చాయ్‌వాలాగా 103 ఏళ్ల బామ్మ..! | Vadodara Tea Seller Proves Hard Work Has No Age Limit Goes Viral | Sakshi
Sakshi News home page

చాయ్‌వాలాగా 103 ఏళ్ల బామ్మ..!

Mar 31 2026 12:47 PM | Updated on Mar 31 2026 12:55 PM

Vadodara Tea Seller Proves Hard Work Has No Age Limit Goes Viral

60 దాటగానే చాలామంది విశ్రాంతి తీసుకుంటారు. అలాంటిది ఈ బామ్మ 103 ఏళ్ల వయసులోనూ టీ స్టాల్‌ నడుపుతూ స్ఫూర్తిగా నిలిచింది. ఎవ్వరిమీద ఆధారపడకుండా స్వతంత్రంగా బతకాలన్న ఆమె దృఢసంకల్పానికి హ్యాట్సాప్‌ అనాల్సిందే. అంతేగాదు కష్టపడేతత్వానికి వయసుతో సంబంధం లేదని ఈ బామ్మ ప్రూవ్‌ చేసింది.

ఆ బామ్మే గుజరాత్‌లోని వడోదరకు చెందిని 108 ఏళ్ల కాశీబా. ఆమె మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయం సమీపంలోని చొన్న టీ స్టాల్‌ నడుపుతూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందామె. ఆమె అల్లం టీకి ఉన్న క్రేజీ అంత ఇంత కాదు. అక్కడ విద్యార్థులకు దశాబ్దాలుగా తన టీ రుచితో ఆకర్షిస్తుంటుందామె. స్వయంగా ఆమె అల్లం తురిమి తయారు చేస్తుంటుంది ఈ బామ్మ. 

ఆమె వయసులో అందరూ విశ్రాంతి ఆశిస్తారు..కానీ ఆమె అచంచలమైన సంకల్పంతో తన చిరు వ్యాపారాన్ని నడుపుతూ ఆత్మనిర్భరతకు అసలైన అర్థంగా మారింది. 1993 నుంచి ఆమె  ఈ టీస్టాల్‌ని నడుపుతుంది. అక్కడ ఎందరో విద్యార్థులకు అదొక మధుర జ్ఞాపకాల ప్రదేశం. కొందరు విద్యార్థులు అక్కడకు వచ్చి స్నేహితులతో కలిసి ఈ బామ్మ చేతి టీ తాగుతూ నాటి మధురస్ముతులను గుర్తుచేసుకుంటుంటారట. 

ఆమెకు కొడుకు, కోడలు, మనవళ్లు ఉన్నా..తను మాత్రం స్వతంత్రంగా బతికేందుకే ఆసక్తి కనబరుస్తుందట. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు​ కూడా హ్యాట్సాఫ్‌  బామ్మ..అందంగా జీవించడం అంటే ఇదే అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: కేవలం 'ఫ్లవర్‌ అనుకుంటివా.. పోషక విలువలున్న ఫుడ్‌'..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement