మార్చి 29న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో రాధికా మర్చంట్ తళుక్కుమన్నారు. ఆమె నీతా అంబానీ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కనిపించారు. ఆమె సింపుల్ దుస్తుల్లో నిరాడంబరంగా కనిపించినప్పటికీ..తన చేతికి ఉన్న వాచ్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది.
చోటి బాహుగా పేరుగాంచిన ఆమె లైలాక్ రిచర్డ్ మిల్లే వాచ్‌తో తన లుక్‌ను హైలెట్ కనింపిచేలా చేశారామె. ఈ వాచ్‌లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 మాత్రమే ఉన్న అత్యంత అరుదైన వాచ్. దీని ధర వింటే కళ్లుబైర్లుకమ్మడం ఖాయం. రాధిక మణికట్టుపై ఉన్న ప్రత్యేక ఆకర్షణగా ఉన్న రిచర్డ్ మిల్లే వారి అత్యద్భుతమైన RM 75-01 ఫ్లయింగ్ టోర్బిల్లాన్ సఫైర్ వాచ్ ఇది.
సముద్ర స్ఫటికపు పారదర్శకత, గోతిక్ వాస్తుశిల్ప వైభవంతో మిళితమైన వాచ్. అద్భుత కళారూపానికి నిలయం ఈ వాచ్. దీన్ని అసాధారణంగా మార్చేది దాని పూర్తిగా ట్రాన్స్‌పరెంట్‌గా కనింపిచేలా చేసే డిజైన్. ఇది లోపల ఉన్న క్లిష్టమైన మెకానిజంను ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసే వీలు కల్పిస్తుంది. దీని పారదర్శక కేస్, రంగు, కాంతిని సున్నితంగా వెదజల్లుతూ, ఒక మృదువైన, ఛాయతో ఆకర్షణీయంగా ఉంటుంది.
ప్రత్యేకతలు..
వాచ్ తయారీకి 40 రోజుల నిరంతర గ్రైండింగ్‌తో సహా, వెయ్యి గంటలకు పైగా మెషీనింగ్ సమయం పడుతుంది. దీనిలోని భాగాలను అత్యంత సూక్షంగా ఉంటాయట, వాటిని ఎంతో సహనంతో అమర్చాల్సి ఉంటుందట. ఈ వాచ్‌ని టైటానియం స్క్రూలు, టైటానియం బేస్‌ప్లేట్ మెకానిజంతో రూపొందిస్తారు.
అదే సమయంలో 6 గంటల వద్ద ఉన్న ఫ్లయింగ్ టూర్‌బిల్లాన్ ప్రతి 60 సెకన్లకు ఒక పూర్తి భ్రమణం చేస్తుంది. అంతేగాదు ఈ వాచ సుమారు 65 గంటల వరకు ఫుల్ చార్జ్ ఉంటుందట. ఈ వాచ్ ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ. 21 కోట్లు.
(చదవండి: సాహసం శ్వాసగా సాగిపో బామ్మ..!)


