అనంతపురం సెంట్రల్: ఆపరేషన్ నైట్ సేఫ్టీపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ జగదీష్ ఆదేశించారు. శనివారం రాత్రి నగరంలో పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనుమానస్పద వ్యక్తులను ప్రశ్నించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాత్రి సమయాల్లో ఏ ఆపద వచ్చిన డయల్ –100ను సంప్రదించాలని, తక్షణం పోలీసు సిబ్బంది స్పందిస్తారన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అశ్విన్ మణిదీప్, డీఎస్పీ శ్రీనివాసరావు, నగర సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


