉద్యమాన్ని ఆపలేరు అతి కష్టం మీద విజయవాడకు చేరుకున్న ఉద్యోగులపై పోలీసులు విరుచుకుపడ్డారు. తమను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ నరకం చూపించారని ఉద్యోగులు మీడియా ఎదుట వాపోయారు. తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులమన్న విషయాన్ని మరిచి హీనంగా చూశారని తెలిపారు. న్యాయమైన హక్కుల కోసం పోరాడితే పోలీసులను అడ్డుపెట్టి వేధింపులకు గురిచేయడం ఏంటని నిలదీశారు. ఉద్యమాన్ని ఎంత అణచాలని చూస్తే ఉవ్వెత్తున ఎగసి పడుతుందని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేదే లేదని భీష్మించారు. ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలిన సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ వైఖరిపై నిరసన -
ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకే కుయుక్తులు
అనంతపురం: పెల్లుబుకుతున్న ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని, పనిలో పనిగా ఖజానాను కొల్లగొట్టేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల పాలసీ తీసుకొచ్చిందని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సి. రమేష్ గౌడ్ మండిపడ్డారు. అనంతపురం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన సోషల్ మీడియా వేదికలను ప్రభుత్వ ప్రచార సాధనాలుగా మార్చాలనుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో టీడీపీకి చెందిన ఇన్ఫ్లుయెన్సర్లకు పారితోషికాలు చెల్లిస్తారని, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఆ పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టాలని చూడడం దుర్మార్గమన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే స్వేచ్ఛ, ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు, వాస్తవాలను వెల్లడించడంలో సోషల్ మీడియా కీలకమన్నారు. ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందుతున్నామన్న కారణంతో ప్రజా గళాన్ని వినిపించే స్వేచ్ఛను కొంతమంది క్రెడిబిలిటీ కలిగిన ఇన్ఫ్లూయెన్సర్లు వదులుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో నిరాశ మిగిల్చిందని విమర్శించారు. హామీలను అమలు చేయకుండా ప్రచారానికి పెద్దపీట వేయడం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావన్నారు. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని, వాటిని ఏ ప్రభుత్వం లేదా రాజకీయ వ్యవస్థ ప్రభావితం చేయకూడదని హితవు పలికారు. ‘వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాం.. ప్రజా గళాన్ని వినిపిస్తాం.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు పోరాడతాం’ అని స్పష్టం చేశారు. -
ఆశలపై నీళ్లు
రాజ్యాంగ హక్కులు ప్రతి ఒక్కరికీ అందాలి పెద్దవడుగూరు: మండలంలోని లక్ష్ముంపల్లి, ముప్పాలగుత్తి, చిన్నవడుగూరు, పెద్దవడుగూరు, బుర్నాకుంట, మేడిమాకులపల్లి తదితర గ్రామాల్లో ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పారాయి. పొలాల్లోకి కూడా వర్షపునీరు చేరడంతో పత్తి, ఉద్దులు, పెసర తదితర పంటలు కుళ్లిపోయాయి. పత్తి కాయలు నేలరాలాయి. ఎకరాకు క్వింటా అయినా దిగుబడి వస్తుందని అనుకుంటే ఈ వర్షంతో పంట తుడిచిపెట్టుకుపోయిందని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. తాడిపత్రి రూరల్/ గుత్తి : రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులు అందరికీ అందాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లీసా గిల్ తెలిపారు. జిల్లాలోని తాడిపత్రి, గుత్తిలో ఏర్పాటు చేసిన అదనపు కోర్టులను ఆదివారం ఆమె వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ఆయా కోర్టులను హైకోర్టు న్యాయమూర్తులు బీఎస్ భానుమతి, కె.సురేష్‌రెడ్డి, చల్లా గుణరంజన్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, న్యాయపరమైన రక్షణలో అందరికీ సమానంగా అందే బాధ్యతను న్యాయ వ్యవస్థ చూడాలన్నారు. రాష్ట్రంలో ఇతర జిల్లాల కంటే అనంతపురం జిల్లాలో కొత్తగా 17 అదనపు కోర్టులు మంజూరయ్యాయని తెలిపారు. తాడిపత్రి, గుత్తిలో అదనపు కోర్టులను ప్రారంభించడం ఎంతో సంతోషకరమన్నారు. పెరుగుతున్న కేసుల సంఖ్యను తగ్గించేందుకు నూతన కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన జడ్జి భానుమతి తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులు కె.సురేష్‌రెడ్డి, చల్లా గుణరంజన్ మాట్లాడుతూ సమాజంలోని బలహీన వర్గాలు, ఆశ్రయ గృహాల్లోని పిల్లలు, ఇతరులకు అవసరమైన రక్షణ, సంక్షేమ సేవలు అందేలా న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సభాధ్యక్షులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు మాట్లాడుతూ ప్రజలకు సమర్థవంతమైన న్యాయం అందించేందుకు ఆయా కోర్టులు పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్పీ జగదీష్, అనంతపురం ఏడీజే జడ్జి సత్యవాణి, గుత్తి అదనపు జిల్లా జడ్జి శంకర్రావు, సీనియర్ సివిల్ జడ్జి కాశీవిశ్వనాథ్, అనంతపురం ఎకై ్సజ్ కోర్టు జడ్జి పావని, తాడిపత్రి జూనియర్ సివిల్ జడ్జి అనిల్‌కుమార్‌నాయక్, జూనియర్ సివిల్ జడ్జి శ్వేత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ఏపీపీ పరమేశ్వర్‌రెడ్డి, ఏజీపీ ఫకృబాషా, తాడిపత్రి బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి ఏవీ రమణారెడ్డి, సాహుల్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
శాసీ్త్రయ దృక్పథంతోనే ప్రగతి
అనంతపురం ఎడ్యుకేషన్: శాసీ్త్రయ భారతదేశ నిర్మాణం కోసం విద్యార్థులు కలిసికట్టుగా కృషి చేయాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఆర్ట్స్ కళాశాల డ్రామా హాల్లో జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కె.చిత్తప్ప అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రంపై ఆసక్తి పెంచుకుని శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. అశాసీ్త్రయ భావజాలం వైపు, వాటిని ప్రచారం చేసే వారి వైపు ఆకర్షితులు కాకుండా ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే ప్రశ్నించడం అలవాటు చేసుకోవడం ద్వారా సృజనాత్మకతను వెలికితీయవచ్చని జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు డాక్టర్ పి.ప్రసూన తెలిపారు. ప్రపంచం శాస్త్ర, సాంకేతిక రంగాల వైపు వేగంగా అడుగులు వేస్తోందని కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం.వంశీకృష్ణ అన్నారు. జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో జిల్లావ్యాప్తంగా ముగ్గురు విద్యార్థులతో కూడిన 42 బృందాలు పాల్గొన్నాయని జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరరాజు తెలిపారు. అనంతరం జిల్లా స్థాయి ప్రశ్నపత్రాలను డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీరాములు నాయక్, అధ్యాపకుడు బి.గోపాల్ నాయక్, జేవీవీ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ సాకే భాస్కర్, జిల్లా నాయకులు మహమ్మద్ జిలాన్, కె.లక్ష్మీనారాయణ, ఎస్.గాంగే నాయక్, ఎస్.తిరుపాల్, నాగరాజుస్వామి పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కుందుర్పి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన వెంకటంపల్లి–కుందుర్పి మార్గంలో జరిగింది. స్థానిక పోలీసుల వివరాల మేరకు.. రాయదుర్గం మండలం కాశీపురం గ్రామానికి చెందిన చిన్నరాయుడు, నాగరాజు (60)ల సమీప బంధువు కర్ణాటక పోలేపల్లిలో మరణించాడు. ఈ క్రమంలో శనివారం అతని దహన సంస్కారాలకు చిన్నరాయుడు, నాగరాజు హాజరై తిరిగి బైకులో స్వగ్రామానికి పయనమయ్యారు. మార్గమధ్యంలో మండలంలోని వెంకటంపల్లి వద్ద వీరి బైకు, మరో బైకు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో నాగరాజు, చిన్నరాయుడుతో పాటు మరో బైక్‌లోని కుందుర్పికి చెందిన దర్శన్‌కు తీవ్రగాయాలయ్యాయి. బంధువులు మెరుగైన చికిత్స కోసం ముగ్గురినీ జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు. దర్శన్‌కు కాళ్లు విరిగాయి. తలకు తీవ్రగాయాలయ్యాయి. చిన్నరాయుడు సైతం తీవ్ర గాయాలతో అనంతపురంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. మృతుడు నాగరాజుకు భార్య సావిత్రి, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆటోల దొంగ అరెస్ట్ గార్లదిన్నె: ఆటోల దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపిన మేరకు.. నెల రోజుల క్రితం కల్లూరుకు చెందిన నాగరాజు, దస్తగిరితో పాటు గార్లదిన్నెకు చెందిన ఆంజనేయులు ఆటోలు చోరీకి గురయ్యాయి. ఇంటి వద్ద పార్కింగ్ చేసి ఉండగా అపహరించుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతపురం రూరల్ డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ రాగిరి రామయ్య ఆదేశాల మేరకు టెక్నాలజీ ఆధారంగా చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం ఫజుల పేటకు చెందిన షేక్ ఇలియాజ్ ఆటోలను చోరీ చేసినట్లు గుర్తించారు. గార్లదిన్నె మండలంలోని వివిధ గ్రామాల్లో పార్క్ చేసిన ఆటోలను గమనించి ఎవరూ లేని సమయంలో షేక్ ఇలియాజ్ చోరీ చేసేవాడు. అనంతరం వాటిని ఒక చోట దాచిపెట్టి స్వగ్రామం తరలించేవాడు. అక్కడ అద్దెకు ఇచ్చి డబ్బు సంపాదించేవాడు. ఆదివారం శింగనమల మండలం లోలూరు క్రాస్ వద్ద అనుమానాస్పదంగా ఓ వ్యక్తి ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా బాగోతం బయటపడింది. అతన్ని అరెస్ట్ చేసి మూడు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. బైకును ఢీకొన్న కారు.. ముగ్గురికి గాయాలు బెళుగుప్ప: బైకును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. మండల పరిధిలోని నరసాపురం గేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని యలగలవంక గ్రామానికి చెందిన దంపతులు కవిత, రామకృష్ణలు ఆదివారం తమ కుమారుడు పునీత్ పుట్టిన రోజు కావడంతో నూతన వస్త్రాలు, ఇతరత్రా వస్తువుల కొనుగోలుకు బైకులో కళ్యాణదుర్గం వెళ్లారు. అన్నీ కొనుగోలు చేశాక తిరిగి స్వగ్రామం బయలుదేరారు. మార్గమధ్యంలో నరసాపురం గేటు వద్ద ప్రధాన రహదారిపై అతివేగంగా వెళుతున్న ఓ కారు వీరి బైకును ఢీకొంది. ప్రమాదంలో కవిత, పునీత్‌కు స్వల్ప గాయాలు కాగా, రామకృష్ణకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. హుటాహుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం అనంతపురం తీసుకెళ్లారు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
విచారణకే పరిమితమా?
● సొసైటీ చైర్మన్‌కు ఎమ్మెల్యే శ్రావణిశ్రీ అండదండలు ● రూ.30 లక్షల గోల్‌మాల్‌పై చర్యలు నిల్నార్పల: మండల కేంద్రంలోని నార్పల రైతు సేవా సహకార సంఘం (సొసైటీ)లో రూ.30 లక్షల గోల్మాల్ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారుల విచారణ సమయంలో సొసైటీ ఇన్చార్జ్ సీఈఓ తారక బ్రహ్మానందరెడ్డి పొంతనలేని సమధానాలు చెప్పడం, చైర్మన్ ఉమా మహేశ్వరనాయుడు అందుబాటులో లేకపోవడం.. వచ్చిన తర్వాత కూడా వివరణ ఇవ్వక పోవడం చర్చనీయాంశంగా మారింది. అవకతవకలకు సంబంధించిన ఆధారాలు, ఫిర్యాదులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సభ్యులు చెబుతున్నారు. అయితే విచారణలు, తనిఖీలు, నివేదికల పేరుతో ప్రక్రియ సాగుతున్నప్పటికీ తుది చర్యలు ఏమిటన్నది మాత్రం స్పష్టత లేదు. ఇదిలా ఉండగా.. నాలుగు రోజుల క్రితం రూ.3.85 లక్షలు, మరొక రోజు రూ.2 లక్షలు బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లు సమాచారం . అయితే మొత్తం బకాయిలు ఇంకా చెల్లించకపోవడంతో సభ్యుల్లో ఆందోళన కొనసాగుతోంది. కొంత కొంత మొత్తాన్ని జమ చేయడం వల్ల అసలు వ్యవహారంపై స్పష్టత రాదని, పూర్తి లెక్కలు బయటపెట్టాలని సభ్యులు కోరుతున్నారు. ఆరోపణలొస్తే నోరు మెదపరా? రైతు పక్షపాతిగా ఉంటామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తరచూ చెబుతుంటారు. అయితే రైతులకు సంబంధించిన సహకార సంఘంలో రూ.30 లక్షల మేర ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వస్తున్నా నోరు మెదపడం లేదు. సొసైటీ చైర్మన్ ఉమామహేశ్వరనాయుడు తన అనుచరుడు కావడం వల్లనే ఈ వ్యవహరంపై ఎమ్మెల్యే స్పందించడం లేదని, సంబంధిత అధికారులు కూడా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
ఆలయంలో అమ్మవారి కిరీటం అపహరణ
పెద్దపప్పూరు: మండలంలో ప్రఖ్యాతి గాంచిన చాగల్లు చౌడేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారి వెండి కిరీటం చోరీకి గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగుడు ముఖానికి మాస్కు ధరించి గుడి తాళాలు పగుల గొట్టి రూ.50 వేల విలువగల అమ్మవారి వెండి కిరీటాన్ని చోరీ చేశాడు. ఈ దృశ్యం సీసీ టీవీలో రికార్డు అయింది. ఆదివారం అమ్మవారికి పూజలు నిర్వహించాలని వెళ్లిన పూజారి కిరీటం కనిపించకపోవడంతో నిర్ఘాంతపోయాడు. గ్రామస్తులు పెద్దపప్పూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు. యువకుడి దారుణ హత్య తాడిపత్రిటౌన్: పాత కక్షల నేపథ్యంలో యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన తాడిపత్రి పట్టణంలోని భగత్‌సింగ్ నగర్లో జరిగింది. సీఐ ఆరోహణ రావు తెలిపిన మేరకు.. భగత్ సింగ్ నగర్‌కు చెందిన వన్నూరప్ప, రాముడు, పెద్దిరాజు కుటుంబాల నడుమ చాలా కాలంగా పాత కక్షలు నడుస్తున్నాయి. గతంలో ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆదివారం రాముడు, పెద్దిరాజు కుటుంబ సభ్యులైన శివ, నరేష్, ధనుంజయ, రవి, సోమశేఖర్లు వన్నూరప్ప కుటుంబంపై దాడికి దిగారు. వన్నూరప్ప కుమారుడు కుళ్లాయప్ప(25)ను కత్తితో పొడిచారు. ఈ క్రమంలోనే కుప్పకూలిపోయిన అతడిని స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుళ్లాయప్పకు భార్య నీలావతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు సీఐ ఆరోహణ రావు కేసు నమోదు చేశారు. నేడు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు మొబైల్: 8977716661 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్ చేసే వినియోగదారులు తమ విద్యుత్ నంబర్‌ను తప్పకుండా తెలియజేయాలని సూచించారు. జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ.. జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు ఫోన్ నంబర్లు 08554–272943, 9154790350కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోండి అనంతపురం సెంట్రల్: జిల్లాలో నోటిఫై చేసిన మద్యం దుకాణాలకు నాలుగు రోజులే గడువు ఉందని, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి.రామ్మోహన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఓపెన్ కేటగిరీలో 50, గీత కులాలకు సంబంధించి 3 దుకాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ రాత్రి 12 గంటల వరకూ మాత్రమే గడువు ఉందని, 3న దరఖాస్తుల పరిశీలన, 5న లాటరీ ద్వారా షాపుల కేటాయింపు ఉంటుందన్నారు. రూ. 3 లక్షలు నాన్ రీ ఫండబుల్ రుసుం, రూ.1,000 ప్రాససింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తుదారునికి 21 సంవత్సరాలు, ఒక వ్యక్తి ఒక దుకాణానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనలు ఉన్నాయన్నారు. ప్రతి దుకాణానికి తప్పనిసరిగా 10 దరఖాస్తులు రావాలని, లేదంటే సదరు దుకాణం వేలం వాయిదా వేస్తామన్నారు. క్రికెట్ ప్రాబబుల్స్‌కు ఎంపిక అనంతపురం: జిల్లా క్రీడాకారులకు అరుదైన గౌరవం లభించింది. త్వరలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్వహించనున్న స్టేట్ ప్రాబబుల్స్ మ్యాచ్‌లకు జిల్లాకు చెందిన క్రికెటర్లు హనీష్ వీరారెడ్డి, మల్లికార్జున, జయంత్ కృష్ణ, దీపక్ ఎంపికయ్యారు. దీనిపై జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సి. శ్రీనాథ్, సెక్రటరీ శ్రీధర్, అసోసియేషన్ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు, కోచ్‌లు హర్షం వ్యక్తం చేశారు. మ్యాచుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఫైనల్ స్టేట్ టీమ్‌కు ఎంపికై జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. -
విత్తన పప్పుశనగ సకాలంలో అందేనా?
అనంతపురం అగ్రికల్చర్: మరో మూడు రోజుల్లో రబీ ప్రారంభమవుతుంది. ఈ సీజన్లో ఎక్కువగా నల్లరేగడి భూముల్లో పప్పుశనగ సాగు చేస్తారు. అందునా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో మరీ ఎక్కువ. అక్టోబర్‌లో వర్షం వస్తే జిల్లా వ్యాప్తంగా 60 వేల హెక్టార్లలో పప్పుశనగ సాగులోకి రావచ్చని అధికారికంగా అంచనా వేసినా.. అంతకు మించి సాగయ్యే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది అదను దాటాక నవంబర్ మొదటి వారంలో కంటితుడుపు చర్యగా రాయితీని 25 శాతానికి కుదించి నామమాత్రంగా 2వేల క్వింటాళ్ల విత్తన పప్పుశనగ పంపిణీ చేసింది. మరి ఈ సీజన్లో అయినా సకాలంలో అందించాలని రైతులు కోరుతున్నారు. ముందస్తు సాగుకు సిద్ధం.. ఇటీవల జిల్లా వ్యాప్తంగా వర్షాలు రావడంతో ముందస్తు పంట సాగుకు సిద్ధమయ్యారు. దీనికి తోడు ఖరీఫ్ పంట ఆశలు గల్లంతు కావడం, ఇంకా పంట వేసుకోలేక బీళ్లుగా పెట్టుకున్నందున నల్లరేగళ్లలో రబీ సాగుకు సమాయత్తమవుతున్నారు. కరువు తాండవిస్తున్న వేళ 75 శాతం రాయితీ వర్తింపజేయాలని విపక్షాలు, రైతులు కోరుతున్నారు. అయితే 50 శాతం రాయితీ వర్తింపజేస్తారని గత కొంతకాలంగా అధికారులు చెబుతూ వచ్చారు. కానీ... చివరకు రాయితీని 35 శాతం ఖరారు చేశారు. అడిగినంత మేర 32,900 క్వింటాళ్ల విత్తన కేటాయింపులు చేశాం కానీ... రాయితీ మాత్రం పెంచేది లేదని స్పష్టం చేశారు. క్వింటా పూర్తి ధర రూ.9 వేలు ఖరారు చేసిన సర్కారు రాయితీని 35 శాతానికే పరిమితం చేయడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. అదే ధరకు బహిరంగ మార్కెట్లో విత్తనాలు లభిస్తాయని చెబుతున్నారు. విత్తన పంపిణీ ఆలస్యమే! వేరుశనగ, పప్పుశనగ సరఫరా చేసిన ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులకు ఏపీ సీడ్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్ల ఖరీఫ్, రబీకి సంబంధించిన చెల్లింపులు పూర్తిగా చేయలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో రూ.70 కోట్లకు పైగా బకాయిలు ఉన్నందున.. ఇప్పుడు విత్తన సేకరణ, సరఫరాకు ప్లాంట్ల నిర్వాహకులు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. దీంతో విత్తన సేకరణ, పంపిణీ ఆలస్యమయ్యే పరిస్థితులు ఉన్నట్లు చెబుతున్నారు. జగన్ హయాంలో 40 శాతం రాయితీ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాం (2019 నుంచి 2024)లో ఏటా రబీలో విత్తన పప్పుశనగపై రైతులకు 40 శాతం రాయితీ వర్తింపజేశారు. ఏటా 30 వేల నుంచి 40 వేల క్వింటాళ్ల విత్తనం కేటాయించి అక్టోబర్ 15లోపు పంపిణీ చేయడంతో సకాలంలో పంట సాగు చేశారు. ఇప్పుడు రాయితీని కాస్త 35 శాతానికి కుదించేయడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్లకు బకాయిలు చెల్లించని సర్కార్ విత్తన సేకరణ.. సరఫరాకు ససేమిరా అంటున్న వైనం -
సూక్ష్మ పరిశీలన ముఖ్యం
అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా అందుతున్న క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై సూక్ష్మపరిశీలన ముఖ్యమని జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ జి.సి.కిషోర్‌కుమార్ స్పష్టం చేశారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై ఆయన ఆదివారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో కలెక్టర్ ఆనంద్‌తో కలిసి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో సూపర్ చెక్ నిర్వహించారు. జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ లాగిన్లోకి వచ్చిన ఓటరు చేర్పునకు సంబంధించి 97 క్లెయిమ్‌లు, వివరాల మార్పునకు సంబంధించి 75 క్లెయిమ్‌లు, ఓటు తొలగింపునకు సంబంధించి 9 క్లెయిమ్‌లను సూపర్ చెక్ చేసి, తగిన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. సమావేశంలో ఈఆర్ఓలు ప్రేమంత్‌కుమార్, వసంతబాబు, రామ్మోహన్, రమేష్‌రెడ్డి, వెంకటనారాయణ, రవిశంకర్‌రెడ్డి, కిరణ్మయి, ఏఈఆర్ఓలు, ఎన్నికల డీటీ, ఎస్ఏ, ఈడీటీలు పాల్గొన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన రాప్తాడు రూరల్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్–2026) ప్రక్రియలో భాగంగా వచ్చిన క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారంపై జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ జీసీ కిషోర్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆదివారం అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఏ.నారాయణపురం–2 స్వర్ణ గ్రామ సచివాలయం, విద్యారణ్యనగర్, పాపంపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. పంటల బీమా ప్రీమియం మాయం ● ఇన్సూరెన్స్ కంపెనీకి జమకాని వైనం ● ఇదీ ఆంధ్రాబ్యాంకు సిబ్బంది నిర్వాకం ● నిలదీస్తే.. రైతుల ఖాతాలకు వెనక్కు కళ్యాణదుర్గం రూరల్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికందకపోతే పంటల బీమా ఆదుకుంటుందనే ఆశతో రైతులు ప్రీమియం చెల్లించారు. అయితే బ్యాంకు అధికారులు ఆ మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి జమ చేయలేదు. ఆ నగదును స్వాహా చేసేశారు. రైతులు నిలదీయడంతో.. చేసేదిలేక ప్రీమియం మొత్తాలను తిరిగి వ్యక్తిగత ఖాతాల్లోకి వెనక్కు వేశారు. వివరాల్లోకెళ్తే.. కళ్యాణదుర్గం మండలంలో ఖరీఫ్ కింద వివిధ రకాల పంటలు సాగయ్యాయి. చాపిరి, విరుపాపల్లి, శీర్పి తదితర గ్రామాల్లో టమాట, కంది, అరటి, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేసిన రైతులు వాతావరణ ఆధారిత పంటల బీమా కింద కళ్యాణదుర్గం యూనియన్ (ఆంధ్రా)బ్యాంకులో జూలై 15వ తేదీలోపు ప్రీమియం చెల్లించారు. వారం కిందట చాపిరి సచివాలయంలో బీమా ప్రీమియం చెల్లించిన రైతుల జాబితాను ప్రదర్శించారు. ఇందులో సుమారు వంద మంది రైతుల పేర్లు కనిపంచలేదు. ఇదేమని ఆర్ఎస్కే సిబ్బందిని అడిగితే బ్యాంకును సంప్రదించాలని చెప్పారు. అక్కడికెళ్లి అడిగితే తమకు సంబంధం లేదని, ఇన్సూరెన్స్ కంపెనీ వారిని అడగండని సలహా ఇచ్చారు. అయితే ప్రీమియం డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించినట్టుగా ఎటువంటి ఆధారమూ వారు చూపలేదు. ఈ క్రమంలో బ్యాంకుకు వచ్చే బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు, సిబ్బందిలో ఆందోళన మొదలైంది. ఈ వ్యవహారం తమ మెడకు చుట్టుకునే అవకాశం ఉందని భావించి బాధిత రైతుల ఖాతాలకు ఆదివారం ప్రీమియం డబ్బును వెనక్కు వేశారు. టెక్నికల్ సమస్య వల్ల జమ చేయలేకపోయాం అంటూ మొబైల్‌కు మెసేజీలు పంపారు. వంద మంది రైతులు ప్రీమియం రూపంలో చెల్లించిన నగదు రూ.5లక్షల దాకా ఉంటుందని అంచనా. ప్రభుత్వం పంటల బీమా వర్తింపజేస్తే.. రూ.కోట్లల్లో పరిహారం అందించాల్సి ఉండేది. ఇప్పుడు ఆ అవకాశాన్ని రైతులు కోల్పోయారు. దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా బ్యాంకు అధికారులు స్పందించలేదు. -
కొనసాగుతున్న వివక్ష
అనంతపురం కల్చరల్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాహిత్య పురస్కారాలలో రాయలసీమ వాసులను, ముఖ్యంగా జిల్లా కవులను, రచయితలను క్రమంగా పక్కన పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన మహాకవి జాషువా పురస్కారాల ప్రకటనలో ఈ విషయం తేటతెల్లమైంది. మరో ‘సారీ’ అనంత వాసులను విస్మరిస్తూ, వివక్ష చూపుతూ కేవలం కోస్తా జిల్లాల నుంచి పలువురిని ఎంపిక చేసింది. సాహిత్య సేవలో అనేక మంది ‘అనంత’ సాహితీవేత్తలు, కవులు, రచయితలు తమదైన కృషి సాగిస్తూ రాష్ట్రస్థాయి గుర్తింపు పొందారు. ప్రతి సందర్భంలో సాహితీ సమావేశాలు, సదస్సులు క్రమం తప్పకుండా నిర్వహిస్తుంటారు. సుప్రసిద్ధ కావ్యాలు, ప్రబంధాలు, కవితా సంపుటాలు, భాషా గ్రంథాలు ఈ గడ్డపై నుంచే వచ్చాయి. మహాకవి జాషువా పద్య సాహిత్యంపై ఉమ్మడి అనంత జిల్లా సాహితీవేత్తలు విస్తృత ప్రచారం గావిస్తున్నారు. ‘జాషువా సాహిత్య పీఠం’ ఏర్పాటు చేసుకుని ప్రతి ఏడాది ఆయన జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తుంటారు. జాషువా విగ్రహాన్ని నగరం నడిబొడ్డును ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా జాతీయస్థాయి గుర్తింపు వచ్చినా ఇక్కడి వారిని ప్రభుత్వం గుర్తించడంలో విఫలమవుతోంది. పూర్తి నిర్లక్ష్యం.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో అనేక మందికి కందుకూరి అవార్డులు, ఉగాది పురస్కారాలు, కళారత్న పురస్కారాలు, భాషా పురస్కారాలు, బోయి భీమన్న అవార్డులు ప్రకటించింది. ప్రతిసారి ‘సీమ’ రచయితల పట్ల పూర్తి వివక్ష, విస్మరణతో మొండి చెయ్యి చూపించింది. దేనిలోనూ ఉమ్మడి అనంత జిల్లాలకు స్థానం కల్పించలేదు. రాయలసీమకు చెందిన వారే అధికారంలో ఉన్నా ప్రతిసారి అన్యాయమే జరుగుతోందంటూ ఎంతో మంది సాహితీవేత్తలు వాపోతున్నారు. ప్రతి నలుగురు కలిసే చోట ఇదే ప్రస్తావన చేసుకుంటున్నారు. ఇంకెన్నాళ్లు ఈ వివక్ష కొనసాగుతుందోనంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. అవార్డులన్నీ రూ.లక్షల నగదు బహుమతితో కూడుకున్నవి కావడంతో లాబీ యింగ్ చేస్తున్న వారు మాత్రమే అర్హులుగా ఉన్నారని కవులు ఆరోపిస్తున్నారు. నేడు మహాకవి జాషువా జయంతి.. మహాకవి జాషువా 131వ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం 9.30 గంటలకు స్థానిక ఆర్ట్స్ కాలేజ్ ప్రధాన గేటు ఎదురుగా ఉన్న జాషువా విగ్రహానికి పూలమాల అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. జిల్లాలోని కవులు, రచయితలు, విద్యార్థులతో ఘన నివాళి, అనంతరం ఆర్ట్స్ కాలేజీ, జూనియర్ కాలేజీలోని ఒకేషనల్ తరగతి గదుల్లో రచయితలు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. పలు సాహితీ సంస్థల వారు జాషువా జయంతిని నిర్వహిస్తున్నారు. మహాకవికి నీరాజనాలర్పించడానికి జాషువా విగ్రహం వద్దకు సాహితీ మిత్రులందరూ తరలి రావాలని జాషువా సాహిత్య పీఠం ప్రతినిధులు నాగలింగయ్య, డాక్టర్ నానీల నాగేంద్ర తెలిపారు. సాహిత్య అవార్డుల్లో మరోసారి ‘సీమ’ వాసులకు రిక్తహస్తం తీరు మారని చంద్రబాబు ప్రభుత్వంపై జిల్లావాసుల మండిపాటు -
గనుల్లో ప్రమాద ఘంటికలు
తాడిపత్రిటౌన్: తాడిపత్రి నియోజకవర్గంలో అపార ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. అటువంటి నిక్షేపాలు అధికార టీడీపీ నాయకులకు ఆదాయ వనరుగా మారాయి. పెద్దవడుగూరు మండలం కొండుపల్లి, క్రిష్టిపాడు, లక్ష్ముంపల్లి, పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట, యాడికి మండలం రాయలచెరువు, వెంగన్నపల్లి, చందన గ్రామాల్లో దాదాపు 70 వరకు తెల్లసుద్ద (స్టీటైట్) అండర్‌గ్రౌండ్, ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌లు ఉన్నాయి. ఇందులో అనుమతులు ఉన్న గనులు 40 వరకు ఉంటాయి. మిగిలిన గనుల్లో అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారు. నిబంధనలు బేఖాతరు.. గనుల్లో ఖనిజం ఉన్న రాయి గట్టిగా ఉంటే సాధారణ యంత్రాలతో తవ్వడం కష్టం. అలాంటి సమయంలో రాయిని చిన్న ముక్కలుగా చేయడానికి పేలుడు పదార్థాలు అమర్చి బ్లాస్టింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే బ్లాస్టింగ్‌కు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. అది కూడా పేలుడు పదార్థాలను పరిమితంగా వాడాలి. ప్రత్యేక స్థలాల్లో నిల్వ చేయాలి. కానీ ఇక్కడ నిర్వాహకులు పరిమితికి మించి పేలుడు పదార్థాలను కొనుగోలు చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇళ్ల మధ్యే నిల్వ చేస్తున్నారు. మరికొంతమంది గనుల్లోనే రహస్య ప్రదేశాల్లో ఉంచుతున్నారు. గనిలో ప్రత్యేక శిక్షణ పొందిన బ్లాస్టర్తోనే పేలుళ్లు చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ సాధారణ కార్మికులకే బ్లాస్టింగ్ పనులు అప్పగిస్తున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది కాళ్లు, చేతులు కోల్పోయి వైకల్యం బారినపడుతున్నారు. పర్యవేక్షించని అధికారులు.. నంద్యాల జిల్లా డోన్, అనంతపురం జిల్లా నార్పలలో కొందరు వ్యక్తులు పేలుడు సామగ్రిని అనధికారికంగా మైనింగ్ నిర్వాహకులకు సరఫరా చేస్తున్నారు. ఈ విషయం స్థానిక పోలీస్ అధికారులకు తెలిసినా పట్టనట్టుగా ఉంటున్నారు. మైనింగ్ నిర్వహణను పరిశీలించాల్సిన అధికారులు మామూళ్లు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కార్మికుల ప్రాణాలతో చెలగాటం.. గనుల్లో బ్లాస్టింగ్ సమయంలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే బాధిత కార్మిక కుటుంబాలకు యాజమాన్యం కొంత మొత్తం అందజేసి విషయం బయటకు పొక్కకుండా చేస్తున్నారు. కొంతకాలం క్రితం పెద్దవడుగూరు మండలం కొండుపల్లిలో బ్లాస్టింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో యాడికి మండలం తూట్రాళ్లపల్లి నాగయ్య, హరిక్రిష్ణ, రామరాజుపల్లికి చెందిన మంగళ కొండప్ప, కొండుపల్లి గ్రామానికి చెందిన తిరుపాలు గాయాలపాలయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న కొండుపల్లి గనుల్లో జరిగిన బ్లాస్టింగ్ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. కొన్నేళ్ల క్రితం గని ప్రమాదంలో క్రిష్టిపాడు ఎస్సీ కాలనీకి చెందిన వీరాంజినేయులు కాళ్లు, చేతులు కోల్పోయాడు. కోనాపురానికి చెందిన గని కార్మికుడు కంబగిరిస్వామి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అధికారం ముసుగులో ‘పచ్చ’ నేతలు గనులపై వాలిపోతున్నారు. కొందరు అనుమతికి మించి.. మరికొందరు అక్రమ తవ్వకాలతో చెలరేగిపోతున్నారు. భద్రతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చి.. పైసా ఖర్చు కాకుండా.. సాధారణ కార్మికులతో గనుల్లో బ్లాస్టింగ్ చేయిస్తున్నారు. అనుభవం లేని కారణంగా కార్మికులు తరచూ ప్రమాదాలకు గురవడం.. ప్రాణాలు కోల్పోవడం పరిపాటిగా మారింది. అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్లు తీసుకుని మిన్నకుండిపోతున్నారు. యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగులు కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిర్వాహకులు తెలిసినా పట్టించుకోని పోలీసు, మైనింగ్ అధికారులు -
ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం
గుత్తి: గుత్తి కోటలో ఆదివారం ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోట ముఖ ద్వారం వద్ద నుంచి విద్యార్థులు, కోట సంరక్షణ సమితి సభ్యులు, ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు.ముఖ్య అతిథులు ఎంపీ అంబికా, అసిస్టెంట్ కలెక్టర్ పీయూష్ కుమార్,జిల్లా టూరిజం అధికారి వెంకటరమణారెడ్డి, ఆర్డీ ఓబుళమ్మకు స్వాగతం పలికారు. అతిథులు పురాతన నాణేల ప్రదర్శన శాలను తిలకించారు. సభా స్థలి వద్ద విద్యార్థులు, చిన్నారులు ముఖ్యంగా జూనియర్ ఏఎన్ఆర్ విజయకుమార్ సినిమా పాటలకు డాన్స్‌లు చేసి అలరించారు. అతిథులు మాట్లాడుతూ గుత్తి కోటను అభివృద్ధి చేయడంతో పాటు టూరిజం హబ్‌గా చేస్తామన్నారు. కార్యక్రమంలో గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయ భాస్కర్, గైడ్ రమేష్, గాయకుడు సాధు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
●ఇరుక్కుని.. ఇక్కట్లకు గురి చేసి
బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన కంటైనర్ అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్ వద్ద బ్రిడ్జి కింది భాగంలో శనివారం భారీ కంటైనర్ ఇరుక్కుపోయింది. ఆ మార్గంలో రాకపోకలను స్తంభింపజేసింది. చివరకు పోలీసులు స్పందించి అతి కష్టంపై కంటైనర్‌ను జాతీయ రహదారిపైకి మళ్లించారు. ఇలా పలుమార్లు జరిగినా ట్రాఫిక్ రద్దీ కారణంగా పోలీసులు సైతం వాటి రాకపోకలను నియంత్రించలేకపోతున్నారు. ఇకపై ఇలాంటి అవాంతరాలు తలెత్తకుండా పగటి పూట నగరంలోకి భారీ వాహనాల రాకపోకలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం
అభివృద్ధి చేయాలి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యాటకం నుంచి వచ్చే ఆదాయంపైనే ఆయా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కానీ రాష్ట్రంలో పర్యాటక రంగం నిర్వీర్యమైపోతోంది. భావితరాలకు చెప్పాల్సిన ఎన్నో విషయాలు మన పర్యాటక ప్రాంతాలు వివరిస్తాయి. జిల్లాలోని యాడికి గుహలు, కుందుర్పి, కొనకొండ్ల వంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. – కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇంటాక్ కోశాధికారి పాలకులు దృష్టి సారించాలి గుత్తికోట విశిష్టతపై పదే పదే మంత్రులు, అధికారులు చెబుతారు కానీ ఒక్క పైసా అభివృద్ధి కోసం వెచ్చించడం లేదు. గతంలో జబర్దస్త్ యాక్టర్లపై చేసిన ఖర్చును కోటలో నీటి వసతి, రోడ్ల నిర్మాణాలకు వెచ్చించి ఉంటే బాగుండేది. ప్రచార ఆర్భాటం, హంగామా కాకుండా నిజమైన అభివృద్ధిపై దృష్టి సారించాలి. – రాజశేఖరరెడ్డి, గుత్తికోట సంరక్షణ సమితి ప్రతినిధి అనంతపురం కల్చరల్: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. అధికారంలోకి రాగానే పర్యాటకానికి ప్రాధాన్యతనిస్తామని చెప్పిన కూటమి నాయకులు ఆ ఊసే నేడు ఎత్తడం లేదు. ఈ క్రమంలో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా జిల్లాలోని పర్యాటక ప్రదేశాల పరిస్థితి మారిపోయింది. అమలు కాని హామీలు.. జిల్లా పర్యాటకంలో అగ్ర స్థానంలో నిలిచే గుత్తి కోటను అభివృద్ధి చేస్తామని అనేక సార్లు ప్రజాప్రతినిధులు, అధికారులు హామీలిచ్చారు. కోటను సందర్శించిన ప్రతి సారీ రూ.కోటి విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే, అవన్నీ నెరవెరలేదు సరికదా.. ఎన్నోసార్లు గుత్తి కోట పరిరక్షణ సమితి ప్రతినిధులు కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎక్కడా చలనం లేకుండా పోయింది. అభివృద్ధి మాట దేవుడెరుగు సరైన రోడ్ల నిర్మాణం చేపట్టలేదు. కనీసం నీటి వసతి కల్పించలేకపోయారు. అయితే, ఈ ఏడాది మార్చిలో గుత్తికోట ఉత్సవాల పేరిట హంగామా చేయడం గమనార్హం. బుల్లితెర నటులను పిలిపించి హడావుడి కూడా చేశారు. దీనికి రూ.లక్షలు ఖర్చు చూపించారు. అవే నిధులను కోట అభివృద్ధికి ఎందుకు కేటాయించలేదని సంరక్షణ సమితి వారు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు అధికారుల నుంచి ఇప్పటికీ సమాధానం లేదు. గుత్తి కోటతో పాటు జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రాల వద్ద హోటళ్లు, పార్కులు నిర్మిస్తామని చెప్పిన మాటలేమయ్యాయని అందరూ నిలదీస్తున్నారు. సందర్భం అభివృద్ధికి నోచుకోని పర్యాటక ప్రదేశాలు హామీలిచ్చి మరిచిపోతున్న పాలకులు, అధికారులు పెదవి విరుస్తున్న పర్యాటక ప్రేమికులు -
ప్రోత్సాహంతో కలల సాకారం
ఉరవకొండకు చెందిన కొమ్మసాని మహేష్, కొమ్మసాని పద్మావతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. మహేష్ టైలర్ వృత్తిని నమ్ముకుని కుటుంబాన్ని పోషించేవాడు. కూతుళ్లు చిన్నప్పటి నుంచే చదువుల్లో చురుగ్గా ఉండేవారు. వారి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సాహమందించారు. పెద్ద కుమార్తె దివ్య 2018లో డీఎస్సీ పరీక్షలు రాసి అర్హత సాధించడంతో 2020లో టీచర్‌గా ఎంపికై ంది. రెండో కుమార్తె ప్రభావతి 2020 సంవత్సరంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో కొలువు సాధించింది. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి.. వారి ఆశలను తమ ఆశయాలుగా మలచుకుని ఉద్యోగాలు సాధించామని దివ్య, ప్రభావతి తెలిపారు. అక్కల స్ఫూర్తితో తమ్ముడు రాహుల్ ఇటీవలే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించడం గమనార్హం. -
కదం తొక్కిన సచివాలయ ఉద్యోగులు
● ‘చలో విజయవాడ’కు తండోపతండాలుగా పయనం ● చంద్రబాబు ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టీకరణ అనంతపురం క్రైం: ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి వేలాది మంది సచివాలయ ఉద్యోగులు విజయవాడ బాట పట్టారు. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన ‘చలో విజయవాడ’ పిలుపుతో కదం తొక్కారు. రైళ్లు, ప్రత్యేక బస్సుల్లో బయలుదేరారు. చంద్రబాబు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందంటూ మండిపడ్డారు. ప్రాణాలు పోయినా పగ చల్లారలేదా? ‘చంద్రబాబు సర్కారు పని ఒత్తిడి కారణంగా మా సహచరులు వందమందికి పైగా తనువు చాలించారు. బాధిత కుటుంబాలు ఇంకా ఆవేదనలో ఉన్నాయి. అయినా సర్కారుకు పగ చల్లారినట్లు లేదు’ అంటూ సచివాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో గ్రామ సర్వేయర్‌గా పనిచేస్తున్న రాష్ట్ర నాయకుడు బూరాడ మధుబాబును సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తున్నామన్నారు. సమస్యలపై అడిగితే సస్పెన్షనే బహుమానమా అని నిలదీశారు. మధుబాబుపై సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్, తొమ్మిది నెలల బకాయి వేతనాలు, పదోన్నతులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు రాజారెడ్డి ఉద్యోగుల ఆందోళనకు మద్దతిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఐక్యవేదిక నాయకులు సుధాకర్, లక్ష్మీనారాయణ, చిన్నూరప్ప, మల్లికార్జున, వరప్రసాద్, శివశంకరయ్య, నాగరాజు, ముత్యాలప్ప, రమేష్, విమల, కళావతి, శశికళ, దీక్షిత్బాబు, శంకర్‌రెడ్డి, మారుతిప్రసాద్, గంగాధర్, రవితేజ, అటకలప్ప, రవికుమార్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ–స్టాంపుల కుంభకోణంపై సీ‘ఐ’డీ
● హైకోర్టు ఆదేశాలతో కదిలిన నేర పరిశోధన విభాగం ● కళ్యాణదుర్గంలో గోప్యంగా విచారణ ● అధికార పార్టీ అక్రమార్కుల్లో వణుకు కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ (ఎస్ఆర్సీ) సంస్థ కేంద్రంగా సాగిన నకిలీ ఈ–స్టాంపుల కుంభకోణంపై నేర పరిశోధన విభాగం (సీఐడీ) దృష్టి సారించింది. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం చేకూర్చిన ఈ ఆర్థిక నేరంపై సమగ్ర దర్యాప్తు చేయించాలని, అసలు దోషులను వెలికి తీయాలని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సమగ్ర దర్యాప్తునకు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిష్పాక్షికంగా విచారణ చేపట్టి తక్షణమే పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని సూచించింది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. విజయవాడ నుంచి సీఐడీ అధికారుల బృందం రెండు రోజుల క్రితం కళ్యాణదుర్గం వచ్చింది. అత్యంత గోప్యంగా విచారణ చేపట్టడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్రమార్కులకు ముచ్చెమటలు! నకిలీ ఈ–స్టాంపుల కుంభకోణంపై హైకోర్టు సీరియస్‌గా స్పందించడం, సీఐడీ అధికారులు విచారణకు రావడంతో అధికార పార్టీకి చెందిన అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కుంభకోణంలో అధికార పార్టీ నియోజకవర్గ ముఖ్య నేత పాత్ర కీలకంగా ఉందని సీఐడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాలతో సీఐడీ అధికారులు చేసిన తనిఖీలు, పరిశీలించిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ వేగవంతం కానుండటంతో టీడీపీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. ఈ కేసు ఇంకా ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ముంచుకొస్తున్న అరెస్టుల గండం! సీఐడీ బృందంలో ఓ డీఎస్పీ స్థాయి అధికారితో పాటు ఇద్దరు ఎస్ఐలు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు కళ్యాణదుర్గంలో రహస్య విచారణ చేపట్టారు. విచారణ ప్రక్రియ కీలక దశకు చేరుకుంటే అక్రమాల్లో కీలకపాత్ర పోషించిన టీడీపీ పెద్ద తలకాయలు కూడా కటకటాల పాలవ్వడం ఖాయమన్న చర్చ స్థానికంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో అధికార పార్టీ రాజకీయ సమీకరణలూ మారే అవకాశాలు లేకపోలేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. -
అరుదైన వ్యాధుల బాధిత చిన్నారులను ఆదుకోవాలి
● ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి లేఖ ఉరవకొండ: అరుదైన వ్యాధుల బాధిత చిన్నారులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు లేఖలు రాశారు. పేద వర్గాల ప్రజలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి లేకపోవడంతో ఎన్నో ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి రోగాల బారిన పడ్డ పేద కుటుంబాల కోసం స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ విధానం అమలు చేసి ఆదుకోవాలన్నారు. స్పైనల్ మస్కలర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ), మస్కలర్ డిస్టరీ (డీఎండీ) లాంటి అరుదైన వ్యాధుల వైద్యానికి దాదాపు రూ. 25 కోట్ల ఖర్చవుతుందన్నారు. ఇలాంటి అరుదైన వ్యాధుల బారిన పడితే పేద ప్రాణాలు పోవాల్సిందేనా? అని వాపోయారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరుదైన వ్యాధుల గురించి అవగాహన కల్పించాలన్నారు. ఆయా వ్యాధుల బారిన పడిన వెంటనే చికిత్స అందించే ఆసుపత్రి వివరాలతో పాటు రోగుల వివరాలు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేలా ఫాస్ట్‌ట్రాక్ విధానం అమలు చేయాలని కోరారు. వైద్యాధికారి మానిటరింగ్ చేసేలా సిస్టం ఉండాలన్నారు. ప్రభుత్వం నుంచి ‘ఎల్ఓసీ’ ఆలస్యం లేకుండా అందించాలన్నారు. వ్యాధిని గుర్తించిన వెంటనే వేగంగా స్పందించడం, సరైన వైద్యమందించి వారి ప్రాణాలను కాపాడడం ప్రభుత్వాల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. -
జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. వాయువ్య దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
అనూష.. అంతర్జాతీయ ఖ్యాతినార్పల మండలం బండ్లపల్లిలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన అమ్మాయి... తన తల్లిదండ్రులే కాదు.. యావత్ జిల్లా వాసులు గర్వపడేలా క్రికెట్లో రాణిస్తోంది. గ్రామీణ వాతావరణంలో క్రికెట్ ఆడటం మొదలుపెట్టి.. ఎన్నో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, పరిమిత సదుపాయాలను అధిగమిస్తూ భారత మహిళల క్రికెట్ జట్టులోకి అడుగుపెట్టింది. తనదైన శైలిలో క్రికెట్లో రాణిస్తూ ప్రస్తుతం మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ‘రాయలసీమ ఎక్స్ఈఎన్ స్టార్స్’జట్టును ఫైనల్స్‌కు చేర్చింది. కుమార్తె కలకు అడ్డంకి కాలేదు వ్యవసాయ కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునే మేము ఏనాడూ మా కుమార్తెను ఆడపిల్లగా చూడలేదు. క్రికెట్ ఆడతానంటే అమ్మాయి భవిష్యత్తు కోసం కొద్దోగొప్పో దాచుకున్న సొమ్ము తీసి ఇచ్చేవాళ్లం. ఆర్డీటీ వారు ఎంతో సహకరించారు. అనూష భారత జట్టుకు ఎంపికై న రోజున కూడా మేము మా జీవనాధారమైన వ్యవసాయ పనులకు వెళ్లాం. మా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కుమార్తె క్రికెట్ కలకు అడ్డంకిగా మారకూడదనే అనుకున్నాం. – బి.లక్ష్మీదేవి, మల్లిరెడ్డి (అనూష తల్లిదండ్రులు) -
మూడేళ్లలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
అనంతపురం అగ్రికల్చర్: మూడేళ్లలో అంతర్జాతీయ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్–రాయలసీమ రైజింగ్’ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం చేపట్టిందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను ఆక్టోబర్ 2వ తేదీన మదనపల్లెలో సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో విలేకరులతో మాట్లాడారు. రాయలసీమతో పాటు ప్రకాశం, మార్కాపురం ఈ 10 జిల్లాల వారీగా ప్రణాళికా బద్ధంగా కార్యాచరణ అమలు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యాన, ఇరిగేషన్, పంచాయతీరాజ్ మూడు ప్రధాన శాఖలతో పాటు అనుబంధ శాఖలను భాగస్వామ్యం చేసి గ్లోబల్హబ్గా మార్చనున్నారన్నారు. అనంతపురం జిల్లాకు సంబంధించి 32 మండలాలు, 338 రైతు సేవా కేంద్రాలను 41 క్లస్టర్లుగా విభజించి మూడేళ్ల ప్రణాళిక అమలు చేస్తామన్నారు. ఈ క్రమంలో ఉద్యానశాఖ ద్వారా రూ.2,252.31 కోట్లు వెచ్చించడానికి ప్రణాళిక రెడీ చేశామన్నారు. విస్తృత అవగాహన ఈ బృహత్తర కార్యక్రమానికి సంబంధించి శనివారం నుంచి అక్టోబర్ 5 వరకు జిల్లా వ్యాప్తంగా అటు రైతులు, ఇటు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా 10 జిల్లాల రూపురేఖలు, రైతుల స్థితిగతుల్లో ఎలా మార్పు రానుందనే ఆంఽశం గురించి 60 నుంచి 90 సెకన్ల నిడివి కలిగిన కంటెంట్ క్రియేట్ చేసి రీల్స్, వీడియోలు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ ఇన్ తదితర వాటిలో పోస్టు చేసి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అధికారిక ఖాతా (ఏపీ ఆఫిషియల్ న్యూస్)కు ఈనెల 30న 12 గంటల్లోపు ట్యాగ్ చేస్తే ... అందులో ఉత్తమమైన ఐదింటిని ఎంపిక చేసి మదనపల్లిలో అక్టోబర్ 2న నిర్వహించే కార్యక్రమంలో సత్కారం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జేడీఏ ఎన్.సాలురెడ్డి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, ఏపీడీ జి.చంద్రశేఖర్, ఉద్యాన శాఖ డీడీ బీసీ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల కోసం ‘రెజోనియా హెల్ప్‌లైన్’
అనంతపురం అర్బన్: ట్రాన్స్మిషన్ టవర్ల నిర్మాణ క్రమంలో ఎదురయ్యే సమస్యలు, అపోహలు తొలగించేందుకు రైతుల కోసం రెజోనియా కంపెనీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిందని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. సమస్యలను రైతులు 1800 309 4401 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. కలెక్టర్ శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెజోనియా టోల్ ఫ్రీ నంబర్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ పునరుత్పత్తిలో భాగంగా ఇక్కడికి తరలివచ్చిన కంపెనీలకు, రైతులకు మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండకూడదన్నారు. సమాచార మార్పిడి, పారదర్శకత, నమ్మకాన్ని మరింత బలోపేతం చేసేందుకు టోల్‌ఫ్రీ నంబరు రైతులకు ఎంతగానో ఉపయోగకరమన్నారు. రైతులు నేరుగా మాట్లాడడం వల్ల దళారీ వ్యవస్థకు అవకాశం ఉండదన్నారు. కంపెనీ ప్రాజెక్టు హెడ్ గిరిప్రసాద్, ఆర్ఓడబ్ల్యూ మేనేజర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు అనంతపురం అర్బన్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని కలెక్టర్ ఆనంద్ ఐసీడీఎస్ అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. ఖాళీలకు సంబంధించి రోస్టర్ సమర్పించని సీడీపీఓలకు చార్జ్‌మెమో జారీ చేయాలని పీడీని ఆదేశించారు. జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ పనితీరుపై కలెక్టర్ శనివారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో ఐసీడీఎస్ పీడీ సాజిదాబేగంతో కలిసి అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ సేవల అమలు, పోషకాహారం పంపిణీ, ఖాళీ పోస్టుల భర్తీ, పిల్లలు హాజరు, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. కంబదూరు ప్రాజెక్టలో ఎస్ఎన్పీ (సప్లిమెంటరీ న్యూట్రీషన్ ప్రోగ్రాం) పంపిణీలో చివరిస్థానంలో ఉందంటూ ఆగ్రహించారు. కాంట్రాక్టర్లు ఆలస్యం చేస్తే తగిన ఆధారాలతో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టు వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని చెప్పారు. సమావేశంలో డీఈఓ అయూబ్ హుసేన్, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, సీడీపీఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
కూతుళ్లను ఉన్నతస్థానంలో చూడాలని..
నార్పల మండలం బొందలవాడకు చెందిన రామకృష్ణ, ఆదెమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు సంతానం. రామకృష్ణ తనకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయినా పిల్లల చదువుకు లోటు రానివ్వలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కుమార్తెలు కూడా చదువులో రాణిస్తూ ముందుకు సాగారు. అలా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన పెద్దమ్మాయి స్వరూపరాణి ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. రెండో కూతురు శృతి కేంద్ర ప్రభుత్వ సంస్థ పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో ఎంఎల్‌హెచ్‌పీ/ సీహెచ్ఓ ఉద్యోగం సాధించింది. మూడో కూతురు సోనీ డీ ఫార్మసీ చదువుతోంది. మా విజయాలకు కారణమైన తల్లిదండ్రులను ఏ కష్టమూ లేకుండా చూసుకుంటామని ముగ్గురు అమ్మాయిలు తెలిపారు. -
విద్యార్థినుల భద్రతపై నిర్లక్ష్యాన్ని సహించం
ఆత్మకూరు: విద్యార్థినుల భద్రత విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు చల్లా మధుసూదన్‌రావు హెచ్చరించారు. ఆత్మకూరు కేజీబీవీలో ఇంటర్ విద్యార్థిని భవనంపైనుంచి కిందపడి గాయపడిన విషయం మీడియా ద్వారా తెలుసుకున్న ఆయన శనివారం జీసీడీఓ కవిత, ఓఎస్సీ మేనేజర్ శాంతామణితో కలిసి విద్యాలయాన్ని సందర్శించారు. సంఘటన ఎలా జరిగిందని ఉపాధ్యాయులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని ఆరా తీశారు. ఆ తర్వాత ఎస్ఓ లీమా రోజ్‌ను విచారణ చేశారు. విద్యార్థిని గాయపడినట్లు సమాచారం ఎందుకు ఇవ్వలేదని మండిపడినట్లు తెలిసింది. ఘనటపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని డీసీపీఓను ఆదేశించారు. గాయపడ్డ విద్యార్థినికి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. కేజీబీవీ పోస్టులకు రేపు కౌన్సెలింగ్ అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి ఈ నెల 28న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ టి.శైలజ తెలిపారు. ఈ మేరకు ఆమె శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తాత్కాలిక తుది మెరిట్ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను సమగ్ర శిక్ష వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు రోస్టర్ నిబంధనల ప్రకారం సోమవారం కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు అవసరమైన ఇతర పత్రాలతో హాజరు కావాలని సూచించారు. గైర్హాజరైన ఎస్జీటీపై వేటు అనంతపురం ఎడ్యుకేషన్: అనుమతి లేకుండా ఏడాదికి పైగా విధులకు డుమ్మా కొట్టిన ఉపాధ్యాయుడిపై వేటు పడింది. పుట్లూరు మండలం దోసలేడు ఎంపీపీఎస్‌లో ఎస్జీటీగా పనిచేస్తున్న పి.రాజా రమేష్‌ను సర్వీసు నుంచి తొలగిస్తూ డీఈఓ ఎన్.అయూబ్ హుస్సేన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2024 అక్టోబరు 25 నుంచి రాజా రమేష్ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరవుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై నోటీసులు జారీ చేసినా ఆయన నుంచి వివరణ అందలేదు. ఆచూకీ తెలియకపోవడంతో పుట్లూరు ఎంఈఓ ద్వారా వ్యక్తిగతంగా నోటీసులు అందించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 17న దినపత్రికల్లో బహిరంగ ప్రకటనలు ఇచ్చి పది రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరినా స్పందించలేదు. అనంతరం నిర్వహించిన శాఖాపరమైన విచారణలో ఆయనపై మోపిన అభియోగాలు రుజువైనట్లు అధికారులు నివేదిక సమర్పించారు. ఏడాదికి మించి అనధికారికంగా విధులకు గైర్హాజరైనందుకు నిబంధనల మేరకు ‘సేవ నుంచి తొలగింపు’ అనే ప్రధాన శిక్ష విధించినట్లు డీఈఓ తెలిపారు. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. కొత్త పింఛన్లు లేనట్లే అనంతపురం టౌన్: ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లు అక్టోబర్‌లో లేనట్లేనని స్పష్టం అవుతోంది. కొత్త పింఛన్ల మంజూరు కోసం ఆశగా ఎదురు చూస్తున్న అర్హులకు ప్రభుత్వం మొండిచేయి చూపింది. పింఛన్ల కోసం జిల్లా వ్యాప్తంగా 67వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే పాత పింఛన్లకే నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. జిల్లాలో 2,75,708 మంది పింఛన్‌దారులకు రూ.123.81కోట్లు మంజూరయ్యాయి. ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంక్ ఉద్యోగుల సమ్మె కారణంగా అక్టోబర్ 1వ తేదీ ఉదయం సచివాలయ ఉద్యోగులు డబ్బులను డ్రా చేసి.. మధ్యాహ్నం నుంచి పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఏ పీడీ శైలజ తెలిపారు. -
పాఠశాల స్థాయిలోనే జానపద నృత్య పోటీలు
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో సృజనాత్మకత, జీవన నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన, గౌరవాన్ని పెంపొందించేందుకు పాఠశాల స్థాయిలో రోల్ ప్లే, జానపద నృత్య పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ అయూబ్ హుస్సేన్ తెలిపారు. ఈ పోటీలకు విద్యార్థులు సిద్ధం కావాలని ఆయన సూచించారు. డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.రామకృష్ణతో కలిసి రోల్ ప్లేకు సంబంధించిన కేలండర్‌ను ఆవిష్కరించారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల్లో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులు జానపద నృత్య పోటీల్లో, 9వ తరగతి విద్యార్థులు రోల్ ప్లే పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. జానపద నృత్య ప్రదర్శనలో 4 నుంచి 6 మంది విద్యార్థులు ఉండాలని, ప్రదర్శన 5 నుంచి 6 నిమిషాల వ్యవధిలో ఉండాలని సూచించారు. రోల్ ప్లే, జానపద నృత్య ప్రదర్శనల్లో ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, బాధ్యతాయుత పౌరసత్వం,లింగ సమానత్వం, మాదకద్రవ్యాల నివారణ, మానసిక ఆరోగ్యం, భద్రత తదితర అంశాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు ఉండాలని డీఈఓ తెలిపారు. మూడు అంచెల్లో పోటీలు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి అక్టోబర్ 10లోపు పాఠశాల, మండల స్థాయి పోటీలు, అక్టోబర్ 25లోపు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికై న విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా నోడల్ అధికారి ఎం.లక్ష్మీనారాయణరెడ్డి, అనంతపురం జిల్లా నోడల్ అధికారి బి.శ్రీనివాసులు, డైట్ అధ్యాపకులు పాల్గొన్నారు. వాతావరణానికి అనుగుణంగా ‘సాగా’లి ● రైతులకు శాస్త్రవేత్తల సూచన బుక్కరాయసముద్రం: రైతులు వాతావరణానికి అనుగుణంగా పంటలు సాగు చేయాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానంలో వాతావరణ పరిస్థితులు, పంటల సాగుపై శాస్త్రవేత్తలు సమావేశం నిర్వహించారు. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామి మాట్లాడుతూ రైతులు పంటల సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. శాస్త్రవేత్తల సూచనల మేరకు పంటలను సాగు చేయాలన్నారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు తేమను ఉపయోగించుకుని ఉలవ, శనగ, అలసంద పంటలను సాగు చేసుకోవచ్చన్నారు. జిల్లాలో రైతులు సాగు చేసిన పంటలపై చర్చించారు. అనంతరం రేకులకుంట పరిశోధనా స్థానంలో రైతులు సాగు చేసిన వేరుశనగ పంటను పరిశీలించారు. కార్యక్రమంలో డీఏఓ సాలిరెడ్డి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ తిమ్మారెడ్డి, రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఐచర్ కిందకు దూసుకెళ్లిన బైక్ ● ఇద్దరికి త్రుటిలో తప్పిన ప్రాణాపాయం కూడేరు: అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారిపై శనివారం సాయంత్రం కూడేరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల పరిధిలోని మరుట్ల–2వ కాలనీకి చెందిన జయసింహా, సోము అనే ఇద్దరు యువకులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. స్థానికులు అందించిన వివరాల మేరకు.. ఇద్దరు యువకులు కూడేరులో ద్విచక్ర వాహనానికి పెట్రోల్ వేయించుకొని మరుట్లకు బయలు దేరారు. స్టేట్ బ్యాంక్ వద్దకు రాగానే అనంతపురం వెళదామని అనుకొని సడన్‌గా ద్విచక్రవాహనాన్ని జయసింహా తిప్పాడు. వెనక కూర్చున్న సోము ఎదురుగా వస్తున్న ఐచర్‌ను గమనించి పక్కకు దూకేశాడు. క్షణాల్లో ద్విచక్ర వాహనం ఐచర్ వాహనం కిందకు దూసుకెళ్లింది. ఐచర్ డ్రైవర్ బ్రేక్ వేయడంతో వాహనం ఆగింది. జయసింహా పక్కకు ఎగిరిపడగా మొహానికి స్వల్పంగా గాయలయ్యాయి. టైర్ల కిందపడింటే ప్రాణానికి ముప్పు వాటిల్లేది. హెల్మెట్ ధరించి ఉంటే ఆ గాయాలు కూడా అయ్యేవి కావు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడ్డ జయసింహాని పక్కకు తీసుకెళ్లి, ఐచర్ కిందకు దూరిన ద్విచక్ర వాహనాన్ని బయటకు తీసి ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూశారు. జయసింహా స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందాడు. -
ఆనంద క్షణాలు.. అపురూప ఘట్టాలు
● ఘనంగా పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ అనంతపురం సెంట్రల్: తొమ్మిది నెలల శిక్షణ అనంతరం ప్రజా సేవలోకి అడుగుపెడుతున్న 2025–2026 బ్యాచ్ సివిల్ కానిస్టేబుళ్ల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా ఆనంద క్షణాలు.. అపురూప ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయి. 2025–26 బ్యాచ్‌కు సంబంధించి డీటీసీలో 101 మంది, పీటీసీలో 582 మంది ఎస్‌సీటీపీసీ (సివిల్) బ్యాచ్ కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరికి శనివారం అనంతపురంలోని పోలీసు శిక్షణ కళాశాల (పీటీసీ) మైదానంలో పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. పోలీసుల పాత్ర కీలకమైనది మంత్రి కేశవ్ మాట్లాడుతూ ప్రమాదాలకు ఎదు రెళ్లి విధులు నిర్వర్తించేవారే పోలీసులని, వారి త్యాగాల వల్లనే ప్రజలు హాయిగా నిద్రపోతున్నారని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ పెరిగిపోయిందని, నేరపరిశోధనలో భాగంగా టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీసుశాఖ కీర్తి మరింత పెంచేలా, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చేలా పనిచేయాలన్నారు. రాష్ట్రంలోనే అతి పెద్ద బ్యాచ్‌కు అనంతపురం నుంచి పాసింగ్ ఔట్ జరగడం అభినందనీయమన్నారు. ఇండోర్, అవుట్ డోర్ శిక్షణలో ప్రతిభ కనబరచిన పోలీసులకు మెమొంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్, పీటీసీ ప్రిన్సిపాల్ సుప్రజ, ట్రైనింగ్ ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, సీఐలు, అధికారులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు పాదాభివందనం టోపీలతో తల్లిదండ్రులను సన్మానిస్తున్న అన్నదమ్ములు -
14 మండలాల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో అక్కడక్కడా వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 14 మండలాల పరిధిలో 3.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. కుందుర్పి 24.6 మి.మీ, గుంతకల్లు 20, నార్పల 10.6, బ్రహ్మసముద్రం, శెట్టూరు 10.2 మి.మీతో పాటు కంబదూరు, పెద్దపప్పూరు, యాడికి, తాడిపత్రి, గార్లదిన్నె, పుట్లూరు, విడపనకల్లు, వజ్రకరూరు, పామిడి తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. సెప్టెంబర్ నెల సాధారణం 111.6 మి.మీ కాగా ప్రస్తుతానికి 91.1 మి.మీ నమోదైంది. మొత్తం మీద జూన్ ఒకటి నుంచి 291.2 మి.మీకు గాను 27 శాతం తక్కువగా 212.3 మి.మీ నమోదైంది. గత నాలుగు నెలల కాలంలో 20 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదయ్యాయి. కాగా రాగల నాలుగు రోజులు జిల్లాకు వర్షసూచన లేదని వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు తెలిపారు. ఎలుగుబంట్ల దాడిలో ఇద్దరు రైతులకు గాయాలు కుందుర్పి: కరిగానిపల్లికి చెందిన రైతులు చంద్ర, వన్నూరుస్వామి ఎలుగుబంటి దాడిలో గాయపడ్డారు. ఇటీవల పొలాల్లోని వేరుశనగ పంటను తొలగించారు. గురువారం రాత్రి వర్షం వచ్చే సూచన కనపడటంతో వేరుశనగ వామికి టార్పాలిన్ కప్పేందుకు రైతులు చంద్ర, వన్నూరుస్వామి పొలంలోకి వెళ్లారు. అప్పటికే వేరుశనగ వామివద్ద ఉన్న ఎలుగుబంటి రైతులపై దాడిచేసి కరిచింది. తీవ్రంగా గాయపడ్డ చంద్ర అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వన్నూరుస్వామి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. గడిచిన రెండు నెలల్లో రైతులపై ఎలుగుబంట్లు దాడి చేయడం ఇది రెండవసారి. స్వైన్‌ఫ్లూపై అప్రమత్తం ఉరవకొండ : పట్టణంలోని శివరామిరెడ్డి కాలనీలో ఐదేళ్ల చిన్నారికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి.. కాలనీలో పర్యటించారు. స్థానిక వైద్యాధికారులు డాక్టర్ సునీత, డాక్టర్ సాహితి, మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే, రక్త పరీక్షలు నిర్వహించారు. అనంతరం కరపత్రాలు అందజేసి స్వైన్‌ఫ్లూ పట్ల అవగాహన కల్పించారు. మేజర్ పంచాయతీ ఈఓ సయ్యద్ సమీర్ ఆధ్వర్యంలో విస్తృతంగా ఫాగింగ్, మురికి ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. పారిశుధ్య సిబ్బందితో పందులను ఊరికి దూరంగా తరలించారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎం లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. 28 నుంచి 30 వరకు బ్యాంకుల బంద్ ● ఆదివారం పనిచేయనున్న బ్యాంకులు అనంతపురం అగ్రికల్చర్: వేతన సవరణ ఒప్పందంలో ఇచ్చిన హామీ మేరకు ఫైవ్ డేస్ బ్యాంకింగ్ ప్రధాన డిమాండ్‌తో బ్యాంకర్లు వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడంతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) దేశా వ్యాప్త పిలుపు మేరకు ఈనెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు సమ్మె చేపట్టనున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ, గ్రామీణ, సహకార బ్యాంకులు పూర్తిగా మూత పడనున్నాయి. ప్రైవేట్ బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. ఏటీఎంలు, కాల్ సెంటర్లు, ఆన్లైన్ బ్యాంకింగ్ పనిచేస్తాయని బ్యాంకర్లు తెలిపారు. వందల సంఖ్యలో ఉన్న బ్యాంకులు మూడు రోజులు బంద్ కానుండటంతో వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రజలు, ఖాతాదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆదివారం వర్కింగ్‌డేగా ఆదేశాలు జారీ అయినట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి. సెలవు రోజు ఆదివారం అన్ని బ్యాంకులు పనిచేయనున్నట్లు తెలిపారు. -
ఫుట్‌బాల్ టోర్నీ విజేత పశ్చిమ బెంగాల్
అనంతపురం: నగరంలోని ఆర్డీటీ క్రీడాగ్రామం వేదికగా సాగిన డాక్టర్ తాలిమెరెన్ ఆవో అండర్–19 బాలికల నేషనల్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను పశ్చిమ బెంగాల్ జట్టు కై వసం చేసుకుంది. క్రీడాకారులు పట్టుదలతో శ్రమించి డిఫెండింగ్ చాంపియన్ మణిపూర్ జట్టును ఓడించి తమ చిరకాల కలను సాకారం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం పశ్చిమ బెంగాల్, మణిపూర్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆట ముగిసే సమయానికి రెండు జట్లూ చెరో గోల్ సాధించి సమంగా నిలిచాయి. ఆ తర్వాత జరిగిన పెనాల్టీ షూటౌట్లో పశ్చిమ బెంగాల్ జట్టు క్రీడాకారులు ఒత్తిడిని జయించి 3 గోల్స్ చేయగా, మణిపూర్ జట్టు 2 గోల్స్‌కే పరిమితమైంది. విజేతలను అభినందిస్తూ ఏపీఎఫ్‌ఏ జనరల్ సెక్రటరీ డేనియల్ ప్రదీప్, ఎగ్జిక్యూటివ్ అర్పిత, నవీన్, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు దాదా ఖలందర్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ శ్రీసత్యసాయి జిల్లా ఉపాధ్యక్షుడు ఈఆర్ షాద్, కడప జనరల్ సెక్రటరీ సుధీర్ తదితరులు మెడల్స్, ట్రోఫీలను అందజేశారు. -
దేవుడా.. ఎంత పని చేస్తివయ్యా..
● విద్యుదాఘాతంతో యువకుడి మృతి ● కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు పామిడి: దేవుడా.. ఎంతపని చేస్తివయ్యా...చేతికొచ్చిన కొడుకునూ లేకుండా చేస్తివే...అంటూ కుమారుడి మృతిని తట్టుకోలేక తండ్రి రోదన చూపరులను కంటతడిపెట్టింది. ఈ దుర్ఘటన పామిడిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలమేరకు... స్థానిక అంబేడ్కర్ సర్కిల్లోని హనుమాన్ టాకీస్ క్రాస్‌లో తాతాయ్యగౌడ్ కోడిగుడ్ల వ్యాపారం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవలే వాణినగర్‌లో తాను ఉన్న ఇంటి వెనుక నూతన గృహనిర్మాణ పనులు చేపట్టాడు. ఈక్రమంలో ఇంటి నిర్మాణ బెడ్డింగ్‌కు క్యూరింగ్ చేయడానికి పూనుకున్నాడు. తాతయ్యగౌడ్ మొదటి కుమారుడు రాహుల్‌గౌడ్ (22) ఇంట్లో నుంచి త్రీపిన్ ఫ్లగ్తో కూడిన విద్యుత్ వైరుకు బోర్ మోటారు వైరును అమర్చే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు. ఇంటి మెయిన్ ఆఫ్‌చేసి కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే రాహుల్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం దద్దరిల్లింది. రాహుల్ ఐటీఐ పూర్తి చేసి తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచేవాడని.. ఇంతలోనే దేవుడు ఎంత పనిచేశాడంటూ కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాన్ని పీఎం నిమిత్తం మార్చురీకి తరలించి, పామిడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి తాడిపత్రిటౌన్: పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి (60) మృతి చెందాడు. పట్టణంలోని మార్కెట్‌యార్డ్ ముందు శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటంతో స్థానికులు అతన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ ఆరోహనరావు తెలిపారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, తెల్లచొక్కా, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించినట్లు పేర్కొన్నారు. సమాచారం తెలిసిన వారు సెల్: 9440796861కు తెలియజేయలని కోరారు. -
వంచక ప్రభుత్వానికి పతనం తప్పదు
● మాట తప్పితే అక్టోబర్ 3 తర్వాత నిరవధిక సమ్మె ● వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల అల్టిమేటం అనంతపురం సిటీ: హామీలు నెరవేర్చకుండా మోసం చేయాలని చూస్తే ప్రభుత్వానికి పతనం తప్పదని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ నాయకులు హెచ్చరించారు. సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శుక్రవారం అనంతపురం వేదికగా సాగిన రాయలసీమ జోనల్ (జోన్–4) వైద్య ఉద్యోగుల గర్జన మహాసభ విజయవంతమైంది. ముందుగా సప్తగిరి సర్కిల్ నుంచి రుద్రంపేట బైపాస్ వరకు వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. రాయలసీమ జిల్లాల నుంచి తరలివచ్చిన కాంట్రాక్ట్ నర్సులు, పారామెడికల్, ఫార్మసీ, ల్యాబ్ అసిస్టెంట్ సిబ్బంది వందలాది మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా గర్జించారు. అనంతరం రుద్రంపేట బైపాస్‌లోని యాదవ భవన్లో జరిగిన మహాసభలో జేఏసీ రాష్ట్ర చైర్మన్ కోటేశ్వరరావు డిమాండ్ల సాధన కోసం గతంలో 15 రోజుల పాటు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తే ఓ మెట్టు దిగివచ్చిన ఉన్నతాధికారులు.. చర్చల పేరుతో ఆర్థికేతర అంశాలు పరిష్కరిస్తామని, మిగిలిన డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ఆర్థికపరమైన డిమాండ్లపై ఇప్పటి వరకూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కానీ, అధికారులు కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. మిగిలిన వారితో సమానంగా బేసిక్ వేతనం చెల్లించాలని, వంద శాతం గ్రాస్ సాలరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్టు నర్సెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకూ 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని కోరారు. విధి నిర్వహణలో మరణించిన ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికీ రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పించాలన్నారు. ఈపీఎఫ్, పరస్పర బదిలీల వంటి డిమాండ్లు పరిష్కరించాలన్నారు. అక్టోబర్ 3వ తేదీలోపు రెగ్యులరైజేషన్‌పై స్పష్టమైన జీఓ ఇవ్వకపోతే విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు ప్రకటించారు. కార్యక్రమంలో ఏపీ ఎంఎల్టీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్, ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు మాధవ్, ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు శరత్, జేఏసీ కో చైర్మన్ వెంకట్, ఏపీజీసీఎన్ఏ రాష్ట్ర అధ్యక్షుడు సుమన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వినోద్, ప్రశాంతి, లావణ్య, సుజేంద్ర, చాందిని, వెంకటేష్ నాయక్, శ్రీకాంత్, వలి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
పంటలు ఎండిపోతున్నా పట్టదా?
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, అనంత, పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ ధ్వజం అనంతపురం: సాగునీరందక పంటలు ఎండిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ కుప్పంకు నీటిని తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. శుక్రవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అనంత ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్లమెంట్ పరిశీలకుడు నరేష్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. నేరుగా కుప్పంకు నీటి తరలింపు కారణంగా అనంతపురం జిల్లాలోని హంద్రీ–నీవా కాలువ పరిసర ప్రాంతాల్లోని పంటలు నీరు లేక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే హంద్రీ–నీవా కాలువకు, పీఏబీఆర్‌కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సబ్సిడీ కింద రైతులకు విత్తనాలు వెంటనే చేయాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనలు నిర్వహించడంతో పాటు త్వరలోనే కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా అమలు చేసే వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. ప్రతి స్థానంలో గెలుపు గుర్రాలను, ప్రజాదరణ ఉన్న నాయకులను అభ్యర్థులుగా ఎంపిక చేయాలని అనంత ఆదేశించారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిష్పక్షపాతంగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయా లని సూచించారు. హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం, ప్రజా సమస్యలపై నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, పార్టీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ, పార్టీ పీఏసీ సభ్యుడు తలారి రంగయ్య, రాయదుర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గాదె లింగబాబు పాల్గొన్నారు. -
హిజ్రాలు డబ్బులు డిమాండ్ చేస్తే ఫోన్ చేయండి
● ఎస్పీ జగదీష్ అనంతపురం సెంట్రల్: జిల్లాలో దసర పండగ సందర్భంగా మామూళ్లంటూ హిజ్రాలతో పాటు ఎవరైనా సరే బలవంతపు వసూళ్లకు పాల్పడితే నేరుగా తనకే ఫోన్ చేయాలని ఎస్పీ జగదీష్ సూచించారు. శుక్రవారం నగరంలోని ఆర్యవైశ్య సంఘం నాయకులు, ప్రజలు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి హిజ్రాల డబ్బు వసూళ్లపై ఫిర్యాదు చేశారు. ఎల్–నినో, ఇతరత్రా కారణాలతో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఈ సమయంలో హిజ్రాలు డబ్బుల కోసం బలవంతం చేస్తున్నారన్నారు. స్పందించిన ఎస్పీ జగదీష్ బలవంతపు వసూళ్లను ఉపేక్షించేది లేదని, ఎవరైనా అలాంటి కార్యక్రమాలకు పాల్పడితనే డయల్ 100 లేదా నేరుగా తనకే సమాచారం అందించాలని సూచించారు. రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపిక బొమ్మనహాళ్: రాష్ట్రస్ధాయి సాఫ్ట్‌బాల్ పోటీలను బొమ్మనహాళ్ మండలంలోని సింగానహాళ్లి ఉన్నత పాఠశాలో 10వ తరగతి చదువుతున్న హెచ్.రంజిత్‌కుమార్ ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయులు ప్రహ్లది నాయుడు, ఫిజికల్ డైరెక్టర్ జగదీష్ తెలిపారు. ఈనెల 24న అనంతపురం జిల్లాస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు జరిగాయన్నారు. పోటీల్లో రంజిత్ ప్రతిభ చూపడంతో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 13, 14, 15 తేదీల్లో కడపలో రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయన్నారు. రంజిత్ రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు, మండలానికి గర్వకారణమని ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ సందర్భంగా పీడీ జగదీష్‌ను అభినందించారు. బడికి దూరమైన విద్యార్థులను గుర్తించండి అనంతపురం ఎడ్యుకేషన్: దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న విద్యార్థులను గుర్తించి తిరిగి బడికి రప్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ దేవానందరెడ్డి ప్రధానోపాధ్యాయులకు సూచించారు. బుక్కరాయసముద్రంలోని ఆర్డీటీ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన వివిధ విద్యా అంశాలపై ప్రధానోపాధ్యాయులతో సమీక్షించారు. విద్యార్థుల హాజరు, డ్రాపౌట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. దీర్ఘకాలికంగా పాఠశాలకు హాజరుకాని విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి తిరిగి బడికి తీసుకురావాలని పేర్కొన్నారు. సమావేశం ఉదయం 10 గంటలకు ఉంటుందని సమాచారం ఇచ్చినప్పటికీ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందనే విషయం ముందుగా తెలియజేయకపోవడంతో పలువురు ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేజీబీవీల్లో వనరుల నిర్వహణకు ‘ఈఆర్పీ’ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ) విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కేజీబీవీల సెక్రటరీ దేవానందరెడ్డి సూచించారు. ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న కేజీబీవీ ప్రిన్సిపాల్స్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్, వార్డెన్లకు శుక్రవారం ఈఆర్పీ, నాణ్యమైన భోజనం, విద్యార్థుల విద్యా ప్రగతిపై స్థానిక సైన్స్ సెంటర్లో అవగాహన శిక్షణ నిర్వహించారు. కేజీబీవీలకు అవసరమైన నిత్యావసర సరుకులు, ప్రొవిజన్స్, ఇతర సామగ్రి అవసరాలను ముందుగానే అంచనా వేసి.. వాటి సరఫరా, నిల్వ, వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించే విధానంపై శిక్షణ ఇచ్చారు. -
ఏమ్మా.. డాక్టర్లు బాగా చూస్తున్నారా?
● కలెక్టర్ ఆనంద్ వాకబుగుంతకల్లుటౌన్: ‘ఏమ్మా..బాగున్నారా..ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సులు మంచిగా సేవలందిస్తున్నారా..సకాలంలో ఇంజెక్షన్లు, మందులు ఇస్తున్నారా.. ఏమైనా ఇబ్బందులున్నాయా’ అని ఉషారాణి అనే బాలింతతో కలెక్టర్ ఆనంద్ ఆరాతీశారు. శుక్రవారం సాయంత్రం గుంతకల్లులోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు. లేబర్‌వార్డు, బాలింతలు, కంగారూ..మదర్‌కేర్ వార్డులను ఆయన పరిశీలించారు. ప్రసవాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తక్కువ బరువు (2.5 కేజీల్లోపు) ఉన్న లేదా నెలలు నిండకుండా పుట్టిన పసిబిడ్డను తల్లి తన ఛాతీకి హత్తుకుంటే బంధాలు బలపడటంతో పాటు వారికి మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చేందుకు గాను ‘కంగారూ..మదర్‌కేర్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. శిశుమరణాల రేటు తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జిల్లాలోని మరో రెండు సీహెచ్‌సీల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఫలితాలు బాగా వచ్చాక జిల్లా అంతటా ఈ సేవలను విస్తరిస్తామని వెల్లడించారు. సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతాం గుంతకల్లు రూరల్: సమస్యలు లేని గ్రామంగా నాగసముద్రం గ్రామాన్ని తీర్చిదిద్దుతామని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం నాగసముద్రం గ్రామంలో ‘ఒక్క గ్రామం నాలుగు సందర్శనలు’లో భాగంగా గ్రామసభ నిర్వహించి, ప్రజల నుంచి వివిధ సమస్యలపై 60 అర్జీలు స్వీకరించారు. అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై విద్యార్థినులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పరిహారంపై సమీక్ష వజ్రకరూరు – దోనిముక్కల వరకు నిర్మిస్తున్న 220 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ విద్యుత్ టవర్ల ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు క్షేత్ర స్థాయి పరిస్థితులకు అనుగుణంగా పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ రెవెన్యూ సిబ్బందికి సూచించారు. రైతులకు పరిహారం అందించే అంశంపై శుక్రవారం గుంతకల్లు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాస్‌తో కలిసి కలెక్టర్ సమీక్షించారు. పరిహారం ఎంత ఇవ్వాలనే దానిపై మూడు రోజుల్లో నివేదిక అందించాలని అధికారులకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీఓ శ్రీనివాస్, వైద్యారోగ్యశాఖ ఆర్డీ శ్రీనివాసరావు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కట్టా వెంకటేశ్వర్లు, నాగసముద్రం పీహెచ్సీ వైద్యుడు నవీన్‌కుమార్ బాబు, ఎంపీడీఓ దేవదాస్, తహసీల్దార్ పుణ్యవతి, అగ్రికల్చర్ ఆఫీసర్ లీనా వసుంధర, కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
కాలువ మట్టి అక్రమ తరలింపుపై విచారణ చేపట్టండి
అనంతపురం సెంట్రల్: భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ) కాలువ పనుల వద్ద అక్రమంగా తరలుతున్న మట్టి తరలింపుపై విచారణ చేపట్టి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హంద్రీ–నీవా కార్యాలయంలో ఎస్ఈ రాజగోపాల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తలారి రంగయ్య మాట్లాడుతూ బీటీపీ కాలువ కోసం తవ్విన మట్టిని కొంతమంది రాత్రికిరాత్రే అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ సంపదను దోచుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. అక్రమ మట్టి రవాణా వెనుక ఎవరెవరి హస్తం ఉందో తేల్చడానికి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మట్టి అక్రమ రవాణాను అడ్డుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కేజీబీవీలో కలకలం
● భవనంపై నుంచి పడ్డ విద్యార్థినికి గాయాలు ఆత్మకూరు: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థిని గాయపడటం కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. గురువారం రాత్రి మొదటి అంతస్తులో నుంచి ఓ విద్యార్థిని కిందపడింది. కాలికి, చేతికి గాయాలయ్యాయి. మెట్లపై నుంచి జారిపడిందా.. లేక తనే భవనంపై నుంచి కిందకు దూకిందా అనేది తెలియరావడం లేదు. ఏం జరిగిందని అడిగిన తోటి విద్యార్థుల వద్ద కళ్లు తిరిగి పడిపోయినట్లు బాధితురాలు చెప్పిందని స్పెషలాఫీసర్ (ఎస్ఓ) లీమా రోజ్ తెలిపారు. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఓ చెప్పారు. ఇదిలా ఉండగా బాధిత విద్యార్థినికి తల్లిదండ్రులు లేరని తెలిసింది. విద్యార్థిని భవనంపైకి వెళ్లి కిందపడే వరకు డ్యూటీలో ఉన్న ఉపాధ్యాయులు, సిబ్బంది ఏం చేస్తున్నారని పలువురు విద్యార్థినుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నీట్ పీజీ ఫలితాల్లో మెరిసిన హంసలేఖ
అనంతపురం సిటీ: పట్టుదల, కష్టం తోడైతే విజయం వరిస్తుందని అనంతపురంలోని లక్ష్మీనగర్‌కు చెందిన వైద్య విద్యార్థిని డాక్టర్ గాజుల హంసలేఖ నిరూపించారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రకటించిన నీట్ పీజీ–2026 ఫలితాల్లో ఆమె జాతీయస్థాయిలో 7,673వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. 720 మార్కులకు గాను 518 మార్కులు సాధించిన హంసలేఖ నెల్లూరులోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. గతేడాది ఇదే నీట్ పీజీ–2025 పరీక్షలో ఆమె సోదరుడు శ్రీకృష్ణదేవరాయలు 621 మార్కులతో జాతీయ స్థాయిలో 1,330వ ర్యాంకు సాధించగా, అన్న స్ఫూర్తితో చెల్లెలు కూడా జాతీయ స్థాయి ర్యాంకు కై వసం చేసుకోవడం విశేషం. -
కాపురంలో చిచ్చురేపిన ‘అనుమానం’
రాప్తాడు రూరల్: అనుమానం ఆ దంపతుల మధ్య చిచ్చు పెట్టింది. మూడోవ్యక్తి ప్రస్తావనతో కాపురంలో కలతలు రేగాయి. పెరిగిన గొడవలు చివరకు నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఇంట్లో గొడవలు చేసుకుంటే తల్లిదండ్రులకు తెలుస్తుందని, బయటకు వెళ్లి మాట్లాడుకుందామని భార్యను నమ్మించి తీసుకెళ్లిన భర్త...నిర్మానుష్య ప్రాంతంలో కత్తితో గొంతుకోసి హతమార్చాడు. అనంతపురం రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నేషనల్ పార్కు సమీపంలో శుక్రవారం ఈ దారుణం చోటు చేసుకుంది. భార్యను హత్య చేసిన భర్త పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. అనుమానంతోనే... కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం రామకొండకు చెందిన ఎస్.అఖిల (26)కు అనంతపురం నగరం ఎర్రనేలకొట్టాలుకు చెందిన రాజేష్‌తో 2020లో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమార్తె, కుమారుడు సంతానం. రాజేష్ బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. తొలినాళ్లలో అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో ఇటీవల కలతలు మొదలయ్యాయి. భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందనే అను మానం రాజేష్‌ను వెంటాడింది. ఈ విషయమై దంపతుల మధ్య పలుమార్లు గొడవలు జరిగినట్లు తెలిసింది. బయటకు తీసుకెళ్లి... భార్యతో గొడవపడితో ఇంట్లో తల్లిదండ్రులకు తెలుస్తుందని భావించిన రాజేష్..బయటకు వెళ్లి మాట్లాడుకుందామని అఖిలను నమ్మించాడు. ఈ క్రమంలో ఆమెను ఇంటినుంచి తీసుకెళ్లాడు. నేషనల్ పార్కు దాటిన తర్వాత కాలువ పక్కన నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ పదునైన కత్తితో అఖిల గొంతు కోశాడు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. చిన్నారులకు తీరని శోకం తల్లి హత్యకు గురికావడం, తండ్రి హంతకుడిగా మారడంతో ఐదేళ్ల కూతురు, మూడేళ్ల బాబు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. తల్లిదండ్రుల మధ్య నెలకొన్న అనుమానాలు, గొడవలు ఇద్దరు చిన్నారులకు తీరని వేదనను మిగిల్చాయి. కళ్లముందు పెరగాల్సిన పిల్లలకు తల్లిదూరం కావడం స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులకు ‘హద్దు’ చిక్కు ఘటనా స్థలం ఏ పోలీస్‌స్టేషన్ పరిఽధిలోకి వస్తుందనే విషయంలో కాసేపు గందరగోళం నెలకొంది. అడుగుల దూరం తేడాతో హద్దుల సమస్య తలెత్తింది. తమ పరిధిలోకి రాదంటే తమ పరిధిలోకి రాదని త్రీటౌన్, రూరల్ పోలీసులు తర్జనభర్జన పడ్డారు. చివరకు రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనే ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన రూరల్ సీఐ శ్రీకాంత్‌యాదవ్ మాట్లాడుతూ...భార్యపై అనుమానంతోనే భర్త హత్య చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. భార్యను కడతేర్చిన భర్త మాట్లాడుకుందామంటూ శివార్లలో కత్తితో పొడిచి హత్య మరో వ్యక్తితో సన్నిహితమే హత్యకు కారణమా? -
రైతులను నిర్లక్ష్యం చేస్తే జెన్‌జీ ఉద్యమాలు
అనంతపురం అర్బన్: ‘రైతు కష్టాలపై ప్రభుత్వాలు స్పందించాలి. కాదని నిర్లక్ష్యం చేస్తే జెన్‌జీ తరహా ఉద్యమాలు తప్పవు. అదే జరిగితే ప్రభుత్వాలు తట్టుకోలేవు.’ అని మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ అన్నారు. శుక్రవారం స్థానిక క్లాక్‌టవర్ వద్ద సీపీఎం చేపట్టిన ‘రైతు రక్షణ జీపుయాత్ర’ కార్యక్రమానికి గేయానంద్‌తో పాటు సామాజికవేత్త బోస్, జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప హాజరై మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. ప్రభుత్వాలకు కంపెనీల మీద ఉన్న శ్రద్ధ రైతులపై చూపడం లేదని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి జిల్లాకు రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చి అమలు చేయాలన్నారు. పంట నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని, లేకపోతే ఆత్మహత్యలు పెరిగే అకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 28న కలెక్టరేట్ వద్ద ధర్నాకు పెద్ద సంఖ్యలో రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు హాజరై జయప్రదం చేయాలన్నారు. రాప్తాడు రూరల్: కరువు పరిస్థితులపై రాప్తాడులో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో జీపు జాతా చేపట్టారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు బాషా, సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు: వర్షాభావంతో రైతులు కరువు కాటకాలతో రైతులు అల్లాడుతుంటే వారి గురించి పట్టించుకోని చంద్రబాబు కార్పొరేట్ కంపెనీలకు భూములు ధారాదత్తం చేస్తూ రైతుల ద్రోహిగా మారారని సీపీఎం సీనియర్ నాయకులు ఓబులు విమర్శించారు. ‘కరువు జీపుయాత్ర’లో భాగంగా శుక్రవారం ఆత్మకూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు హంద్రీ–నీవా నీళ్లను కుప్పానికి తీసుకెళ్తున్నా జిల్లాలోని టీడీపీ ప్రజాప్రతినిధులు ఏమీ మాట్లాడలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. -
విద్యార్థిని జీవితంతో చెలగాటం
● డబ్బు చెల్లిస్తేనే ఆన్లైన్లో పేరు తొలగిస్తామంటున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ● పట్టించుకోని విద్యాశాఖ అధికారులు కళ్యాణదుర్గం రూరల్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ నాశనం అయింది. కళ్యాణదుర్గంలో జరిగిన ఘటన దానికి సాక్ష్యంగా నిలుస్తోంది. వివరాలు... బాధిత విద్యార్థిని తల్లి జ్యోతి తెలిపిన వివరాల మేరకు... కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ది గ్రామానికి చెందిన జ్యోతి, కృష్ణమూర్తి దంపతుల కుమార్తె నిత్యశ్రీ 2023–24లో స్థానికంగా ఉన్న శ్రీదేవి ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్య పథకానికి ఎంపికై ంది. అయితే అక్కడ విద్యార్థులు లేకపోవడంతో ఒంటిమిద్ది సమీపంలోని రత్నాకర్ స్కూల్లోకి 1వ తరగతిలో ఉచిత సీటులో చేరింది. అప్పటి నుంచి 3వ తరగతి వరకు అక్కడే విద్యను అభ్యసించింది. అయితే ఇంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నిత్యశ్రీని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేదుకు విద్యార్థి తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. అయితే నిత్యశ్రీకి ప్రభుత్వం నుంచి పడాల్సిన డబ్బు జమ కాలేదని, రూ.70 వేలు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని రత్నాకర్ స్కూల్ యాజమాన్యం తేల్చి చెప్పింది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. దీనిపైసోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. ఎంఈఓ కలగజేసుకోని రత్నాకర్ స్కూల్లో టీసీని ఇప్పించి, ఫీజుమాత్రం చెల్లించాల్సిందే అని చెప్పడంతో విద్యార్థి తల్లితండ్రులకు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఆన్లైన్ డేటాతో చిక్కు రత్నాకర్ స్కూల్ ఇచ్చిన టీసీని నిత్యశ్రీ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు అందజేశారు. అయితే రత్నాకర్ స్కూల్ యాజమాన్యం విద్యార్థిని వివరాలను ఆన్లైన్లో తొలగించలేదని, అది తొలగిస్తేనే మీకు ఇక్కడ అడ్మిషన్ ఇస్తామని ఉపాధ్యాయులు తెలిపారు. ఇదే అంశంపై వారం రోజులుగా నిత్యశ్రీ తల్లిదండ్రులు అధికారుల వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటున్నా ఫలితం లేకపోయింది. దీంతో నిత్యశ్రీని చదువు మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికై నా విద్యార్థి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు జ్యోతి, కృష్ణమూర్తి విజ్ఞప్తి చేస్తున్నారు. -
ట్రెల్లీస్ ఘటనలో ఎవరినీ ఉపేక్షించం
అనంతపురం సిటీ: నగరంలోని ట్రెల్లీస్ స్కూల్లో చోటు చేసుకున్న అమానుష ఘటనలో దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు చల్ల మధుసూదనరావు, ఉండవల్లి గాంధీబాబు స్పష్టం చేశారు. ఇటీవల ట్రెల్లీస్ స్కూల్లో ఓ చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటనను ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా పరిగణించి సుమోటోగా విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ట్రెల్లీస్ స్కూల్‌ను వారు సందర్శించారు. పాఠశాలలో పిల్లల రక్షణ కోసం ఎలాంటి ‘చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ‘ అమలులో లేకపోవడాన్ని గుర్తించి యాజమాన్య నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దారుణమైన సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని పాఠశాల యాజమాన్యాన్ని కమిషన్ సభ్యులు నిలదీశారు. స్కూల్లో సీసీ కెమెరాల మానిటరింగ్‌ను నిరంతరం పర్యవేక్షించాలని, ‘సేఫ్ టచ్ – అన్ సేఫ్ టచ్‌పై పిల్లలకు తగిన అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. పాఠశాలల్లో పిల్లల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థుల రక్షణకు అన్ని రకాల చర్యలు తక్షణమే తీసుకోవాలని ఆదేశించారు. వారి వెంట మండల విద్యాశాఖ అధికారి వెంకటస్వామి, ఐసీడీఎస్ పీడీ సాజిదా బేగం, ఉరవకొండ సీడీపీఓ శ్రీదేవి ఉన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలి చిన్నారులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని జీజీహెచ్ వైద్యాధికారులకు ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సూచించారు. గురువారం జిల్లా సర్వజనాస్పత్రిలోని చిన్న పిల్లల వార్డును కమిషన్ సభ్యులు గాంధీబాబు, మధుసూచనరావు పరిశీలించారు. పసికందు మొదలుకుని ప్రభుత్వాస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ మానవతా దృక్పథంతో, ఆప్యాయతతో వైద్య చికిత్స అందజేయాలన్నారు. బలహీనంగా ఉన్న చిన్నారులకు మంచి పోషకాహారం అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, ఐసీడీఎస్ పీడీ సాజిదా బేగం, ఉరవకొండ సీడీపీఓ శ్రీదేవి, డీసీపీఓ మంజునాథ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. సంపూర్ణ పోషకాహారం అందించాలి అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు సంపూర్ణ పోషణలో భాగంగా గుడ్లు, పాలు వంటి పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని ఐసీడీఎస్ సిబ్బందిని ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఆదేశించారు. నగరంలోని కృపానందనగర్–2 అంగన్వాడీ కేంద్రాన్ని కమిషన్ సభ్యులు చల్ల మధుసూదనరావు, ఉండవల్లి గాంధీబాబు గురువారం తనిఖీ చేశారు. బాలామృతం, గుడ్లు, పాలు, బియ్యం, కందిపప్పు, నూనె క్వాలిటీని పరిశీలించి ఇవన్నీ పిల్లలకు గర్భిణులకు, మహిళలకు, బాలింతలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు పిల్లల రక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా చూడాలని ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఉండవల్లి గాంధీ బాబు, చల్లా మధుసూదన్‌రావు అధికారులకు సూచించారు. పిల్లల రక్షణ, హక్కుల పరిరక్షణపై గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో వివిధ శాఖల అధికారులతో వారు సమీక్షించారు. పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించకుండా వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలన్నారు. పిల్లల పైన ఎలాంటి సంఘటనలు జరిగినా కమిషన్ చాలా సీరియస్‌గా తీసుకుంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆడపిల్లల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. బాల్యవివాహాలను పూర్తి స్థాయిలో అరికట్టేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల తదితరులు పాల్గొన్నారు. ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు చల్ల మధుసూదనరావు, ఉండవల్లి గాంధీబాబు భద్రతా ప్రమాణాలు పాటించని యాజమాన్యంపై ఆగ్రహం -
ప్రైవేటుకు ఎలక్ట్రిక్ బస్సులు వద్దు
అనంతపురం క్రైం: ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని, అవసరమైన ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీనే కొనుగోలు చేసి సిబ్బందితో నిర్వహించాలని ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై ప్రభుత్వం మళ్లీ ఆలోచిస్తే ఉద్యోగ సంఘాల జేఏసీగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గురువారం అనంతపురంలోని వీకే భవన్లో ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆర్. విజయ్‌భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన, జిల్లా కార్యదర్శి కె. కొండయ్య ఆధ్వర్యంలో విస్తృతస్థాయి కౌన్సిల్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా దామోదరరావు పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ ఆస్తులు, డిపోలు, రూట్లు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలన్నారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న సుమారు 15 వేల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. రద్దీకి అనుగుణంగా 4 వేల కొత్త బస్సులను సమకూర్చాలని డిమాండ్ చేశారు. కడప జోన్ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ అధ్యక్షుడు పీ.ఎస్. ఖాన్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడేవారిపై నాన్ బెయిలబుల్న కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
27న కోర్టు భవన సముదాయం ప్రారంభం
తాడిపత్రి రూరల్: స్థానిక వెటర్నరీ ఆస్పత్రి వద్ద నూతన కోర్టుల భవన సముదాయాన్ని ఈనెల 27న హైకోర్టు ప్రధాన న్యామూర్తి లీసాగిల్ పర్చువల్గా ప్రారంభిస్తారని తాడిపత్రి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏవీ రమణారెడ్డి తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి హైకోర్టు జడ్జీలు బీఎస్ భానుమతి, సురేష్‌రెడ్డి, చల్లా గుణరంజన్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి భీమారావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్, ఎస్పీలతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొంటారన్నారు. చెత్త ఇవ్వండి.. సరుకులు తీసుకోండి● జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి అనంతపురం న్యూటౌన్: జిల్లాలోని ఇళ్ల నుంచి చెత్తను సేకరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి విజయలక్ష్మి తెలిపారు. వచ్చేనెల 24 వరకూ జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛరఽథం డ్రైవ్‌ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సీఈఓ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని మండలాల్లో స్వచ్ఛ రథాల ద్వారా పొడి చెత్తను సేకరించి, ప్రజలకు నిత్యావసర వస్తువులు అందిస్తామన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా గ్రామాలను శుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే వస్తువులు అందించే వినూత్న కార్యక్రమంగా రూపొందించామన్నారు. ప్రజలందరూ పొడి చెత్తను ఒక సంచిలో భద్రపరిచి, కనీసం నెలకు ఒకసారి వచ్చే స్వచ్ఛ రథానికి ఇచ్చి లబ్ధి పొందాలన్నారు. సమాచారం కోసం పంచాయతీ కార్యదర్శి, గ్రీన్ అంబాసిడర్లను సంప్రదించాలన్నారు. నేడు, రేపు సీపీఎం జీపు జాతా ● కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ అనంతపురం అర్బన్: వర్షాభావం కారణంగా జిల్లాలో తీవ్రమైన కరువు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప డిమాండ్ చేశారు. నగరంలోని ఆ పార్టీ కార్యాలయం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరువు మండలాలు ప్రకటించాలని, నష్టపోయిన రైతులకు పరిహారం, పంట రుణాలు మాఫీ చేయాలంటూ శుక్ర, శనివారాల్లో జిల్లాలో జీపు జాతా తలపెట్టామన్నారు. 28న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు రాప్తాడు నుంచి జీపు జాత ప్రారంభిస్తామన్నారు. రైతులు, కౌలు రైతులు, కూలీలు, వృత్తిదారులు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు నాగేంద్రకుమార్, రామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, బాలరంగయ్య, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతాం అనంతపురం న్యూటౌన్: దివ్యాంగుల సంక్షేమం, సమగ్రాభివృద్ధి కోసం పలు సేవలు, సంక్షేమ కార్యక్రమాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. నగరంలోని ఎం.వై.ఆర్ ఫంక్షన్ హాల్లో గురువారం విభిన్న ప్రతిభావంతుల, హిజ్రా–వయోవృద్ధుల సంక్షేమశాఖ వయోవృద్ధుల సహాయ సంస్థ ఆధ్వర్యంలో మూడు చక్రాల స్కూటర్లను ఉచిత పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 70 మంది దివ్యాంగులకు (ఒక్కో మోటారు వాహనం విలువ రూ. 1,20,000) మూడు చక్రాల స్కూటర్ల ఉచిత పంపిణీ చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా పెన్షన్ పొందుతున్న దివ్యాంగులలో ఇప్పటిదాకా దాదాపు 70 శాతం మందికి యూడీఐడీ కార్డులు పంపిణీ చేశామన్నారు. రాయలసీమ రీజియన్‌లో అనంతపురం జిల్లా దివ్యాంగుల సంక్షేమంలో రాష్ట్రంలోనే మోడల్‌గా నిలిచేలా అన్ని పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. అర్హులైన దివ్యాంగులందరికీ కార్పొరేషన్ ద్వారా సంపూర్ణ న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు , వయోవృద్ధుల సంస్థ చైర్మన్ గడుపూటి నారాయణస్వామి, ఏపీ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు హరినాథ్‌రెడ్డి, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కొమ్మల మాటున కాసుల వర్షం!
అనంతపురం క్రైం: అనంతపురంలో ఇటీవల కురిసిన వర్షాలకు పలుచోట్ల చెట్లు నేల కూలాయి. వీటిని తొలగించే మాటున నగర పాలక అధికారులు, అధికార పార్టీ నేతలు కాసులు కొల్లగొట్టినట్లు తెలిసింది. అంతా ఏకమై నామినేషన్ పనుల పేరుతో కూలిన ఒక్కో చెట్టును తొలగించడానికి సుమారు రూ.లక్ష చొప్పున రెండు రోజుల వ్యవధిలోనే రూ.12 లక్షలకు పైగా ఖర్చు చూపడం చర్చనీయాంశంగా మారింది. ప్రతి వార్డుకు చెత్త ట్రాక్టర్లున్నప్పుడు చెట్ల కొమ్మల తొలగింపునకు ప్రత్యేకంగా బిల్లులు పెట్టడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. చేతులు కలిపి.. జేబుల్లోకి వేసుకుని.. నగరపాలక సంస్థలో ఐదు నెలల్లోనే రూ.కోట్ల మేర నామినేషన్ పనులు చేపట్టారన్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా కొమ్మల మాటున కాసులు కొల్లగొట్టిన విషయం బయటకు రావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న కొందరు కాంట్రాక్టర్లు, పార్టీ అనుబంధ వ్యక్తులతో అధికారులు చేతులు కలిపి పర్సెంటేజీలు లెక్కగట్టి నామినేషన్ పనులను అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పని ఎంత జరిగింది.. వాస్తవంగా ఆ పని అవసరమా.. బిల్లులో చూపిన పరిమాణంలో పని జరిగిందా.. అన్న ప్రశ్నలకు సమాధానాలు అధికారుల వద్ద లేవు. పనుల బిల్లుల పరిశీలన జరిగితే అసలు కథ బయటపడుతుందన్న చర్చ పట్టణంలో జోరుగా సాగుతోంది. ఒకే రకమైన పనులను వివిధ పేర్లతో చూపించడం, ఒక ప్రాంతంలో చేసిన పనిని మరో పేరుతో బిల్లుల్లో నమోదు చేయడం, అవసరం లేని పనులకు సైతం అత్యవసర పనుల ముద్ర వేయడం వంటి విధానాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని పట్టణ ప్రజలు కోరుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నగర పాలక సంస్థలో దోపిడీ పర్వం సాగుతోందనే ఆరోపణలున్నాయి. పలు దఫాలు ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చినా ఏ అధికారి స్పందించలేదు. స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న కలెక్టర్ అయినా స్పందించి వాస్తవాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఖర్చుపై స్పష్టత లేదు వర్షాలు పడిన సమయంలో చెట్ల కొమ్మలు పడిపోయి ఉంటే తొలగించి ఉంటారు. మిగిలిన చెత్తను ఎత్తి ఉంటారు. ఇంత ఖర్చు అని చెప్పలేం. విద్యుత్ శాఖ వాళ్లు చెట్లు కొట్టేసి వాటిని అక్కడే వదిలేస్తారు. మేము వాటిని క్లియర్ చేస్తాం. అలాగని కలపను తెచ్చుకుని వినియోగించుకునే అవకాశం లేదు. ఎంత బిల్లులు పెట్టారన్నది చూసి చెబుతాం. – షాకీర్, ఇన్చార్జ్ ఎస్ఈ ఈ ఏడాది మేలో అనంతపురం నగరంలోని సాయినగర్, విద్యుత్ నగర్ సర్కిల్, గుత్తి రోడ్డు, కొవ్వూరునగర్, లక్ష్మీనగర్ తదితర కాలనీల్లో భారీ వర్షాలకు వృక్షాలు నేల కూలాయి. కూలిన చెట్లను తొలగించేందుకు నగరపాలక సంస్థలో రూ.96 వేల బిల్లు పెట్టడం గమనార్హం. జూన్‌లో కూడా పలు కాలనీల్లో కురిసిన భారీ వర్షాలకు నేలకూలిన చెట్లను తొలగించేందుకు రూ.95 వేలు, రూ. 75 వేల మేర బిల్లులు పెట్టారు. నగరంలో ప్రతి వార్డుకు చెత్త సేకరణ ట్రాక్టర్లు ఉన్నప్పుడు చెట్ల కొమ్మలు తొలగింపునకు ప్రత్యేకంగా ఎందుకు బిల్లులు పెట్టారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వర్షానికి కూలిన చెట్ల తొలగింపునకు అడ్డగోలుగా బిల్లులు నామినేషన్ పేరున దందా అధికారులు కుమ్మక్కయ్యారని సర్వత్రా ఆరోపణలు -
తుదిపోరులో నెగ్గేదెవరో ?
అనంతపురం: డాక్టర్ తాలిమెరెన్ ఆవో అండర్ – 19 బాలికల ఫుట్‌బాల్ చాంపియన్ షిప్ టోర్నీలో తుది పోరుకు రంగం సిద్ధమైంది. అనంతపురంలోని ఆర్డీటీ క్రీడా గ్రామం వేదికగా శుక్రవారం ఉదయం డిఫెండింగ్ చాంపియన్ మణిపూర్ జట్టు, వెస్ట్ బెంగాల్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నెల 10న ప్రారంభమైన టోర్నీలో మొత్తం 15 రాష్ట్రాల జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి తలపడ్డాయి. మూడోసారి టైటిల్ కోసం.. ఇప్పటి వరకూ జరిగిన డాక్టర్ తాలిమెరెన్ ఆవో చాంపియన్ షిప్ టోర్నీల్లో మణిపూర్ జట్టే విజయప్రస్థానం కొనసాగిస్తూ వచ్చింది. వరుస విజయాలతో రెండు పర్యాయాలు ట్రోఫీని కై వసం చేసుకున్న మణిపూర్ జట్టు ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను దక్కించుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ జట్టు కూడా మణిపూర్ ఆశలను కల్లలు చేసేందుకు సరైన వ్యూహ రచనతో బరిలో దిగనుంది. -
వైఎస్సార్ సీపీ ప్రభంజనం ఖాయం
● పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామి రెడ్డి అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ‘అనంత’ ముఖ్య అతిథిగా, పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు నరేష్‌కుమార్‌రెడ్డి, అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిశీలకుడు తిప్పేస్వామి విశిష్ట అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ‘అనంత’ మాట్లాడుతూ నగర పాలక సంస్థలోని 62 డివిజన్లతో పాటు మేయర్ పీఠాన్ని కై వసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఆయన అనుచరులు దందాలు, అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఐదేళ్ల పాలనలో అందించిన సంక్షేమం, చేసిన రూ.1,000 కోట్ల అభివృద్ధి ఒకవైపు... ఈ రెండున్నరేళ్ల చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలు, అరాచకాలు మరోవైపు ఉన్నాయని, వీటిపై ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కోవిడ్ కష్టకాలంలోనూ మౌలిక వసతులు కల్పించామన్నారు. సర్వజనాసుపత్రి విస్తరణకు రూ.300 కోట్లు కేటాయించి సర్జికల్ బ్లాక్ నిర్మిస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులను నిలిపివేసిందని విమర్శించారు. తమ పార్టీలో కార్యకర్తే అధినేత అని స్పష్టం చేశారు. స్థానిక నాయకులు, కార్యకర్తల సూచనల మేరకే అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. యువతకు పెద్దపీట వేస్తామని వెల్లడించారు. బాబు నైజం బయటపడింది.. అనంతపురం నగరాన్ని రూ.1,045 కోట్లతో అభివృద్ధి చేసిన వ్యక్తి అనంత వెంకటరామిరెడ్డి అని పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ కుమార్ రెడ్డి కొనియాడారు. చంద్రబాబు హామీలు నెరవేర్చక ప్రజలను మోసం చేశారని, రెండున్నరేళ్లలోనే ఆయన నైజం బయటపడిందన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు బోయ తిప్పేస్వామి మాట్లాడుతూ స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పనిచేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, పీఏసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్, బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, సీఈసీ సభ్యులు నదీం అహమ్మద్, మీసాల రంగన్న, ఎస్ఈసీ సభ్యులు లింగాల శివశంకర్ రెడ్డి, కోగటం విజయభాస్కర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు గౌస్‌బేగ్, వీరా రామకృష్ణా రెడ్డి, మాజీ మేయర్ వసీం సలీం, మాజీ డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆలమూరు శ్రీనివాస రెడ్డి, పూజారి రాజశేఖర్ యాదవ్, గౌని నాగన్న, టీటీడీ మాజీ సభ్యుడు అశ్వత్తనాయక్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్రిజ్వాన్, జిల్లా అధ్యక్షుడు మొఘల్ సైఫుల్లా బేగ్, ఎగ్గుల శ్రీనివాసులు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, కృష్ణవేణి, సాకే చంద్రలేఖ, శివబాల, కేవీ రమణ, ఎద్దుల అమరనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మగువా.. లోకానికి తెలుసా నీ విలువా..
పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకూ ఆ పని, ఈ పనీ అంటూ పరుగులు తీస్తుంది. ఆమె కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదు. గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదు. ఆదిశక్తి రూపం ఆమె. ఆమె లాలనలో, పాలనలో అందరూ పసివాళ్లే. ప్రతి చోటా ప్రేమగా అల్లుకుపోతుంది. ఆమె శ్రమ అంచనాలకు కూడా అందదు. ఆమె లేని జగతిలో దీపమే వెలుగదు. తన వాళ్ల కోసం ఓ మహిళ పడే కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువేనేమో. బతుకుదెరువు కోసం నగరం నుంచి పల్లెలకు వెళ్లి దుస్తుల వ్యాపారం చేసే ఓ మహిళ తన చిన్ని కుమార్తెను నడుముకు కట్టుకుని స్కూటర్లో వెళ్తున్న దృశ్యం పలువురిని ఆలోచింపజేసింది. బుక్కరాయసముద్రం వద్ద ఈ దృశ్యం కనిపించగా, ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. –సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
రోడ్డు పక్కకు దూసుకెళ్లిన స్కూల్ బస్సు
● విద్యార్థులకు తప్పిన ప్రమాదం బుక్కరాయసముద్రం: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ స్కూల్ బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఘటన మండల పరిధిలో జరిగింది. బస్సులోని 25 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వివరాలు.. బీకేఎస్ మండల పరిధిలోని సిద్దరాంపురం నుంచి అనంతపురంలోని అనంతలక్ష్మి ఇంగ్లిష్ మీడియం స్కూల్‌కు 25 మంది విద్యార్థులు అదే పాఠశాల బస్సులో బయలుదేరారు. మార్గమధ్యంలోని దేవర కొండ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో బస్సు డ్రైవర్ రవి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న గుంతల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా బస్సులోని పిల్లలు హాహాకారాలు చేశారు. సమీపంలోని జగనన్న కాలనీవాసులు ఘటనాస్థలికి పరుగున వచ్చి పిల్లలందరినీ బస్సులో నుంచి దించేశారు. విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. విషయాన్ని ఎంఈఓ లింగా నాయక్ జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు. రోడ్డు రవాణా శాఖ అధికారులు డ్రైవర్ రవి డ్రైవింగ్ లైసెన్స్, బస్సు ఫిట్నెస్, ఇన్సూరెన్స్ తదితర రికార్డులను పరిశీలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రాప్ సర్వర్.. టెర్రర్! అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ ఈ–క్రాప్ ప్రక్రియను సర్వర్ సమస్య వెంటాడుతున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. మూడు రోజులుగా ఆర్ఎస్కే అసిస్టెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పరిష్కరించలేని పరిస్థితి నెలకొంది. పగలు రద్దీ ఎక్కువగా ఉంటుందని అర్ధరాత్రి యాప్‌ను ఓపెన్ చేస్తున్నా సర్వర్ మొరాయిస్తుండడం, ఈ–క్రాప్ వేగవంతం చేయాలంటూ పైనుంచి ఒత్తిళ్లు అధికం కావడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈనెల 30లోపు ఈ–క్రాప్ పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతానికి 80 శాతం పూర్తయినట్లు చెబుతున్నా... ఈ–కేవైసీ 80 శాతం పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. 6.50 లక్షల ఎకరాల వ్యవసాయ పంటలు, మూడు లక్షల ఎకరాల ఉద్యాన పంటలు, మరో 1,300 ఎకరాల మల్బరీతో పాటు 3.40 లక్షల ఎకరాల బీడు భూములు... మొత్తంగా 13 లక్షల ఎకరాల వరకు ఈ–పంటలో నమోదు చేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఇంకా 5 లక్షల ఎకరాలకు పైగా నమోదు చేయాల్సి ఉందంటున్నారు. నీట్ పీజీ ఫలితాల్లో అదరగొట్టిన పూజిత ● జాతీయస్థాయిలో 74వ ర్యాంకుతో సత్తా గుంతకల్లు/ గుంతకల్లు టౌన్: నీట్–2026 పీజీ పరీక్ష ఫలితాల్లో గుంతకల్లుకు చెందిన డాక్టర్ ఎం.పూజిత అదరగొట్టారు. దేశవ్యాప్తంగా మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్బీఈఎంఎస్) నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇందులో పూజిత 603 మార్కులతో ఆలిండియా స్థాయిలో 74వ ర్యాంకు సాధించారు. స్థానిక సాయినగర్‌కు చెందిన ఆరోగ్య విస్తరణాధికారి కుమారస్వామి, ఎల్ఐసీ ఉద్యోగిని సుగుణమ్మ కుమార్తె పూజిత గత ఏడాది సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 5.99 లక్షల మందికి ఆల్బెండజోల్ అనంతపురం సిటీ: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న జిల్లా వ్యాప్తంగా బాలబాలికలు 5,99,852 మందికి ఆల్బెండజోల్ మాత్ర ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఎన్డీడీ నోడల్ అధికారి, వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. శిశు సంక్షేమ, మున్సిపాలిటీ, పంచాయతీ రాజ్, స్వర్ణ వార్డు సిబ్బందిని సమన్వయం చేసుకుని విజయవంతానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు ప్రసన్న భారతి తదితరులున్నారు. -
సోనామసూరి పేరుతో మోసం
బొమ్మనహాళ్: సోనామసూరి బియ్యం పేరుతో రేషన్ బియ్యాన్ని విక్రయించి ఓ వ్యక్తిని మోసం చేసిన ఘటన బొమ్మనహాళ్ మండలంలోని నేమకల్లులో గురువారం చోటు చేసుకుంది. వివరాలు... నేమకల్లుకు బొలెరో వాహనంలో వచ్చిన గుర్తు తెలియని ఓ వ్యక్తి సోనామసూరి బియ్యం విక్రస్తున్నామని చెప్పాడు. శాంపుల్‌గా కొంత బియ్యం చూపించి, బయట మార్కెట్లో క్వింటా బియ్యం రూ.7 వేలు పైనే ఉందని, తమ వద్ద కేవలం రూ.4,300కే విక్రయిస్తున్నట్లు నమ్మించాడు. దీంతో గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి బియ్యం బాగున్నాయని.. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే బియ్యం వస్తాయని ఆశతో క్వింటా రూ.4,300 ప్రకారం 3 క్వింటాళ్ల బియ్యాన్ని రూ. 12,900లకు కొనుగోలు చేశాడు. కొద్ది సేపటి తర్వాత ఇంట్లో అన్నం చేసుకునేందుకు బియ్యం బస్తాను తెరచి చూడగా..అందులో సోనామసూరి బియ్యం కాకుండా రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించాడు. దీంతో తాను మోసపోయిన్నట్లు తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశాడు. బియ్యం విక్రయించిన వ్యక్తి కోసం గాలించిన్పప్పటికీ అప్పటికే అతడు వాహనంతో వెళ్లిపోయిన్నట్లు బాధితుడు తెలిపారు. సీసీ కెమెరాల్లో దొరికిన వీడియోలతో పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. రెన్యూవల్ చేయని మద్యం షాపులకు నోటిఫికేషన్ ● అక్టోబర్ 1 వరకూ దరఖాస్తుకు గడువు ● 5న లాటరీ ద్వారా ఎంపిక అనంతపురం సెంట్రల్: రెన్యూవల్ చేయని మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి.రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 138 మద్యం షాపులకు రెన్యూవల్ చేసుకోవడానికి అవకాశం కల్పించామన్నారు. అయితే వివిధ కారణాలతో ఓపెన్ కేటగిరీలో మొత్తం 50 మద్యం షాపులు, 3 గీత కులాలకు సంబంధించిన షాపులు రెన్యూవల్ కాలేదన్నారు. అనంతపురంలో 15, తాడిపత్రి 12, గుత్తి 7, గుంతకల్లు 4, కణేకల్ 1, కళ్యాణదుర్గం 4, కంబదూరు 5, రాయదుర్గం 3, బుక్కరాయసముద్రం 2 మద్యం షాపులు నోటిఫై చేశామన్నారు. వీటిని లాటరీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో అందజేయవచ్చన్నారు. అక్టోబర్ 1వ తేదీ రాత్రి 11.59 గంటల వరకూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. 5న ఉదయం 8 గంటలకు జిల్లా పరిషత్ ఆవరణలోని డీపీఆర్సీ మీటింగ్ హాల్లో లాటరీ ప్రక్రియ నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
జగనన్న చలువతోనే సేవా భాగ్యం
● ఆత్మీయ వీడ్కోలు సభలో జెడ్పీటీసీ సభ్యులు అనంతపురం న్యూ టౌన్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చలువతోనే ప్రజలకు సేవ చేసే మహదవకాశం తమకు దక్కిందని పలువురు జెడ్పీటీసీలు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ పాలకమండలి పదవీకాలం ముగిసిన నేపథ్యంలో గురువారం సభ్యులకు స్థానిక జెడ్పీ సమావేశ భవనంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌హన్ రెడ్డికి రుణపడి ఉంటామన్నారు. ఐదేళ్ల పదవీ కాలంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో రూ.129.53 కోట్ల మేర పనులు చేపట్టినట్లు వెల్లడించారు. రూ.39.14 కోట్లతో రోడ్లు, రూ. 64.64 కోట్లతో తాగునీటి సౌకర్యం, రూ.11.18 కోట్లతో డ్రైనేజీలు, రూ. 5.79 కోట్లతో కల్వర్టులు, రూ.59 లక్షలతో అంగన్వాడీ భవనాల నిర్మాణం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 180 కారుణ్య నియామకాలు చేపట్టామన్నారు. 32 మంది ఎంపీడీఓలు, 48 మంది డిప్యూటీ ఎంపీడీఓలు, 42 మంది ఏఓలు, 112 మంది సీనియర్ అసిస్టెంట్లు, 12 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు డ్రైవర్లు, 53 మంది లేబర్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించినట్లు తెలిపారు. ఆత్మీయ సభలో జెడ్పీటీసీలతోపాటు సీఈఓ విజయలక్ష్మి, డిప్యూటీ చైర్పర్సన్ నాగరత్నమ్మ, పరిపాలన అధికారులు మాధవి, లెక్కల శ్రీనివాసులు, నందకిషోర్, చైర్ పర్సన్ సీసీలు సురేష్, నరేష్ తదితరులు తమ అనుభవాలు పంచుకున్నారు. అనంతరం జెడ్పీటీసీ సభ్యులను అధికారులు జ్ఞాపికలు, శాలువలతో సన్మానించారు. -
ఆందోళనలు చేస్తే కర్రలతో కొడతారా?
● స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుస్తాం ● మాజీ మంత్రి శైలజానాథ్ బుక్కరాయసముద్రం: ప్రజా సమస్యలు, రైతు సమస్యలపై ఆందోళనలు చేస్తే కర్రలతో కొడతారా అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త శైలజానాథ్ చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి రివర్స్‌లో పోలీసులతో కేసులు పెట్టించడమేంటని మండిపడ్డారు. గురువారం మండల పరిధిలోని బొమ్మలాటపల్లిలో ఎర్రితాత కల్యాణ మండపంలో పార్టీ మండలాధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన నియోజక వర్గ అబ్జర్వర్ ఎల్ఎం మోహన్‌రెడ్డితో కలసి వైఎస్సార్సీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె, శింగనమల, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలవడం ఖాయమన్నారు. ప్రతి పంచాయతీలో అభ్యర్థులను పోటీలో ఉంచుతామన్నారు. వారి గెలుపుకు కార్యకర్తలు విస్తృతంగా పని చేయాలన్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే గ్రామస్థాయిలో పార్టీని మరింతగా బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ కోసం పని చేసిన ఏ ఒక్కరినీ మర్చిపోమన్నారు. అందుకే ఇప్పటికే ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డులను కూడా ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్, యువ నాయకుడు డాక్టర్ సాకే రిత్విక్, బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి, నాగలింగారెడ్డి, భాస్కర్‌రెడ్డి, ముసలన్న, వెంకటరెడ్డి, పార్వతి, పూల నారాయణస్వామి, లక్ష్మిరెడ్డి, నరేష్, మంత్రి ఆంజినేయులు, పద్మావతి, గుజ్జల పెద్దన్న, మల్లికార్జున, ముత్యాలశీన, ఆది, శ్రీనివాసరెడ్డి, బాలకృష్ణారెడ్డి, జయరామిరెడ్డి, కాటమయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి శైలజానాథ్ సమావేశంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు -
కనులపండువగా సిడిమాను ఉత్సవం
బెళుగుప్ప: మండలంలోని బెళుగుప్పతండా గ్రామంలో బుధవారం గౌరసంద్రం మారెమ్మ జాతరను పురస్కరించుకొని కనుల పండువగా సిడిమాను ఉత్సవం నిర్వహించారు. ముందుగా అర్చకుడు చంద్రానాయక్ మారెమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులతో కలసి గ్రామోత్సవంతో అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం అమ్మవారి పూనకంతో అర్చకుడు చంద్రానాయక్‌ను సిడిమాను ఉత్సవంలో భాగంగా సిడిమాను చుట్టూ తిరుగుతూ భక్తులపై పూలు చల్లి ఆశీర్వదించారు. భక్తిశ్రద్ధలతో జరిగే కార్యక్రమం కావడంతో పెద్ద సంఖ్యలో చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. యువజనోత్సవాలకు దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం కల్చరల్: జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వచ్చే నెలలో జరగనున్న జిల్లా స్థాయి యువజనోత్సవాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆన్సెట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి రవిశంకర్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 15 నుంచి 29 ఏళ్ల వయసున్న యువతకు జానపద నృత్యం, జానపద గీతం, పెయింటింగ్, వీధి నాటకం, కవితా రచన పోటీలు ఉంటాయన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన విజేతలు రాష్ట్రస్థాయి, ఆపైన జాతీయ స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న స్వచ్ఛంద సంస్థలు వివరాలతో ఈనెల 30లోపు జిల్లా కేంద్రంలోని ఆన్సెట్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు 9959517370, 9010786106 నంబర్లలో సంప్రదించాలన్నారు. జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపాలి గుత్తి: 2027లో జరగబోవు పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి ఆయూబ్ హుసేన్ తెలిపారు. బుధవారం ఆయన పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, టాయిలెట్లు, బూత్ రూమ్స్ పరిపశీలించారు. ఉపాధ్యాయులు బోధనను దగ్గరుండి పరిశీలించారు. వందశాతం ఉత్తీర్ణత, 90 శాతం విద్యార్థులు హాజరు లక్ష్యంగా ఉపాధ్యాయులందరూ పని చేయాలన్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఈఓ రవి నాయక్, హెచ్ఎం సుంకన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ఉరవకొండ రూరల్: కోనాపురం సమీపంలో బుధవారం అనంతపురం – బళ్లారి జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను భారత్ గ్యాస్ సిలిండర్ల బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌కు కాలు విరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ ఉన్న ఫలంగా కుడి వైపు వాహనాన్ని తిప్పాడు. దీంతో బొలెరో వాహనం నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ఈ ప్రమాదంలో ఏదైనా రాపిడి జరిగి సిలిండర్లు పేలి ఉంటే పెను ప్రమాదం సంభవించేదని అటుగా వెళ్తున్న ప్రయాణికులు, స్థానికులు తెలిపారు. మహిళా సాధికారతతోనే సమాజ ప్రగతి రాయదుర్గంటౌన్: మహిళా సాధికారతతోనే సమాజ ప్రగతి సాధ్యమని ఆర్డీటీ మహిళా సాధికారత విభాగం డైరెక్టర్ విశా ఫెర్రర్ అన్నారు. బుధవారం గుమ్మఘట్ట మండలశాఖ అక్షయ మహిళా పొదుపు సహకార సంఘం సొసైటీ బ్యాంకును ఆమె ప్రారంభించారు. తొలుత పట్టణంలోని 17వ వార్డు పరిధిలోని కెనరా బ్యాంకు వెనుక వీధిలో 650 మంది సభ్యులున్న సొసైటీ బ్యాంకు భవనాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం సీతారామాంజనేయ కల్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన మహిళా సాధికార సమావేశంలో పొదుపు మహిళలను విశా ఫెర్రర్ మాట్లాడారు. ఉరవకొండ ఆర్డీడీ ఆర్డీ కృష్ణవేణి, ఏపీసీలు సుకన్య, సుధాకర్, వెంకటేశు లు, కోఆర్డినేటర్ తిప్పన్న, ఎర్రిస్వామి, షేక్‌న్‌బీ, ఎఫ్‌సీ ఇందిరా ప్రసన్న, ఆర్ఈ చంద్రశేఖర్, ఇంజినీర్ శ్రీలక్ష్మి, అకౌంటెంట్ అరుణ, అవుట్‌రీజ్ వర్కర్ అరుణకుమారి పాల్గొన్నారు. -
అన్నదాతలను ఆదుకోవడంలో విఫలం
● వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి పామిడి/పెద్దవడుగూరు/గుత్తి/గుత్తి రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలను ఆదుకోవడంలో విఫలమయ్యాయని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు వై నైరుతిరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం పామిడి మండలం గజరాంపల్లి గ్రామంలో వర్షాభావంతో ఎండిన పంటల పొలాలు, పెద్దవడుగూరు మండలం కాశేపల్లి సమీపంలోని పత్తి పంట పొలాలను పరిశీలించారు. వైఎస్సార్సీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పంటల బీమా ప్రీమియం ప్రభుత్వం చెల్లించిందన్నారు. కరువు ప్రాంత రైతులను ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆర్థిక ఇబ్బందులతో అష్టకష్టాలు పడుతున్న రైతుల నుంచి ముక్కుపిండి బీమా ప్రీమియం కట్టించుకున్నట్లు గుర్తు చేశారు. అనంతరం వారు పామిడి మండలం గజరాంపల్లిలో రైతులతో ముఖాముఖీగా మాట్లాడారు. పామిడి మండలం గజరాంపల్లి గ్రామ పరిధిలో 500 మంది దాకా రైతులు 1500 ఎకరాల్లో కొర్ర, కంది, పత్తి, జొన్న, దోస పంటలు సాగు చేసినట్లు రైతులు నాగేంద్రరెడ్డి, దేవేంద్ర, తిప్పారెడ్డి, బొజ్జిరెడ్డి, రమేష్ తదితరులు తెలిపారు. ప్రభు త్వం ఎకరాకు రూ.25వేల చొప్పున పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి పెమ్మక చెన్నకేశవరెడ్డి, రూరల్ కన్వీనర్ రమావత్ రామకృష్ణనాయక్, మూలి నాగేశ్వర్ రెడ్డి, మండలనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులూ.. పంట పొలాల దుస్థితిని చూడండి చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కరువుతో రైతులు, ప్రజలు అల్లాడుతున్నా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎస్విఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్‌కుమార్‌రెడ్డి ,అనంతపురం వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి విమర్శించారు. పెద్దవడుగూరు మండలం మండలం కాశేపల్లి వద్ద పత్తి పంట పొలాలను పరిశీలించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎద్దుల శరభారెడ్డి, రైతు విభాగం మండల అధ్యక్షుడు దేవమోహన్‌రెడ్డి, ఎద్దుల సూర్యప్రభాకర్‌రెడ్డి, రామాంజులరెడ్డి, భూషణ, దొరస్వామిరెడ్డి, శేఖర్, సూర్యనారాయణరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, గోపీనాథ్‌రెడ్డి, శ్రీరామిరెడ్డి, దిమ్మగుడి మోహన్‌రెడ్డి, నాగభూషణ, ప్రసాద్, హనుమంతరెడ్డి, తిమ్మారెడ్డి, శ్రీనివాసులు, మురళీధర్‌రెడ్డి, పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి.. రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో పంటల పరిస్థితులను క్షేత్ర స్థాయిలో తెలుసుకోవాలనే పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రైతు విభాగం నాయకులు బుధవారం జిల్లాలో పర్యటించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల మీదగా గుత్తి, గుత్తి రూరల్ మండలంలోని వన్నేదొడ్డి, కొత్తపేట శివార్లలోని పంట పొలాలను వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డితో కలిసివైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎఎస్ నాగిరెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్‌కుమార్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా నాగిరెడ్డి..రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య యాదవ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. వేరుశనగతో పాటు పత్తి, మొక్కజొన్న, సజ్జ పంటలు కూడా దెబ్బతిన్నాయన్నారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు కనీసం రూ. 25 వేలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. కరువు, చంద్రబాబు కవలలు అని రాష్ట్రమంతా కోడై కూస్తోందన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారం చేపట్టినా రాష్ట్రంలో దుర్భిక్షం తలెత్తుతుందన్నారు. రైతులు అన్ని విధాల నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, జిల్లా, మండల నాయకులు సీవీ రంగారెడ్డి, గురు ప్రసాద్ యాదవ్, వరలక్ష్మి, వాల్మీకి శివ, రామరంగారెడ్డి, రామసుబ్బారెడ్డి, జీపు రమణ, జయరామిరెడ్డి, దస్తగిరి, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. -
విచారణ వద్దు.. వదిలేయండి!
● కళ్యాణదుర్గం సబ్‌రిజిస్ట్రార్‌ను కాపాడేందుకు రంగంలోకి ప్రజాప్రతినిధి అనంతపురం టౌన్: కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ రామ్మోహన్ అక్రమాలు, నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై ‘సాక్షి’లో ఆధారాల సహితంగా ‘అక్రమాల్లో రిజి‘స్టార్’ శీర్షికన బుధవారం వెలువడిన కథనం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో సబ్ రిజిస్ట్రార్‌ను కాపాడేందుకు కూటమి పార్టీ ప్రజాప్రతినిధి విశ్వప్రయత్నాలు సాగించినట్లు తెలుస్తోంది. సదరు సబ్ రిజిస్ట్రార్‌పై ఎలాంటి విచారణ చేయవద్దంటూ ఓ మంత్రి నుంచి ఆ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయించినట్లు సమాచారం. ‘అవసరమైతే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లే విధంగా చూస్తాం.. అప్పటి వరకు చర్యలు వద్దు’ అంటూ హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. మాది తప్పు.. ఆయనది ఒప్పా! నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేసిన ఆ శాఖకు చెందిన నలుగురు ఉద్యోగులను ఇటీవల సస్పెండ్ చేశారు. వారిలో శింగనమల సబ్ రిజిస్ట్రార్ గురునాథ్, తాడిపత్రి సబ్ రిజిస్ట్రార్ బసవరాజు, సీనియర్ అసిస్టెంట్లు గుత్తి మంజునాథ్యాదవ్, చెన్నేకొత్తపల్లి అనిల్ ఉన్నారు. అయితే, ఇప్పటి వరకు సస్పెన్షన్‌కు గురైన వారి కంటే భారీగా డబ్బు దండుకుని నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్లు చేయడంతో పాటు పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్‌ను మాత్రం కాపాడేందుకు ప్రజాప్రతినిధి అన్ని రకాల ప్రయత్నాలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ‘మేము చేస్తే తప్పు.. వారు చేస్తే ఒప్పా?’ అంటూ సస్పెండ్‌కు గురైన అధికారులతోపాటు రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. ‘కాపాడేవారు ఉంటే ఎలాంటి పనులైనా చేయొచ్చా’ అంటూ మండిపడుతున్నారు. కలెక్టర్ స్పందించాలి.. కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ అక్రమాలు, నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై విచారణ అధికారిగా ఎవరిని నియమించారని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ విజయలక్ష్మిని వివరణ కోరగా అలాంటిది ఏమీ లేదని సమాధానం ఇవ్వడం గమనార్హం. ఎవరైనా బాధితులు వచ్చి లిఖిత పూర్వకంగా సబ్ రిజిస్ట్రార్‌పై ఫిర్యాదు చేస్తే అప్పుడు విచారణ చేపడతామని బదులివ్వడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ పెద్దల నుంచి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఎలాంటి ఆదేశాలు వచ్చాయో దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తోంది. ఏదిఏమైనా కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ అక్రమాలపై కలెక్టర్ అయినా స్పందించి విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
జిల్లా అంతటా బుధవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి. వాయువ్య దిశగా గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
‘ప్రత్యామ్నాయం’ దిశగా రైతులను ప్రోత్సహించండి అనంతపురం అర్బన్: కొర్రలు, జొన్నలు, ఉలవలు, అలసందలు, పెసలు వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జేసీ బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంట విత్తనాలను 80 శాతం సబ్సిడీతో ఇస్తున్నారని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు వర్షపాతం 36 శాతం తక్కువగా నమోదైందన్నారు. జిల్లావ్యాప్తగా 3.43 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 2.78 లక్షల హెక్టార్లలోనే సాగయ్యాయన్నారు. మిగిలిన భూమిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశుగ్రాసం కొరత లేకుండా చూడాలని చెప్పారు. నెలాఖరులోగా ఈ–పంట డిజిటల్ క్రాప్ సర్వే పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని 302 రైతు సేవా కేంద్రాల పరిధిలో హాఫ్ మూన్ మోడల్లో కేటాయించిన పంటల సాగు లక్ష్యం పూర్తి కావాలన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి సాలురెడ్డి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, డీసీఓ అరుణకుమారి, పౌర సరఫరాల సంస్థ డీఎం రమేష్‌రెడ్డి, డీఎస్ఓ శోభారాణి, మార్క్‌ఫెడ్ డీఎం పెన్నేశ్వరి, పశుసంవర్ధక శాఖ జేడీ ప్రేమ్‌చంద్, ఎల్డీఎం మారుతీ శ్రీనివాసులు, డీఆర్డీఏ పీడీ శైలజ, ఉద్యానశాఖాధికారి రత్నకుమార్, మత్స్యశాఖ అధికారి విజయకృష్ణ, ఏపీసీఎన్ఎఫ్ ఎస్పీఎం నవీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మమ్మల్ని చంపి ఇసుక తరలించండి
యల్లనూరు: ‘మమ్మల్ని చంపేసి ఇసుకను తరలించుకోండి’ అంటూ మండలంలోని మల్లాగుండ్ల గ్రామ ప్రజలు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. మల్లాగుండ్ల గ్రామ సమీపంలోని 58 ఎకరాల్లో 1,17,199 టన్నుల ఇసుకను తరలించాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం బుధవారం అనంతపురం ఆర్డీఓ ప్రేమ్‌నాథ్ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు శశికళ, తాడిపత్రి మైనింగ్ ఏడీ ఓబుల్‌రెడ్డి, తహసీల్దారు సింధు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. కార్యక్రమానికి రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, యువ నాయకుడు రిత్విక్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, యల్లనూరు జెడ్పీటీసీ భోగతి విజయపత్రాప్రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు సాయిప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ గంగాదేవి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ శివశంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శైలజానాథ్ మాట్లాడుతూ యల్లనూరు, పుట్లూరు మండలాలు ఉద్యాన పంటలకు పెట్టింది పేరన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి ఇసుక తీసుకోకూడదన్నారు. అన్ని గ్రామాల రైతులు ఒకే మాట మీద నిలబడ్డారన్నారు. అసలే రైతుల పరిస్థితి బాగాలేదని, బోర్లలో నీరు తగ్గిపోయాయని, అయినా ఇసుక తవ్వకాలు ఎలా చేస్తారని అధికారులను నిలదీశారు. యల్లనూరు వద్ద చిత్రావతి నదిలో నిమజ్జనానికి కూడా నీరు లేక వినాయక విగ్రహాలను అలాగే వదిలేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇసుక రీచ్ వద్దే వద్దని ఏడు గ్రామాల రైతులు సంతకాలు చేసి ఆర్డీఓ ప్రేమనాథ్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మైనింగ్ అధికారి వరప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యూత్ జాయింట్ సెక్రటరీ వనం రవి, రాష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీ కల్లూరు సూరి, నాయకులు మల్లాగుండ్ల కొండారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, పురుషోత్తంనాయుడు, కిరణ్, దాసరి రమణ, ఏటూరు రామాంజినేయులు, నాగరంగయ్య, యల్లనూరు మారుతి, జాఫర్, హాజీవలి, చిన్న ఆంజనేయులు, గడ్డంవారిపల్లి రామాంజులరెడ్డి, రామకృష్ణారెడ్డి, లక్ష్మిరెడ్డి, కొడవండ్లపల్లి మణికంఠ, తిరుమలాపురం కృష్ణారెడ్డి, పాతపల్లి తిరుపాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో మల్లాగుండ్ల గ్రామస్తుల ధ్వజం కరువు పరిస్థితులుంటే ఇసుక తరలిస్తామంటారా?: మాజీ మంత్రి శైలజానాథ్ మండిపాటు -
పీఏబీఆర్‌కు టీఎంసీ నీరు తరలించాలి
ఉరవకొండ: పీఏబీఆర్‌కు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి ఒక టీఎంసీ నీటిని తరలించి, కుడి కాలువ ద్వారా చెరువులు, వ్యవసాయ భూములకు నీరు అందించే అంశాన్ని ప్రభుత్వం, అధికారులు పరిశీలించాలని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి కోరారు. బుధవారం అనంతపురంలోని తన స్వగృహంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయంలో ప్రస్తుతం 3.70 టీఎంసీల మేర నీరు ఉందన్నారు. ప్రస్తుత నీటి నిల్వను తాగునీటి అవసరాలకు రిజర్వు చేస్తూనే అదనంగా ఒక టీఎంసీ నీటిని తరలించే అవకాశాన్ని సాంకేతికంగా అంచనా వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా 49 చెరువులకు నీరందించేలా పీఏబీఆర్ కుడి కాలువను రూపొందించారన్నారు. జల్లిపల్లి, కూడేరు నుంచి ధర్మవరం కుడి కాలువ పరిధిలోని అనేక ప్రాంతాల్లో సాగునీటి కొరత నెలకొందన్నారు. చీనీ తోటలు, ఇతర ఉద్యాన పంటలకు సాగునీరు అందక రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. గేట్ల మరమ్మతులు అత్యవసరం కుడి కాలువకు నీటిని విడుదల చేసే స్లూయిస్ గేట్లలో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారని, గేట్లు సక్రమంగా పనిచేయకపోతే నీటి నియంత్రణలో ఇబ్బందులు తలెత్తడంతో పాటు నీరు వృథా అయ్యే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు నీటి విడుదలకు ముందే గేట్లను సాంకేతికంగా పరిశీలించి అత్యవసరంగా మరమ్మతులు చేపట్టాలన్నారు. నీటి లభ్యత, భవిష్యత్ తాగునీటి అవసరాలు, వర్షపాత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని శాసీ్త్రయంగా నీటి నిర్వహణ చేపట్టాలని కోరారు. ప్రధానంగా తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత నీటి నిల్వను తాగునీటి అవసరాలకే రిజర్వు చేయాలి నీటి విడుదలకు ముందే గేట్ల మరమ్మతులు చేపట్టాలి వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి -
రైతుల కోసం ఏకమవుదాం
రాప్తాడు రూరల్: రైతాంగాన్ని కాపాడుకునేందుకు పార్టీలకు అతీతంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా ష్‌రెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురం టవర్‌క్లాక్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో చేపడుతున్న కరువుదీక్షలకు బుధవారం ఆయన హాజరై సంఘీభావం తెలిపారు. ప్రజా సమస్యలపై సీపీఐ చేపట్టే ప్రతి ఉద్యమానికి వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. అందరికీ ఏకై క శత్రువు కరువేనని, అన్నంపెట్టే రైతులకు ఆపద వచ్చిందన్నారు. పార్టీలకు అతీతంగా ఏకమై రైతు కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. కరువుపై కనీసం ప్రకటన లేదు ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు సాగు చేశారు, కరువు ప్రభావంతో రైతులు ఏ మేరకు నష్టపోయారన్న వివరాలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు డ్యాష్‌బోర్డు ముందు ఉన్నప్పటికీ కరువుపై కనీసం ప్రకటన చేయడం లేదని ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. తుంగభద్ర డ్యాంలో నీళ్లున్నా పీఏబీఆర్ కుడికాలువకు ఇవ్వడం లేదన్నారు. పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వాలని అనేక వేదికలపై వైఎస్సార్సీపీ గళం విప్పుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నీరు లేక డ్యాం కింద వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వరుసగా మూడేళ్లు పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చామని, దీంతో అనంతపురం నగరం వరకు భూగర్భజలాలు పెరిగి వందలాది గ్రామాల్లో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ వేసి రైతుల నోట్లో మట్టికొట్టారని విమర్శించారు. కేసులకు భయపడం సీఎం జిల్లాకు రావడం లేదని, మంత్రి లోకేష్ విగ్రహావిష్కరణలు చేసి నాలుగు మాటలు చెప్పి వెళ్లారని, కరువు, రైతు, నీళ్ల గురించి మాట్లాడలేదని ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. ప్రజల్లోకి వెళ్తున్న తమపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 26 నెలల్లో తనపైనా, తన సోదరులపైనా 22 కేసులు పెట్టారని తెలిపారు. ఇది ప్రభుత్వ స్పాన్సర్డ్ కరువని ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ఏడాది క్రితమే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రైతులకు అండగా పోరాడతామని స్పష్టం చేశారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నాయకులు గంగుల సుధీర్‌రెడ్డి, మామిళ్లపల్లి ఆమర్నాథ్రెడ్డి, బండి పవన్‌కుమార్, దుగుమర్రి గోవిందరెడ్డి, వైస్ ఎంపీపీ రామాంజనేయులు, బోయ శేఖర్, విశ్వనాథ్‌రెడ్డి, హంపాపురం సింగారప్ప, సునీల్‌దత్తరెడ్డి, బండా అంజియాదవ్ ఉన్నారు. కరువుపై ప్రభుత్వం కనీసం ప్రకటన చేయడం లేదు తుంగభద్రలో నీళ్లున్నా పీఏబీఆర్‌కు ఎందుకు ఇవ్వరు? మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి -
రాష్ట్రంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి
● వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ అనంతపురం: రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా చంద్ర బాబు ప్రభుత్వం రెడ్‌బుక్ పాలనతో అప్రకటిత అత్యవసర పరిస్థితి ఏర్పడిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు. బుధవారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టే అధికారం ఎవరికీ లేదన్నారు. ప్రతిపక్ష నేతల గొంతు నొక్కడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మంత్రి లోకేష్ పదే పదే రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నామని చెప్తున్నారన్నారు. విజయవాడలో డీఎస్సీ, నిరుద్యోగ సమస్యలపై నిరసన తెలిపేందుకు వెళ్లిన యువతపై దాడులకు పాల్పడడం దారుణమన్నారు. మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, తీరా నోటిఫికేషన్ వచ్చేసరికి కానిస్టేబుల్ ఉద్యోగాల్లో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు ఏడేసి పోస్టులే కేటాయించి నిరుద్యోగ యువతను దారుణంగా వంచించారని మండిపడ్డారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకే రౌడీ షీట్లు తెరుస్తున్నారని, బైండోవర్ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి.. రాజకీయ కక్షసాధింపులకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని విమర్శించారు. నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ బాలుర ఐటీఐలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన–4.0 (పీఎంకేవీవై) ద్వారా ఉచిత నైపుణ్య శిక్షణ కోర్సులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాయపరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అప్లికేషన్ డెవలపర్–వెబ్ అండ్ మొబైల్ కోర్సుకు 20 నుంచి 40 ఏళ్ల వయసున్న వారు, ఎలక్ట్రిక్ వాహనాల సేవా సాంకేతిక నిపుణుడు–ద్విచక్ర వాహనాల కోర్సుకు 18 నుంచి 35 ఏళ్ల వయసున్న వారు అర్హులన్నారు. ఈ శిక్షణ ఉద్యోగం, స్వయం ఉపాధికి ఉపయోగపడుతుందన్నారు. దరఖాస్తులను ఈ నెల 26లోపు అనంతపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 80967 63970లో సంప్రదించాలని తెలిపారు. -
‘చుక్కల’ ఫైళ్ల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్
అనంతపురం అర్బన్: చుక్కల భూముల (డాటెడ్ ల్యాండ్)కు సంబంధించిన చిక్కులు తొలగించేందుకు కసరత్తు మొదలైంది. కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్ వేదికగా ప్రత్యేక డ్రైవ్ బుధవారం ప్రారంభమైంది. కలెక్టర్ ఆనంద్ ఆదేశాలతో ఆర్డీఓలు, మండల రెవెన్యూ అధికారులు ఫైళ్లను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో చుక్కల భూములకు సంబంధించిన ఫైళ్లు 2,190 వరకు ఉన్నట్లు సమాచారం. తొలిదశలో కనీసం 300 ఫైళ్లను పరిష్కరించాలనే లక్ష్యం విధించినట్లు తెలిసింది. సక్రమంగా ఉన్నవాటికి డాటెడ్ ల్యాండ్ కమిటీ (డీఎల్సీ) ద్వారా ఆమోదించి జాబితా నుంచి తొలగిస్తారు. 2,190 ఫైళ్లు పెండింగ్ చుక్కల భూములకు సంబంధించి అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో అత్యధికంగా 1,768 ఫైళ్లు, కళ్యాణదుర్గం డివిజన్లో 420 ఫైళ్లు పెండింగ్ ఉన్నాయి. గుంతకల్లు రెవెన్యూ డివిజన్ పరిధిలోని వజ్రకరూరు మండలానికి సంబంధించి రెండు ఫైళ్లు మాత్రమే పెండింగ్ ఉన్నట్లు తెలిసింది. అనంతపురం డివిజన్లోని బుక్కరాయసముద్రం, అనంతపురం రూరల్, శింగనమల మండలాలతో పాటు కళ్యాణదుర్గం డివిజన్లోని కంబదూరు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప మండలాల్లో అత్యధికంగా పెండింగ్ ఉన్నట్లు సమాచారం. చుక్కల భూమి అంటే... నిషేధిత భూములు (22ఏ), చుక్కల భూములు (డాటెడ్ ల్యాండ్) రెండు ఒకేరకం కాదు. వీటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అసైన్డ్ చేసిన ప్రభుత్వ భూములు 22ఏ జాబితా కిందకు వస్తాయి. వీటి పరిష్కార అధికారాన్ని కలెక్టర్ల నుంచి ఆర్డీఓలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసింది. ఇక చుక్కల భూములకు సంబంధించి.. ప్రభుత్వ భూమిగా చెప్పబడే భూమి వివరం ఆర్ఎస్ఆర్ (రీ సెటిల్మెంట్ రిజిస్టర్)లో చుక్కలుగా చూపించి ఉండాలి. ఆ భూమి ఎవరికీ అసైన్డ్ చేసి ఉండకూడదు. ఇలాంటి భూమిని అనుభవించేవారు దరఖాస్తు చేసుకుంటే నిబంధనల మేరకు జాబితా నుంచి తొలగిస్తారు. ఆమోదముద్రకు నిబంధనలిలా... ● డాటెడ్ ల్యాండ్ చట్టం–2017 ప్రకారం ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న వ్యక్తి చట్టం వచ్చే నాటికి 12 ఏళ్ల ముందు ఆ భూమిపై హక్కు, అనుభవం కలిగి ఉండాలి. ● తహసీల్దారు వద్ద దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై సమగ్ర విచారణ నిర్వహించి ఆర్డీఓకు తహసీల్దారు నివేదిస్తారు. దానిని ఆర్డీఓ విచారణ చేసి కలెక్టర్‌కు పంపిస్తారు. ● జిల్లాస్థాయి కమిటీ వాటిని విచారణ చేసి జాబితా నుంచి తొలగిస్తారు. -
అందుబాటులో లేకపోతే ఇంటికి వెళ్లండి
డి.హీరేహాళ్ (బొమ్మనహాళ్): ‘ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించే సమయం లేకపోతే ఇంటికి వెళ్లిపోండి’ అంటూ జిల్లా స్వర్ణ గ్రామ, వార్డు అధికారి నాసరరెడ్డి హెచ్చరించారు. బుధవారం డి.హీరేహాళ్ మండలంలోని ఎం.హనుమాపురం, మడేనాహాళ్లి గ్రామ సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ సిబ్బంది పని తీరు సక్రమంగా లేదన్నారు. అందుబాటులో ఉండడం లేదంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. సర్వేలు కూడా సకాలంలో పూర్తి చేయడం లేదని మండిపడ్డారు. అనంతరం మండలంలో పలు మీసేవా కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి అభివృద్ధి పనులపై చర్చించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దాసానాయక్, డిప్యూటీ ఎంపీడీఓ యోగానంద తదితరులు పాల్గొన్నారు. -
25 మండలాల్లో వాన
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాపై వరుణుడి ప్రభావం కొనసాగుతోంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు 22 మండలాల పరిధిలో 7.3 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా విడపనకల్లు 54.4 మి.మీ, వజ్రకరూరు 32.8, గార్లదిన్నె 20.8, కణేకల్లు 11, బొమ్మనహాళ్ 10.4, ఉరవకొండ 10.2 మి.మీ వర్షం కురిసింది. సెప్టెంబర్ సాధారణం 111.6 మి.మీ కాగా ప్రస్తుతానికి 76.3 మి.మీ నమోదైంది. ఓవరాల్‌గా జూన్ ఒకటి నుంచి 282 మి.మీ గానూ 30 శాతం తక్కువగా 198 మి.మీ నమోదు కావడం గమనార్హం. నేడు పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం అనంతపురం టౌన్: జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని గురువారం కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ భవన్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాసయాదవ్ తెలిపారు. జిల్లాలోని పరిశ్రమల్లో వస్తు ఉత్పత్తి, ఎగుమతులు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చిస్తారన్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుకు పచ్చ జెండా అనంతపురం టౌన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. పీపీపీ విధానంలో ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్‌కు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశాలు జారీ చేశారు. 45 రోజుల్లో టెండర్ల పక్రియ పూర్తి చేయాలని సూచించారు. ముందుగా, జిల్లా కేంద్రాల్లో.. తర్వాత దశల వారిగా అన్ని ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. కాగా, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును డాక్యుమెంట్ రైటర్లు, వెండార్లు వ్యతిరేకించి ఇటీవల 20 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెన్‌డౌన్ నిర్వహించారు. వీటితో డాక్యుమెంట్ రైటర్లు రోడ్డున పడే ప్రమాదం తలెత్తనుంది. టూవీలర్ మెకానిజం కోర్సుపై ఉచిత శిక్షణ అనంతపురం: ఏ.ఎఫ్.ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం 45 రోజుల ఉచిత టూ వీలర్ మెకానిజం (బైక్ రిపేరింగ్, సర్వీసింగ్, ఇంజిన్ రిపేరింగ్) శిక్షణ కోర్సు నిర్వహిస్తున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మలా రెడ్డి తెలిపారు. ఇంగ్లిష్ కమ్యూనికేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్పై కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండాలన్నారు. మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తారన్నారు. కోర్సు పూర్తయిన తర్వాత టూల్ కిట్, సర్టిఫికెట్తో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ నెల 24 నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభమవుతుందన్నారు. ఆసక్తి గల వారు ఉప్పరపల్లి రోడ్డు, బెంగళూరు హైవే వద్ద ఉన్న అనంతపురం ఏ.ఎఫ్. ఎకాలజీ సెంటర్లో సంప్రదించవచ్చు. మరిన్ని వివరాలను 99594 22884, 99487 71362 నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. పీఎండీఎస్‌తో ఎల్‌నినోను అధిగమించొచ్చు కూడేరు: పీఎండీఎస్ (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) విధానంతో ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని రాయలసీమ జిల్లాల ఎల్‌నినో క్లస్టర్ అధికారి ఎం.కె.వి. శ్రీనివాసులు అన్నారు. బుధవారం కూడేరు వద్ద రైతు శంకర నాయుడు పొలంలో చేపట్టిన పీఎండీఎస్ మిశ్రమ సాగు పద్ధతులు, హాఫ్మూన్ మోడల్‌ను పరిశీలించారు. రైతులకు పలు సూచనలు ఇచ్చారు. ప్రతి రైతు ఎల్‌నినో దృష్ట్యా పీఎండీఎస్ విధానంలో సాగు చేయాలని తెలియజేశారు. అనంతరం కంది, ఆముదం, ఉద్యాన పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి సాల్ రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి ధనుంజయ్య, ఏపీడీ చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పీడీ రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలి
అనంతపురం: అఖిల భారత అంతర వర్సిటీ, దక్షిణ భారత అంతర వర్సిటీ క్రీడా పోటీల్లో జేఎన్టీయూ అనంతపురం విద్యార్థులు రాణించేలా తర్పీదు ఇవ్వాలని వీసీ ప్రొఫెసర్ సుదర్శనరావు అన్నారు. జేఎన్టీయూఏలో 17వ స్పోర్ట్స్ కౌన్సిల్ సమావేశాన్ని స్పోర్ట్స్ సెక్రెటర్ డాక్టర్ నారాయణ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2025–26 సంవత్సరానికి సంబంధించిన క్రీడా వివరాలను వెల్లడించడంతో పాటు, 2026–27 విద్యాసంవత్సరంలో క్రీడల నిర్వహణ బాధ్యతలను వివిధ కళాశాలలకు కేటాయించే అంశాలపై కౌన్సిల్‌కు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ దుర్గా ప్రసాద్, డీఏపీ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ భవాని, ఓటీపీఆర్‌ఐ డైరెక్టర్ ప్రొఫెసర్ జీవీ సుబ్బా రెడ్డి, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చెన్నా రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు జోజిరెడ్డి, దామోదర్ రెడ్డి, ఫైనాన్స్ ఆఫీసర్ బి. వెంకటశివారెడ్డి పాల్గొన్నారు. 65 ఏళ్ల వయసులో జాతీయ స్థాయి ప్రతిభ జేఎన్టీయూ అనంతపురం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్, ఫిజికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి. జోజి రెడ్డి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. కొత్తగూడెం (పాల్వంచ)లో సెప్టెంబర్ 18 నుండి 22 వరకు నిర్వహించిన ’ఆలిండియా సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్’లో 65 ఏళ్లకు పైబడిన వారి విభాగంలో ఆయన రన్నరప్ (ద్వితీయ స్థానం) సాధించారు. జాతీయ స్థాయి పోటీల్లో ఘనత సాధించిన జోజి రెడ్డిని వీసీ ప్రొఫెసర్ సుదర్శన రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ దుర్గా ప్రసాద్, ప్రొఫెసర్ దేవన్న, స్పోర్ట్స్ సెక్రెటరీ డాక్టర్ నారాయణ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య దిలీప్ కుమార్, డైరెక్టర్లు, బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు. -
ఎన్‌హెచ్–44 విస్తరణకు డీపీఆర్ సిద్ధం చేయండి:జేసీ
అనంతపురం అర్బన్: జాతీయ రహదారి–44ను నాలుగు వరుసల నుంచి ఆరు వరుసల విస్తరణకు సంబంధించి డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారి విస్తరణ అంశంపై జేసీ మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాతీయ రహదారి, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఏపీఎస్పీడీసీఎల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి విస్తరణకు సంబంధించి డీపీఆర్ చాలా కీలకమన్నారు. ఏవైనా సమస్యలు వస్తే తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు. పురోగతిలో ఉన్న పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎన్‌హెచ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తరుణ్‌కుమార్ పాల్గొన్నారు. టపాసుల విక్రయాలకు తాత్కాలిక లైసెన్సులు అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం డివిజన్ పరిధిలో దీపావళి సందర్భంగా టపాకాయల విక్రయాలకు తాత్కాలిక లైసెన్సుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆర్డీఓ ప్రేమంత్‌కుమార్ తెలిపారు. నాలుగు సెట్ల దరఖాస్తులు అక్టోబర్ 15లోగా ఆర్డీఓ కార్యాలయంలో సమర్పించాలి. దరఖాస్తుదారులు స్వయంగా వచ్చి దరఖాస్తులు అందజేయాలని, ఇతరుల ద్వారా వచ్చిన వాటిని తిరస్కరిస్తామని స్పష్టం చేశారు. పోలీసు విచారణ అనంతరం అర్హత ఉన్న వారికి జీఎస్టీ, అగ్నిమాపక శాఖ చలానా, ఎన్ఓసీ సమర్పించిన తర్వాతే లైసెన్సులు మంజూరు చేస్తామన్నారు. ప్రస్తుత ఏడాదికి లైసెన్సు పొందిన వారే విక్రయాలకు అర్హులని, గత లైసెన్సులు చెల్లుబాటు కావన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు గ్రీన్ క్రాకర్స్ మాత్రమే విక్రయించాలని స్పష్టం చేశారు. 29 మండలాల్లో కరువు! ● ప్రభుత్వానికి ప్రతిపాదనలు అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కరువు మండలాలను ప్రకటించే అవకాశమున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. కలెక్టర్ ద్వారా 29 మండలాల్లో కరువు ఉన్నట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, రాయదుర్గం మండలాల్లో తేలికపాటి వర్షం పడడం, 21 రోజుల వర్షపాత విరామం (డ్రైస్పెల్) నమోదు కానందున వీటిని పక్కనపెట్టినట్లు తెలిసింది. తాగునీటి సమస్యలపై కంట్రోల్ సెంటర్అనంతపురం ఎడ్యుకేషన్: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజ నాయుడు తెలిపారు. 95504 80972కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెంటర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. -
ఇంటి ఎదుట వివాహిత ధర్నా
అనంతపురం సెంట్రల్: కుటుంబ సమస్యలతో ఓ వివాహితపై భర్త, వారి బంధువులు దాడికి పాల్పడ్డారని బాధితురాలు రుబీనా ఆరోపించారు. రుద్రం పేటలో నివాసం ఉంటున్న రుబీనా గత కొంతకాలంగా భర్త షెక్షావలితో విభేదించి ఒక్కరే ఉంటున్నారు. దిశ పోలీసుస్టేషన్లో కేసు విచారణలో ఉంది. మంగళవారం సాయంత్రం భర్త తరఫున కొంతమంది వచ్చి తనపై దాడి చేయడమేగాక, ఇంటి నుంచి బయటకు పంపి తాళం వేసినట్లు తెలుపుతూ బాధితురాలు ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కొంతసేపటికి ఆమె కళ్లు తిరిగి సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించా రు. నాలుగో పట్టణ పోలీసులు రంగ ప్రవేశం చేసి తిరిగి ఆమె ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. న్యాయ పరంగా విచారించి సదరు ఇల్లు ఎవరికి చెందుతుందనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని నాలుగో పట్టణ పోలీసులు తెలియజేశారు. -
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. గాలివేగం తగ్గింది. వాయువ్య దిశగా గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
అదిగదిగో రబీ.. విత్తనమేదీ..? ● రాయితీ విత్తన పప్పుశనగ పంపిణీలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ సీజన్ ఈ నెలాఖ రుతో ముగియనుంది. అక్టోబర్ ఒకటి నుంచి ‘రబీ’ మొదలు కానుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో 2.57 లక్షల హెక్టార్ల ఖరీఫ్ పంటలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు రబీపై గంపెడాశలు పెట్టుకుని సాగుకు సిద్ధమవుతున్నారు. వారం రోజుల్లో రబీ మొదలు కానున్నా చంద్ర బాబు ప్రభుత్వం రాయితీ విత్తనంపై ఎటూ తేల్చకపోవడంపైసర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపాదనలు పంపినా..! రబీలో ప్రధానపంటగా పప్పుశనగ 70 వేల నుంచి 80 వేల హెక్టార్ల భారీ విస్తీర్ణం అంచనా వేశారు. ఉరవకొండ, తాడిపత్రి, రాయదుర్గం, గుంతకల్లు తదితర 25 మండలాల పరిధిలో ఉన్న నల్లరేగడి భూముల్లో పప్పుశనగ విత్తుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల వర్షం కూడా పడటంతో ముందస్తు సాగుకు రెడీ అవుతున్నా రాయితీ విత్తన పంపిణీ సన్నాహకాలు చేయకపోవడం గమనార్హం. 45 వేల క్వింటాళ్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా వ్యవసాయశాఖ ప్రతిపాదనలు పంపినా ఇంకా అనుమతులు ఇవ్వలేదు. సేకరణ, పంపిణీ ఆలస్యం 2024 ఖరీఫ్, రబీ,2025 ఖరీఫ్‌లో విత్తన వేరుశనగ, విత్తన పప్పుశనగ పంపిణీకి సంబంధించి సరఫరాదారులకు చంద్రబాబు ప్రభుత్వం పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించలేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.90 కోట్ల మేర పెద్దమొత్తంలో బకాయిలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ రబీలో విత్తన సేకరణ, పంపిణీ ఆలస్యం కానున్నట్లు తెలిసింది. -
అక్రమాల్లో రిజి‘స్టార్’
అనంతపురం టౌన్: కళ్యాణదుర్గం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఆయనో సబ్ రిజి‘స్టార్’గా వెలుగుతున్నారు.. పైసలే పరమావధిగా పనిచేస్తున్నారు.. ప్రభుత్వ భూములైనా.. నిషేధిత భూములైనా సరే.. కళ్లు మూసుకొని రిజిస్ట్రేషన్లు చేస్తూ అందిన కాటికి దోచుకుంటున్నారు.. ఈయనకు స్థానిక ఓ ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉండడంతో ఉన్నతాధికారులు సైతం చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. కళ్లెదుటే సబ్ రిజి స్ట్రార్ చేసిన అక్రమాలు కనిపిస్తున్నా చర్యలకు మాత్రం ఉపక్రమించడం లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ చేసిన అక్రమాలు మచ్చుకు కొన్ని: ● కంబదూరు మండల కేంద్రంలోని సర్వే నంబర్ 691–2లో 4.90 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఈ భూమి నిషేదిత జాబితాలో ఉంది. ఈ భూమిని ప్రభుత్వ నిబంధనల మేరకు ఎలాంటి క్రయ,విక్రయాలు చేపట్టరాదు. అయితే ఈ భూమిని ఇటీవల సెప్టెంబర్ 9న భాగపరిష్కారాల డాక్యుమెంట్ నంబర్ 8147–2026 పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఒకరోజు వ్యవధిలోనే ఇదే నెల 10న డాక్యుమెంట్ నంబర్ 8199–2026 పేరిట అపర్ణ పేరిట సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఎట్టి పరిస్థితుల్లోను రిజిస్ట్రేషన్ చేయరాదు. అయినా కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసేశారు. ● బెలుగుప్ప మండలం కాలువపల్లి గ్రామం సర్వే నంబర్ 308–2లో రెండెకరాల స్థలం ఉంది. ఈ భూమి సైతం నిషేధిత జాబితాలో ఉంది. ఈ భూమిని సైతం కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ ఆగస్టు 27న డాక్యుమెంట్ నంబర్ 7739–2026 పేరిట సేల్ డీడ్ చేశారు. ● కళ్యాణదుర్గం మండలం వెస్టుకోడిపల్లిలో అసలైన భూ యజమానుల ప్రమేయం లేకుండానే వేరొకరి పేరిట డాక్యుమెంట్ నంబర్ 3781–2026 పేరిట ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న భూయజమానులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో గత నెలలో రిజిస్ట్రేషన్ రద్దు చేశాడు. కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ అక్రమాలపై అనేకమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకునే సాహసం మాత్రం అధికారులు చేయడం లేదు. ఇతనికి ప్రజాప్రతినిధుల అండ మెండుగా ఉండడంతో చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సబ్ రిజిస్ట్రార్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదో? ఇంత పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్న కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కాని పరిస్థితి నెలకొందని రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు బహిరంగంగానే విమర్శలు చేస్తు న్నారు. ఈయన చేసిన అక్రమాలు ఉన్నతాధికారులకు కనిపించడం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఎమ్మెల్యే అమిలినేనితో సబ్ రిజిస్ట్రార్ రామ్మోహన్ (ఫైల్) ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ యథేచ్ఛగా నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు సబ్ రిజిస్ట్రార్‌కు అండగా ప్రజాప్రతినిధులు చర్యలకు వెనకడుగు వేస్తున్న అధికారులు -
అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి
● డీఆర్ఎం సీఎస్ గుప్తా గుంతకల్లు: ప్రతి ఉద్యోగి విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యహరించాలని డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా సూచించారు. గుంతకల్లు డివిజన్ పరిధిలో 12 మంది ఉద్యోగులు ప్రమాదాలు నివారించడంలో ప్రతిభ కనబరిచి మ్యాన్ అఫ్ మంత్ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరికి డీఆర్ఎం కార్యాలయంలోని తుంగభద్ర ఛాంబర్లో డీఆర్ఎం సీఎస్ గుప్తా చేతుల మీదుగా మంగళవారం ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్న వారిలో సీనియర్ టెక్నిషియన్ జీ.నాగరాజు (నందలూరు), కీమ్యాన్‌లు తరుణ్ దహల్ (ఓబుళవారిపల్లి), నక్క శ్రీకాంత్ (బేతంచెర్ల), స్టేషన్ మాస్టర్ బద్రి ప్రసాద్ (రాయలచెరువు), ట్రైన్ మేనేజర్లు ఖసీమ్ (ఎర్రగుంట్ల), లెనిన్ బాబు (నందలూరు), ఎర్రగుంట్లకు చెందిన ట్రైనీ మేనేజర్లు ఆర్కే గుప్తా, మైకేల్బాబు, సీనియర్ టెక్నిషియన్ జీ.వెంకటేష్ (కడప), లోకోపైలట్ ఎన్.రామ్‌ప్రసాద్ (తిరుపతి), సీనియర్ అసిస్టెంట్ లోకోపైలట్ భూపేంద్రకుమార్ (తిరుపతి), లోకోపైలట్ ఎన్వీ సునీ (తిరుపతి)లకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం శివప్రసాద్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతిభను వెలికితీసేందుకే ట్యాలెంట్ హంట్ ఆత్మకూరు: గ్రామీణుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకే ట్యాలెంట్ హంట్ ఉపయుక్తంగా ఉంటుందని ఆర్డీటీ క్రికెట్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్డీటీ క్రీడా మైదానంలో అండర్ – 14, అండర్– 18 క్రికెట్ ట్యాలెంట్ హంట్ నిర్వహించారు. మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ ఎంపిక ప్రక్రియకు 40 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. ఎంపిక కార్యక్రమంలో ఆర్డీటీ ఏపీసీ కృష్ణయ్య, ఆర్డీటీ కోచ్ హరినాథ్‌రెడ్డి, ప్రదీప్, ఎస్జే షాకీర్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఆర్డీటీ కోఆర్డినేటర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కుక్కదాడిలో ఆరుగురికి గాయాలు వజ్రకరూరు: మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం కుక్కదాడిలో ఆరుగురు గాయపడ్డారు. గ్రామానికి చెందిన శివ, ప్రభాకర్, అల్లబకాస్, బండయ్య, నవీన్ మరో వ్యక్తిపై కుక్క దాడి చేసింది. గాయపడిన వారు స్థానిక ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. -
కొనసాగుతున్న వర్షాలు
● కణేకల్లులో కుండపోత అనంతపురం అగ్రికల్చర్/కణేకల్లు: మూడు రోజులుగా వరుణుడు కరుణిస్తున్నాడు. ఒట్టిపోయిన వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు నిండి ప్రవహిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా మూడో రోజు సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కూడా వర్షాలు కురిశాయి. కణేకల్లులో 80 మి.మీ కుండపోత నమోదైంది. మొత్తంగా 27 మండలాల పరిధిలో 17.3 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. మూడు రోజుల్లోనే ఏకంగా 67 మి.మీ వర్షపాతం రికార్డయింది. కణేకల్లులో 80 మి.మీతో పాటు గుత్తి 60.2, బెళుగుప్ప 46.8, ఉరవకొండ 46.4, యాడికి 39.2, కళ్యాణదుర్గం 38.6, కంబదూరు 34.6, శెట్టూరు 34.2, పెద్దవడుగూరు 33.8, విడపనకల్లు 21.6 మి.మీ వర్షం కురిసింది. కూడేరు, యల్లనూరు, బుక్కరాయసముద్రం, అనంతపురం రూరల్ మినహా మిగతా ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. భారీ వర్షాలు కురిసిన రాయదుర్గం, ఉరవకొండ, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. అక్కడక్కడా కొంత పంటనష్టం వాటిల్లడం, ఖరీఫ్ పంటలకు ఉపయోగం లేకున్నా మూడు నెలల తర్వాత కురిసిన వర్షాల వల్ల ప్రత్యామ్నాయం, రబీకి ఊరటనిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. సెప్టెంబర్ సాధారణం 111.6 మి.మీ గానూ ప్రస్తుతానికి 71.3 మి.మీ నమోదైంది. ఓవరాల్‌గా జూన్ ఒకటి నుంచి 278.8 మి.మీ గానూ 31 శాతం తక్కువగా 192.5 మి.మీ నమోదైంది. మూడు రోజుల కిందట వరకు 52 శాతం లోటు వర్షం ఉండగా తాజాగా 31 శాతానికి తగ్గింది. ఈనెల 23, 24, 25 తేదీల్లో కూడా జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. -
దాహార్తి తీర్చి.. ఆదర్శంగా నిలిచి..
శెట్టూరు: తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలను చూసి చలించిపోయిన రైతు తన సొంత డబ్బుతో బోరు బావి తవ్వించి దాహార్తి తీర్చాడు. వివరాలు.. మండ లంలోని చిన్నంపల్లిలో కొంతకాలంగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఫిర్యాదు చేసినా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించలేదు. దీంతో గ్రామంలోని చిన్నకారు రైతు మాల దేవక ఈరన్న మంగళవారం బోరు బావి తవ్వించాడు. రైతు సంకల్పానికి ప్రకృతి తోడయ్యింది. బోరుబావిలో రెండు ఇంచులకుపైగా నీరు పడింది. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. నలుగురికి ఆదర్శంగా నిలిచిన కర్షకుడు ఈరన్నను అభినందించారు. -
తిరుమల లడ్డూపై కూటమి కుట్ర పటాపంచలు
అనంతపురం న్యూ టౌన్: వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌వి అసత్య ప్రచారాలన్న వాస్తవం తేటతెల్లమైందని జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ స్పష్టం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ నివేదికతో కూటమి కుట్రలు పటాపంచలైనట్లు ఆమె తెలిపారు. జెడ్పీ కార్యాలయంలోని తన చాంబర్లో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని, ఇటు సీబీఐ ఎస్ఐటీ, అటు ఈడీ తమ విచారణలో తేల్చాయన్నారు. ఇది ఒక విధంగా సీఎం చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిదని ఆమె ధ్వజమెత్తారు. ప్రైవేట్ సరఫరాదారులు, డెయిరీ కంపెనీల యజమానులు కేవలం వ్యాపార లాభాల కోసం పామ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్, రసాయన కల్తీలకు పాల్పడ్డారని, అలాంటి వారిపై ఈడీ కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొనడం శుభ పరిణామమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో తిరుమల పవిత్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఉండేదన్నారు. -
అమెరికా సదస్సుకు ప్రొఫెసర్ సురేంద్రబాబు
అనంతపురం న్యూటౌన్: అమెరికాలో నవంబర్‌లో జరిగే ఐబీఎం క్వాంటం సదస్సులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రొఫెసర్ నంబూరి సురేంద్రబాబు పాల్గొననున్నారు. ప్రస్తుతం ఆయన టాంజానియీ యూనివర్సిటీ ఆఫ్ దోదోమాలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. క్వాంటం సదస్సులో పాల్గొనే తొలి ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా ఘనతకెక్కారు. సురేంద్రబాబు ఎస్కే యూనివర్సిటీలో పీజీ, పీహెచ్డీ పూర్తి చేశారు. ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాలలో అడహాక్ లెక్చరర్‌గా పనిచేసిన సురేంద్రబాబు భారత ప్రభుత్వ సమస్త ఈడీసీఐఎల్ ద్వారా ఎంపికై 2009 నుంచి దోదోమా యూనివర్సిటీలో ఫుల్‌టైం ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన కంప్యూటర్ క్వాంటం కెమిస్ట్రీలో ఆర్గానిక్ పాలిమర్ సోలార్ సైన్సెస్‌పై పరిశోధనలు చేశారు. ప్రస్తుతం క్వాంటం కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా డ్రగ్ డిజైన్ మెటీరియల్ డిజైన్ రంగాలలో తన పరిశోధనలను కొనసాగిస్తున్నారు. ఈ పరిశోధనలకు గుర్తింపుగా ఈ ఏడాది నవంబర్ 10 నుంచి 13వ తేదీ వరకు జరిగే ఐబీఎం క్వాంటం సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రొఫెసర్ నంబూరి సురేంద్రబాబు హాజరుకానున్నారు. ఈయనకు తొలి ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా ఆహ్వానం రావడం పట్ల ఎస్కే యూనివర్సిటీకి చెందిన పలువురు ప్రొఫెసర్లు తదితరులు అభినందనలు తెలిపారు. -
నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు సీజ్
అనంతపురం క్రైం: నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల వినియోగం, విక్రయాలపై అనంతపురం నగరపాలక సంస్థ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డా. రాజా రవీంద్రనాథ్ చౌదరి ఆధ్వర్యంలో పాతూరు ప్రాంతంలో సుమారు 15 దుకాణాలను మంగళవారం తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.1.49 లక్షలకు పైగా జరిమానా విధించారు. నగరంలోని ఆరు సర్కిళ్ల శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటేషన్ సెకట్రరీలు తనిఖీల్లో పాల్గొన్నారు. ప్లాస్టిక్ వినియోగం, విక్రయాలపై నిరంతర తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘనులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కణేకల్లు ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా షాబిద్ కణేకల్లు: కణేకల్లు ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా ఎస్.షాబిద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. షాబిద్ను ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా నియమిస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. తాడిపత్రిలో 2023లో నిషేదిత భూములకు అప్పట్లో సబ్ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న (మొన్నటి వరకు కణేకల్లు సబ్ రిజిస్ట్రార్) బసవరాజు రిజిస్ట్రేషన్ చేయడంతో అతనితోపాటు సీనియర్ అసిస్టెంట్ మంజునాథయాదవ్ను డీఐజీ సస్పెండ్ చేశారు. దీంతో కణేకల్లు ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా షాబిద్ను నియమిస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. షాబిద్ జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఉన్నతాధికారులు కణేకల్లు ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా నియమించడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. నిరంతర నిఘా కొనసాగాలి అనంతపురం అర్బన్: ఈవీఎంలు భద్రపరిచిన గోదాము వద్ద నిరంతర నిఘా కొనసాగాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. పాత ఆర్డీఓ కారాలయ ఆవరణలోని గోదాములో భద్రపరిచిన ఈవీఎంలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. లాగ్ బుక్‌లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదాము వద్ద పటిష్ట భద్రత ఉండాలన్నారు. సీసీ కెమెరాలు నిరంతరాయంగా పని చేయాలన్నారు. గోదాము పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సిబ్బంది అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎ.మలోల, ఎన్నికల డీటీ కనకరాజ్, ఎస్ఏ శామ్యూల్ బెంజిమన్, పార్టీల ప్రతినిధులు శ్రీనివాసరావు, మసూద్‌వలి, రామాంజనేయులు, శ్యాంప్రసాద్, ఇమామ్ పాల్గొన్నారు. నేటితో ముగియనున్న మద్యంషాపుల రెన్యూవల్ అనంతపురం సెంట్రల్: మద్యం షాపులకు రెన్యూవల్ గడువు బుధవారంతో ముగుస్తుందని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ వైటీ ప్రసాద్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి. రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో మద్యం షాపుల యజమానులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 138 మద్యం షాపులకు గాను ఇప్పటి వరకూ 95 షాపులు రెన్యూవల్ అయినట్లు తెలిపారు. బుధవారం సాయంత్రం వరకూ రెన్యూవల్ చేసుకోవడానికి గడువు ఉందని వివరించారు. రెన్యూవల్ కాని షాపులకు గురువారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రతి షాపులకు 10 దరఖాస్తులు తప్పనిసరిగా రావాలని, రూ.3 లక్షలు నాన్ రీఫండబుల్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ టాస్క్ఫోర్సు సీఐ జయనాథ్‌రెడ్డి, ఎస్ఐ జయ నరసింహ, మద్యం షాపుల యజమానులు పాల్గొన్నారు. క్యాంపస్ హాస్టల్లో ఘర్షణ అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మహిళా వసతి గృహంలో ఎంబీఏ, ఎల్ఎల్బీ విద్యార్థినుల మధ్య గ్యాంగ్‌వార్ చోటు చేసుకుంది. వాష్‌రూంకు సంబంధించిన విషయంలో ఇద్దరి విద్యార్థినుల మధ్య చోటు చేసుకుంది. ఎంబీఏ, ఎల్ఎల్బీ విద్యార్థినులు ఒకరినొకరు దూషణలకు దిగారు. దీంతో ఎంబీఏ విద్యార్థిని..ఎల్ఎల్బీ విద్యార్థినిపై చేయి చేసుకుంది. ఈ క్రమంలో హాస్టల్ అధికారులు జోక్యం చేసుకొని ఇరువురికి సర్దిచెప్పి, హాస్టల్‌కు పంపించేశారు. -
‘అనంత’ను కరువు జిల్లాగా ప్రకటించాలి
అనంతపురం అర్బన్: అనంతను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ అన్నారు. మంగళవారం స్థానిక గణేనాయక్ భవన్లో శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో రాంభూపాల్‌తో పాటు జిల్లా కార్యదర్శి నల్లప్ప మాట్లాడారు. వర్షాభావంతో జిల్లాలో 54 శాతానికి పైగా పంటలు సాగు చేయలేదని, వేసిన పంటలు ఎండిపోయాయన్నారు. భూగర్భజలాలు అడుగంటి బోర్లలో నీరు రాకపోవడంతో పంట తోటలు ఎండిపోతుండడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఏదో ఒక చోట రైతు ఆత్మహ్యతలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా కనీస చర్యలు చేపట్టలేదని దుమ్మెత్తిపోశారు. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేలు పరిహారం ఇవ్వాలన్నారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు, పంట నష్ట పరిహారం, కౌలు వెనక్కి చెల్లించాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ఈ డిమాండ్లతో ఈనెల 23 నుంచి 27 వరకు జిల్లాలో జీపుజాతా నిర్వహించిన 28న కలెక్టరేట్ ఎదుట ధర్నా తలపెట్టామన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు నాగేంద్రకుమార్, రామిరెడ్డి, బాలరంగయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణమూర్తి, సభ్యులు ఆర్వీనాయుడు, మారుతి, నిర్మల, భాస్కర్, నాగరాజు, అచ్చుత్ ప్రసాద్, మల్లికార్జున, నాగమణి, ముత్తుజ పాల్గొన్నారు. -
పింఛన్ కోసం ‘రక్త’ కన్నీరు
● పడరాని పాట్లు పడుతున్న హీమోఫీలియా బాధితులు ● శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం గుంజేపల్లి గుడ్డంపల్లి తండాకు చెందిన శివప్రసాద్ హీమోఫీలియాతో బాధపడుతున్నాడు. ఆయనకు జారీ చేసిన సదరం ధ్రువపత్రంలో 44 శాతం శాశ్వత వైకల్యం ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే పింఛన్ కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఆన్లైన్లో 40 శాతంలోపు ఉన్నట్లు చూపిస్తుండటంతో పింఛన్‌కు అర్హులు కాదని సిబ్బంది చెబుతున్నారని బాధితుడు వాపోతున్నాడు. సదరం సర్టిఫికెట్లో ఒక శాతం.. ఆన్లైన్లో మరో శాతం చూపిస్తుండటంతో అసలు ఏది ప్రామాణికమో తెలియక బాధితులు అయోమయానికి గురవుతున్నారు. రాప్తాడు రూరల్: హీమోఫీలియా అనేది అరుదైన వంశపారంపర్య, జన్యుపరమైన వ్యాధి. రక్తం గడ్డకట్టడానికి అవసరమైన కారకాలు (క్లాటింగ్ ఫ్యాక్టర్స్) లోపించడం వల్ల వస్తుంది. ఈ వ్యాధి బాధితులకు తరచూ వైద్య చికిత్సలు, మందులు అవసరం అవుతాయి. వ్యాధి తీవ్రతను బట్టి భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. పేద కుటుంబాలకు ఈ వ్యయం భారంగా మారుతున్న నేపథ్యంలో, బాధితుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం నెలకు రూ.10 వేల చొప్పున పింఛన్ అందజేసింది. ఉమ్మడి జిల్లాలో 50 మంది వరకు పింఛన్ పొందుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మరో 130 మంది వరకు అర్హులు ఉన్నట్లు తెలిసింది. సదరం ధ్రువపత్రం తప్పనిసరి కావడంతో కొత్తగా పింఛన్ పొందాల్సిన వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నెలలుగా ఎదురుచూపులు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో సదరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు బాధితులకు ఇప్పటివరకు ధ్రువపత్రాలు మంజూరు కాలేదు. ప్రభుత్వం ప్రకటించిన స్లాట్ ద్వారా ముందుగా నమోదు చేసుకుని, అనంతరం వైద్య పరీక్షలకు హాజరైనప్పటికీ నెలలు గడుస్తున్నా సర్టిఫికెట్లు చేతికి అందకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. సర్టిఫికెట్ కోసం బాధితులు సచివాలయాలు, ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు. రోజుల తరబడి తిరిగినా సమస్య పరిష్కారం కావడం లేదని బాధితులు వాపోతున్నారు. పింఛన్ కోత విధించేందుకే ఇలాంటి నిబంధనలు ప్రవేశపెట్టారా.. అని ప్రశ్నిస్తున్నారు. సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలి
అనంతపురం క్రైం: ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సులు, సిబ్బంది సంఖ్యను పెంచాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) అనంతపురం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీకాంత్‌కు మంగళవారం వినతిపత్రం అందజేసింది. ఐద్వా కమిటీ సభ్యులు మాట్లాడుతూ సీ్త్రశక్తి పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ప్రస్తుతం పాత, స్క్రాప్ బస్సుల స్థానంలో కొత్త బస్సులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. 2029 నాటికి విద్యుత్ బస్సుల నిర్వహణను పూర్తిగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్న ప్రచారం జరుగుతోందని, దీంతో అనేక ప్రాంతాల్లో బస్‌స్టాప్‌లను తగ్గించడం, నిర్ణీత స్టాపుల్లో బస్సులు నిలపకపోవడం, మహిళా ప్రయాణికులతో సిబ్బంది దురుసుగా వ్యవహరించడం తదితర సమస్యలు కొనసాగుతున్నాయని ఐద్వా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సుయమలీ, కార్యదర్శి అశ్విని, గీత, ఆర్. జోష్ తదితరులు పాల్గొన్నారు. -
మీ ఓటు ఓకే ‘సర్’!
అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఓటర్ల విచారణ ప్రక్రియ సాగుతోంది. ఎస్ఐఆర్ ప్రారంభానికి ముందు జిల్లాలో 20,38,523 ఓట్లు ఉన్నాయి. ‘సర్’లో భాగంగా వీరికి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశారు. ఈ ప్రక్రియలో 2,48,087 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యుమరేషన్ ఫారాలు వెనక్కి రాలేదు. దీంతో ఓటర్ల ముసాయిదా జాబితాలో ఈ ఓట్లు చేర్చేలేదు. ముసాయిదా ప్రకారం జిల్లాలో 17,90,436 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులోనూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఓట్లు, మ్యాపింగ్ కాని ఓట్లు 3,83,382 ఉన్నట్లు గుర్తించి అందరికీ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం విచారణ ప్రక్రియ నడుస్తోంది. అక్టోబరు 5వ తేదీన ముగుస్తుంది. అదే నెల 9వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. 95 శాతం ఓట్లు సక్రమమే అధికారిక లెక్కల ప్రకారం నోటీసు జారీ అయిన ఓట్లలో ఇప్పటి వరకు జరిగిన విచారణ ప్రకారం చూస్తే 95 శాతం ఓట్లు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు, ఓటు మ్యాపింగ్ కాలేదంటూ 3,83,382 మంది ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణ సమయంలో ఓటర్ల నుంచి అవసరమైన ధ్రువపత్రాలను తీసుకుని పరిశీలన చేశారు. ఇప్పటి వరకు చేసిన విచారణలో 20,639 ఓట్లు మాత్రమే అనర్హమైవిగానూ 3,62,743 ఓట్లు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించారు. వీటిలో ఇప్పటి వరకు 3,41,999 ఓట్లను ఓటర్ల తుది జాబితాకు పంపించారు. మరో 20,744 ఓట్లు తుది జాబితాకు పంపించాల్సి ఉంది. అనంతపురంలో అత్యధికం.. విచారణలో అనర్హమైనవిగా నిర్ధారించిన ఓట్లను తొలగించి ఓటర్ల తుది జాబితాను ప్రచురిస్తారు. నోటీసు జారీ అయిన 3,83,382 ఓట్లకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన విచారణలో 20,639 అనర్హమైనవిగా గుర్తించారు. ఈ ఓట్లు అత్యధికంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 11,290 ఉన్నాయి. అత్యల్పంగా గుంతకల్లు నియోజకవర్గంలో 58 ఉన్నాయి. ఇక రాప్తాడు నియోజకవర్గం పరిధిలో 2,718, రాయదుర్గంలో 1,673 ఓట్లు, తాడిపత్రిలో 1,650 ఓట్లు, శింగనమలలో 1,525 ఓట్లు, ఉరవకొండలో 1,059 ఓట్లు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 666 ఓట్లు ఉన్నాయి. 95 శాతం ఓట్లు సక్రమంగానే ఉన్నట్లు విచారణలో వెల్లడి 3,83,382 మంది ఓటర్లకు నోటీసుల జారీ ఇప్పటి వరకు అనర్హులుగా తేలింది 20,639 మంది ఓటర్లే -
నార్పల సొసైటీలో రూ.30 లక్షలు గల్లంతు
● ఇన్చార్జ్ సీఈఓ, చైర్మన్ మౌనం ● నోటీసులు జారీ చేసిన విచారణ అధికారి నార్పల : స్థానిక రైతు సేవా సహకార సంఘం ఖాతాలో రూ.30 లక్షల దాకా గల్లంతయ్యాయి. ఆ డబ్బు ఎందుకు ఖర్చు చేశారనే వివరాలు నమోదు కాలేదు. ఇన్చార్జ్ సీఈఓ, చైర్మన్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వారికి విచారణ అధికారులు నోటీసులు జారీ చేశారు. వ్యవసాయ సీజన్ (ఖరీఫ్, రబీ)లో రైతులకు ఎంతమేర ఎరువులు అవసరమవుతాయో తెలుసుకొని ముందస్తుగా మార్క్‌ఫెడ్, ఇఫ్కో, తదితర ఎరువుల సంస్థలకు సొసైటీ తరఫున ఇండెంట్ ఇస్తారు. ఈ మేరకు ఆన్లైన్ పేమెంట్ ద్వారా వాటికి సొమ్ము జమ చేస్తుంది. అనంతరం సరఫరా చేసిన ఎరువులను అవసరమైన రైతులు కొనుగోలు చేస్తారు. వారు చెల్లించిన సొమ్మును ఒకటి, రెండు రోజుల్లో సీఈఓ సొసైటీ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. ఇలా నిత్యం ఆ సంఘానికి దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు జమవుతుంది. మొత్తంగా ఈ సొమ్ము రూ.40 లక్షల దాకా ఉంటుంది. సొమ్ము డ్రా చేశారిలా.. సొసైటీలోని సొమ్మును తీసుకునేందుకు చైర్మన్ మహేష్ నాయుడు, ఇన్చార్జ్ సీఈఓ తారక బ్రహ్మానందరెడ్డికి మాత్రమే చెక్ పవర్ ఉంటుంది. దీనిని అదునుగా తీసుకున్న వారు ఏకంగా రూ. 30 లక్షల వరకు దశలవారీగా నగదు డ్రా చేసేశారు. ఓచర్ నంబర్ 66 ద్వారా 2026 మార్చి 31న రూ.7,48,000 డ్రా చేశారు. అనంతరం ఓచర్ 67 ద్వారా రూ.2500తో పాటు 2026 సెప్టెంబరు 19న రూ.22,76,280 డ్రా చేశారు. సంఘ కార్య కలాపాల తీరుపై ఇటీవల వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సోమవారం కార్యాలయానికి వచ్చిన తనిఖీ అధికారి జి.రమాదేవి ఆ నిధుల మళ్లింపును గుర్తించారు. 10 రోజుల్లో జమ చేయాలి నిధుల దుర్వినియోగం విషయం బయటపడడంతో సొసైటీ చైర్మన్ మహేష్ నాయుడు అందుబాటులో లేకుండాపోయారు. విచారణ అధికారులు చైర్మన్‌కు సమాచారం తెలపండని సీఈఓతో ఫోన్ చేయించగా ఆయన ‘అనంతపురంలో ఉన్నా..రాలేను’ అని సమాధానం చెప్పారు. ఇన్చార్జ్ సీఈఓ కూడా నిధుల డ్రాపై ఎటువంటి సమాధానమూ ఇవ్వలేదు. దీంతో మొత్తం డబ్బులు పది రోజుల్లో జమ చేయాలని ఇన్చార్జ్ సీఈఓ, చైర్మన్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ విషయంపై మీడియా వివరణ కోరగా.. ఇవి అరోపణలు మాత్రమేనని, పూర్తిగా విచారణ చేసి చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. -
ఆధిపత్య పోరులోనే చరణ్ హత్య
గుంతకల్లుటౌన్: ట్రాన్స్జెండర్ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరే జగన్ అలియాస్ చరణ్ హత్యకు ప్రధాన కారణమని వన్‌టౌన్ సీఐ మనోహర్ తెలిపారు. ఈ హత్య కేసులో 9 మందిని సోమవారం మధ్యాహ్నం స్థానిక రైల్వే డీజిల్‌షెడ్ రోడ్‌లోని పార్క్ వద్ద అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి రెండు వేటకొడవళ్లు, ఒక పిడిబాకు, 6 మోటార్ సైకిళ్లు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. వన్‌టౌన్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను సీఐ వెల్లడించారు. హత్యకు దారి తీసిన కారణాలేమంటే.. పాతగుంతకల్లు వాల్మీకి సర్కిల్ ఏరియాలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అదే ఏరియాకు చెందిన చిత్ర (హిజ్రా) అలియాస్ ఉడదాల పృథ్వీ చేత బెంచికొట్టాలకు చెందిన బోయ వీరేష్, అతని స్నేహితులు రిబ్బన్ కటింగ్ చేయించి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. తన క్రేజ్‌ను తగ్గించారని మనస్తాపానికి గురైన అపర్ణ (హిజ్రా) అలియాస్ రాజశేఖర్ చిత్రతో చనువుగా ఉంటున్న వీరేష్‌ను ఎలాగైనా చంపాలని భావించింది. 15వ తేదీ రాత్రి 11:30 గంటల సమయంలో అపర్ణ వర్గానికి చెందిన సాయివికాస్, అతని స్నేహితులు వసంత్, సాల్మన్‌రాజ్, సుందర్‌లు బెంచికొట్టాలలోని వీరేష్ ఇంటి వద్దకు బైక్‌లతో వెళ్లి హారన్లు మోగించి భారీ శబ్ధాలను చేశారు. దీంతో వీరేష్, అతని స్నేహితులు కలిసి సాయివికాస్ అతని మిత్రులపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న అపర్ణ వీరేష్‌ను చంపాలని ప్రణాళిక రచించారు. మరుసటి రోజు 16వ తేదీ వేకువజామున తన వర్గీయులైన సాయివికాస్, అతని బంధువులతో కలిసి వీరేష్ ఇంటిపై దాడికి దిగారు. ఈ ఘర్షణలో తన అన్న వీరేష్‌ను కాపాడేందుకు వచ్చిన తమ్ముడు చరణ్‌ను వేటకొడవలితో మెడపై బలంగా నరికి, ఛాతీపై కత్తితో పొడవడంతో చరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై మృతుడి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులైన ఇందిరానగర్‌కు చెందిన డి.రాజా, రామాంజినేయులు, అల్లీపీరా కాలనీకి చెందిన సాయిచరణ్, మధువరణ్, మస్తాన్‌పేటకు చెందిన వసంత్‌కుమార్, సాల్మన్‌రాజ్, బోయ సుందర్, రామిరెడ్డికాలనీకి చెందిన షేక్‌నాసిర్, దోనిముక్కలరోడ్డుకు చెందిన అపర్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. సమావేశంలో ఎస్ఐ కళ్యాణ్, ఏఎస్ఐ వెంకటనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. హత్య కేసులో 9 మంది అరెస్ట్ వేటకొడవళ్లు, ఆరు బైక్‌ల స్వాధీనం -
ఆ తండ్రికి అదే చివరి ఫోన్ కాల్
రాప్తాడు రూరల్: ఆ తండ్రికి తనయుడు చేసిన ఆ ఫోన్‌కాలే చివరిదైంది. ‘నాన్నా..అత్తకు బాగో లేదంట.. చూపించుకునేందుకు తిరుపతికి వెళ్తారంట..’ అంటూ తండ్రికి ఫోన్ చేసి చెప్పే ప్రయత్నం చేయగా.. ‘నువ్వు నాతో మాట్లాడొద్దు.. ఫోన్ పెట్టేయ్’ అంటూ తండ్రి ఆగ్రహంవ్యక్తం చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతపురం రూరల్ మండలం కృష్ణంరెడ్డిపల్లిలో ఆదివారం రాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన గోగుల రామాంజనేయులు ఆటోడ్రైవరుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుమారుడు గోగుల మోహన్‌కృష్ణ (21) జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రుల మధ్య విభేదాలు రావడంతో పదేళ్ల క్రితం తల్లి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తండ్రీకొడుకులిద్దరే ఇంట్లో ఉంటున్నారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఏడు నెలలుగా మాటలు లేకుండా ఎవరికి వారు అన్నట్లుగా జీవిస్తున్నారు. మోహన్‌కృష్ణ కింది గదిలో పడుకుంటే.. తండ్రి పైఅంతస్తులో నిద్రించేవాడు. కొడుకు సంపాదన తండ్రికి ఇవ్వకపోవడం, ఖరీదైన బైకు, మొబైల్ కొనుగోలు చేయడం తదితర విషయాల్లోనూ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు తెలిసింది. కుటుంబ కలహాలతో మోహన్‌కృష్ణ తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం. ఎవరి కోసం బతకాలి! ఆదివారం సాయంత్రం మోహన్‌కృష్ణ తన స్నేహితుల వద్ద ఇంట్లో పరిస్థితిని చెప్పుకుని బాధపడినట్లు తెలిసింది. ‘ఇంటికి వెళ్తే మనశ్శాంతి ఉండటం లేదు.. నాన్న నాతో మాట్లాడటం లేదు.. ఎవరి కోసం బతకాలి? పెళ్లి చేసుకుని హాయిగా ఉందామనుకుంటే ఇంట్లోనే మనశ్శాంతి లేకుండా పోయింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. స్నేహితులతో ఇలా మాట్లాడిన కొన్ని గంటల్లోనే అతను అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాత్రి 9.30 గంటల సమయంలో తండ్రికి ఫోన్ చేసి అత్త అనారోగ్య విషయం చెప్పేందుకు ప్రయత్నించాడు. తండ్రి ఫోన్ పెట్టేయమని చెప్పడంతో ఆ తర్వాత మోహన్‌కృష్ణ ఇంట్లో ఉరి వేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది. తల్లి ఫిర్యాదుతో క్లూస్ టీం పరిశీలన సమాచారం అందుకున్న మోహన్‌కృష్ణ తల్లి సోమవారం ఉదయం గ్రామానికి చేరుకుంది. మృతదేహానికి చీమలు పట్టి ఉండటం, అక్కడక్కడా గాయాలు కనిపించడంతో అనుమానం వ్యక్తం చేసింది. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఇటుకలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న సీఐ హేమంత్‌కుమార్, ఎస్ఐ విజయ్‌కుమార్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసుల సమాచారంతో క్లూస్ టీం కూడా అక్కడికి చేరుకుని ఆధారాలను పరిశీలించింది. ఆత్మహత్యగా వైద్యుల నిర్ధారణ మృతదేహంపై గాయాల విషయంపై సీఐ హేమంత్‌కుమార్ మాట్లాడుతూ..మోహన్కృష్ణది ఆత్మహత్యగానే వైద్యులు నిర్ధారించారని తెలిపారు. చీమలు కుట్టడం వల్లే అక్కడక్కడా గాయాలు ఏర్పడినట్లు వైద్యులు ధ్రువీకరించారని వెల్లడించారు. విషాదం నింపిన యువకుడి బలవన్మరణం చివరి సారిగా తండ్రికి ఫోన్ చేసి ఆత్మహత్య -
తాగునీటి సమస్య తలెత్తకూడదు
అనంతపురం అర్బన్: జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో తాగునీటి సమస్య, వ్యవసాయం, అక్షరాస్యత, తదితర అంశాలపై అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా తాగునీటి సమస్య ఉత్పన్నమయ్యే ప్రాంతాలను గుర్తించాలన్నారు. వాటిపై ప్రత్యేక దృష్టి పెడుతూ వాటితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. సమస్య దృష్టికి వచ్చిన 24 గంటల్లోగా పరిష్కరించాలన్నారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని చెప్పారు. ఎల్–నినోను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాల మేరకు రైతులు పంటలు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 100 శాతం అక్షరాస్యత శాతం సాధించే లక్ష్యంగా వయోజన విద్యా అధికారులు, వలంటీర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉపాధి పథకం కింద పనిచేసే వారిలో నిరక్ష్యరాసులను, పొదుపు సంఘాల్లో నిరక్షరాస్య మహిళలను గుర్తించి విద్యావంతులుగా మార్చాలని ఆయా శాఖల అధికారులనను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, డీఆర్డీఏ పీడీ శైలజ, జిల్లా వ్యవసాయాధికారి సాలురెడ్డి, డ్వామా పీడీ సలీమ్, ఏపీఎంఐపీ పీడీ రఘునాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సరుకు రవాణా పెంపునకు సాంకేతిక పరిజ్ఞానం
గుంతకల్లు: సరుకు రవాణా సామర్థ్యం పెంపునకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని దక్షిణ తీర రైల్వే ప్రిన్సిపాల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ (పీసీఓఎం) వినీత్‌కుమార్, డీఆర్ఎం చంద్రశేఖర్‌గుప్తా పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని జూటురు రైల్వేస్టేషన్‌కు అనుసంధానంగా ఉన్న ఎంఎస్ అల్ట్రాటెక్ సిమెంట్ సైడింగ్(యూసీఎల్జే) పాయింట్‌ను సోమవారం పీసీఓఎం, డీఆర్ఎంలు సందర్శించారు. ఈ సందర్భంగా యూసీఎల్జే ప్రతినిధులతో సిమెంట్ లోడింగ్ పెంపుపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. సరుకు రవాణాలో నిరంతర వృద్ధి సాధించేందుకు కొత్త మార్కెట్ గమ్యస్థానాలపై దృష్టి సారించాలన్నారు. అనంతరం పీసీఓఎం, డీఆర్ఎంలు మాట్లాడుతూ ఏడాది ఇప్పటి వరకు యూసీఎల్జే ద్వారా దాదాపు 2,521 మిలియన్ టన్నుల సరుకును లోడ్ చేసినట్లు తెలిపారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 13 శాతం వృద్ధి పెరిగినట్లు చెప్పారు. డివిజన్ మొత్తం ఆరిజినేటింగ్ ప్రైట్ లోడింగ్‌లో యూసీఎల్జే సైడింగ్ వాటా దాదాపు 54 శాతం ఉండటం విశేషమన్నారు. ఇక సైడింగ్ ప్లాంట్ విస్తరణ పూర్తయితే ప్రసుత్తం రోజుకు 6.5 రేక్‌ల నుంచి 13 రేక్‌ల వరకు లోడింగ్ సామర్థ్యం పెరుగుతుందని, దీంతో గుంతకల్లు డివిజన్ సరుకు రవాణా వృద్ధిలో యూసీఎల్జే పాత్ర మరింత బలోపేతం అవుతుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ డీఓఎం దినేష్‌కుమార్, సీనియర్ డీఈఈ సుదర్శన్‌రెడ్డి, సీనియర్ డీసీఎం కే.సత్యనారాయణ, డీఈఎన్ రమసామీ తదితరులు పాల్గొన్నారు. ఫ్యాక్టరీల ప్రతినిధులతో సమావేశం తాడిపత్రి రూరల్: మండలంలోని బుగ్గ వద్ద గల అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో అల్ట్రాటెక్, అదానీ సిమెంట్ ఫ్యాక్టరీల ప్రతినిధులతో సోమవారం సౌత్ కోస్ట్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ వినీత్‌కుమార్ సమావేశమయ్యారు. సిమెంట్ లోడింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక సాంకేతికతను అందజేస్తామన్నారు. గుంతకల్లు నుంచి సరుకు రవాణాలో ఏఐ ఆధారిత సాంకేతికను ఉపయోగించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట తాడిపత్రి రైల్వే స్టేషన్ మేనేజరు అనిల్, కమర్షియల్ అఫీసర్ అనుకుమార్ తదితరులు ఉన్నారు. -
ఉమ్మడి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి
శింగనమల: ఉమ్మడి అనంతపురం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని మాజీ మంత్రి, నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. సోమవారం శింగనమలలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వామపక్షాల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ధర్నాకు వైఎస్సార్సీపీ సంఘీభావం ప్రకటించింది. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ వామపక్షాలు మూడు రోజులు పాటు చేస్తున్న ధర్నాకు వైఎస్సార్సీపీ మద్దతునిస్తుందన్నారు. తాము ఎక్కడ రాజకీయాలు చేయడం లేదని, తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోతుంటే, పరిశీలించి భరోసా అందించామన్నారు. అధికార పార్టీ మాత్రం విమర్శలే ధ్యేయంగా ఉందన్నారు. రైతులకు న్యాయం చేస్తే హర్షిస్తామన్నారు. రైతులను ఆదుకోని పక్షంలో గట్టిగా పోరాటం చేస్తామన్నారు. రైతులు సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోయి, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా, విద్యార్థుల ఫీజులు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంకు ముందు చూపు లేదన్నారు. శాస్త్రవేత్తలు ఎల్‌నినో గురించి ముందస్తు సమాచారం అందించినా, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం వల్లే, నేడు పంటలు ఎండిపోయే స్థితి వచ్చిందన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.7 లక్షల వరకు అందించారన్నారు. నేడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న కూటమి ప్రభుత్వంలో చలనం లేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు చెన్నప్ప, మధు, చికెన్ బాషా, వైఎస్సార్సీపీ నాయకులు బొమ్మన శ్రీరామిరెడ్డి, తరిమెల వంశీ గోకుల్‌రెడ్డి, బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి, మధు, దుద్దేకుంట భాస్కర్‌రెడ్డి, నీలం భాస్కర్, ఎన్వి నారాయణ, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ -
23 మండలాల్లో వర్షం
● హంపాపురంలో నేలవాలిన ద్రాక్ష పంట.. రూ.40 లక్షల నష్టంహంపాపురంలో నేలవాలిన ద్రాక్షతోట, కణేకల్లు–మాల్యం మధ్య వేదవతి హగిరిపై రోడ్డు తెగిన దృశ్యంఅనంతపురం అగ్రికల్చర్: అల్పపీడన ప్రభావంతో జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 23 మండలాల పరిధిలో 7.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. బొమ్మనహాళ్, డీ హీరేహాళ్ మండలాల్లో 40 మి.మీ మేర భారీ వర్షం కురిసింది. ఇక అనంతపురం రూరల్ 28.4 మి.మీ, కూడేరు 25.6, యల్లనూరు 25.2, గార్లదిన్నె 20.8 మి.మీతో పాటు శింగనమల, ఆత్మకూరు, పెద్దపప్పూరు, రాప్తాడు, శెట్టూరు, కుందుర్పి, తాడిపత్రి, వజ్రకరూరు, బెళుగుప్ప, యాడికి, కంబదూరు, విడపనకల్లు తదితర మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. ద్రాక్ష రైతుకు రూ.40 లక్షల పంటనష్టం కాగా గాలులతో కూడిన వర్షం పడటంతో అక్కడక్కడా వేరుశనగ, పత్తి, ద్రాక్ష, టమాట తదితర పంటలు దెబ్బతిన్నాయి. రాప్తాడు మండలం హంపాపురంలో రైతు గద్దె కేశవరెడ్డికి చెందిన ఐదు ఎకరాల ద్రాక్ష తోట నేలవాలింది. రూ.40 లక్షలకు పైగా పంట నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు. రాకపోకలు బంద్ కణేకల్లు: మండలంలోని రచ్చుమర్రి, ఆదిగానిపల్లి, వేపరాలతోపాటు వేదవతి హగరి పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. కణేకల్లు శివారులోని వేదవతి హగరిపై వేసిన తాత్కాలిక రోడ్డు వరద ఉధృతికి తెగిపోయింది. ఉరవకొండ నుంచి రాయదుర్గం వెళ్లే ఆర్టీసీ బస్సులు మాల్యం దాకా వచ్చి అటు నుంచి అటే వెళుతున్నాయి. దీంతో రాయదుర్గం, కణేకల్లు నుంచి ఉరవకొండకెళ్లే ప్రయాణికులు.. ఉరవకొండ నుంచి ఇటు వైపు వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. హెచ్చెల్సీ అక్విడెక్ట్‌పై ప్రత్యామ్నాయ మార్గమున్నప్పటికీ ఆ అక్విడెక్ట్ శిథిల దశకు చేరుకున్నందున అధికారులు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. మరోవైపు రూ.6కోట్ల వ్యయంతో వేదవతి హగరిపై కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే వాహనాల రాకపోకలకు ఇబ్బందులుండవు. -
‘గురజాడ’ సేవలు చిరస్మరణీయం
అనంతపురం అర్బన్: తెలుగు సాహిత్యానికి, సమాజ సంస్కరణకు గురజాడ అప్పారావు అందించిన సేవలు చిరస్మరణీయమని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ కొనియాడారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గురజాడ అప్పారావు జయంతి నిర్వహించారు. జాయింట్ కలెక్టర్‌తో పాటు డీఆర్ఓ ఎ.మలోల పాల్గొని గురుజాడ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాటాడుతూ సమాజంలో మూఢ నమ్మకాలు, సామాజిక దురాచారాలను తన రచనల ద్వారా ఎత్తిచూపి ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన గురజాడ సాహితీ సేవలు చిరస్మరణీయమన్నారు. తెలుగు భాషను ప్రజలకు మరింత చేరువ చేస్తూ వ్యవహారిక భాషకు ప్రాధాన్యత కల్పించడంలో గురజాడ చేసిన కృషి విశేషమైనదన్నారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి రమణరెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్, కోఆర్డినేషన్ విభాగం సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి, భూ విభాగం సూపరింటెండెంట్ రియాజుద్ధీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. జేఎన్టీయూతో రెండు సంస్థల అవగాహన అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం రెండు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. హైదరాబాద్‌కు చెందిన ’గ్లోబల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ’, బెంగళూరుకు చెందిన ’టెక్నోహబ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ’ సంస్థలతో సోమవారం అవగాహన ఒప్పందాలపై (ఎమ్ఓయూ) సంతకాలు చేసింది. ఈ సందర్భంగా జేఎన్టీయూ అనంతపురం వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శన రావు మాట్లాడుతూ.. ఈ అవగాహన ఒప్పందాలు విద్యార్థులు, అధ్యాపకుల సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. సాంకేతికత ఆధారిత విద్య, పరిశోధనలు, ప్రాజెక్టు శిక్షణ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సుల రూపకల్పన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడమే ఈ ఒప్పందాల ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. దుర్గా ప్రసాద్, డీఏపీ ప్రొఫెసర్ ఎస్.వి.సత్యనారాయణ, ప్రొఫెసర్ ఆర్. భవానీ, ప్రొఫెసర్ వైశాలి గోర్పడే, ఏ.సురేష్ బాబు, వి.నాగ ప్రసాద్ నాయుడు, పి.ఆర్.భానుమూర్తి, పి. సుజాత, సి.శోభా బిందు, జి. వి.సుబ్బా రెడ్డి, ఏపీ శివ కుమార్ పాల్గొన్నారు. -
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మండలాల వారీగా పింఛన్ల దరఖాస్తులు ఇలా
సాక్షి ప్రతినిధి, అనంతపురం : కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు బరితెగిస్తున్నారు. మట్టి, ఇసుక, లిక్కర్లో అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ‘పింఛన్’ వచ్చి చేరింది. తాము సిఫార్సులు చేసిన వారికే పింఛన్ మంజూరు చేయాలని నియోజకవర్గ నేత అధికారులకు హుకుం జారీ చేశారు. అర్హతలున్నా, అన్ని డాక్యుమెంట్లతో కార్యాలయానికి వచ్చినా ‘పచ్చ’ నేత సిఫార్సు లేకుంటే దరఖాస్తు పక్కన పడేయండని ఆదేశాలు జారీ చేయడం విస్తుగొలుపుతోంది. టీడీపీ నేత అనుమతి తీసుకోకుండా డైరెక్టుగా దరఖాస్తు చేసుకుంటే వాటిని అప్లోడ్ చేయకుండా అడ్డుకుంటున్నారు. అర్హులకు న్యాయం చేయాల్సిన అధికారులు కూడా ‘వెన్నుపోటు పార్టీ’నేతల ఆదేశాలనే పాటిస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. టీడీపీ నేతలు ఓకే అంటేనే కొత్త పింఛన్ల కోసం ఈ నెల 7 నుంచి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. రెండేళ్ల తర్వాత దరఖాస్తులు స్వీకరించడంతో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి భారీగా సచివాలయాలకు క్యూ కట్టారు. ఇదే అదనుగా కళ్యాణదుర్గం ప్రజాప్రతినిధి బరితెగించారు. ప్రజాప్రతినిధి మేనల్లుడు కళ్యాణదుర్గంలో ప్రజావేదిక వద్ద నియోజకవర్గంలోని ఎంపీడీఓలు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లతో ఈ నెల 11వ తేదీ ఉదయం 6 గంటలకే సమావేశం నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘స్థానిక టీడీపీ నేతలు ఓకే అంటేనే పింఛన్లు నమోదు చేయండి. లేదంటే వాటిని పక్కన పెట్టేయండి. వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు అన్ని అర్హతలున్నా స్థానిక టీడీపీ నేతలను కలిసి వచ్చిన తర్వాతే దరఖాస్తులను స్వీకరించండి. అధికార పార్టీ నేతలను కలవకుండా నేరుగా దరఖాస్తు చేసుకుంటే నిర్మొహమాటంగా వాటిని పక్కన పెట్టేయండి. ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం’ అని హుకుం జారీ చేశారు. పంచాయతీ నుంచి ఇద్దరి ఎంపిక పంచాయతీ పరిధిలో ఇద్దరు చొప్పున టీడీపీ నేతలను నియోజకవర్గ నేత ఎంపిక చేశారు. వీరందరితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ‘మీరు సిఫార్సులు చేసిన వారి జాబితా మండల నేతకు ఇవ్వండి. మీరంతా ఓకే అంటేనే పింఛన్ మంజూరవుతుంది. ప్రతిపక్షపార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు అన్ని అర్హతలూ ఉండి దరఖాస్తు చేసుకుంటే వారంతా మీ దగ్గరికి వచ్చి బతిమాలితేనే ఓకే చెప్పండ’ని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రతీ పంచాయతీలోనూ వెన్నుపార్టీ నేతలు పింఛన్ల మంజూరు పేరిట వసూళ్లకు పాల్పడుతున్నట్లు దరఖాస్తుదారులు చెబుతున్నారు. ‘పచ్చ’ పార్టీ నేతల ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా పాటిస్తున్నారని వాపోతున్నారు. మరోవైపు టీడీపీ నేతలు తమకు కావాల్సిన వారికి అర్హత లేకపోయినా దరఖాస్తు చేయించినట్లు సొంత పార్టీ కార్యకర్తలే చెప్తుండడం గమనార్హం. 2,657 కళ్యాణదుర్గం 1,389శెట్టూరు1,355బ్రహ్మసముద్రం ఈ చిన్నారి పేరు మోక్షిత. వయసు ఆరేళ్లు. బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామం. కుడిచేయి పూర్తిగా సహకరించదు. వైకల్యం 40 శాతం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ మంజూరు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం నూతన పింఛన్ల కోసం పోర్టల్ ప్రారంభించగానే అన్ని పత్రాలతో ఈ నెల 12న దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరి దరఖాస్తును టీడీపీ మండల కన్వీనర్ శ్రీరాములు ఆదేశాల మేరకు స్థానిక డిజిటల్ అసిస్టెంట్ అప్‌లోడే చేయలేదు. దీంతో చిన్నారిని తీసుకుని సోమవారం కలెక్టరేట్లో తమ సమస్యను విన్నవించుకున్నారు. 1,844కుందుర్పి2,049కంబదూరుమేం చెప్పిన వారికే ఓకే చేయాలి తెలుసు కదా..? కళ్యాణదుర్గంలో బరితెగించిన అధికార పార్టీ నేతలు ఎంపీడీఓలు, డిజిటల్, వెల్ఫేర్ అసిస్టెంట్లతో భేటీ టీడీపీ నేతల సిఫార్సులనే అప్రూవ్ చేయాలని హుకుం వైఎస్సార్సీపీ సానుభూతిపరుల దరఖాస్తుల తిరస్కరణ -
పీఎండీఎస్‌తో రైతుకు భరోసా
గార్లదిన్నె: ఎన్‌నినో పరిస్థితుల వల్ల తక్కువ వర్షపాతం ఉండడంతో పీఎండీఎస్ (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) విధానంలో పంటలు సాగు చేస్తే రైతులకు భరోసా లభిస్తుందని ఏపీసీఎఫ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం గార్లదిన్నె మండల పరిధిలోని కోటంకలో 70 ఎకరాల్లో చేపట్టిన పీఎండీఎస్ సిట్రస్, కాంపాక్ట్ బ్లాక్‌ను విజయ్‌కుమార్, కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ భూమిలో తేమను కాపాడుకుంటూ పంటల వైవిధ్యంతో రైతులు సాగును కొనసాగించాలన్నారు. మిశ్రమ పంటలు సాగు చేయడం వల్ల నేల సారవంతం పెరిగి, కలుపు ఉధృతి తగ్గి రైతుకు ఆదాయం వస్తుందన్నారు. రెండు రోజులుగా కురిసిన వర్షంకు రైతులు ఉలవ, కొర్ర, జొన్న విత్తనాలు వంటి ప్రత్యామ్నాయ పంటలు విత్తుకోవాలన్నారు. అనంతరం 4 ఎకరాల్లో కాంపాక్ట్ బ్లాక్‌లో పెల్లైటెజ్డ్, పీఎండీఎస్ విత్తన గుళికలతో విత్తనాలు వేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సాలు రెడ్డి, జిల్లా మేనేజర్ లక్ష్మానాయక్, ఎస్పీం డాక్టర్, నవీన్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వెంకట్‌కుమార్, మండల వ్యవసాయ అధికారి సోమశేఖర్, ఉద్యాన శాఖ అధికారి రత్నకుమార్ పాల్గొన్నారు. లాభదాయకంగా పెల్లైటెజ్డ్ పీఎండీఎస్ కూడేరు: ‘ప్రకృతి వ్యవసాయంలో వర్షాకాలానికి ముందే పొడి నేలలో విత్తనాలు విత్తే విధానమే పీఎండీఎస్. ఎల్–నినో పరిస్థితులను అధిగమించడానికి ఇది వినూత్న విధానం. ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుంది’ అని ఏపీసీఎన్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ విజయకుమార్ అన్నారు. కూడేరులో ఒకే చోట 30 ఎకరాల్లో పెల్లైటెజ్డ్ పీఎండీఎస్ విధానంలో చేపడుతున్న పంటలను సోమవారం ఆయన కలెక్టర్ ఆనంద్‌తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. -
దళారి చేతిలో రైతులు దగా
● రూ.8 కోట్లకు పైగా మొక్కజొన్న, శనగ కొనుగోలు ● 2 నెలల్లో ఇస్తానని.. మాట తప్పిన వైనంఅనంతపురం అర్బన్: దళారి చేతిలో రైతులు దగాపడ్డారు. మొక్కజొన్న, శనగ కొనుగోలు చేసి డబ్బుల ఇవ్వకుండా ఐపీ నోటీసులు పంపి మోసం చేశాడు. తమకు న్యాయం చేయాలని యల్లనూరు, పుట్లూరు మండలాలకు చెందిన బాధిత రైతులు సోమవారం కలెక్టరేట్లో ‘ప్రజాసమస్యల పరిష్కార వేదిక’లో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్‌కు ఫిర్యాదు అందజేశారు. అనంతరం రైతులు సుధాకర్ నాయకుడు, రాజేశ్వరనాయుడు, శివనారాయణ, మాధవరెడ్డి, నాయుడప్ప, జానకీనాయుడు, తదితరులు మీడియాతో మాట్లాడారు. పంట కొనుగులు చేసి డబ్బులు చెల్లించకుండా తమను దళారి మోసం చేశాడన్నారు. రెండు మండలాల్లోనూ 93 మంది రైతుల నుంచి రూ.8 కోట్లకు పైగా విలువ చేసే మొక్కజొన్న, శనగ పంటను పుట్లూరు మండలం సంజీవపురానికి చెందిన రాజశేఖర్‌రెడ్డి అలియాస్ రాజారెడ్డి అనే వ్యక్తి ఈ ఏడాది మార్చి నుంచి మే మధ్యకాలంలో కొనుగోలు చేశాడని చెప్పారు. రెండు నెలల్లో చెల్లిస్తానని చెప్పి.. ఐదు నెలలు అవుతున్నా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే పోలీసు స్టేషన్లలో 10 రోజుల క్రితం ఫిర్యాదు చేశామన్నారు. అయితే అతను వారం క్రితం తమకు ఐపీ నోటీసు పంపించాడని తెలిపారు. అది కూడా పంట కొనుగోలుకు కాకుండా తాను ఎరువుల దుకాణం పెట్టుకునేందుకు రైతుల నుంచి డబ్బులు తీసుకున్నట్లుగా ఐపీ నోటీసులో పేర్కొన్నాడని వాపోయారు. ● కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి 591 అర్జీలను అధికారులు స్వీకరించారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయుల దాడి
యల్లనూరు: వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. మండలంలోని నీర్జాంపల్లికి చెందిన బాధితుడు, వైఎస్సార్ సీపీ కార్యకర్త వెంకటరాముడు తెలిపిన మేరకు.. వెంకటరాముడు కుమారుడు హరి, అదే గ్రామానికి చెందిన రమేష్ కుమార్తె మూడేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇటీవల ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో అమ్మాయి తరఫు వారు వెంకటరాముడును అంతమొందించేందుకు ప్లాన్ వేశారు. ఇటీవల తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు సాయిప్రతాప్‌రెడ్డి నీర్జాంపల్లి గ్రామానికి వెళ్లగా వెంకటరాముడు, హరితో పాటు మరి కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది మనసులో పెట్టుకున్న అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు అశోక్, క్రిష్ణార్జున, గంగా మహేష్, త్రిలోక్, సంతోష్, మల్లిఖార్జున, ఓబులేసు, రమేష్, కుమార్, రాజేష్, గంగయ్యతో పాటు మరికొందరు ఆదివారం రాత్రి వెంకటరాముడుపై దాడి చేసేందుకు అతని ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. వెంకటరాముడు తలపై రాళ్లు,కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఇంట్లో టీవీ, బీరువా, ఇనుప కిటికీలు ధ్వంసం చేశారు. దీనిపై సోమవారం సాయంత్రం యల్లనూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వెంకటరాముడు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్త అశోక్ అండ చూసుకుని తనపై దాడి చేశారని వాపోయాడు. ఇదిలా ఉండగా, వెంకటరాముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయని పోలీసులు టీడీపీ నాయకుల ఒత్తిడితో అతని కుమారుడు హరిపై మాత్రం పోక్సో కేసు నమోదు చేయడం గమనార్హం. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
వ్యక్తిగత సంపాదనపైనే వారి దృష్టి
● ప్రజాప్రతినిధులపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత ధ్వజం ● కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ అనంతపురం: జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు సహాయక చర్యలు చేపట్టకుండా ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత సంపాదనపైనే దృష్టి కేంద్రీకరించారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం నగరంలోని క్లాక్‌టవర్ వద్ద సీపీఐ మండల కార్యదర్శి నరేష్ అధ్యక్షతన కరువు దీక్షలు చేపట్టారు. ముఖ్య అతిథులుగా అనంత తో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ గడచిన ఐదు దశాబ్ద కాలంలో జిల్లా ప్రజలు ఎన్నడూ ఇటువంటి కరువు పరిస్థితులను చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని 2.90 లక్షల ఎకరాల ఉద్యాన పంటల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. దాదాపు లక్ష ఎకరాల్లోని చీనీ తోటలు నీళ్లు లేక ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచక పంటను తొలగిస్తున్నారని ఆవేదన చెందారు. రెండు నెలలుగా కరువు హెచ్చరికలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. తుంగభద్ర నీటిని తాగునీటికే పరిమితం చేశారని, ఆందోళనలు చేస్తేనే రాయదుర్గం, ఉరవకొండ ప్రాంతాలకు అరకొరగా సాగునీరందిస్తున్నారని చెప్పారు. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా ద్వారా వస్తున్న నీటిని సౌత్ కెనాల్, నార్త్ కెనాల్, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్‌కు విడుదల చేయాలని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నీటి ప్రయోజనాలను ఫణంగా పెట్టి కృష్ణా డెల్టాకు నీటిని తరలించడం దారుణమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కరువు సహాయక చర్యలు, రైతులకు పరిహారం, తాగునీరు, పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయకపోతే వైఎస్సార్సీపీ తరఫున జిల్లావ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణస్వామి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, రైతు కూలీ సంఘం నాయకుడు నాగరాజు, ఐఎఫ్టీయూ నాయకుడు ఏసురత్నం, పట్టణ పేదల సంఘం నాయకుడు వీరనారప్ప, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ గౌడ్, గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు, వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, మాజీ మేయర్ వసీం, నాయకులు ఎద్దుల అమర్నాథ్ రెడ్డి, హనుమంతు, అనంతపురం రూరల్ మండల నాయకులు ఓబులేసు, వెంకట్రాముడు, రెడ్డప్ప, నరసింహులు, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి కష్టాలు పునరావృతం
రాయదుర్గంటౌన్: పట్టణంలో తాగునీటి సరఫరా మరోసారి అస్తవ్యస్తంగా మారింది. అనేక కాలనీల్లో నాలుగైదు రోజులు గడిచిపోతున్నా.. తాగునీరు అందడం లేదు. హెచ్చెల్సీ నుంచి కణేకల్లులోని ఎస్ఎస్ ట్యాంకులోకి తుంగభద్ర జలాల పంపింగ్ ఆశాజనకంగా జరుగుతోంది. దాదాపు రోజుకు 60 ఎంఎల్డీల నీరు పంపింగ్ చేస్తున్నారు. ఎస్ఎస్ ట్యాంకు పూర్తిస్థాయి నీటిమట్టం 3,052 మిలియన్ లీటర్లు కాగా సోమవారం నాటికి 2,010 ఎంఎల్డీ నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికి అధికారులు పట్టణవాసులకు తాగునీటిని సరఫరా చేయడంలో మళ్లీ పాత కథను పునరావతం చేస్తున్న పరిస్థితి ఉంది. భారీ వర్షాలు లేవు, గాలి తీవ్రత లేదు, అయినప్పటికి కరెంట్ సరఫరాలో లోపం, టెక్నికల్ సమస్య, పైప్‌లైన్ లీకేజీ, వాల్వ్ లీకేజీ మరమ్మతు, పంప్‌హౌస్‌లో సమస్య, ఎస్ఎస్ ట్యాంకు వద్ద మోటారు సమస్య అంటూ అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది చెబుతున్న పరిస్థితి ఉంది. రెండు ట్యాంకర్లే గతి ఎస్ఎస్ ట్యాంకులో నీటి నిల్వ పూర్తిగా అడుగంటిన సమయంలో దాదాపు ఏడు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు చేపట్టారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఐదు అద్దె ట్యాంకర్లను రద్దు చేసి కేవలం మున్సిపాలిటీకి చెందిన రెండు ట్యాంకర్ల ద్వారా మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. నీటి కొరత ఏర్పడిన సమయాల్లో రెండు ట్యాంకర్ల ద్వారా పట్టణంలో అవసరమైన చోట్ల నీటి సరఫరాకు ఎలా సాధ్యమవుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పాలకులు కూడా తాగునీటి సరఫరా వైపు కన్నెత్తి చూడకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొళాయిలకు తాగునీరు సరఫరా కాని అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ప్రత్యామ్నాయం లేని కాలనీల్లో కనీస అవసరాలకు కూడా నీరు లభించని దుస్థితి ఉంది. నాలుగైదు రోజులకోసారి సరఫరాతో జనం పరేషాన్ -
●మద్యం చిచ్చు.. తల్లీపిల్లల ఆత్మహత్యాయత్నం
కళ్యాణదుర్గం/బ్రహ్మసముద్రం: మద్యం మహమ్మారి కుటుంబంలో చిచ్చుపెట్టింది. పని మాని.. తాగుడుకు బానిసైన భర్త డబ్బుకోసం హింసిస్తుండటంతో భరించలేకపోయిన భార్య ముగ్గురు పిల్లలతో కలిసి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు... గుమ్మఘట్ట మండలం కలుగోడుకు చెందిన ఆశాకు బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లికి చెందిన ఎర్రిస్వామితో పదేళ్ల క్రితం వివాహమైంది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి ముగ్గురు కుమార్తెలు సంతానం. కొన్నేళ్లుగా ఎర్రిస్వామి మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్య కూలి పనికి వెళ్లి తెచ్చిన డబ్బును ఎత్తుకెళ్లడం.. మద్యం తాగి ఇంటికి రావడం పరిపాటిగా మారింది. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తుండటంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు సూచించినా అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మద్యం తాగొచ్చిన ఎర్రిస్వామి భార్యతో గొడవపడి, అనంతరం బయటకు వెళ్లాడు. భర్త తీరుతో విసిగిపోయిన ఆశా జీవితంపై విరక్తిచెందింది. కొంతసేపటి తర్వాత ఆరు, నాలుగు, రెండు సంవత్సరాల వయసున్న కుమార్తెలు శ్రావ్య, రష్మిక, ఆద్యాలకు పురుగుమందు తాగించి.. ఆపై తాను కూడా తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగువారు గమనించి వారిని హుటాహుటిన రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులపై వేటు అనంతపురం టౌన్: అసైన్డు భూములను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసిన ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ విజయలక్ష్మి సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. తాడిపత్రి మండలం వీరాపురంలో సర్వే నంబర్లు 683–ఏ, 683–బీ1, 683–బీ2లోని 6.75 ఎకరాల విస్తీర్ణం కలిగి 2023–24 మధ్యన నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములకు అప్పటి తాడిపత్రి సబ్ రిజిస్ట్రార్ బసవరాజు, సీనియర్ అసిస్టెంట్ మంజునాథ్ యాదవ్ రిజిస్ట్రేషన్లు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంంతో విచారణకు ఆదేశించారు. దీనిపై జిల్లా రిజిస్ట్రార్ ఇచ్చిన విచారణ నివేదిక ఆధారంగా ఇద్దరు ఉద్యోగులపై డీఐజీ చర్యలకు తీసుకున్నారు. ఎస్కేయూలో పీజీ అడ్మిషన్లు అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ కళాశాలలో ఎంబీఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఆసక్తి గల వారు ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, ఫిజిక్స్, ఎంఏ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఎంకాం, ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు. సంబంధిత సబ్జెక్టులలో బీఎస్సీ (ఆనర్స్), బీఏ (ఆనర్స్), బీకాం (ఆనర్స్), బీబీఏ కోర్సుపూర్తి చేసిన అభ్యర్థులు ఈ ప్రవేశాలకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను జతపరచాల్సి ఉంటుంది. నిర్ణీత ఫీజు చెల్లించి, ఈ నెల 25 నుంచి 30వ తేదీలోపు యూనివర్సిటీలోని అడ్మిషన్ కార్యాలయంలో సంప్రదించాలని డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. నులిపురుగుల్ని నిర్మూలిద్దాం అనంతపురం అర్బన్: పిల్లలకు చదువుతోపాటు వారి ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సూచించారు. పిల్లలను ఇబ్బంది పెట్టే నులిపురుగుల నిర్మూలన కోసం ఆల్బెండజోల్ మాత్రలు అందించాలన్నారు. ఈ నెల 25న చేపట్టనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జేసీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డీఈఓ అయూబ్‌ఖాన్, ఆర్ఐఓ వెంకటరమణ నాయక్, ఐడీసీఎస్ పీడీ సాజిదాబేగం, ఆర్బీఎస్ ప్రోగ్రాం అధికారి విష్ణుమూర్తి, మేనేజర్ రజిత, డీవీఈఓ గురవయ్య పాల్గొన్నారు. -
బాధితులకు సత్వర న్యాయం
అనంతపురం సెంట్రల్: బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని ఎస్పీ జగదీష్ ఆదేశించారు. సోమవారం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 129 అర్జీలు నమోదయ్యాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో నేరుగా మాట్లాడి.. సమస్యలను పరిష్కరించాల్సిందిగా అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు నూతన మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ వాహనం నేర స్థలాల్లో ఆధారాలు సేకరించేందుకు మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్‌ను జిల్లాకు మంజూరు చేశారు. సోమవారం పోలీసు కార్యాలయ ఆవరణంలో ఎస్పీ జగదీష్ వాహనాన్ని పరిశీలించారు. ఫొటోగ్రఫీ, వీడియో డాక్యుమెంటేషన్, శాసీ్త్రయ పద్ధతుల్లో ఆధారాల సేకరణ చేపట్టేందుకు ఈ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. లైన్మెన్పై వేటు ● ఏఈ ప్రతాప్‌కు షోకాజ్ అనంతపురం టౌన్: బుక్కరాయసముద్రం మండలం రేగడికొత్తూరు గ్రామంలో శనివారం చోటు చేసుకున్న విద్యుత్ ప్రమాదంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కార్మికులు ప్రధాన్ భందర, నానో బాణరలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విద్యుత్ ప్రమాదంలో రేగడి కొత్తూరు లైన్మెన్ వెంకటేష్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహించారు. రేగడికొత్తూరు లైన్ ఎల్సీ తీసుకోకుండా వడియంపేట లైన్‌కు ఎల్సీ తీసుకొని ఇద్దరు కార్మికుల మృతికి కారణం కావడంతో వెంకటేష్‌ను సస్పెండ్ చేసినట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. బీకేఎస్ విద్యుత్ శాఖ ఏఈ ప్రతాప్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. ప్రమాదంపై లోతుగా విచారణ చేపట్టేందుకు విజిలెన్సు డీఈని విచారణ అధికారిగా నియమించినట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. 23న జాబ్ మేళా అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) సహకారంతో స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 23న జాబ్ మేళా నిర్వహించనున్నారు. అనంతపురం, పరిసర ప్రాంతాలకు చెందిన ఉద్యోగార్థులు, నిరుద్యోగ యువతతో పాటు డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ తదితర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. పలు ప్రముఖ సంస్థలు మేళాలో పాల్గొని అర్హతలను బట్టి అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. విద్యార్హత, వయసు, ఉద్యోగ స్వభావం, సంస్థను బట్టి వేతనాలు, ప్రోత్సాహకాలు, ఇతర ప్రయోజనాలు ఉంటాయని ప్రిన్సిపల్ పద్మశ్రీ, జేకేసీ కోఆర్డినేటర్ జీవన్‌కుమార్ తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు బయోడేటాతో పాటు విద్యార్హతల ధ్రువపత్రాలు, అవసరమైన ఇతర పత్రాలతో హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దివ్యాంగులంటే చులకనా?అనంతపురం అర్బన్: ‘దివ్యాంగులంటే మీకంత చులకనా..? టీడీపీ నాయకులు చెప్పినోళ్లకే పింఛను ఇస్తారు. వారి చెప్పనది దరఖాస్తులు కూడా తీసుకోరా..?’ అంటూ దివ్యాంగుల సంఘం నాయకుడు రాజేష్ ధ్వజమెత్తారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అర్హులకు పింఛన్లు ఇవ్వరంట... దరఖాస్తులు తీసుకోరంటూ మండిపడ్డారు. సచివాలయ ఉద్యోగులను ఎమ్మెల్యే పిలిపించుకుని... మా నాయకులు చెప్పిన వారికే దరఖాస్తులు అప్లోడ్ చేయాలని ఆదేశించారన్నారు. బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామానికి చెందిన శివన్న తన ఆరేళ్ల కుమార్తె దివ్యాంగురాలు మోక్షిత పింఛను కోసం 12వ తేదీన దరఖాస్తు చేస్తే డిజిటల్ అసిస్టెంట్ 18వ తేదీ వరకు అప్లోడ్ చేయకుండా గడువు ముగిసిందని చెప్పారని మండిపడ్డారు. ఇప్పుడు చిన్నారి మోక్షితకు ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛను ఇస్తారా..? లేక ఆయన కుమారుడు మంత్రి లోకేష్ ఇస్తారా..? అంటూ నిలదీశారు. అర్హులకు పింఛను రాకపోతే కలెక్టరేట్‌ను ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు వసంత్, హరినాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మద్యం షాపుల రెన్యువల్ గడువు పెంపు అనంతపురం సెంట్రల్: మద్యం షాపుల రెన్యువల్ గడువును ఈ నెల 23 వరకూ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి. రామమోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మద్యం షాపులు ప్రస్తుతమున్న లైసెన్స్ ఫీజుపై 38 శాతం అదనంగా చెల్లించి రెన్యువల్ చేసుకునేలా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తొలుత సోమవారం సాయంత్రం 5 గంటల వరకూ సమయం కేటాయించగా ప్రస్తుతం ఈనెల 23 వరకూ గడువు పెంచినట్లు వివరించారు. -
ఇంకెన్నాళ్లీ కష్టాలు ?
స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లవుతున్నా మా తలరాతలు మాత్రం మారడం లేదు. మా గ్రామం ఓ చిన్న ద్వీపంలా ఉంది. వర్షాకాలం వస్తే కంటిమీద కనుకు ఉండదు. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడి వెళ్లాలో అర్థం కాదు. పొరుగు ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయి. ఇంకెన్నాళ్లీ కష్టాలు పడాలి? మాకు మోక్షం ఎప్పుడు లభిస్తుంది.? జిల్లా కలెక్టర్ స్పందించి అపరిష్కృతంగా ఉన్న బ్రిడ్జిల సమస్య పరిష్కరించాలి. – గలిబే అనిల్‌కుమార్, హనకనహళ్ ఒక్క బ్రిడ్జినైనా నిర్మించండి సొల్లాపురం మార్గంలో రెండు వంకలుంటే... బెళుగుప్ప మార్గంలో ఒక వంక మాత్రమే ఉంది. దయనీయ పరిస్థితులను అనుభవిస్తున్న గ్రామాన్ని పాలకులు పట్టించుకోవడంలేదు. కనీసం ఒక వంకౖపైనెనా బ్రిడ్జి కడితే మా ఊరికి మోక్షం లభించినట్లే. ఒక బ్రిడ్జి నిర్మాణానికై నా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ బ్రిడ్జి నిర్మిస్తే మా గ్రామానికి కుడివైపునున్న బెళుగుప్పకై నా వెళ్లగలుగుతాం. జలదిగ్బంధం నుంచి బయటపడుతాం. – శివరాజ్, హనకనహళ్ -
ఇద్దరు విద్యార్థుల అదృశ్యం
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం బళ్లారిరోడ్డు రాచానపల్లి సమీపంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల హాస్టల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది.నార్పల మండలం జంగంరెడ్డిపల్లికి చెందిన కొవ్వూరి అమృతకుమార్రెడ్డి, ధర్మవరానికి చెందిన మనోహర్‌రెడ్డి శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కళాశాల నుంచి బయటకు వెళ్లారు. ఓ మద్యం దుకాణం సమీపంలో కనిపించగా, కళాశాల యాజమాన్యం వారిని చూసింది. దీంతో అక్కడి నుంచి పరారైన విద్యార్థులు రాత్రి 9 గంటలకు హాస్టల్‌కు చేరుకున్నారు. ఈ విషయంపై యాజమాన్యం వారిని మందలించడంతో పాటు, వారి ఎదుటే తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆదివారం కళాశాలకు రావాలని సమాచారం ఇచ్చింది. దీంతో మనస్తాపానికి గురైన ఇద్దరు విద్యార్థులు తెల్లవారుజామున హాస్టల్ నుంచి వెళ్లిపోయారు. అమృతకుమార్రెడ్డి తండ్రి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ శ్రీకాంత్‌యాదవ్ ఆదివారం రాత్రి కళాశాలకు వెళ్లి యాజమాన్యాన్ని, విద్యార్థులను విచారించారు. ఆచూకీ తెలిసిన వారు 94407 96811 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. విద్యార్థులకు వక్తృత్వ పోటీలు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో ‘వికసిత్ భారత్– 2047’ అంశంపై చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని డీఈఓ అయ్యూబ్ హుస్సేన్ తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు ఆసక్తి ఉన్న విద్యార్థులను పోటీల్లో తప్పనిసరిగా పాల్గొనేలా చూడాలని సూచించారు. సోమ వారం పాఠశాల స్థాయిలో నిర్వహించి విజేతల వివరాలను సంబంధిత డీవైఈఓ కార్యాలయాల్లో అందజేయాలని ఆదేశించారు. బియ్యం అక్రమ తరలింపుపై ఎంజేపీలో విచారణ ● గుట్టుగా చేపట్టడంపై సర్వత్రా విమర్శలు నార్పల: మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే(ఎంజేపీ) బాలికల గురుకుల పాఠశాలలో బియ్యం అక్రమ తరలింపుపై ఆదివారం అధికారులు విచారణ చేపట్టారు. విజయవాడ నుంచి వచ్చిన రాష్ట్ర వెల్ఫేర్ డిప్యూటీ సెక్రటరీ సుభాషిణి దేవమ్మ, అనంతపురం డీడీ కుష్బూ కొఠారి, అబ్జర్వర్ ప్రిన్సిపాల్ హర్షద్వలి సమక్షంలో విచారణ జరిపారు. అయితే, పాఠశాల గేట్లను మూసివేసి బయటి వ్యక్తులను లోపలికి అనుమతించకుండా గుట్టుగా విచారణ చేయడంపై వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పాఠశాల వద్ద నిరసన తెలిపారు. ప్రిన్సిపాల్ కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులతో అధికారులకు అనుకూలంగా సమాధానాలు ఇప్పించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బియ్యం అక్రమ తరలింపుతో పాటు ప్రిన్సిపాల్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జేసీ అనుచరుల దాష్టీకం ● వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడి తాడిపత్రిటౌన్: జేసీ అనుచరుల దాష్టీ కాలు ఆగడం లేదు. తాజాగా తాడిపత్రి పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో వైఎస్సార్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ హరినాథరెడ్డిపై దాడికి తెగబడ్డారు. ఆదివారం హరినాథరెడ్డి పట్టణంలోని సుంకులమ్మపాలెంలో ఉన్న తన ఇంటికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు మూడు వాహనాల్లో అనుసరించారు. కూరగాయల మార్కెట్ సమీపంలో ఢీకొట్టారు. కిందపడిన హరినాథరెడ్డిపై ముఖాలకు మాస్కులు వేసుకున్న 15 మంది కర్రలు, రాడ్లతో దాడి చేశారు. స్థానికులు కేకలు వేయడంతో పారిపోయారు. వైఎస్సార్సీపీ నాయకులు ఘటనా స్థలానికి వెళ్లి హరినాథరెడ్డిని చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. -
బిక్కి బరితెగింపు
కళ్యాణదుర్గం: అధికార అండతో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. నిబంధనలను పక్కనబెట్టి పట్టపగలే కొండను పిండి చేస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా చోద్యం చూస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. కళ్యాణదుర్గంలో వాల్మీకి సర్కిల్ సమీపంలోని ఆంజనేయ స్వామి కొండ పొరంబోకు స్థలం(సర్వే నంబర్ 421)లో టీడీపీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బిక్కి రామలక్ష్మి భర్త బిక్కి గోవిందప్ప (ఖైదీ గోవిందప్ప) బ్లాస్టింగ్ చేస్తూ కొండను కరిగిస్తున్నాడు. స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ప్రస్తుతం అక్కడ సెంటు స్థలం రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ధర పలుకుతోంది. ఈ లెక్కన రూ.2 కోట్లకు పైగా విలువైన 20 సెంట్లను కాజేసేందుకు ఎత్తుగడ వేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ప్రోద్బలంతోనే కొండను ‘బిక్కి’ కరిగించేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అల్లుడికి ఆస్పత్రి నిర్మించేందుకు..! బిక్కి గోవిందప్ప అల్లుడు నియోజకవర్గంలోని ఓ మండలంలో ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. పట్టణంలోని వాల్మీకి సర్కిల్లో ఇటీవల ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభించారు. ప్రభుత్వ వైద్యుడిగా సేవలందిస్తూనే మరోవైపు సొంత ఆసుపత్రి ద్వారా ఆర్జన సాగిస్తున్నారు. ఈ క్రమంలో తన అల్లుడికి శాశ్వత ఆసుపత్రి నిర్మాణం చేసేందుకు కొండ వద్ద స్థలం ఆక్రమణకు తెరతీసినట్లు తెలిసింది. గతంలో ఓ చర్చి నిర్వాహకులు తీసుకున్న స్థలంపై కన్నేసి వారిని భయపెట్టి ఖాళీ చేయించినట్లు సమాచారం. చోద్యం చూస్తున్న అధికారులు.. వాల్మీకి సర్కిల్ సమీపంలో పట్టపగలే బ్లాస్టింగ్ చేస్తున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తుండడం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ భాస్కర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. కొండ పొరంబోకులో యథేచ్ఛగా బ్లాస్టింగ్ రూ.2 కోట్లకు పైగా విలువైన స్థలం ఆక్రమణకు పన్నాగం చోద్యం చూస్తున్న రెవెన్యూ, మైనింగ్ అధికారులు -
బావిలో భల్లూకం
● నేమకల్లు శివారులో కలకలం బొమ్మనహాళ్: మండలంలోని నేమకల్లు గ్రామ శివారులోని ఓ పాడుబడ్డ బావిలో ఎలుగు బంటి కనిపించిన ఘటన ఆదివారం కలకలం సృష్టించింది. ప్రమాదవశాత్తు బావిలో పడి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. గ్రామస్తుల సమాచారంతో అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దామోదర్‌రెడ్డి, అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలిని పరిశీలించారు. బావి చుట్టూ ఉన్న ముళ్ల కంపను తొలగించడంతో ఎలుగుబండి బయటకు వచ్చి సమీపంలోని కొండల వైపు పరుగులు తీసింది. ఇటీవల గ్రామ సమీపంలోని కంకర క్వారీలో ఎలుగు బంటి ఇరుక్కుపోవడం, తాజాగా పాడుబడ్డ బావిలో మరో భల్లూకం చిక్కుకుపోయిన దృష్ట్యా వన్యప్రాణుల రక్షణకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
హనకనహళ్.. హాహాకారం
కణేకల్లు: ఓవైపు వర్షాభావం.. మరోవైపు కరువు కరాళ నృత్యం...దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్న సమయంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో హనకనహళ్ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామానికి నలుదిక్కులా ఉన్న వంకలు ఒక్కసారిగా వరదనీటి ఉధృతికి పొంగి పొర్లాయి. గ్రామాన్ని వరదనీరు చుట్టుముట్టడంతో రాకపోకలు స్తంభించి.. జనం బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. మిగి లి న సీజన్లలో ఊరంతా బాగానే ఉంటున్నా ... వర్షాకాలం వచ్చిందంటే ఆ ఊరి జనానికి ఓ వైపు ఆనందం.. మరోవైపు ఆందోళన వెంటాడడం పరిపాటిగా మారింది. కణేకల్లు మండలంలోని హనకనహళ్ గ్రామస్తులు వర్షాకాలంలో దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రానికి హనకనహళ్ సుదూర గ్రామం. కణేకల్లుకు 18 కిలోమీటర్ల దూరంలో గ్రామం ఉంటుంది. అయితే బెళుగుప్ప మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామం చుట్టూ వంకలు ఉన్నాయి. హనకనహళ్ నుంచి సొల్లాపురానికి వెళ్లే మార్గంలో ఊరికి సుమారు 200 మీటర్ల దూరంలో చిన్న వంక ఉంది. ఈ వంకకు మరో 500 మీటర్ల దూరంలో చెరువు వంక ఉంది. హనకనహళ్ నుంచి బెళుగుప్పకు వెళ్లే దారిలో గ్రామ శివారులో పెద్ద వంక ఉంది. హనకనహళ్ చుట్టుపక్కల ఉన్న బెళుగుప్ప మండలానికి చెందిన తగ్గుపర్తి, రాంసాగరం, గంగవరం, బెళుగుప్ప తదితర ప్రాంతాల్లో వర్షాలొస్తే మూడు వంకల్లో వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. శనివారం రాత్రి హనకనహళ్తోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో భారీ వర్షానికి వంగలు, వాగులు పొంగిపొర్లాయి. దీంతో ఈ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉరవకొండ నుంచి హనకనహళ్ మీదుగా కళ్యాణదుర్గానికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఉదయం చెరువు వంక దాకా వచ్చి వెనక్కి వెళ్లిపోయింది. వంక ఉధృతి తగ్గే దాకా రాకపోకలు పునరుద్ధరణ ఉండదు. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న రోజులెన్నో.. సొల్లాపురం వెళ్లే మార్గంలో రెండు వంకలు, బెళుగుప్ప మార్గంలో పెద్ద వంకలపై బ్రిడ్జిలు నిర్మించాలంటూ అనేకసార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు కోరినా ఎవ్వరూ కరుణించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాన్పులు, ఇతరత్రా అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు వెళ్లలేని దయనీయ పరిస్థితి ఉంది. బెలుగుప్ప మార్గంలో ఒకే ఒక వంక ఉందని, ఈ వంకౖపైనెనా బ్రిడ్జి నిర్మిస్తే బెళుగుప్ప వెళ్లొచ్చని, అటు నుంచి జిల్లా కేంద్రమైన అనంతపురం వెళ్లొచ్చని ప్రజలు చెప్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే వంకలు పారితే ఎటూ వెళ్లలేక దేవుడిపై భారం వేసి గడిపిన రోజులెన్నో ఉన్నాయని ప్రజలు నిట్టూరుస్తున్నారు. వంకలు పారితే స్కూళ్లకు సెలవే.. వంకలు పారితే పాఠశాలలు, గ్రామ సచివాలయా లు, ఆరోగ్య ఉపకేంద్రాల్లో పని చేసే ఉద్యోగులు గ్రామంలోకి చేరుకోలేరు. పాఠశాలలకు వెళ్లాల్సిన ఉపాధ్యాయులు అనంతపురం నుంచి హనకనహళ్కు అద్దె జీపుల్లో రోజూ వచ్చి వెళ్తుంటారు. ఉదయం విధులకు రావడం.. సాయంత్రం ఇళ్లకు వెళ్లడం పరిపాటి. ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాలతోపాటు హైస్కూల్ కూడా ఉంది. వంకలొస్తే స్కూల్‌కు కూడా హాలిడేనే. సచివాలయ, ఆరోగ్య ఉపకేంద్రాల్లో పని చేసే ఉద్యోగుల పరిస్థితి కూడా అంతే. గ్రామాన్ని చుట్టుముట్టిన వరదనీరు భారీ వర్షంతో పొంగిపొర్లుతున్న వంకలు స్తంభించిన రాకపోకలు వానొచ్చిందంటే ఓ వైపు ఆనందం.. మరోవైపు ఆందోళన దయనీయ స్థితిని గడుపుతున్న గ్రామస్తులు -
‘స్థానిక’ ఎన్నికలు సమర్థంగా ఎదుర్కొందాం
ఉరవకొండ: రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ శ్రేణులు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక వీరశైవ కల్యాణ మంటపంలో పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డితో పాటు నియోజకవర్గ పరిశీలకుడు గోవర్దన్‌రెడ్డి, గ్రేటర్ రాయలసీమ అధికార ప్రతినిధి రమణ, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న హాజరయ్యారు. పార్టీ బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు డిష్ సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో 60 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నారు. ఖరీఫ్‌లో రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోయి 80 శాతం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయన్నారు. ఎల్‌నినో వస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరించినా చంద్రబాబు అప్రమత్తం కాకుండా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడంతో రైతులకు ఈ దుస్థితి పట్టిందన్నారు. పంట పెట్టుబడులు తిరిగిరాక కుటుంబ పోషణ భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. గ్రామాల్లో పనులు లేక వ్యవసాయ కూలీలు వలసబాట పట్టారన్నారు. ఐదేళ్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఈక్రాప్ బుకింగ్ చేయించుకున్న రైతులందరికి ప్రీమియం చెల్లించేలా పాలసీ తీసుకొచ్చి, ఐదేళ్లలో ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలోనే 1.05 లక్షల మంది రైతులకు రూ.185 కోట్ల బీమా ప్రీమియం చెల్లించగా పరిహారం రూపంలో రూ.575 కోట్ల లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. పండ్ల తోటలు సాగుచేసే రైతులకూ రూ.లక్షలు బీమా వర్తించిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక బీమా ప్రీమియం రైతులే చెల్లించేలా చేసి వారిని మరింత అవస్థలు పాలుచేశారన్నారు. ఇప్పటికైనా కరువు మండలాలు ప్రకటించి సహా యక చర్యలు చేపట్టాలన్నారు. హంద్రీ–నీవా వెడల్పు పనుల్లో రూ.కోట్లు దోపిడీ చేసిన అధికార పార్టీ నేతలు కనీసం నీటిని జిల్లా రైతులు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.నియో జకవర్గ పరిశీలకుడు గోవర్దనరెడ్డి మాట్లాడుతూ మంత్రి పయ్యావుల కేశవ్ ఎలాంటి అభివృద్ధి చేయకుండా మోసం చేశారన్నారు. వైఎస్సార్ సీపీ గ్రేటర్ రాయలసీమ జిల్లాల అధికార ప్రతినిధి కేవీ రమణ మాట్లాడుతూ పయ్యావుల సహా మంత్రులు హంద్రీ–నీవా పనుల్లో రూ.వెయ్యికోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తులూరు అశోక్, ఎంపీపీలు నరసింహలు, దేవిబాయి, నారాయణరెడ్డి, కరణం పుష్పావతి, వైస్ ఎంపీపీలు ఈడిగ ప్రసాద్, దేవా, పార్టీ రాష్ట్ర నాయకులు బసవరాజు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వ -
●వెళ్లిరావయ్యా.. గణేశా
ఏడు రోజుల పాటు పూజలందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది. యువత కేరింతలు, డీజేలు, బ్యాండు మేళాలు, డప్పు చప్పుళ్లు హోరెత్తాయి. పట్టణం నలువైపులా నుంచి దాదాపు 150 విగ్రహాలను ప్రధాన రహదారుల్లో ఊరేగించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి తెల్లవార్లూ గుడ్డం కోనేరు వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం కొనసాగింది. దాదాపు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. – హిందూపురం టౌన్: -
వీఆర్‌కు వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు
అనంతపురం సెంట్రల్: అనంతపురం వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లుపై బదిలీ వేటు పడింది. వీఆర్‌కు పంపుతూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న కరుణాకర్‌ను వన్‌టౌన్ సీఐగా నియమించారు. ధర్మవరం, పెనుకొండ, జమ్మలమడుగు, బుక్కరాయసముద్రంలో సీఐగా కరుణాకర్ పనిచేశారు. సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. వివాదాలు.. తీవ్ర ఆరోపణలు.. సీఐ వెంకటేశ్వర్లు వ్యవహార శైలి ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వినాయక చవితిని పురస్కరించుకుని అనంతపురంలో కొన్ని రోజుల క్రితం నిర్వహించిన ‘ఆగమన్’ కార్యక్రమం సందర్భంగా అక్కడి వారిపై సీఐ వెంకటేశ్వర్లు చిందులు తొక్కారు. దుర్భాషలాడడంతో పాటు దాడికి పాల్పడినట్లు తెలిసింది. దీనిపై కొంతమంది టీడీపీ నాయకులు పోలీసుస్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఇన్చార్జ్ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇక సీఐ వెంకటేశ్వర్లు పోలీసుస్టేషన్‌లోనూ సిబ్బందిని దుర్భాషలాడేవారని, స్టేషన్ విషయాలు బయటకు పొక్కితే ఒక్కొక్కరి కథ తేలుస్తానంటూ బెదిరింపులకు పాల్పడేవారని తెలిసింది. ఇటీవల స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలు కూడా గాడి తప్పాయి. వన్‌టౌన్ పరిధిలోని శారద నగర్లో కొందరు ఏకంగా ప్రింటింగ్ మిషన్ ఏర్పాటు చేసుకుని నకిలీ నోట్లు తయారు చేస్తున్న వైనం కలకలం సృష్టించింది. విజయవాడ పోలీసులు గుట్టురట్టు చేసేంత వరకూ స్థానిక పోలీసులు దీన్ని గుర్తించలేకపోయారు. మద్యం షాపుల నుంచి నెలవారీ మామూళ్లు, తదితర అంశాలపై కూడా వెంకటేశ్వర్లుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను వీఆర్‌కు పంపుతూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. నూతన సీఐగా కరుణాకర్ -
ఎన్నాళ్లకెన్నాళ్లకు
●జలపాతాల కనువిందు భారీ వర్షాలతో యాడికి మండలంలోని కోనుప్పలపాడు వద్ద కోన, మారడమ్మ జలపాతాలు కళ సంతరించుకున్నాయి. పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. జలపాతాలను చూసేందుకు ప్రజలు తరలి వచ్చారు. పరిసరాల్లో ఉల్లాసంగా గడిపారు. – యాడికి: అనంతపురం అగ్రికల్చర్: మూడు నెలల పాటు జాడలేకుండా పోయిన వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు డీ.హీరేహాళ్, రాయదుర్గం, గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం మినహా 28 మండలాల్లో వర్షాలు కురిశాయి. ఒకే రోజు ఏకంగా 43.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఈ సీజ న్లో ఇదే అత్యధిక సగటు కావడం గమనార్హం. అత్యధికంగా యాడికి మండలంలో 97.6 మి.మీ, నార్పల 86.8, బొమ్మనహాళ్ 80.2, పామిడి 80, తాడిపత్రి 73.4, పెద్దవడుగూరు 72.4 మేర వర్షపాతం నమోదైంది. అలాగే యల్లనూరు 69.6 మి.మీ, ఆత్మకూరు 63.2, గార్లదిన్నె 62.4, ఉరవకొండ 62.2, పుట్లూరు 58.2, వజ్రకరూరు 55.2, బెళుగుప్ప 48.6, గుంతకల్లు 48, పెద్దపప్పూరు 46.8, అనంతపురం రూరల్ 43.6, బుక్కరాయసముద్రం 42.2, గుత్తి 40.4, అనంతపురం అర్బన్ 39.2, రాప్తాడు 34.2, కూడేరు 32.4, శింగనమల 30.4, కళ్యాణదుర్గం 30.2, కుందుర్పి 20.6, కంబదూరు 14.4, శెట్టూరు 10.6, కణేకల్లు 10 మి.మీ మేర వర్షం కురిసింది. ఆగస్టు సాధారణం 111.6 మి.మీ కాగా ప్రస్తుతానికి 49.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఓవరాల్‌గా ఈ సీజన్లో ఇప్పటి వరకు 269.5 మి.మీ గానూ 36.7 శాతం తక్కువగా 170.6 మి.మీ నమోదు కావడం గమనార్హం. సీజన్లో తొలిసారిగా కొన్ని మండలాల్లో వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగి ప్రవహించాయి. ఉపయోగం లేదంటున్న రైతులు.. జిల్లా వ్యాప్తంగా అరకొర తేమలో ఖరీఫ్ కింద సాగు చేసిన 2.57 లక్షల ఎకరాల పంటలు ఇప్పటికే చాలా వరకు ఎండిపోయాయి. అక్కడక్కడా పంటలు తొలగించేశారు. చాలా ఆలస్యంగా కురిసిన ఈ వర్షాలతో ఖరీఫ్ పంటలకు ఎలాంటి ఉపయోగం లేదని రైతులు చెబుతున్నారు. కంది మినహా వేరుశనగ, ఆముదం, పత్తికి ఉపయోగం లేదంటున్నారు. ప్రత్యామ్నాయ పంటలతో పాటు రబీలో పప్పుశనగ సాగుకు కొంత వరకు ఊరటనిస్తాయని చెబుతున్నారు. పశుగ్రాసం, పండ్లతోటలకు ఉపశమనం లభించే అవకాశం ఉందంటున్నారు. విత్తనం కోసం ఎదురుచూపు.. 80 శాతం సబ్సిడీతో 30 వేల క్వింటాళ్ల ప్రత్యామ్నాయ విత్తనాలు పంపిణీ చేస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు వేయి క్వింటాళ్లు కూడా అందివ్వకపోవడంతో సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. నల్లరేగళ్లు కలిగిన 25 మండలాల పరిధిలో రబీ కింద పప్పుశనగ పంట సాగుకు సిద్ధంగా ఉన్నా ఇంకా విత్తన పంపిణీ ఏర్పాట్లు చేయకపోవడంతో వర్షం వచ్చినా ఉపయోగించుకోలేని దుస్థితిలో ఉన్నట్లు రైతులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు ఓ మంచి వర్షం ఒకే రోజు 43.5 మి.మీ భారీ వర్షపాతం నాలుగు మండలాలు మినహా జిల్లా అంతటా వాన -
‘శ్రీరామరెడ్డి’ కార్మికుల నిరవధిక సమ్మె
కూడేరు: కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆదివారం వేకువజామున నుంచి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. స్థానిక పీఏబీఆర్ డ్యాం వద్ద ఉన్న పంప్ హౌస్‌లో మోటార్లను బంద్ చేసి తాగునీటి సరఫరాను నిలిపివేశారు. ఆరు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణభారంగా ఉందని శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొర్రకోడు ఎర్రిస్వామి, కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్‌లో 600 మంది కార్మికులు పని చేస్తున్నామన్నారు. వేతనాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించేదిలేదని స్పష్టం చేశారు. కార్మిక సంఘం నాయకులు నారాయణ స్వామి, రమేష్, వన్నూరు స్వామి, రాజా, నేసే ఎర్రిస్వామి, సుధాకర్ పాల్గొన్నారు. కార్మికులంటే కాంట్రాక్టర్‌కు అలుసా?తాగునీటి సరఫరా పథకంలో చాలీచాలని వేతనాలతో పని చేసే కార్మికులంటే కాంట్రాక్టర్లకు అలుసా అని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు మండిపడ్డారు. ఆదివారం న్యాయపరమైన డిమాండ్ల సాధనకు శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్‌లో పని చేసే కార్మికులు పీఏబీఆర్ డ్యాం వద్ద ఉన్న ప్రాజెక్ట్ పంప్‌హౌస్ వద్ద నిరవధిక సమ్మె చేపట్టారు. వారికి మద్దతుగా వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, సత్యసాయి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి మద్దతు పలికారు. -
వృద్ధురాలి ఉసురు తీసిన మట్టి మిద్దె
యాడికి: మండలంలోని భోగాలకట్ట గ్రామంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలరు మట్టి మిద్దె కూలి అశ్వర్థమ్మ (80) మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన దిద్దే కుంట అశ్వర్థమ్మ, దిద్దేకుంట నారాయణ రెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. నారాయణరెడ్డితోపాటు ఇద్దరు కుమారులు, ఒక కూతురు మృతి చెందగా.. కోడలు కృష్ణవేణి తన ఇద్దరు కుమారులతో కలిసి గ్రామంలో వేరుగా ఉంటోంది. అయితే వృద్ధురాలు అశ్వర్థమ్మ పాడుబడిన సొంతింటిలోనే తలదాచుకునేది. శనివారం రాత్రి కురిసిన వర్షాలకు ఇంటి మట్టి గోడలు, దూలాలు కుప్పకూలాయి. శిథిలాల కింద నలిగి అశ్వర్థమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. ఆదివారం ఉదయం స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ గోపాలుడు, వీఆర్ఓ రంగస్వామి తదితరులు మృతి చెందిన అశ్వర్థమ్మను శిథిలాల నుంచి వెలికితీశారు. డీటీ శ్రీనివాసులు మృతురాలి అంత్యక్రియల కోసం రూ.5 వేలు ఆమె కోడలు కృష్ణవేణికి అందించారు. బోగాలకట్టలో విషాదం -
టైరు మారుస్తుండగా ముంచుకొచ్చిన మృత్యువు
తాడిపత్రి రూరల్: స్థానిక పులిప్రొద్డుటూరు రహదారిపై వ్యాన్ టైరు మారుస్తుండగా.. పాల వ్యాన్ రూపంలో మృత్యువు ముంచుకొచ్చి డ్రైవర్ ఎజ్జాన్‌బాష (46) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అప్గ్రేడ్సీఐ నారాయణరెడ్డి వివరాల మేరకు.. వైఎస్సార్ కడపజిల్లా ఖాజీపేట మండలం సర్వర్ఖాన్పేటకు చెందిన ఎజ్జాన్‌బాష మినీవ్యాన్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన షేక్‌ఖాజా పొగాకు సరుకును బళ్లారికి తరలించేందుకు మినీ వ్యాన్‌ను అద్దెకు మాట్లాడుకున్నాడు. దీంతో శనివారం రాత్రి కర్ణాటక రాష్ట్రం బళ్లారికి బయల్దేరారు. తెల్లవారుజామున పులిపొద్దుటూరు వద్ద రాగానే మినీవ్యాన్ టైరు పగిలిపోయింది. దీంతో వాహనాన్ని రోడ్డువైపు ఆపి ఇండికేటర్లు వేసి ఎజ్జాన్బాషా టైరు మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో గుత్తివైపు నుంచి వచ్చిన శ్రీనిధి పాలడెయిరీ గూడ్స్ వాహనం వేగంగా వచ్చి మినీ వ్యాన్‌ను ఢీకొనింది. ఈ ప్రమాదంలో ఎజ్జాన్బాషాపై గూడ్స్ వాహనం వెనుక చక్రాలు ఎక్కడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో పక్కనే ఉన్న పొగాకు రైతు షేక్ఖాజాకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎజ్జాన్‌బాష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. మృతుడి సోదరుడు హబీబుల్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. తెల్లవారుజామున దొంగతనాలు.. సాయంత్రానికి కటకటాలు అనంతపురం సెంట్రల్: తెల్లవారుజామున మూడిళ్లలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు సాయంత్రానికల్లా కటాకటాల వెనక్కి పంపించారు. వన్‌టౌన్ ఎస్ఐ తిరుపాల్ తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని బోయగేరిలో ఆదివారం తెల్లవారుజామున హరికిరణ్ కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా దొంగ చొరబడ్డాడు. హఠాత్తుగా నిద్రలేచిన వారిని ఇనుపరాడ్డుతో బెదిరించి హరికిరణ్ భార్య మెడలోని బంగారు తాళిబొట్టు గొలుసు, సెల్‌ఫోన్ లాక్కున్నాడు. అలాగే ఎదురుగా ఉంటున్న వినేష్ ఇంట్లోకి చొరబడి సెల్‌ఫోన్, నాగరాజు అనే వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లాడు. బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. రాప్తాడు మండలం చిన్మయనగర్‌కు చెందిన కటిక సాయిప్రసాద్ ఈ దొంగతనాలకు పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. ‘ఎన్న్టీఆర్ మార్గ్’లో ఉన్న అతన్ని అరెస్ట్ చేశారు. దొంగతనం చేసిన వస్తువులన్నీ రికవరీ చేశారు. గూడ్స్ వాహనం ఢీకొని వ్యాన్ డ్రైవర్ దుర్మరణం -
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటుదాం
గార్లదిన్నె: అందరూ ఐకమత్యంతో సాగి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని మర్తాడు క్రాస్ టీ కన్వెన్షన్ హాలులో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్యతో కలిసి పార్టీ శ్రేణులకు ‘అనంత’ దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. అందరూ కలసికట్టుగా కష్ట పడి పనిచేయాలన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంపై వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చేది మన ప్రభుత్వమేని స్పష్టం చేశారు. ప్రజలు కరువు బారిన పడినా ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. జిల్లా రైతులు ఈ ఖరీఫ్‌లో 5.75 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయారన్నారు. కరువు కారణంగా పశు సంపదను కాపాడుకోలేకపోతున్నారన్నారు. శింగనమల నియోజకవర్గంలో లక్షల ఎకరాల్లో చీనీ చెట్లు ఉన్నాయని, కాలువలకు నీరు వదిలితే భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. రాయలసీమకు నీరు రాకుండా చంద్రబాబు, లోకేష్ తీవ్ర అన్యాయం చేస్తున్నారని, శ్రీశైలం నీటిని కోస్తా ప్రాంతాలకు తీసుకెళ్తున్నారని విమర్శించారు. నీటి కోసం రైతులు, ప్రజలు రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు. గెలుపు మనదే: శైలజానాథ్ వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో పోటీ చేయబోతున్నామని, అన్ని చోట్లా గెలుపొందుతామని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో కూటమి నాయకులు వైఎస్ జగన్ ఫొటో తీసివేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఎన్నికల్లో సత్తా చాటి, మళ్లీ అదే చోట వైఎస్ జగన్ నిలువెత్తు ఫొటో ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉండి ఉంటే అన్ని మండలాలకూ నీళ్లు వచ్చేవన్నారు. జగన్ హయాంలో వర్షాలు సకాలంలో కురిసి, పంటలు సమృద్ధిగా పండాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 29న నీటి కోసం మిడ్ పెన్నార్ డ్యాం వద్ద ఆందోళన కార్యక్రమం తలపెట్టామని, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన దుష్ప్రచారం ఉత్తిదేనని తేలిందని, ఇప్పటికై నా వారు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఊరూరా బెల్టుషాపులే.. పార్టీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో అర్హులందరికీ పథకాలు అందాయన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఊరూరా బెల్టుషాపులు వెలిశాయన్నారు. టీచర్ పోస్టులను అనర్హులకు కట్టబెట్టారన్నారు. గ్రామాల్లో తాగు, సాగు నీటి కోసం ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబును వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పడం హాస్యాస్పదమన్నారు. జగన్ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా అమలు చేసి రైతులకు రూ.3.32 వేల కోట్లు ఇచ్చారన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని తేటతెల్లమైన నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పడంతో పాటు తప్పుడు కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణ రెడ్డి, మండల కన్వీనర్ ఎల్లారెడ్డి, పంచాయతీరాజ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సుధాకర్ రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి బచ్చలన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, వాణిజ్య విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, బూత్ కమిటీ నియోజకవర్గ అధ్యక్షుడు ఓబి రెడ్డి, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆంజనేయులు, మేధావుల ఫోరం నియోజకవర్గ అధ్యక్షుడు అనిల్‌కుమార్ రెడ్డి, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లారెడ్డి, కురబ సంఘం ఉపాధ్యక్షుడు అట్టేశీన, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి నారాయణ, పణీంద్ర, చీమల శీన, సుంకిరెడ్డి, ఆదినారాయణ, దేవ, జగన్, లక్ష్మిదేవి, పద్మావతి, సుమలత తదితరులు పాల్గొన్నారు. వచ్చేది మన ప్రభుత్వమే రాయలసీమకు చంద్రబాబు, లోకేష్ తీవ్ర అన్యాయం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
ఆశా కార్యకర్త పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం సిటీ: జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఖాళీగా ఉన్న 26 ఆశా కార్యకర్తల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పట్టణ ప్రాంతాల్లో రెండు పోస్టుల భర్తీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో 24 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులైన మహిళా అభ్యర్థులు ఈ నెల 24లోపు ఆయా పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు https://ananthapuramu.ap. gov.in/ వెబ్‌సైట్‌ను పరిశీలించాలన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కోశాధికారిగా దివాకర్ అనంతపురం అర్బన్: రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కోశాధికారిగా ఆర్ఎన్ దివాకర్‌రావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. విజయవాడలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయనకు రాష్ట్ర కమిటీలో చోటుకల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ కృష్ణమూర్తిని, దివాకర్‌రావును జిల్లా సంఘం నాయకులు గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా దివాకర్‌రావు మాట్లాడుతూ తనకు ఇంతటి బాధ్యత అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సోమశేఖర్, ఉపాధ్యక్షుడు ముక్తియార్, కోశాధికారి పునీత్‌బాబు, డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు నారాయణస్వామి, రాజ్‌కుమార్, ఆదినారాయణ, సూర్యనారాయణ, చంద్రమోహన్, నాయకులు దినేష్, ఉదయ్‌లు పాల్గొన్నారు. ఉత్కంఠ పోరులో వెస్ట్ బెంగాల్ విజయం అనంతపురం: స్థానిక ఆర్డీటీ క్రీడామైదానంలో ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏపీఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో డాక్టర్ తాలిమెరెన్ ఆవో అండర్–19 బాలికల నేషనల్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌లో వెస్ట్‌బెంగాల్, ఒడిశా జట్లు గెలుపొందాయి. ఉదయం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్, వెస్ట్‌బెంగాల్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్‌లో 1–0 గోల్స్ తేడాతో వెస్ట్ బెంగాల్ జట్టు విజయం సాధించింది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన రెండో మ్యాచ్‌లో ఒడిశా, మహారాష్ట్ర జట్లు తలపడ్డాయి. మహారాష్ట్ర జట్టు ఒక గోల్ చేయగా, ఒడిశా జట్టు నాలుగు గోల్స్‌తో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు అనంత క్రీడాగ్రామానికి చేరుకుంటున్నారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లను ఏపీఎఫ్‌ఏ ప్రతినిధులు జి.అనిల్ కుమార్, సురేష్ మక్కె, సురేష్, జి.పవన్ కుమార్, దాసరి మల్లేష్, ఆర్ఎన్ శ్రీనివాస్, ఇర్షాద్ అలీ పరిశీలించారు. అధికారులను దుర్భాషలాడిన వారిపై కేసుబెళుగుప్ప: పీజీఆర్ఎస్లో ఈ.కాంతమ్మ ఇచ్చిన వినతి విచారణ నిమిత్తం గ్రామానికి వెళ్లిన అధికారులను దుర్భాషలాడిన కాలువపల్లి వాసులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివ ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ కాంతమ్మ వినతి విచారణ నిమిత్తం శనివారం గ్రామానికి వెళ్లిన సర్వేయర్ సందీప్, టీడీ గురుబ్రహ్మలపై అదే గ్రామానికి చెందిన బోయ నీలకంఠ, తమ్ముళ్లు సతీష్, ఓబుళపతి తదితరులు దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురి చేశారని సర్వేయర్ ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నేడు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు సెల్: 8977716661కి ఫిర్యాదు చేయాలన్నారు. వినియోగదారులు విద్యుత్ నంబర్‌ను తప్పకుండా తెలియజేయాలని తెలియజేశారు. జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ: అనంతపురం జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని ఉదయం 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు ఫోన్ నంబర్లు 08554–272943, 9154790350కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. -
కార్మికులను కాటేసిన మృత్యుతీగలు
● విద్యుదాఘాతంతో జార్ఖండ్ చెందిన అన్నదమ్ముల దుర్మరణం బుక్కరాయసముద్రం: పొట్టకూటి కోసం జార్ఖండ్ నుంచి జిల్లాకు వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు 11 కేవీ విద్యుత్ లైను పనులు చేస్తూ ఆ తీగలపైనే ప్రాణాలు వదిలారు. ఎల్సీ ఇవ్వడంలో విద్యుత్ లైన్మెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ ఘటన శనివారం బుక్కరాయసముద్రం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... బుక్కరాయసముద్రం మండలం వడియంపేట, రేగడి కొత్తూరు, పొలాల్లో కాంట్రాక్టర్ అమర్నాథ్రెడ్డి 11 కేవీ విద్యుత్ లైను వేసే పనులు చేపడుతున్నారు. ఇతని వద్ద జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ప్రధాన్ భందర (28), అతని తమ్ముడు నానో బాణర (25) ఏడాది కాలంగా కూలి పనులు చేస్తున్నారు. రోజూవారీగా వచ్చిన కూలి డబ్బులు పోగుచేసి స్వగ్రామంలోని తల్లిదండ్రులకు పంపిస్తూ ఉండేవారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రేగడి కొత్తూరు గ్రామంలో రైతుల పొలాల్లో భందర్, బాణర శనివారం విద్యుత్ లైన్లు లాగే పనులు చేస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో వడియంపేట హైవే సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న పొలంలో లైన్ లాగేందుకు సిద్ధమయ్యారు. దీంతో వడియంపేట గ్రామంలో ఎల్సీ ఇవ్వాలని వర్క్ చేయించే అశోక్ లైన్మెన్ వెంకటేష్‌కు ఫోన్ చేశాడు. దీంతో ఆ పొలం పొడరాళ్ల గ్రామం ఫీడర్‌కు వస్తుందని, ఆ ఫీడర్ చూసే వారికి ఫోన్ చేయాలని సూచించాడు. అయితే తాము వర్క్ చేస్తున్న లైన్‌కు ఎల్సీ ఇచ్చారని భావించి భందర్, బాణరలు విద్యుత్ తీగలు లాగేందుకు వైర్లను తాకారు. వెంటనే ఇద్దరూ విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో లైన్మెన్ వెంకటేష్, వర్క్ చేయిస్తున్న అశోక్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటనా స్థలానికి బీకేఎస్ సీఐ సుబ్బరాయుడు చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన భందర్, బాణర -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండుముఖం
● మాజీ మంత్రి సాకే శైలజానాథ్ శింగనమల: ఎల్–నినో ప్రభావం నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం వల్లే పంటలు నీరందక ఎండుముఖం పట్టాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. శనివారం ఆయన శింగనమల మండలం నాగులగుడ్డం, వెస్ట్ నరసాపురం, సోదనపల్లి, ఈస్ట్ నరసాపురం గ్రామాల్లో పంటలను పరిశీలించారు. ఎండిపోతున్న పంటలను చూపుతూ రైతులు కన్నీరు పెట్టడంతో ఆయన చలించిపోయారు. ధైర్యంగా ఉండాలని రైతులకు భరోసా కల్పించారు. అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ పంట చేతికి వచ్చే సమయంలో ఎండిపోవడంతో వారి పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. వర్షాలు పడడమే ఒక సమస్య కాదని, సకాలంలో నీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రైతులకు హామీలు కాదని, వారికి కావల్సింది నీరని అన్నారు. రైతులు చేసిన అప్పులు ఎవరు తీరుస్తారని, వారి కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించారు. హెచ్చెల్సీ దిగువ ప్రాంతాల్లోని రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే పంట నష్ట పరిహారం, పంటల బీమాను రైతులకు అందించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పరంధామరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మన శ్రీరామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తరిమెల వంశీ గోకుల్‌రెడ్డి, నాయకులు కంచిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీనావాసులు నాయక్, భాస్కర్‌రెడ్డి, గురుమూర్తి రెడ్డి, మధు, నారాయణ, జగన్, బండి శ్రీనివాసులు, శివమ్మ, వెంకటరాముడు, రమాదేవి, సరస్వతి, లక్ష్మీదేవి, శంకర్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, రాజు, విజయ్, తిరుపతయ్య, వెంకటనారాయణ, కోటిరెడ్డి, బాలకృష్ణ, అబ్దుల్లా, ఆలీ, గోపాల్, వీరాంజి, చెన్నారెడ్డి, నాగన్న, శ్రీకాంత్‌రెడ్డి, రామకృష్ణ నాయక్ పాల్గొన్నారు. -
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. రైతుకు శాపం
● 5 ఎకరాల్లో మిరప పంట తొలగింపు వజ్రకరూరు: ఆ రైతు ఎన్నో ఆశలతో మిరప పంట సాగు చేశాడు. రూ.లక్షల పెట్టుబడి పెట్టాడు. అయితే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కరెంటు సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడడంతో పంట ఎండుముఖం పట్టింది. దీంతో చేసేదేమి లేక పంటను తొలగించాడు. వివరాలు.. వజ్రకరూరు మండలం పొట్టిపాడు గ్రామానికి చెందిన రైతు రవీంద్రనాథ్‌రెడ్డి తన ఐదు ఎకరాల్లో మిరప పంట సాగుచేశాడు. ఎకరాకు రూ.1.25 లక్షల దాకా పెట్టుబడి పెట్టాడు. 15 రోజులుగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుండడం.. 7 గంటల పాటు రావాల్సిన ఉచిత విద్యుత్ రెండు గంటలు మాత్రమే రావడంతో పంట వాడుముఖం పట్టింది. విద్యుత్ అధికారులను సంప్రదిస్తే మెయిన్ లైన్ సమస్య ఉందంటూ చేతులెత్తేశారు. ఇదే క్రమంలో నెలకొన్న వర్షాభావంతో పంట ఎండిపోయే దశకు చేరుకుంది. దీంతో చేసేదేమీ లేక శనివారం రైతు రవీంద్రనాథ్ రెడ్డి పంటను తొలగించాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరాడు. కరెంటు షాక్‌తో కూలీ మృతి యల్లనూరు: కరెంటు షాక్‌తో కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని తిమ్మంపల్లి వద్ద జరిగింది. ఎస్ఐ రామాంజనేయరెడ్డి తెలిపిన మేరకు.. శనివారం తిమ్మంపల్లి సమీపంలోని ఓ వ్యవసాయ తోటలో మోటారును బయటకు తీసే పనులకు బుక్కాపురం గ్రామానికి చెందిన మునీంద్ర (50) వెళ్లాడు. జీపు సాయంతో మోటారును బయటకు తీస్తున్న సమయంలో మునేంద్ర గమనించకుండా పైపులు పైకి ఎత్తడంతో విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మునీంద్రకు భార్య లక్ష్మిదేవి, పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ రామాంజనేయరెడ్డి కేసు నమోదు చేశారు. యువకుడి బలవన్మరణం అనంతపురం సెంట్రల్: యువకుడు బలవన్మరణం పొందిన ఘటన అనంతపురంలోని సాయినగర్‌లో జరిగింది. టూటౌన్ సీఐ పుల్లయ్య తెలిపిన మేరకు.. సాయినగర్‌కు చెందిన రామ్మూర్తి కుమారుడు భవాని శంకర్ (28) అవివాహితుడు. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై శంకర్ శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ పుల్లయ్య తెలిపారు. ట్రాక్టర్లో తరలిస్తున్న గడ్డి దగ్ధం కుందుర్పి: ట్రాక్టర్లో తరలిస్తున్న గడ్డి దగ్ధమైన ఘటన కుందుర్పిలో జరిగింది. శెట్టూరు మండలం లక్ష్మంపల్లికి చెందిన రామకృష్ణ శనివారం కణేకల్లు నుంచి ట్రాక్టర్లో మొక్కజొన్న గడ్డి తరలిస్తుండగా కుందుర్పిలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలాయి. ఈ క్రమంలోనే మంటలు చెలరేగడంతో గడ్డి కాలిపోయింది. స్థానికులు స్పందించి మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. -
పుస్తకాలు అందుబాటులో ఉంచాలి:కలెక్టర్
అనంతపురం కల్చరల్: నిరుద్యోగులకు అవసరమైన ప్రామాణిక పుస్తకాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని శనివారం కలెక్టర్ తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠకులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసుకోవాలని, ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకుని నిరుద్యోగులలో ఆత్మవిశ్వాసం నింపాలన్నారు. కార్యదర్శి శివప్రసాద్‌తో పాటు డిప్యూటీ లైబ్రేరియన్ కమ్మన్న, ఉద్యోగ సంఘం నాయకులు రవికుమార్, ప్రతాప్‌రెడ్డి, జయరామ్, శ్రీనివాసులు తదితరులు కలెక్టర్‌కు ఇతర శాఖా గ్రంథాలయాల వివరాలందించారు. గడ్డి మందు తాగి యువతి ఆత్మహత్య బుక్కరాయసముద్రం: గడ్డి మందు తాగి యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని కొత్తపల్లిలో జరిగింది. పొలీసులు తెలిపిన మేరకు.. కొత్తపల్లికి చెందిన రాజు, జానకి దంపతుల కుమార్తె అశ్వని (19) తన తల్లితో కలిసి నిత్యం కూలి పనులకు వెళ్తుండేది. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న గడ్డి మందు తీసుకుని గ్రామం బయటకు వెళ్లిన ఆమె.. అక్కడ గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయింది. స్థానికులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి పరిశీలించగా, అప్పటికే అశ్వని మృతి చెందింది. అశ్వని ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మాతాశిశు ఆరోగ్య రక్షణే ధ్యేయం అనంతపురం సిటీ: మాతాశిశు ఆరోగ్య రక్షణే ధ్యేయంగా పని చేయాలని ఐసీడీఎస్ సిబ్బందికి కలెక్టర్ ఓ. ఆనంద్ పిలుపునిచ్చారు. అనంతపురంలోని బరమప్ప వీధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పోషకాహార, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఆరా తీశారు. బాలింతలు, స్థానిక లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. తల్లులు, పిల్లల హిమోగ్లోబిన్ స్థాయిలను తనిఖీ చేయడం, పిల్లల బరువులను ట్రాక్ చేయడం, అంగన్వాడీ కేంద్రం సమగ్ర పనితీరును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆహారంలో తగినంత ప్రొటీన్ ఉండేలా చూసుకోవాలన్నారు. తాజా, స్థానికంగా తయారు చేసిన వేడి భోజనాన్ని తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ సాజిదా బేగం, అనంతపురం అర్బన్ సీడీపీఓ లలితమ్మ, సూపర్వైజర్ హేమలత, అంగన్వాడీ సిబ్బంది, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
కార్మికులను వేధిస్తే బుద్ధి చెప్తాం
శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్టును దోచుకుతింటున్న పెద్దల కబంధహస్తాల నుంచి కాపాడాలని మేం డిమాండ్ చేస్తున్నాం. కార్మికులకు సకాలంలో జీతాలు, ప్రావిడెంట్ ఫండ్లు చెల్లించి ఆదుకోవాలనేది మా ఆకాంక్ష. వేతనాలు ఇవ్వకుండా వేధిస్తూ.. ప్రభుత్వ నిధులను భోంచేస్తూ ప్రాజెక్టును నిర్వీర్యం చేసే పనులకు స్వస్తి పలకకపోతే భవిష్యత్తులో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. –పెన్నోబిలేసు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ -
మద్యం కాదు.. మంచినీళ్లివ్వండి
కళ్యాణదుర్గం రూరల్: ఊరూరా బెల్టుషాపులతో మద్యాన్ని ఏరులై పారిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాగునీటిని అందించడంలో తీవ్రంగా విఫలమైందని మహిళలు ఆగ్రహించారు. కళ్యాణదుర్గం మండలం బోయలపల్లిలో 15 రోజులుగా తాగునీరు అందడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలిపినా పట్టించుకోలేదు. దీంతో గ్రామానికి చెందిన మహిళలు శనివారం ఉదయం ఖాళీ బిందెలు చేతపట్టుకుని ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామంలో 4 బెల్టుషాపులు పెట్టించి మద్యం సరఫరా చేస్తున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు.. తాగునీటి గురించి ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. అనంతరం అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. ‘స్థానిక’ పోలింగ్ కేంద్రాలు 1,594 అనంతపురం న్యూ టౌన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ బూత్‌ల వివరాలను జిల్లా పరిషత్ అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ ఆమోదం లభించిన జాబితాను మీడియాకు వెల్లడించారు. జిల్లాలోని 31 మండలాలలో మొత్తం 450 మండల ప్రాదేశిక సభ్యులను ఎన్నుకోనున్నారు. ఇందుకు గాను జిల్లావ్యాప్తంగా 1,594 పోలింగ్ స్టేషన్లను తుదివిడతగా గుర్తించినట్లు జిల్లా పరిషత్ అధికారులు వివరించారు. -
విషాదం నింపిన వినాయక నిమజ్జనం
● ట్రాక్టర్‌ను ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్ ● బీటెక్ విద్యార్థి మృతి ● 8 మందికి గాయాలు తాడిపపత్రి రూరల్: వినాయక నిమజ్జనం విషాదం నింపింది. మండలంలోని ఆలూరు సమీపంలో ట్రాక్టర్‌ను సిమెంట్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. మరో 8 మంది గాయపడ్డారు. అప్‌గ్రెడ్ సీఐ నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. పట్టణంలోని సున్నపు గేరికి చెందిన నాగరాజు, పద్మావతి దంపతుల కుమారుడు జగదీష్ (20) స్థానిక సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తన స్నేహితులతో కలిసి శుక్రవారం అర్ధరాత్రి ఆలూరు గ్రామ సమీపంలోని నీటికుంటలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసిన అనంతరం ట్రాక్టర్లో తిరుగుపయనయ్యాడు. మార్గమధ్యంలో ఆలూరు వద్ద వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను సిమెంట్ ట్యాంకర్ బలంగా ఢీకొంది. ప్రమాద ధాటికి ట్రాక్టర్ రెండు ముక్కలైంది. ఇంజిన్, ట్రాలీలు రోడ్డు పక్కన బోల్తా పడ్డాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి గాయపడ్డ 9 మందిని 108లో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగదీష్, పవన్, విష్ణువర్దన్, అశోక్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అనంతపురం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ జగదీష్ మృతి చెందాడు. కుమారుడి మృతితో నాగరాజు, పద్మావతి దంపతులు గుండెలవిసేలా రోదించారు. వీరికి మరొక కుమారుడు ఉన్నట్లు తెలిసింది. ప్రమాదానికి కారణమైన తమిళనాడుకు చెందిన డ్రైవర్ మూర్తిపై కేసు నమోదు చేసి సిమెంట్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్, విష్ణువర్ధన్, అశోక్ -
బైకు అదుపుతప్పి వ్యక్తి మృతి
నార్పల: బైకు అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని నల్లపరెడ్డి పల్లి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... మండల పరిధిలోని నల్లపరెడ్డిపల్లికి చెందిన ఆర్.రామ్మోహన్ (52), అతని స్నేహితుడు కృష్ణమూర్తి శుక్రవారం సాయత్రం సొంత పని నిమిత్తం తాడిమర్రి మండలం కునుకుంట్ల గ్రామానికి వెళ్లారు. పని ముగించుకుని తిరిగి బయలుదేరారు. నల్లపరెడ్డి పల్లి సమీపంలో చెరువు కట్ట వద్ద రోడ్డుపై నిలిచిన బురదలో బైకు అదుపుతప్పడంతో ఇద్దరూ కింద పడ్డారు. గ్రామస్తులు ఇద్దరినీ బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించగా, రామ్మోహన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ రామ్మోహన్ కుటుంబాన్ని పోషించేవాడు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రామ్మోహన్ కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళ ఆత్మహత్య తాడిపత్రిటౌన్: తాడిపత్రి పట్టణంలోని ఇందిరా నగర్లో నివాసం ఉంటున్న సునీత (40) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సునీత, విజయ్ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు సంతానం. పెద్దమ్మాయి ఇడుపుల పాయ ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ చదువుతోంది. విజయ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంతకాలంగా సునీత అనారోగ్యంతో బాధపడుతోంది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా నయం కాకపోవడంతో మనోవేదనకు గురైన ఆమె శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ● సునీతకు చికిత్సల నేపథ్యంలో కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయని, దీంతో అప్పుడప్పుడు భార్యాభర్తలు గొడవ పడేవారని స్థానికులు చెబుతున్నారు. అనారోగ్యంతో పాటు కాపురంలో కలహాలతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పేర్కొన్నారు. ఆంధ్ర జట్టుకు భంగపాటు అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏపీఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా సాగుతున్న డాక్టర్ తాలిమెరెన్ ఆవో అండర్–19 బాలికల జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో ఆంధ్ర జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. శనివారం ఉదయం కర్ణాటక, ఏపీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. కర్ణాటక జట్టు క్రీడాకారులు ఆట ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శిస్తూ వచ్చారు. కర్ణాటక జట్టు 7 గోల్స్ సాధించగా, ఏపీ జట్టు ఒక్క గోల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జూటూరు తులసీదాస్‌కు అరుదైన గుర్తింపు యల్లనూరు: జిల్లాకు చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త జూటూరు తులసీదాస్‌కు అరుదైన గుర్తింపు లభించింది. మహారాష్ట్ర రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ రూపొందించిన నాలుగో తరగతి తెలుగు పాఠ్యాంశంలో ఆయన రచించిన ‘సంఘీభావం’ కథను చేర్చారు. బాలసాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న జూటూరు తులసీదాస్ గురుశతకం (2017), అమ్మ నేర్పిన అక్షర గేయాలు (2017), ముత్తెపు చినుకులు (2018), ఎర్రకోటలో తెల్లసిపాయిలు (2019), కాకులు దూరని కారడవి (2019) పేరుతో రచించిన పుస్తకాలు ప్రాచుర్యం పొందాయి. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో పాటు మహారాష్ట్ర పాఠ్యాంశాల్లో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందని మండల ఎంఈఓలు చంద్రశేఖర్, పరమేశ్వరరెడ్డి, శ్రీదేవి, ప్రేమ్ కుమార్‌లు తెలిపారు. -
సరదా కాదు.. సర్వనాశనమే!
పేకాట.. మొదట సరదాగా మొదలవుతుంది. గెలుపు రుచి చూసిన కొద్దీ అత్యాశ పెరుగుతుంది. ఒక్కసారి గెలిచిన డబ్బు.. మళ్లీ ఆడాలనే ఆశను పెంచుతుంది. ఓడిన డబ్బును తిరిగి గెలుచుకోవాలనే ఆలోచన అప్పుల్లోకి నెడుతుంది. చివరకు పిల్లల చదువులు, పెళ్లిళ్లు, కుటుంబ భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బు మొత్తం పేకాటకు పోతుంది. అప్పులు పెరిగి ఆస్తులు అమ్ముకోవడం లేదా కుదవ పెట్టడం జరుగుతోంది. ఈ జూదపు ఉచ్చులో చిక్కుకున్న కుటుంబాలు చివరకు వీధిన పడుతున్నాయి. మరోవైపు ఇదే పేకాట నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ‘కాపలా’కు ఆరుగురు.. ఏర్పాట్లకు నలుగురు ● అనంతపురం రూరల్ మండలానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మకూరు మండలంలోని ఐదు ఎకరాల భూమిని పేకాట కోసం కుదువ పెట్టాడు. ఈయన సుమారు రూ.2 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది. ● అనంతపురం రూరల్ ప్రాంతానికే చెందిన మరో వ్యక్తి పేకాట అప్పులు తీర్చేందుకు కోట్ల రూపాయల విలువైన స్థలాలను విక్రయించాడు. ● ఉరవకొండ మండలానికి చెందిన మరో వ్యక్తి సుమారు 13 ఎకరాల భూమిని కుదవ పెట్టాడు. .... ఇలాంటి బాధితులు ఒకరు, ఇద్దరు కాదు.. అనంతపురం నగరం, ధర్మవరం, ఆత్మకూరు, రామగిరి తదితర ప్రాంతాలకు చెందిన పలువురు ఈ పేకాట ఉచ్చులో చిక్కుకున్నట్లు సమాచారం. వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి.రాప్తాడు రూరల్: రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాల పరిధిలో ఊరికి దూరంగా పేకాట కేంద్రాలు ఏర్పాటు చేసి రోజూ ‘ఆట’ నిర్వహిస్తున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక విడత.. రాత్రి 9 నుంచి అర్ధరాత్రి వరకు మరో విడత ఆట సాగుతోంది. ఒక రోజు ఆట రూ.15 లక్షల వరకు జరుగుతోంది. ఒక్కో కేంద్రంలో 30 మంది వరకు పాల్గొంటున్నారు. రాప్తాడు, అనంతపురం రూరల్, అనంతపురం నగరం, నార్పల, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, ఉరవకొండ తదితర ప్రాంతాల నుంచి జూదరులను తీసుకొస్తున్నారు. కార్లల్లోనే రాకపోకలు ఆటకు వచ్చే వారిని కార్లలో పేకాట కేంద్రం సమీపంలో దింపుతున్నారు. అనంతరం వాహనాలను తిరిగి అనంతపురం పంపించి.. ఆట ముగిసిన తర్వాత ఫోన్ చేస్తే మళ్లీ వచ్చి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశారు. దీంతో పేకాట కేంద్రాల ఆచూకీ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.100కు రూ.10 వడ్డీ! పేకాటలో డబ్బులు అయిపోయినా.. ఆట ఆగకుండా రుణ సౌకర్యం అందుబాటులో ఉంచుతున్నారు. అనంతపురం రూరల్ పరిధిలోని తపోవనానికి చెందిన ఓ వ్యక్తి ఆటగాళ్లకు అప్పులు ఇస్తున్నట్లు సమాచారం. రూ.100కు రోజుకు రూ.10 వడ్డీ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంటే రూ.10 వేల అప్పు తీసుకుంటే చేతికి రూ.9 వేలు ఇచ్చి, తిరిగి రూ.10 వేలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం తీసుకున్న అప్పును అదే రోజు సాయంత్రం వడ్డీతో సహా చెల్లించాలి. ఆ వ్యక్తి ఇప్పటి వరకు ఆటగాళ్లకు భూములు, స్థలాలు, ఇళ్లను కుదువ పెట్టుకుని సుమారు రూ.50 లక్షలకు పైగా అప్పులిచ్చినట్లు సమాచారం. ఊరి బయటే అడ్డాలు రాప్తాడు మండలం బుక్కచెర్ల చెరువు సమీపంలో, అనంతపురం రూరల్ మండలం ముండబండపల్లి ఈరాలమ్మ మాన్లు, నరసనాయనికుంట నల్లగుట్ట, కురుగుంట నుంచి కట్టకిందపల్లికి వెళ్లే మార్గం, కామారుపల్లి నుంచి మదిగుబ్బ వెళ్లే మార్గం తదితర ప్రాంతాల్లో పేకాట కేంద్రాలు నడుస్తున్నాయి. ఊరికి దూరంగా, నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకోవడంతో పోలీసుల కంటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ‘మేజు’తో లక్షల్లో ఆదాయం? పేకాట నిర్వాహకులకు ‘మేజు’ రూపంలో రోజుకు రూ.1.80 లక్షల వరకు ఆదాయం వస్తున్నట్లు సమాచారం. కూలీల ఖర్చులు, ఇతర వ్యయాలు పోగా నిర్వాహకులు రోజుకు పెద్ద మొత్తంలో డబ్బు పంచుకుంటున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. రోజుకు లక్షల రూపాయల ఆట జరుగుతున్నా.. తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నది మాత్రం ఆటగాళ్ల కుటుంబాలేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని బాధితులు, స్థానికులు కోరుతున్నారు. పేకాటతో బతుకు బుగ్గి.. రోజూ రూ.15 లక్షల ‘ఆట’ అప్పులు.. అధిక వడ్డీలు.. ఆస్తుల తాకట్టు రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాల్లో జోరుగా సాగుతున్న పేకాట పేకాట కేంద్రాల వద్ద పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం పది మంది వరకు కూలీలను వినియోగిస్తున్నారు. వారిలో ఆరుగురు కాపలాగా ఉండి కొత్త వ్యక్తులు వచ్చినా, పోలీసులు వచ్చినా వెంటనే సమాచారం చేరవేస్తున్నారు. మరో నలుగురు పేకాటకు అవసరమైన ఏర్పాట్లు చూస్తున్నారు. పట్టలు పరచడం, పేకల కట్టలు అందించడం, తాగునీరు, స్నాక్స్ తదితరాలు సమకూర్చుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో కూలీకి ఒక్కో విడతకు రూ.1,500 చొప్పున చెల్లిస్తున్నట్లు సమాచారం. రెండు విడతలకు కలిపి రోజుకు రూ.3 వేల వరకు అందుతున్నట్లు తెలుస్తోంది. -
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తాచాటాలి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత కణేకల్లు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా ఏంటో చూపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపు నిచ్చారు. కణేకల్లులోని షిర్డీసాయిబాబా కల్యాణ మంటపంలో శనివారం మధ్యాహ్నం కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డితో కలిసి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయవచ్చన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు దౌర్జన్యాలు చేయడానికి ప్రయత్నిస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ఐదేళ్లలో రూ.4.49 లక్షల కోట్లు డీబీటీ– నాన్‌డీబీటీ ద్వారా పేదలకు లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు పాలనలో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి కింద రూ.3వేలు, 50 ఏళ్లకే పింఛన్, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి హామీలు అమలు చేయకుండా ఆయా వర్గాలను వంచించా రన్నారు. అలవిగానీ హామీలు ఇవ్వడం.. తర్వాత ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నారు. రెండున్నరేళ్ల పాలనలో చంద్రబాబు సర్కారు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకొందన్నారు. కార్యక్రమంలో కణేకల్లు, బొమ్మనహళ్ మండలాల కన్వీనర్లు పాటిల్ బ్రహ్మానందరెడ్డి, రామాంజనేయులు, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు గౌని ఉపేంద్రరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఉషారాణి, రాజ్‌కుమార్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆలేరి రాజగోపాల్‌రెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మక్బూల్‌బాషా, పార్టీ జిల్లా కోశాధికారి పాటిల్ నాగిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మారెంపల్లి మారెన్న, కణేకల్లు టౌన్ కన్వీనర్ జీహెచ్‌కే సర్మస్, అనుబంధ సంఘాల నేతలు పైనేటి తిమ్మప్ప చౌదరి, హళ్లి నాగరాజు, ఆదిసద్గురు చంద్రశేఖర్‌రెడ్డి, యండ్రకాయల వన్నూరప్ప, ఆలూరు చిక్కణ్ణ, కోటిరెడ్డి, కెంగుంట రామిరెడ్డి, యర్రగుంట గోవర్ధన్‌రెడ్డి, మందాల క్రిష్ణారెడ్డి, పూలచెర్ల సురేష్ పాల్గొన్నారు. -
ఏఐతో పన్నుల వసూళ్లు సులువు
● కలెక్టర్ ఆనంద్ అనంతపురం సిటీ: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఆదాయ పన్నుల వసూళ్లను సమర్థవంతంగా చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ. ఆనంద్ ఆదేశించారు. అనంతపురంలోని వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ కార్యాలయాన్ని శనివారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీటీడీ నెక్ట్స్‌జెన్ పోర్టల్ పనితీరును కలెక్టర్‌కు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వివరించారు. పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్, రిటర్నుల దాఖలు, పరిశీలన, బకాయిల వసూళ్లు తదితర ప్రక్రియలను సమీకృత డిజిటల్ వేదిక ద్వారా చేపట్టిన విధానాలను ప్రదర్శించారు. వాణిజ్య పన్నుల శాఖలో కీలకంగా వినియోగిస్తున్న మూడు ఏఐ ఆధారిత మాడ్యూళ్ల పనితీరును కలెక్టర్ పరిశీలించారు. జీఎస్టీ బకాయిలు, ఆస్తుల సమాచార మాడ్యూల్ ద్వారా బకాయిపడిన డీలర్ల చర, స్థిరాస్తులకు సంబంధించిన సమాచారాన్ని, వివిధ వనరుల నుంచి సమీకరించి జప్తు చేయదగిన ఆస్తులను గుర్తించే విధానాన్ని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వివరించారు. లీగల్ ఏఐ మాడ్యూల్ పనితీరును కూడా కలెక్టర్ పరిశీలించారు. సంబంధిత చట్ట నిబంధనలు, సర్క్యులర్లు, గత కేసుల చట్టపరమైన తీర్పులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కౌంటర్ అఫిడవిట్లు, ప్రత్యుత్తరాల తయారీలో అధికారులకు ఈ మాడ్యూల్ సహకరిస్తున్న విధానాన్ని గుర్తించారు. జవాబుదారీతనం పెరగాలి ఆదాయ పన్ను బకాయిల వసూళ్లు, న్యాయపరమైన కేసుల పరిష్కారం తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పన్నుల పరిపాలనలో ఏఐ వినియోగం పారదర్శకత, సామర్థ్యం, జవాబుదారీతనాన్ని పెంచే దిశగా కీలక ముందడుగు వేయాలన్నారు. డేటా ఆధారిత విధానాలను సమర్థవంతంగా వినియోగించి ఆదాయాన్ని పెంచాలన్నారు. కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ అనంతపురం సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ పి.మౌనిక, అసిస్టెంట్ కమిషనర్ కె.రాకేష్, కళ్యాణదుర్గం అసిస్టెంట్ కమిషనర్ బి.సునీత, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కలెక్టర్‌కు జెడ్పీ పగ్గాలు
● జెడ్పీ, మండల పరిషత్‌లో ప్రత్యేక అధికారుల పాలనకు శ్రీకారం అనంతపురం న్యూ టౌన్: జిల్లా పరిషత్, మండల పరిషత్తుల పాలక మండళ్ల పదవీకాలం ముగియనుండడంతో ప్రత్యేక అధికారుల పాలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు శనివారం రెండు ప్రత్యేక జీవోలను విడుదల చేసింది. ప్రభుత్వ ఉత్తర్వు 128 మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 63 మండల ప్రజా పరిషత్తు ప్రత్యేక పరిపాలన అధికారులను నియమించనున్నారు. ఈ ప్రత్యేక అధికారులు కొత్తగా ఎన్నికయ్యే పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించే వరకు మండల ప్రజా పరిషత్ అధికారాలు, విధులను నిర్వహించాల్సి ఉంటుంది. మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, మండల ప్రాదేశిక సభ్యుల పదవీకాలం ఈ నెల 23వ తేదీన ముగియనుంది. కొత్తగా ఎన్నికలు జరిగేంత వరకు మండల స్థాయిలో ప్రభుత్వ పాలన ఆగిపోకూడదని పంచాయతీరాజ్ చట్టం చెబుతోంది. ప్రభుత్వం ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించాల్సి ఉంటుంది. మండల ప్రత్యేక అధికారి బాధ్యతలను ఎంపీడీవోలకు అప్పగిస్తారా లేక కొత్తగా మరెవరినైనా నియమించాలా అనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. 24న ముగియనున్న పాలక పదవీకాలం అనంతపురం జిల్లా పరిషత్ పాలక మండలి పదవీ కాలం ఈనెల 24వ తేదీన ముగియనున్నది. ఆ తర్వాత జెడ్పీ పాలన ప్రత్యేక అధికారుల చేతుల్లోకి మారనుంది. ఈ మేరకు కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీఓ 129ని విడుదల చేసింది. ఆరు నెలల పదవీ కాలానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతలోపుగా మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్ల జాబితా, ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పేపర్ల సామగ్రి, బ్యాలెట్ బాక్సుల కూర్పు తదితర ఎన్నికల వ్యవహారాలన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు అనువుగా జిల్లా, మండల స్థాయి అధికారులు తలమునకలై ఉన్నారు. 54 మంది బీఎల్ఓలకు షోకాజ్ అనంతపురం ఎడ్యుకేషన్: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ఫేజ్–2లో హియరింగ్ నోటీసులను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను సకాలంలో పూర్తి చేయకుండా పెండింగ్‌లో ఉంచిన 54 మంది బూత్ లెవల్ అధికారు(బీఎల్ఓ)లు, సూపర్వైజర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. 50 రోజులు గడిచినా ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంతో అనంతపురం అర్బన్ ఓటరు నమోదు అధికారి, ఆర్డీఓ ప్రేమంత్ కుమార్ శనివారం నోటీసులు జారీ చేశారు. ఎస్ఐఆర్ ఫేజ్–2 హియరింగ్ నోటీసుల ఆన్లైన్ ప్రక్రియలో అనంతపురం నియోజకవర్గం రాష్ట్రంలో అత్యధిక పెండింగ్ ఉన్న నియోజకవర్గాల్లో రెండో స్థానంలో, జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సంబంధిత బీఎల్ఓలు, సూపర్వైజర్లను ఫోన్ ద్వారా సంప్రదించినా పనిలో ఆశించిన పురోగతి కనిపించకపోవడంతో షోకాజ్ జారీ చేశారు. నోటీసు అందుకున్న వారు రెండ్రోజుల్లోగా, అంటే ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆర్డీఓ కార్యాలయంలో సంజాయిషీ సమర్పించాలని ఆదేశించారు. అలాగే మిగిలిన పెండింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గడువులోగా సంజాయిషీ ఇవ్వకపోయినా, పెండింగ్ పనులను పూర్తి చేయకపోయినా క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌కు నివేదిక పంపుతామని ఆర్డీఓ హెచ్చరించారు. -
కాలువ మట్టి.. కొల్లగొట్టి
● బీటీపీ కాలువ పనుల్లో దోపిడీ ● రాత్రికి రాత్రే తరలిస్తున్న ‘పచ్చ’ నేతలు ● మట్టి రవాణాను అరికట్టని అధికారులు ● మైనింగ్ చట్టాల ప్రకారం కాలువ తవ్వకాల మట్టిని కాంట్రాక్టర్ సొంత పనులకు తరలించకూడదు. విక్రయించకూడదు. నిర్దేశించిన ప్రభుత్వ స్థలంలోనే డంప్ చేయాలి. ● అదేవిధంగా మట్టిని తరలించాలంటే ప్రభుత్వానికి నిర్ణయించిన సీనరేజ్ రుసుం చెల్లించి అనుమతి పత్రాలు పొందాలి. ● కాలువ నిర్మాణాల కోసం తవ్విన మట్టిని తరలించాలంటే సంబంధిత ఆర్డీఓ/ తహసీల్దార్ వద్ద నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) తప్పనిసరి. ● మట్టి తరలించే వాహనానికి మైనింగ్ శాఖ జారీ చేసిన వేబిల్లు తప్పనిసరిగా ఉండాలి. ● ఈ బిల్లులో మట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు. ఎంత పరిమాణం ఉందో స్పష్టంగా ఉండాలి. ● ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మట్టి తరలించాలి. కళ్యాణదుర్గం: బీటీపీ (భైరవానితిప్పప్రాజెక్టు) కాలువ పనుల పేరుతో మట్టి దోపిడీ అడ్డూఅదుపు లేకుండా సాగుతోంది. రాత్రివేళ్లల్లో యథేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమ రవాణా స్థానికంగా చర్చనీయాంశమైంది. జీడిపల్లి నుంచి భైరవానితిప్ప ప్రాజెక్టు వరకు కాలువ తవ్వకం పనులు సాగుతున్నాయి. కాలువ కోసం తీసిన మట్టిపై అధికార టీడీపీ నాయకులు కన్ను పడింది. సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ కంపెనీ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే టిప్పర్ల ద్వారా కాలువ మట్టిని తరలించుకుపోతోంది. ఇదే అదనుగా పలువురు ‘పచ్చ’ నేతలు భారీ మొత్తంలో ప్రైవేట్ భూముల్లో డంప్ ఏర్పాటు చేసుకుని.. గుట్టుగా అమ్ముకుంటున్నారు. మరికొందరైతే ఏకంగా పొలాలకు, రస్తాలకు కూడా కాలువ మట్టిని వినియోగించుకోవడం కొసమెరుపు. రూ.లక్షల్లో మట్టి దోపిడీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం– అనంతపురం ప్రధాన రహదారి ఒంటిమిద్ది వద్ద, కళ్యాణదుర్గం– బెంగళూరు ప్రధాన రహదారి నారాయణపురం వద్ద బీటీపీ కాలువ పనుల నిర్మాణాల కోసం తవ్విన మట్టిని రాత్రికి రాత్రే ‘తమ్ముళ్లు’ అక్రమంగా రవాణా చేస్తున్నారు. 30 టన్నుల సామర్థ్యం కలిగిన టిప్పర్ల ద్వారా మట్టిని తరలించేస్తున్నారు. ఇలా పదుల సంఖ్యలో టిప్పర్లను పెట్టి రూ.లక్షల్లో మట్టి దోపిడీ చేస్తున్నారు. చోద్యం చూస్తున్న అధికారులు నిబంధనల ప్రకారం ప్రభుత్వ పరిధిలోని మట్టిని తరలించాలన్నా, వినియోగించాలన్నా సంబంధిత మైనింగ్, రెవెన్యూ శాఖల అనుమతులు తప్పనిసరి. కానీ కళ్లముందే ఇంత పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రతిపక్షం, ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికై నా బీటీపీ కాలువ మట్టి అక్రమ రవాణాను అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరుతున్నారు. ఇవీ నిబంధనలు... ఇక్కడ కనిపిస్తున్న మట్టి దిబ్బలు కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి సమీపంలోనివి. పక్కనే ఒంటిమిద్ది వద్ద బీటీపీ కాలువ పనులు జరుగుతున్నాయి. ఓ టీడీపీ నాయకుడు తనకున్న పలుకుబడితో రాత్రికి రాత్రే కాలువ మట్టి అక్రమ రవాణాతో దోపీడికి తెరలేపాడు. అనంతపురం ప్రధాన రహదారి పక్కనే ప్రైవేట్ పొలంలో మట్టిని నిల్వ ఉంచాడు. దీని విలువ సుమారు రూ.5 లక్షలకు పైగానే ఉంటుంది. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గుత్తి: పట్టణ శివారులోని కర్నూలు రోడ్డు కోళ్లఫారం సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బెస్త శ్రీరాములు (38) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బెస్త వీధికి చెందిన శ్రీరాములు, రామలక్ష్మి దంపతులకు కుమారుడు, కుమార్తె కర్నూలు రోడ్డులోని మహర్షి దయానంద గురుకుల పాఠశాలలో ఏడు, ఐదో తరగతి చదువుతున్నారు. శ్రీరాములు పిల్లలను పిలుచుకొని రావడానికి స్కూటీపై బయల్దేరాడు. మార్గంమధ్యలో స్కూల్ వ్యాన్ ఢీకొనింది. స్కూటీ రోడ్డు పక్కకు ఎగిరి పడింది. రోడ్డుపైనే శ్రీరాములు పడి మృతి చెందాడు. భర్త మరణ వార్త విని భార్య రామలక్ష్మి, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్ పరారీ అయ్యాడు. ఘటనపై సీఐ రామారావు కే సు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలతో భర్త హత్య కళ్యాణదుర్గం రూరల్: మండలంలోని చాపిరి గ్రామంలో భర్తను భార్య హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...నారాయణపురం గ్రామం నుంచి చాపిరి గ్రామానికి బతుకుదెరువు కోసం వచ్చిన నాగరాజు, రత్నమ్మ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈమధ్య కాలంలో నాగరాజు తాగుడుకు బానిసయ్యాడు. తరుచూ భార్యాభర్తలు తగువు పడుతుండేవారు. గురువారం రాత్రి భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. గొడవ సద్దిమణిగిన తర్వాత ఒక్కసారిగా భార్య రత్నమ్మ భర్త నాగరాజుపై కర్రతో తలపై బాదింది. ఈ దాడిలో గాయపడిన నాగరాజును స్థానికులు వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతూ నాగరాజు శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ గంగాధర్ తెలిపారు. డీపీఓ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఖాళీగా ఉన్న జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ (టీఎంఎఫ్) పోస్టును ఔట్సో ర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ అయ్యూబ్ హుస్సేన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నెలకు రూ.25 వేల వేతనం చెల్లిస్తారు. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హతతో పాటు తెలుగు, ఇంగ్లిష్ భాషలపై మంచి పట్టు, సమర్థవంతమైన సంభాషణ నైపుణ్యాలు, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. విద్యాశాఖ లేదా ఇంటర్మీడియట్ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన అసిస్టెంట్ డైరెక్టర్లు, సూపరింటెండెంట్లకు ప్రాధాన్యం ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన, ప్రతిభా పరీక్ష, మౌఖిక ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నెల 22లోపు దరఖాస్తులు సమర్పించాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన బయోడేటాతో పాటు విద్యార్హత, అనుభవ ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని డీఈఓ సూచించారు. విద్యుదాఘాతంతో మహిళా రైతుకు తీవ్ర గాయాలు గుత్తి రూరల్: మండలంలోని టి.కొత్తపల్లిలో శుక్రవారం విద్యుదాఘాతంతో నాగలక్ష్మి అనే మహిళా రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన ఆదిశేషులు, నాగలక్ష్మి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నాగలక్ష్మి గ్రామ శివారులోని పంటకు నీరు పెట్టేందుకు వెళ్లింది. వ్యవసాయ బోరు స్విచ్ ఆన్ చేస్తున్న క్రమంలో స్టార్టర్ బాక్సు వద్ద తెగి ఉన్న తీగ తగిలి ఆమె షాక్‌కు గురైంది. ఈ ప్రమాదంలో సొమ్మసిల్లి పడి అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్సలకు అనంతపురానికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత ఆత్మహత్య గార్లదిన్నె: బూదేడుకు చెందిన ఓ వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. శుక్రవారం పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన అనూష (30) గత బుధవారం ఇంటి వద్ద విషద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్థితిలో ఉండగా ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతిచెందింది. మృతు రాలికి కొడుకు,కుమార్తె ఉన్నారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. -
10 మండలాల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్: చాన్నాళ్ల తర్వాత జిల్లాలో అక్కడక్కడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 10 మండలాల పరిధిలో 3.4 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. పెద్దవడుగూరులో 42.6 మి.మీ మేర వర్షం కురిసింది. శింగనమల 20 మి.మీ, నార్పల 18.6 మి.మీతో పాటు కూడేరు, గుత్తి, యల్లనూరు, బ్రహ్మసముద్రం, అనంతపురం రూరల్, యాడికి, పెద్దపప్పూరు మండలాల్లో తేలికపాటి నుంచి తుంపర్లు పడ్డాయి. కాగా అక్కడక్కడా బలమైన గాలులు వీయడంతో ఆత్మకూరు మండలం సనపలో 15 మంది రైతులకు చెందిన 45 ఎకరాల అరటి తోటలు నేలవాలడంతో రూ.50 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. దీనిపై ఉద్యానశాఖ అధికారులు ప్రాథమిక అంచనాలు వేసినట్లు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాగల నాలుగు రోజులూ వర్షం పడే సూచనలు ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి, రీసెర్చ్ అసోసియేట్ కె.పావని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం జిల్లాలో 19న 6.3 మి.మీ, 20న 8.8 మి.మీ, 21న 10 మి.మీ, 22న 10.1 మి.మీ, 23న 6 మి.మీ మేర సగటు వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొన్నారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలో 19న 6.4 మి.మీ, 20న 16 మి.మీ, 21న 8 మి.మీ, 22న 10 మి.మీ, 23న 8.8 మి.మీ మేర వర్షం పడే సూచన ఉందన్నారు. -
మైనార్టీల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయాలి
అనంతపురం అర్బన్: మైనార్టీల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయాలని శాసనసభ మైనార్టీల సంక్షేమ కమిటీ చైర్మన్ మహమ్మద్ నసీర్ అహమ్మద్ జిల్లా అధికారులకు సూచించారు. మైనార్టీల కోసం చేపట్టిన కార్యక్రమాలపై చైర్మన్ శనివారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ కలిసి అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైనార్టీల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా? అనే అంశాలను పరిశీలించడమే కమిటీ ఉద్దేశమన్నారు. రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక ప్రకారం ముస్లిం మైనార్టీలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. సమాజంలో విద్య ద్వారానే మార్పు సాధ్యమవుతుందన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, వాటి ద్వారా ఆదాయ వనురల పెంపు, మసీదుల ఇమామ్‌లు, మౌజమ్ల గౌరవ వేతనం తదితర అంశాలపై కమిటీ సమీక్షించిందన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలోని కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్లేలా ప్రతి అధికారి కృషి చేయాలన్నారు. అనంతరం కమిటీ చైర్మన్, సభ్యులను కలెక్టర్ సన్మానించారు. సమావేశంలో కమిటీ సభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఇషాక్‌బాషా, సుందరపు విజయ్‌కుమార్ ఖాజీ యాకూబ్‌బాషా, కమిటీ సెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, కమిటీ అదనపు కార్యదర్శి ఈశ్వరరావు, మైనార్టీ సంక్షేమ శాఖాధికారి రామసుబ్బారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
దళితులంటే సునీతమ్మకు నచ్చదా?
ఆత్మకూరు: దళితులంటే పరిటాల సునీతకు నచ్చదా? అంటూ గొరిదిండ్లకు చెందిన దళిత మహిళలు ఎమ్మెల్యే సునీతపై పెద్ద ఎత్తున మండిపడ్డారు. శుక్రవారం ఆత్మకూరులో గొరిదిండ్ల దాడి విషయంలోని బాధితులు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు సీపీ ఆలమూరు ఓబులేసు, దళిత మహిళలు మాట్లాడుతూ గొరిదిండ్లకు అనూష తన భర్త, తండ్రిని కోల్పోయి ఉన్న ఒక్క కూతురిని చూసుకోవడానికి వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటే అదే గ్రామానికి చెందిన అక్కులప్ప అనే వ్యక్తి అనూష పట్ల అనుచితంగా ప్రవర్తించి, అత్యాచార యత్నం చేశాడన్నారు. బుధవారం రాత్రి అక్కులప్ప మధ్యం తాగి అనూషను కత్తితో పొడవగా, తీవ్రంగా గాయపడిందన్నారు. అనూషపై దాడిని అడ్డుకోబోయిన హరీష్‌కుమార్, మహేంద్ర, శివానందను గొడ్డలితో దాడి చేశారన్నారు. ప్రస్తుతం వారు అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. దాడి చేసిన వారిపై అక్కులప్ప, మధు, సోమశేఖర్, రామాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేవలం అక్కులప్పపై కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుకున్నారన్నారు. మిగిలిన వారిని టీడీపీ నాయకుడు బాలాజీ ఎమ్మెల్యే సునీత ఇంట్లో దాచిపెట్టారన్నారు. కక్షలను పెంచి పోషిస్తున్న ఎమ్మెల్యే సునీత.. నియోజకవర్గంలో మహిళల పట్ల ఎన్ని దాడులు జరిగినా ఎమ్మెల్యే సునీత మాత్రం పట్టించుకోలేదని గ్రామానికి చెందిన దళిత నాయకులు అన్నారు. పరిటాల సునీత ఎప్పుడు అధికారంలోకొచ్చినా ఎస్సీలపైనే దాడులు జరుగుతున్నాయన్నారు. హోంమంత్రిగా దళిత మహిళ ఉన్నా.. మహిళలపై దాడులు పెచ్చుమీరుతున్నాయన్నారు. టీడీపీ అధికారం వచ్చిన తర్వాత ప్రజలు ఊర్లు విడిచే పరిస్థితి వచ్చిందన్నారు. నలుగురిపై కేసులు నమోదు చేయకపోతే పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని బాలాజీ ఎవరి పేరు చెబితే వారిపైన మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారని, ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మండల కన్వీనర్ బాల పోతన్న, యూత్ కన్వీనర్ కొండారెడ్డి,మాజీ డీసీసీబీ డైరెక్టర్ వాసుదేవరెడ్డి, లక్ష్మిరెడ్డి, గొరిదిండ్ల నరసింహ, రమేష్, కేశవరెడ్డి, మాధన్న, గోవింద్ , ఆదినారాయణ, లక్ష్మి, అఖిల, లలితమ్మ, సంగమ్మ,రామక్క,లక్ష్మక్క, ముత్యాలక్క,నారాయణమ్మ,కుంటెమ్మ,నాగమణి, శాంతమ్మ, కుళ్లాయప్ప, పెద్దన్న పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో భూరికార్డుల ట్యాంపరింగ్
● డీఆర్ఓ ఫిర్యాదుతో కేసు నమోదు అనంతపురం అర్బన్: తాడిపత్రిలోని ఓ భూమికి సంబంధించి కలెక్టరేట్లోని ల్యాండ్ సీలింగ్ రిజిష్టర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ట్యాంపరింగ్ చేశారు. డీఆర్ఓ మలోల ఫిర్యాదు మేరకు అనంతపురం వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఐపీసీ466, 468/బీఎన్ఎస్ 336 (3), 337 కింద కేసు నమోదు చేశారు. తాడిపత్రి మండలం తాడిపత్రి గ్రామ సర్వే నంబరు 770–ఇ2, సీసీ నంబరు 2963/75 ఉండగా... సంబంధిత ఎంట్రీలో సర్వే నంబరు 709–ఇ2, సీసీ నంబరు 2968/75గా మార్పు చేసినట్లు గుర్తించారు. ఈ మార్పుల ఆధారంగా గతంలో అనంతపురం భూ సంస్కరణల విభాగం ప్రత్యేక తహసీల్దారు 2023 మే 9న సంబంధిత భూమి ల్యాండ్ సీలింగ్ చట్టం పరిధిలోకి రాదని ఎండార్స్మెంట్ ఇచ్చినట్లు... అలాగే ఈ ఏడాది మార్చి 16న తాడిపత్రి తహసీల్దారుకు పంపిన లేఖలో సర్వే నంబరు 770–ఇ2లో 2.40 ఎకరాల భూమి సంబంధిత రిజిష్టర్‌లో నమోదు కాలేదని పేర్కొన్నట్లు దర్యాప్తులో తేలింది. గతంలో కలెక్టర్ విచారణ.. ఈ వ్యవహారంపై కలెక్టర్ ఆనంద్ గతంలో స్వయంగా విచారణ చేసి ల్యాండ్ సీలింగ్ రిజిష్టర్‌లోని నమోదులో మార్పులు జరిగినట్లు గుర్తించారు. తహసీల్డారు కార్యాలయం ల్యాండ్ సీలింగ్ రిజిష్టర్‌లో 17, 18 పేజీలు లేకపోవడం, 1–బి రిజిష్టర్, అడంగల్‌లో డి.పట్టాగా నమోదు ఉండడం, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో సీలింగ్ ల్యాండ్ ప్రస్తావన ఉండడం, ఆర్డీఓ కార్యాలయంలోని ల్యాండ్ సీలింగ్ రిజిష్టర్‌లో సీసీ నంబరు 2963/75 తాడిపత్రి కింద సర్వే నంబరు 770–ఇ2లో 2.40 ఎకరాలు సంబంధించిన నమోదు ఉండడాన్ని కలెక్టర్ గుర్తించారు. ఇందుకు తాడిపత్రి ఇన్చార్జ్ తహసీల్దార్ సోమశేఖర్, ఎంఆర్ఐ ఈశ్వర్‌రెడ్డి, వీఆర్ఓ వెంకటస్వామి, జూనియర్ అసిస్టెంట్ షఫీలను బాధ్యులను చేస్తూ గత నెల 17న సస్పెండ్ చేశారు. ఆర్డీఓ కార్యాలయం డీఏఓ కుల్లాయప్పకు, డీటీ రాజేంద్రప్రసాద్‌కు, కలెక్టరేట్ భూ రికార్డుల విభాగం జూనియర్ అసిస్టెంట్ పవన్‌కుమార్‌కు చార్జ్‌మెమో ఇచ్చారు. -
ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య
కుందుర్పి: మండలంలోని రుద్రంపల్లికి చెందిన బోయ హరికృష్ణ (22) జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు.. బోయ బొమ్మిరెడ్డి రెండో కుమారుడు హరికృష్ణ తాగుడుకు బానిసయ్యాడు. జులాయిగా తిరిగేవాడు. కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం తాగుడు మానేయాలని మందలించారు. దీంతో మనస్థాపం చెందిన హరికృష్ణ.. గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పశువుల కాపర్లు విషయాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో తండ్రి బొమ్మిరెడ్డి ఫిర్యాదు మేరకు కుందుర్పి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతోనే మనుగడ అనంతపురం న్యూ టౌన్: పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్య మని వక్తలు స్పష్టం చేశారు. శుక్రవారం నగరంలోని ఉపాధ్యాయ భవన్లో భవన్లో జిల్లాస్థాయి పర్యావరణ వర్క్‌షాప్ నిర్వహించారు. జిల్లా స్థాయిలోని గ్రీన్ టీచర్లు, విద్యార్థులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ క్రాప్స్ రాష్ట్ర కోఆర్డినేటర్ నీలకంఠ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. నీటి సంరక్షణ చర్యలను చేపడుతూనే, ప్లాస్టిక్ వినియోగం గణనీయంగా తగ్గించినప్పుడే ప్రకృతిలో పర్యావరణం సాధ్యమవుతుందన్నారు. ఉపాధ్యాయులందరూ విధిగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎన్జీసీ జిల్లా కోఆర్డినేటర్ కావూరి విజయ్‌కుమార్, అనంతపురం క్లస్టర్ కోఆర్డినేటర్ రవికుమార్, శైలజ, ప్రేమనాథరెడ్డి, అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లుకు చెందిన ఉపాధ్యాయులు, 16 మండలాల పర్యావరణ పరిరక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 21 నుంచి జిల్లావ్యాప్తంగా కరువు దీక్షలు అనంతపురం అర్బన్: జిల్లా వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి 23 వరకు కరవు దీక్షలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జగదీష్ మాట్లాడుతూ ఎల్నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయకుడు కరువుపై చర్చించకపోవడం బాధాకరమన్నారు. రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించడం లేదన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గసభ్యుడు జాఫర్, సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సంజీవప్ప, రామకృష్ణ, కేశవరెడ్డి, గోపాల్, టి.నారాయణస్వామి, పద్మావతి పాల్గొన్నారు. నిమజ్జనంలో కత్తులతో దాడి అనంతపురం సెంట్రల్: నగరంలో ఇందిరానగర్‌లో వినాయక నిమజ్జనంలో ఇద్దరు యువకులు కత్తులతో దాడి చేసుకున్నారు. అనిల్‌కుమార్ అనే యువకుడిపై వినయ్ అనే యువకుడు కత్తితో ఛాతీలో పొడిచాడు. దీంతో నిమజ్జన వేడుకలో ఒక్కసారి కలకలం రేగింది. తీవ్రంగా గాయపడిన అనిల్‌కుమార్‌ను క్షతగాత్రులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. త్రీటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కరువు చిత్రం.. కన్నీటి కష్టం
శింగనమల/గుత్తి రూరల్: ఆరుతడి పంటలపై ఆశలేదు.. పచ్చని పంట పొలాలున్నా ఫలితంలేదు.. పంట పొలాలు బీటలు వారాయి.. పచ్చని పైర్లు నిలువునా నెర్రెలు చీలాయి.. వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేసిన పంటలు కళ్లెదుటే నిలువునా ఎండిపోతుంటే.. కనుచూపు మేర ఎడారి ఛాయలు కనిపిస్తుంటే.. చూడలేక.. ఉండలేక ఆరుగాలం కష్టించే అన్నదాత దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.. ఇంతటి దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నా.. కనీసం వ్యవసాయానికి సాగునీరు అందలేదు.. సాయం అందించలేదు.. రైతు సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం.. రైతుల గురించి ఆలోచన కూడా చేయలేదని నిట్టూరుస్తున్నారు. శింగనమల నియోజకవర్గం ఉద్యానతోటలకు ప్రసిద్ధి. కానీ నేడు భూగర్భజలం అడుగంటిపోవడంతో రైతులు దిక్కు తోచక విలవిల్లాడుతున్నారు. శింగనమల మండలం నాగులగుడ్డం తండాలో రైతు రాముడు నాయక్‌కు ఎనిమిదెకరాల పొలం ఉంది. చీనీపంటలు, ఇతర పంటల సాగుకోసం ఎనిమిది బోరుబావులు తవ్వాడు. నాలుగు బోర్లలో నీరు వస్తుండేది. కానీ అందులో రెండు బోర్లలో భూగర్భజలాలు అడుగంటాయి. మరో రెండు బోర్లలో మాత్రమే నీరు వచ్చేది. దీంతో పంటలకు నీరుచాలకపోవడంతో చుట్టుపక్కల ఉన్న రైతుల బోరుబావుల నుంచి ట్యాంకర్ల ద్వారా తెప్పించుకొని చీనీచెట్లను బతికించుకోవడానికి అష్టకష్టాలు పడ్డాడు. అయితే ట్యాంకర్లకు కూడా నీరు సరిపడా అందక దిక్కుతోచని స్థితిలో చీనీచెట్లను వదిలేయాల్సి వచ్చింది. గ్రామంలోని రైతులు కూడా తాగు, సాగు నీటి కోసం ఇక్కట్లు పడుతూనే ఉన్నారు. నాగులగుడ్డం తండాలో రైతు మూడ్ రాముడు నాయక్ తోటలో ఎండిపోయిన చీనీ చెట్లు, శ్రీపురంలో వేరుశనగ పంటను దున్నేస్తున్న రైతు శ్రీపురం వద్ద ఎండిన వేరుశనగ పంట.. గుత్తి మండలంలోని శ్రీపురంలో గోవిందు అనే రైతు ఖరీఫ్ సీజన్లో ఎంతో ఆశతో ఈ ఏడాదైనా దిగుబడి వస్తుందని మూడున్నర ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశాడు. విత్తనం వేసినప్పటి నుంచి సరైన వర్షాలు లేవు. పంట ఎండుముఖం పట్టింది. ఇక వర్షం రాదు.. చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆదుకోదని భావించాడు. దిక్కుతోచని స్థితిలో పశువుల మేత అయినా దక్కుతుందేమోనని భావించి వేరుశనగ పంటను శుక్రవారం దున్నేశాడు. ప్రస్తుతం మార్కెట్లో ట్రాక్టర్ వరిగడ్డి రూ.25 వేలు పలుకుతోంది. దీంతో రైతులు అంత ధరపెట్టి కొనుగోలు చేసే శక్తి లేక నష్టం అని తెలిసినా కూడా తమ పొలాల్లో వేరశనగ పంటలు తొలగించి పశువుల మేత కోసం ఇళ్లకు తరలిస్తున్నారు. దాదాపు రూ.60 వేలు వెచ్చించి వేరుశనగ సాగు చేశానని, పంట చేతికి రాక పూర్తిగా నట్టేట మునిగానని, రైతు గోవిందు ఆవేదన చెందాడు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కాదు.. ఎల్లోనినో ఎఫెక్ట్‌గానే రైతులు భావిస్తున్నారు. ఎండిపోయిన 1200 చీనీ చెట్లు నాగులగుడ్డం తండా వద్ద రైతు రాముడు నాయక్ వదిలేసిన చీనీ పంట గుత్తి మండలం శ్రీపురం వద్ద వేరుశనగ పంటను దున్నేసిన రైతు -
దగ్గుపాటి.. వివాదాల కుంపటి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. వివాదాలతో తరచూ వార్తల్లో కెక్కుతున్నారు. తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉన్న వారితో పాటు గతంలో ఎమ్మెల్యే వెన్నంటి నడిచిన వారే ఆయన తీరును తూర్పారపడుతున్నారు. ఎమ్మెల్యేకు డబ్బులుంటే చాలని.. మరెవ్వరూ అవసరం లేదని కార్యకర్తలే చెప్తున్నారు. అడిగినంత డబ్బులు ఇవ్వకున్నా.. లేదా చెప్పిన పని చేయకున్నా కార్యకర్తలను వేధిస్తూ, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నా ఎమ్మెల్యే ఏమాత్రమూ తగ్గడం లేదు. సొంతపార్టీ కేడర్‌పైనే కేసులు రుద్రంపేట గ్రామ పంచాయతీ పరిధిలో టీడీపీ సీనియర్ కార్యకర్త ఫక్రుద్దీన్ ఏటా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. గతేడాది మాత్రం ఎగ్జిబిషన్ పెట్టుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ఎగ్జిబిషన్ నిర్వహించాలంటే ‘ఎమ్మెల్యే ట్యాక్స్’ కింద రూ.10 లక్షలు ఇవ్వాల్సిందేనని దగ్గుపాటి అనుచరులు తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు. అంత డబ్బులు ఇచ్చుకోలేమని బతిమలాడినా వదల్లేదు. ఫక్రుద్దీన్‌పై ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు గంగారంతో పాటు గన్‌మెన్ షేక్షావలి దాడి చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే గన్‌మెన్ షేక్షావలిని పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు. గంగారాంపైనా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇంత జరిగినా దగ్గుపాటి వ్యవహారశైలిలో ఏమాత్రం మార్పు రాలేదు. మామూళ్లు ఇవ్వలేదని మద్యం దుకాణానికి నిప్పు అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్ల నుంచి ప్రతి నెలా ‘ఎమ్మెల్యే ట్యాక్స్’ కింద మామూళ్లు వెళుతున్నాయి. అయితే డీమార్ట్ ఎదురుగా ఉన్న నంబూరి వైన్స్‌ను నంబూరి వెంకట రమణ నిర్వహిస్తున్నాడు. ఈయన టీడీపీ సానుభూతిపరుడు. దుకాణంలో తనకు వాటా ఇవ్వాలని రమణపై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. తన మాట లెక్కచేయకపోవడంతో ఎమ్మెల్యే అనుచరులు పెట్రోల్ పోసి వైన్స్ దుకాణానికి నిప్పంటించారు. ఇలా వరుసగా సొంత పార్టీ వారిపైనే దాడులు, దౌర్జన్యాలు, దాష్టీకాలకు పాల్పడుతుండడంతో ఎమ్మెల్యేను కాదని ఏ పని చేయాలన్నా నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. రూ.200 కోట్ల ఆరోపణలపై నోరెత్తని దగ్గుపాటి రెండేళ్ల వ్యవధిలోనే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రూ.200 కోట్ల విలువైన భూములను ఆక్రమించుకున్నారని సొంత పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆరోపణలు చేశారు. నగరంతో పాటు రూరల్ పరిధిలో ఏ స్థలం అమ్మాలన్నా.. కొనాలన్నా ఎమ్మెల్యే అనుమతి అడుగుతున్నారని, అలాగే ప్రతి నెలా రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే బహిరంగంగా ఆరోపణలు చేసినా ఇప్పటివరకు వీటిపై దగ్గుపాటి స్పందించకపోవడం గమనార్హం. గంగారం... దూరం దూరం ఎమ్మెల్యే దగ్గుపాటికి గంగారాం నమ్మిన బంటుగా ఉన్నారు. దగ్గుపాటి ఏ చిన్న పని చేయాలన్నా గంగారాంతో చేయించారు. మద్యం దుకాణాల నుంచి అక్రమ వసూళ్లు, సివిల్ పంచాయితీలు, పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు, మాట వినని వారిపై దాడులు మొదలైనవన్నీ గంగారాం కనుసన్నల్లోనే జరిగాయి. పంపకాల్లో తేడా రావడంతో గంగారాంను ఎమ్మెల్యే దూరం పెడుతూ వచ్చారు. ఓ వైన్ షాపుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పై నుంచి ఒత్తిడి రావడంతో పోలీసులు గంగారాంను అరెస్ట్ చేశారు. ఇక అప్పటి నుంచి గంగారాంను ఎమ్మెల్యే పూర్తిగా దూరం పెట్టారు. చేయించిన ఎమ్మెల్యేను వదిలేసి చేసిన తనను జైలుకు పంపించారని గంగారాం తన అనుచరుల వద్ద రగిలిపోతూ కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యేపై బూతుపురాణం లంకించిన సంగతి తెలిసిందే. ఇళ్ల స్థలాలు అడిగినందుకు బెదిరింపులు ఎన్నికల సమయంలో తనను గెలిపిస్తే 1000 మంది మైనార్టీలకు నివేశన స్థలం ఇవ్వడంతో పాటు ఇళ్లు కట్టించి ఇస్తానని దగ్గుపాటి ప్రసాద్ హామీ ఇచ్చారు. గెలిచాక హామీపై నోరు మెదపకపోవడంతో టీడీపీ మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు మహబూబ్‌బాషా ప్రశ్నించారు. దీన్ని ఎమ్మెల్యే సహించలేకపోయారు. బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో తన కుమారుడిపై హత్యాయత్నం కేసు పెట్టించారని, తన కూతురి వివాహ సమయంలో కుటుంబాన్ని ఇబ్బందిపెట్టడంతో పెళ్లి కూడా రద్దయ్యిందని మహబూబ్‌బాషా శాసనసభ మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ ఎదుట శుక్రవారం విలపించారు. ఇలా సొంత పార్టీ నేతలు, కార్యకర్తల ఎదుగుదలను ఎమ్మెల్యే ఓర్వలేకపోతున్నారని టీడీపీ కేడరే బహిరంగంగా విమర్శిస్తుండడం గమనార్హం. వరుస వివాదాల్లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే సొంత పార్టీ కేడర్‌పైనే అక్రమ కేసుల బనాయింపు అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే వేధింపులే ఎమ్మెల్యే అక్రమాలపై భగ్గుమంటున్న బాధితులు -
కక్షలకు ఆజ్యం పోస్తున్న పరిటాల సునీత
● మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆత్మకూరు: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకొచ్చినప్పటి నుంచి సస్యశ్యామలంగా ఉన్న రాప్తాడు నియోజకవర్గంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది.. ఎమ్మెల్యే పరిటాల సునీత పల్లెల్లో కక్షలకు ఆజ్యం పోస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఘర్షణలో గాయపడి అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న అనూష, హరికుమార్, మహేంద్ర, శివానందను మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గొరిదిండ్లలో అనూష అనే మహిళపై టీడీపీ కార్యకర్త అక్కులప్ప కత్తితో దాడి చేశాడన్నారు. అక్కులప్ప అనుచరులు మరో ముగ్గురిపై విచక్షణరహితంగా కత్తులు, గొడ్డలితో దాడి చేశారని, కనగానపల్లి అక్కులప్ప అనే వ్యక్తి అనూషను అత్యాచారం చేయబోయాడని తెలిపారు. అనూషకు మద్దతు ఇచ్చిన వారిపై మధు, సతీష్, సోమశేఖర్, రామాంజనేయులు కత్తులు, గొడ్డలితో దాడి చేశారన్నారు. అయితే అక్కులప్పను మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారని, మిగిలిన నలుగురిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మహిళను అత్యాచారం, చంపబోతే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అని మండిపడ్డారు. మదిగుబ్బ తండాలో ఓ మహిళను హత్య చేస్తే పోలీసులు కేసు తీసుకోకుండా ఆత్మహత్యగా చిత్రీకరించారన్నారు. నిందితులు నెల రోజులుగా గ్రామంలో తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సనప గ్రామంలో పోతులయ్య అనే వ్యక్తి ఇంట్లో రూ.18 లక్షల విలువైన నగలు దొంగతనం జరిగితే టీడీపీ నేతలే దొంగతనం చేశారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. దొంగలకు, రేపిస్ట్‌లకు, హత్యలు చేసేవారికి పరిటాల సునీత మద్దతు పలుకుతూ గ్రామాల్లో కక్షలు రేపుతున్నారన్నారు. దాడులు చేసిన వారు అధికార పార్టీ నేతలు అయితే వారిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి టీ, కాఫీలు ఇస్తున్నారన్నారు. అదే గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ కుళ్లాయప్ప ప్రమేయం ఉందని బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నారని, అనంతపురం రూరల్ మండలం కొడిమిలో అంజనాదేవి అనే మహిళపై అత్యాచారయత్నం చేస్తే మహేంద్రరెడ్డి, మహేశ్వరరెడ్డితో పాటు మరొకరు ఆమెను వివస్త్రను చేసి, రాళ్లు, కట్టెలతో దాడి చేశారన్నారు. పోలీసులు మాత్రం దాడులకు పాల్పడిన వారి దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకొని బాధితులపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పాపంపల్లి వాసుదేవరెడ్డి ,ముత్యాలరెడ్డి, గొరిదిండ్ల నరసింహ, సునీల్‌దత్తారెడ్డి, సుధీర్‌రెడ్డి, హనుమంతు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నేమకల్లు క్వారీల్లో ‘విజిలెన్స్’ తనిఖీలు
బొమ్మనహాళ్: మండలంలోని నేమకల్లు శివారులోని క్వారీల్లో అనుమతి లేకుండా తెల్లరాయి తవ్వకాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుపై మైన్స్ అండ్ జియాలజీ అధికారులు రెండో రోజు శుక్రవారం కూడా తనిఖీలు నిర్వహించారు. కర్నూలు రీజినల్ మైన్స్అండ్ జియాలజీ విజిలెన్స్ అధికారి రాజశేఖర్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా మైనింగ్ అధికారుల బృందం సభ్యులు క్వారీలను పరిశీలించారు. కర్నూలు రీజినల్ మైన్స్అండ్ జియాలజీ ఏజీ రాజశేఖర్ మాట్లాడుతూ అనుమతి లేకుండా తెల్లరాయి తవ్వకాలు చేస్తున్నారన్న ఫిర్యాదులు కేంద్ర మైన్స్ అండ్ జియాలజీ కార్యాలయాలనికి అందడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేమకల్లు కొండల్లోని క్వారీల్లో రెండురోజుల పాటు తనిఖీలు నిర్వహించామన్నారు. పీహెచ్ భారతి 4.398 హెక్టార్లు, శివరాజు 4.958 హెక్టార్లు, మోహన్‌దాస్ 2.620 హెక్టార్లు, గురుప్రసాద్ 2.082 హెక్టార్లకు ప్రభుత్వం లీజు మంజూరు చేసిందన్నారు. అయితే అనుమతులు లేకపోయినా కేటీ లాలుస్వామి 2.646 హెక్టార్లు, తిమ్మనగౌడ్ 3.632 హెక్టార్లు, అలైఖ్య 4.684 హెక్టార్లలో తవ్వకాలు సాగిస్తున్నారన్నారు. లీజు అనుమతుల కోసం వీరు రెండేళ్ల క్రితం దరఖాస్తులు చేసుకున్నారని, అయితే వాటిని 8 నెలల క్రితమే రద్దు చేసినట్లు తెలిపారు. కేటీ లాలుస్వామి, తిమ్మనగౌడ్ క్వారీల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రదేశాల్లోనే అక్రమంగా తెల్లరాయిని తవ్వుతున్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలు, యంత్రాలను గురువారమే సీజ్ చేసిన్నట్లు చెప్పారు. అన్ని క్వారీల్లో సర్వేలు చేశామని, నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని ఏజీ తెలిపారు. తనిఖీల్లో రాయల్టీ ఇన్స్పెక్టర్ పురుషోత్తం, టెక్నికల్ అసిస్టెంట్ దిలీప్‌కుమార్, అనంతపురం రాయల్టీ ఇన్స్పెక్టర్ సుప్రజ, సర్వేయర్ నిర్మల్ పాల్గొన్నారు. -
నగదు బ్యాగు పొలంలో ప్రత్యక్షం
ఉరవకొండ: ఉరవకొండ శివారులోని లత్తవరం రోడ్డు వద్ద రైతు మాదినేని శ్రీనివాసులు ఇంట్లో బుధవారం రాత్రి చోరీకి గురైన రూ.45 లక్షల నగదు బ్యాగు శుక్రవారం బాధిత రైతు పొలంలో ప్రత్యక్షమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బ్యాగు తెరిచి చూడగా రూ.32 లక్షల నగదు కనిపించింది. ఈ బ్యాగు తాను ఇంట్లో భ్రదపరచినదేనని రైతు గుర్తించాడు. మిగతా రూ.13 లక్షలు ఏమయ్యాయో తెలియడం లేదు. అసలు బ్యాగును బాధితుడి పొలంలోనే ఎవరు పడేసి వెళ్లానేది అంతుచిక్కడం లేదు. ఇంటిదొంగల పనేనా అన్న కోణంలోనూ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. త్వరలోనే నిజానిజాలు బయటపడనున్నాయి. ‘డైట్’ సరఫరాకు టెండర్ల ఆహ్వానం అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిధిలోని డీసీహెచ్ఎస్ పరిధిలో ఉన్న ఆస్పత్రుల్లో రోగులు, వైద్య సిబ్బందికి ఆహారం (డైట్) సరఫరా చేసేందుకు అనుభవం, ఆసక్తి ఉన్న వారి నుంచి టెండర్లు ఆహ్వానించనున్నారు. ఈ మేరకు డీసీహెచ్ఎస్ డాక్టర్ వెంకట్రావు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. హిందూపురంలోని 200 పడకలు ఉన్న జిల్లా ఆస్పత్రితో పాటు తాడిపత్రి, గుంతకల్లు, మడకశిర, కదిరి, ధర్మవరం, రాయదుర్గంలోని వంద పడకల ప్రాంతీయ వైద్యశాలలు, అనంతపురంలోని సీడీ ఆస్పత్రి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, గుత్తి, పెనుకొండ ప్రాంతాల్లోని 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాలు, కొనకొండ్ల, శింగనమల, కణేకల్లు, పామిడి, సీకే పల్లి, తనకల్లు, కొత్తచెరువు, గోరంట్ల, నల్లమాడ, రొళ్లలోని 30 పడకల సీహెచ్‌సీలకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు జిల్లా ఆస్పత్రికి రూ.2 వేలు, ప్రాంతీయ వైద్య శాలలకు రూ.1,500, సీడీ ఆస్పత్రి, సీహెచ్‌సీలకు రూ.వెయ్యి చొప్పున డీడీ (డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, అనంతపురం) తీసి ఈ నెల 21 నుంచి 26వ తేదీలోపు కార్యాలయం పనివేళల్లో అందజేయాలి. పూర్తి వివరాలకు 80085 53730, 82475 78680 నంబర్లలో సంప్రదించవచ్చు. ఐటీఐల్లో ప్రవేశాలకు గడువు పొడిగింపు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో (2026–27 విద్యా సంవత్సరానికి) మిగిలిన సీట్ల భర్తీకి నిర్వహించే 6వ విడత ప్రవేశాల కౌన్సెలింగ్ గడువును పొడిగించినట్లు ఐటీఐ కన్వీనర్, ప్రిన్సిపాల్ రాయపరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోగా దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 91005 98631, 97032 31501 నంబర్లలో సంప్రదించాలన్నారు. అభివృద్ధి పనులు పూర్తిచేయాలి అనంతపురం అర్బన్: వివిధ శాఖలు చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 నంబంరు నుంచి ఇప్పటి వరకు 24 శాఖలకు సంబంధించి మంజూరు చేసిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు లేనిపక్షంలో నిధులు వెనక్కు వెళతాయన్నారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన పనులు చేయకపోతే అభివృద్ధిలో జిల్లా వెనకబడుతుందన్నారు. పనుల విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. రాష్ట్రస్థాయికి ఇద్దరు విద్యార్థినులు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా సైన్స్ సెంటర్లో శుక్రవారం నిర్వహించిన నేషనల్ సైన్స్ సెమినార్–2026 జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచిన ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ‘భారతదేశ ఇంధన సమ్మేళనం–2047: అవకాశాలు– సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో గుంతకల్లు డాక్టర్ ఎస్‌ఆర్‌కేఎం ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని పి.నందిత, రాయదుర్గం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థిని ఎస్.హఫీపా సాధియా ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వీరు రాష్ట్రస్థాయి పోటీల్లో అనంతపురం జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరిని డీఈఓ డాక్టర్ అయూబ్ హుస్సేన్, జిల్లా సైన్స్ అధికారి నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. -
చెదుళ్లలో మహిళపై దాడి
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని చెదుళ్ల గ్రామంలో ఓ మహిళపై దాడి జరిగిన ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల మేరకు.. చెదుళ్లలో దళిత వర్గానికి చెందిన శ్రీదేవికి 15 ఏళ్ల క్రితం నరసింహారెడ్డితో ప్రేమ వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే నరసింహారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో శ్రీదేవి చెదుళ్లలో అవ్వ ఇంట్లో ఉంటోంది. శ్రీదేవి సొంత పిన్ని అయిన నారాయణమ్మ, ఆమె కుమారులు కుళ్లాయప్ప, నారాయణలు శ్రీదేవి ఇంట్లో ఉన్న సామాన్లను బయటకు విసిరేశారు. పిల్లలను బయటకు ఈడ్చి కొట్టి గ్రామంలో ఉండడానికి వీల్లేదని బెదిరింపులకు పాల్పడ్డారు. అఽధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని శ్రీదేవి విజ్ఞప్తి చేశారు. -
అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి
కణేకల్లు: మండలంలోని అంబాపురంలో గురువారం గంగమ్మ (28) అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పోలీసుల వివరాలమేరకు.. బొమ్మనహళ్ మండలం హారేసముద్రానికి చెందిన హెచ్.వండ్రక్క, వండ్రప్పల కుమార్తె గంగమ్మను పదేళ్ల క్రితం అంబాపురానికి చెందిన వన్నూరుస్వామికిచ్చి వివాహాం చేశారు. కొన్నేళ్లు వీరి కాపురం సవ్యంగా సాగింది. ఆ తర్వాత భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వీరికి ముగ్గురు కుమారులున్నారు. బుధవారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం గురువారం ఉదయం వన్నూరుస్వామి తన భార్య ఉరి వేసుకొని చనిపోయినట్లు భార్య తరుపు బంధువులకు చెప్పాడు. వారి ద్వారా సమాచారం తెలుసుకొన్న గంగమ్మ తల్లిదండ్రులు గురువారం ఉదయం అంబాపురంలోని వారి ఇంటికెళ్లి విగతజీవిగా ఉన్న కూతుర్ని చూసి బోరుమన్నారు. అయితే గంగమ్మ తలకు దెబ్బలు తగలడంతో తమ కూతుర్ని కొట్టి చంపి ఉంటారని తల్లీదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా గంగమ్మ పెద్ద కుమారుడు ముని బుధవారం రాత్రి ఇంట్లో జరిగిందంతా పోలీసులకు వివరించినట్లు సమాచారం. ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తగా నారాయణస్వామి బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్తగా (ప్రిన్సిపాల్ సైంటిస్ట్, హెడ్) గురువారం డాక్టర్ నారాయణస్వామి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ప్రధాన శాస్త్రవేత్తగా పని చేస్తున్న డాక్టర్ విజయ శంకర్‌బాబు వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల తిరుపతి–మృతికా శాస్త్ర విభాగ అధిపతిగా బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి మాట్లాడుతూ జిల్లా రైతులకు పంటల సాగులో లాభసాటి మెళకువలు అందించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణపై వ్యవసాయ సలహాలు, సూచనలు అందిస్తామన్నారు. రైతాంగ అభివృద్ధికి పరిశోధనా స్థానం తరుఫున ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. వ్యక్తిపై పోక్సో కేసు బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని పసులూరులో బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేఽధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి వివరాలమేరకు.. వెంకటాపురానికి చెందిన రాజు పసులూరు గ్రామంలో ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. రాజుకు ఇది వరకే పెళ్లి అయింది. అయితే నాలుగు రోజుల క్రితం బాలికను రాజు ఇంటి నుంచి తీసుకెళ్లాడు. తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఇరువురిని స్టేషన్‌కు తీసుకొచ్చి రాజును అదుపులోకి తీసుకుని బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. రాజుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
●ఉండ్రాళ్లయ్యా.. క్షమించయ్యా
బుక్కరాయసముద్రం: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో సాధారణ ప్రజలకే కాదు.. దేవుళ్లకూ నీటి కష్టాలు తప్పడం లేదు. బీకేఎస్ మండలం మీదుగా వెళ్తున్న హెచ్ఎల్సీలో ఈ సారి నీటి జాడ కరువైంది. కాలువకు నీరు వదలాలని ప్రజలు, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకులు పాలకులను అనేకసార్లు కోరినా పట్టించుకోలేదు. దీంతో రైతులు, ప్రజలు సాగు,తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వినాయక చవితి రావడం, లంబోదరుడి విగ్రహాల నిమజ్జనానికి కూడా నీరు కరువవడంతో చేసేదిలేక వెంకటాపురం, దయ్యాలకుంటపల్లికి చెందిన ప్రజలు ఒట్టి కాలువలోనే వినాయకులను వదిలేసి వచ్చారు. ఇంత ఘోరం ఎప్పుడూ చూడలేదని, కనీసం వినాయక చవితికి అయినా కాలువకు నీరు వదలక పోవడం దారుణమని పలువురు మండిపడ్డారు. -
ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి
ఉరవకొండ: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కరువు నెలకొందని, ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి కలెక్టర్ ఆనంద్‌ను కోరారు. గురువారం అనంతపురంలోని కలెక్టరేట్లో కలెక్టర్‌ను కలిసి ఆయనకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ జిల్లాలో సెప్టెంబర్ రెండో వారం దాటినప్పటికీ తగినంత వర్షపాతం నమోదుకాక బోరుబావులు ఎండిపోతున్నాయన్నారు. వర్షాలు లేకపోవడం వల్ల భూగర్భజలాలు పూర్తిగా అడుగంటే పరిస్థితి నెలకొందన్నారు. చాలా మంది రైతులు పంటలు సాగుచేసి వాటిని కాపాడుకోలేక అప్పుల పాలవుతున్నారన్నారు. ముఖ్యంగా జిల్లాలో పశువులకు మేత, తాగునీరు అందక కబేళాలకు తరలిస్తున్నారని చెప్పారు. కనీసం పశువుల దాహర్తి తీర్చడానికి జిల్లాలోని అన్నీ చెరువులను హంద్రీనీవా నీటితో నింపాలన్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ప్రతి గ్రామంలో పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి రాయితీ అందేలా చూడాలన్నారు. బ్యాంకుల్లో రైతుల రుణాలన్నీ మాఫీ చేసి, వ్యవసాయ పనులు లేక అవస్థలు పడుతున్న వారికి ఉపాధి పనులు కల్పించాలన్నారు. ప్రస్తుత పనిదినాలకు అదనంగా మరో 50 రోజులు పని కల్పించేలా చూడాలన్నారు. -
చోరీ ఘటనపై లోతుగా దర్యాప్తు
ఉరవకొండ: పట్టణ శివారు లత్తవరం రోడ్డు పక్కన నివాసముండే రైతు మాదినేని శ్రీనివాసులు ఇంట్లో బుధవారం రాత్రి జరిగిన భారీ చోరీ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. గురువారం చోరీ జరిగిన ఇంటిని సీసీఎస్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో పాటు డాగ్ స్క్వాడ్ , క్లూస్ టీం బృందాలు తనిఖీ చేశారు. రైతు ఇంట్లో మంచం కింద ప్రత్యేకంగా బ్యాగులో దాచిన రూ.45 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు... దేవుడి గదిలో ఉంచిన రూ.2లక్షలు, మరో చోట ఉంచిన రూ.50వేలు చోరీ చేయకపోవడం పలు అనుమాలకు తావిస్తోంది. ఈచోరీ తెలిసిన వ్యక్తుల పనేనా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. బాదిత రైతు శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవలే తన పొలాన్ని రూ.60లక్షలకు విక్రయించిన డబ్బులో రూ.45లక్షలను తన కుమారుడి వివాహం, ఇంటి నిర్మాణం కోసం ఇంట్లో దాచిపెట్టుకోని ఉంటే దాన్ని చోరీ చేశారని వాపోయారు. ఉరేసుకున్న వ్యక్తి కర్ణాటక వాసి కూడేరు: మండల పరిధిలోని ఉదిరిపికొండ–శివరాంపేట గ్రామాల మధ్య అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కన చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తిని కర్ణాటక వాసిగా పోలీసులు గుర్తించారు. గురువారం మృతుడి వివరాలను పోలీసులు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రంలోని మొలకల్మూరు తాలుకా కొండపల్లికి చెందిన రుద్రప్ప, నాగలక్ష్మి దంపతుల కుమారుడు మైలాడి (25), కుమార్తె ఉన్నారు. వీరు ఈ నెల 9న ఉరవకొండ మండలం పెన్నహోబిళం లక్ష్మీనరసింహస్వామి ఆలయ దర్శనార్థం వచ్చారు. మైలాడికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఉదిరిపికొండ వైపు వచ్చాడు. కుటుంబ సభ్యులు అతని కోసం వెతికినా కనిపించలేదు. వారు ఉరవకొండ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసి స్వగ్రామానికి వెళ్లి పోయారు. ఆ తర్వాత మైలాడి చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు అతని భుజాలపై ఉన్న పచ్చబొట్టు అక్షరాల ఆధారంగా బళ్లారి పోలీసులకు సమాచారమివ్వగా వారి ద్వారా మృతుడి ఆచూకీ లభించడంతో మిస్టరీ వీడింది. -
పెండింగ్ వేతనాల కోసం 20 నుంచి సమ్మె
● ‘శ్రీరామరెడ్డి’ ప్రాజెక్టు కార్మికుల స్పష్టీకరణ కూడేరు/అనంతపురం న్యూటౌన్ : ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఈ నెల 20 నుంచి శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ కార్మికులు సమ్మెకు దిగనున్నట్లు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్, ప్రాజెక్ట్ కార్మిక యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రకోడు ఎర్రిస్వామి తెలిపారు. గురువారం వారు మండలంలోని శ్రీరామరెడ్డి ప్రాజెక్ట్ వద్ద కార్మికులతో సమావేశమయ్యారు. న్యాయపరమైన డిమాండ్ల సాధనకు అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. ప్రాజెక్ట్ ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్ట్‌లో 600 మంది కార్మికులు పని చేస్తున్నారన్నారు. కాంట్రాక్టర్ 5 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికుల కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ బకాయిల చెల్లింపుతో పాటు తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫేజ్–4 కార్మికుల వేతన కోతలను ఉపసంహరించుకోవాలన్నారు. 18 ఫిల్టర్ బెడ్లు, మోటార్లు సక్రమంగా పని చేయడం లేదని, నిర్వహణ లోపాలను సరిచేయాలని కోరారు. రెండు రోజుల్లో డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నేతలు నారాయణ స్వామి, రమేష్, వన్నూరు స్వామి రాజా, నేసే ఎర్రిస్వామి, సుధాకర్ పాల్గొన్నారు. -
ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్స్‌కు తమిళనాడు, మణిపూర్
అనంతపురం: డాక్టర్ తాలిమెరెన్ ఆవో అండర్–19 బాలికల ఫుట్‌బాల్ నేషనల్ చాంపియన్‌షిప్ టోర్నీలో ఇప్పటి వరకూ జార్ఖండ్ కొనసాగిస్తూ వచ్చిన విజయ ప్రస్థానానికి డిఫెండింగ్ చాంపియన్ మణిపూర్ జట్టు కళ్లెం వేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ నెల 10 నుంచి ఆర్డీటీ స్టేడియం వేదికగా 15 రాష్ట్రాల జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు, ఏపీ జట్లు తలపడ్డాయి. ఏపీ జట్టుపై 12–1 గోల్స్ తేడాతో తమిళనాడు జట్టు ఘన విజయం సాధించింది. పైచేయి సాధించిన మణిపూర్ మధ్యాహ్నం జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో జార్ఖండ్, మణిపూర్ జట్లు తలపడ్డాయి. నువ్వానేనా అనే రీతిలో సాగిన ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ జట్టు మొదట ఓ గోల్ చేసింది. ఛాలెంజ్‌గా తీసుకున్న మణిపూర్ జట్టు చెలరేగిపోయింది. మరో 6 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా మణిపూర్ క్రీడాకారిణి తంగ్జమ్ విక్టోరియా దేవి ఓ గోల్ చేయడంతో మ్యాచ్ ఫలితం సమంగా మారింది. దీంతో నిబంధనల మేరకు ఇరు జట్లకు చెరో ఐదేసి పెనాల్టీ షూటౌట్లు కేటాయించారు. ఈ అవకాశాన్ని మణిపూర్ జట్టు క్రీడాకారులు సద్వినియోగం చేసుకున్నారు. ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ మణిపూర్ క్రీడాకారులు దాసిలా సేస్టమ్, మంగలేబి ఇరోమ్, అగున్వాంగ్లియు ఖేంగ్తామెయ్, రించుయిలా గాంగ్మెయ్ వరుసగా నాలుగు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలకంగా మారారు. జార్ఖండ్ జట్టు రెండు గోల్స్‌కే పరిమితమైంది. దీంతో మణిపూర్ జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. మ్యాచ్‌లను ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్, కార్యదర్శి డానియల్ ప్రదీప్, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు దాదాఖలందర్ పర్యవేక్షించారు. -
మధుమేహం, రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి
అనంతపురం సిటీ: మధుమేహం, రక్తపోటు తదితర వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, వీటిని నిర్లక్ష్యం చేస్తే కంటి సమస్యలు, కిడ్నీ వైఫల్యం, గుండెపోటు, స్ట్రోక్, పాదాల సమస్యలు వస్తాయని డీఎంహెచ్ఓ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ’మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉంచితే.. ప్రాణానికి రక్షణ’ అనే నినాదంతో 30 రోజుల పాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కొనసాగే సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని గురువారం అనంతపురంలోని నాయక్‌నగర్‌లో ఉన్న అర్బన్‌హెల్త్ సెంటర్లో ఆయన ప్రారంభించారు. నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో ప్రత్యేక స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు ● ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి గుత్తి: వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో నివాసముండే అశోక్‌కుమార్ (26) బుధవారం రాత్రి వినాయక నిమజ్జనం సంబరాల్లో పాల్గొన్నాడు. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి కింద పడిపోయాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు అతడిని కర్నూలు ఆస్పత్రికి రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడు అశోక్ కుమార్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేసేవాడు. మృతుడికి భార్య ప్రశాంతి ఉన్నారు. సెలవులో ఉద్యానశాఖ డీడీ అనంతపురం అగ్రికల్చర్: ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ (డీడీహెచ్) డి.ఉమాదేవి గురువారం నుంచి 40 రోజుల పాటు సెలవు పెట్టారు. కుమారుడి పెళ్లి నిమిత్తం అమెరికా వెళుతున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. తిరిగి నవంబర్‌లో డీడీగా బాధ్యతలు చేపడతారన్నారు. దీంతో అసిస్టెంట్ డైరెక్టర్ బీసీ ధనుంజయకు ఇన్చార్జి డీడీ బాధ్యతలు అప్పగిస్తూ కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బాషా తెలిపారు. గల్లంతైన యువకుడి మృతి బొమ్మనహాళ్: వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొని హెచ్చెల్సీ కాలువలో గల్లంతైన సాయిభరత్ (22) మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ నబీరసూల్ వివరాల మేరకు.. ఉప్పరహాళ్ క్రాస్ వద్ద నివాసం ఉంటున్న శీనా కుమారుడు సాయిభరత్ బుధవారం సాయంత్రం నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నాడు. నిమజ్జనం అనంతరం అందరూ గోడిసెలపల్లి రోడ్డులోని హెచ్చెల్సీ కాలువలో స్నానం చేస్తుండగా సాయిభరత్ కూడా కాలువలోకి దూకాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి గల్లంతయ్యాడు. స్థానికులు గమనించి కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. గురువారం కణేకల్లు మండలంలోని యర్రగుంట గ్రామ సమీపంలో సాయిభరత్ మృతదేహం లభ్యమైంది. మృతుడు తండ్రి శీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు గండి బొమ్మనహాళ్: మండలంలోని ఏలంజి గ్రామ సమీపంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు గురువారం తెల్లవారుజామున గండి పడింది. దీంతో ట్యాంక్‌లో నిల్వ ఉన్న తాగునీరు భారీగా వృథా అవుతోంది. సత్యసాయి తాగునీటి పథకం ద్వారా హెచ్చెల్సీ నుంచి వచ్చే నీటిని ఈ ట్యాంక్‌లో నిల్వ చేసి, చుట్టూ పక్కల ఉన్న 16 గ్రామ పంచాయతీలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కీలకమైన నీటి నిల్వ ట్యాంక్‌కు గండి పడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ట్యాంక్‌కు గండి పడిన విషయం తెలుసుకున్న డీఈఈ రామారావు, ఏఈఈ భార్గవ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ట్యాంక్ నుంచి నీరు బయటకు వస్తున్న నేపథ్యంలో పనులు చేయడానికి వీలు కావడం లేదన్నారు. ట్యాంక్‌లో నీటిని ఒక్కటిన్నర అడుగు మేర ఉంచి రింగ్ బండ్‌ను ఏర్పాటు చేసిన తర్వాతే గండి పూడ్చేందుకు వీలవుతుందన్నారు. వీలైనంత త్వరగా గండి పూడ్చివేసి ట్యాంక్‌లోకి హెచ్చెల్సీ నీటిని నింపుతామని డీఈఈ తెలిపారు. -
అసమర్థ ప్రభుత్వం.. పంట తొలగింపే శరణ్యం
విడపనకల్లు: మండల పరిధిలోని పొలికి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి తన 12 ఎకరాల్లో సాగు చేసిన మిరప పంటను గురువారం తొలగించాడు. గుంతకల్లు బ్రాంచి కెనాల్ (జీబీసీ)కు సాగు నీరు వస్తాయనే ఆశతో నెల రోజుల క్రితం రూ.12 లక్షలు ఖర్చు చేసి వెంకటేశ్వరరెడ్డి మిరప సాగు చేశాడు. అయితే, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ సాగు నీరు విడుదల కాకపోవడంతో పంట ఎండుముఖం పట్టింది. దీంతో దిక్కుతోచని వెంకటేశ్వర రెడ్డి ట్రాక్టర్‌తో పంటను తొలగించాడు. ఆయన మాట్లాడుతూ రైతులు సాగు చేసిన పంటలకు కనీసం సాగు నీరు ఇవ్వలేని అసమర్థ స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని విమర్శించారు. -
‘మత్తు’పై ఉక్కుపాదం మోపండి
● అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం అనంతపురం అర్బన్: ‘‘మత్తు, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపండి. గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోండి. మత్తు పదార్థాలు సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించండి’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ పి.జగదీష్‌తో కలిసి నార్కో కో–ఆర్డినేషన్ సెంటర్ (ఎన్కార్డ్) జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా ‘ఈగల్ క్లబ్‌లు’ క్రీయాశీలకంగా పనిచేయాలన్నారు. పాఠశాలల సమీపంలో గుట్కా, గంజాయి, ఇతర నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై సమాచారం సేకరించి పంపించాలన్నారు. జిల్లాలోని ప్రతి ఈగల్ క్లబ్‌కు ఒక మహిళ పోలీసు అధికారిని అనుసంధానం చేయాలన్నారు. ఆయా ఈగల్ క్లబ్‌లలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సంబంధిత సిబ్బందితో నెలకోసారి పాఠశాలల్లో మాదకద్రవ్య వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం ‘‘డ్రగ్స్ వద్దు బ్రో’’ పుస్తకాన్ని కలెక్టర్, ఎస్పీ ఆవిష్కరించారు. సమావేశంలో ఏఎస్పీ నాగభూషణం, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డీటీసీ వీర్రాజు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ వలీబాషా, ఇతర అధికారులు పాల్గొన్నారు. హెచ్ఐవీ నియంత్రణపై దృష్టి సారించాలి హెచ్ఐవీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. తన చాంబర్లో వైద్యాధికారులతో ఆయన సమీక్షించారు. హెచ్ఐవీ ప్రభావిత ప్రాంతాలు, వర్గాలు, వృత్తిదారులను గుర్తించి పరీక్షలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఎయిడ్స్ నియంత్రణాధికారి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గడువులోపు ‘సర్’ పూర్తి చేస్తాం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను గడువులోపు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌కు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ తెలిపారు. సీఈఓ గురువారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్‌తో పాటు ఎస్పీ పి.జగదీష్, డీఆర్ఓ ఎ.మలోల పాల్గొన్నారు. చెత్త తొలగింపుపై ప్రత్యేక దృష్టి అనంతపురం న్యూటౌన్: జిల్లాలో బల్క్ చెత్త తొలగింపునకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జడ్పీ ఆవరణంలోని డీపీఆర్సీ మీటింగ్ హాలులో గురువారం జిల్లా పరిషత్ సమావేశ భవనంలో బల్క్ వేస్ట్ జనరేటర్లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు. జిల్లాను చెత్తరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులతో సమన్వయంతో పనిచేయాలన్నారు. ే -
గంగజాడ కోసం అన్నదాతల పాట్లు
● 20 కిలో మీటర్ల నుంచి పైపులైన్లు ● చీనీచెట్లను కాపాడుకునేందుకు రైతుల కష్టాలు ● ట్యాంకర్ నీరు రూ.వెయ్యి పైమాటే .. యల్లనూరు: ఆరుగాలం శ్రమించి పంటలను సాగు చేసిన అన్నదాతలను పుట్టెడు దుఃఖాలు వెంటాడుతున్నాయి. సాగు చేసిన పంటలకు సైతం నీరు లేక నిట్టనిలువునా ఎండుతుంటే.... చేసేది లేక చీనీ, అరటి చెట్లను కొందరు రైతులు వదిలేసుకుంటున్నారు. కరువు విలయతాండవం చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వంతో పాటు ఉద్యాన, వ్యవసాయ అధికారుల్లో చలనం లేదు. కనీసం ప్రభుత్వానికి నివేదికలను రాసి పంపితే పంట నష్టపరిహారం జాబితాలో చేర్చేందుకు కూడా ఉద్యాన అధికారులు ప్రయత్నించడం లేదు. 1400 అడుగుల్లో బోర్లు వేస్తున్నా... పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి, బాలాపురం తదితర గ్రామాల్లో రైతులకు గంగజాడ కరువైంది. 1400 అడుగుల లోతులో బోర్లు వేస్తున్నా గంగజాడ దొరకడం లేదు. దీంతో చేసేదిలేక యల్లనూరు మండలం తిరుమలాపురం గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ బోరు వద్ద నుంచి ట్యాంకర్లతో నీటిని తరలిస్తూ చీనీ, దానిమ్మ, అరటి చెట్లను కాపాడుకుంటున్నారు. ఒక్కో ట్యాంకరుకు రూ.1000 కి పైగా ఖర్చు చేస్తున్నారు. వందల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేసిన అన్నదాతలకు నీరు కరువవడంతో నీళ్లకోసం రూ.లక్షలు ఖర్చు పెడుతున్నారు. యల్లనూరు మండలం చిలమకూరు చిత్రావతి నదిలో పుట్లూరు గ్రామాల రైతులు బోర్లు వేసుకొని అక్కడి నుంచి పైపులైను సహాయంతో నీటిని తీసుకెళ్లేందుకు రూ.20 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. పుట్లూరు మండలానికి పుట్లూరు చెరువు, కోమటికుంట్ల చెరువులు, గండికోట నీరు వస్తే రైతులు కాస్త ఊపిరి పీల్చుకునేవారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి రైతుల కోసం పుట్లూరు, కోమటికుంట్ల చెరువులకు నీరు విడుదల చేయిస్తే సగం కష్టాలు గట్టెక్కుతామని పలువురు రైతులు చెబుతున్నారు. కరువు పరిస్థితులు ఇలాగే కొనసాగితే నవంబర్‌లోపు పుట్లూరు, యల్లనూరు మండలాల భూములన్నీ బీడు భూములుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిలమకూరు చిత్రావతి నది నుంచి కోమటికుంట్లకు రైతులు వేసుకుంటున్న పైప్‌లైన్ తిరుమలాపురం తోటల వద్ద పుట్లూరుకు ట్యాంకర్లతో నీటిని నింపుకుంటున్న వ్యాపారులు -
నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
● ఎస్పీ జగదీష్ అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలో వినాయకుల శోభాయాత్ర, నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ జగదీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. నిమజ్జన ప్రదేశాల్లో పోలీసు సిబ్బందితో పాటు గజ ఈతగాళ్లు, రెవెన్యూ, మున్సిపల్, ఫైర్ సర్వీస్ సిబ్బందిని నియమించామన్నారు. డీజేలకు అనుమతి లేదని, ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగజేయరాదన్నారు. మద్యపానం చేసి వేడుకల్లో పాల్గొనరాదన్నారు. చిన్నారులు, వృద్ధులు, మహిళల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పోలీసులు సూచించిన మార్గాల్లోనే శోభాయాత్రలు నిర్వహించి కమిటీ సభ్యులు, యువత సహకరించాలని కోరారు. ● 4 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు విగ్రహాలను ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలోని హంద్రీ–నీవా కాలువలో, అంత కంటే తక్కువ విగ్రహాలను అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి అక్కమ్మగార్ల గుడి వద్ద చెక్‌డ్యాంతో పాటు న్యూ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద నిమజ్జనం చేయాలి. ● నిమజ్జనోత్సవం సందర్భంగా అనంతపురం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ గుత్తి వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు గుత్తి రోడ్డులోని మిర్చి యార్డు నుంచి, తాడిపత్రి వైపు నుంచి వచ్చే బస్సులు ఎన్టీఆర్ మార్గ్ మీదుగా, కళ్యాణదుర్గం, బళ్లారి, రుద్రంపేట వైపు నుంచి వచ్చే బస్సులు తపోవనం, తడకలేరు, గుత్తి రోడ్డు నుంచి మిర్చియార్డు మీదుగా బస్టాండ్‌కు చేరుకోవాలి. ఇళ్ల స్థలాలు అడిగితే ఎమ్మెల్యే వేధిస్తున్నాడు ● శాసనసభ కమిటీ ఎదుట టీడీపీ నాయకుడు ఆవేదన అనంతపురం అర్బన్: ‘‘పార్టీ కోసం.. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గెలుపు కోసం పనిచేసినందుకు వేధింపులు, నాలుగు పోలీసు కేసుల రూపంలో సరైన బహుమతి ఇచ్చారు’ అంటూ శాసనసభ మైనారిటీల సంక్షేమ కమిటీ ఎదుట టీడీపీ మైనారిటీ నాయకుడు ఐఎంఎంబాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దశలో కమిటీ చైర్మన్ మహమ్మద్ నసీర్ అహమ్మద్‌తో వాదనకు దిగారు. ఈ క్రమంలో ఆయన్ను పోలీసులు బయటకు తీసుకెళ్లారు. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో కమిటీకి బాషా వినతిపత్రం అంద జేసి పరిస్థితి వివరించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి విజయం కోసం అలుపెరగకుండా పనిచేశానని చెప్పారు. అనంతరం మీడియాతో బాషా మాట్లాడారు. దగ్గుపాటి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే ముస్లిం మైనారిటీలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరగా ఆయన సరే అన్నారని, అయితే రెండున్నరేళ్లయినా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని వాపోయారు. ఇదే విషయంపై తమ వాళ్లు ఎక్కడపడితే అక్కడ నిలదీస్తున్నారని చెప్పారు. ఇళ్ల స్థలాల గురించి అడిగితే ఎమ్మెల్యే తనపై వ్యతిరేక ముద్రవేసి వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజుకు ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికే తనపై నాలుగు కేసులు పెట్టారని ఆవేదన చెందారు. ఎం.కొండాపురం పంచాయతీకి ఐఎస్ఓ గుర్తింపు అనంతపురం ఎడ్యుకేషన్: కళ్యాణదుర్గం మండలం ఎం.కొండాపురం గ్రామ పంచాయతీకి నీటి సమృద్ధి అంశం కింద ఐఎస్ఓ గుర్తింపు లభించింది. సమర్థవంతమైన నీటి నిర్వహణతో పాటు ప్రజలకు నీటి సదుపాయాలు కల్పించేందుకు పంచాయతీ చేపట్టిన చర్యలకు గుర్తింపు లభించినట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజ నాయుడు తెలిపారు. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో కమిషనర్ కృష్ణతేజ చేతుల మీదుగా డిప్యూటీ ఎంపీడీఓ రంగనాయకులు, పంచాయతీ కార్యదర్శి లోకేష్ ఐఎస్ఓ ధ్రువపత్రాన్ని అందుకున్నారు. -
ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థం రాయలసీమకు.. మరీ ముఖ్యంగా కరువుపీడిత ఉమ్మడి అనంతపురం జిల్లాకు శాపంగా మారింది. తన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా జలాలు నేరుగా తీసుకుపోయేందుకు హంద్రీ–నీవా కాలువకు సిమెంట్ కాంక్రీట్‌తో లైనింగ్ వేయించారు. ఇలా చేయడం వల్ల కాల
ఆత్మకూరు/ కనగానపల్లి: ఉమ్మడి జిల్లాలోని ఉరవ కొండ, రాప్తాడు, కళ్యాణదుర్గం, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల మీదుగా హంద్రీ–నీవా కాలువ వెళ్తుంది. అయితే కాలువకు కాంక్రీట్‌తో లైనింగ్ చేయడం వల్ల సమీప ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగే అవకాశం లేకుండా పోయింది. ఎవరైనా కాలువలోకి మోటర్లు వేసి నీటిని పొలాలకు తీసుకుందామని ప్రయత్నిస్తే కేసులు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. ఫ్యాక్టరీలకు నీరు వదిలే ప్రభుత్వం.. పంటల సాగు ఇవ్వకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే ఉపాధి కోసం వలస పోక తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు కంటతడి బోర్లల్లో నీళ్లున్నాయన్న ఆశతో చాలామంది రైతులు వరి నార్లు వేసుకుని, నాట్లుకూడా వేశారు. అయితే హంద్రీ– నీవా, పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా చెరువులకు నీరు ఇవ్వకపోవడంతో పరిస్థితి తారుమారైంది. ఓ వైపు ఎల్–నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు చెరువులకు నీరు చేరడం లేదు. క్రమేణా భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలోంచి నీరు రావడం లేదు. దీంతో పైరు ఎండిపోతుండటంతో కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో రైతు కంటతడి పెడుతున్నాడు. నీరు లేక వ్యవసాయ భూములన్ని బీళ్లుగా మారుతున్నాయి. ఒక్క రాప్తాడు నియోజకవర్గంలోనే లక్ష ఎకరాల వరకు నీరందకుండా పోతోంది. తాగునీటికీ కష్టాలే హంద్రీ–నీవా కాలువతో పాటు పీఏబీఆర్ నుంచి కుడి కాలువ గుండా కూడా చెరువులు, కుంటలకు నీరు వదలటం లేదు. దీంతో గ్రామాల్లో ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. హంద్రీ–నీవా ద్వారా సాగునీటికి కాకుండా తాగునీటికి వదులుతామని చెప్పిన అధికారులు కనీసం ఈ ప్రాంతంలోని చెరువులు, నీటికుంటలకు కూడా నీరు ఇవ్వడం లేదు. దీంతో బోరుబావుల్లో నీరు రాక ప్రజలు తాగునీటి కష్టాలు పడుతున్నారు. కనగానపల్లి మండలం యలకుంట్ల వద్ద చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రెండు రోజుల క్రితం తాగునీటి కోసం హంద్రీ–నీవా కాలువ వద్ద తూమును ఎత్తి నీటిని సమీపంలోని వంకలోకి వదిలారు. దీనిని గుర్తించిన అధికారులు వెంటనే అక్కడికి వెళ్లి నీటిని బయటకు వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు. హంద్రీ–నీవా కాలువలో పారుతున్న కృష్ణా జలాలు కాలువకు కాంక్రీట్ లైనింగ్‌తో పెరగని భూగర్భ జలాలు చెరువులు, కుంటలకు వదలని నీరు.. బీళ్లుగా మారుతున్న పొలాలు -
చెరువులకు తక్షణమే నీళ్లివ్వాలి
అనంతపురం ఎడ్యుకేషన్: తీవ్ర కరువుతో అల్లాడుతున్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో పంటలను కాపాడేందుకు చెరువులకు తక్షణమే నీటిని విడుదల చేయాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం డ్యాం నుంచి నీటి విడుదల ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా జిల్లాలోని చెరువులకు నీరు విడుదల చేసే ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు. శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం 180 టీఎంసీల నుంచి 112 టీఎంసీలకు పడిపోయిందని తెలిపారు. అయినప్పటికీ 835 అడుగుల వరకు నీటిని డ్రా చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారని, పవర్ జనరేషన్ జరగని పరిస్థితుల్లో హంద్రీ–నీవాకు 3.5 టీఎంసీల నీటిని తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. శ్రీశైలం డ్యాంలో 854–840 అడుగుల మధ్య సుమారు 26 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ సమయంలో వెలిగొండ, హంద్రీ–నీవా, ముచ్చుమర్రి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు నీటి విడుదల కొనసాగితే హంద్రీ–నీవాకు మరో 9 టీఎంసీల వరకు నీటిని తీసుకునే అవకాశం ఉందన్నారు. 840–830 అడుగుల మధ్య కూడా హంద్రీ–నీవా, కల్వకుర్తి, ముచ్చుమర్రి ద్వారా నీటిని తీసుకునే అవకాశం ఉందని, దీంతో మరో 4.5 టీఎంసీల వరకు హంద్రీ–నీవాకు నీరు పొందవచ్చన్నారు. ఈ లెక్కన ఇప్పటికీ శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా ద్వారా దాదాపు 17 టీఎంసీల నీటిని తీసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. ట్రయల్ రన్‌కే నీరు ఎందుకు? వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాలేదని, ప్రధాన సొరంగం నిర్మాణం పూర్తయినా కాలువల వ్యవస్థ ఇంకా పూర్తి కావాల్సి ఉందని ప్రకాష్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం ట్రయల్ రన్లో భాగంగా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితుల్లో, ఆ నీటిని తగ్గించి హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ద్వారా రాయలసీమ జిల్లాలకు మళ్లించాలని కోరారు. ఎండిపోతున్న పంటలు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో హంద్రీ–నీవా నీటిపై ఆధారపడిన చెరువులు ఉన్నాయని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. నీరు లేక చీనీ, అరటి, మిరప, టమాట తదితర పంటలు ఎండిపోతున్నాయని, భూగర్భజలాలు అడుగంటడంతో రైతులు పంటలను వదిలేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుంగభద్ర డ్యాం నుంచి పీఏబీఆర్‌కు నీటిని విడుదల చేసి, అక్కడి నుంచి పీఏబీఆర్ కుడికాలువ కింద ఉన్న 49 చెరువులకు నీటిని అందించాలని ప్రకాష్‌రెడ్డి కోరారు. హంద్రీ–నీవా కింద ఉన్న అన్ని చెరువులను వెంటనే నింపడంతో పాటు హంద్రీ–నీవా నుంచి పేరూరు డ్యాంకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం గురువారం హంద్రీ–నీవా సీఈ కార్యాలయం ఎదుట జలదీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు, రైతు సంఘాల నాయకులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు పాల్గొంటారని చెప్పారు. తొమ్మిది నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివస్తారని వెల్లడించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, వైస్ ఎంపీపీలు చియ్యేడు కృష్ణారెడ్డి, బోయ రామాంజనేయులు, వైఎస్సార్సీపీ నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి బండి పవన్, గోవిందరెడ్డి, నీరుగంటి నారాయణరెడ్డి, ఈశ్వరయ్య, పాపంపేట ప్రసాద్‌రెడ్డి, భానుకోట శివ, ఉప్పరపల్లి శీనా పాల్గొన్నారు. మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్ నేడు హంద్రీ–నీవా సీఈ కార్యాలయం ఎదుట జలదీక్ష


