రాప్తాడు రూరల్: కారు ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం రూరల్ పరిధిలోని సోములదొడ్డికి చెందిన దాసరి రామకృష్ణ (65), నారాయణస్వామి మంగళవారం ద్విచక్ర వాహనంపై 44వ జాతీయ రహదారిపై పామురాయికి వెళుతుండగా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. బైక్‌పై వెనుక కూర్చొన్న రామకృష్ణ ఎగిరి రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఘటనపై అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
గోవా మద్యం బాటిళ్లు స్వాధీనం
తాడిపత్రి టౌన్: మండలంలోని చుక్కలూరు వద్ద ఎకై ్సజ్ అధికారులు మంగళవారం చేపట్టిన వాహనాల తనిఖీల్లో గోవా నుంచి మద్యం బాటిళ్లతో వస్తున్న కారు పట్టుబడింది. వాహనాన్ని అధికారులు సీజ్ చేసి, 36 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న యాడికి మండలం రామరాజుపల్లికి చెందిన పైలా కొండారెడ్డి పరారీ కాగా, రఫీ వలి పట్టుబడ్డాడు. పరారీలో వున్న కొండారెడ్డి కోసం గాలిస్తున్న అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్లు గడ్డం నాయుడు, జయనాథరెడ్డి పాల్గొన్నారు.


