ఘనంగా రంగనాథస్వామి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా రంగనాథస్వామి రథోత్సవం

Mar 29 2026 7:10 AM | Updated on Mar 29 2026 7:10 AM

బ్రహ్మసముద్రం : మండలంలోని వేపులపర్తి గ్రామంలో వెలసిన లక్ష్మీరంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉదయం ఆలయంలో అభిషేకాలు, విశేష అలంకరణ, అర్చనలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం ఉత్సవ మూర్తులను రథంపై అధిష్టింపజేసి మేళాతాళాలతో భక్తులు లాగారు. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. భక్తులకు దాతల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement