గుంతకల్లు: స్థానిక రైల్వే స్టేషన్‌లోని రెండో నంబర్ ఫ్లాట్ ఫారంపై ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని శనివారం గుర్తించినట్లు జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. 30 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు, తెలుపు రంగు మల్టీ రంగు ఫుల్ షర్ట్, మల్టీకలర్ లుంగీ, బ్రౌన్ కలర్ ఫుల్ డ్రాయర్ ధరించాడు. కుడి ఛాతీపై బి.ఆస్మ, ఎడమ వైపు బి.వెంకటేష్ అనే పేర్లు ఇంగ్లిష్ అక్షరాల పచ్చబొట్టు, ఎడమ భుజంపై గుర్రం పచ్చబొట్టు ఉంది. ఆచూకీ తెలిసిన వారు 78158 65689 కు సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీసులు కోరారు.


