పశ్చిమ ఆసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలతో వంట గ్యాస్‌కు కరువొచ్చింది. దీంతో ఇళ్లలోనూ గ్యాస్ స్టౌ వెలగని పరిస్థితి. దీంతో పల్లె, పట్నం తేడా లేకుండా చాలామంది మళ్లీ కట్టెల పొయ్యిని ఆశ్రయిస్తున్నారు. పట్టణాల్లోని హోటళ్లలోనూ కట్టెలతోనే ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో నగర వాసులూ ఆటోలు, ద్విచక్రవాహనాలపై శివారు ప్రాంతాలకు వెళ్లి నాలుగు కర్రలు ఏరుకుని వస్తున్నారు. తమకా భాగ్యం కూడా లేకుండా పోతోందని అపార్ట్‌మెంట్ వాసులంతా అల్లాడిపోతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం


