జిల్లా బంద్‌కు మద్దతు ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

జిల్లా బంద్‌కు మద్దతు ఇవ్వండి

Mar 23 2026 8:28 AM | Updated on Mar 23 2026 8:28 AM

అనంతపురం: కరువు సీమలో కల్పతరువుగా విరాజిల్లుతున్న ఆర్డీటీని పరిరక్షించాలన్న డిమాండ్‌తో ఏప్రిల్‌ 9న సీపీఐ ఉమ్మడి అనంతపురం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ , సీపీఎం మద్దతు ఇవ్వాలని సీపీఐ కోరింది. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డితో పాటు సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, నగర కార్యదర్శి రామిరెడ్డి, బాలరంగయ్యలను సీపీఐ జిల్లా బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్‌ మాట్లాడుతూ.. ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌ చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు. ఎన్నో ఆందోళనలు, నిరసనలు చేపట్టినా ఫలితం లేకపోయిందన్నారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ, సీపీఎం నాయకులను మాత్రమే కలిశామని, తక్కిన రాజకీయ, కుల సంఘాలను కలిసి బంద్‌ను విజయవంతం చేయాలని కోరతామన్నారు. ఏప్రిల్‌ 3న అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్‌ కార్యాచరణకు శ్రీకారం చుడతామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణస్వామి, సహాయ కార్యదర్శి మల్లికార్జున, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీరాములు, కేశవ రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ, సీపీఎం మద్దతు కోరిన సీపీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement