అనంతపురం: వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాయలసీమ జోనల్ సమావేశం సోమవారం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు పాల్గొననున్నారు. అనంతపురం నగరంలోని సూరజ్ గ్రాండ్ హోటల్‌లో జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా..అనంతపుర నగరానికి వచ్చిన సుధాకర్ బాబును అనంతపురం జిల్లా ఎస్సీ సెల్ ఇంచార్జ్ కొర్రపాటి శరత్ బాబు, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో మంత్రి ఆంజనేయులు, సిద్దరాంపురం సర్పంచ్ రామాంజనేయులు, సాకే అశోక్ కుమార్ ,మారుతి , తదితరులు పాల్గొన్నారు.


