గాండ్లపెంట: మండలంలోని కటారుపల్లిలో జరుగుతున్న విశ్వకవి యోగి వేమన బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి గొడుగుల మెరవణి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కటారుపల్లి, గొల్లపల్లి గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా గొడుగులను తీసుకెళ్తూ మెరవణి నిర్వహించారు. వేమన భక్తులు స్వామిగొడుగులకు టెంకాయలు సమర్పించారు. కార్యక్రమంలో కేరళ నుంచి వచ్చిన కళాకారుల డ్రమ్స్ వాయిద్య ప్రదర్శన, కథాకళి నృత్యం, కేరళ మిర్రర్ వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గొడుగుల మెరవణి తెల్లవారుజామున వరకు కొనసాగింది. దీంతో నాలుగు రోజుల పాటు కొనసాగిన బ్రహ్మోత్సవాలు ముగిశాయి.


