అవినీతి అధికారికి 12 ఏళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

అవినీతి అధికారికి 12 ఏళ్ల జైలు

Apr 1 2026 7:42 AM | Updated on Apr 1 2026 7:42 AM

అనంతపురం సెంట్రల్‌: కులాంతర వివాహం చేసుకున్న వారికి అందించే ప్రోత్సాహం మంజూరు చేసేందుకు ఓ వ్యక్తి నుంచి రూ. 4 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అసిస్టెట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి నాగభూషణంకు 12 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 2 లక్షల జరిమానా విధిస్తూ కర్నూలు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి శ్రీవిద్య మంగళవారం తీర్పు వెలువరించారు. ఆ వివరాలను అనంతపురం ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాయదుర్గానికి చెందిన కె.అజ్మిత్‌ 2014లో అనసూయమ్మను కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా మొలకాల్మూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కులాంతర వివాహం చేసుకున్నాడు. 2016లో గిరిజన సంక్షేమశాఖ ద్వారా రూ.50 వేల పోత్సాహకం కోసం అనంతపురం కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అప్పుడు అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌గా ఉన్న నాగభూషణం దరఖాస్తును ప్రాసెస్‌ చేయడానికి రూ.4 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు 2018 ఏప్రిల్‌ 26న ఏసీబీని ఆశ్రయించాడు. 27న అనంతపురం గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో నాగభూషణం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపారు. ఈ కేసుల్లో అన్ని సాక్ష్యాధారాలు రుజువుకావడంతో మంగళవారం తుదితీర్పు వెలువరిచినట్లు డీఎస్పీ వివరించారు. ప్రివెన్షన్‌ కరప్షన్‌ యాక్టు–1998 కింద 5 సంవత్సరాలు, సెక్షన్‌ 13(2) కింద 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించారు. అందులో ఫిర్యాదుదారుకు రూ.1.90 లక్షలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించినట్లు తెలిపారు.

కులాంతర వివాహ ప్రోత్సాహానికి రూ.4 వేలు డిమాండ్‌

2018లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

8 ఏళ్ల తర్వాత తీర్పు వెలువరించిన కోర్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement