ఎస్కేయూ ప్రతిష్టను ఇనుమడింపజేస్తా | - | Sakshi
Sakshi News home page

ఎస్కేయూ ప్రతిష్టను ఇనుమడింపజేస్తా

Mar 29 2026 7:09 AM | Updated on Mar 29 2026 7:09 AM

అనంతపురం: ఎస్కేయూ వీసీగా ప్రొఫెసర్‌ ఎన్‌వీఆర్‌ జ్యోతి కుమార్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే, బీఆర్‌ అంబేడ్కర్‌, శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాలకు నివాళులర్పించారు. ఆయనకు రెక్టార్‌ వెంకటనాయుడు, రిజిస్ట్రార్‌ రమేష్‌ బాబు, ప్రిన్సిపాల్‌ డి.ఆంజనేయులు ఘనంగా స్వాగతం పలికారు. పాలకభవనం ముందు మోకరిల్లి నమస్కరించిన అనంతరం లోపలికి వెళ్లారు. ఇన్‌చార్జ్‌ వీసీ అనిత నుంచి వీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఎస్కేయూ ప్రతిష్టను జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement