అనంతపురం అర్బన్: వంట గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌ను నిరోధించేందుకు మండలస్థాయిలో రెవెన్యూ, పౌర సరఫరాలు, పోలీసు శాఖతో కలసి సంయుక్తంగా టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు జేసీ సి.విష్ణుచరణ్ తెలిపారు. ఈ నెల 23న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘బ్లాక్‌లో డెలివరీ’ కథనానికి ఆయన స్పందించారు. జిల్లాలోని హోటళ్లు, మాల్స్, పెద్ద టిఫిన్ సెంటర్లు, బేకరీలు, కేటరర్లు, వీధి స్థాయి వ్యాపార కేంద్రాలు, వాణిజ్య సంస్థలపై నిఘా ఉంచి, తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీ వద్ద వీఆర్‌ఓని ఏర్పాటు చేసి, డొమెస్టిక్ సిలిండర్లు సక్రమంగా పంపిణీ అయ్యేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. అక్రమంగా సిలిండర్లు నిల్వ ఉంచిన, బ్లాక్ మార్కెట్ చేస్తున్న ప్రదేశాల్లో దాడులు నిర్వహించి ఆరుగురిపై 6–ఎ కేసులు నమోదు చేసి 85 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై చట్టపరమైన చర్యలకు సిఫారుసు చేశామన్నారు.
క్షయ నివారణలో భాగస్వాములు కండి
అనంతపురం: క్షయ వ్యాధి నివారణలో అందరూ భాగస్వాములు కావాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈబీ దేవి పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా లెప్రసి ఎయిడ్స్, క్షయ వ్యాధి నివారణా అధికారి డాక్టర్ బి జయలక్ష్మి, క్షయ వ్యాధి నిపుణులు డాక్టర్ సుధీంద్ర, డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ అహమ్మద్, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ మనోహర్‌రెడ్డి, డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ రమణ, డెమో నాగరాజు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైద్య ఉద్యోగులు, ఆశాలు, నర్సింగ్ విద్యార్థులతో నగరంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి డీఎంహెచ్‌ఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.


