న్యూస్‌రీల్
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూసమస్యలపై అర్జీలను పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లో అందజేయాలని సూచించారు. అర్జీ పరిష్కార స్థితిని కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు.
నృసింహుడి
ఆలయంలో అద్భుతం
● స్వామి వారి పాదాలను తాకిన
సూర్య కిరణాలు
గుత్తి: పట్టణంలోని కోటపై వెలసిన అతి పురాతన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆదివారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్య కిరణాలు లక్ష్మీనరసింహస్వామి పాదాలపై ప్రసరించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని భక్తులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. గత కొన్ని దశాబ్దాలుగా సూర్య కిరణాలు ఉగాది పర్వదినం మరుసటిరోజు స్వామి పాదాలపై పడుతున్నాయని అర్చకులు తెలిపారు.


