అనంతపురం అర్బన్: ‘జనగణనలో భాగంగా మొదటి దశలో చేపట్టనున్న గృహగణన పారదర్శకంగా నిర్వహించాలి. పూర్తిస్థాయిలో సర్వే చేయాలి. ఒక్క ఇంటినీ విడిచిపెట్టకూడదు. సెన్సెన్స్ మార్గదర్శాల ప్రకారం సమగ్ర వివరాలను సేకరించాలి.’’ అని డీఆర్‌ఓ ఎ.మలోల సెన్సెస్ ఫీల్డ్ ట్రైనర్లకు సూచించారు. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో వారం రోజులుగా నిర్వహిస్తున్న జనగణనపై ప్రత్యేక శిక్షణ తరగతులు ఆదివారం ముగిసాయి. మూడు బ్యాచ్‌లుగా 82 మంది ఫీల్డ్ ట్రైనర్లకు ముగింపు కార్యక్రమంలో డీఆర్‌ఓ మాట్లాడారు. శిక్షణ పొందిన ఫీల్డ్ ట్రైనర్లు క్షేత్రస్థాయిలోని సెన్సెస్ సిబ్బందికి జనగణనపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే http:// census. ap. gov. in/ se వెబ్‌సైట్‌లో స్వీయగణన ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. కొన్ని ఇళ్లకు వెళ్లి సమాచారం సేకరించే ప్రక్రియను డీఆర్‌ఓ పరిశీలించారు.


