● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత
అనంతపురం: ఆర్టీసీలో పనిచేస్తున్న వేలాది మందికి ఉద్యోగ భదత్ర కల్పిస్తూ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడమే కాకుండా.. కుల వృత్తులపై ఆధారపడిన వారికి ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం అందించి కార్మిక, కర్షక సంక్షేమ పథకాల ప్రదాతగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో చోటు దక్కించుకున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి కొనియాడారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, నగర అధ్యక్షుడు మార్కెట్ ఖాజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంత వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. ట్రేడ్ యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించి, కేక్ చేసి మాట్లాడారు. ట్రేడ్ యూనియన్ సాగించిన పోరాటాలు స్ఫూర్తిదాయకమన్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే శ్రామికులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారి సంక్షేమానికి బాటలు వేశారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ రమేష్‌గౌడ్, మాజీ మేయర్ వసీం, మాజీ డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్‌రెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కొర్రపాడు హుస్సేన్ పీరా, రాజశేఖర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి సంపంగి రామాంజినేయులు, రాజారత్నం, అనిల్‌కుమార్‌గౌడ్, నగర అధ్యక్షుడు ఖాజా, కాకర్ల శ్రీనివాసరెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి రాజశేఖరరెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర్ రిజ్వాన్, జిల్లా అధ్యక్షుడు మొఘల్ సైఫుల్లా భేగ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కసనూరు రఘునాథ రెడ్డి, ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎం. శ్రీనివాసనాయక్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, న్యాయవాది నాగన్న, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, నాయకులు శ్రీదేవి, రాధాయాదవ్, శోభారాణి, శోభాబాయి, క్రిస్టియన్ మైనార్టీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ చిలకల థామస్, ఇంటలెక్చువల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టుబడి తానీషా, సోషల్ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలామ్ బాబా, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, కై లాష్ తదితరులు పాల్గొన్నారు.


