పామురాయి వద్ద 544డీ జాతీయ రహదారి ప్రవేశ మార్గం
శింగనమల సమీపంలో ఫ్లై ఓవర్‌పై ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు
సి.బండమీదపల్లి వద్ద దూసుకెళుతున్న వాహనాలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చొరవ కారణంగా 544డీ జాతీయ రహదారి మంజూరై, నిర్మాణ పనులు జోరుగా సాగాయి. అనంతపురం నుంచి హైదరాబాద్ మార్గంలోని 44వ జాతీయ రహదారికి అనుసంధానిస్తూ పామురాయి వద్ద నుంచి విజయవాడ వరకు నాలుగు లైన్ల రహదారి ప్రస్తుతం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కొన్ని చోట్ల సాగుతున్న పనులు సైతం చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే తాడిపత్రి నుంచి అనంతపురం వరకూ 544డీ జాతీయ రహదారిపై వాహనాలు దూసుకెళుతున్నాయి. నాడు వైఎస్ జగన్ తీసుకున్న చొరవ కారణంగానే ఈ రహదారి అద్భుతంగా తయారైదంటూ వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం:


