సాహసం శ్వాసగా సాగిపో బామ్మ..! | Vidya Kaur story: Woman driving at 72 goes viral | Sakshi
Sakshi News home page

సాహసం శ్వాసగా సాగిపో బామ్మ..!

Mar 31 2026 2:30 PM | Updated on Mar 31 2026 2:37 PM

Vidya Kaur story: Woman driving at 72 goes viral

యంగ్‌గా ఉన్నప్పుడు నేర్చుకోవడం వేరు..పెద్ద వయసు వచ్చాక కొత్తవి నేర్చుకోవాలన్న లోలోన ఏదో బెరుకు ఉంటుంది. కొందరు మాత్రం చాల డేర్‌గా నచ్చిన నైపుణ్యాలను అందుపుచ్చుకునేందుకు ముందుకొస్తారు. అలాంటి కోవకు చెందిందే ఈ విద్యాకౌర్‌.

మాజీ ఉపాధ్యాయురాలు, ప్రిన్సిపాల్‌ అయిన విద్యాకౌర్‌కి ‍డ్రైవింగ్‌ అంటే మహా ఇష్టం. ఎలాగైన నేర్చుకోవాలన్నది ఆమె డ్రీమ్‌. అయితే 59 ఏ‍ళ్ల వయసులో డ్డ్రైవింగ్‌ నేర్చుకుందామనుకుంటే..చాలా పెద్ద వయసు అని తిరస్కరించారు అధికారులు. అయితే విద్యాకౌర్‌ తగ్గేదే లే అంటూ ముందుకు సాగింది. 

ఆమెనే స్వయంగా కారు కొనుక్కుని పొరుగువారి సాయంతో డ్రైవింగ్‌ నేర్చుకున్నారామె. ప్రస్తుతం ఆమెనే స్వయంగా కారుని రయ్‌ రయ్‌మని నడిపేస్తోంది. సీనియర్‌ సిటిజన్‌ అనే మూసధోరణిని బద్దలు కొడుతూ..స్వేచ్ఛగా సాగిపోతోందామె. ఇక్కడ విద్యాకౌర్‌ కథ ఎవరో మన పరిమితుల్ని డిసైడ్‌ చేయడం కాదు..మన శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంటే ధైర్యంగా ముందుకు సాగిపోచ్చు అని చాటి చెబుతోంది ఈ సూపర్‌ బామ్మ స్టోరీ.

 

(చదవండి: చాయ్‌వాలాగా 103 ఏళ్ల బామ్మ..!)

 

Advertisement
 
Advertisement
Advertisement