కూడేరు: జోడు లింగాల సంగమేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం పార్వతీ పరమేశ్వరులకు అర్చకులు శివశంకర్‌శాస్త్రి, మహేష్, శివ, ప్రవీణ్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 8 గంటలకు ఆలయం నుంచి శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను మంగళవాయిద్యాల నడుమ పల్లకీలో ఆంజనేయస్వామి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ ఈడిగ సంఘం ఆధ్వర్యంలో వ్యాఘ్ర వాహనంపై ఆదిదంపతుల ఉత్సవ విగ్రహాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ పీర్ల చావిడి వరకు ఊరేగింపు చేశారు.
నేడు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ
అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు సెల్ నంబర్ 8977716661 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్ చేసే వినియోగదారులు తమ విద్యుత్ నంబర్‌ను తప్పకుండా తెలియజేయాలని సూచించారు.
జిల్లాలో డయల్ యువర్ ఎస్‌ఈ : అనంతపురం జిల్లాలో డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వహిస్తున్నట్లు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు సెల్‌నంబర్ 9154790350కు ఫిర్యాదు చేయాలని కోరారు.
రైలు పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం
గుంతకల్లు: గుంతకలు–నంచర్ల స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాం గుర్తించినట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. మృతిని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. 25 నుంచి 30 ఏళ్లు వయస్సు ఉంటుందన్నారు. బ్లూకలర్‌లో బ్లాక్ కలర్ షర్ట్, బ్లాక్ జీన్స్ ప్యాంట్ ధరించినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు వివరించారు. ఆచూకీ తెలిసిన వారు 7815865689కు సమాచారం ఇవ్వాలని జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.


