సుర్రుమన్న సూరీడు | - | Sakshi
Sakshi News home page

సుర్రుమన్న సూరీడు

Mar 30 2026 8:31 AM | Updated on Mar 30 2026 8:31 AM

అనంతపురం అగ్రికల్చర్‌: సూరీడు సుర్రుమన్నాడు. ఆదివారం మధ్యాహ్నం వరకు కాస్త చల్లబడినట్లు కనిపించిన సూరీడు తర్వాత నిప్పులు కురిపించాడు. సండే కాస్తా మండేలా వేసవితాపం కొనసాగింది. కళ్యాణదుర్గంలో 40.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో కూడా 38 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదైంది. రాత్రి కూడా 25 నుంచి 28 డిగ్రీల మధ్య తీవ్రస్థాయిలో ఉక్కపోత నమోదైంది. జనం బయటకు రావడానికే భయపడ్డారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ఇక రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదు కావడంతో జనానికి ముచ్చెటమలు పట్టాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్‌, మే నెలల్లో భానుడి భగభగలు మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్‌లో 44 నుంచి 45 డిగ్రీల గరిష్ట సూచీని తాకే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. మండే ఎండలకు వడదెబ్బకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement