రూ.19.76 కోట్లతో ఉద్యాన ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

రూ.19.76 కోట్లతో ఉద్యాన ప్రణాళిక

Mar 30 2026 8:32 AM | Updated on Mar 30 2026 8:32 AM

అనంతపురం అగ్రికల్చర్‌: ఏప్రిల్‌ నుంచి మొదలు కానున్న 2026–27 ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల అమలుకు జిల్లాకు రూ.19.76 కోట్లు బడ్జెట్‌ కేటాయించినట్లు ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. అందులో మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ హార్టికల్చర్‌ డెవలప్‌మెంట్‌ (ఎంఐడీహెచ్‌) కింద రూ.17.50 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస యోజనా (ఆర్‌కేవీవై) కింద రూ.2.26 కోట్ల బడ్జెట్‌ ఇచ్చారన్నారు. ఆయిల్‌ఫాం కింద మరికొంత బడ్జెట్‌ కేటాయించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో కొత్త తోటల విస్తరణ, పాత తోటల పునరుద్ధరణ, రెండు, మూడు సంవత్సరాల నిర్వహణ పథకం, యాంత్రీకరణ, పోస్టు హార్వెస్టింగ్‌ తదితర అన్ని రకాల పథకాలు అమలు చేయనున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement