నేడు జంగంపల్లికి ‘రణబలి’ | - | Sakshi
Sakshi News home page

నేడు జంగంపల్లికి ‘రణబలి’

Mar 29 2026 7:10 AM | Updated on Mar 29 2026 7:10 AM

యల్లనూరు: రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఆదివారం యల్లనూరు మండలం జంగంపల్లి గ్రామంలో పర్యటించనున్నట్లు ‘రణబలి’ చిత్ర యూనిట్‌ మేనేజర్‌ సుబ్బు తెలిపారు. ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ ‘రణబలి’గా కనిపించనున్న విషయం తెలిసిందే. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్‌ పాలనలో జరిగిన యధార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఆ కాలంలోని సామాజిక పరిస్థితులు, స్వాభిమాన పోరాటాలు, భావోద్వేగ బంధాలను ప్రతిబించించేలా జంగంపల్లి కోట (బ్రిటీష్‌ పాలనలో నిర్మించిన) లో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విజయ్‌ దేవరకొండపై పలు సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం.

విద్యార్థుల ఘర్షణపై కేసు నమోదు

వజ్రకరూరు: స్థానిక కేవీ జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద శనివారం పదో విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణపై కేసు నమోదు చేసినట్లు వజ్రకరూరు ఎస్‌ఐ నాగస్వామి తెలిపారు. కొనకొండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులపై గూళ్యపాళ్యం గ్రామానికి చెందిన విద్యార్థులు దాడి చేశారన్నారు. ఘటనలో విద్యార్థి భరత్‌ గాయపడి గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. మరో బాధిత విద్యార్థి రాంచరణ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement