గుత్తి: స్థానిక రైల్వేస్టేషన్ అవుటర్ సిగ్నల్ పాయింట్ వద్ద తిరుచానూరు ఎక్స్‌ప్రెస్ రైలులో చైన్‌స్నాచింగ్ జరిగింది. చర్లపల్లి నుంచి తిరుపతికి బయలుదేరిన రైలు (07017) సోమవారం గుత్తి రైల్వే స్టేషన్ అవుటర్ సిగ్నల్ పాయింట్ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో ఎస్–5 కోచ్‌లోకి చొరబడిన దుండగులు ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును అపహరించి రైలు దిగి ఉడాయించాడు. అయితే ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రైల్వే పోలీసులు తెలిపారు. కాగా, మహిళా ప్రయాణికురాలి మెడలోని బంగారు చైన్‌ను దుండగుడు ఎత్తుకెళ్లినట్లు పలువురు ప్రయాణికులు స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా సోమవారం చైన్‌స్నాచింగ్ చోటు చేసుకున్న ప్రాంతంలోనే పలుమార్లు రైళ్లలో చోరీలు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ విషయం తెలిసినా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా తమకు ఎలాంటి ఫిర్యాదు పోలీసులు బుకాయిస్తుండడం పరిపాటిగా మారిపోయింది.


