ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి

Apr 1 2026 7:36 AM | Updated on Apr 1 2026 7:36 AM

అనంతపురం అర్బన్‌: తీవ్ర ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులు ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ సూచించారు. జిల్లా సమాచార పౌర సంబంధాలు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, అధికార యంత్రాంగం సంయుక్తంగా మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు మెగా ఉచిత వైద్యశిబిరాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం స్వయంగా వైద్యపరీక్షలు చేయించుకుని, మాట్లాడారు. మీడియా మిత్రుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి డీంహెచ్‌ఓ, జీజీహెచ్‌, ప్రభుత్వ వైద్యకళాశాల బృందం, ఎన్‌టీఆర్‌ వైద్యసేవ అఽధికారులు పూర్తి సహకారం అందించారన్నారు. కాగా, జర్నలిస్టుల కోసం నిర్వహించిన మెగా ఉచిత వైద్యశిబరానికి విశేష స్పందన లభించింది. 236 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు సేవలు అందుకున్నారు. ఈ సందర్భంగా డీఐపీఆర్‌ఓ బాలకొండయ్య మాట్లాడుతూ.. శిబిరం విజయవంతం చేసిన జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు తోడ్పాటు అందించిన డీఎంహెచ్‌ఓ ఈబీదేవి, డాక్టర్‌ గంగాధరెడ్డి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ మల్లీశ్వరి, అడ్మినిస్టేటివ్‌ ఆఫీసర్‌ మల్లికార్జునరెడ్డి, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి అలెగ్జాండర్‌, ప్రైవేటు ఆస్పతుల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టరేట్‌ ఉద్యోగులు శ్రీనివాసమూర్తి, పురుషోత్తం, రామప్ప, సమాచార శాఖ ఉద్యోగులు దామోదర్‌రెడ్డి, దుర్గా సుహాసిని, ప్రభావతి, చాంద్‌బాషా, కమల్‌బాషా, తాజుద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement