అనంతపురం ఎడ్యుకేషన్: రంజాన్ పండుగ నేపథ్యంలో శనివారం పదో తరగతి విద్యార్థులకు జరగాల్సిన ఇంగ్లిష్ పరీక్ష (13ఈ, 14ఈ)ను ప్రభుత్వ వాయిదా వేసిందని డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం తన చాంబరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాయిదా పడిన ఇంగ్లిష్ పరీక్ష ఏప్రిల్ 2న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. సంబంధిత విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ప్రధానోపాధ్యాయులు, పర్యవేక్షకులు పరీక్ష సమయానికి ముందుగానే కేంద్రాలకు చేరుకుని పరీక్ష సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.
నేటి ఓపెన్ స్కూల్ పరీక్షలు 30కు వాయిదా
ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షల్లో భాగంగా శనివారం 211–గణితం, 223–భారతీయ సంస్కృతి, వారసత్వం పరీక్షలు ఈనెల 30కు వాయిదా వేసినట్లు డీఈఓ తెలిపారు. ఆరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు. పరీక్షలు రాయనున్న అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. సమావేశంలో ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ వెంకటేష్ పాల్గొన్నారు.


