కళ్యాణదుర్గం రూరల్: భార్య చేతిలో దారుణ హత్యకు గురైన హనుమంతు మృతదేహన్ని అధికారులు ఆదివారం వెలికితీశారు. మండల పరిధిలోని పాతచెరువు గ్రామంలో భార్య సుకన్య భర్త హనుమంతును ముడునెలల క్రితం చంపి ఇంటి అవరణలో పాతిపెట్టిన ఘటన మూడురోజుల క్రితం బయట పడింది. నిందితురాలు సుకన్య రూరల్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయింది. ఆదివారం జిల్లా వైద్యాఽధికారి (హెచ్‌ఓడీ)శంకర నాయక్ బృందం, తహసీల్దార్ భాస్కర్, డీఎస్పీ రవిబాబు, సీఐ గణేష్ , గ్రామస్తుల సమక్షంలో హనుమంతు మృతదేహాన్ని వెలికితీసి ఫ్లోరెన్సిక్ ల్యాబ్ పంపారు.


