అనంతపురం: జిల్లా ప్రజలకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ధర్మాన్ని కాపాడేందుకు జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడు శ్రీరాముడని పేర్కొన్నారు. లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరమైనదని, భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనదన్నారు.‘శ్రీరామనవమి అంటే పండుగ మాత్రమే కాదు.. సత్యం, ధర్మం, ఓర్పు కలిసిన జీవనమార్గం. ఆ మార్గంలో అందరూ పయనిద్దాం’ అని పిలుపునిచ్చారు. రామ నామం మధురం.. రామ నామం పవిత్రం..ఆ తారక మంత్రం ప్రజల జీవితాల్లో సుఖ శాంతులు నింపాలని ఆకాంక్షించారు.
శ్రీరాముని కటాక్షం అందరిపై ఉండాలి
అనంతపురం అర్బన్: జిల్లా ప్రజలకు కలెక్టర్ ఓ.ఆనంద్, ఎస్పీ పి. జగదీష్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. శ్రీరాముడు ఆచరించిన జీవిన విధానం మానవాళికి మార్గదర్శనమన్నారు. శ్రీరాముని కరుణ, కటాక్షాలతో జిల్లా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంట సిరి సంపదలు వెల్లివిరియాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఆనందమయ జీవితం గడపాలని కోరుకున్నారు.


