పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ గ్యాస్ వినియోగదారులపై తీవ్రంగా పడుతోంది. సరఫరా మందగించడంతో గ్యాస్ డిమాండ్ అంతకంతకూ పెరిగిపోతోంది. కమర్షియల్ వంటగ్యాస్‌పై ఆధారపడిన హోటళ్ల నిర్వహణ భారంగా మారింది. గ్యాస్ దొరకని కారణంగా కొన్ని హోటళ్లు మూత పడుతున్నాయి. మరికొంతమంది పాత పద్ధతిలో కట్టెల పొయ్యిలపై వంట తయారు చేసి హోటళ్లను నెట్టుకొస్తున్నారు. ఇక గృహావసర వినియోగదారులకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో ప్రత్యేకంగా సమయం కేటాయించుకుని పుల్లలు ఏరుకొచ్చి కొందరు, కొనుక్కొచ్చి మరికొందరు పొయ్యి వెలిగిస్తున్నారు. ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని ఎదురుచూస్తున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం


