అనంతపురం: ఏప్రిల్‌లో జరగనున్న జేఎన్‌టీయూ (అనంతపురం) 15వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని చాన్సలర్/ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం అమరావతిలో ఆహ్వాన పత్రికను వీసీ స్వయంగా గవర్నర్‌కు అందజేసి విన్నవించారు. యూనివర్సిటీ చేపట్టిన కార్యక్రమాలు, గౌరవ డాక్టరేట్ ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. గౌరవ డాక్టరేట్‌ను భారతదేశ క్షిపణి పుత్రి టెస్సీ థామస్‌కు ఇవ్వనున్నారు. ఇందుకు వీసీని గవర్నర్ అభినందించారు.


