రాప్తాడురూరల్: కరువు కష్టాలతో పోరాడుతున్న అనంతపురం జిల్లాకు రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఆశాకిరణం అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐదు దశాబ్దాలుగా జిల్లాకు అండగా నిలిచిన ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం హర్షణీయమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్డీటీని ఇబ్బందులకు గురిచేసే పరిస్థితులు ఇటీవల నెలకొనడం బాధాకరమన్నారు. అయితే ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆందోళనలు, ప్రజల మద్దతును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఆర్డీటీ మరింత విస్తృతంగా సేవలు అందించి, అనంతపురం జిల్లాలో అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు.
ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌పై ‘తోపుదుర్తి’ హర్షం


