విరోష్‌.. ఫుల్‌ జోష్‌ | - | Sakshi
Sakshi News home page

విరోష్‌.. ఫుల్‌ జోష్‌

Mar 27 2026 8:49 AM | Updated on Mar 27 2026 9:08 AM

క్రేజీ స్టార్స్‌ విజయ్‌ దేవరకొండ, రష్మిక (విరోష్‌) జోడీ గురువారం అనంతపురంలో సందడి చేసింది. ఈ దంపతులిద్దరూ కలసి నటిస్తున్న ‘రణబలి’ చిత్రం షూటింగ్‌ త్వరలో జిల్లాలో జరగనుంది. ఈ క్రమంలోనే విరోష్‌ దంపతులు నగరానికి విచ్చేశారు. స్థానిక హౌసింగ్‌ బోర్డులోని అభయాంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపించారు. నూతన దంపతులకు పురోహితులు ఆత్మీయ స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందించి స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించారు. రష్మిక, విజయ్‌దేవరకొండను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. సెల్ఫీల కోసం పలువురు ఎగబడ్డారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం

విరోష్‌ జోడీ రాక సందర్భంగా అభిమానుల

కోలాహలం

విజయ్‌ దేవరకొండ, రష్మికను చూసిన ఆనందంలో నగరవాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement