రాయదుర్గంటౌన్: అటవీ ప్రాంతం నుంచి మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటలకు రాయదుర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోకి ఓ ఎలుగుబంటి చేరుకుంది. వాకింగ్ చేస్తున్న కొందరు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులతో పాటు ఫారెస్ట్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో రెస్క్యూ టీమ్‌ను రంగంలో దించారు. బోన్ తెప్పించేలోపు ఎలుగుబంటి కళాశాల గోడ దూకి అక్కడ ఉన్న బాత్ రూములోకి దూరింది. దీంతో రెస్క్యూ టీమ్ దాదాపు మూడుగంటల పాటు శ్రమించి వలలు వేసి ఎలుగుబంటిని బంధించారు. స్థానిక పవువైద్యాధికారి పరీక్షించి ఎలుగుబంటి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించిన అనంతరం బోనులో తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదలారు.
కుమారుడి హత్యకేసులో తండ్రి అరెస్ట్
అనంతపురం సెంట్రల్: యువకుడి హత్య కేసులో కన్న తండ్రిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను మంగళవారం అనంతపురం వన్‌టౌన్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. బుక్కరాయసముద్రం మండలం పసులూరు గ్రామానికి చెందిన చింతమాను సురేంద్ర కుటుంబం కొన్నేళ్లుగా అనంతపురంలోని వైఎస్సార్‌కాలనీలో నివాసముంటోంది. సురేంద్ర కుమారుడు ప్రదీప్ తాగుడకు బానిసై జులాయిగా తిరిగేవాడు. ఈ క్రమంలో గతనెల 11న రాత్రి తండ్రితో గొడవ పడ్డాడు. నిన్ను చంపుతానంటూ తండ్రి సురేంద్రను మత్తులో ఉన్న ప్రదీప్ బెదిరించాడు. దీంతో తనను చంపుతాడనే భయంతో ఇనుపరాడ్‌తో సురేంద్ర దాడి చేయడంతో ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కర్నూలులోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి పరారీలో ఉన్న తండ్రిని మంగళవారం కలెక్టరేట్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.
పారిశ్రామికవేత్తలను
ప్రోత్సహించాలి : కలెక్టర్
అనంతపురం అర్బన్: పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను అన్ని విధాల ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.


