తప్పని గ్యాస్‌ తిప్పలు | - | Sakshi
Sakshi News home page

తప్పని గ్యాస్‌ తిప్పలు

Mar 21 2026 5:08 AM | Updated on Mar 21 2026 5:08 AM

శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026

వినియోగదారులు ఆందోళన చెందొద్దు : కలెక్టర్‌

అనంతపురం ఎడ్యుకేషన్‌: గ్యాస్‌ వినియోగదారులు ఆందోళన చెంద వద్దని, సరిపడు గ్యాస్‌ నిల్వలు ఉన్నాయని కలెక్టర్‌ ఆనంద్‌ స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి సకాలంలో గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేస్తున్నామన్నారు. శుక్రవారం ఆయన అనంతపురం రూరల్‌ మండలం ఆలమూరు వద్దనున్న ఉమా భారతి ఇండేన్‌ గ్యాస్‌ గోడౌన్‌, నగరంలోని ఏిపీహెచ్‌బీ కాలనీలోని పావన్‌ గ్యాస్‌ ఏజెన్సీని తనిఖీ చేశారు. వినియోగదారులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలని, ఓటీపీ ద్వారా డెలివరీ చేస్తారని చెప్పారు. ఏజెన్సీల వద్దకు వెళ్లి బుక్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఎవ్వరూ ఏజెన్సీల వద్దకు రావద్దని స్పష్టం చేశారు. ఇంటి వద్దనే గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేస్తారన్నారు.

రాయదుర్గంటౌన్‌/ కూడేరు: వినియోగదారులను వంటగ్యాస్‌ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్‌ సరఫరా మందగించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా వంటింటి కష్టాలు మొదలయ్యాయి. ఆన్‌లైన్‌ బుకింగ్‌ ముప్పుతిప్పలు పెడుతోంది. శుక్రవారం రాయదుర్గంలోని హెచ్‌పీ గ్యాస్‌ ఏజెన్సీ వద్దకు వినియోగదారులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రీఫిల్‌ కోసం క్యూలో పడిగాపులు కాసినా ప్రయోజనం లేకపోయింది. స్టాక్‌ లేదంటూ బోర్డు పెట్టారు. ఆదివారం స్టాక్‌ వస్తుందని తెలపడంతో నిరాశతో వెనుదిరిగారు. ఇక కూడేరులోని భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీ వద్దకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వినియోగదారులు పోటెత్తారు. ఖాళీ సిలిండర్లను క్యూలో పెట్టి గంటల తరబడి ఎండలోనే నిల్చున్నారు. కొందరికి మాత్రమే సిలిండర్లు అందడంతో మిగిలిన వారు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్న వారందరికీ గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని నిర్వాహకులు హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.

రంజాన్‌కు సర్వం సిద్ధం

అనంతపురం కల్చరల్‌: సత్య నిష్ట, ధర్మాచరణ, దానధర్మాలు, ఉపవాసాలతో పవిత్ర రంజాన్‌ మాసం ముగియడంతో శనివారం పండుగ జరుపుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. జిల్లా అంతటా రంజాన్‌ వేడుకలకు మసీదులు, ఈద్గాలలో ఏర్పాట్లు చేశారు. నెలరోజుల ఉపవాస దీక్షల్లో చివరిరోజు శుక్రవారం ఇఫ్తార్‌ వేళ మసీదులన్నీ ముస్లింలతో రద్దీగా మారాయి.

● ముస్లింలకు కలెక్టర్‌ ఆనంద్‌, జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్‌ కృపాకటాక్షాలతో పాడిపంటలతో జిల్లా సుభిక్షంగా ఉండాలని, అందరి ఇళ్లలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

ముస్లింలకు ‘అనంత’ రంజాన్‌ శుభాకాంక్షలు

అనంతపురం: ముస్లింలకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్‌ అంటే ఉపవాస దీక్షలు మాత్రమే కాదని.. మనిషిలోని చెడు భావనలు, అధర్మం, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగని పేర్కొన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక రంజాన్‌ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement