●భక్తులతో పోటెత్తిన మురడి
డి.హీరేహాళ్ మండలం మురడి గ్రామంలో ఆంజనేయస్వామి బ్రహ్మ రథోత్సవం శనివారం వైభవంగా సాగింది. దివ్య స్వరూపుడి దర్శనం కోసం ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. రథం వద్ద మహిళలు పొర్లుదండాలతో మొక్కు తీర్చుకున్నారు. యువకుల నందికోలు నాట్యం, కోలాటం, చెక్కభజన వంటివి ఆకట్టుకున్నాయి. స్వామివారి ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆంజనేయస్వామి ఆలయం వద్ద లంకా దహనం నిర్వహించనున్నారు.
–డి.హీరేహాళ్(రాయదుర్గం):


