అనంతపురం అర్బన్: ‘టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై కక్ష కట్టి తొలగించారు. ఇది సరైన తీరు కాదు. కార్మికులను రాజకీయాలకు అతీతంగా చూడాలి.’ అని మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి స్రవంతి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.రాజారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించిప మధ్యాహ్న భోజన పథకం, ఆయా స్వీపర్లు వాచ్‌మెన్‌ల సంఘం జిల్లా మహాసభలకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. మధ్యాహన భోజన కార్మికులకు గౌరవ వేతనం రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుంతకల్లు పట్టణంలో ఏప్రిల్ 18, 19 తేదీల్లో జరగనున్న ఏఐటీయూసీ జిల్లా మహా సభలకు కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. మహాసభలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌గౌడ్, నగర అధ్యక్షుడు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక..
మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా కవితమ్మ, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ఎం బాషా, ఉపాధ్యక్షురాలిగా ఉమాదేవి, చంద్రప్ప, వరలక్ష్మి, సహాయ కార్యదర్శులుగా వనజ, రత్నమ్మ, నారాయణ, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
ఆయా, స్వీపర్ల, వాచ్‌మెన్ సంఘం ఎన్నిక..
స్కూల్ ఆయా, స్వీపర్, వాచ్‌మెన్ సంఘం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షురాలిగా లక్ష్మిదేవి, కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా దుర్గమ్మ, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ఎం బాషా, ఉపాధ్యక్షులుగా పెద్దక్క, వెంకటలక్ష్మి, రత్నమ్మ, సహాయ కార్యదర్శులుగా నాగమణి, హజీవ్, ఆలీబాషా, కార్యకవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.


