Mumbai Indians
-
కంగ్రాట్స్ సూర్యా భాయ్.. తండ్రిగా ప్రమోషన్!
టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తండ్రయ్యాడు. అతడి భార్య దేవీషా షెట్టీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో ఈ శుభవార్త తెలియడంతో, కుటుంబంతో సమయం గడిపేందుకు సూర్య జట్టుకు దూరమయ్యాడు. దీంతో మే 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగాల్సిన కీలక మ్యాచ్‌కు అతడి లభ్యతపై సందేహాలు నెలకొన్నాయి. బిడ్డ పుట్టిన కారణంగా, కుటుంబ బాగోగులు చూసుకోవడానికి సూర్య ఈ వారం జట్టుతో కలిసి రాయ్‌పూర్‌కు ప్రయాణించలేదు. 2016లో వివాహం చేసుకున్న సూర్య-దేవీషా జంట, తమ కుమార్తె రాకతో ఆనందంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సూర్యకుమార్ దంపతులకు అభిమానులు కంగ్రాట్స్ తెలిపారు. ‘ కంగ్రాట్స్ సూర్యా భాయ్’ అని కామెంట్లు పెడుతున్నారు.సూర్య క్రికెట్ ప్రయాణంలో దేవీషా నిరంతరం మద్దతుగా నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ శుభ సందర్భంలో క్రికెట్ ప్రపంచం నుంచి ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ను కెప్టెన్సీ సమస్య వెంటాడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పితో బాధపడుతుండటంతో గత మ్యాచ్‌లో (లక్నో సూపర్‌జెయింట్స్‌పై) సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును గెలిపించాడు. హార్దిక్ ఇంకా కోలుకోకపోవడం, సూర్య కుటుంబ కారణాలతో అందుబాటులో లేకపోవడంతో ఆర్సీబీతో మ్యాచ్‌కు బుమ్రా స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశముంది. View this post on Instagram A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar) చదవండి: తొలి క్రికెటర్‌గా మిచెల్ మార్ష్! -
ముంబై ఇండియన్స్‌కు మరో బిగ్ షాక్
ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో గత మ్యాచ్‌లో (లక్నో) కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై ఇండియన్స్ క్యాంప్‌ను వీడాడని సమాచారం. హార్దిక్ గాయం కారణంగా ఆర్సీబీతో జరుగబోయే తదుపరి మ్యాచ్‌కు (మే 10న) కూడా దూరమయ్యాడని తెలుస్తోంది. హార్దిక్ ఇవాళ (మే 6) జట్టుతో కలిసి రాయ్‌పూర్‌కు (ఆర్సీబీ మ్యాచ్‌కు వేదిక) వెళ్లే ఫ్లైట్ ఎక్కలేదు. దీంతో అతను ఆర్సీబీ మ్యాచ్‌లో ఆడే అవకాశం కనిపించడం లేదు.మరోవైపు ఆర్సీబీ మ్యాచ్‌కు సూర్యకుమార్ కూడా అందుబాటులో ఉండడని సమాచారం. సూర్యకుమార్ త్వరలో తండ్రి కానున్న నేపథ్యంలో భార్యకు దగ్గరగా ఉండేందుకు జట్టును వీడినట్లు తెలుస్తోంది. ఇద్దరు కెప్టెన్లు ఒకేసారి జట్టుకు అందుబాటులో లేకపోవడం మినుకుమినుకుమంటున్న ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేయనుంది.వీరి గైర్హాజరీలో కెప్టెన్సీ ఎవరు చేపడతారన్న అంశం ప్రస్తుతం ముంబై ఇండియన్స్ అభిమానులను సందిగ్దంలో పడేస్తుంది. రోహిత్ శర్మ కాకుండా బుమ్రా, తిలక్ వర్మ, రికెల్టన్ రూపంలో మూడు ఆప్షన్లు ఉన్నా, ఎవరన్నదే ప్రశ్నార్థకం.ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్ గత మ్యాచ్‌లో లక్నోపై గెలిచినా, ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా లేనట్లే అనుకోవాలి. టెక్నికల్‌గా రేసులో ఉన్నా, ముంబై ప్లే ఆఫ్స్ చేరాలంటే చాలా అద్భుతాలు జరగాలి. ఇప్పటివరకు ఆ జట్టు 10 మ్యాచ్‌ల్లో మూడే విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్‌ల కోసం ఇప్పటికే 6 జట్ల మధ్య ప్రధాన పోటీ జరుగుతుంది. ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా ఉన్న పంజాబ్ సహా ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్, గుజరాత్, సీఎస్కే ప్లే ఆఫ్స్ బెర్త్‌ల కొసం నువ్వా-నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. ఈ జట్లను దాటి తొమ్మిదో స్థానంలో ఉన్న ముంబై ప్లే ఆఫ్స్ రేసులోకి రావడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. -
బిగ్ న్యూస్.. జట్టుకు దూరంగా హార్దిక్
ఐపీఎల్ 2026 నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌కు సంబంధించి బిగ్ న్యూస్ అందుతుంది. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టుతో కలిసి తదుపరి మ్యాచ్‌కు (ఆర్సీబీ) వేదిక అయిన రాయ్‌పూర్‌కు వెళ్లలేదు. ఈ విషయం ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హార్దిక్ ఉద్దేశపూర్వకంగా జట్టుకు దూరంగా ఉన్నాడా.. లేక యాజమాన్యమే అతన్ని దూరం పెట్టిందా అని ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారు.కాగా, హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక జట్టు ప్రదర్శన దారుణంగా మారిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో ముంబై ప్రదర్శన మరీ ఘోరంగా ఉంది. కెప్టెన్‌గా, ఆటగాడిగా హార్దిక్ పూర్తిగా చేతులెత్తేశాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఏకంగా 7 పరాజయాలు ఎదుర్కొని ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా అసాధ్యం చేశాడు. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.వ్యక్తిగతంగానూ హార్దిక్ దారుణ ప్రదర్శనలు చేశాడు. 8 మ్యాచ్‌ల్లో కేవలం 146 పరుగులు చేసి, 4 వికెట్లు మాత్రమే తీశాడు. వరుస పరాజయాల తర్వాత హార్దిక్ గత మ్యాచ్‌లో (లక్నో) ఆడలేదు. ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి జట్టును గెలిపించాడు. టాస్ సమయంలో స్కై హార్దిక్ గురించి మాట్లాడుతూ.. అనారోగ్యం అని సర్ది చెప్పాడు. అయితే అప్పుడు హార్దిక్ గైర్హాజరీకి కారణం వేరని తెలుస్తుంది.మేనేజ్మెంట్ ఘాటుగా మందలించడంతో హర్ట్ అయ్యి జట్టుకు దూరంగా ఉంటున్నాడని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. తాజాగా హార్దిక్ జట్టుతో కలిసి ప్రయాణించకపోవడం పై ప్రచారానికి మరింత బలాన్నిస్తుంది. హార్దిక్ త్వరలో జట్టుతో కలుస్తాడని సహచరులు చెబుతున్నా, అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో ముంబై పని దాదాపుగా అయిపోయినట్లే. అధికారకంగా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నా, అది జరిగే పని కాదు. దీంతో హార్దిక్ ముందే జట్టు నుంచి తప్పుకుని ఉండవచ్చు. కాగా, మే 10న రాయ్‌పూర్ వేదికగా జరుగబోయే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆర్సీబీతో తలపడాల్సి ఉంది. -
బుమ్రా ఫెయిల్యూర్‌కు కారణమిదే: రవిశాస్త్రి
ఐపీఎల్-2026లో టీమిండియా పేస్ గుర్రం, ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేలవ ఫామ్ కొనసాగుతోంది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బుమ్రా విఫలమయ్యాడు. తన శైలికి విరుద్దంగా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. జస్ప్రీత్ తన నాలుగు ఓవర్ల కోటాలో 11.20 ఏకానమీ రేటుతో ఏకంగా 45 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ సీనియర్ పేసర్ కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లో బుమ్రా మొత్తంగా కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.ప్రతీ సీజన్లో పర్పుల్ క్యాప్ రేసులో ఉండే బుమ్రా.. ఈసారి ఇలాంటి ప్రదర్శన చేయడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశమైంది.ఈ నేపథ్యలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిరంతరాయంగా మ్యాచ్‌లు ఆడటం వల్ల బుమ్రాపై వర్క్‌లోడ్ పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అధిక పనిభారం వల్లే బుమ్రా రాణించలేకపోతున్నాడని శాస్త్రి చెప్పుకొచ్చారు."బుమ్రా గత 12 నెలలుగా అవిరామంగా క్రికెట్ ఆడుతున్నాడు. ఈ భారీ వర్క్‌లోడ్‌తో అతడు ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అతడు శారీరకంగా, మానసికంగా అలిసిపోయినట్లు కన్పిస్తున్నాడు. అతడు పేలవ ప్రదర్శనకు ఇది ప్రధాన కారణం. ముంబై ఇండియన్స్ బుమ్రా పట్ల జాగ్రత్త వహించాలి. రాబోయే రెండు ఏళ్లలో భారత జట్టు బిజీ షెడ్యూల్‌తో గడపనుంది. పలు టెస్టు సిరీస్‌లు, అలాగే వన్డే ప్రపంచ కప్ వంటి కీలక టోర్నమెంట్లు జరగనున్నాయి. బుమ్రా భారత జట్టకు చాలా కీలకం కాబట్టి, ముంబై మేనెజ్మెంట్ అతడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని" ఛాంపియన్స్ వాలీ కామెంటరీ కార్యక్రమంలో రవిశాస్త్రి పేర్కొన్నారు.చదవండి: IPL 2026: 'వావ్ వాట్ ఏ ప్లేయర్.. ఏ మాత్రం మారలేదు' -
'వావ్ వాట్ ఏ ప్లేయర్.. ఏ మాత్రం మారలేదు'
ఐపీఎల్-2026 సీజన్లో సోమవారం ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐదు మ్యాచ్‌ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ తన లోని క్లాస్‌ను మరోసారి చూపించాడు.229 పరుగుల భారీ లక్ష్య చేధనలో హిట్‌మ్యాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్‌తో కలిసి స్కోర్ బోర్డును రోహిత్ పరుగులు పెట్టించాడు. రోహిత్ కేవలం 44 బంతుల్లోనే 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 84 పరుగులు చేశాడు. 39 ఏళ్ల వయసులోనూ ఏ మాత్రం అతడి బ్యాటింగ్ తగ్గలేదని ఈ ఇన్నింగ్స్ చూస్తే మనకు అర్ధమవుతోంది. ఓవరాల్‌గాఈ సీజన్లో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన రోహిత్, 174.01 స్ట్రైక్ రేటుతో 221 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మపై లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు."వాట్ ఏ ప్లేయర్.. వాట్ ఏ ప్లేయర్. రోహిత్ శర్మ ఒక అద్భుతమైన ఆటగాడు. గతంలో ఆస్ట్రేలియా కోచ్‌గా ఉన్నప్పుడు ప్రత్యర్థిగా అతడి సత్తాను చూశాను. ఇప్పుడు ఎల్ఎస్జీ కోచ్‌గా అదే చూస్తున్నాను. అతడి బ్యాటింగ్‌లో ఏ మాత్రం మార్పు రాలేదు. ప్రపంచంలోని గొప్ప ప్లేయర్లు అందరిని చూసేందుకు ఐపీఎల్ ఒక వేదిక" అని లాంగర్ పేర్కొన్నాడు.కాగా రోహిత్ శర్మకు ఆస్ట్రేలియాపై గొప్ప రికార్డు ఉంది. ముఖ్యంగా వైట్‌బాల్ క్రికెట్లో ఆసీస్ బౌలర్లకు రోహిత్ చుక్కలు చూపించేవాడు. ఆస్ట్రేలియాలోని బౌన్సీ పిచ్‌లపై సైతం రోహిత్ తనదైన శైలిలో చెలరేగిపోయేవాడు.చదవండి: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. ఇంటికి వెళ్లిపోయిన కెప్టెన్? -
హార్దిక్ పాండ్యాపై వేటు.. ముంబై కెప్టెన్‌గా తొలగింపు?
రెండేళ్ల క్రితం ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. ముంబై సారథిగా అరంగేట్రంలోనే చేదు అనుభవం చవిచూశాడు. ఐపీఎల్-2024లో హార్దిక్ కెప్టెన్సీలో ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.మళ్లీ పాత కథే అయితే, గతేడాది మాత్రం మంచి ప్రదర్శన కనబరిచింది. పద్నాలుగింట ఎనిమిది గెలిచి ప్లే ఆఫ్స్ చేరింది. దీంతో హార్దిక్ కెప్టెన్సీపై విమర్శలు తగ్గాయి. కానీ ఈ సీజన్లో మళ్లీ పాత కథే పునరావృతమవుతోంది. ఐపీఎల్-2026లో ఇప్పటికి పది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ముంబై కేవలం మూడు గెలిచింది.సొంతమైదానం వాంఖడేలో వరుసగా నాలుగు పరాజయాల తర్వాత సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచి.. మూడో విజయం నమోదు చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బదులు సూర్యకుమార్ యాదవ్ ముంబై సారథిగా వ్యవహరించాడు. వెన్నునొప్పి కారణంగా హార్దిక్ మ్యాచ్‌కు దూరమైనట్లు యాజమాన్యం వెల్లడించింది.కావాలనే పక్కనపెట్టారుఅయితే, ఇటు బ్యాటింగ్.. అటు బౌలింగ్‌లో విఫలమవుతూ.. కెప్టెన్‌గానూ తేలిపోతున్న హార్దిక్ పాండ్యాను కావాలనే పక్కనపెట్టారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు హార్దిక్‌పై వేటు వేసి అతడిని సారథ్య బాధ్యతల నుంచి తొలగిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.యాజమాన్యం ఆలోచన ఏమిటి?ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం హార్దిక్ పాండ్యాకు మద్దతుగానే ఉండనున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనం ప్రచురించింది. హార్దిక్ కెప్టెన్సీ శైలిపై యాజమాన్యానికి ఎలాంటి ఫిర్యాదులూ లేవని.. అతడు జట్టును విజయవంతంగా నడిపించగలడనే నమ్మకంతో ఉన్నట్లు పేర్కొంది.కాగా వరుస ఓటముల నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తగా.. జట్టు సమిష్టి వైఫల్యానికి పాండ్యా ఒక్కడినే బాధ్యుడిని చేయలేమని హెడ్‌కోచ్ మహేళ జయవర్దనే ఇప్పటికే స్పష్టం చేశాడు. యాజమాన్యం సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ముంబై ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ స్థాయికి తగ్గట్లుగా ఆడటం లేదన్న సంగతి తెలిసిందే. చదవండి: జై శ్రీరామ్.. 15 ఏళ్ల బాధ నేటితో తీరింది: రఘు శర్మ -
ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. ఇంటికి వెళ్లిపోయిన కెప్టెన్?
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. సోమవారం ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయాన్ని అందుకుంది. 229 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఊదిపడేసింది.ఈ విజయంలో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(83), రోహిత్ శర్మ(84) కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా బదులుగా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించాడు. హార్దిక్ వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నట్లు టాస్ సందర్భంగా సూర్యకుమార్ తెలిపాడు.అయితే ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్‌ల్లో పాండ్యా ఆడే సూచనలు కన్పించడం లేదు. లక్నోతో మ్యాచ్ అనంతరం హార్దిక్ గాయంపై ముంబై వికెట్ కీపర్ బ్యాటర్ రికెల్టన్ అప్డేట్ ఇచ్చాడు. హార్దిక్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడని, అతడు ప్రస్తుతం జట్టుతో లేడని రికెల్టన్ చెప్పుకొచ్చాడు."హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. అతడు వెన్ను నొప్పితో బాధపడుతున్నాని ఈ రోజే నాకు తెలిసింది. అయితే ఆ గాయం తీవ్రత ఎలా ఉందన్న విషయం నాకు తెలియదు. మా తదుపరి మ్యాచ్‌కు దాదాపు ఆరు రోజుల విశ్రాంతి లభించింది. ఈ సమయంలో హార్దిక్ కోలుకుని, తిరిగి రాయ్‌పూర్‌లో జట్టుతో కలుస్తాడని ఆశిస్తున్నా" అని రికెల్టన్ పేర్కొన్నాడు.కాగా ఈ ఏడాది సీజన్లో కూడా పాండ్యా కెప్టెన్‌గా తన మార్క్ చూపించలేకపోయాడు. వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా ఈ బరోడా క్రికెటర్ విఫలమయ్యాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది. వెంటనే కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు పాండ్యా గాయం కారణంగా తనంతట తానే ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలిగే పరిస్థితి ఏర్పడింది.చదవండి: అర్జున్ టెండుల్కర్‌ను ఎందుకు ఆడించట్లేదు? -
సరికొత్త రికార్డులు నెలకొల్పిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ లేటుగా అయినా లేటెస్ట్గా లైన్లోకి వచ్చింది. నిన్న (మే 4) లక్నో సూపర్ జెయింట్స్‌పై భారీ విజయం సాధించి, ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవడమే కాకుండా సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో లక్నో నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఈ జట్టు.. ఐపీఎల్ చరిత్రలో తమ అత్యధిక లక్ష్య ఛేదనను నమోదు చేసింది. ఐపీఎల్లో లక్నోపై అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగానూ రికార్డు నెలకొల్పింది. అలాగే ఐపీఎల్లో అత్యధిక సార్లు (7) 200 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించిన జట్ల జాబితాలో రాజస్థాన్ రాయల్స్ (6), సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను (6) వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో పంజాబ్ (11) మాత్రమే ముంబై ముందుంది. ఈ భారీ రికార్డులు నెలకొల్పే క్రమంలో ఆ జట్టు స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కూడా ఓ వ్యక్తిగత రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 7 సిక్సర్లు బాదిన అతను.. ఓ ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును నమోదు చేశాడు. తొలి వికెట్‌కు ర్యాన్ రికెల్టన్‌తో కలిసి 143 పరుగులు జోడించిన రోహిత్.. ముంబై ఇండియన్స్ పై రికార్డులు నెలకొల్పడంలో కీలకపాత్ర పోషించాడు.రోహిత్ శర్మ (83), రికెల్టన్ (84) చెలరేగడంతో లక్నో నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఫలితంగా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.అంతకుముందు నికోలస్ పూరన్ (21 బంతుల్లో 63; ఫోర్, 8 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (25 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఆఖర్లో ఎయిడెన్ మార్క్రమ్ (25 బంతుల్లో 31 నాటౌట్; ఫోర్, సిక్స్), హిమ్మత్ సింగ్ (31 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించారు. -
13 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ
ఐపీఎల్ 2026లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి తన క్లాస్‌ను చాటుకున్నాడు. గాయం నుంచి తిరిగి వచ్చిన వెంటనే అద్భుత ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు. అంతేకాకుండా 13 ఏళ్ల పాత రికార్డును కూడా బద్దలు కొట్టాడు. వాంఖడే వేదికగా నిన్న (మే 4) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దుమురేపాడు. భారీ లక్ష్య ఛేదనలో కేవలం 44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఓ భారీ వ్యక్తిగత రికార్డు నెలకొల్పాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల (7) రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఓ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 6 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. అదీ 13 ఏళ్ల కిందట తొలిసారి ఈ ఫీట్‌ను సాధించాడు. 2013 ఎడిషన్‌లో ఇదే వాంఖడే వేదికగా పంజాబ్‌పై సిక్సర్ల సిక్సర్ కొట్టాడు. ఆతర్వాత 3 సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్ కెరీర్లో రెండు సెంచరీలు చేసినా, వాటిలోనూ తలా ఐదు సిక్సర్లు మాత్రమే బాదాడు.తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ అలవోకగా సిక్సర్లు బాదుతుంటే చూడముచ్చటగా ఉండింది. వింటేజ్ రోహిత్ శర్మను గుర్తు చేసింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సహచర ఓపెనర్ ర్యాన్ రికెల్టన్‌తో కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 143 పరుగులు జోడించి, గెలుపుకు బలమైన పునాది వేశాడు.రోహిత్-రికెల్టన్ వీరవిహారం చేయడంతో లక్నో నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ సునాయాసంగా (మరో 8 బంతులు మిగిలుండగానే) ఛేదించింది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఆ జట్టుకు అత్యధిక ఛేదనగానూ నిలిచింది. ఈ గెలుపుతో ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలను ఇంకా సజీవంగా ఉంచుకుంది. తదుపరి ఆడబోయే 4 మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధిస్తే, ప్లే ఆఫ్స్ రేసులో ఉండే అవకాశం ఉంది. మే 10న జరిగే తదుపరి మ్యాచ్‌లో ముంబై ఆర్సీబీతో తలపడనుంది. ఆతర్వాతి మ్యాచ్‌ల్లో పంజాబ్, కేకేఆర్, రాజస్థాన్ జట్లను ఢీకొట్టాల్సి ఉంది. -
జై శ్రీరామ్.. 15 ఏళ్ల బాధ నేటితో తీరింది: రఘు శర్మ
ఐపీఎల్లో పద్నాలుగేళ్లకే సంచలనాలు సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. అత్యంత పిన్న వయసులో ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో గుజరాత్‌పై) నమోదు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.ఇక ఇటీవలే పదిహేనో వసంతంలో అడుగుపెట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఐపీఎల్-2026 సందర్భంగా తన రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లోనే శతక్కొట్టాడు. వైభవ్ (Vaibhav Suryavanshi) వైభవం ఇలా ఉంటే.. రఘు శర్మ (Raghu Sharma)ది మరో కథ.33 ఏళ్ల వయసులో...పంజాబ్‌కు చెందిన లెగ్ స్పిన్నర్ రఘు శర్మ. అతడి వయసు ఇప్పుడు 33 ఏళ్లు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటినా ఐపీఎల్లో అరంగేట్రం కోసం అతడు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి వచ్చింది. రఘును తొలుత నెట్‌బౌలర్‌గా చేర్చుకున్న ముంబై ఇండియన్స్.. గతేడాది వేలంలో రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.అరంగేట్ర మ్యాచ్‌లో అలాకానీ.. 2025లో రఘు శర్మకే బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే, ఈ ఏడాది ఎట్టకేలకు అతడిని ముంబై యాజమాన్యం కరుణించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా రఘు ముంబై తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లో పూర్తి నాలుగు ఓవర్ల కోటా వేసిన రఘు శర్మ.. 24 పరుగులే ఇచ్చాడు.ఇప్పుడిలా..పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ చెన్నైతో మ్యాచ్‌లో రఘు వికెట్లు తీయలేకపోయాడు. అయితే, తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో మాత్రం అతడి కల నెరవేరింది. లక్నో అరంగేట్ర బ్యాటర్ అక్షత్ రఘువన్షి (11) రూపంలో రఘు శర్మ ఐపీఎల్లో తన తొలి వికెట్ తీశాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో 36 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. #RaghuSharma makes a statement with that wicket 🔥Years of hard work and belief are finally paying off. 💙🙌🏻#TATAIPL Revenge Week 2026 ➡️ #MIvLSG | LIVE NOW 👉https://t.co/hc4PVkY1Pc pic.twitter.com/QFbQB1OeRg— Star Sports (@StarSportsIndia) May 4, 2026ఈ నేపథ్యంలో రఘు శర్మ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే, దూకుడుగా సెలబ్రేట్ చేసుకోకుండా.. తన జేబులో నుంచి ఓ పేపర్ తీసి డ్రెసింగ్‌రూమ్ వైపు చూపించాడు ఈ లెగ్ స్పిన్నర్. అందులో..ఆ బాధ నేటితో తీరిపోయింది‘‘రాధే రాధే. గత పదిహేనేళ్లు ఎంతో బాధగా గడిచాయి. అయితే, ఆ గురుదేవుడి దయ వల్ల ఆ బాధ నేటితో తీరిపోయింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముంబై ఇండియన్స్‌కు ధన్యవాదాలు. ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను. జై శ్రీరామ్’’ అని రఘు శర్మ రాశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వాంఖడేలో సోమవారం టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో.. 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ముంబై 18.4 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లక్నోను ఆరు వికెట్ల తేడాతో ఓడించి సీజన్లో పదింట తమ మూడో విజయాన్ని నమోదు చేసింది.చదవండి: నువ్వసలు ఏం చేశావు బుమ్రా?.. గావస్కర్ ఫైర్! -
అదృష్టం ఉండాలి.. వాళ్లను తప్పుబట్టను: పంత్
లక్నో సూపర్ జెయింట్స్ రాత మారలేదు. ముంబై ఇండియన్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో పరాజయం పాలైంది. తద్వారా ఐపీఎల్-2026లో వరుసగా ఆరో (డబుల్ హ్యాట్రిక్) ఓటమి నమోదు చేసింది. తద్వారా పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది.మా వాళ్లు స్వేచ్ఛగా ఆడారుఈ నేపథ్యంలో ముంబై చేతిలో ఓటమిపై లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘మేము శుభారంభం అందుకున్నాం. అయితే, అదే ఆట తీరు కొనసాగించి మరికొన్ని పరుగులు రాబడితే ఇంకా బాగుండేది. ఈ మ్యాచ్‌లో మాకూ సానుకూలాంశాలు ఉన్నాయి.కానీ అవేంటో ఇప్పుడు చెప్పలేను. మా వాళ్లు స్వేచ్ఛగా ఆడారు. అయితే, ఆఖర్లో ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. సొంతమైదానం కాబట్టి ఇక్కడి పిచ్ పరిస్థితులకు వాళ్లు బాగా అలవాటు పడ్డారు. ముందుగా చెప్పినట్లు మేము ఇంకో 10-15 పరుగులు చేసి ఉంటే బాగుండేది.వారిని తప్పుపట్టలేనుఈ వికెట్ మీద 220-230 పరుగులు చేయడం కాస్త సులువే. ఆరంభంలో మాదే పైచేయిగా ఉంది. బౌలర్లను ఓటమికి బాధ్యులను చేయలేను. వారిని తప్పుపట్టలేను. మా బౌలర్లు అత్యద్భుతంగా బౌల్ చేశారు’’ అని పంత్ పేర్కొన్నాడు.అదృష్టం కావాలయ్యా!ఈ క్రమంలో..‘బాగానే ఆడుతున్నారు. అయినా ఓడిపోతున్నారు. మీ జట్టుకు ఇంకేం కావాలి?’ అని హోస్ట్ అడుగగా.. ‘‘మాకు కొంచెం అదృష్టం కావాలయ్యా!.. అదొక్కటే నేను ఇప్పుడు చెప్పగలను’’ అని పంత్ సమాధానం ఇచ్చాడు. ‘ఎలాంటి అదృష్టం?’ అని హోస్ట్ ప్రశ్నించగా.. ‘‘మాకు ఆశీర్వాదాలు కావాలి. మేము ఇంకాస్త పట్టుదలగా ముందుకు సాగాలి’’ అని పంత్ బదులిచ్చాడు.పూరన్ బ్యాట్ ఝులిపించినా..కాగా వాంఖడే వేదికగా టాస్ ఓడిన లక్నో తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు సాధించింది. నికోలస్ పూరన్ విధ్వంసకర అర్ధ శతకం (21 బంతుల్లో 63)తో మెరవగా.. మార్క్రమ్ (31 నాటౌట్), హిమ్మత్ సింగ్ (40 నాటౌట్) తమ వంతు సాయం అందించారు. ఇక పంత్ 15 పరుగులే చేశాడు.High, Handsome and 2⃣ points 💙@mipaltan seal their highest run-chase in #TATAIPL history ✌️Scorecard ▶️ https://t.co/elXSOvaeig #KhelBindaas | #MIvLSG pic.twitter.com/G5rSddXCbc— IndianPremierLeague (@IPL) May 4, 2026అయితే, ముంబై ఓపెనర్లు రియాన్ రికెల్టన్ (32 బంతుల్లో 83), రోహిత్ శర్మ (44 బంతుల్లో 84) ఆకాశమే హద్దుగా చెలరేగి లక్నోకు షాకిచ్చారు. వీరిద్దరితో పాటు నమన్ ధిర్ (12 బంతుల్లో 23 నాటౌట్) మెరుపులు మెరిపించగా.. 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి ముంబై లక్ష్యాన్ని ఛేదించింది. లక్నోను ఆరు వికెట్ల తేడాతో ఓడించి.. వాంఖడేలో ఈ సీజన్‌లోవరుసగా నాలుగు ఓటముల తర్వాత తొలి విజయం నమోదు చేసింది.చదవండి: నువ్వసలు ఏం చేశావు బుమ్రా?.. గావస్కర్ ఫైర్! -
నువ్వసలు ఏం చేశావు బుమ్రా?.. గావస్కర్ ఫైర్!
టీమిండియా ప్రధాన పేసర్, ముంబై ఇండియన్స్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా ఆట తీరుపై భారత దిగ్గజం సునిల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బుమ్రా వంటి ప్రపంచస్థాయి బౌలర్ ‘ఇలాంటి’ తప్పు చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదన్నాడు. ఇంతకీ బూమ్ బూమ్ బుమ్రా ఏం చేశాడంటే?..ఐపీఎల్-2026లో ఏడు ఓటములతో దాదాపుగా ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయిన దశలో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు సొంతగడ్డపై చెలరేగిన సంగతి తెలిసిందే. వాంఖడే వేదికగా ముంబై సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు లక్నోను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.చెలరేగిన నికోలస్ పూరన్ఎట్టకేలకు నికోలస్ పూరన్ (21 బంతుల్లో 63) చెలరేగడంతో లక్నో భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. మిగతా వారిలో ఓపెనర్ మిచెల్ మార్ష్ (44), ఐడెన్ మార్క్రమ్ (31 నాటౌట్), హిమ్మత్ సింగ్ (40 నాటౌట్) రాణించారు.రెండు నో బాల్స్ఇదిలా ఉంటే.. లక్నో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న వేళ బుమ్రా (Jasprit Bumrah) పద్నాలుగో ఓవర్లో బంతితో రంగంలోకి దిగాడు. బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతికి మార్క్రమ్ సింగిల్ తీయగా.. రెండో బంతికి పరుగులేమీ రాలేదు.ఇక మూడో బంతికి హిమ్మత్ సింగ్‌కు సంధించగా.. అది నో బాల్ అయింది. ఆ తర్వాత బంతి వైడ్‌గా వెళ్లింది. ఆ వెంటనే బుమ్రా మళ్లీ నో బాల్ వేశాడు. ఈ ఓవర్లో బుమ్రా మొత్తంగా ఏడు పరుగులే ఇచ్చినప్పటికీ రెండు నోబాల్స్ వేయడం విమర్శలకు దారితీసింది.🎥 Wickets that didn't count, no-balls, and bat flying out of hands 👀The most eventful over of the season? 🤷♂️Updates ▶️ https://t.co/elXSOvaeig #TATAIPL | #KhelBindaas | #MIvLSG pic.twitter.com/4OQj5C9R49— IndianPremierLeague (@IPL) May 4, 2026గావస్కర్ ఫైర్ఈ నేపథ్యంలో కామెంటేటర్ సునిల్ గావస్కర్ బుమ్రా ఆట తీరుపై మండిపడ్డాడు. ‘‘ఇది అస్సలు ఆమోదయోగ్యనీయం కాదు. నువ్వొక ప్రొఫెషనల్ క్రికెటర్‌వి బుమ్రా. వైడ్లు వేస్తున్నావంటే అర్థం చేసుకోగలను. కానీ నో బాల్స్ వేయడమేంటి?’’ అని కామెంట్రీ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా ఈ మ్యాచ్‌లో బుమ్రా చెత్త ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి ఏకంగా 45 పరుగులు ఇచ్చుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.ఎట్టకేలకు ఓ విజయంఇక ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ (84), రికెల్టన్ (83) చెలరేగడంతో లక్నో విధించిన 229 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఆరు వికెట్లతో లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచింది. వరుసగా మూడు ఓటముల తర్వాత ముంబైకి ఈ కీలక విజయం దక్కింది. మరోవైపు లక్నో వరుస ఓటముల్లో ‘సిక్సర్’ నమోదు చేసింది. వరుసగా ఆరో పరాజయంతో జట్టు అట్టడుగున పదో స్థానంలోనే ఉంది. చదవండి: మాట తప్పిన రిషబ్ పంత్! -
రోహిత్, రికెల్టన్ ఊచకోత.. లక్నోపై ముంబై ఇండియన్స్ గెలుపు
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 4) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నోపై ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా.. ముంబై ఇండియన్స్ మరో 8 బంతులు మిగిలుండగానే (18.4 ఓవర్లు) 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.రోహిత్, రికెల్టన్ ఊచకోత229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఓపెనర్లు చెలరేగిపోయారు. రోహిత్ శర్మ (83), రికెల్టన్ (84) విధ్వంసం సృష్టించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 10.5 ఓవర్లలో ఏకంగా 143 పరుగులు జోడించి గెలుపు ఖాయం చేశారు. అనంతరం తిలక్ వర్మ (11), సూర్యకుమార్ యాదవ్ (12) తక్కువ స్కోర్లకే ఔటైనా, నమన్ ధిర్ (23 నాటౌట్), విల్ జాక్స్ (10 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. లక్నో బౌలర్లలో మణిమారన్ సిద్దార్థ్ 2 వికెట్లు పడగొట్టగా.. షమీ, మొహిసిన్ ఖాన్ తలో వికెట్ తీశారు..పూరన్ విధ్వంసంటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. నికోలస్ పూరన్ (21 బంతుల్లో 63; ఫోర్, 8 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (25 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో స్కోర్ కాస్త నెమ్మదించింది. ఆఖర్లో ఎయిడెన్ మార్క్రమ్ (25 బంతుల్లో 31 నాటౌట్; ఫోర్, సిక్స్), హిమ్మత్ సింగ్ (31 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతగా ఆడారు. మిగతా బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ 13, కెప్టెన్ పంత్ 15, అరంగేట్రం ఆటగాడు అక్షత్ రఘువంశీ 11 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ 2 వికెట్లు తీయగా.. ఘజన్ఫర్, విల్ జాక్స్, రఘు శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఐపీఎల్లో మరో సిక్సర్ల చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీలాగే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో సిక్సర్ల చిచ్చరపిడుగును పరిచయం చేసింది. 2026 ఎడషన్‌లో భాగంగా ఇవాళ (మే 4) ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 22 ఏళ్ల అక్షత్ రఘువంశీ అనే మెరుపు వీరుడు లక్నో సూపర్ జెయింట్స్ తరఫున గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అక్షత్ వచ్చీ రాగానే ఓ భారీ సిక్సర్ల రికార్డు సొంతం చేసుకొని అందరి దృష్టిని ఆకర్శించాడు.అక్షత్ ఐపీఎల్ కెరీర్లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి అరుదైన రికార్డు సాధించాడు. ఈ ఘనత సాధించిన 11వ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అక్షత్‌కు ముందు రాబ్ క్వీని (రాజస్థాన్), కెవాన్ కూపర్ (రాజస్థాన్), ఆండ్రీ రసెల్ (కేకేఆర్), కార్లోస్ బ్రాత్‌వైట్ (ఢిల్లీ), అనికేత్ చౌదరి (ఆర్సీబీ), జేవన్ సీల్స్ (కేకేఆర్), సిద్దేశ్ లాడ్ (ముంబై), మహీశ్ తీక్షణ (సీఎస్కే), సమీర్ రిజ్వి (సీఎస్కే), వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్) ఈ ఘనత సాధించారు.ఈ సీజన్ వేలంలో అక్షత్‌కు లక్నో రూ. 2.2 కోట్లకు దక్కించుకుంది. అక్షత్ తన డెబ్యూ క్యాప్‌ను తన ఆరాధ్య ఆటగాడు రోహిత్ శర్మ నుంచి తీసుకున్నాడు. అక్షత్ 2025 మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌తో వెలుగులోకి వచ్చాడు. ఆ సీజన్లో ఓ మ్యాచ్‌లో 56 బంతుల్లో 115 పరుగులు చేసిన అక్షత్‌పై లక్నో సూపర్ జెయింట్స్ అప్పుడే కన్నేసింది.అక్షత్‌కు దేశవాలీ క్రికెట్లోనూ ఓ అదిరిపోయే రికార్డు ఉంది. 2021-22 రంజీ సీజన్లో మధ్యప్రదేశ్ తరఫున అరంగేట్రం చేసిన అతను.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసి రికార్డుల్లోకెక్కాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి బంతికే సిక్సర్ బాదిన అక్షత్ ఆతర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 7 బంతుల్లో సిక్సర్ సాయంతో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న లక్నో 19 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (44), పూరన్ (63) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు. మార్క్రమ్ (29), హిమ్మత్ సింగ్ (37) క్రీజ్‌లో ఉన్నారు. -
లక్నోతో మ్యాచ్‌కు హార్దిక్ దూరం.. కారణమిదే!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఈ సీజన్లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఏడు ఓటములు చవిచూసిన ముంబై ఇండియన్స్ పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ అవకాశాలు దాదాపు కోల్పోయింది. పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు కెప్టెన్ హార్దిక్ దూరమవ్వడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే టాస్ సమయంలో స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వచ్చిన సూర్యకుమార్.. పాండ్యా ఆడకపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపాడు. అందుకే మ్యాచ్‌కు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇక కెప్టెన్‌గా జట్టును నడిపించడంలో విఫలమైన హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గానూ పూర్తిగా తేలిపోయాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 146 పరుగులు మాత్రమే చేసిన పాండ్యా బౌలింగ్‌లోనూ కేవలం నాలుగు వికెట్లు తీశాడు. అంతేకాదు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రవర్తనపై కూడా విమర్శలు వచ్చాయి. జట్టు ఆటగాళ్ల పట్ల దురుసు ప్రవర్తనతో చెడ్డ పేరును మూటగట్టుకున్నాడు. ఒక దశలో పాండ్యాను తప్పించి రోహిత్‌కు మళ్లీ పగ్గాలు అప్పగించాలని ముంబై అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.🚨 Toss Update 🚨@mipaltan won the toss and elected to field against @LucknowIPL. Surya Kumar Yadav is captaining #MI as Hardik Panyda is unwell. Updates ▶️https://t.co/elXSOvaeig #TATAIPL | #KhelBindaas | #MIvLSG pic.twitter.com/eQjzr2GXrm— IndianPremierLeague (@IPL) May 4, 2026చదవండి: ‘అన్నా.. గెలిచాం’.. కేకేఆర్ క్రికెటర్ పోస్టు వైరల్! -
లక్నోపై ముంబై ఇండియన్స్ గెలుపు
లక్నోపై ముంబై ఇండియన్స్ గెలుపుఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 4) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నోపై ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా.. ముంబై ఇండియన్స్ మరో 8 బంతులు మిగిలుండగానే (18.4 ఓవర్లు) 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ (84) ఔట్13.6వ ఓవర్- 44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసిన అనంతరం రోహిత్ శర్మ ఔటయ్యాడు. విధ్వంసం సృష్టించి ఔటైన రికెల్టన్10.5వ ఓవర్- రికెల్టన్ 32 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసి మొహిసిన్ ఖాన్ బౌలింగ్‌లో ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దంచికొడుతున్న రోహిత్, రికెల్టన్229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. తొలి ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఏకంగా 71 పరుగులు చేశారు. రోహిత్ శర్మ (36), రికెల్టన్ (34) దంచికొడుతున్నారు. లక్నో భారీ స్కోర్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. నికోలస్ పూరన్ (21 బంతుల్లో 63; ఫోర్, 8 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (25 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో లక్నో ఇంకా భారీ స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో స్కోర్ నెమ్మదించింది. ఆఖర్లో ఎయిడెన్ మార్క్రమ్ (25 బంతుల్లో 31 నాటౌట్; ఫోర్, సిక్స్), హిమ్మత్ సింగ్ (31 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతగా ఆడి, ఊహించినంత కాకపోయినా ఓ మోస్తరు స్కోర్ అందించారు. మిగతా బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ 13, కెప్టెన్ పంత్ 15, అరంగేట్రం ఆటగాడు అక్షత్ రఘువంశీ 11 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ 2 వికెట్లు తీయగా.. ఘజన్ఫర్, విల్ జాక్స్, రఘు శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు. ఒక్కసారి కుదుపుపూరన్ క్రీజ్‌లో ఉన్నంత సేపు అతి భారీ స్కోర్ దిశగా సాగిన లక్నో.. అతను ఔట్ కాగానే ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. రెండు పరుగుల వ్యవధిలో (123-125) పూరన్‌తో పాటు మిచెల్ మార్ష్ (44) కూడా ఔటయ్యాడు. ఆ కొద్దిసేపటికే (148, 160 పరుగుల వద్ద) రిషబ్ పంత్ (15), అక్షత్ రఘువంశీ (11) కూడా పెవిలియన్ బాట పట్డారు. 13 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 164-5గా ఉంది. మార్క్రమ్ (10), హిమ్మత్ సింగ్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ 2, ఘజన్ఫర్, విల్ జాక్స్, రఘు శర్మ తలో వికెట్ తీశారు.పంత్ ఔట్10.4వ ఓవర్- విల్ జాక్స్ బౌలింగ్‌లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి రిషబ్ పంత్ (15) ఔటయ్యాడు.ఒకే ఓవర్లో 2 వికెట్లు కోల్పోయిన లక్నో8.5వ ఓవర్- కార్బిన్ బాష్ బౌలింగ్ నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి మిచెల్ మార్ష్ (44) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన లక్నో8.1వ ఓవర్- కార్బిన్ బాష్ బౌలింగ్‌లో ర్యాన్ రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి పూరన్ (63) ఔటయ్యాడు.దంచికొడుతున్న లక్నో..ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ దంచికొడుతుంది. ఏడు ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టానికి 106 పరుగులు చేసింది. పూరన్ (47), మిచెల్ మార్ష్ (43) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 15 పరుగులు చేసిన జోస్ ఇంగ్లిస్ గజన్ఫర్ బౌలింగ్‌లో సూర్యకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 4) జరుగుతున్న 47వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్వల్ప అస్వస్థత కారణంగా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని స్కై తెలిపాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కూడా బరిలోకి దిగుతున్నాడు. హిట్‌మ్యాన్ గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ముంబై మరో మార్పు కూడా చేసింది. ట్రెంట్ బౌల్ట్ స్థానంలో కార్బిన్ బాష్ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్టు..లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, మహమ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, AM ఘజన్ఫర్, రఘు శర్మ -
చరిత్ర సృష్టించిన సీఎస్కే చిచ్చర పిడుగు
ఐపీఎల్-2026లో చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాడు కార్తీక్ శర్మ ఎట్టకేలకు తన బ్యాట్ ఝుళిపించాడు. ఈ ధనాధన్ లీగ్‌లో భాగంగా శనివారం చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. 160 పరుగుల లక్ష్య చేధనలో అతడు కీలక ఇన్నింగ్స్ ఆడాడు.రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొత్తంగా 40 బంతులు ఎదుర్కొన్న కార్తీక్.. 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో కార్తీక్ శర్మ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌పై సీఎస్కే తరపున హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా కార్తీక్ నిలిచాడు. కార్తీక్ కేవలం 20 ఏళ్ల 6 రోజుల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. ఓవరాల్‌గా ముంబైపై తక్కువ వయసులో 50కు పైగా పరుగులు చేసిన జాబితాలో కార్తీక్ మూడో స్ధానంలో నిలిచాడు. తొలి రెండు స్ధానాల్లో సంజూ శాంసన్, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.కాగా గతేడాది జరిగిన మినీ వేలంలో కార్తీక్ శర్మను రూ.14 కోట్ల భారీ ధరకు సీఎస్కే కొనుగోలు చేసింది. అయితే సీజన్ ఆరంభ మ్యాచ్‌లలో అతడు రాణించకపోవడంతో ఫ్యాన్స్ విమర్శించారు. కానీ ఇప్పుడు తనలోని అసలైన ఆటను కార్తీక్ బయటపెట్టాడు.చదవండి: IPL 2026: వైభవ్ సూర్యవంశీ 'అన్ ప్రొఫెషనల్'?.. తన వ్యాఖ్యలపై జితేష్ క్లారిటీ -
‘ఇది జట్టు వైఫల్యం.. ఆ ముగ్గురినే నిందించలేం’
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఆట దాదాపు ముగిసినట్లే. ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసిన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ చేరే అవకాశాలు కోల్పోయింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతుంది. శనివారం సీఎస్కే చేతిలో ఓటమి చవిచూసిన తర్వాత ముంబై ఇండియన్స్ విషయంలో ఒక అంశం చర్చకు దారి తీసింది. టీమిండియాకు ఆడుతున్న ఆటగాళ్లలో ఎక్కువ మంది ముంబై ఇండియన్స్ జట్టులోనే ఉన్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహా రోహిత్ శర్మ, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు కీలక ఆటగాళ్లు. ఇందులో రోహిత్ గాయంతో డగౌట్‌కే పరిమితమయ్యాడు. ఇక మిగిలిన ఆటగాళ్లలో కెప్టెన్ పాండ్యా సంగతి పక్కనబెడితే సూర్యకుమార్, తిలక్ వర్మ, బుమ్రాలు దారుణంగా విఫలమవ్వడం ముంబై కొంప ముంచుతుంది. ఈ సీజన్లో బుమ్రా ముంబై ఇండియన్స్ తరఫున 9 మ్యాచ్‌లాడి కేవలం మూడు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక సూర్యకుమార్ పేలవ ఫామ్ ప్రదర్శిస్తున్నాడు. తొమ్మిది మ్యాచ్‌లు కలిపి కేవలం 20 సగటుతో పరుగులు సాధించాడు. తిలక్ వర్మ సెంచరీ సాధించినప్పటికీ ఆ మురిపెం ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది. ఈ ముగ్గురు అగ్రశ్రేణి ఆటగాళ్లు విఫలం కావడంపై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్దనే స్పందించాడు. సీఎస్కేతో మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జయవర్దనే మాట్లాడాడు. ‘నిజానికి ఈ ముగ్గురి వల్లే ముంబై ఇండియన్స్ దారుణ ఆటతీరు ప్రదర్శిస్తోందని చెప్పలేం. ఎందుకంటే సూర్య, తిలక్, బుమ్రాలు ఇప్పటికే వారేంటో నిరూపించుకున్నారు. ఒక్కసారి సూర్యకుమార్ టచ్‌లోకి వస్తే ఎంత డేంజర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అతడు కుదురుకోవడానికి రెండు, మూడు ఇ న్నింగ్స్‌లు చాలు. కానీ ఈ సీజన్లో మాకు ఆ సమయం దాటిపోయింది. ఇక తిలక్ వర్మ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. తనదైన రోజున ధాటిగా ఆడగల సత్తా ఉన్న తిలక్ వర్మ అనుభవం పెరిగిన కొద్దీ ఆటలో మరింత రాటుదేలుతాడన్న నమ్మకం నాకుంది. అయితే తిలక్ వర్మ టీ20 క్రికెట్లో అన్ని రకాల పాత్రలను పోషిస్తున్నాడు. టీ20 క్రికెట్ ఆడడం అంత ఈజీ కాదు. ఒక్కోసారి పరిస్థితి చేయి దాటిపోతుంది. బుమ్రా రాణించకపోవడం వల్ల ముంబై ఇండియన్స్‌ను ఇబ్బంది పెట్టే అంశం. కానీ బుమ్రా ఒక్కడే కాదు ముంబై బౌలర్లంతా కలిసికట్టుగా ఆడడంలో విఫలమయ్యారు. మిగతా బౌలర్లు కూడా వికెట్లు తీస్తే బుమ్రాపై ఒత్తిడి తగ్గడంతో పాటు వికెట్లు తీసే అవకాశముంటుంది.’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: అదే జరిగితే ప్లేఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్! -
అదే జరిగితే ప్లేఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్!
ఐపీఎల్ 2026 సీజన్లో శనివారం సీఎస్కేతో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించిన ఐపీఎల్ మాజీ చాంపియన్ ఇప్పుడు ప్లేఆఫ్ చేరడం దాదాపు అసాధ్యమే. అయితే కొంత అదృష్టం కలిసి రావడంతో మిగిలిన 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధిస్తే మాత్రం ముంబైకి ప్లేఆఫ్ అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. కానీ ప్లేఆఫ్స్ చేరే క్రమంలో ముంబై ఇండియన్స్ ముందున్న దారి చాలా కఠినమని చెప్పొచ్చు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో, 4 పాయింట్లు సాధించి 9వ స్థానంలో ఉంది. జట్టు నెట్ రన్ రేట్ (-0.803) సైతం చాలా దారుణంగా ఉండటం గమనార్హం. ఐపీఎల్లో ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 14 పాయింట్లు అవసరం. అయితే ప్రస్తుతం ముంబై వద్ద ఉన్నది కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే. అంటే, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ముంబై తన మిగిలిన 5 మ్యాచ్‌ల్లోనూ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ముంబై అదృష్టం కలిసి వచ్చి ఐదు మ్యాచ్‌లు గెలిచి నప్పటికీ ప్లేఆఫ్స్ చేరాలంటే ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు తమ మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడిపోవాలని ముంబై కోరుకోవాలి. అదే సమయంలో ముంబై తాము ఆడబోయే ఐదింటిలో ఒక్కటి ఓడినా సీజన్లో వారి ప్రయాణం ముగిసినట్లే. ముంబై తమ తర్వాతి మ్యాచ్‌ల్లో భాగంగా సోమవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో, మే 10న రాయ్‌పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో, మే 14న టేబుల్ టాపర్స్ పంజాబ్ కింగ్స్‌తో ధర్మశాలలో తలపడాల్సి ఉంది. ఆ తర్వాత మే 20న కోల్‌కతా నైట్ రైడర్స్, మే 24న రాజస్తాన్ రాయల్స్‌తో ఆడాల్సి ఉంది. ఈ ఐదింటిలో గెలవడంతో పాటు రన్‌రేట్‌ను భారీగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరముంది. గణాంకాల పరంగా అవకాశం ఉన్నప్పటికీ, ముంబై ప్రస్తుత ఫామ్ చూసుకుంటే మాత్రం అద్భుతం జరిగితే తప్ప ప్లేఆఫ్స్ చేరడం కష్టంగానే కనిపిస్తోంది.చదవండి: ఐపీఎల్‌కు ధోని గుడ్‌బై.. వీడియో వైరల్! -
అంతా అయిపోయింది.. మాకేది కలిసి రాలేదు: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్-2026 సీజన్లో ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కథ దాదాపు ముగిసినట్లే. శనివారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ముంబై పరాజయం పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలం కావడంతో ముంబై ఈ ఘోర ఓటమిని మూట కట్టుకుంది.తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని సీఎస్కే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలోనే ఊదిపడేసింది. ముంబై బౌలర్లు మరోసారి విఫలమయ్యారు.ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తాము మెరుగ్గా రాణించలేకపోయామని హార్దిక్ చెప్పుకొచ్చాడు."కేవలం ఈ ఒక్క మ్యాచ్ మాత్రమే కాదు, సీజన్ మొత్తం మాకు కలిసిరాలేదు. ఈ రోజు సీఎస్కే అన్ని విభాగాల్లో మాకంటే మెరుగైన ప్రదర్శన చేశారు. ఒకానొక దశలో మా స్కోర్ ఈజీగా 190 దాటుతుందని అని అనుకున్నాము. కానీ 10 ఓవర్ల తర్వాత మా రిథమ్‌ను కోల్పోయాం. చివర్లో మెరుపులు మెరిపించడంలోనూ విఫలమయ్యాం.ఒకవేళ ఈ పిచ్‌పై 180 నుంచి 190 పరుగుల స్కోర్ వచ్చి పరిస్థితి మరో విధంగా ఉండేది. పిచ్ కాస్త స్లోగా ఉంది. అందుకే క్రీజులోకి రాగానే షాట్లు ఆడేందుకు కష్టమైంది. క్రీజులో సెటిల్ అయిన ప్రత్యర్ధి జట్టు బ్యాటర్లు సైతం ఇబ్బంది పడ్డారు. లెక్కలతో కూడిన క్రికెట్ ఆడటం చాలా అవసరం. కానీ ఈ రోజు మా బ్యాటర్లు బంతిని సరిగ్గా హిట్ చేయలేకపోయారు. వారు మాకంటే బాగా బ్యాటింగ్ చేశారని హార్దిక్ పేర్కొన్నాడు.అదేవిధంగా బౌలింగ్‌లో మీరు మరింత దూకుడుగా ఉండాల్సిందా? అన్న ప్రశ్న కూడా పాండ్యాకు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో ఎదురైంది. అందుకు హార్దిక్ కాస్త వ్యంగ్యంగా సమాధనమిచ్చాడు. "ఇంకా ఎంత దూకుడుగా ఉండాలో నాకు తెలియదు. బహుశా వాళ్లను అవుట్ చేయడానికి నిప్పులు కురిపించే బంతులు వేయాలేమో. మా దగ్గర ఉన్న ఆప్షన్స్‌తోనే మేము బరిలోకి దిగాము" అని పాండ్యా వ్యాఖ్యనించాడు.చదవండి: ‘పాండ్యాపై విద్వేషం.. కరువైన మద్దతు!’ -
‘పాండ్యాపై విద్వేషం.. కరువైన మద్దతు!’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ అత్యధిక టైటిల్స్ విషయంలో సీఎస్కేతో కలిసి సమానంగా ఉంది. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో మాత్రం ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే 9 మ్యాచ్‌లాడిన ముంబై ఏడు పరాజయాలు చవిచూసింది. శనివారం సీఎస్కేతో మ్యాచ్‌లోనూ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ అవకాశాలను దాదాపు గల్లంతు చేసుకున్నట్లే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ముంబై ప్లేఆఫ్ చేరడం కష్టం. ఇక కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా పూర్తిగా విఫలమవుతున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతడిపై విమర్శలు పెరిగిపోయాయి. మ్యాచ్ ఓటములను తట్టుకోలేక సహచరులపై ఆగ్రహం వెళ్లగక్కుతున్నాడు. ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యాపై ముంబై ఇండియన్స్ జట్టులో విద్వేశం పెరిగిపోయిందని, అతడికి జట్టులో కనీస మద్దతు కరువయిందంటూ మాజీ క్రికెటర్ మనోజ్ తివారి అభిప్రాయపడ్డాడు. జట్టు పేలవ ప్రదర్శనకు పాండ్యాను ఒక్కడినే నిందించడం తగదని పేర్కొన్నాడు. క్రిక్‌బజ్‌తో మనోజ్ తివారి మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రయాణం దాదాపు ముగిసినట్లే. జట్టు వైఫల్యాలకు కెప్టెన్ పాండ్యాను విమర్శిస్తున్నారు. కానీ అతడికి జట్టు నుంచి సరైన మద్దతు లేదనిపిస్తోంది. కెప్టెన్‌గా పాండ్యా చేయాల్సింది చేస్తున్నాడు. జట్టులో ఆటగాళ్లు సరిగ్గా ఆడడం లేదు. ముఖ్యంగా టీ20 క్రికెట్లో సూపర్‌స్టార్‌గా పేరుపొందిన సూర్యకుమార్ యాదవ్ ఘోరంగా విఫలమవుతున్నాడు. తిలక్ వర్మ ఒక్క మ్యాచ్ మినహా మళ్లీ రాణించింది లేదు. జట్టులో నిలకడ ప్రదర్శన లేనప్పుడు పాండ్యాను తప్పుబట్టడం వల్ల ప్రయోజనం లేదు. కలిసికట్టుగా ఆడినప్పుడే జట్టుకు విజయాలు లభిస్తాయి. కానీ ముంబై ఇండియన్స్‌లో ఇప్పుడు అది మిస్సయింది. రోహిత్ గాయంతో డగౌట్‌కు పరిమితమవ్వడం, బుమ్రా, సూర్య, తిలక్ వంటి ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడం ముంబైని దెబ్బకొట్టాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్ పాండ్యాను విమర్శించడం తగదు. అతడి ప్రవర్తనతో ఆటగాళ్లు క్రమంగా విద్వేషం పెంచుకుంటున్నారనిపిస్తుంది. అందుకే అతడికి జట్టు నుంచి మద్దతు కరువయ్యింది. ఇక 9 మ్యాచ్‌ల్లో ఏడు పరాజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలను వదిలేసుకున్న ముంబై ఇండియన్స్‌కు అదృష్టం తోడవ్వాలి. ఎందుకంటే ప్రతీ జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. మరోవైపు టాప్-4లో ఉన్న పంజాబ్‌కు ఆరు మ్యాచ్‌లు, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్లకు ఐదేసీ మ్యాచ్‌లు, రాజస్తాన్‌కు నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. ముంబై ప్లేఆఫ్ చేరాలంటే ఈ జట్లు తమ మ్యాచ్‌లన్నీ ఓడిపోవాలి. కానీ 99 శాతం ఇది జరగని పని. కాబట్టి ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ప్లేఆఫ్ ఆశలు పక్కనబెట్టి విజయాలు సాధించి గౌరవంగా నిష్క్రమించడం మంచిది’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: ‘నేను క్రెడిట్ తీసుకోలేను.. అతడే మ్యాచ్ విన్నర్’ -
ముంబై ఇండియన్స్ ప్రపంచ రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఏడు పరాజయాలతో ప్లేఆఫ్ ఆశలను దాదాపు గల్లంతు చేసుకుంది. శనివారం చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. అయితే ఓడినప్పటికీ ముంబై ఇండియన్స్ ప్రపంచ రికార్డును నమోదు చేయడం విశేషం. టీ20 క్రికెట్ చరిత్రలో 50 వేల పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. సీఎస్కేతో మ్యాచ్‌లో ఈ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. 50వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి ముంబై ఇండియన్స్‌కు 114 పరుగులు అవసరం కాగా.. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఆ మైలురాయిని అందుకుంది. ముంబై ఇండియన్స్‌కు ఇది 308వ టీ20 మ్యాచ్. ఇందులో 286 ఐపీఎల్ మ్యాచ్‌లు కాగా.. మరో 22 మ్యాచ్‌లు ఛాంపియన్స్ లీగ్వి ఉన్నాయి. ఇక టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జట్ల జాబితాలో ముంబై తర్వాత ఇంగ్లండ్‌కు చెందిన సోమర్సెట్ (48,244 పరుగులు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (47,304 పరుగులు), చెన్నై సూపర్ కింగ్స్ (46,438 పరుగులు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో రోహిత్ శర్మ (6,286 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా, సూర్యకుమార్ యాదవ్ (3,933), కీరన్ పొలార్డ్ (3,915) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ప్రపంచ రికార్డు సాధించినప్పటికీ మ్యాచ్ ఫలితం మాత్రం ముంబై ఇండియన్స్‌కు చేదు అనుభవం మిగిల్చింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. నమన్ ధిర్ (57) అర్థసెంచరీతో రాణించాడు. రికెల్టన్ (37), సూర్యకుమార్ (21) పర్వాలేదనిపించారు. అన్షుల్ కంబోజ్ 3 వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 18.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్), కార్తిక్ శర్మ (54 నాటౌట్) సీఎస్కేను గెలిపించారు. సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఇది నాలుగో విజయం కాగా.. ముంబైకి ఇది ఏడో ఓటమి. దీంతో ముంబై ప్లేఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో సీఎస్కే 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ 4 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: ఇంపాక్ట్ నిబంధనపై బీసీసీఐ కీలక నిర్ణయం! -
సీఎస్కేను గెలిపించిన కార్తిక్ శర్మ.. ముంబై ఓటమి
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్‌పై సీఎస్కే ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి అంచె పోటీల్లో ముంబైని చిత్తుగా ఓడించిన సీఎస్కే శనివారం రెండో అంచె పోటీలోనూ మరోసారి ముంబైని ఓడించింది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.160 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే మరో 11 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్), ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కార్తిక్ శర్మ (54 నాటౌట్) అజేయంగా నిలిచి సీఎస్కేను గెలిపించారు. ముంబై బౌలర్లలో బుమ్రా, గజన్ఫర్ చెరొక వికెట్ తీశారు. అంతకముందు ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. నమన్ ధిర్ (57 పరుగులు) అర్థసెంచరీతో రాణించాడు. రియాన్ రికెల్టన్ (37), సూర్యకుమార్ (21) పర్వాలేదనిపించారు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.అజేయ అర్థసెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఇది నాలుగో విజయం కాగా.. ముంబైకి ఇది ఆరో ఓటమి. దీంతో ముంబై ప్లేఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో సీఎస్కే 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ 4 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.An unorthodox finishing touch to a classic rivalry! 🎬🎥 @ChennaiIPL complete the double over their arch-rivals #MI in style 💛Scorecard ▶️ https://t.co/VVAjldiiC0#TATAIPL | #KhelBindaas | #CSKvMI | @ChennaiIPL pic.twitter.com/yeBWsXZ6Lu— IndianPremierLeague (@IPL) May 2, 2026 -
తిలక్ వర్మకు చేదు అనుభవం.. 28 వేల వాచ్ గోవిందా!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సీఎస్కేతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ క్రికెటర్ తిలక్ వర్మకు చేదు అనుభవం ఎదురయ్యింది. ముంబై ఇన్నింగ్స్ సమయంలో సీఎస్కే బౌలర్ జేమీ ఓవర్టన్ వేసిన బంతి తిలక్ వర్మ చేతికున్న రిస్ట్ వాచ్‌ను రెండు ముక్కలు చేసింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఓవర్టన్ వేసిన షార్ట్ పిచ్ బంతిని షాట్ ఆడే క్రమంలో తిలక్ వర్మ మిస్ చేశాడు. దీంతో బంతి తిలక్ వర్మ చేతికి బలంగా తాకింది. నొప్పితో బాధపడిన తిలక్‌ను ఫిజియో వచ్చి పరిశీలించాడు. అదే సమయంలో చేతికున్న రిస్ట్ వాచ్ రెండు ముక్కలు కావడం గమనార్హం. కాగా తిలక్‌వర్మ తన చేతికి ధరించిన రిస్ట్ వాచ్ ధర రూ.28 వేలు కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో తిలక్ వర్మ మరోసారి విఫలమయ్యాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన తిలక్ వర్మ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. నమన్ ధిర్ (57) అర్థసెంచరీతో రాణించగా.. రికెల్టన్ 37 పరుగులు చేశాడు.𝗧𝗜𝗠𝗘 𝗢𝗨𝗧 ⌚🤐#TilakVarma’s wrist-watch, too, now has a #BiggestRivalry story to tell 👀#TATAIPL Revenge Week 2026 ➡️ #CSKvMI | LIVE NOW 👉https://t.co/wLcMjiCsSi pic.twitter.com/cCLwL6SYux— Star Sports (@StarSportsIndia) May 2, 2026చదవండి: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ క్రికెటర్ -
IPL 2026: ముంబైపై సీఎస్కే ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ నాలుగో విజయాన్ని సాధించింది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 18.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్), ఇంపాక్ట్ ప్లేయర్ కార్తిక్ శర్మ (54 నాటౌట్) అజేయంగా నిలిచి సీఎస్కేను గెలిపించారు. ముంబై బౌలర్లలో బుమ్రా, గజన్ఫర్ చెరొక వికెట్ తీశారు. అంతకముందు ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.గైక్వాడ్ హాఫ్ సెంచరీముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అర్థసెంచరీ సాధించాడు. 34 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న రుతురాజ్ ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం సీఎస్కే 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే160 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన సీఎస్కే 63 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన ఉర్విల్ పటేల్ గజన్ఫర్ బౌలింగ్‌లో బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం సీఎస్కే 7 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.సంజూ శాంసన్ (11) ఔట్.. తొలి వికెట్ డౌన్160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన శాంసన్ బుమ్రా బౌలింగ్‌లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సీఎస్కే టార్గెట్ 160 పరుగులుసీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. నమన్ ధిర్ (57 పరుగులు) అర్థసెంచరీతో రాణించాడు. రియాన్ రికెల్టన్ (37), సూర్యకుమార్ (21) పర్వాలేదనిపించారు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.ఆరో వికెట్ డౌన్..5 పరుగులు చేసిన రాబిన్ మింజ్ అన్షుల్ కంబోజ్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో ముంబై ఇండియన్స్ 139 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. నమన్ ధిర్ (48), పాండ్యా (9) పరుగులతో ఆడుతున్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ముంబైసీఎస్కేతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన తిలక్ వర్మ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో రుతురాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. నమన్ ధిర్ 44, పాండ్యా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.12 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 3 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. నమన్ ధిర్ 42, తిలక్ వర్మ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.7 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. నమన్ ధిర్ 25, సూర్యకుమార్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.4 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. రికిల్టన్ 15, నమన్ ధిర్ 13 పరుగులతో ఆడుతున్నారు.తొలి వికెట్ కోల్పోయిన ముంబైసీఎస్కేతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన ఓపెనర్ విల్‌జాక్స్ అన్షుల్ కంబోజ్ బౌలింగ్‌లో రామక్రిష్ణ ఘోష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై ఒక పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయింది.టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఏంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. రఘుశర్మ సీజన్లో తొలి మ్యాచ్ ఆడనుండగా, అశ్వనీ స్థానంలో క్రిష్ భగత్ జట్టులోకి వచ్చాడు. ఇక చెన్నై సూపర్‌కింగ్స్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. అకిల్ హొసేన్ స్థానంలో ప్రశాంత్ వీర్, గుర్జప్నీత్ సింగ్ స్థానంలో రామక్రిష్ణ ఘోష్ జట్టులోకి వచ్చాడు. ఈ సీజన్లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె పోరులో సీఎస్కే 103 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది.చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రీవిస్, శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరిముంబై ఇండియన్స్: విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, క్రిష్ భగత్, జస్ప్రీత్ బుమ్రా, గజన్ఫర్ -
ముంబై ఇండియన్స్‌కు చావోరేవో మ్యాచ్.. ఓడితే ఇంటికే?
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ కీలక పోరుకు సిద్దమైంది. శనివారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ అమీతుమీ తెల్చుకోనుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ముంబై ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది.ఆ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్ధానంలో ఉంది. దీంతో ప్లే ఆఫ్ రేసులో ముంబై ఉండాలంటే మిగిలిన సీఎస్కేతో పాటు మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ భవితవ్యం ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడి ఉంటుంది.ముంబై జట్టులోకి ప్రోటీస్ ఆల్రౌండర్ఇక సీఎస్కేతో జరగనున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. చెపాక్ మైదానం స్పిన్ అనుకూలించే అవకాశమున్నందన మాయాంక్ మార్కండేను తిరిగి తుది జట్టులోకి తీసుకురావలని ముంబై మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.మరో స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్‌తో మార్కండే బంతిని పంచుకోనున్నాడు. అదేవిధంగా గత మ్యాచ్‌లో విఫలమైన పేసర్ ట్రెంట్ బౌల్ట్పై వేటు పడనున్నట్లు వార్తలు అతడి స్ధానంలో ప్రోటీస్ ఆల్‌రౌండర్ కార్భిన్ బాష్ ఆడడం దాదాపు ఖాయమైంది. ఈ మ్యాచ్‌కు కూడా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ దూరం కానున్నాడు.దీంతో ముంబై ఇన్నింగ్స్‌ను ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్ ప్రారంభించనున్నారు. మిడిలార్డర్లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్ ఉండనున్నారు. గత మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయిన యువ ఆటగాడు రాబిన్ మింజ్‌ను తుది జట్టులో కొనసాగించే సూచనలు కన్పిస్తున్నాయి.ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), రాబిన్ మింజ్, శార్దూల్ ఠాకూర్, కార్బిన్ బాష్, జస్ప్రీత్ బుమ్రా, గజన్ఫర్, మయాంక్ మార్కండేచదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు' -
న్యూజిలాండ్‌కు భారీ షాక్
భుజం గాయంతో బాధపడుతున్న న్యూజిలాండ్ వన్డే, టి20 క్రికెట్ జట్టు కెప్టెన్ మిచెల్ సాంట్నర్ నెల రోజుల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఐపీఎల్లో భాగంగా వారం రోజుల క్రితం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ అందుకునే క్రమంలో ముంబై ప్లేయర్ సాంట్నర్ భుజానికి గాయమైంది.ఆ మ్యాచ్ నుంచి మధ్యలోనే తప్పుకున్న అతను లీగ్‌కు కూడా పూర్తిగా దూరమయ్యాడు. ఈ సీజన్ ఐపీఎల్లో అతను నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. ఇటీవలే స్వదేశానికి చేరుకున్న సాంట్నర్‌కు పరీక్షలు నిర్వహించిన క్రికెట్ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్‌జెడ్‌సీ) అతని గాయం విషయంపై స్పష్టమైన ప్రకటన ఇచ్చింది. ‘శుక్రవారం ఉదయమే ప్రత్యేక వైద్య నిపుణుడిని సాంట్నర్ కలిశాడు. గాయం నుంచి కోలుకునే క్రమంలో తగినంత విశ్రాంతితో పాటు రీహాబిలిటేషన్ కూడా అవసరం అని వారు తేల్చారు’ అని ఎన్‌జెడ్‌సీ వెల్లడించింది. తాజా పరిణామాల కారణంగా ఐర్లాండ్‌తో జరిగే ఏకైక టెస్టుతో పాటు లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టు నుంచి అతను తప్పుకోవడం ఖాయమైంది. గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్ సాధిస్తే సాంట్నర్‌ను ఇంగ్లండ్‌తో తర్వాతి రెండు టెస్టుల్లో ఆడించాలా లేదా అనేదానిపై టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. 2026 టి20 ప్రపంచకప్‌లో సాంట్నర్ సారథ్యంలోనే కివీస్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.చదవండి: IPL 2026: అన్నా.. సారీ.. నిన్ను తక్కువగా అంచనా వేశాం! -
చరిత్ర సృష్టించిన శార్దూల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటగాడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కాని చేయలేదు. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.ఈ చారిత్రక ఘటనలో పాత్రధారుడు ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్. 2026 ఎడిషన్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్ 29) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ ముంబై బౌలింగ్ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి ఒక్క బంతి కూడా వేయలేదు.244 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ముంబై సారధి హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ 7వ ఓవర్ సమయంలో శార్దూల్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా (బౌలర్) తీసుకున్నాడు. అయితే మ్యాచ్ పూర్తయ్యే వరకు హార్దిక్ శార్దూల్‌తో ఒక్క బంతి కూడా వేయించకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది.ఐపీఎల్ చరిత్రలో ఇంపాక్ట్ సబ్‌గా వచ్చి, ఏ విభాగంలోనూ పాల్గొనని తొలి ఆటగాడిగా శార్దూల్ చరిత్ర సృష్టించాడు. ఈ చారిత్రక తప్పిదం చేసినందుకు హార్దిక్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెగ్యులర్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్న వేల, ఇంపాక్ట్ ప్లేయర్‌గా శార్దూల్‌ను బరిలోకి దించి బౌలింగ్ చేయించకపోవడమేంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.ఈ అంశాన్ని వూహ్యాత్మక తప్పిదంగా విశ్లేషిస్తూ హార్దిక్‌పై మండిపడుతున్నారు. ముంబై బ్యాటింగ్ కోచ్ పోలార్డ్ కూడా ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. "శార్దూల్‌తో ఒక్క ఓవర్ కూడా వేయించలేదు.. నేను వెళ్లి కారణం అడుగుతాను" అంటూ వ్యాఖ్యానించాడు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 244 పరుగుల భారీ స్కోర్‌ను కూడా కాపాడుకోలేక చేతులెత్తేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లు ప్రతి ముంబై బౌలర్‌ను చీల్చిచెండాడి పరుగులు పిండుకున్నారు. ఫలితంగా సన్‌రైజర్స్ 244 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలుండగానే ఊదేసింది.ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. -
వరుస ఓటములు.. అయినా ముంబై ఇండియన్స్‌కు ప్లే ఆఫ్ ఛాన్స్?
ఐపీఎల్-2026 సీజన్లో ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బుధవారం వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. ముంబై బ్యాటింగ్‌లో అదరగొట్టినప్పటికి, బౌలింగ్‌లో మాత్రం అందుకు భిన్నంగా ఘోరంగా విఫలమైంది. 244 పరుగుల భారీ టార్గెట్‌ను సైతం ముంబై బౌలర్లు డిఫెండ్ చేసుకోలేకపోయారు. ముంబైకి ఇది ఆరువ ఓటమి. దీంతో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తమ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. ఆ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్ధానంలో ఉంది. పాయింట్ల పరంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై సమానంగా ఉన్నప్పటికి రన్‌రేట్ పరంగా హార్దిక్ సేన (-0.784) వారి కంటే కాస్త మెరుగ్గా ఉంది.ముంబై ప్లే ఆఫ్స్ చేరాలంటే?ప్రస్తుతం నెగటివ్ రన్ రేట్‌తో ఉన్న ముంబైకి ప్రతి మ్యాచ్ ఇప్పుడు చావో రేవో అన్నట్లుగా మారింది. ముంబైకి ఇంకా 6 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ముంబై ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ భవితవ్యం ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడి ఉంటుంది.అయితే ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తే ముంబై మరోసారి లీగ్ స్టేజీలోనే ఇంటిముఖం పట్టే సూచనలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా పేలవ ఫామ్ ముంబైకి ప్రధాన సమస్యగా మారింది. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అయిన బుమ్రా ఈ ఏడాది సీజన్లో తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. జూనియర్ క్రికెటర్లు సైతం అతడి బౌలింగ్‌ను ఉతికారేస్తున్నారు. ఇప్పటివరకు అతడు కేవలం రెండే రెండు వికెట్లు సాధించాడు. ఆఖరిగా ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఏదైన అద్భుతం జరగాలి.చదవండి: IPL 2026: భారీ తప్పిదం.. ముంబై ఇండియన్స్ ఓటమికి కారణం ఇదే? -
ఆరోగ్యం బాగోలేకపోయిన స్టేడియంకు వచ్చిన వినోద్ కాంబ్లీ
ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ చాన్నాళ్ల తర్వాత పబ్లిక్‌లో కన్పించారు. సచిన్ టెండూల్కర్ ప్రాణస్నేహితుడు అయిన కాంబ్లీ.. బుధవారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వాంఖడే స్టేడియంకు వచ్చారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో కాంబ్లీ చాలా బలహీనంగా ఉండి, నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ కన్పించారు. ఇద్దరు వ్యక్తులు ఆయనను చేతులు పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. కేవలం 54 ఏళ్ల వయసులోనే ఆయన ఆరోగ్యం ఇంతలా క్షీణించడం చూసి నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్టేడియంలోని ప్రేక్షకులు "గెట్ వెల్ సూన్ సార్" అని అరవగా.. ఆయన చిరునవ్వుతో థమ్సప్ చూపిస్తూ అందరికీ అభివాదం చేశారు. వినోద్ కాంబ్లీ గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ, క్రికెట్ పట్ల ఉన్న మక్కువతో కాంబ్లీ స్టేడియం రావడం విశేషం.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలోనే ఊదిపడేసింది.Vinod Kambli came to Wankhede Stadium today to watch the Mumbai Indians match. There was a time when he was considered an even better batsman than Sachin Tendulkar, but some bad habits ruined his career. Seeing him like this today doesn’t feel good, but it was nice to see that he… pic.twitter.com/AJOMh1FTX3— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) April 29, 2026 -
భారీ తప్పిదం.. ముంబై ఇండియన్స్ ఓటమికి కారణం ఇదే?
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది సీజన్లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఆరో ఓటమిని నమోదు చేసింది. బుధవారం వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది.243 పరుగుల భారీ టార్గెట్‌ను కూడా ముంబై కాపాడుకోలేక పోయింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు భారీ తప్పిదం చేసింది. బౌలర్లను ఊచకోత కోసిన ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేసే అవకాశాన్ని ముంబై ఇన్నింగ్స్ ఆరంభంలోనే కోల్పోయింది. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రెండో బంతిని బ్యాక్ ఆఫ్‌ది లెంగ్త్ డెలివరీగా బౌల్ట్ సంధించాడు.ఆ బంతిని హెడ్ లెగ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌కు సమీపంగా వెళుతూ కీపర్ చేతుల్లో పడింది. దీనిని కీపర్, బౌలర్ ఎవరూ సరిగా గుర్తించకపోవడంతో ముంబై అప్పీల్‌కు కూడా ప్రయత్నించలేదు. తర్వాత రీప్లేలో చూడగా బంతి హెడ్ బ్యాట్‌కు తగిలినట్లుగా స్పష్టమైంది. ఈ సమయంలో హెడ్ స్కోరు 8 పరుగులు మాత్రమే. ఈ తప్పిదానికి ముంబై భారీ మూల్యం చెల్లించుకోవాల్సింది. ఆ తర్వాత ఈ ఆసీస్ ఓపెనర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హెడ్ కేవలం 30 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ముంబై ఓటమిని శాసించాడు. ఒకవేళ 8 పరుగుల వద్ద హెడ్ ఔటై వుంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో హెడ్ ఇచ్చిన రెండు సునాయస క్యాచ్‌లను కూడా ముంబై ఫీల్డర్లు జారవిడిచారు.చదవండి: భయం వారి బ్లడ్‌లోనే లేదు.. తెలిసిందల్లా ఒక్కటే: పాట్ కమ్మిన్స్ -
భయం వారి బ్లడ్‌లోనే లేదు.. తెలిసిందల్లా ఒక్కటే: పాట్ కమ్మిన్స్
ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. బుధవారం వాంఖడే మైదానం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయాన్ని అందుకుంది. ముంబై నిర్ధేశించిన 244 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఊదిపడేసింది.ఈ విజయంలో ట్రావిస్ హెడ్ (76 పరుగులు),అభిషేక్ శర్మ (45 పరుగులు), హెన్రిచ్ క్లాసెన్ (65 నాటౌట్),సలీల్ అరోరా (10 బంతుల్లో 30 నాటౌట్)లది కీలక పాత్ర. ఓపెనర్లు అభిషేక్, హెడ్‌కు 129 పరుగులు అందించగా.. క్లాసెన్, ఆరోరా దూకుడుగా ఆడి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. హైదరాబాద్‌కు ఐపీఎల్లో ఇది వందో విజయం కావడం గమానార్హం. మ్యాచ్ అనంతరం ఈ చారిత్రత్మక విజయంపై ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ స్పందించాడు. ఎంతటి భారీ టార్గెట్‌నైనా ఛేదించే సత్తా తమ బ్యాటర్లకు ఉందని కమ్మిన్స్ అన్నాడు."244 పరుగుల లక్ష్యాన్ని చేధించడం అంత సులువు కాదు. కానీ మా బ్యాటింగ్ లైనప్ గురుంచి తెలుసు కాబట్టి ఖచ్చితంగా చేధిస్తామని అనుకున్నాను. మా బాయ్స్ నా నమ్మకాన్ని నిజం చేశారు. మా ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ గురుంచి ఎంత చెప్పిన తక్కువే. వారు ఆడుతున్న తీరు చూస్తుంటే భయం అన్నదే లేనిట్లు అన్పిస్తోంది. ముఖ్యంగా పిచ్ బాగున్నప్పుడు వారు ఆడే షాట్లకు బౌలర్లు బెంబేలెత్తాల్సిందే.వారికి బౌలింగ్ వేయాల్సిన అవసరం నాకు లేనందుకు సంతోషిస్తున్నాను. ఇక క్లాసెన్ మరోసారి తన క్లాస్ ఎంటో చూపించాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు రాణిస్తున్నాడు. అటువంటి ఆటగాడు జట్టులో ఉన్నందుకు మా అదృష్టం. మరోవైపు యువ ఆటగాడు సలీల్ అరోరా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్లో అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఛాన్స్ దొరికిన ప్రతీ మ్యాచ్‌లోనూ సత్తాచాటుతున్నాడు.కోచింగ్ స్టాఫ్ యువ ఆటగాళ్లలో నింపిన 'ఫియర్ లెస్' వైఖరి జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. ఐదేళ్ల క్రితం ఐపీఎల్‌కి, ఇప్పటి టోర్నీకి చాలా తేడా ఉంది. గతంలో 200 పరుగులు ఛేదించడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఓవర్‌కు 12 పరుగులు చేయాల్సి ఉన్నా, బ్యాటర్లు దానిని సులువుగా ఛేదిస్తున్నారు.ఇటువంటి హైస్కోరింగ్ మ్యాచ్‌లలో బౌలర్ల పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి మ్యాచ్‌లలో ఒక అద్భుతమైన 'యార్కర్' మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంది. మా జట్టులో ఈషన్ మలింగ వంటి అత్యుత్తమ బౌలర్లు ఉన్నారు. అతడు మా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.చదవండి: చాలా బాధగా ఉంది.. వారిని మాత్రం తప్పుబట్టను: హార్దిక్ -
చాలా బాధగా ఉంది.. వారిని మాత్రం తప్పుబట్టను: హార్దిక్
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ కథ ఏ మాత్రం మారలేదు. బుధవారం వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ బౌలర్లు డిఫెండ్ చేసుకోలేకపోయారు. సీనియర్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాలు దారుణంగా విఫలమయ్యారు. ఈ ఏడాది సీజన్లో ముంబైకి ఇది ఆరో ఓటమి. దీంతో ముంబై ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్ మెరుగు పడినప్పటికి, బౌలింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని హార్దిక్ అన్నాడు."భారీ స్కోర్‌ను నమోదు చేసినప్పటికి ఓడిపోవడం మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. ఈ రోజు మంచు ప్రభావం పెద్దగా లేదు. వారు అద్భుతమైన షాట్లు ఆడారు. మేము కొన్ని చెత్త బంతులు వేశాం. సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయకపోవడంతో వారు దూసుకుపోయారు. గత మ్యాచ్‌తో పోలిస్తే మేము పుంజుకున్నాము అన్పించింది. ముఖ్యంగా బ్యాటింగ్ పరంగా చాలా మెరుగయ్యాం. కానీ బౌలింగ్ పరంగా మాత్రం విఫలమయ్యాము. 244 పరుగుల టార్గెట్‌ను మా బౌలర్లు డిఫెండ్ చేసుకోగలరని నమ్మాను. కానీ మేము అనుకున్నది ఈ రోజు జరగలేదు. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము.ఇక నా విషయానికి వస్తే.. చివరి మూడు బంతులు మినహా, మిగిలన ఓవర్లు మొత్తం బాగానే బౌలింగ్ చేశాను. అయితే కొన్ని క్యాచ్‌లను విడిచిపెట్టడం మా గెలుపు అవకాశాలను దెబ్బ తీసింది. క్రికెట్లో క్యాచ్‌లు పట్టినప్పుడే మొమెంటం మారుతుంది. మా కుర్రాళ్లందరూ జట్టును గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. బౌలింగ్ విభాగంలో ఈ సీజన్లో మాకు పెద్దగా ఆప్షన్లు లేవు. అందుబాటులో ఉన్న బౌలర్లనే రొటేట్ చేయాల్సి వస్తుంది. అయినప్పటికి ఎట్టి పరిస్థితుల్లోనూ మా బౌలర్లను బలిపశువులు చేయను. ఓటుములకు జట్టు మొత్తం బాధ్యత వహించాల్సిందే. ముంబై ఇండియన్స్ అంటే ఒక బ్రాండ్. కానీ మా స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాము. సొంత ప్రేక్షకుల ముందు మ్యాచ్‌లను ఓడిపోతుండడం చాలా బాధగా ఉంది. కొన్ని సందర్భాల్లో హోమ్ గ్రౌండ్లో ప్రత్యర్థి జట్టు పేరు మారుమోగుతుంటే ఆ బాధ మరింత ఎక్కువ అవుతోంది. అభిమానుల ప్రేమను తిరిగి పొందాలంటే మేము తిరిగి మ్యాచ్‌లను గెలవాలి. అందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తాము. మా యజమానులు, కోచింగ్ స్టాఫ్ అందరూ ఎంతో సపోర్ట్‌గా ఉన్నారు. మేము లోపాలను సరిదిద్దుకుని తిరిగి పుంజుకుంటామని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో హార్దిక్ పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో ఉంది.చదవండి: హెడ్, క్లాసెన్ ఊచకోత.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన సన్‌రైజర్స్ -
హెడ్, క్లాసెన్ ఊచకోత.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన సన్‌రైజర్స్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 29) జరిగిన 41వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ముంబైని 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.రికెల్టన్ రికార్డు సెంచరీటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ర్యాన్ రికెల్టన్ (123 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో విల్ జాక్స్ 46, సూర్యకుమార్ యాదవ్ 5, నమన్ ధిర్ 22, హార్దిక్ పాండ్యా 31, తిలక్ వర్మ 7, రాబిన్ మింజ్ 1 (నాటౌట్) పరుగు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో హింగే 2, ఎషాన్ మలింగ, నితీశ్ కుమార్ రెడ్డి, సాకిబ్ తలో వికెట్ తీశారు.సన్‌రైజర్స్ బ్యాటర్ల ఊచకోత244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. అభిషేక్ శర్మ (45), ట్రవిస్ హెడ్ (76), హెన్రిచ్ క్లాసెన్ (65 నాటౌట్) ఊచకోత కోసి సన్‌రైజర్స్‌ను గెలిపించారు. ఆఖర్లో సలీల్ అరోరా (30 నాటౌట్) సైతం విధ్వంసం సృష్టించాడు. మిగతా ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ డకౌట్ కాగా.. నితీశ్ కుమార్ రెడ్డి 21 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్ 2 వికెట్లు తీయగా.. బౌల్ట్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు. -
చరిత్ర సృష్టించిన రికెల్టన్.. ఫాస్టెస్ట్ సెంచరీ
ర్యాన్ రికెల్టన్.. ఈ పేరు ఇప్పుడు ముంబై ఇండియన్స్ అభిమానుల నోట మారుమోగుతోంది. ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ (ఏప్రిల్ 29) జరుగుతున్న మ్యాచ్‌లో అతడు ఆడిన ఇన్నింగ్స్ ముంబై ఇండియన్స్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది.ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. రికెల్టన్ కేవలం 44 బంతుల్లోనే శతకం బాదాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డు 18 ఏళ్లుగా సనత్ జయసూర్య ఖాతాలో ఉండింది. జయసూర్య ఐపీఎల్ అరంభ ఎడిషన్‌లో (2008) ముంబై ఇండియన్స్‌కు ఆడుతూ సీఎస్కేపై 45 బంతుల్లో శతక్కొట్టాడు. ఈ రికార్డును రికెల్టన్ నేటి మ్యాచ్‌లో బద్దలు కొట్టాడు.ఐపీఎల్లో ముంబై తరఫున వేగవంతమైన సెంచరీలు44 బంతులు – ర్యాన్ రికెల్టన్45 బంతులు – సనత్ జయసూర్య45 బంతులు – తిలక్ వర్మ47 బంతులు – కెమరూన్ గ్రీన్ఈ సెంచరీతో రికెల్టన్ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల తరఫున అన్ని టీ20 లీగ్‌లలో కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ దిగ్గజం రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. రికెల్టన్ ఎంఐ ఫ్రాంచైజీల (ముంబై ఇండియన్స్, ఎంఐ కేప్‌టౌన్) తరఫున మొత్తం 3 సెంచరీలు చేయగా.. రోహిత్ 2 సెంచరీలు (రెండూ ముంబై ఇండియన్స్ తరఫునే) చేశాడు. 2025 ఐపీఎల్ సందర్భంగా ఎంఐ ఫ్యామిలీలో చేరిన రికెల్టన్ కేవలం రెండేళ్ల వ్యవధిలో రోహిత్ శర్మ వంటి దిగ్గజాన్ని అధిగమించడం విశేషం.ఎంఐ ఫ్రాంచైజీల తరఫున అత్యధిక సెంచరీలు3 – ర్యాన్ రికెల్టన్ (ఐపీఎల్, SA20)2 – రోహిత్ శర్మ (ఐపీఎల్)2 – సూర్యకుమార్ యాదవ్ (ఐపీఎల్)2 – టామ్ బాంటన్రికెల్టన్ను ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 వేలంలో కేవలం రూ.1 కోటికే సొంతం చేసుకుంది. ఇతగాడు ఇప్పటికే ఎంఐ ఫ్రాంచైజీల తరఫున అత్యంత కీలకమైన ఆటగాడిగా మారిపోయాడు.ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 55 బంతులు ఎదుర్కొన్న రికెల్టన్ 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయమైన 123 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో రికెల్టన్ మరో రికార్డు కూడా నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక స్కోర్123 (నాటౌట్)- ర్యాన్ రికెల్టన్114 (నాటౌట్)- సనత్ జయసూర్య112 (నాటౌట్)- క్వింటన్ డికాక్109 (నాటౌట్)- రోహిత్ శర్మ105 (నాటౌట్)- రోహిత్ శర్మ103 (నాటౌట్)- సూర్యకుమార్ యాదవ్కాగా, ఈ మ్యాచ్‌లో గాయపడిన డికాక్ స్థానంలో జట్టులోకి వచ్చిన రికెల్టన్ రికార్డు శతకం బాది ముంబై ఇండియన్స్‌కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు. ఎందుకంటే, రికెల్టన్ సెంచరీకి ముందు డికాక్ కూడా ఓ అద్భుత శతకం బాదాడు. దీంతో తదుపరి మ్యాచ్‌ల్లో ఎవరిని ఆడించాలో మేనేజ్మెంట్కు అర్దం కావట్లేదు.భారీ స్కోర్‌టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ర్యాన్ రికెల్టన్ (123 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో విల్ జాక్స్ 46, సూర్యకుమార్ యాదవ్ 5, నమన్ ధిర్ 22, హార్దిక్ పాండ్యా 31, తిలక్ వర్మ 7, రాబిన్ మింజ్ 1 (నాటౌట్) పరుగు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో హింగే 2, ఎషాన్ మలింగ, నితీశ్ కుమార్ రెడ్డి, సాకిబ్ తలో వికెట్ తీశారు. -
ముంబై ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ఎందుకు ధరించారో తెలుసా..?
ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ (ఏప్రిల్ 29) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. దీని వెనుక ఓ హృదయ విదారక కారణం ఉంది.జట్టు సహాయక సిబ్బందిలో ఒకరి కుమార్తె ఇటీవల అకాల మరణం చెందింది. ఆమె స్మారకార్థం, అలాగే ఆ కుటుంబానికి సంఘీభావం తెలియజేయడానికి ఆటగాళ్లు నల్ల ఆర్మ్బ్యాండ్లు ధరించి మైదానంలోకి దిగారు.ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. "మా సహాయక సిబ్బందిలో ఒకరి కుమార్తె అకాల మరణం చెందింది. వారి కుటుంబానికి మద్దతుగా, ఆమె జ్ఞాపకార్థం ఈరోజు మా ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించారు" అని వెల్లడించారు.ఈ విషాద సమయంలో ఆ కుటుంబ గోప్యతను గౌరవిస్తూ, సంబంధిత సిబ్బంది వివరాలను ముంబై ఇండియన్స్ వెల్లడించలేదు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 15 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 181-3గా ఉంది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ 44 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. అతనికి జతగా హార్దిక్ పాండ్యా (2) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు విల్ జాక్స్ 46, సూర్యకుమార్ యాదవ్ 5, నమన్ ధిర్ 22 పరుగులు చేసి ఔటయ్యారు. హింగే, ఎషాన్ మలింగ, నితీశ్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీశారు. -
రోహిత్ శర్మ అభిమానులకు చేదు వార్త
ముంబై ఇండియన్స్ అభిమానులకు చేదు వార్త. ఆ జట్టు స్టార్ బ్యాటర్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ (ఏప్రిల్ 29) జరుగుతున్న కీలక పోరులో కూడా రోహిత్ ఆడటం లేదు. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా అతడు వరుసగా నాలుగో మ్యాచ్‌కు దూరమయ్యాడు.టాస్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా రోహిత్ గాయంపై కీలక అప్డేట్ ఇచ్చాడు. "రోహిత్ ఇంకా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదు. అతడు తిరిగి రావడానికి ఇంకొన్ని మ్యాచ్‌లు పట్టొచ్చు" అని స్పష్టం చేశాడు. దీంతో ముంబై అభిమానులు అతని రీ-ఎంట్రీ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.రోహిత్ గైర్హాజరీ ముంబైకి భారీ ఎదురుదెబ్బగా పరిగణించబడుతుంది. అతని అనుభవం, ఆరంభ ఓవర్లలో దూకుడు జట్టుకు ఎంతో అవసరం. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఓపెనర్లుగా ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్ బరిలోకి దిగారు. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.ఆరంభ ఓవర్లలో ముంబై ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. జాక్స్, రికెల్టన్ పోటీపడి బౌండరీలు, సిక్సర్లు బాదుతున్నారు. 6 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 78-0గా ఉంది. జాక్స్ 38, రికెల్టన్ 37 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు బౌలింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఎసాన్ మలింగ ఒక్కడే జాక్స్-రికెల్టన్ జోడీ ధాటి నుంచి తప్పించుకున్నాడు. కమిన్స్, హింగే, హర్ష్ దూబే, సాకిబ్ హుసేన్‌ను వీరి జోడీ చెడుగుడు ఆడుకుంది.ఈ మ్యాచ్‌లో ముంబై రెండు మార్పులతో బరిలోకి దిగింది. డికాక్ స్థానంలో రికెల్టన్, సాంట్నర్ స్థానంలో రాబిన్ మింజ్ బరిలోకి దిగారు. ఎస్ఆర్హెచ్ విషయానికొస్తే.. ఈ జట్టు ఓ మార్పు చేసింది. శివాంగ్ కుమార్ స్థానంలో హర్ష్ దూబే తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(w), నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(సి), హర్ష్ దూబే, సకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), విల్ జాక్స్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, AM గజన్ఫర్, అశ్వనీ కుమార్ -
ముంబైని చిత్తు చేసిన సన్‌రైజర్స్
ముంబైని చిత్తు చేసిన సన్‌రైజర్స్244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. అభిషేక్ శర్మ (45), ట్రవిస్ హెడ్ (76), హెన్రిచ్ క్లాసెన్ (65 నాటౌట్) ఊచకోత కోసి సన్‌రైజర్స్‌ను గెలిపించారు. ఆఖర్లో సలీల్ అరోరా (30 నాటౌట్) సైతం విధ్వంసం సృష్టించాడు. మిగతా ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ డకౌట్ కాగా.. నితీశ్ కుమార్ రెడ్డి 21 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్ 2 వికెట్లు తీయగా.. బౌల్ట్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు.అంతకుముందు రికెల్టన్ (123 నాటౌట్) శతక్కొట్టుడుతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో విల్ జాక్స్ 46, సూర్యకుమార్ యాదవ్ 5, నమన్ ధిర్ 22, హార్దిక్ పాండ్యా 31, తిలక్ వర్మ 7, రాబిన్ మింజ్ 1 (నాటౌట్) పరుగు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో హింగే 2, ఎషాన్ మలింగ, నితీశ్ కుమార్ రెడ్డి, సాకిబ్ తలో వికెట్ తీశారు.4 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్9.4వ ఓవర్- 4 పరుగుల వ్యవధిలో సన్‌రైజర్స్ 3 వికెట్లు కోల్పోయింది. తొలుత అభిషేక్, ఇషాన్ కిషన్ వరుస బంతుల్లో ఔట్ కాగా.. ఆతర్వాత హెడ్ (76) హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో జాక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్తొమ్మిదో ఓవర్ 4, 5 బంతులకు సన్‌రైజర్స్ అభిషేక్ (45), ఇషాన్ కిషన్ (0) వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ (45) ఔట్8.4వ ఓవర్- 129 పరుగుల వద్ద సన్‌రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఘజన్ఫర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్ శర్మ (45) ఔటయ్యాడు.సన్‌రైజర్స్ ఓపెనర్ల ఊచకోత244 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (48), అభిషేక్ శర్మ (36) చెలరేగిపోతున్నారు. 6 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 92-0గా ఉంది. ముంబై ఇండియన్స్ భారీ స్కోర్‌టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ర్యాన్ రికెల్టన్ (123 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో విల్ జాక్స్ 46, సూర్యకుమార్ యాదవ్ 5, నమన్ ధిర్ 22, హార్దిక్ పాండ్యా 31, తిలక్ వర్మ 7, రాబిన్ మింజ్ 1 (నాటౌట్) పరుగు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో హింగే 2, ఎషాన్ మలింగ, నితీశ్ కుమార్ రెడ్డి, సాకిబ్ తలో వికెట్ తీశారు. నమన్ ధిర్ ఔట్13.4వ ఓవర్- 165 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. హింగే బౌలింగ్‌లో హర్ష్ దూబేకు క్యాచ్ ఇచ్చి నమన్ ధిర్ (22) ఔటయ్యాడు.రెండో వికెట్ డౌన్8.3వ ఓవర్- 110 పరుగుల వద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది. ఎషాన్ మలింగ బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (5) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన ముంబై7.1వ ఓవర్- 93 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి విల్ జాక్స్ (46) ఔటయ్యాడు.దుమ్మురేపుతున్న ముంబై ఓపెనర్లుముంబై ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. జాక్స్, రికెల్టన్ పోటీపడి బౌండరీలు, సిక్సర్లు బాదుతున్నారు. 6 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 78-0గా ఉంది. జాక్స్ 38, రికెల్టన్ 37 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు బౌలింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఎసాన్ మలింగ ఒక్కడే జాక్స్-రికెల్టన్ జోడీ ధాటి నుంచి తప్పించుకున్నాడు. కమిన్స్, హింగే, హర్ష్ దూబే, సాకిబ్ హుసేన్‌ను వీరి జోడీ చెడుగుడు ఆడుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 29) జరుగుతున్న 41వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఈ ఎడిషన్‌లో చెత్త ప్రదర్శనలు చేస్తూ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది. సన్‌రైజర్స్ విషయానికొస్తే.. ఈ జట్టు మధ్యమధ్యలో తడబడినా, ఓ మోస్తరు ప్రదర్శనలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించింది.తుది జట్లు..సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(w), నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(సి), హర్ష్ దూబే, సకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), విల్ జాక్స్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, AM గజన్ఫర్, అశ్వనీ కుమార్ -
రోహిత్ ఆడడంపై ముంబై క్లారిటీ!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో ఆ జట్టు ఆడిన చివరి మూడు మ్యాచ్‌లకు డగౌట్‌కే పరిమితమయ్యాడు. అయితే ముంబై ఇండియన్స్ ఇవాళ ఎస్ఆర్హెచ్తో తలపడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లోనైనా రోహిత్ బరిలోకి దిగుతాడా లేడా అన్నది అనుమానమే. తాజాగా ఈ విషయమై ముంబై ఇండియన్స్ స్పష్టత ఇచ్చింది. కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని ముంబై యాజమాన్యం పేర్కొంది. అయితే ఎస్ఆ ర్హెచ్తో మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌కు రోహిత్ కచ్చితంగా అందుబాటులో ఉంటాడని ముంబై అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ముంబై యాజమాన్యం మాత్రం రోహిత్ విషయంలో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదనిపిస్తోంది. రోహిత్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆడించాలని భావిస్తోంది. ఈరోజు ఉదయం వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన రోహిత్ శర్మ బ్యాటింగ్ జోలికి పోలేదు. వార్మప్, రన్నింగ్ అనంతరం కాసేపు ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ సపోర్ట్ స్టాఫ్‌తో కాసేపు ముచ్చటించి మైదానం వీడాడు. ఏప్రిల్ 12న ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ సమయంలో రోహిత్‌కు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఫిజియో మైదానంలోనే హిట్‌మ్యాన్‌కు ట్రీట్మెంట్ చేసినప్పటికీ నొప్పి తగ్గలేదు. దీంతో మరుసటి ఓవర్లోనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన రోహిత్ మరోసారి బ్యాటింగ్‌కు రాలేదు. ఆ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ తేడాతో ఓటమి చవిచూసింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లాడి కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఎస్ఆర్హెచ్ మాత్రం మధ్యలో పరాజయాలు చవిచూసినా వరుసగా నాలుగు విజయాలు సాధించి జోరు కనబరుస్తోంది. 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, ఒక ఓటమితో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.చదవండి: సోదరి ఓటమి.. జడేజా ఇంట మరోసారి విభేదాలు! -
ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ
ఐపీఎల్ 2026లో వరుస పరాజయాలతో సతమతమవుతూ, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ భుజం గాయం కారణంగా సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. అతని స్థానంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌ను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది.ఈ సీజన్లో సాంట్నర్‌ను గాయాల సమస్య వెంటాడింది. ఏప్రిల్ 4న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ అతని కుడి భుజానికి గాయమైంది. దీంతో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తదుపరి మ్యాచ్‌కు దూరమయ్యాడు.తరువాత కోలుకుని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌పై మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఏప్రిల్ 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన పోరులో మళ్లీ అదే భుజానికి గాయమైంది. దీంతో అతను సీజన్ మొత్తానికే దూరమవాల్సి వచ్చింది.సాంట్నర్ ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఆడి ఐదు వికెట్లు తీశాడు. ముంబై బౌలింగ్ విభాగంలో అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు సాంట్నర్ దూరం కావడం ముంబై ఇండియన్స్‌కు భారీ దెబ్బగా పరిగణించబడుతుంది.ప్రత్యామ్నాయంగా మరో స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌ను తీసుకున్నప్పటికీ.. అతను ఏ మేరకు ముంబై కష్టాలను తీర్చగలడో చూడాలి. సాంట్నర్ తరహాలోనే ఎడమచేతి స్పిన్నర్ అయిన మహారాజ్‌కు టీ20ల్లో అపార అనుభవం ఉంది. అతడు 218 టీ20 మ్యాచ్‌ల్లో 191 వికెట్లు పడగొట్టాడు.ముంబై ఏప్రిల్ 29న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. కేశవ్ మహారాజ్ రాకతో జట్టు బౌలింగ్ దళానికి కొత్త బలం చేకూరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. -
'సెంచరీలు కొట్టండి.. లేదంటే అంతే మీ పని'
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 103 పరుగుల తేడాతో ముంబై చిత్తు అయింది. ఐపీఎల్ చరిత్రలో పరుగుల తేడా పరంగా ముంబై ఇండియన్స్‌కు ఇదే అతి పెద్ద ఓటమి.దీంతో ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల చెత్త ప్రదర్శనపై ఆ జట్టు యజమాని ఆకాశ్ సైతం అసహనం వ్యక్తం చేశారు. ముంబై డౌగౌట్‌కు దగ్గరలో ఉన్న ఆకాశ్.. సోఫాలో నుంచి లేచి నిలబడి.. ‘‘అంతా అయిపోయింది. ఇంకేం చూస్తారు.. పదండి పదండి’’ అన్నట్లుగా ప్రేక్షకులకు సైగ చూస్తూ స్టేడియాన్ని వీడారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ అంబానీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబై వరుస వైఫల్యాలపై ఆకాశ్ గుర్రుగా ఉన్నారని బసిత్ అలీ అన్నాడు.ఆకాష్ అంబానీకి గనుక కోపం వస్తే పరిస్థితి మరో విధంగా ఉంటుంది. అప్పుడు ఆటగాళ్లను ఆయన దండిస్తాడు. భాయ్ ఇకపై మ్యాచ్‌లు గెలవండి, సెంచరీలు కొట్టండి అని తమ ఆటగాళ్లకు ఆకాష్ గట్టిగా చెబుతాడు అని బసిత్ అలీ ఎగతాళిగా వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ముంబై జట్టు సెలక్షన్‌పై కూడా అతడు విమర్శలు కురిపించాడు. ముఖ్యంగా వరుసగా రెండు మ్యాచ్‌లలో విఫలమైన యువ ఆటగాడు డానిష్ మలేవార్‌ను జట్టులోకి తీసుకోవడాన్ని అతడు తప్పబట్టాడు. "ఈ కొత్త ఓపెనర్ ఎవరు? అతడిని ముంబై ఎందుకు ఆడిస్తోంది? అతనేమన్నా సిఫార్సుతో జట్టులోకి వచ్చాడా? అని అలీ మండిపడ్డాడు. అయితే ముంబై ఫ్యాన్స్ మాత్రం బసిత్ అలీకి కౌంటరిస్తున్నారు. ముందు మీ పీఎస్ఎల్ సంగతి చూసుకోండి, ఆ తర్వాత ఐపీఎల్ గురుంచి మాట్లాడు అంటూ ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. కాగా ఐపీఎల్‌కు పోటీగా ప్రారంభమైన పీఎస్ఎల్-2026 సీజన్ అట్టర్ ప్లాప్ అయింది. -
సామ్సన్ జిగేల్.. ముంబై ఢమాల్
-
బ్యాటింగ్ రాదు.. బౌలింగ్ రాదు! నీకు కెప్టెన్సీ అవసరమా?
ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా పేలవ ఫామ్ కొనసాగుతోంది. కెప్టెన్‌గా, వ్యక్తిగత ప్రదర్శన పరంగా హార్దిక్ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ దారుణంగా విఫలమయ్యాడు.తొలుత బౌలింగ్‌లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 38 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం కీలక సమయంలో బ్యాటింగ్ వచ్చిన హార్దిక్.. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ర్యాష్ షాట్ ఆడి తన వికెట్‌ను వికెట్‌ను కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీ పరంగా కూడా హార్దిక్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.చెత్త నిర్ణయాలు తీసుకుంటూ జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఈ ఏడాది సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ పాండ్యా కేవలం 97 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో కూడా కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో హార్దిక్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.బ్యాటింగ్ రాదు, బౌలింగ్ రాదు.. కెప్టెన్సీ అవసరమా హార్దిక్ అంటూ ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది.సీఎస్కే ఘన విజయంఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 103 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. సీఎస్కే స్పిన్నర్ అకిల్ హుస్సేన్ నాలుగు వికెట్లు పడగొట్టి ముంబై పతనాన్ని శాసించాడు. అతడితో పాటు నూర్ అహ్మద్ రెండు, గుర్జప్నీత్, కాంబోజ్, ముఖేష్ చౌదరి, కాంబోజ్ తలా వికెట్ సాధించారు. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(36), తిలక్ వర్మ(37) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ విజయంతో సీఎస్కే పాయింట్ల పట్టికలో ఐదో స్దానానికి చేరుకుంది. -
ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన సీఎస్కే
ఐపీఎల్-2026లో చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 103 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. చెన్నై ఓపెనర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సంజూ 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవాల్డ్ బ్రెవిస్(21), గైక్వాడ్(22) రాణించారు. ఈ ఏడాది సీజన్లో సంజూకు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్, అశ్విని కుమార్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, శాంట్నర్ చెరో వికెట్ సాధించారు.అకిల్ మ్యాజిక్‌అనంతరం 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. సీఎస్కే స్పిన్నర్ అకిల్ హోస్సేన్ 4 వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. అతడితో పాటు నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(36), తిలక్ వర్మ(37) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు. ముంబై ఇండియన్స్‌కు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం. -
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి శతక్కొట్టాడు. ఈ ధనాధన్ లీగ్‌లో భాగంగా వాఖండే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ముంబై బౌలర్లను తనదైన శైలిలో ఉతికారేశాడు.కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సంజూకు ఇది 5వ ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో ఇది అతడికి ఎనిమిదివ సెంచరీ. ఈ క్రమంలో శాంసన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.సంజూ సాధించిన రికార్డులు ఇవేముంబై ఇండియన్స్‌పై సెంచరీ చేసిన మొట్టమొదటి సీఎస్కే బ్యాటర్‌గా శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో సంజూ కంటే ముందు ఈ సీఎస్కే బ్యాటర్ కూడా ముంబైపై మూడంకెల స్కోరును అందుకోలేదు.అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఒకే సీజన్లో రెండు సెంచరీలు చేసిన మొదటి భారత బ్యాటర్‌గా సంజూ రికార్డు నెలకొల్పాడు.ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో కెఎల్ రాహుల్‌తో కలిసి నాలుగో స్థానంలో శాంసన్ నిలిచాడు.టీ20 క్రికెట్లో భారత తరపున అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ సరసన శాంసన్ నిలిచాడు. వీరిద్దరూ ఇప్పటివరకు 8 టీ20 సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి(9), అభిషేక్ శర్మ(9) సంయుక్తంగా అగ్రస్ధానంలో ఉన్నారు.చదవండి: IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి విధ్వంసకర ప్లేయర్ What composure. What striking 💛𝐒𝐚𝐧𝐣𝐮 𝐒𝐦𝐚𝐬𝐡𝐢𝐧𝐠 𝐒𝐚𝐦𝐬𝐨𝐧 🔥Scorecard ▶️ https://t.co/gGt34dqUoq#TATAIPL | #KhelBindaas | #MIvCSK | @ChennaiIPL | @IamSanjuSamson pic.twitter.com/2Hr9Ui0UEn— IndianPremierLeague (@IPL) April 23, 2026 -
ముంబై ఇండియన్స్‌పై సీఎస్కే ఘన విజయం
Chennai super kings vs Mumbai indians Live updates: ముంబై ఇండియన్స్‌పై 103 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. సీఎస్కే స్పిన్నర్ అకిల్ హుస్సేన్ నాలుగు వికెట్లు పడగొట్టి ముంబై నడ్డివిరిచాడు.అతడితో పాటు నూర్ అహ్మద్ రెండు, గుర్జప్నీత్, కాంబోజ్, ముఖేష్ చౌదరి, కాంబోజ్ తలా వికెట్ సాధించారు. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(36), తిలక్ వర్మ(37) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ విజయంతో సీఎస్కే పాయింట్ల పట్టికలో ఐదో స్దానానికి చేరుకుంది.ముంబై ఏడో వికెట్ డౌన్‌సూర్యకుమార్ యాదవ్ రూపంలో ముంబై ఇండియన్స్ ఏడో వికెట్ కోల్పోయింది. ముంబై విజయానికి 41 బంతుల్లో 121 పరుగులు కావాలి.కష్టాల్లో ముంబై13 ఓవర్ వేసిన నూర్ అహ్మద్ బౌలింగ్‌లో వరుస బంతుల్లో ముంబై ఇండియన్స్ రెండు వికెట్లు కోల్పోయింది. తొలి బంతికి హార్దిక్ పాండ్యా(1), రెండో బంతికి షెర్ఫేన్ రూథర్ ఫర్డ్(0) పెవిలియన్‌కు చేరాడు. 13 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 86/6ముంబై ఐదో వికెట్ డౌన్తిలక్ వర్మ రూపంలో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన తిలక్.. అకీల్ హొసేన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ముంబై మూడో వికెట్ డౌన్‌ముంబై మూడో వికెట్ కోల్పోయింది. అకిల్ హుస్సేన్ బౌలింగ్‌లో నమన్ ధీర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.ముంబై రెండో వికెట్ డౌన్‌ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన క్వింటన్ డికాక్.. ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 11/2ముంబై తొలి వికెట్ డౌన్‌ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. యువ ఓపెనర్ దానిష్ మలేవార్ మరోసారి డౌకటయ్యాడు. అకిల్ హోస్సేన్ బౌలింగ్‌లో మలేవార్ ఔటయ్యాడు. సంజూ శాంసన్ సూపర్ సెంచరీవాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ అజేయ సెంచరీతో చెలరేగాడు. సంజూ 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవాల్డ్ బ్రెవిస్(21), గైక్వాడ్(22) రాణించారు.దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్, అశ్విని కుమార్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, శాంట్నర్ తలా వికెట్ సాధించారు.సీఎస్కే ఐదో వికెట్ డౌన్కార్తీక్ శర్మ రూపంలో సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన కార్తీక్ శర్మ.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 166/5. క్రీజులో సంజూ శాంసన్(78) ఉన్నాడు.12 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 128/412 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. క్రీజులో సంజూ శాంసన్(57), కార్తీక్ శర్మ(2) ఉన్నారు.సీఎస్కే రెండో వికెట్ డౌన్సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్.. శాంట్నర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 73/2సీఎస్కే తొలి వికెట్ డౌన్32 పరుగుల వద్ద సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. గజన్ఫర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.దూకుడుగా ఆడుతున్న రుతురాజ్2 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్(17), సంజూ శాంసన్(5) ఉన్నారు.ఐపీఎల్-2026లో మరో కీలక పోరుకు తెరలేచింది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌కు కూడా ముంబై, సీఎస్కే లెజెండరీ ప్లేయర్లు రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని దూరమయ్యారు. వీరిద్దరూ గాయాలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా సీఎస్కే జట్టులోకి ఆయూశ్ మాత్రే స్ధానంలో యువ ఆటగాడు కార్తిక్ శర్మ వచ్చాడు.తుది జట్లుచెన్నై సూపర్ కింగ్స్ : సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ముఖేష్ చౌదరిముంబై ఇండియన్స్: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), తిలక్ వర్మ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా, క్రిష్ భగత్, అల్లా మహ్మద్ గజన్ఫర్, అశ్వనీ కుమార్ -
హార్దిక్ తో గొడవ పై కృనాల్ పాండ్యా క్లారిటీ
-
స్టార్స్ ఆడతారా?
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరు మ్యాచ్‌లు ఆడినా మహేంద్ర సింగ్ ధోని ఇంకా బరిలోకి దిగలేదు. గాయం నుంచి కోలుకుంటున్న అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరోవైపు ముంబై ఇండియన్స్ ఆరు మ్యాచ్‌లు ఆడగా... తొలి నాలుగు మ్యాచ్‌లలో బరిలోకి దిగిన రోహిత్ శర్మ గాయంతో గత రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య వాంఖెడే మైదానంలో జరిగే మ్యాచ్‌లో వీరిద్దరు బరిలోకి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు భారత స్టార్లు బుధవారం సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. అయితే గత మ్యాచ్‌కు ముందు కూడా సాధన చేసినా... చివరి నిమిషంలో తప్పుకోవడంతో ఈసారి వారి పునరాగమనం మళ్లీ ఆసక్తిగా మారింది. టోర్నీలో ఇరు జట్లు ప్రస్తుతం చెరో నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా ముంబై ఏడో స్థానంలో, చెన్నై ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాయి. నాలుగు వరుస పరాజయాల తర్వాత తిలక్ వర్మ మెరుపులతో గత మ్యాచ్‌లో నెగ్గిన ముంబై సొంతగడ్డపై అదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది. డికాక్, నమన్ ధీర్‌లతో పాటు సూర్యకుమార్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా రాణిస్తే భారీ స్కోరుకు అవకాశం ఉంది. బౌలింగ్‌లో బుమ్రా ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం కాగా, అశ్వని కుమార్ కూడా ఆకట్టుకున్నాడు. ఇద్దరు విదేశీ స్పిన్నర్లు సాంట్నర్, ఘజన్ఫర్ ప్రత్యర్థిని కట్టడి చేయగలరు. మరోవైపు వరుసగా రెండు విజయాలతో కోలుకున్నట్లు అనిపించిన చెన్నై గత పోరులో హైదరాబాద్ చేతిలో ఓడి మళ్లీ వెనుకబడింది. సంజూ సామ్సన్ ఫర్వాలేదనిపిస్తున్నా, కెప్టెన్ రుతురాజ్ ఫామ్ ఆందోళనకరంగా ఉంది. పైగా సత్తా చాటిన యువ బ్యాటర్ ఆయుశ్ మాత్రే గాయంతో టోర్నీకి దూరం కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ. టాపార్డర్‌లో అతని స్థానంలో ఎవరిని ఆడిస్తారనేది చూడాలి. -
‘మమ్మల్ని ఆపడం ఎవరివల్లా కాదు’
న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ జట్టులో చాలా మంది ప్రపంచకప్ విజేతలు ఉన్నారని... వారు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే తమ జట్టును ఆపడం ఎవరి వల్లా కాదని మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ అన్నాడు. ఐపీఎల్లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జయభేరి మోగించడంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన ఈ హైదరాబాదీ లెఫ్ట్ హ్యాండర్... ఆ తర్వాత భారీ షాట్లతో రెచ్చిపోయి అజేయ సెంచరీతో ముంబై జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆ తర్వాత బౌలర్లు సమష్టి కృషితో సత్తాచాటడంతో గుజరాత్‌పై ముంబై ఘనవిజయం సాధించింది. మ్యాచ్ అనంతరం తిలక్ మాట్లాడుతూ... ‘ఈ ప్రదర్శన నాకు, జట్టుకు ఎంతో ముఖ్యమైంది. గత నాలుగైదు మ్యాచ్‌ల్లో ఏదీ కలిసిరాలేదు. ఎక్కువ సమయం క్రీజులో గడిపేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో గుజరాత్‌తో మ్యాచ్‌లో పరిస్థితులకు తగ్గట్లు ఆడాలని అనుకున్నా... అది ఫలితాన్నిచ్చింది’ అని అన్నాడు. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిన ముంబై ఇండియన్స్... తిలక్ మెరుపులతో తిరిగి గెలుపు బాట పట్టింది. తిలక్ వర్మకు ఐపీఎల్లో ఇదే తొలి శతకం కాగా... ఈ జోరు సీజన్ మొత్తం కొనసాగించాలనుకుంటున్నట్లు అతడు వెల్లడించాడు. ‘అహ్మదాబాద్ వేదికగా ముంబై మ్యాచ్ ఎప్పుడు జరిగినా... ఇలాంటి పిచ్‌పైనే సాగుతుంది. ఇతర పిచ్‌లతో పోల్చుకుంటే అది కాస్త నెమ్మదిగా ఉంది. బంతి తక్కువ ఎత్తులో వస్తుండటంతో స్ట్రెయిట్‌గా ఆడాలని నిర్ణయించుకున్నా. దీంతో సులువుగా పరుగులు రాబట్టగలిగా. సాధారణంగా మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతా. కానీ జట్టుకు అవసరమైనప్పుడు పరిస్థితులకు తగ్గట్లు ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. చిన్నప్పటి నుంచి దీని కోసం ఎంతో సాధన చేశా. ఎక్కువ ఆలోచించడం లేదు. చిన్నచిన్న లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని అందుకోవడమే మా పని. ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టి పెట్టాం. మా సామర్థ్యం ఏంటో మాకు తెలుసు. జట్టులో చాలా మంది ప్రపంచకప్ గెలిచిన ప్లేయర్లు ఉన్నారు. అనుభవం, నైపుణ్యానికి కొదవలేదు. మేమంతా కలిసికట్టుగా రాణిస్తే... ముంబై ఇండియన్స్‌ను ఆపడం ఎవరి తరం కాదు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా ఉత్సాహపరిచాడు. ‘నువ్వు చేయగలవు’ అని పదే పదే చెప్తూ నాలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఆ సమయంలో ‘ప్రశాంతంగా ఉండు... మిగిలిందంతా నేను చూసుకుంటా’ అని చెప్పాను. మొత్తానికి ఈ విజయం జట్టులో జోష్ నింపింది’ అని తిలక్ వివరించాడు. -
ముంబై ఇండియన్స్‌కు శుభవార్త.. బిగ్ బూస్ట్
ముంబై ఇండియన్స్‌కు శుభవార్త. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ అందుబాటులోకి వచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా అతడు ముంబై తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో విల్ జాక్స్ అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే.వరల్డ్‌కప్‌లో సూపర్హిట్ఇంగ్లండ్ తరఫున ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి 226 పరుగులు చేసిన విల్ జాక్స్ (Will Jacks).. తొమ్మిది వికెట్లు కూల్చాడు. ఈ టోర్నీలో ఇంగ్లండ్ సెమీస్ ప్రయాణానికి దోహదం చేసిన ఈ ఆల్‌రౌండర్ నాలుగుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. ఈ పవర్ హిట్టర్‌ను ముంబై ఇండియన్స్ రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసింది.వ్యక్తిగత సెలవుఅయితే, వరల్డ్‌కప్ తర్వాత వ్యక్తిగత సెలవుపై వెళ్లిన విల్ జాక్స్ ముంబై ఆరంభ మ్యాచ్‌లకు మాత్రమే దూరమవుతాడని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఆరు మ్యాచ్‌లు పూర్తైనా అతడు జట్టుతో చేరలేదు. తాజా సమాచారం ప్రకారం విల్ జాక్స్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతడు భారత్‌లో అడుగుపెట్టినట్లు సమాచారం. కాగా ముంబై ఇండియన్స్ ఇప్పటికి ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే గెలిచింది. ఇలాంటి తరుణంలో స్టార్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ జట్టుతో చేరనుండటం సానుకూలాంశం. కాగా ముంబై గురువారం చెన్నై జట్టుతో తలపడనుంది. ఇందుకు వాంఖడే వేదిక.చదవండి: తిలక్ వర్మపై హార్దిక్ పాండ్యా సీరియస్.. స్పందించిన స్టార్ -
గుజరాత్‌ను వారి ఇలాకాలో ఓడించిన అనంతరం హార్దిక్ వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 21) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్‌ను వారి సొంత ఇలాకాలో (అహ్మదాబాద్) చిత్తుగా ఓడించింది. హ్యాట్రిక్ విజయాల తర్వాత గుజరాత్‌కు ఎదురైన తొలి ఓటమి ఇది. మరోవైపు ముంబైకు నాలుగు వరుస పరాజయాల తర్వాత వచ్చిన తొలి గెలుపు ఇది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ (101 నాటౌట్) రికార్డు శతకంతో ముంబై ఇండియన్స్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తిలక్ శతక్కొట్టుడుతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. అనంతరం 200 పరుగుల లక్ష్య ఛేదనలో అశ్వనీ కుమార్ (4-0-24-4), ఘజన్ఫర్ (2.5-0-17-2), సాంట్నర్ (3-0-16-2) ధాటికి గుజరాత్ 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.ఈ గెలుపుపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా చాలా ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. అహ్మదాబాద్ లాంటి కఠిన వేదికపై గెలవడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ మైదానంలో ముంబై ఇండియన్స్‌కు గతంలో పెద్దగా విజయాలు లేవు. ఈసారి మంచి క్రికెట్ ఆడి విజయం సాధించడం ప్రత్యేకంగా అనిపించింది. ఈ గెలుపు జట్టుకు అత్యంత అవసరమైంది.మ్యాచ్‌లో కీలక మలుపు 14వ ఓవర్ టైమ్‌ఔట్ తర్వాత వచ్చింది. ఆ సమయంలో తిలక్ వర్మకు ఓ సందేశం ఇచ్చాను. బంతిని గమనించి, ధైర్యంగా కొట్టు అని చెప్పాను. తిలక్ ప్రతిభపై పూర్తి నమ్మకం ఉంది, అతను తన సహజ ఆట ఆడితే చాలు అన్న భావనతో ప్రోత్సహించాను. చివరికి తిలక్ అద్భుతంగా ఆడి జట్టుకు మంచి స్కోర్ అందించాడు.బౌలింగ్‌లో బుమ్రా వినియోగంపై పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాను ఎప్పుడైనా ఉపయోగించవచ్చని, అతను ప్రత్యేకమైన బౌలర్ కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా అతన్ని వినియోగించడం ముఖ్యమని అన్నాడు. ఈ మ్యాచ్‌లో కొత్త బంతితోనే ప్రభావం చూపాలని నిర్ణయించి, బుమ్రాను ప్రారంభంలోనే బౌలింగ్‌కు తీసుకురావడం విజయానికి దోహదపడిందని తెలిపాడు.ఈ మ్యాచ్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. అరంగేట్రం బౌలర్ కృష్ మంచి లైన్, లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడని, అశ్వనీ కుమార్ కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్ మలుపు తిప్పాడని పేర్కొన్నాడు. గత సీజన్లో కూడా అతను ఇదే తరహా ప్రదర్శన చేసినట్లు గుర్తు చేశాడు. అదనంగా ఫీల్డింగ్‌లో కూడా జట్టు మెరుగ్గా రాణించిందని, ముఖ్యంగా నమన్ ప్రదర్శనను ప్రశంసించాడు. మొత్తంగా ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని పాండ్యా అభిప్రాయపడ్డాడు. ఇక దూసుకుపోతామని పరోక్షంగా చెప్పాడు. -
ముంబై చేతిలో పరాజయాన్ని బౌలర్లపై నెట్టిన గిల్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 20) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ 99 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. తిలక్ వర్మ (101 నాటౌట్) రికార్డు శతకంతో ముంబై ఇండియన్స్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. నాలుగు వరుస పరాజయాల తర్వాత ముంబైకి వచ్చిన మొదటి గెలుపు ఇది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిచి ఉండకపోయుంటే ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా సంక్లిష్టం అయ్యేవి. మరోవైపు గుజరాత్‌కు ఇది హ్యాట్రిక్ విజయాల తర్వాత తొలి పరాజయం. ఈ మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 200 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ చేతులెత్తేసింది. అశ్వనీ కుమార్ (4-0-24-4), ఘజన్ఫర్ (2.5-0-17-2), సాంట్నర్ (3-0-16-2) ధాటికి 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓటమిపై సమీక్షిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. మధ్య ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇవ్వడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డాడు.గిల్ మాటల్లో.. ఈ పిచ్‌పై 160-170 పరుగుల స్కోర్ చాలా ఎక్కువ. మా బౌలర్లు మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయలేకపోవడం వల్ల ప్రత్యర్థి జట్టు అదనపు పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. వాటిని భవిష్యత్తులో అమలు చేయాల్సిన అవసరం ఉంది.ఈ ఓటమిని పెద్ద సమస్యగా చూడదలచుకోలేదు. చిన్న అవాంరంగానే పరిగణిస్తాం. ఇకపై బయట మైదానాల్లో జరిగే మ్యాచ్‌ల్లో తిరిగి విజయాల బాట పడతాం. జట్టు ప్రదర్శనను మెరుగుపరుచుకోవడానికి అవసరమైన మార్పులు చేసుకుంటాము.పిచ్‌పై మాట్లాడుతూ.. వికెట్ కొంచెం నెమ్మదిగా ఉంది. బంతి సరిగా బ్యాట్‌పైకి రాకపోవడం బౌలర్లకు సవాలుగా మారింది. కొన్ని బంతులు వేగంగా, మరికొన్ని నెమ్మదిగా, ఇంకొన్ని తక్కువ ఎత్తులో ఉండటం వల్ల సరైన లెంగ్త్‌ను నిరంతరం కొనసాగించలేకపోయాము. ముఖ్యంగా మధ్య ఓవర్లలో ఒకే లెంగ్త్‌ను కచ్చితంగా పాటించలేకపోవడం మా ప్రధాన లోపం.ప్రత్యర్థి బ్యాటింగ్ సమయంలో పిచ్‌లో మార్పులపై ప్రశ్నించగా.. పెద్దగా తేడా లేదని చెప్పాడు. అయితే తమ బ్యాటింగ్ సమయానికి కొంత మంచు ప్రభావం ఉండిందని అన్నాడు. ఇది ముంబై బౌలర్లకు కలిసొచ్చిందని పరోక్షంగా తెలిపాడు.మొత్తంగా, గిల్ ఈ మ్యాచ్‌లో జరిగిన తప్పిదాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకుంటే మళ్లీ విజయాల బాట వచ్చని నమ్మకం వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా తన జట్టును మళ్లీ సమతుల్యంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశాడు. -
ముంబై చేతిలో చిత్తుగా ఓడిన గుజరాత్
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. సోమవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 99 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. వాషింగ్టన్ సుందర్ 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ 4 వికెట్లతో చెలరేగగా, గజన్ఫర్, మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు పడగొట్టారు. సొంతగడ్డపై ఆడిన గుజరాత్ ముంబై బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనప్పటికీ మిడిలార్డర్లో తిలక్ వర్మ (101 నాటౌట్) సెంచరీతో విధ్వంసం చెలరేగగా, నమన్ ధిర్ (45) బాధ్యతాయుతంగా ఆడారు. గుజరాత్‌బౌలర్లలో రబాడ 3 వికెట్లు తీయగా, సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ చెరొక వికెట్ తీశారు. సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సీజన్లో రెండో విజయం సాధించిన ముంబై 4 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, మూడు పరాజయాలతో పట్టిలకలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. -
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ఫాస్టెస్ట్ సెంచరీ
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో తిలక్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో తిలక్ విధ్వంసం సృష్టించాడు.ముంబై ఇండియన్స్ 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్.. తొలుత ఆచితూచి ఆడాడు. ఈ హైదరాబాదీ తను ఎదుర్కొన్న తొలి 22 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత తిలక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గుజరాత్ బౌలర్లను ఉతికారేశాడు. అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు. తొలి 50 పరుగులను 33 బంతుల్లో పూర్తి చేసిన తిలక్.. చివరి 50 పరుగులను కేవలం 12 బంతుల్లోనే బాది తన మొదటి ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి.ఫాస్టెస్ట్ సెంచరీఈ మ్యాచ్‌లో 45 బంతుల్లోనే శతకొట్టిన తిలక్ వర్మ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున ఫాస్టెస్ సెంచరీ చేసిన ఆటగాడిగా సనత్ జై సూర్య రికార్డును తిలక్ సమం చేశాడు. జైసూర్య 2008 సీజన్లో సీఎస్కేపై 45 బంతుల్లోనే శతక్కొట్టాడు.ఇప్పుడు మళ్లీ 18 ఏళ్ల తర్వాత తిలక్ 45 బంతుల్లో సెంచరీ చేశాడు. ముంబై ఇండియన్స్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ మాత్రం తిలక్ వర్మనే కావడం గమనార్హం.అదేవిధంగా ముంబై ఇండియన్స్ తరపున సెంచరీ చేసిన రెండువ అతి పిన్నవయష్కుడిగా తిలక్ నిలిచాడు. 23 ఏళ్ల 163 రోజుల్లో తిలక్ ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో కామోరూన్ గ్రీన్(22 ఏళ్ల 352 రోజులు) అగ్రస్ధానంలో ఉన్నాడు.చదవండి: IPL 2026: ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ బాల్.. దెబ్బకు స్టంప్స్ ఎగిరిపోయాయిONE OF THE CRAZIEST HUNDREDS IN THE IPL BY TILAK VARMA IN 45 BALLS. 🤯🔥- The hundred celebration was ice cold. 🥶 pic.twitter.com/DhMfH0UlgM— Mufaddal Vohra (@mufaddal_vohra) April 20, 2026 -
ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ బాల్.. దెబ్బకు స్టంప్స్ ఎగిరిపోయాయి
ఐపీఎల్-2026లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూర్య తీవ్ర నిరాశపరిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు కగిసో రబాడ ఆరంభంలోనే బిగ్ షాకిచ్చాడు.అతడు బౌలింగ్ ధాటికి ఓపెనర్లు వికెట్లు కోల్పోయి ముంబై కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌పై ముంబై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే 6 ఓవర్ వేసిన రబాడ బౌలింగ్‌లో సూర్య ఓ సిక్స్, ఫోర్ బాది మంచి టచ్‌లో కన్పించాడు. కానీ అదే ఓవర్లో రబాడ అద్భుతమైన బంతితో సూర్యకుమార్‌ను బోల్తా కొట్టించాడు.ఐదో బంతిని రబాడ లెంగ్త్ బాల్ సంధించాడు. ఆ డెలివరీని సూర్య స్ట్రైట్ డ్రైవ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఇన్ స్వింగ్ అయ్యి బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో సూర్య కేవలం 15 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ వికెట్ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.Quinton de Kock ✅Surya Kumar Yadav ✅Kagiso Rabada with a fine piece of new-ball bowling 👌Updates ▶️ https://t.co/cawFoZABvQ#TATAIPL | #KhelBindaas | #GTvMI | @gujarat_titans pic.twitter.com/Xw2QlE4kZF— IndianPremierLeague (@IPL) April 20, 2026 -
గుజరాత్‌పై ముంబై ఇండియన్స్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. సోమవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 99 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. వాషింగ్టన్ సుందర్ 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ 4 వికెట్లతో చెలరేగగా, గజన్ఫర్, మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు పడగొట్టారు. సొంతగడ్డపై ఆడిన గుజరాత్ ముంబై బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.గుజరాత్ మూడో వికెట్ డౌన్‌గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్.. అశ్విన్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 45/3గుజరాత్ రెండో వికెట్ డౌన్‌గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన జోస్ బట్లర్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. బుమ్రా వేసిన మొదటి ఓవర్లో తొలి బంతికే సాయిసుదర్శన్ పెవిలియన్‌కు చేరాడు.తిలక్ వర్మ విధ్వంసంఅహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. తిలక్ వర్మకు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ. అతడితో పాటు నమన్ ధీర్(32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 45) రాణించాడు. ఫలితంగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలా వికెట్ సాధించారు.తిలక్ వర్మ హాఫ్ సెంచరీతిలక్ వర్మ ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. అహ్మాదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. 59 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.దూకుడుగా ఆడుతున్న తిలక్16 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(37), హార్దిక్ పాండ్యా(7) ఉన్నారు.ముంబై నాలుగో వికెట్ డౌన్98 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన నమన్ధీర్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోర్: 103/4ముంబై మూడో వికెట్ డౌన్44 పరుగుల వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. రబాడ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడుముంబై రెండో వికెట్ డౌన్23 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన క్వింటన్ డికాక్.. కగిసో రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు.తొలి వికెట్ డౌన్టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. అరంగేట్ర ఆటగాడు డానిష్ మాలెవర్(2).. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు ముంబై స్కోర్: 21/1ఐపీఎల్-2026 సీజన్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కూడా ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ దూరమయ్యాడు.కాగా ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరపున యువ ఆటగాళ్లు డానిష్ మలేవార్, క్రిష్ భగత్ అరంగేట్రం చేశాడు. అదేవిధంగా మిచెల్ శాంట్నర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. గుజరాత్ టైటాన్స్ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, కగిసో రబడ, ప్రసిద్ధ్ కృష్ణ, అశోక్ శర్మముంబై ఇండియన్స్ : డానిష్ మాలెవార్, క్వింటన్ డి కాక్(వికెట్‌కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(సి), తిలక్ వర్మ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, క్రిష్ భగత్, జస్ప్రీత్ బుమ్రా, ఘజన్ఫర్ -
నాకు ఫీల్డింగ్ పెట్టడం రాదు అంతా రోహితే చూసుకునేవాడు..
-
ముంబై పతనం: రోహిత్ నుంచి బుమ్రా వరకు.పాండ్య బలుపే కారణమా..?
-
ముఖం చాటేసిన పాండ్యా.. ఏడుపొక్కటే తక్కువ!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ వైఫల్యం కొనసాగుతుంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించిన ముంబై గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ దారుణ ఓటమిని చవిచూసింది. ప్రబ్‌సిమ్రన్, శ్రేయస్ అయ్యర్ల విధ్వంసంతో ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. మ్యాచ్‌లో ఓటమితో ముంబై ఇండియన్స్ పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ముంబై ఓటమి తర్వాత ఢీలా పడిన ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బస్సులో హోటల్ రూమ్‌కు బయల్దేరిన సమయంలో మీడియా కంట పడ్డాడు. మీడియాను చూసి ముఖం చాటేసిన పాండ్యా తన చేతులు అడ్డుపెట్టుకొని ఏడ్చినంత పని చేశాడు. తన పక్కనే కూర్చున్న సూర్యకుమార్ యాదవ్ కూడా డల్‌గా కనిపించాడు. పక్కనే కూర్చున్న సూర్యతో కూడా ఏం మాట్లాడకుండా బస్ అద్దంవైపు తిరిగిన పాండ్యా బయటకు చూస్తూ కంటతడి పెట్టినట్లు కెమెరాలకు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక కెప్టెన్‌గానే గాక ఆటగాడిగానూ పాండ్యా విఫలమవుతున్నాడు. నాలుగు మ్యాచ్‌లు కలిపి 27 సగటుతో కేవలం 81 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు మాత్రమే తీసిన పాండ్యా ఇచ్చుకున్న పరుగులుఎకానమీ రేటు 11.16గా ఉండడం గమనార్హం. పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ టాస్ ఓడిపోవడం దగ్గరి నుంచి పాండ్యాకు ఏదీ కలిసిరాలేదు. బ్యాటింగ్‌లో 14 పరుగులు మాత్రమే చేసిన ఈ ఆల్‌రౌండర్ మూడు ఓవర్లు వేసి 39 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ సెంచరీతో మెరవగా, నమన్ ధిర్ అర్థసెంచరీతో రాణించాడు. అనంతరం పంజాబ్ ప్రబ్‌సిమ్రన్, అయ్యర్ విధ్వంసంతో 16.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 198 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఇప్పటికే నాలుగు ఓటములతో పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు గుజరాత్ టైటాన్స్‌తో ఏప్రిల్ 20న జరగబోయే మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది.Hardik Pandya was hiding his face while going hotel in the team bus. He looked quite upset and emotional. After the match last night pic.twitter.com/X0Gdcltzpr— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) April 17, 2026చదవండి: ఐపీఎల్ చరిత్రలో అరుదైన దృశ్యం.. -
ముంబై జట్టులో విభేదాలు.. మైదానంలోనే బుమ్రా- హార్దిక్ ఫైట్!
ఐపీఎల్-2026లో ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు ఏది కలిసిరావడం లేదు. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై పరాజయం పాలైంది. ముంబైకి ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. ముంబై పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్దానంలో కొనసాగుతోంది.కాగా వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌లో అంతర్గత విభేదాలు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా- స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య జరిగిన మాటల యుద్దం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.ఏమి జరిగిందంటే?196 పరుగుల భారీ లక్ష్య చేధనలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయాడు. అతడిని ఔట్ చేసేందుకు హార్దిక్ పాండ్యా తీవ్ర ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికి ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో పాండ్యా తన సహనాన్ని కోల్పోయాడు. బుమ్రా బౌలింగ్ చేస్తున్నప్పుడు పాండ్యా పదే పదే ఫీల్డర్లను మారుస్తూ విసుగు తెప్పించాడు.తన బౌలింగ్‌కు తగ్గట్టుగా ఫీల్డింగ్ పెట్టుకునే అవకాశం ఇవ్వకుండా, హార్దిక్ జోక్యం చేసుకోవడం బుమ్రాకు నచ్చలేదు. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్దం జరిగింది. బుమ్రా అసహనంతో నీవు నాకు చెప్పొద్దు అన్నట్లు సైగలు చేశాడు. ఏదేమైనప్పటికి బుమ్రా చివరికి నిర్ణయానికే తలవంచాల్సి వచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఈ ఏడాది సీజన్లో బుమ్రా దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ టీమిండియా పేస్ గుర్రం ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి ఒక్క వికెట్ కూడా సాధించలేదు.చదవండి: IND vs IRE: సూర్యకు షాక్..! టీమిండియా కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్? View this post on Instagram A post shared by Pranav Kumar (@2_be_pro) -
హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం!
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ ఓటుమల పరంపర కొనసాగుతోంది. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై పరాజయం పాలైంది. ఈ ఏడాది సీజన్లో ముంబైకి ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం కావడం గమనార్హం. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో కొనసాగుతోంది. అయితే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా తీసుకున్న ఓ నిర్ణయంపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది.ఏమి జరిగిదంటే?టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన మూడో ఓవర్లో ముంబై ర్యాన్ రికెల్టన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వెంట వెంటనే పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో ముంబై తరపున తొలి మ్యాచ్ ఆడుతున్న క్వింటన్ డికాక్, యువ ఆటగాడు నమన్ ధీర్ తమ అద్బుత బ్యాటింగ్‌తో ముంబైని ఆదుకున్నాడు. డికాక్ సెంచరీతో చెలరేగగా.. నమన్ధీర్ ఆర్ధ శతకంతో సత్తాచాటాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరి దూకుడు చూసి ముంబై 230కి పైగా స్కోర్ సాధిస్తుందని అంతా భావించారు. కానీ నమన్ ధీర్ ఔటయ్యాక సీన్ రివర్స్ అయిపోయింది. నమన్ ధీర్ ఔటయ్యాక, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌ను కాదని హార్దిక్ పాండ్యా స్వయంగా క్రీజులోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాస్త ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన పాండ్యా తీవ్ర నిరాశపరిచాడు. పాండ్యా 12 బంతుల్లో కేవలం 14 పరుగులు మాత్రమే ఔటయ్యాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత ఈ లక్ష్యాన్ని పంజాబ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. తాజాగా హార్దిక్ తీసుకున్న ఈ చెత్త నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ మండిపడ్డాడు.హార్దిక్ చెత్త కెప్టెన్సీ?కెప్టెన్ ఎల్లప్పుడూ బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్ ఈ ఒక్క సీజన్ కాదు, గత రెండు సీజన్లలో కూడా ఇదే తీరును కనబరిచింది. ఈ వైఫల్యాలకు మూల కారణాలను వెతకాలి. 2013 నుంచి 2023 మధ్య కెప్టెన్‌గా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిల్స్‌ను అందించాడు. ఆ తర్వాత ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ కనీసం ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేకపోయింది. ఇప్పుడు ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యేలా కనిపిస్తోంది. హార్దిక్ కెప్టెన్సీ బాగోలేదు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోహార్దిక్ ముందుగా బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరం ఏముంది? 12 బంతుల్లో 14 పరుగులు పరుగులు మాత్రమే చేశాడు. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌కు కేవలం ఐదు బంతులు మాత్రమే లభించాయి. ఒకవేళ రూథర్‌ఫోర్డ్ కూడా అన్ని బంతులు ఆడి ఉంటే, అతను 3-4 సిక్సర్లు కొట్టి ఉండేవాడు. అంతేకాకుండా జస్ప్రీత్ బుమ్రాతో తొలి ఓవర్ వేయించాల్సింది. ఇలా ముంబై ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన కెప్టెన్సీతో పంజాబ్‌ను విజయ పథంలో నడిపిస్తుంటే, ముంబై ఇండియన్స్ కెప్టెన్ మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఇందుకు ఒకే పరిష్కరం ఉంది. హార్దిక్ వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పుకోని, ఆ బాధ్యతను తిరిగి రోహిత్‌కు అప్పగించాలని నేను భావిస్తున్నాను," అని తివారీ క్రిక్‌బజ్ డిబేట్లో పేర్కొన్నాడు. కాగా ఈ ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ హార్దిక్ సీజన్ మధ్యలోనే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక ఇది ఇలా ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ వైఫల్యం కూడా ముంబై జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. బుమ్రా ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా సాధించలేదు. వికెట్ల విషయం పక్కన పెడితే పరుగులను కట్టడం చేయడంలో బుమ్రా విఫలమవుతున్నాడు.చదవండి: IND vs IRE: సూర్యకు షాక్..! టీమిండియా కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్? -
కెలికి మరి చితకొట్టించుకున్నారు, ముంబైను చీల్చిచెండాడిన శ్రీయస్ అయ్యర్..
-
పంజాబ్ చేతిలో ఓటమిపై హార్దిక్ కీలక వ్యాఖ్యలు
పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. పరాజయాలపై సమీక్ష నిర్వహిస్తామని.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదేమోనని వ్యాఖ్యానించాడు. మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్-2026లో వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే.కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదుసొంతమైదానం వాంఖడేలో గురువారం పంజాబ్ కింగ్స్ (MI vs PBKS)తో మ్యాచ్‌లో ముంబై ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మేము ఎక్కడ పొరపాటు చేస్తున్నామో తెలుసుకునేందుకు సమీక్ష నిర్వహిస్తాము.వ్యక్తిగత వైఫల్యమా? సమిష్టి వైఫల్యమా? మా ప్రణాళికల్లోనే లోపాలున్నాయా? అన్న అంశాలపై చర్చించాల్సి ఉంది. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. లేదంటే ఇలాగే కొనసాగుతూ పరిస్థితులు చక్కదిద్దాలా అన్న విషయం గురించి ఆలోచిస్తాము. కొన్ని కఠినమైన ప్రశ్నలకు జవాబులు వెదకక తప్పదు. వైఫల్యాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.ఆ ముగ్గురే టార్గెట్?ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సీనియర్లు పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు సూర్యకుమార్ యాదవ్.. మరో ప్లేయర్ తిలక్ వర్మ (Tilak Varma)ను ఉద్దేశించే హార్దిక్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రపంచస్థాయి బౌలర్ అయిన బుమ్రా ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లలో కలిపి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.మరోవైపు.. సూర్య చేసిన పరుగులు వరుసగా 16, 51, 6, 33, 0. ఇక తిలక్ వర్మ రాబట్టిన రన్స్ 20, 0, 14, 1, 8. ఇదిలా ఉంటే.. పంజాబ్ జట్టుకు ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా క్రెడిట్ ఇచ్చాడు. ‘‘వాళ్లు మాకంటే మెరుగ్గా బౌలింగ్ చేశారు. మెరుగ్గా బ్యాటింగ్ చేశారు. ఫీల్డింగ్ అద్భుతం. వారి ప్రదర్శనకు మేము మూల్యం చెల్లించాల్సి వచ్చింది’’ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో పాండ్యా 14 పరుగులు చేశాడు. మూడు ఓవర్ల బౌలింగ్‌లో 39 రన్స్ ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.ముంబై వర్సెస్ పంజాబ్ స్కోర్లుముంబై- 195/6(20)పంజాబ్- 198/3(16.3)ముంబైపై ఏడు వికెట్ల తేడాతో పంజాబ్ గెలుపు.The winning momentum refuses to stop 🌪️A flawless record remains perfectly intact 🛡️Punjab Kings conquer the Wankhede to climb up to the top spot in the table! ❤️Updates ▶️ https://t.co/Fn2dxJ429j#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/LUuZx5nlbf— IndianPremierLeague (@IPL) April 16, 2026చదవండి: T20 WC 2026: మ్యాచ్ ఫిక్సింగ్!.. రంగంలోకి ఐసీసీ -
‘ఓటములకు అతడిని బాధ్యుడిని చేయలేము’
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో హార్దిక్ సేన ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా ఈ సీజన్లో ఐదింట నాలుగో పరాజయం నమోదు చేసింది.హార్దిక్ పాండ్యాపై విమర్శలుఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)పై విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా పంజాబ్‌తో మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో తేలిపోవడంతో జట్టుపై ప్రభావం పడింది. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పాండ్యా 12 బంతుల్లో 14 పరుగులే చేసి మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.ఇక బౌలింగ్‌లో మూడు ఓవర్లు వేసిన పాండ్యా.. 39 పరుగులు ఇచ్చుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై విమర్శల దాడి పెరగగా.. హెడ్‌కోచ్ మహేళ జయవర్దనె మాత్రం భిన్నంగా స్పందించాడు. ఈ సీజన్లో ముంబై ఓటములకు కేవలం హార్దిక్‌ను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదన్నాడు.ఆ ఒక్కడినే బాధ్యుడిని చేయలేముపంజాబ్ చేతిలో ఓటమి అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఇది కేవలం హార్దిక్ పాండ్యా వైఫల్యం మాత్రమే కాదు. మా సమిష్టి వైఫల్యం. జట్టుగా విఫలమైనపుడు అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నేను... నాయకత్వ బృందంలో ఉన్న ప్రతి ఒక్కరు, యాజమాన్యం మొత్తం ఇందుకు బాధ్యత వహిస్తుంది.వ్యక్తిగతంగా ఎవరినీ బాధ్యులను చేయలేము. ఇకపై ఆటను మెరుగు పరచుకోవడం ఎలా అన్న అంశం మీద మాత్రమే మేము ప్రస్తుతం దృష్టి సారించాము’’ అని మహేళ జయవర్దనె హార్దిక్ పాండ్యాకు అండగా నిలిచాడు.తమ జట్టు బాగానే ఆడుతోందని.. అయితే, పూర్తి స్థాయిలో రాణించి ఫలితాన్ని రాబట్టలేకపోతుందని ఈ సందర్భంగా జయవర్దనె కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. మిగిలిన జట్లు మాత్రం అత్యద్భుతంగా ఆడుతూ ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నాడు.ప్రభ్‌సిమ్రన్,శ్రేయస్ మెరుపులుకాగా వాంఖడే వేదికగా టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేయగా.. ముంబై బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనింగ్ బ్యాటర్ క్వింటన్ డికాక్ అజేయ సెంచరీ (60 బంతుల్లో 112)తో చెలరేగగా.. నమన్ ధిర్ అర్ధ శతకం (50) బాదాడు.లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 16.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 198 పరుగులు సాధించింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (39 బంతుల్లో 80 నాటౌట్) దుమ్ములేపగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ (35 బంతుల్లో 66) ఆడాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ముంబై విధించిన లక్ష్యాన్ని పంజాబ్ ఆడుతూపాడుతూ ఛేదించింది.చదవండి: శ్రేయస్ స్టన్నింగ్ క్యాచ్.. షాకైన రోహిత్, సూర్య!The winning momentum refuses to stop 🌪️A flawless record remains perfectly intact 🛡️Punjab Kings conquer the Wankhede to climb up to the top spot in the table! ❤️Updates ▶️ https://t.co/Fn2dxJ429j#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/LUuZx5nlbf— IndianPremierLeague (@IPL) April 16, 2026 -
పంజాబ్ ‘టాప్’ షో
ముంబై: బౌలర్ల క్రమశిక్షణకు బ్యాటర్ల జోరు తోడవడంతో... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో పంజాబ్ కింగ్స్ అజేయంగా సాగుతోంది. గురువారం జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను చిత్తుచేసింది. నాలుగో విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరగా... ముంబై వరుసగా నాలుగో పరాజయం మూటగట్టుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (60 బంతుల్లో 112 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే డికాక్ దుమ్మురేపాడు. నమన్ ధీర్ (31 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 68 బంతుల్లోనే 122 పరుగులు జోడించారు. గాయం కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరం కాగా... రికెల్టన్ (2), సూర్యకుమార్ యాదవ్ (0), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (14), రూథర్‌ఫోర్డ్ (1) విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అర్ష్ దీప్ సింగ్ 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (39 బంతుల్లో 80; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (35 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) దంచి కొట్టడంతో లక్ష్యం చిన్నబోయింది. బాదుడే... బాదుడు బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పంజాబ్ బ్యాటర్లు తొలి ఓవర్ నుంచే ముంబై బౌలర్లపై చెలరేగారు. దీపక్ చహర్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ 2 ఫోర్లు కొడితే, ప్రియాన్ష్ ఆర్య (15; 2 ఫోర్లు, 1 సిక్స్) 6, 4 బాదాడు. దీంతో 21 పరుగులు వచ్చాయి. ఆర్యతో పాటు కూపర్ కనోలి (17; 1 ఫోర్, 2 సిక్స్‌లు)ని గజన్ఫర్ వరుస ఓవర్లలో అవుట్ చేయగా... ఎదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాది శ్రేయస్ తన ఉద్దేశం చాటాడు. పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్ 61/2తో నిలిచింది. ఆ తర్వాత శ్రేయస్, ప్రభ్‌సిమ్రన్ జోరు కనబర్చడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. దీపక్ ఓవర్లో 6, 4 కొట్టిన ప్రభ్‌సిమ్రన్... హార్దిక్ ఓవర్లో రెండు, శార్దుల్ ఓవర్లో రెండు ఫోర్లతో 23 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ నుంచి శ్రేయస్ కూడా దూకుడు పెంచాడు. బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్లతో అలరించిన శ్రేయస్ 31 బంతుల్లో పిఫ్టీ మార్క్ అందుకున్నాడు. శార్దుల్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన శ్రేయస్ మరో భారీ షాట్ కొట్టే యత్నంలో అవుటైనా... అప్పటికే పంజాబ్ గెలుపు ఖాయమైంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) శశాంక్ (బి) అర్ష్ దీప్ 2; డికాక్ (నాటౌట్) 112; సూర్యకుమార్ (సి) చాహల్ (బి) అర్ష్ దీప్ 0; నమన్ (సి) బార్ట్లెట్ (బి) శశాంక్ 50; హార్దిక్ (సి) బార్ట్లెట్ (బి) యాన్సెన్ 14; రూథర్‌ఫోర్డ్ (బి) అర్ష్ దీప్ 1; తిల్ (రనౌట్) 8; మయాంక్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–134, 4–175, 5–182, 6–193. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 4–0–22–3; యాన్సెన్ 4–0–30–1; బార్ట్లెట్ 4–0–39–0; వైశాక్ 3–0–36–0; యుజ్వేంద్ర చాహల్ 3–0– 45–0; శశాంక్ సింగ్ 2–0–19–1. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) దీపక్ (బి) గజన్ఫర్ 15; ప్రభ్‌సిమ్రన్ (నాటౌట్) 80; కూపర్ (సి) డికాక్ (బి) గజన్ఫర్ 17; శ్రేయస్ (సి) నమన్ (బి) శార్దుల్ 66; స్టొయినిస్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (16.3 ఓవర్లలో 3 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–27, 2–45, 3–184. బౌలింగ్: దీపక్ 2.3–0–45–0; బుమ్రా 4–0–41–0; గజన్ఫర్ 4–0–31–2; హార్దిక్ 3–0–39–0; శార్దుల్ 3–0–42–1. ఐపీఎల్లో నేడుగుజరాత్ X కోల్‌కతా వేదిక: అహ్మదాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
గర్జించిన శ్రేయస్, ప్రబ్‌సిమ్రన్.. పంజాబ్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో జోరు కనబరుస్తోంది. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ (80 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (65) వీరవిహారం చేయడంతో 196 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.3 ఓవర్లలోనే ఛేదించడం విశేషం. ముంబై బౌలర్లలో గజన్ఫర్ 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (112 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టగా.. నమన్ ధిర్ అర్థశతకంతో రాణించాడు. ఒక దశలో డికాక్, నమన్ ధిర్‌ల జోరుతో ముంబై ఇండియన్స్ 200 ప్లస్ పరుగులు చేస్తుందనిపించింది. కానీ నమన్ ధిర్ ఔటైన తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ముంబై 195 పరుగుల వద్దే ఆగిపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, యాన్సెన్, శశాంక్ సింగ్ చెరొక వికెట్ పడగొట్టారు. ఇక ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు ప్రబ్‌సిమ్రన్, శ్రేయస్ అయ్యర్ పోటీపడి మరీ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. పంజాబ్ దూకుడు ముందు ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ముంబై బౌలర్లలో బుమ్రా సహా అందరూ దారాళంగా పరుగు లిచ్చుకున్నారు. సీజన్లో పంజాబ్ వరుసగా నాలుగో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలతో 9వ స్థానంలో కొనసాగుతోంది.The winning momentum refuses to stop 🌪️A flawless record remains perfectly intact 🛡️Punjab Kings conquer the Wankhede to climb up to the top spot in the table! ❤️Updates ▶️ https://t.co/Fn2dxJ429j#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/LUuZx5nlbf— IndianPremierLeague (@IPL) April 16, 2026 -
శ్రేయస్ స్టన్నింగ్ క్యాచ్.. షాకైన రోహిత్, సూర్య!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. గురువారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా బౌండరీ లైన్ వద్ద అయ్యర్ అదిరిపోయే క్యాచ్ అందుకున్నాడు. అతని స్టన్నింగ్ క్యాచ్‌ను కళ్లారా చూసిన ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆశ్చర్యపోయారు. మార్కో యాన్సెన్ వేసిన 18వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్ బాదిన హార్దిక్ రెండో బంతిని డాట్ చేశాడు. మూడో బంతిని లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడగా.. సిక్సర్‌గా దూసుకొచ్చిన బంతిని బౌండరీ లైన్‌పై అయ్యర్ అద్భుతంగా అందుకొని చాకచక్యంగా లోపలికి విసిరేసాడు. అక్కడే ఉన్న బార్ట్లెట్ ఏ తప్పిదం చేయకుండా అందుకున్నాడు. ఎడమవైపు గాల్లోకి ఎగురుతూ బంతిని అందుకోవడంతో పాటు అంతే సమర్థవంతంగా అయ్యర్ లోపలికి విసిరేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. క్యాచ్ పూర్తయిన వెంటనే శ్రేయస్ అయ్యర్.. ఇప్పుడు అరవండంటూ ప్రేక్షకులను ఉద్దేశించి సైగలు చేశాడు. అప్పటి వరకు అరిచిన ముంబై ఫ్యాన్స్.. ఈ క్యాచ్‌తో మౌనం వహించారు. దాంతో వారిని ఇంకా గట్టిగా అరవాలంటూ అయ్యర్ కోరాడు. అయితే అయ్యర్ పట్టిన క్యాచ్‌కు డగౌట్లో ఉన్న రోహిత్, సూర్యకుమార్‌లు ఫిదా అయ్యారు. వాట్ ఏ క్యాచ్ అని రోహిత్ సూర్యతో చెబుతున్నట్లు కెమెరాల్లో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.SHREYAS IYER, WHAT HAVE YOU DONE!! 🤯🎥 One of the best catches you would see in the #TATAIPL history 🔥🔥Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/6EKgHR82cL— IndianPremierLeague (@IPL) April 16, 2026SKY & ROHIT COULDN'T BELIEVE IT - SHREYAS IYER YOU BEAUTY 😍 pic.twitter.com/lo0McmMaJh— Johns. (@CricCrazyJohns) April 16, 2026 -
డికాక్ కొత్త చరిత్ర.. ఒక్క సెంచరీతో ఇన్ని రికార్డులా?
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీతో చెలరేగాడు. ఈ సీజన్లో డికాక్‌కు ఇదే తొలి మ్యాచ్ కాగా, ఆడిన తొలి మ్యాచ్‌లోనే శతక్కొట్టడం విశేషం. ఈ నేపథ్యంలో డికాక్ ఒక్క సెంచరీతో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.టీ20 క్రికెట్లో డికాక్‌కు ఇది 9వ సెంచరీ. టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లి, రిలీ రోసౌ, సాహిబ్జదా ఫర్హాన్‌లు కూడా 9 శతకాలతో నాలుగో స్థానంలోనే ఉన్నారు. ఇక విండీస్ వీరుడు క్రిస్ గేల్ 22 శతకాలతో తొలి స్థానంలో ఉండగా, బాబర్ ఆజమ్ (11), డేవిడ్ వార్నర్ (10) శతకాలతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.ఐపీఎల్లో మూడు వేర్వేరు జట్లు తరఫున సెంచరీలు బాదిన మూడో బ్యాటర్‌గా డికాక్ నిలిచాడు. 2016లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆర్సీబీతో మ్యాచ్‌లో 108 పరుగులు, 2022లో లక్నో సూపర్‌జెయింట్స్ తరఫున కేకేఆర్‌తో మ్యాచ్‌లో 140 నాటౌట్, తాజాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో అజేయ శతకంతో మెరిశాడు. గతంలో సంజూ శాంసన్ (ఢిల్లీ, రాజస్తాన్, సీఎస్కే), కేఎల్ రాహుల్ (పంజాబ్, ఢిల్లీ, లక్నో) ఈ ఫీట్ సాధించారు. మరో విశేషమేమిటంటే ఈ ముగ్గురు కూడా వికెట్ కీపర్లే కావడం గమనించాల్సిన అంశం.ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున పంజాబ్‌పై సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా డికాక్ నిలిచాడు. 2014లో లెండిల్ సిమ్మ న్స్ (100 నాటౌట్) పంజాబ్‌పై తొలి సెంచరీ సాధించాడు.ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో డికాక్ చోటు సంపాదించాడు. సనత్ జయసూర్య (114 నాటౌట్) తొలి స్థానంలో ఉంటే డికాక్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ (109 నాటౌట్, 105 నాటౌట్) ముంబై తరపున రెండుసార్లు తన బెస్ట్ స్కోర్లు నమోదు చేశాడు.ఐపీఎల్ 2026 సీజన్లో డికాక్‌ది రెండో సెంచరీ. సీఎస్కే ఓపెనర్ సంజూ శాంసన్ ఈ సీజన్లో తొలి సెంచరీ సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (112 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టగా.. నమన్ ధిర్ అర్థశతకంతో రాణించాడు.పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, యాన్సెన్, శశాంక్ సింగ్ చెరొక వికెట్ పడగొట్టారు.𝑸𝒖𝒊𝒕𝒆 𝒅𝒆 𝑲𝒏𝒐𝒄𝒌! 👏#MIvPBKSpic.twitter.com/ZmfClFOpm8— Mumbai Indians (@mipaltan) April 16, 2026What a player, what a knock, and what a way to start the season! 💯Quinton de Kock, take a bow for a truly special Wankhede hundred! 👏Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @mipaltan pic.twitter.com/jEhH1ofb1z— IndianPremierLeague (@IPL) April 16, 2026చదవండి: ఐపీఎల్లో సెంచరీ కొట్టిన అర్ష్‌దీప్ -
ఐపీఎల్లో సెంచరీ కొట్టిన అర్ష్‌దీప్
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే అర్ష్‌దీప్ సెంచరీ నమోదు చేసింది బ్యాటింగ్‌లో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే బౌలింగ్‌లో అర్ష్‌దీప్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఓపెనర్ రికెల్టన్ను ఔట్ చేయడం ద్వారా అర్ష్‌దీప్ ఐపీఎల్లో వంద వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు. ఐపీఎల్లో వంద వికెట్లు సాధించి ఐదో లెఫ్టార్మ్ పేసర్‌గా, నాలుగో భారత బౌలర్‌గా నిలిచాడు. ఇంతకముందు ట్రెంట్ బౌల్ట్ (144 వికెట్లు), ఉనాద్కట్ (114 వికెట్లు), ఆశిష్ నెహ్రా (106 వికెట్లు), జహీర్ ఖాన్ (102 వికెట్లు) ముందున్నారు. ఇక పవర్ ప్లేలో అర్ష్‌దీప్ వికెట్ తీసుకోవడం 11 ఇన్నింగ్స్‌ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.Back-to-back breakthroughs 🎯A century of #TATAIPL wickets 🌟Arshdeep Singh becomes the first @PunjabKingsIPL bowler to reach the milestone 👏Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @arshdeepsinghh pic.twitter.com/ioOXVqbfWX— IndianPremierLeague (@IPL) April 16, 2026 #MI in 𝗱𝗲𝗲𝗽 trouble 😯🎥 Arshdeep Singh with 2️⃣ wickets in his second over 👊Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/6zPnONpClJ— IndianPremierLeague (@IPL) April 16, 2026 -
ఐపీఎల్ చరిత్రలో అరుదైన దృశ్యం..
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్‌లో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం కావడంతో అతడి స్థానంలో క్వింటన్ డికాక్ జట్టులోకి వచ్చాడు. డికాక్‌తో కలిసి రియాల్ రికెల్టన్ ముంబై ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ ఇద్దరు సౌతాఫ్రికాకు చెందిన వారే కావడం విశేషం. ఐపీఎల్లో ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. ముంబై ఇండియన్స్ తరఫున ఇద్దరు సౌతాఫ్రికా బ్యాటర్లు ఓపెనింగ్ చేయడం ఐపీఎల్లో ఇదే తొలిసారి. ఇక ఇన్నింగ్స్ రెండో ఓవర్ మార్కో యాన్సెన్ వేశాడు. ఈ సమయంలో స్ట్రైకింగ్‌లో, నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌తో పాటు బౌలర్ కూడా సౌతాఫ్రికాకు చెందిన వారే ఉండడం మరో గమనించదగ్గ అంశం. -
IPL 2026: పంజాబ్ కింగ్స్ ఘన విజయం
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సీజన్లో పంజాబ్‌కు ఇది నాలుగో విజయం. ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ (80 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (65) వీరవిహారంతో 196 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించడం విశేషం. ముంబై బౌలర్లలో గజన్ఫర్ 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (112 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టగా.. నమన్ ధిర్ అర్థశతకంతో రాణించాడు. ప్రబ్‌సిమ్రన్ హాఫ్ సెంచరీముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం దిశగా సాగుతుంది. ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ అర్థసెంచరీతో చెలరేగగా, అయ్యర్ (34) దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం పంజాబ్ 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. శ్రేయస్ (12), ప్రబ్‌సిమ్రన్ (16) క్రీజులో ఉన్నారు. అంతకముందు కూపర్ కన్నోలి (17) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య గజన్ఫర్ బౌలింగ్‌లో దీపక్ చాహర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. అంతకముందు ఇన్నింగ్స్ తొలి ఓవర్లో పంజాబ్ 21 పరుగులు పిండుకోవడం విశేషం.పంజాబ్ టార్గెట్ 196 పరుగులుపంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (112 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టగా.. నమన్ ధిర్ అర్థశతకంతో రాణించాడు. ఒక దశలో డికాక్, నమన్ ధిర్‌ల జోరుతో ముంబై ఇండియన్స్ 200 ప్లస్ పరుగులు చేస్తుందనిపించింది. కానీ నమన్ ధిర్ ఔటైన తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ముంబై 195 పరుగుల వద్దే ఆగిపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, యాన్సెన్, శశాంక్ సింగ్ చెరొక వికెట్ పడగొట్టారు.బార్ట్లెట్ కళ్లు చెదిరే క్యాచ్.. పాండ్యా (14)ఔట్14 పరుగులు చేసిన పాండ్యా మార్కో యాన్సెస్ బౌలింగ్‌లో గ్జేవియర్ బార్ట్లెట్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. డికాక్ సెంచరీపంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీ బాదాడు. 53 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న డికాక్‌కు ఐపీఎల్లో ఇది మూడో సెంచరీ. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.నమన్ ధిర్ ఔట్.. మూడో వికెట్ డౌన్పంజాబ్తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. అర్థసెంచరీ సాధించిన నమన్ ధిర్ శశాంక్ సింగ్ బౌలింగ్‌లో బార్ట్లెట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. డికాక్ (82), పాండ్యా (3) క్రీజులో ఉన్నారు.7 ఓవర్లలో ముంబై 67/2ఏడు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. నమన్ ధిర్ (34), డికాక్ (25) క్రీజులో ఉన్నారు.సూర్యకుమార్ గోల్డెన్ డక్.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. సూర్యకుమార్ యాదవ్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చిన అర్షదీప్ సింగ్ అంతకముందు రియాన్ రికెల్టన్ను ఔట్ చేశాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 15 పరుగులు చేసింది.బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గురువారం వాంఖడే వేదికగా 24వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ముంబై జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. రోహిత్ శర్మ, మిచెల్ సాంట్నర్ స్థానం డికాక్, మయాంక్ రావత్ తుది జట్టులోకి వచ్చారు. పంజాబ్ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.ముఖాముఖి పోరులో ఇరుజట్లు 35 సార్లు తలపడగా.. ముంబై ఇండియన్స్ 17 సార్లు, పంజాబ్ కింగ్స్ 17 సార్లు నెగ్గాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇక వాంఖడే స్టేడియంలో మాత్రం పంజాబ్ కింగ్స్ రికార్డు మెరుగ్గా ఉంది. వాంఖడేలో పంజాబ్ ముంబై పై 5 సార్లు గెలిచింది. గత ఐదు మ్యాచ్‌ల్లో ముంబై మూడింటింలో, పంజాబ్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచాయి.ముంబై ఇండియన్స్ తుదిజట్టు: క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా( కెప్టెన్), రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, మయాంక్ రావత్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.పంజాబ్ కింగ్స్ తుదిజట్టు: ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), కూపర్ కొన్నోలీ, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్ వైశాక్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్. -
ముంబై ఇండియన్స్‌లోకి కొత్త ఆల్‌రౌండర్
ముంబై ఇండియన్స్‌లోకి కొత్త ఆల్‌రౌండర్ వచ్చాడు. గాయపడిన అథర్వ అంకోలేకర్ స్థానంలో జట్టులో చేరాడు. అతని పేరు కృష్ణ్ భగత్. 21 ఏళ్ల కృష్ పంజాబ్‌కు చెందిన ఆల్‌రౌండర్. ఇతన్ని ముంబై ఇండియన్స్ రూ. 30 లక్షల బేస్‌ప్రైజ్‌కు సొంతం చేసుకుంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన అంకోలేకర్ స్థానాన్ని కృష్ భర్తీ చేశాడు. ముంబైకి చెందిన అంకోలేకర్‌ను ఈ సీజన్ వేలంలో రూ. 30 లక్షల బేస్ ప్రైజ్‌కు దక్కించుకున్నారు. అయితే అతను గాయం కారణంగా సీజన్ మొత్తం నుంచే తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో కృష్ జట్టులోక వచ్చాడు.కృష్ రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కూడా చేయగలడు. కృష్ పంజాబ్ తరఫున 7 ఫస్ట్‌క్లాస్, 9 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. గత రెండు సీజన్లలో అతను ముంబై ఇండియన్స్ ట్రైల్స్‌లో పాల్గొన్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే ఎంఐ బృందంలో నెట్ బౌలర్‌గా ఉన్నాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్లో ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో సతమతమవుతుంది. సీజన్‌ను గెలుపుతో బోణీ కొట్టిన ఈ మాజీ ఛాంపియన్, ఆతర్వాత హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొంది. తాజాగా ఆర్సీబీ చేతిలో చతికిలబడిన ఈ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలతో 2 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఇవాళ (ఏప్రిల్ 16) జరుగబోయే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ వారి సొంత ఇలాకా వాంఖడేలో జరుగనుంది. ఈ మ్యాచ్‌కు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడని తెలుస్తుంది. ఆర్సీబీ మ్యాచ్‌లో గాయపడిన రోహిత్ పూర్తిగా కోలుకోలేదని సమాచారం. -
ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 16) పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. వాంఖడే వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడని తెలుస్తుంది.రోహిత్ ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా గాయపడిన (Hamstring Injury) విషయం తెలిసిందే. స్కాన్లలో గాయం ఉందా లేదా అన్న విషయం స్పష్టంగా తెలియడం లేదు. దీంతో ఎంఐ మేనేజ్మెంట్ ముందు జాగ్రత్త చర్యగా హిట్‌మ్యాన్‌కు కొద్ది రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. గుజరాత్‌తో మ్యాచ్ (ఏప్రిల్ 20) సమయానికి రోహిత్ పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. కాగా, ఆర్సీబీ మ్యాచ్‌లో రోహిత్ బ్యాటింగ్ చేస్తూ మధ్యలోనే వైదొలిగిన విషయం తెలిసిందే.పంజాబ్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరమైతే, ఇప్పటికే కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్ మరింత ఇబ్బంది పడనుంది. ఈ సీజన్లో ముంబై తొలి మ్యాచ్ విజయం తర్వాత హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. రోహిత్ విషయానికొస్తే.. ఈ సీజన్లో అతను ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 137 పరుగులు చేశాడు. పంజాబ్ మ్యాచ్‌కు రోహిత్ మిస్ అయితే అతని స్థానంలో నమన్ ధీర్‌కు ఓపెనర్‌గా అవకాశం దక్కవచ్చు.మరోపక్క నేటి పంజాబ్ మ్యాచ్‌కు స్టార్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ అందుబాటులో ఉంటాడు. జాక్స్ బుధవారమే జట్టుతో చేరాడు. అతను తుది జట్టులో ఉంటాడా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు.పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టు ఏదైనా ఉందా అంటే అది పంజాబే. ఈ సీజన్లో పంజాబ్ 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సొంతం చేసుకొని పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. కేకేఆర్‌తో జరగాల్సిన ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.పంజాబ్‌తో మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ తుది జట్టు (అంచనా)..ర్యాన్ రికెల్టన్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే, జస్ప్రీత్ బుమ్రా -
ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై
-
తిక్క కుదిరింది.. ఆర్సీబీ బ్యాటర్‌కు షాక్!
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో తన ప్రవర్తనతో అంపైర్లకు చిరాకు తెప్పించిన ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు కూడా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షాకిచ్చింది. అంపైర్లకు బంతిని అందించడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటు ఐపీఎల్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణంగా టిమ్ డేవిడ్‌పై చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.4 ప్రకారం టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ కేటాయించినట్లు ఐపీఎల్ కౌన్సిల్ తెలిపింది. జరిమానా విధించడం ద్వారా టిమ్ డేవిడ్ తిక్క కుదిరిందని అభిమానులు కామెంట్లు చేశారు. పాండ్యాకు జరిమానా..మరోవైపు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు షాక్ తగిలింది. ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు పాండ్యాకు జరిమానా విధిస్తూ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక ప్రకటన విడుదల చేసింది.‘ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం హార్దిక్ పాండ్యా ఆర్సీబీతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేశాడు. ఈ సీజన్లో ముంబై జట్టుకు ఇదే మొదటి తప్పిదం కావడంతో కెప్టెన్ పాండ్యాకు రూ. 12 లక్షల జరిమానా విధిస్తున్నాం’ అని వెల్లడించింది.టిమ్ డేవిడ్ ఏం చేశాడంటే?ఆర్సీబీ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన బంతిని టిమ్ డేవిడ్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్సర్ కొట్టాడు. అయితే డేవిడ్ బలంగా బాదడంతో బంతి ఆకారం మారిపోయింది. దీంతో అంపైర్లు కొత్త బంతిని రీప్లేస్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బంతులున్న బాక్స్‌ను మైదానంలోకి తీసుకురాగా టిమ్ డేవిడ్ ఆ బాక్స్‌లో నుంచి ఒక బంతిని తీసుకొని చెక్ చేయడం ప్రారంభించాడు. అయితే అంపైర్ బంతిని తిరిగి ఇచ్చేయాలని పదే పదే అడిగినప్పటికీ టిమ్ డేవిడ్ అతడిని పట్టించుకోకుండా అదే పనిగా బంతిని గాల్లోకి విసురుతూ దానిని చెక్ చేస్తూనే పోయాడు. లెగ్ అంపైర్ వీరేందర్ శర్మ వచ్చి ఇలా చేయడం తగదని వార్నింగ్ ఇవ్వడం, ఇంతలో ముంబై ఆటగాడు రోహిత్ శర్మ జోక్యం చేసుకొని డేవిడ్ నుంచి బంతిని తీసుకొని అంపైర్‌కు ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Casual inspection from Tim David after absolute destruction 🔥🥶#IPLRivalryWeek 2026 👉 #MIvRCB | LIVE NOW 👉https://t.co/gLbf9ggQbu | #TATAIPL pic.twitter.com/OumaLMDlYF— Star Sports (@StarSportsIndia) April 12, 2026చదవండి: ‘ఇదేనా మర్యాద.. నిన్ను చూస్తేనే అసహ్యమేస్తోంది’ -
అతడిని చూసి నేర్చుకో! తిలక్ వర్మపై విమర్శల వర్షం
ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. ముంబైకి ఇది వరుసగా మూడో పరాజయం. దీంతో హార్దిక్ సేన పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పడిపోయింది.ముఖ్యంగా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ ఫామ్ లేమి ముంబై జట్టు మేనెజ్మెట్ కలవరపెడుతోంది. ఈ ఏడాది సీజన్లో తిలక్ ఇప్పటివరకు ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ తిలక్ నిరాశపరిచాడు. 3 బంతుల్లో కేవలం ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు.మొత్తంగా నాలుగు మ్యాచ్‌లు ఆడిన తిలక్ కేవలం 35 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యలో తిలక్ వర్మపై బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్‌లా తిలక్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించలేకపోతున్నాడని శ్రీకాంత్ అన్నాడు. కాగా పాటిదార్ కూడా నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు."తిలక్ వర్మ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. అతడికి భారీ షాట్లు ఆడే సత్తా లేదు. దూకుడుగా ఆడే బ్యాటర్ కూడా కాదు. తిలక్ వర్మ మంచి టెక్నిక్ ఉన్న ఆటగాడే కావచ్చు, కానీ ఫిల్ సాల్ట్ లేదా రజత్ పాటిదార్ లాగా బౌలర్లను టార్గెట్ చేయలేడు. గత రెండు మూడు ఐపీఎల్ సీజన్ల నుంచి తిలక్ వర్మ ఆశించినంత మేర రాణించలేకపోయాడు.టీ20ల్లో క్రికెట్లో నిలకడ అవసరం లేదు. పది మ్యాచ్‌ల్లో ఏడింటిలో 30-40 పరుగులు చేయడం కంటే, నాలుగింటిలో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును ఒంటిచేత్తో గెలిపించడం మేలు. ఇప్పుడు పాటిదార్ అదే చేస్తున్నాడు. తిలక్‌ను లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు పంపిస్తే బెటర్.160 లేదా 170 పరుగులను ఛేజ్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే తిలక్ అద్భుతంగా ఆడతాడు. కానీ 200 లేదా 220 పరుగులను ఛేజ్ చేసేటప్పుడు తిలక్ వర్మ సరిపోడు" అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: ఐపీఎల్ నుంచి రోహిత్ శర్మ అవుట్? -
ఐపీఎల్ నుంచి రోహిత్ శర్మ అవుట్?
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ వరుసగా హ్యాట్రిక్ ఓటములను చవిచూసింది. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయపడడం ముంబై ఇండియన్స్ మేనెజ్మెంట్ను కలవరపెడుతోంది.241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ ముంబై ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో రోహిత్ శర్మ తొడ కండరాలు పట్టేశాయి. వికెట్ల మధ్య పరిగెత్తేందుకు రోహిత్ ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి రోహిత్ కుడి హ్యామ్‌స్ట్రింగ్‌కు బ్యాండేజ్ వేశాడు. కానీ ఏ మాత్రం రోహిత్ నొప్పి లేదు. దీంతో అదే ఓవర్లో రోహిత్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. రిహిత్ ఇలా మధ్యలోనే వెళ్లిపోవడంతో వాంఖడే స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. తర్వాత మరి అతడు బ్యాటింగ్‌కు రాలేదు. రోహిత్ స్కాన్ రిపోర్ట్లు కోసం ముంబై మేనెజ్మెంట్ ఎదురుచూస్తోంది. అతడి గాయంపై మ్యాచ్ అనంతరం ముంబై స్టార్ షేర్ఫేన్ రూథర్‌ఫర్డ్ అప్డేట్ ఇచ్చాడు."రోహిత్ తొడ కండరాలు పట్టేసినట్లు అన్పిస్తోంది. కానీ అధికారికంగా ఏమీ ఖరారు కాలేదు. ప్రస్తుతం అతడు మా వైద్యబృందం పర్యవేక్షణలో ఉన్నాడు. స్కాన్ రిపోర్ట్‌ల కోసం వేచి చూస్తున్నాం. రోహిత్ ఫిట్నెస్ గురించి త్వరలోనే పూర్తి సమాచారం తెలుస్తుంది" రూథర్‌ఫర్డ్ పేర్కొన్నాడు.ఒకవేళ రోహిత్ గాయం గ్రేడ్-1లో ఉన్నట్లయితే పూర్తిగా కోలుకోవడానికి సుమారు నాలుగు వారాల సమయం పట్టనుంది. అదే జరిగితే రోహిత్ ఐపీఎల్-2026 సీజన్ మధ్యలోనే వైదొలిగే అవకాశముంది. ఏదేమైనప్పటికి రోహిత్ త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.చదవండి: BCCI: ఫోన్ చూసిన రోమీ, వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ కఠిన చర్యలు! -
బుమ్రాకు ఏమైంది.. ఏంటి ఈ వరుస చేదు అనుభవాలు..?
ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడు. ఈ స్టార్ ముంబై ఇండియన్స్ పేసర్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బుమ్రా స్థాయి బౌలర్‌కు ఇది ఖచ్చితంగా చేదు అనుభవమనే చెప్పాలి.గత ఎడిషన్ చివరి మ్యాచ్‌తో (పంజాబ్ కింగ్స్‌పై 4-0-40-0) కలుపుకొని బుమ్రా ఐపీఎల్లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో వికెట్లు లేకుండా ఉన్నాడు. ఇది అతని ఐపీఎల్ కెరీర్లో అత్యంత పొడవైన వికెట్‌లేని స్ట్రీక్. ఈ పేసు గుర్రం ఐపీఎల్లో 149 మ్యాచ్‌లు ఆడి 183 వికెట్లు తీయగా.. ఇప్పటివరకు ఇలాంటి చేదు అనుభవం ఎన్నడూ ఎదురుకాలేదు. ఒక మ్యాచ్ కాకపోతే మరో మ్యాచ్‌లో అయినా అతనికి వికెట్ దక్కేది. అలాంటిది ఏకంగా ఐదు మ్యాచ్‌లుగా అతనికి వికెట్ లేకపోవడమనేది నిజంగా ఆశ్చర్యకరం.ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బుమ్రా 122 బంతులు వేసినా ఒక్క వికెట్ కూడా తీయలేదు. బహుశా ఏ స్థాయి క్రికెట్లో అయినా అతనికి ఇది చేదు అనుభవమే అయ్యుంటుంది. యార్కర్లు, స్లో బౌన్సర్లు, లో ఫుల్ టాస్ బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే బుమ్రా ఉన్నట్లుండి వికెట్లకు ఎందుకు ముఖం వాచాడోనని ఫ్యాన్స్ అనుకుంటున్నాడు. ఈ సీజన్లో వికెట్లు తీయలేకపోయినా, పొదుపుగా బౌలింగ్ చేయడం బుమ్రాకు ఈ సీజన్లో సానుకూలాంశం. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో అతని ఎకానమీ రేట్ 8.20గా ఉంది.తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 39 పరుగులు సమర్పించుకున్న బుమ్రా.. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్‌పై 3 ఓవర్లలో 32 పరుగులు.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 4 ఓవర్లలో 21.. కేకేఆర్‌పై 4 ఓవర్లలో 35 పరుగులు మాత్రమే ఇచ్చాడు.ఇదిలా ఉంటే, నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా మినహా మిగతా బౌలర్లంతా తేలిపోవడంతో ముంబై ఇండియన్స్ భారీగా పరుగులు సమర్పించుకుంది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో తడబడి 18 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. తద్వారా సీజన్లో హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొంది. తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌పై గెలుపు తర్వాత వరుసగా ఢిల్లీ, ఆర్ఆర్, ఆర్సీబీ చేతుల్లో పరాజయాలు ఎదుర్కొని, పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇదే వాంఖడే వేదికగా పంజాబ్ కింగ్స్‌తో (ఏప్రిల్ 16) తలపడనుంది.ముంబై-ఆర్సీబీ మ్యాచ్ వివరాలు..ఆర్సీబీ- 240/4(20)ముంబై ఇండియన్స్- 222/5(20)18 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయంప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: ఫిల్ సాల్ట్కీలక ప్రదర్శనలుఆర్సీబీ- ఫిల్ సాల్ట్ (78), విరాట్ కోహ్లి (50), రజత్ పాటిదార్ (53), టిమ్ డేవిడ్ (34 నాటౌట్), కృనాల్ పాండ్యా (4-0-26-1)ముంబై ఇండియన్స్- హార్దిక్ పాండ్యా (4-0-39-1), రూథర్‌ఫోర్డ్ (71 నాటౌట్) -
ముంబై ఇండియన్స్.. హ్యాట్రిక్ ఓటమి
-
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ లెజెండ్ రోహిత్ శర్మ మరో చారిత్రాత్మక మైలురాయిని తాకాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున 6000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. నిన్న (ఏప్రిల్ 12) వాంఖడే స్టేడియంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్‌కు ఈ మైలురాయిని చేరుకునేందుకు 6 పరుగులు కావాల్సి ఉన్నాయి. జేకబ్ డఫీ వేసిన మూడో ఓవర్లోపుల్ షాట్‌తో సిక్సర్ కొట్టి ఈ ఘనత (231వ మ్యాచ్) సాధించాడు. ఈ మ్యాచ్‌లో 13 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..రోహిత్ శర్మ- 6002 (2 సెంచరీలు/40 అర్ద సెంచరీలు) సూర్యకుమార్ యాదవ్- 3776 (2/29)కీరన్ పొలార్డ్- 3412 (0/16)అంబటి రాయుడు- 2416 (0/14) సచిన్ టెండూల్కర్- 2334 (1/13) ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్‌తో కలిపి ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ చేసిన పరుగులు..- 240 మ్యాచ్‌ల్లో 6275 పరుగులు. - రోహిత్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (3915), పొలార్డ్ (3823) ఉన్నారు. విరాట్ కోహ్లీతో పోలిక - ఐపీఎల్లో ఒకే జట్టుకు అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. - విరాట్ ఆర్సీబీ తరఫున 271 మ్యాచ్‌ల్లో 8840 పరుగులు చేశారు. - IPL + CLT20 కలిపి 9264 పరుగులు చేశారు. ఇదిలా ఉంటే, నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ చారిత్రక మైలురాయిని తాకినా, ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తడబడిన ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 222 పరుగుల వద్ద ఆగిపోయింది. ఫలితంగా ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఆర్సీబీ తరఫున ఫిల్ సాల్ట్ (78), విరాట్ కోహ్లి (50), రజత్ పాటిదార్ (53), టిమ్ డేవిడ్ (34 నాటౌట్), కృనాల్ పాండ్యా (4-0-26-1) అద్భుత ప్రదర్శనలు చేయగా.. ముంబై ఇండియన్స్ తరఫున హార్దిక్ పాండ్యా (4-0-39-1), రూథర్‌ఫోర్డ్ (71 నాటౌట్) చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేశారు. -
భళా బెంగళూరు
ముంబై: టాప్–3 బ్యాటర్ల దూకుడుకు బౌలర్ల సహకారం తోడవడంతో... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్లో మూడో విజయం నమోదు చేసుకుంది. గత మ్యాచ్‌లో రాజస్తాన్ దూకుడు ముందు నిలువలేకపోయిన బెంగళూరు... ముంబైపై సమష్టిగా సత్తా చాటింది. ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు 18 పరుగుల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (36 బంతుల్లో 78; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (38 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రజత్ పాటీదార్ (20 బంతుల్లో 53; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (16 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 222 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (22 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్), రికెల్టన్ (22 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 33; 5 ఫోర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. భారీ ఛేదనలో ముంబై వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి లయ దొరకబుచ్చు కోలేకపోయింది. ఆఖర్లో రూథర్‌ఫోర్డ్ (31 బంతుల్లో 71 నాటౌట్; 1 ఫోర్, 9 సిక్స్‌లు) ధనాధన్ షాట్ల విరుచుకుపడినా అది ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది. 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడం కూడా ఫలితంపై ప్రభావం చూపింది. బెంగళూరు బౌలర్లలో సుయాశ్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. ముంబై స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకొని బెంగళూరు భారీ షాట్లతో విరుచుకుపడగా... బెంగళూరు స్పిన్నర్లు పరుగులు కట్టడి చేయడంతో పాటు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) హార్దిక్ (బి) శార్దుల్ 78; కోహ్లి (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ 50; రజత్ (సి) తిలక్ (బి) సాంట్నర్ 53; టిమ్ డేవిడ్ (నాటౌట్) 35; జితేశ్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 10; షెఫర్డ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 240. వికెట్ల పతనం: 1–120, 2–185, 3–194, 4–231. బౌలింగ్: బౌల్ట్ 4–0–50–1; హార్దిక్ 4–0–39–1; బుమ్రా 4–0–35–0; సాంట్నర్ 4–0–43–1; మార్కండే 2–0–40–0; శార్దుల్ 2–0–32–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) భువనేశ్వర్ (బి) సుయాశ్ 37; రోహిత్ (రిటైర్డ్ హర్ట్) 19; సూర్యకుమార్ (సి) రసిక్ (బి) కృనాల్ 33; తిలక్ వర్మ (సి) డఫీ (బి) సుయాశ్ 1; హార్దిక్ (సి) షెఫర్డ్ (బి) డఫీ 40; రూథర్‌ఫోర్డ్ (నాటౌట్) 71; నమన్ ధీర్ (సి) రజత్ (బి) రసిక్ 1; సాంట్నర్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 222. వికెట్ల పతనం: 1–72, 2–74, 3–121, 4–145, 5–154. బౌలింగ్: డఫీ 4–0–58–1; భువనేశ్వర్ 4–0–38–0; రసిక్ సలామ్ 2.5–0–23–1; కృనాల్ 4–0–26–1; సుయాశ్ 4–0–47–2; షెఫర్డ్ 1.1–0–28–0. -
ఆర్సీబీ జోరు.. ముంబైకి హ్యాట్రిక్ ఓటమి
ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్ వరుసగా హ్యాట్రిక్ ఓటములను చవిచూసింది. ఆదివారం వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హార్దిక్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేయగల్గింది.ముంబై బ్యాటర్లలో షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్(71 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(40), ర్యాన్ రికెల్టన్(37), సూర్యకుమార్ యాదవ్(33) ఫర్వాలేదన్పించారు. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్ శర్మ రెండు, జాకబ్ డఫీ, కృనాల్ పాండ్యా తలా వికెట్ సాధించారు.సాల్ట్, పాటిదార్ విధ్వంసం..అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రజత్ పాటిదార్(53), విరాట్ కోహ్లి(50) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. వీరితో పాటు టిమ్ డేవిడ్(16 బంతుల్లో 34) మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, శార్థూల్ ఠాకూర్, మిచెల్ శాంట్నర్ తలా వికెట్ సాధించారు. -
ముంబైపై ఆర్సీబీ ఘన విజయం
MI vs RCB Live Updates: ఐపీఎల్-2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి.ఆర్సీబీ ఘన విజయంఆర్సీబీ తిరిగి గెలుపు బాట పట్టింది. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్(71 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(40), ర్యాన్ రికెల్టన్(37), సూర్యకుమార్ యాదవ్(33) ఫర్వాలేదన్పించారు. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్ శర్మ రెండు, జాకబ్ డఫీ, కృనాల్ పాండ్యా తలా వికెట్ సాధించారు.ముంబై నాలుగో వికెట్ డౌన్‌ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 40 పరుగులు చేసిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. జాకబ్ డఫీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ముంబై ఇండియన్స్ మూడో వికెట్ డౌన్‌ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 46 బంతుల్లో 120 పరుగులు కావాలి.ఒకే ఓవర్లో ముంబై రెండు వికెట్లు డౌన్‌ముంబై ఇండియన్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో తొలి బంతికి ర్యాన్ రికెల్టన్(37) ఔట్ కాగా.. ఐదో బంతికి తిలక్ వర్మ(1) ఔటయ్యారు. 9 ముంబై ఇడియన్స్కు స్కోర్: 85/2రోహిత్ రిటైర్డ్ హార్ట్ముంబైకి భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం కారణగా రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. 7 ఓవర్లకు ముంబై స్కోర్: 72/0దూకుడుగా ఆడుతున్న ముంబై ఓపెనర్లు3 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. క్రీజులో ర్యాన్ రికెల్టన్(29), రోహిత్ శర్మ(9) ఉన్నారు.దుమ్ములేపిన ఆర్సీబీ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్‌వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు బీభత్సం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రజత్ పాటిదార్(53), విరాట్ కోహ్లి(50) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. వీరితో పాటు టిమ్ డేవిడ్(16 బంతుల్లో 34) మెరుపులు మెరిపించాడు.ఆర్సీబీ మూడో వికెట్ డౌన్రజత్ పాటిదార్ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. కేవలం 20 బంతుల్లోనే 53 పరుగులు చేసిన పాటిదార్.. శాంట్నర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 194/3ఆర్సీబీ రెండో వికెట్ డౌన్ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 38 బంతుల్లో 58 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14.4 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 185-2ఆర్సీబీ తొలి వికెట్ డౌన్ఫిల్ సాల్ట్ రూపంలో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం 36 బంతుల్లో 78 పరుగులు చేసిన సాల్ట్.. శార్థూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 167/1. క్రీజులో విరాట్ కోహ్లి(47), రజత్ పాటిదార్(9 బంతుల్లో 34)ఉన్నాడు.దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ ఓపెనర్లు7 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. క్రీజులో ఫిల్ సాల్ట్(49), విరాట్ కోహ్లి(24) ఉన్నారు.3 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 33/03 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(13), ఫిల్ సాల్ట్(17) ఉన్నారు.ఐపీఎల్-2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. ప్లేయింగ్ ఎలెవన్‌లోకి మిచెల్ శాంట్నర్, మయాంక్ మార్కండే వచ్చారు. మరోవైపు ఆర్సీబీ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగింది. జోష్ హాజిల్‌వుడ్‌కు విశ్రాంతి ఇవ్వగా జాకబ్ డఫీ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే, జస్ప్రీత్ బుమ్రా -
భార్యతో కలిసి చెట్టాపట్టాల్.. ఐపీఎల్‌కు డుమ్మా!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ పడుతూ లేస్తూ తన ప్రయాణం కొనసాగిస్తోంది. విజయంతో సీజన్‌ను ఆరంభించినప్పటికీ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో జట్టు ఒత్తిడిలో పడింది. రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్‌కు చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ఎందుకు ఆడడం లేదన్న ప్రశ్న అలాగే ఉండిపోయింది. ఈ వారంలోపూ విల్ జాక్స్ ముంబై ఇండియన్స్‌తో చేరతాడని యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే విల్ జాక్స్ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే విల్ జాక్స్ తన భార్య అనా బ్రుమ్వెల్తో కలిసి పారిస్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలు బయటికి వచ్చాయి. అంతేకాదు జాక్స్ భార్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఎంజాయింగ్ హాలిడే ట్రిప్’ పేరిట స్టోరీని షేర్ చేసుకోవడం పలు అనుమానాలకు తావి స్తోంది. ఈ లెక్కన విల్ జాక్స్ ఇప్పట్లో ఐపీఎల్లో అడుగుపెట్టే అవకాశాలు లేనట్లేనని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. అమెరికన్ సింగర్ అలెక్స్ వారెన్ మ్యూజిక్ కన్సర్ట్కు జాక్స్ తన భార్యతో కలిసి హాజరయ్యేందుకే పారిస్ వెళ్లినట్లు తెలుస్తోంది.ఇక ఫ్రాన్స్‌లో అడుగుపెట్టడానికి ముందు మొరాకోలో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేశారు. కాగా విల్ జాక్స్ ఈ ఏడాది యాషెస్ సిరీస్ సమయంలోనే తన స్కూల్ ఫ్రెండ్ అయిన అనా బ్రూమ్వెల్తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అయితే విల్‌కు 14 ఏళ్ల వయసులోనే వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే, అసలే రెండు వరుస ఓటములతో ఢీలా పడిన ముంబై ఇండియన్స్‌కు విల్ జాక్స్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిస్తే ఏమవుతుందో అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అయితే విల్ జాక్స్ విషయమై ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్ మహేల జయవర్దనే రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం స్పందించాడు. ‘విల్ జాక్స్ త్వరలోనే జట్టుతో చేరుతాడని ఆశిస్తున్నా’ అంటూ తెలిపాడు. 2025 ఐపీఎల్ సీజన్లో విల్ జాక్స్ ముంబై ఇండియన్స్ తరఫున 233 పరుగులు చేయడంతో పాటు ఆరు వికెట్లు తీశాడు. విల్ జాక్స్ లేకపోవడం వల్ల ముంబై జట్టు సమతుల్యం దెబ్బతిన్నది. విల్ జాక్స్ అందుబాటులో లేకపోవడంతో తొలి మ్యాచ్‌లో ఆఫ్గన్ ఆటగాడు అల్లాఘన్జఫర్ను ఆడించినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది. రెండో మ్యాచ్‌లో అతడిని తొలగించి మిచెల్ శాంట్నర్‌కు అవకాశమిచ్చారు. ఇక మూడో మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్ల వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. విల్ జాక్స్ జట్టులో చేరితే మాత్రం ఆల్‌రౌండర్‌గా తన పాత్రకు న్యాయం చేయగలడని ముంబై ఇండియన్స్ ఆశిస్తోంది. ముంబై తన తదుపరి మ్యాచ్ ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది.No way my bruh Will Jacks is roaming in the streets of Paris 😭 https://t.co/OpZ8tjzYkw pic.twitter.com/atrDFVqePs— Mumbai Indians FC (@MIPaltanFamily) April 9, 2026చదవండి: ‘చనిపోయేలోపు ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత జట్టును చూడాలి’ -
రోహిత్ శర్మకు సంబంధించి బిగ్ న్యూస్
దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మకు సంబంధించి ఓ బిగ్ న్యూస్ అందుతుంది. హిట్‌మ్యాన్‌పై బయోపిక్ రాబోతుందని సోషల్‌మీడియా కోడై కూస్తోంది. ఇవాళ (ఏప్రిల్ 9) రోహిత్ ఇన్‌స్టాలో షేర్ చేరిన స్టోరీ ఈ పుకార్లకు తావిచ్చింది.రోహిత్ షేర్ చేసిన క్రిప్టిక్ పోస్ట్‌లో నెట్ఫిక్స్ లోగో కలిగిన డ్రాఫ్ట్ #45 అనే స్క్రిప్ట్ డాక్యుమెంట్ కనిపిస్తుంది. దీనిపై Champion అని రాసి ఉంది. Rohit Sharma’s copy అనే వాటర్‌మార్క్ ఉండటంతో, హిట్‌మ్యాన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం అయ్యాడని అభిమానులు భావిస్తున్నారు. #collab అనే క్యాప్షన్ Netflixతో అధికారిక ఒప్పందం ఉందని సూచిస్తోంది. Rohit bhai ab Netflix Netflix pe bhi pull karenge ❤️ pic.twitter.com/mOdNjOIr09— Johns. (@CricCrazyJohns) April 9, 2026వీటన్నిటినీ బట్టి హిట్‌మ్యాన్‌పై డాక్యుమెంటరీ లేదా బయోపిక్ రాబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్-రోహిత్ బ్యాక్‌డ్రాప్‌లో డాక్యూ–సిరీస్ ఉంటుందని కొందరనుకుంటున్నారు. మరికొందరేమో, రోహిత్ స్పోర్ట్స్–థీమ్ షోలో పాల్గొనబోతున్నాడని చర్చించుకుంటున్నారు.ఇదిలా ఉంటే, అంతర్జాతీయ స్థాయిలో టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. మరోవైపు ఫ్రాంచైజీ క్రికెట్లో ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026లో హిట్‌మ్యాన్ ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో 78 (38) పరుగులు, ఆతర్వాతి మ్యాచ్‌లో 35 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో 5 పరుగులు సహా.. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 118 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్ తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 12న ఆడనున్నాడు. వాంఖడే జరిగే ఆ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆర్సీబీతో తలపడుతుంది. -
బుమ్రాకే చుక్కలు చూపించాడు -వాడి బ్యాటింగ్ కు పిచ్చోళ్లయిపోయాం...
-
బుమ్రా ఖాతాలో అరుదైన హ్యాట్రిక్
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో ఓ అనవసర రికార్డు చేరింది. తిరుగులేని టీ20 కెరీర్లో అతను అరుదైన హ్యాట్రిక్ సాధించాడు. 273 మ్యాచ్‌ల పొట్టి క్రికెట్ ప్రస్తానంలో కేవలం నాలుగోసారి మాత్రమే వికెట్ లేకుండా వరుసగా మూడు టీ20లను (హ్యాట్రిక్) ముగించాడు. నిన్న (ఏప్రిల్ 7) రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో వికెట్ లేకుండా పోవడంతో బుమ్రా ఖాతాలో ఈ అనవసర రికార్డు చేరింది. గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ప్రస్తుత ఐపీఎల్ ఎడిషన్‌లో బుమ్రా వరుసగా కేకేఆర్ (4-0-35-0), ఢిల్లీ (4-0-21-0), రాజస్థాన్ (3-0-32-0) మ్యాచ్‌ల్లో వికెట్ తీయలేకపోయాడు.బుమ్రా టీ20 కెరీర్లో ఇలాంటి సందర్భాలు.. - 2016 IPL: SRH, RCB, KXIPతో వరుసగా జరిగిన మ్యాచ్‌ల్లో వికెట్లు తీయలేకపోయాడు. - 2014 IPL: CSK, SRH, KKR, RRతో వరుసగా జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో వికెట్లు తీయలేకపోయాడు. - 2017/18 T20Is: శ్రీలంక, దక్షిణాఫ్రికాపై వరుసగా మూడు మ్యాచ్‌ల్లో వికెట్లు తీయలేకపోయాడు. పై నాలుగు సందర్భాలు మినహా, బుమ్రా తన యావత్ టీ20 కెరీర్లో మరెప్పుడు వరుసగా 3 మ్యాచ్‌ల్లో వికెట్లు లేకుండా ఉండలేదు. 273 మ్యాచ్‌ల పొట్టి క్రికెట్ కెరీర్లో బుమ్రా 6.92 సగటున 345 వికెట్లు తీశాడు. ఐపీఎల్ కెరీర్ మాత్రమే తీసుకుంటే.. ఈ లీగ్‌లో 148 మ్యాచ్‌ల్లో 7.26 సగటున 183 వికెట్లు పడగొట్టాడు.బుమ్రాను సైతం వదలని సూర్యవంశీరాజస్థాన్ రాయల్స్ యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఎవరినీ వదిలిపెట్టడం లేదు. నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు సైతం చుక్కలు చూపించాడు. బుమ్రా వేసిన తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన వైభవ్.. అదే ఓవర్లో నాలుగో బంతిని మరోసారి స్టాండ్స్‌కు పంపించాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ దెబ్బకు బుమ్రా చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 14 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు.వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో రాయల్స్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ 3 వికెట్ల నష్టానికి ఏకంగా 150 పరుగులు చేసింది. వైభవ్‌తో పాటు యశస్వీ జైశ్వాల్ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు.జైశ్వాల్ కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు వైభవ్, రియాన్ పరాగ్(10 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లతో 20) మెరుపులు మెరిపించారు. అనంతరం బరిలోకి దిగిన ముంబై 11 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. వైభవ్, జైస్వాల్ ధాటికి బుమ్రా వికెట్ లేకుండానే ఇన్నింగ్స్‌ను ముగించాడు. -
‘టార్గెట్ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 27 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం జైస్వాల్ మాట్లాడాడు.‘పవర్ ప్లే మాకు మూడు ఓవర్లు మాత్రమే అన్న విషయం నా మైండ్‌లో ఉంది. అందుకే బౌలర్లు ఎవరొచ్చినా ధాటిగా ఆడాలని నిర్ణయించుకున్నా. తొలి ఓవర్ దీపక్ చాహర్ బౌలింగ్‌కు వస్తున్నాడని తెలుసుకొని అతడిని ఎదుర్కొనేందుకు ప్రణాళిక వేసుకున్నా. ఆ తర్వాత బుమ్రా బాయ్ బౌలింగ్‌కు వచ్చాడు. బుమ్రా సంగతి వైభవ్ సూర్యవంశీ చూసుకుంటాడులే అని మనసులో అనుకున్నా. ఆ తర్వాత ఎవరొచ్చినా ఇదే ప్లాన్ అమలు చేయాలని చూశాం. మూడు ఫార్మాట్లలో ఇదే తరహా ఆటతీరును ఆడొచ్చా అంటే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే నేను ఆడే ప్రతీ మ్యాచ్‌లో బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా. ప్రతీ మ్యాచ్‌లో వినూత్నమైన షాట్లను ఆడేందుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఆటగాడు. అతడు ఆడుతున్న తీరు అమోఘం. అతడు కష్టపడుతున్నాడు. వచ్చీ రాగానే భారీ సిక్సర్లు కొడుతూ ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడికి లోనయ్యేలా చేస్తున్నాడు. ఆటతీరు మార్చుకోమని చెప్పలేను కానీ భారీ ఇన్నింగ్స్ ఆడితే చూడాలని ఉంది. వైభవ్ సూర్యవంశీకి స్వేచ్ఛనిచ్చాం. ఆ స్వేచ్ఛను అతను చక్కగా ఆస్వాదిస్తూ బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ప్రతీసారి మ్యాచ్‌లో బరిలోకి దిగడానికి ముందు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తా. ఈ సీజన్లో వరుసగా మూడు అర్థసెంచరీలు సాధించడం వెనుక నా సీక్రెట్ అదే. నా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నా.’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: ఫిక్సింగ్ కలకలం.. ఏడుగురు ఆటగాళ్లపై నిషేధం! -
యశస్వి, వైభవ్ మెరుపులు
గువాహటి: ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్తాన్ మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. భారీ వర్షం కారణంగా నిర్ణీత సమయం కంటే రెండున్నర గంటలు ఆసల్యంగా ప్రారంభమైన మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (32 బంతుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), వైభవ్ సూర్యవంశీ (14 బంతుల్లో 39; 1 ఫోర్, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. అనంతరం ముంబై తడబడింది. 11 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు చేసి ఓడింది. రికెల్టన్ (8), రోహిత్ (5), సూర్యకుమార్ (6), తిలక్ (14), హార్దిక్ (9) విఫలమయ్యారు. దంచుడే... దంచుడు మ్యాచ్‌ను రాయల్స్ మెరుపులతో ఆరంభించింది. చహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో జైస్వాల్ 4, 6, 4, 4, 4 కొట్టడంతో 22 పరుగులు రాగా... బుమ్రా వేసిన మరుసటి ఓవర్లో వైభవ్ రెండు సిక్స్‌లు బాదాడు. బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో జైస్వాల్ రెండు, వైభవ్ ఒక సిక్స్ కొట్టడంతో మరోసారి 22 పరుగులు వచ్చాయి. దీంతో 3 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ 58 పరుగులు చేసింది. 4వ ఓవర్లో హార్దిక్ నాలుగు పరుగులే ఇవ్వగా... శార్దుల్ వేసిన ఐదో ఓవర్లో 6, 4, 6 కొట్టిన వైభవ్ మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. దీంతో 80 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ధ్రువ్ జురేల్ (2) విఫలం కాగా... కెప్టెన్ రియాన్ పరాగ్ (10 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు.స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (నాటౌట్) 77; వైభవ్ (సి) తిలక్ (బి) శార్దుల్ 39; జురేల్ (ఎల్బీ) ఘజన్ఫర్ 2; పరాగ్ (సి) తిలక్ (బి) ఘజన్ఫర్ 20; హెట్‌మైర్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (11 ఓవర్లలో 3 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–80, 2–84, 3–121. బౌలింగ్: దీపక్ చహర్ 1–0–22–0; బుమ్రా 3–0–32–0; బౌల్ట్ 1–0–22–0; హార్దిక్ 2–0–17–0; శార్దుల్ 2–0– 36–1; ఘజన్ఫర్ 2–0–21–2. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) జురేల్ (బి) ఆర్చర్ 8; రోహిత్ (సి) జురేల్ (బి) సందీప్ 5; సూర్యకుమార్ (సి) ఆర్చర్ (బి) బర్గర్ 6; తిలక్ (సి) హెట్‌మైర్ (బి) బిష్ణోయ్ 14; హార్దిక్ (సి) జైస్వాల్ (బి) బిష్ణోయ్ 9; నమన్ (సి) బిష్ణోయ్ (బి) బర్గర్ 25; రూథర్‌ఫోర్డ్ (సి) సందీప్ (బి) దేశ్‌పాండే 25; శార్దుల్ (సి) జురేల్ (బి) సందీప్ 8; దీపక్ (నాటౌట్) 5; బౌల్ట్ (రనౌట్) 1; బుమ్రా (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (11 ఓవర్లలో 9 వికెట్లకు) 123. వికెట్ల పతనం: 1–10, 2–20, 3–22, 4–41, 5–46, 6–93, 7–103, 8–111, 9–116. బౌలింగ్: ఆర్చర్ 2–0–17–1; బర్గర్ 2–0–21–2; సందీప్ 3–0–26 –2; దేశ్‌పాండే 2–0–29–1; బిష్ణోయ్ 2–0–25–2. -
ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన రాజస్తాన్
ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ముంబై పరాజయం పాలైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 150 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో జైశ్వాల్ విధ్వంసం సృష్టించాడు.జైశ్వాల్ కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు వైభవ్ సూర్యవంశీ(14 బంతుల్లో 1 సిక్స్, 5 సిక్సర్లతో 39), రియాన్ పరాగ్(10 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లతో 20) మెరుపులు మెరిపించారు. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్ రెండు, శార్థూల్ ఠాకూర్ ఓ వికెట్ సాధించాడు.అనంతరం 151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైంది. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్(25), నమన్ ధీర్(25) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. రాజస్తాన్ బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు, సందీప్ శర్మ, బర్గర్ తలా రెండు వికెట్లు సాధించారు. -
ముంబై ఇండియన్స్‌లోకి వైభవ్ సూర్యవంశీ?
వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. ఐపీఎల్-2026 సీజన్లోనూ వైభవ్ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. 15 ఏళ్ల వైభవ్ తన సంచలన బ్యాటింగ్‌తో వరల్డ్‌క్లాస్ బౌలర్లను సైతం వణికిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనే సూర్యవంశీ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 31 పరుగులతో సత్తాచాటాడు. ఇప్పుడు మూడో మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, శాంట్నర్ వంటి పవర్ఫుల్ బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కొనేందుకు వైభవ్ సిద్దమయ్యాడు.మంగళవారం రాజస్తాన్ రాయల్స్ గౌహతి వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. అయితే ఈమ్యాచ్‌కు ముందు బీసీసీఐ మాజీ సెలెక్టర్ జతిన్ పరాంజ్పే కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సూర్యవంశీ త్వరలోనే ముంబై ఇండియన్స్ తరపున ఆడే అవకాశముందని పరాంజ్పే జోస్యం చెప్పాడు."ఈ రోజు వైభవ్ సూర్యవంశీ తన భవిష్యత్తు జట్టుపైనే ఆడబోతున్నాడు. భవిష్యత్తులో ట్రేడింగ్ ద్వారా లేదా వేలంలో భారీ ధరకు వైభవ్‌ను ముంబై సొంతం చేసుకునే అవకాశం ఉందని" అని పరాంజ్పే ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. కాగా గౌహతి వేదికగా రాజస్తాన్-ముంబై మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో టాస్ కూడా ఇంకా పడలేదు.చదవండి: భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్! -
ముంబైపై రాజస్తాన్ ఘన విజయం
ముంబైపై రాజస్తాన్ ఘన విజయంగౌహతి వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్(25), నమన్ ధీర్(25) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. రాజస్తాన్ బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు, సందీప్ శర్మ, బర్గర్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 150 పరుగులు చేసింది. ముంబై ఏడో వికెట్ డౌన్నమన్ ధీర్ రూపంలో ముంబై ఇండియన్స్ ఏడో వికెట్ కోల్పోయింది.ముంబై ఆరో వికెట్ డౌన్షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ రూపంలో ముంబై ఇండియన్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన రూథర్‌ఫోర్డ్.. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు ముంబై స్కోర్: 94/6కష్టాల్లో ముంబై ఇండియన్స్ముంబై ఇండియన్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. రవిబిష్ణోయ్ వేసిన ఐదో ఓవర్లో మూడో బంతికిక్ పాండ్యా(9), ఆఖరి బంతికి తిలక్ వర్మ(1) ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి ముంబై 5 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది.ముంబై ఇండియన్స్ మూడో వికెట్ డౌన్రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. సందీప్ శర్మ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.ముంబై ఇండియన్స్ రెండో వికెట్ డౌన్‌ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. బర్గర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ముంబై ఇండియన్స్ తొలి వికెట్ డౌన్151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తొలి వికెట్‌ను కోల్పోయింది. 8 పరుగులు చేసిన ర్యాన్ రికెల్టన్.. జోఫ్రా అర్చర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.ముంబై ముందు భారీ టార్గెట్ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న 11 ఓవర్ల మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 150 పరుగులు చేసింది. యశస్వీ జైశ్వాల్ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు.కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు వైభవ్ సూర్యవంశీ(14 బంతుల్లో 1 సిక్స్, 5 సిక్సర్లతో 39), రియాన్ పరాగ్(10 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లతో 20) మెరుపులు మెరిపించారు. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్ రెండు, శార్థూల్ ఠాకూర్ ఓ వికెట్ సాధించాడు.రాజస్తాన్ మూడో వికెట్ డౌన్రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. ఘజన్ఫర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 97/2.రాజస్తాన్ రెండో వికెట్ డౌన్84 పరుగుల వద్ద రాజస్తాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన ధ్రువ్ జురెల్.. ఘజన్ఫర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 7 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 97/2. జైశ్వాల్(47), రియాన్ పరాగ్(7) క్రీజులో ఉన్నారు.రాజస్తాన్ తొలి వికెట్ డౌన్80 పరుగుల వద్ద రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం 14 బంతుల్లో 39 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ.. శార్థూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.రాయల్స్ ఓపెనర్ల విధ్వంసంరాజస్తాన్ రాయల్స్ ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(10 బంతుల్లో 36), వైభవ్ సూర్యవంశీ(7 బంతుల్లో20) దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది.ఒకే ఓవర్లో 22 పరుగులురాజస్తాన్ ఇన్నింగ్స్‌ను జైశ్వాల్ ఘనంగా ఆరంభించాడు. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్లో జైశ్వాల్ ఏకంగా 22 పరుగులు రాబట్టాడు.మ్యాచ్ ఆరంభంఈ వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబై రెండు మార్పులతో బరిలోకి దిగింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్ తుది జట్టులోకి వచ్చారు. రాజస్తాన్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లురాజస్థాన్ రాయల్స్ : వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఘజన్ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రామరి కాసేపట్లో మ్యాచ్ ఆరంభం👉వర్షం కారణంగా రాజస్తాన్-ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. 9:55కు టాస్ పడనుండగా.. 10:10 నిమిషాలకు మ్యాచ్ ఆరంభం కానుంది.తగ్గిన వర్షంఅభిమానులకు గుడ్ న్యూస్. గౌహతిలో వర్షం ఎట్టకేలకు ఆగింది. దీంతో మైదానాన్ని సిద్దం చేసేందుకు గ్రౌండ్ స్టాప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.టాస్ ఆలస్యంఐపీఎల్-2026లో గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్- ముంబై ఇండియన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. గౌహతిలో ప్రస్తుతం చిరుజల్లులు పడుతున్నాయి. మైదానం మొత్తాన్ని గ్రౌండ్ స్టాప్ కవర్లతో కప్పి ఉంచారు. దీంతో షెడ్యూల్ ప్రకారం 7:00 గంటలకు పడాల్సిన టాస్ ఇప్పుడు ఆలస్యం కానుంది. కాగా సోమవారం ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కేకేఆర్-పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయింది. -
ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తమ రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. మంగళవారం(ఏప్రిల్ 7) గువహటి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌లో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ కీలక పోరుకు ముందు ముంబై అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అందింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు అనారోగ్యం కారణంగా దూరమైన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి కోలుకున్నాడు.దీంతో రాజస్తాన్‌తో మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండనున్నాడు. ఈ విషయాన్ని ముంబై బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ధ్రువీకరించారు. "హార్దిక్ పాండ్యాకు ఎటువంటి గాయం కాలేదు. కేవలం అనారోగ్యం కారణంగానే గత మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు అతను పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. మంగళవారం రాజస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో పాండ్యా తప్పకుండా ఆడతాడుమాంబ్రే ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు.కాగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆశించినంత మేర రాణించలేకపోయింది. పాండ్యా రీఎంట్రీ ఇస్తే దీపక్ చహర్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశముంది.ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా) : రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నమన్ ధీర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, హార్దిక్ పాండ్యా మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, శార్దూల్ ఠాకూర్, , జస్ప్రీత్ బుమ్రా -
రోహిత్ దెబ్బకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మైండ్ బ్లాక్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. అయితే ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ చేసిన ఒక తుంటరి పనికి ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ మైండ్ బ్లాక్ అయింది. విషయంలోకి వెళితే.. ముంబై ఇన్నింగ్స్ 9వ ఓవర్ కుల్దీప్ యాదవ్ వేశాడు. కాగా కుల్దీప్ వేసిన బంతిని రోహిత్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి మిస్సయ్యి రోహిత్ పక్కనుంచి వెళ్లి కీపర్ కేఎల్ రాహుల్ చేతుల్లో పడింది. అయితే కుల్దీప్ రోహిత్ చేతిని తాకి కీపర్ చేతుల్లోకి పడిందన్న అనుమానం కలిగి అంపైర్‌కు అప్పీల్ చేశాడు. ఇక్కడే రోహిత్ తనలోని తుంటరి చేష్టలను బయటకు తీశాడు. తాను ఔటయ్యానంటూ రోహిత్ డగౌట్ వెళుతున్నట్లు అంపైర్‌కు సైగలు చేశాడు. కానీ అంపైర్ మాత్రం రోహిత్ ఔట్ అంటూ వేలు పైకి ఎత్తలేదు. అయితే రోహిత్ తాను ఔట్ అంటూ పెవిలియన్ వైపు నడవడం చూసి కుల్దీప్, రాహుల్ డీఆర్ ఎస్ రివ్యూ కోరారు. దీంతో థర్డ్ అంపైర్ రివ్యూను పరిశీలిస్తున్న సమయంలోనే రోహిత్ పగలబడి నవ్వాడు. ఎందుకంటే బంతి తనకు చాలా దూరంగా వెళ్లిందన్న విషయం రోహిత్‌కు తెలుసు. రిప్లేలో కూడా అదే కనిపించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తన రివ్యూను వృథా చేసుకున్నట్లయింది. ఆ తర్వాత రోహిత్ కుల్దీప్, రాహుల్ వైపు చూడగా వారు చిరునవ్వుతో కనిపించారు. ముంబై ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం రోహిత్ మట్లాడుతూ.. ‘కుల్దీప్ రివ్యూకు వెళతాడని ముందే ఊహించాను. బంతి నాకు తగల్లేదని నేను క్లియర్‌గా ఉన్నప్పటికీ.. కుల్దీప్ 50-50 చాన్స్‌తో రివ్యూకు వెళ్లొచ్చని ఊహించాను. నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అలా చేశాను. అందుకే పెవిలియన్‌కు వెనుదిరుగుతున్నట్లు నటించాను. నాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాను. మరుసటి ఓవర్లోనే నా ఇన్నింగ్స్‌కు తెరపడింది. కానీ కుల్దీప్, రాహుల్‌తో జరిగిన ఫన్నీ మూమెంట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.’ అని చెప్పుకొచ్చాడు. కాగా మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను మంచి ఈజ్‌తోనే ప్రారంభించాడు. 26 బంతుల్లో 35 పరుగులు చేసిన హిట్‌మ్యాన్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ (51) అర్థసెంచరీ సాధించాడు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. సమీర్ రిజ్వీ (90) సంచలన ఇన్నింగ్స్‌తో ఢిల్లీకి విజయాన్ని అందించాడు.Mind games, ft. Rohit Sharma and Kuldeep Yadav 😉🎥 Hear Rohit's take on the eventful DRS call involving the duo 😄#TATAIPL | #KhelBindaas | #DCvMI | @ImRo45 | @imkuldeep18 | @DelhiCapitals | @mipaltan pic.twitter.com/vUw7eAZhwX— IndianPremierLeague (@IPL) April 4, 2026చదవండి: మొదట్లో చితక్కొట్టినా చివర్లో వణికించాడు! -
'సూపర్' సమీర్
గత మ్యాచ్‌లో లక్నోపై తన మెరుపు బ్యాటింగ్ ట్రైలర్‌తో సరిపెట్టిన సమీర్ రిజ్వీ... ఈ సారి ముంబై బౌలర్లకు సినిమా చూపించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన రిజ్వీ... కుదురుకున్నాక మైదానం నలువైపులా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. బంతి ఎక్కడ పడ్డా దాని గమ్యస్థానం బౌండరీనే అన్నట్లు చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం చేరింది. బ్యాటింగ్‌లో ముంబై ఇండియన్స్ చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోగా...ఆపై సమీర్ ధాటికి బౌలర్లు నిలువలేకపోవడంతో పరాజయం మూటగట్టుకుంది.న్యూఢిల్లీ: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... ఐపీఎల్ 19వ సీజన్లో వరుసగా రెండో విజయం తమ ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్‌లో లక్నోను చిత్తుచేసిన అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్... శనివారం ‘డబుల్ హెడర్’లో భాగంగా జరిగిన మొదటి పోరులో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది. 13 ఏళ్ల తర్వాత విజయంతో సీజన్‌ను ఆరంభించిన ముంబై తమ రెండో మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో కనీస ప్రదర్శన కనబర్చలేక వెనుకబడి పోయింది. ఏకపక్షంగా సాగిన పోరులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా అనారోగ్యంతో మ్యాచ్‌కు దూరం కావడంతో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ సాధించగా...రోహిత్ శర్మ (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సమీర్ రిజ్వీ (51 బంతుల్లో 90; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఒంటి చేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి పతుమ్ నిసాంక (30 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్) సహకరించాడు. 2025 సీజన్ ఢిల్లీ ఆఖరి మ్యాచ్‌నుంచి చూస్తే రిజ్వీ వరుసగా మూడో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకోవడం విశేషం. నాలుగే సిక్స్‌లు... గత మ్యాచ్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మైదానంలో అడుగుపెట్టిన ముంబై ఇండియన్స్‌కు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో చెలరేగారు. ముకేశ్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (9), హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ (0) పెవిలియన్ బాటపట్టారు. దీంతో ముంబై 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రోహిత్‌తో కలిసి సూర్యకుమార్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ఇద్దరు విధ్వంసకర వీరులు క్రీజులో ఉన్నా... ఆశించినంత వేగంగా ఆడలేకపోయారు. మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించిన అనంతరం రోహిత్ వెనుదిరగగా... షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (5) విఫలమయ్యాడు. ఆఖర్లో నమన్ ధీర్ (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్), సాంట్నర్ (18 నాటౌట్; 2 ఫోర్లు) కాస్త పోరాడటంతో ముంబై ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ముంబై ఇన్నింగ్స్ మొత్తంలో నాలుగు సిక్స్‌లు మాత్రమే నమోదయ్యాయి. పవర్‌ప్లేలో ఒక్క సిక్స్ కూడా లేకుండా ముంబై ముగించడం 2023 తర్వాత ఇదే తొలిసారి. హార్దిక్ స్థానంలో సూర్యకుమార్... గత మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్... ఈ పోరులో ముంబై జట్టుకు సారథిగా వ్యవహరించాడు. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అస్వస్థతకు గురవడంతో... అతడి స్థానంలో జట్టు పగ్గాలు అందుకున్నాడు. బ్యాటింగ్‌లో హాఫ్‌సెంచరీ చేసిన సూర్య... జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.సమీర్ సెంచరీ మిస్... గత మ్యాచ్‌లో లక్నో బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్న సమీర్ రిజ్వీ... ముంబైపై అదే దూకుడు కొనసాగించాడు. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (1) మరోసారి విఫలం కాగా... నితీశ్ రాణా (0) డకౌటయ్యాడు. దీంతో ఢిల్లీ జట్టు 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్లు కనిపించగా... ‘ఇంపాక్ట్ ప్లేయర్’ సమీర్ రిజ్వీతో కలిసి నిసాంక పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. ఆరంభంలో నిసాంక వేగంగా ఆడగా... అతడికి రిజ్వీ అండగా నిలిచాడు. సాంట్నర్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన నిసాంక... శార్దుల్ ఠాకూర్ ఓవర్లో 6, 4, 4తో చెలరేగాడు. మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించిన అనంతరం నిసాంక అవుట్ కాగా... అక్కడి నుంచి రిజ్వీ దంచుడు ప్రారంభమైంది. అప్పటి వరకు 23 బంతుల్లో 25 పరుగులే చేసిన రిజ్వీ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బాష్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో 4, 4, 6, 6తో 20 పరుగులు రాబట్టిన సమీర్... మయాంక్ మార్కండేకు రెండు సిక్స్‌లు రుచి చూపించాడు. ఈక్రమంలో 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న రిజ్వీ... దీపక్ చాహర్ ఓవర్లో 4, 6... శార్దుల్ ఓవర్లో 4, 4, 6తో సెంచరీకి సమీపించాడు. అయితే మరో భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో బాష్ బౌలింగ్‌లో అతడు వెనుదిరగగా... మిల్లర్ (21 నాటౌట్; 4 ఫోర్లు), స్టబ్స్ (3 నాటౌట్) మిగిలిన పనిపూర్తి చేశారు. 17 ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సాధించిన విజయాలు. ముంబైపై అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ (18) అగ్రస్థానంలో ఉంది.స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) అక్షర్ (బి) ముకేశ్ 9; రోహిత్ (సి) నితీశ్ రాణా (బి) అక్షర్ 35; తిలక్ (సి అండ్ బి) ముకేశ్ 0; సూర్యకుమార్ (ఎల్బీ) ఎన్గిడి 51; రూథర్‌ఫోర్డ్ (సి) ముకేశ్ (బి) విప్రాజ్ 5; నమన్ (సి) స్టబ్స్ (బి) నటరాజన్ 28; సాంట్నర్ (నాటౌట్) 18; బాష్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–18, 2–18, 3–71, 4–85, 5–122, 6–146. బౌలింగ్: ముకేశ్ 3–0–26–2; ఎన్గిడి 4–0–34–1; అక్షర్ 4–0–22–1; విప్రాజ్ 3–0–24–1; కుల్దీప్ 3–0–31–0; నటరాజన్ 3–0–24–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) రికెల్టన్ (బి) దీపక్ 1; నిసాంక (సి) మార్కండే (బి) సాంట్నర్ 44; నితీశ్ రాణా (రనౌట్) 0; సమీర్ రిజ్వీ (సి) తిలక్ (బి) బాష్ 90; మిల్లర్ (నాటౌట్) 21; స్టబ్స్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–2, 2–7, 3–73, 4–151. బౌలింగ్: దీపక్ చాహర్ 3–0–20–1; బుమ్రా 4–0–21–0; సాంట్నర్ 3–0–22–1; శార్దుల్ 3–0–41–0; మార్కండే 2–0–20–0; కార్బిన్ బాష్ 3.1–0–39–1. -
ఐపీఎల్ చరిత్రలో అత్యంత అరుదైన ఘట్టం
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 4) మధ్యాహ్నం (3:30 గంటలకు) జరిగిన మ్యాచ్‌లో ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడగా.. ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. ఢిల్లీ మరో 11 బంతులు మిగిలుండగానే (18.1 ఓవర్లు) 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సమీర్ రిజ్వి (90) వరుసగా రెండో మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీని గెలిపించాడు.అంతకుముందు లక్నోపై కూడా రిజ్వి (70 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ముంబైపై తాజా హాఫ్ సెంచరీ రిజ్వికి ఐపీఎల్లో వరుసగా మూడవది. గత ఎడిషన్ చివరి మ్యాచ్‌లోనూ (పంజాబ్) అతను అజేయ హాఫ్ సెంచరీ (58) సాధించాడు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ ఓ అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. ఢిల్లీ లక్ష్యానికి చేరువైన తరుణంలో (16.4వ ఓవర్) స్ట్రయికర్ (మిల్లర్), నాన్ స్ట్రయికర్ (ట్రిస్టన్ స్టబ్స్), బౌలర్ (కార్బిన్ బాష్), వికెట్‌కీపర్ (ర్యాన్ రికెల్టన్, ముంబై) నలుగురూ సౌతాఫ్రికన్లే ఉన్నారు. ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలో ఇలా చాలా అరుదుగా జరుగుతుంది.గతంలో ఒకే దేశానికి చెందిన నలుగురు ఇలా వేర్వేరు పోజిషన్లలో ఆడిన దాఖలాలు ఇప్పటివరకు రికార్డు కాలేదు. ఒకవేళ ఇలాంటి ఘట్టాలు ఎక్కడైనా నమోదైనా, సౌతాఫ్రికన్లు ఆ నాలుగు పోజిషన్లలో ఉండి ఉండే అవకాశం మాత్రం లేదు. ఫ్రాంచైజీ లీగ్ పుణ్యమా అని ఇలాంటి సిత్రాలన్నీ జరుగుతూ ఉంటాయి. -
సమీర్ రిజ్వీ సంచలనం.. ముంబైకి షాకిచ్చిన ఢిల్లీ
ఐపీఎల్-2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ గ్రాండ్ విక్టరీ సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో చేధించింది.ఢిల్లీ యువ సంచలనం సమీర్ రిజ్వీ మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన రిజ్వీ.. ముంబై బౌలర్లను ఉతికారేశాడు. ఓ దశలో తొలి ఐపీఎల్ సెంచరీ చేసేలా కన్పించిన రిజ్వీ.. ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. మొత్తంగా 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 పరుగులు చేసి రిజ్వీ ఔటయ్యాడు. అతడితో పాటు పాటు ఫాథుమ్ నిస్సాంక 44 పరుగులతో రాణించాడు. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్, శాంట్నర్, బాష్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(51) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్ శర్మ(35), నమన్ధీర్(28) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఎంగిడి, అక్షర్ పటేల్, నిగమ్, నటరాజన్ తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది. సమీర్ రిజ్వీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: IPL 2026: అర్జున్ సంచలన బౌలింగ్.. స్టంప్స్ ఎగిరిపోయాయి! వీడియో -
IPL 2026: ధోనిని అధిగమించిన రోహిత్
ముంబై ఇండియన్స్ విధ్వంసకర బ్యాటర్ రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలోకి వేసుకున్నాడు. ఐపీఎల్లో ఓ ప్రత్యర్దిపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2026 ఎడిషన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 4) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓ సిక్సర్ బాదిన రోహిత్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై తన సిక్సర్ల సంఖ్యను 51కి పెంచుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో ఓ ప్రత్యర్దిపై అత్యధిక సిక్సర్లు బాదిన విభాగంలో ఎంఎస్ ధోనిని అధిగమించాడు. ధోని ఆర్సీబీపై 50 సిక్సర్లు బాదాడు. ఈ విభాగంలో రోహిత్, ధోని తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లి ఉన్నాడు. విరాట్ సీఎస్కేపై 48 సిక్సర్లు కొట్టాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో ఓ ప్రత్యర్దిపై అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు క్రిస్ గేల్ ఖాతాలో ఉంది. గేల్ పంజాబ్ కింగ్స్‌పై 61, కేకేఆర్‌పై 54 సిక్సర్లతో తొలి స్థానాలను ఆక్రమించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌పై మెరుపు అర్ద సెంచరీ (38 బంతుల్లో 78 పరుగులు; సిక్స్‌లు, 7 ఫోర్లు) చేసిన అతను.. ఇవాళ ఢిల్లీతో మ్యాచ్‌లో 26 బంతుల్లో 35 పరుగులు (5 ఫోర్లు, 1 సిక్స్) చేశాడు.ఢిల్లీ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ 19 ఓవర్ల తర్వాత 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ముకేశ్ కుమార్ 2, ఎంగిడి, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, నటరాజన్ తలో వికెట్ తీశారు. కుల్దీప్ యాదవ్ (3-0-31-0) మినహా ఢిల్లీ బౌలర్లంతా పొదుపుగా కూడా బౌలింగ్ చేశారు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (51) అర్ద సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ (35) ఓ మోస్తరు స్కోర్‌తో పర్వాలేదనిపించాడు. -
ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్!
ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌కు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ తాత్కాలిక సారథిగా బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యాడు.ఐపీఎల్-2026 సీజన్లో శనివారం తొలి డబుల్ హెడర్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ వేదికగా మధ్యాహ్నం మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్- ముంబై ఇండియన్స్.. సాయంత్రం మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్- రాజస్తాన్ రాయల్స్ అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి.ఈ నేపథ్యంలో ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే, టాస్ సమయంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బదులు సూర్యకుమార్ యాదవ్ మైదానంలోకి వచ్చాడు. దీంతో హార్దిక్ జట్టుకు దూరమైన విషయం తెలిసింది.ఈ విషయం గురించి సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. స్వల్ప అనారోగ్యం కారణంగా హార్దిక్ పాండ్యా మ్యాచ్‌కు అందుబాటులో ఉండలేకపోయాడని తెలిపాడు. అదే విధంగా... తమ తుదిజట్టులో మూడు మార్పులు జరిగినట్లు వెల్లడించాడు. హార్దిక్ పాండ్యా స్థానంలో దీపక్ చహర్ వచ్చినట్లు సూర్య తెలిపాడు.ఇక ట్రెంట్ బౌల్ట్ స్థానంలో దీపక్ చహర్, అల్లా ఘజన్ఫర్ స్థానంలో మిచెల్ సాంట్నర్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడుతున్నట్లు సూర్య వెల్లడించాడు. మరోవైపు.. తమ తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేవని ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తుదిజట్లుఢిల్లీ క్యాపిటల్స్కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీశ్ రాణా, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రాజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి. నటరాజన్, ముకేశ్ కుమార్.ముంబై ఇండియన్స్రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నమన్ ధీర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: ‘ధోని ఎక్కడి నుంచో వచ్చాడు.. రో-కోలకు ముఖం మీదే చెప్పేయండి’ -
సమీర్ రిజ్వీ విధ్వంసం.. ముంబైను చిత్తు చేసిన ఢిల్లీ
ముంబైను చిత్తు చేసిన ఢిల్లీఅరుణ్ జైట్లీ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో చేధించింది. యువ సంచలనం సమీర్ రిజ్వీ మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 పరుగులు చేసి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. అతడితో పాటు ఫాథుమ్ నిస్సాంక 44 పరుగులతో రాణించాడు. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్, శాంట్నర్, బాష్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులకే పరిమితమైంది.రిజ్వీ ఔట్సమీర్ రిజ్వీ తొలి ఐపీఎల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 పరుగులు చేసి రిజ్వీ ఔటయ్యాడు. సెంచరీకి చేరువలో సమీర్👉సమీర్ రిజ్వీ దుమ్ములేపుతున్నాడు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నాడు.సమీర్ రిజ్వీ హాఫ్ సెంచరీసమీర్ రిజ్వీ మరోసారి ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి సత్తాచాటాడు. కేవలం 31 బంతుల్లోనే తన మూడో ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 58 పరుగులతో సమీర్ క్రీజ్‌లో ఉన్నాడు.నిస్సాంక ఔట్👉నిస్సాంక(44) రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది.దూకుడుగా ఆడుతున్న నిస్సాంక9 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. పాథుమ్ నిస్సాంక(43) దూకుడుగా ఆడుతుండగా.. సమీర్ రిజ్వీ(19) ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఢిల్లీ విజయానికి 66 బంతుల్లో 97 పరుగులు కావాలి.ఢిల్లీ రెండో వికెట్ డౌన్7 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. నితీష్ రాణా ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.కేఎల్ రాహుల్ ఔట్ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో రాహుల్ పెవిలియన్‌కు చేరాడు.సూర్యకుమార్ హాఫ్ సెంచరీ.. ముంబై స్కోరెంతంటే?అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులకే పరిమితమైంది.ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. అక్షర్, నటరాజన్, లుంగి ఎంగిడి, విప్రజ్ నిగమ్ తలా వికెట్ సాధించారు. ముంబై బ్యాటర్లలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్ శర్మ(35), నమన్ ధీర్(28) రాణించాడు. తిలక్ వర్మ(0),ర్యాన్ రికెల్టన్(9), రూథర్ ఫర్డ్(5) విఫలమయ్యారు.👉ముంబై ఇండియన్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన నమన్ ధీర్.. నటరాజన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఐదో వికెట్ డౌన్15.3: లుంగి ఎంగిడి బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51). ముంబై స్కోరు: 122-5(15.3). నమన్ ధిర్ 18 పరుగులతో ఉన్నాడు. సాంట్నర్ క్రీజులోకి వచ్చాడు.ముంబై నాలుగో వికెట్ డౌన్‌ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన షెర్ఫెన్ రూథర్ ఫర్డ్ విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ముంబై స్కోర్: 92-4రోహిత్ ఔట్71 పరుగుల వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి షెర్ఫెన్ రూథర్ ఫర్డ్ వచ్చాడు.👉9 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(25), రోహిత్ శర్మ(34) ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన ముంబై 2.5: రికెల్టన్ను అవుట్ చేసిన ముకేశ్ కుమార్ తిలక్ వర్మ (2 బంతుల్లో 0)ను డకౌట్ చేశాడు. సూర్యకుమార్ క్రీజులోకి రాగా.. రోహిత్ 9 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 22-2(3)తొలి వికెట్ డౌన్2.3: ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగిన ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (11 బంతుల్లో 9). ముంబై స్కోరు: 18-1(2.4). తిలక్ వర్మ క్రీజులోకి రాగా.. రోహిత్ శర్మ 9 పరుగులతో ఉన్నాడు.హార్దిక్ పాండ్యాకు అనారోగ్యంఢిల్లీతో మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనారోగ్యం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.ఈ మ్యాచ్‌లో ముంబై మొత్తంగా మూడు మార్పులతో బరిలోకి దిగింది. కార్బిన్ బాష్, దీపక్ చాహర్, మిచెల్ శాంట్నర్ తుది జట్టులోకి వచ్చారు. ట్రెంట్ బౌల్ట్, ఘజన్ఫర్లకు విశ్రాంతి ఇచ్చారు. ఢిల్లీ మాత్రం తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రాఢిల్లీ క్యాపిటల్స్ : కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, టి నటరాజన్, ముఖేష్ కుమార్చదవండి: PSL 2026: ఐపీఎల్ పొమ్మంది.. కట్ చేస్తే! అక్కడ వరల్డ్ రికార్డు -
రోహిత్‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్ శనివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై రోహిత్ శర్మ ఇప్పటివరకు 37 మ్యాచ్‌ల్లో 1057 పరుగులు సాధించాడు. కాగా రోహిత్ కంటే ముందు కోహ్లీ ఉన్నాడు. ఈ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ 30 ఇన్నింగ్స్‌ల్లో 1,130 పరుగులు సాధించాడు. కోహ్లీ కంటే 73 పరుగులు వెనుకబడి ఉన్న రోహిత్ ఢిల్లీతో మ్యాచ్‌లోనే ఆ ఫీట్‌ను సాధిస్తాడా లేదా అనేది చూడాలి. ఈ సీజన్‌ను రోహిత్ శర్మ మంచి ఈజ్‌తో ప్రారంభించాడు. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే రోహిత్ 38 బంతుల్లోనే 78 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఇవాళ్టి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోలిస్తే ముంబై ఇండియన్స్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై 21-16 విజయాలతో ఢిల్లీపై ఆధిక్యతను కలిగి ఉంది. గత ఐదు మ్యాచ్‌ల్లో ఢిల్లీపై ముంబై నాలుగు విజయాలు సాధించడం విశేషం.చదవండి: ‘నువ్వొక అద్భుతం.. ప్రపంచం నీ పాదాల చెంతకు’ -
ఐపీఎల్లో నేడు ‘డబుల్’ ధమాకా
న్యూఢిల్లీ: ఐపీఎల్ సీజన్లో తొలి ‘డబుల్ హెడర్’కు రంగం సిద్ధమైంది. ఢిల్లీలో జరిగే పోరులో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుండగా... అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను గుజరాత్ టైటాన్స్ ఎదుర్కొంటుంది. తమ తొలి మ్యాచ్‌ల్లో నెగ్గి ముంబై, ఢిల్లీ జోరు మీదుండగా ... సొంత మైదానంలో లీగ్‌లో బోణీ చేయాలని గుజరాత్ పట్టుదలగా ఉంది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అదృష్టవశాత్తూ ఓటమి నుంచి తప్పించుకుంది. 142 పరుగుల ఛేదనలో 26/4తో కష్టాల్లో ఉన్న సమయంలో రిజ్వీ, స్టబ్స్ పట్టుదలగా ఆడి గెలిపించారు. ఈ నేపథ్యంలో టాపార్డర్ నుంచి జట్టు మంచి ప్రదర్శనను ఆశిస్తోంది. మరోవైపు కోల్‌కతాపై 221 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించిన ముంబై అదే దూకుడును కొనసాగించాలని భావిస్తోంది. రికెల్టన్, రోహిత్, సూర్య, తిలక్, పాండ్యాలతో టాప్–5 బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. గుజరాత్ బోణీ చేసేనా! తొలి మ్యాచ్‌లో చెన్నైని చిత్తు చేసిన ఉత్సాహంతో రాజస్తాన్ రెండో పోరుకు సై అంటోంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ విధ్వంసాన్ని అడ్డుకోవడమే గుజరాత్‌కు కీలకం కానుంది. సొంత మైదానంలో విజయంతో ఖాతా తెరవాలని ఆశిస్తున్న టైటాన్స్ తుది జట్టులో ఎలాంటి మార్పూ చేయకపోవచ్చు. గత పోరులో ఫలితం ప్రతికూలంగా వచి్చనా...టాప్–4 బ్యాటర్లు గిల్, సుదర్శన్, బట్లర్, ఫిలిప్స్‌పైనే జట్టు ఆధారపడి ఉంది. -
ముంబై ఇండియన్స్‌కు శుభవార్త
ఐపీఎల్-2026లో తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టిన విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తమ ఆరంభ మ్యాచ్ ఆడిన హార్దిక్ సేన.. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సత్తా చాటింది.ఓ శుభవార్త ఈ క్రమంలో తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శనివారం నాటి ఈ మ్యాచ్‌కు అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక. ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు ఓ శుభవార్త అందింది.న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ గురువారం ముంబై జట్టుతో చేరాడు. ఢిల్లీతో మ్యాచ్‌కు ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ అందుబాటులో ఉండనున్నాడు. కాగా భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో సాంట్నర్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే, టీమిండియాతో ఫైనల్లో కివీస్ ఓడిపోవడంతో అతడు రన్నరప్ జట్టు కెప్టెన్‌గా మిగిలిపోయాడు.ఐదు సీజన్ల పాటుఇదిలా ఉంటే.. 2019లో ఐపీఎల్లో అడుగుపెట్టిన మిచెల్ సాంట్నర్.. ఐదు సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్‌తో కొనసాగాడు. అయితే, 2025 వేలానికి ముందు చెన్నై అతడిని వదిలించుకోగా.. ముంబై ఇండియన్స్ రూ. 2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఇక తుదిజట్టులో సాంట్నర్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో చోటు దక్కడం కష్టమే అయినా.. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ మంచి బ్యాకప్ ఆప్షన్‌గా పనిచేస్తాడు. కాగా ఇప్పటి వరకు ఐపీఎల్లో సాంట్నర్ 31 మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌కు చెందిన దాదాపు అందరు ప్లేయర్లు జట్టుతో చేరారు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్‌జాక్స్ ఒక్కడు ఎప్పుడు అందుబాటులోకి వస్తాడన్న అంశంపై మాత్రం స్పష్టత లేదు.ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ జట్టుఅల్లా ఘజన్ఫర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ (లక్నో నుంచి ట్రేడింగ్), అశ్వనీ కుమార్, నమన్ ధీర్, షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (ట్రేడింగ్), కార్బిన్ బాష్, రఘు శర్మ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చహర్, రాజ్ అంగద్‌బవా, తిలక్ వర్మ, హార్దిక్‌పాండ్యా, రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, విల్ జాక్స్, మయాంక్ మార్కండే (ట్రేడింగ్), రియాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్ , మయాంక్ రావత్, అథర్వ అంకోలేకర్, మొహమ్మద్ ఇజ్హార్ , డానిశ్ మాలేవర్.చదవండి: IPL 2026: ‘నేనైతే ఫుల్ హ్యాపీ’.. తెలుగు క్రికెటర్ భావోద్వేగం! -
‘బెంచ్ మీద ఉండలేను.. దానికి నేను వ్యతిరేకం’
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ ఇప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పోరాడుతున్నాడు. దేశవాళీ క్రికెట్లో తొలుత సొంత జట్టు ముంబైకి ఆడిన ఈ ఆల్‌రౌండర్.. ఆ తర్వాత గోవాకు మారిపోయాడు. అయినప్పటికీ 26 ఏళ్ల అర్జున్ టెండుల్కర్ ఇంతవరకు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.తండ్రి సచిన్ పదహారేళ్లకే భారత జట్టులో అరంగేట్రం చేసి.. లెక్కకు మిక్కిలి రికార్డులు సాధిస్తే.. అర్జున్ టీమిండియా ఇప్పటికీ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించలేకపోతున్నాడు. ఇక ఐపీఎల్‌లోనూ అతడికి అవకాశాలు కరువయ్యాయి.ఐదు మ్యాచ్‌లు ఆడి..సచిన్ మెంటార్‌గా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుతో చాలాకాలం కొనసాగిన అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar).. ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు తీయగలిగాడు. చివరగా 2024లో ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఈ ఆల్‌రౌండర్.. ఆ తర్వాత మళ్లీ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.లక్నో సూపర్ జెయింట్స్లోకిఈ క్రమంలో 2026 మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ అర్జున్ టెండుల్కర్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026లో భాగంగా లక్నో బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుండగా.. అర్జున్‌కు తుదిజట్టులో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌కు హాజరైన అర్జున్ టెండుల్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘ముంబై ఇండియన్స్ తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడారు కదా! మీరు బాగా బౌలింగ్ చేశారు. స్వింగ్ కూడా బాగుంది. కాబట్టి మరికొన్ని అవకాశాలకు మీరు అర్హులు అని భావించారా?’’ అని హోస్ట్ అర్జున్ టెండుల్కర్‌ను అడిగాడు.బెంచ్ మీద కూర్చోవాలని ఎవరు కోరుకుంటారు?ఇందుకు బదులిస్తూ.. ‘‘ఎవరైనా సరే అలాగే ఫీలవుతారు. బెంచ్ మీద కూర్చోవాలని ఎవరికి మాత్రం ఆశగా ఉంటుంది. అయితే, అవకాశం వచ్చినపుడు కఠినంగా శ్రమించి అద్భుతంగా ఆడటం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది’’ అని అర్జున్ టెండుల్కర్ పేర్కొన్నాడు. అదే విధంగా ఐపీఎల్లో ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌పై అభిప్రాయం పంచుకుంటూ.. పదకొండు మంది ఆటగాళ్లతోనే తుదిజట్టు ఉంటే బాగుంటుందని అర్జున్ పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా తానైతే ఇంపాక్ట్ సబ్ నిబంధనకు వ్యతిరేకమని స్పష్టం చేశాడు.చదవండి: సిరాజ్ జట్టులో ఎందుకున్నట్లు?.. టీమిండియా దిగ్గజం -
ఐపీఎల్ 2026లో విషాదం
ఐపీఎల్ 2026లో ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్‌కు చెందిన 76 ఏళ్ల బ్రాడ్కాస్ట్ ఇంజనీర్ జాన్ విలియం లాంగ్‌ఫోర్డ్ ముంబైలోని తన హోటల్ గదిలో విగతజీవిగా పడి ఉన్నారు. లాంగ్‌ఫోర్డ్ మార్చి 24 నుంచి ముంబైలోని ట్రైడెంట్ హోటల్లో ఉంటున్నారు. మార్చి 29న జరిగిన ముంబై ఇండియన్స్–కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో ఆయన పని చేశారు. ఆ రాత్రి హోటల్ గదిలోకి వెళ్లిన అతను.. మరుసటి రోజు ఉదయం ఎంతకీ స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది స్పేర్ లాక్‌తో డోర్ ఓపెన్ చేసి చూడగా లాంగ్‌ఫోర్డ్ నేలపై పడివున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో రంగంలోకి దిగిన మెరైన్ డ్రైవ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్‌మార్టం నివేదికలో ఎలాంటి అనుమానాస్పద అంశాలు లభించలేదని పోలీసులు తెలిపారు. లాంగ్‌ఫోర్డ్ కెరీర్ బ్రిటిష్ సిటిజన్ అయిన లాంగ్‌ఫోర్డ్ ఐపీఎల్ 2026లో ZOOM కమ్యూనికేషన్స్ తరఫున ఫ్రీలాన్స్ విజన్ సూపర్వైజర్గా పని చేస్తున్నారు. గతంలో అతను మహిళల ప్రీమియర్ లీగ్, 2024 పారిస్ ఒలింపిక్స్, 2010 FIFA వరల్డ్ కప్ వంటి ప్రధాన ఈవెంట్లలో కూడా సేవలందించారు. 1996 నుంచి 2011 వరకు భారత్, శ్రీలంక, వెస్టిండీస్‌లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్స్‌లో కూడా పని చేశారు. లాంగ్‌ఫోర్డ్‌కు ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్–కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ చివరి అసైన్మెంట్గా మిగిలిపోయింది. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (78), ర్యాన్ రిక్ల్టన్ (81) మెరుపు ఇన్నింగ్స్‌ల కారణంగా ముంబై ఇండయన్స్ ఘన విజయం సాధించింది. -
చెత్త కెప్టెన్సీ.. అతడికి ఎందుకు బంతి ఇవ్వలేదు?
ఐపీఎల్-2024లో చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ గత సీజన్లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. అజింక్య రహానే సారథ్యంలో పద్నాలుగింట ఐదు మ్యాచ్‌లే గెలిచి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక తాజా ఎడిషన్‌ను కూడా కేకేఆర్ ఓటమితోనే ఆరంభించింది.ఐపీఎల్-2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 220 పరుగుల భారీ స్కోరు చేసిన కోల్‌కతా (KKR vs MI).. లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (43 బంతుల్లో 81), రోహిత్ శర్మ (38 బంతుల్లో 78) ధనాధన్ దంచికొట్టడంతో ముంబై ఇండియన్స్ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.Sealed in style 🔒@mipaltan begin their #TATAIPL 2026 campaign with an impressive 6⃣-wicket victory at home 💙Scorecard ▶️ https://t.co/JmJcgsoHQ7#KhelBindaas | #MIvKKR pic.twitter.com/zOnWb5Sc8U— IndianPremierLeague (@IPL) March 29, 2026ఆరు వికెట్ల తేడాతోవాంఖడే స్టేడియంలో 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 224 పరుగులు సాధించి.. ఆరు వికెట్ల తేడాతో కేకేఆర్‌పై ముంబై గెలిచింది. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్.. కేకేఆర్ సారథి అజింక్య రహానే వ్యూహాలను విమర్శించాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో సునిల్ నరైన్‌కు బంతి ఇవ్వకపోవడాన్ని భజ్జీ తప్పుబట్టాడు.పవర్ ప్లేలో అదే అత్యుత్తమంజియోస్టార్ షోలో మాట్లాడుతూ.. ‘‘పవర్ ప్లేలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సునిల్ నరైన్‌తో బౌలింగ్ చేయించడం అత్యుత్తమ నిర్ణయం. అతడితో కనీసం రెండు ఓవర్లు అయినా వేయించాల్సింది. తద్వారా రోహిత్ శర్మను టార్గెట్ చేసే వీలు ఉండేది.నరైన్‌కు రోహిత్‌పై మంచి రికార్డు ఉంది. ఒకవేళ ఈరోజు కూడా రోహిత్‌ను త్వరగా అవుట్ చేసి ఉంటే.. ముంబై ఒత్తిడిలో కూరుకుపోయేది. ఇక పవర్ ప్లే సంగతి పక్కన పెడితే నరైన్‌కు పూర్తి కోటా బౌలింగ్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. కెప్టెన్సీ ఎంత చెత్తగా ఉందో చెప్పడానికి ఇదొక నిదర్శనం’’ అని హర్భజన్ సింగ్ రహానే కెప్టెన్సీని విమర్శించాడు.వారిద్దరు అద్బుతంఏదేమైనా రోహిత్ శర్మ, రికెల్టన్‌లకు క్రెడిట్ ఇవ్వాల్సిందేనని భజ్జీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. వారిద్దరు అద్భుతంగా బ్యాటింగ్ చేశారని.. కేకేఆర్ బౌలర్లను ఏ దశలోనూ కోలుకోనివ్వలేదని ప్రశంసించాడు. కాగా ముంబైతో మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన సునిల్ నరైన్.. 30 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. తిలక్ వర్మ (18) వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: బంగ్లాదేశ్‌కు బ్యాడ్‌న్యూస్!.. షాకిచ్చిన జియోస్టార్! -
నేను ముందే చెప్పాను కదా!: అంపైర్‌తో రోహిత్ శర్మ
టీమిండియా దిగ్గజ కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ ఐపీఎల్-2026 టోర్నీని ఘనంగా ఆరంభించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ వింటేజ్ హిట్‌మ్యాన్‌ను గుర్తుచేశాడు. కేవలం 38 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 78 పరుగులు సాధించాడు.Rohit Sharma in his element 🙌🎥 Enjoy his scintillating early smacks for six 👊#MI are 64/0 after 5 overs.Updates ▶️ https://t.co/JmJcgsoHQ7#TATAIPL | #KhelBindaas | #MIvKKR | @mipaltan | @ImRo45 pic.twitter.com/ys8k0JNHlW— IndianPremierLeague (@IPL) March 29, 2026ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కోల్‌కతా (KKR vs MI)పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా 2012 తర్వాత తొలిసారి ఐపీఎల్లో తమ ఆరంభ మ్యాచ్‌లో ముంబై గెలుపు జెండా ఎగురవేసింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా అంపైర్‌తో రోహిత్ శర్మ (Rohit Sharma) వ్యవహరించిన తీరు వైరల్‌గా మారింది.గేజ్ టెస్టు నిర్వహిస్తుండగా.. కేకేఆర్ విధించిన 221 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ బ్యాటింగ్‌కు వస్తున్న సమయంలో.. అంపైర్ అతడి బ్యాట్‌ను పరీక్షించాడు. బ్యాట్ పరిమాణం సరిగ్గా ఉందా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు గేజ్ టెస్టు నిర్వహిస్తుండగా.. రోహిత్ తన బ్యాట్ సరిగ్గానే ఉందంటూ రియాక్షన్ ఇచ్చాడు.నేను ముందే చెప్పాను కదా!అయితే, నిబంధన ప్రకారం బ్యాట్‌ను టెస్టు చేసిన అంపైర్ సంతృప్తి వ్యక్తం చేయగా.. ‘నేను ముందే చెప్పాను కదా!’ అన్నట్లుగా రోహిత్ శర్మ నవ్వులు చిందిస్తూ మైదానంలోకి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు హిట్‌మ్యాన్ అభిమానులను ఆకర్షిస్తున్నాయి.కాగా గతేడాది ఎక్కువగా ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రోహిత్.. ఈసారి మాత్రం తుదిజట్టులో భాగంగా బరిలోకి దిగుతున్నాడు. దీంతో అతడి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక టీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ అందించిన ఘనత రోహిత్ శర్మది. కెప్టెన్ హోదాలో ముంబైని సైతం ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. అయితే, 2024లో ముంబై రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. చదవండి: IPL: ఈ ఐదు రికార్డులను ఎవరూ బ్రేక్ చేయలేరు!?pic.twitter.com/0A7i9X5ybq— • (@ClassyCricket) March 30, 2026 -
అతడొక అద్భుతమైన ఫీల్డర్.. ఎందుకిలా చేశారు?: మాజీ కెప్టెన్ ఫైర్
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అనుసరించిన వ్యూహాలను టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తప్పుబట్టాడు. ఇద్దరు కీలక పేసర్లను కాదని పవర్ ప్లేలో కెప్టెన్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రెండు ఓవర్లు ఎందుకు బౌలింగ్ చేశాడని ప్రశ్నించాడు.ఆరు వికెట్ల తేడాతోఅదే విధంగా సూర్యకుమార్ యాదవ్ విషయంలో యాజమాన్యం వ్యవహారశైలి ఏమిటో తనకు అర్థం కావడం లేదని చిక్కా విమర్శించాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 టోర్నీలో ముంబై బోణీ కొట్టిన విషయం తెలిసిందే. సొంతమైదానం వాంఖడే వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.తద్వారా పద్నాలుగేళ్ల విరామం తర్వాత తొలిసారి.. ఓ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్‌లో ముంబై జయభేరి మోగించింది. అయితే, ఈ మ్యాచ్‌లో ముంబై గెలిచినా.. ఆ జట్టు అనుసరించిన వ్యూహాలు మాత్రం తనకు ఆశ్చర్యం కలిగించాయని క్రిష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు.ఇది అసలు అంతుపట్టని విషయంతన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఇది అసలు అంతుపట్టని విషయం. భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు తుదిజట్టులో చోటు ఇవ్వలేదు. సూర్యను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించడం సరికాదు.అతడొక అద్భుతమైన ఫీల్డర్అతడొక అద్భుతమైన ఫీల్డర్. సూర్యకు బదులు రూథర్‌ఫర్డ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపాల్సింది. ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా పంపి సూర్యకు అన్యాయం చేశారు’’ అని చిక్కా ముంబై యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.మరో వ్యూహాత్మక తప్పిదం ఇదిఇక పవర్ ప్లేలో ముంబై అనుసరించిన వ్యూహాలను ప్రస్తావిస్తూ.. ‘‘ముంబై చేసిన మరో వ్యూహాత్మక తప్పిదం ఇది. ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉన్నా.. వారి సేవలను పూర్తిగా వినియోగించుకోలేకపోయారు. వారిద్దరు ఆలస్యంగా బంతితో రంగంలోకి దిగారు.ఇక తన తొలి ఓవర్లోనే బుమ్రా ఐదు స్లో బంతులు ఎందుకు వేశాడో నాకైతే అర్థం కాలేదు. తనదైన సహజశైలిలో స్వింగ్, సీమ కలగలిపి అతడు బౌలింగ్ చేయలేదు. మరోవైపు.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు ఓవర్లు తానే వేశాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించాడు. కాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో బౌల్ట్ నాలుగు ఓవర్ల కోటాలో 38 పరుగులు ఇచ్చి వికెట్లు తీయలేకపోయాడు. మరోవైపు.. పాండ్యా 3 ఓవర్లలో 39 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీయగా.. బుమ్రా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 35 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఫిట్నెస్ సమస్యల కారణంగానేఇదిలా ఉంటే.. సూర్యను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించడంతో విమర్శలు రాగా.. హెడ్‌కోచ్ మహేళ జయవర్దనె స్పందించాడు. సూర్య గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్నందు వల్లే అతడిని ఎక్కువగా శ్రమపెట్టదలచుకోలేదని తెలిపాడు. ఫిట్నెస్ సమస్యలు తీవ్రం కాకుండా చూసుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు.చదవండి: అంతుచిక్కని శార్దూల్ ఠాకూర్! -
IPL 2026: బ్లూ సోఫాలో అంబానీ ఫ్యామిలీ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత ఖరీదైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఖరీదైన జట్టుగా మాత్రమే గాక క్యాచ్ రిచ్ లీగ్‌లో అత్యధిక టైటిల్స్ కొట్టిన జట్టుగానూ ముంబై ఇండియన్స్‌కు పేరుంది. ఇప్పటివరకు ఐపీఎల్లో ఐదు టైటిల్స్ కొట్టిన ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్‌కింగ్స్‌తో కలిసి సమానంగా ఉంది. ముంబై ఇండియన్స్ యాజామాన్యం ఎవరన్నది అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్న ముకేశ్ అంబానీ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ఓనర్. అంబానీ ఫ్యామిలీ ఏది చేసినా రిచ్‌గానే కనిపిస్తుంటుంది. ఐపీఎల్‌లోనూ అది ఎన్నోసార్లు స్పష్టంగా తెలిసొచ్చింది. ముంబై ఇండియన్స్ జట్టు టైటిల్ గెలిచిన ప్రతీసారి అందులో ఉండే ఆటగాళ్లకు అంబానీ ఫ్యామిలీ ఎన్నో విలువైన కానుకలు కూడా అందించింది. తాజాగా ఐపీఎల్ 19వ సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను ఆదివారం కేకేఆర్‌తో ఆడింది. ముంబై ఇండియన్స్ విజయం సంగతి పక్కనబెడితే అంబానీ ఫ్యామిలీకి సంబంధించి ఒక వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిపోయింది.అదేంటంటే.. కేకేఆర్‌తో మ్యాచ్ సందర్భంగా నీతా అంబానీ ఫ్యామిలీకి వాంఖడే స్టేడియం డగౌట్‌కు సమీపంలో వేసిన ప్రత్యేక బ్లూ సోఫాలో ఆసీనులయ్యారు. మ్యాచ్ ఆద్యంతం అక్కడే కూర్చుని నీతా అంబానీ జట్టు సభ్యులను చీర్ చేశారు. అయితే అభిమానులకు ఇక్కడే ఒక సందేహం కలిగింది. వాస్తవానికి ఏ ఫ్రాంచైజీ ఓనర్ అయినా బాక్స్‌లో లేదా అభిమానుల మధ్యలో కూర్చొని మ్యాచ్ వీక్షించడం ఆనవాయితీ. కానీ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ మాత్రం ఆ రూల్‌ను బ్రేక్ చేసి మైదానం డగౌట్లో ప్రత్యేక సోఫాలో అంబానీ ఫ్యామిలీని ఎందుకు కూర్చోబెట్టా రన్నది ఆసక్తి కలిగించింది. మరి అంబానీ ఫ్యామిలీకే ఎందుకు సోఫాలు వేస్తారు. మిగతా ఓనర్లకు ఎందుకు వేయరన్న ప్రశ్నలు చాలా మందిలో తలెత్తాయి. గతంలోనూ అంబానీ కుటుంబం ఎందుకు మైదానం సమీపంలో వేసిన సోఫాలో కూర్చొని మ్యాచ్‌లు వీక్షిస్తారనే ప్రశ్నలు చాలాసార్లు వచ్చాయి.నీతా అంబానీ టీమ్ ఓనరే కాదు.. ఆమె ముంబై జట్టుకు సీఈవో. టీమ్ మీటింగ్స్, స్టాటజీ మీటింగ్, ప్లేయర్ మీటింగ్ లకి నీతా అంబానీ తరచూ హాజరవుతూ ఉంటారు. ముంబై ఇండియన్స్ మాత్రమే కాదు అంబానీ ఫ్యామిలీ వేరే టీమ్ ఫ్రాంచైజీకి కూడా స్పాన్సర్‌గా వ్యవహరి స్తుంటారు. దీనికి తోడు భారత్‌లోనే అత్యంత ధనవంతుల జాబితాలో ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. అంబానీ ఫ్యామిలీ వద్ద డబ్బులకు కొదవ లేకపోవడంతో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న బీసీసీఐకి కూడా అంబానీ ఫ్యామిలీ స్పాన్సర్‌గా వ్యవరిస్తున్నట్లు వార్తలున్నాయి. అందుకే బీసీసీఐ కూడా అంబానీ ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకోవడం లేదనిపిస్తోంది. బహుశా ఈ కారణం చేతనే ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లు జరిగినప్పుడల్లా మైదానం డగౌట్ సమీపంలో బ్లూ సోఫాను ఉంచుతున్నట్లుగా అనిపి స్తోంది. ఇతర జట్ల యజమానులు మాత్రం వీఐపీ బాక్స్, కార్పొరేట్ బాక్సుల్లో కూర్చొవడం లేదా నిలబడి మ్యాచ్ ని వీక్షిస్తుంటారు. కానీ ముంబై ఇండియన్స్ యజమానులు రాయల్ గా గ్రౌండ్ పక్కనే కూర్చొని మ్యాచ్ వీక్షిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మరోసారి వైరల్‌గా మారాయి. Nah man Nita Ambani just showed her power on live television😭😭 pic.twitter.com/tNXU262FTx— ` (@McgMadMan) March 30, 2026చదవండి: టైగర్‌వుడ్స్‌కు ట్రంప్ మాజీ భార్య వార్నింగ్! -
గర్ల్ ఫ్రెండ్‌కు బెంజ్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్.. ఎన్ని కోట్లంటే?
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచాడు. హార్దిక్ తన ప్రేయసి మహికా శర్మకు అత్యంత ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆమెపై ఉన్న ప్రేమను చాటుకుంటూ సుమారు రూ. 1.7 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ లగ్జరీ కారును కానుకగా అందించాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇటీవలే పాండ్యా తన కోసం రూ.12 కోట్ల విలువైన లగ్జరీ రును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన గర్ల్‌ఫ్రెండ్ కోసం ఏకంగా మెర్సిడెస్ బెంజ్‌ను కొనుగోలు చేసి అందరిని ఆశ్యర్యపరిచాడు. కాగా ఈ బరోడా క్రికెటర్ నటాషా స్టాంకోవిక్‌తో విడిపోయిన తర్వాత మహికా శర్మతో ప్రేమలో పడ్డాడు. హార్దిక్ ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ ఆమె మైదానంలో ఉండి ఉత్సహపరుస్తుంటుంది. తన విజయాల్లో మహికా కీలక పాత్ర పోషిస్తుందని హార్దిక్ ఇదివరకే పలుమార్లు పేర్కొన్నాడు. అయితే హార్దిక్ గత నెలలో తన మాజీ భార్య నటాషాకు కూడా ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. నటాషా, అగస్త్య కోసం రూ. 4 కోట్ల విలువైన లాండ్ రోవర్ డిఫెండర్‌ను పాండ్యా కొనుగోలు చేశాడు.ముంబై గ్రాండ్ విక్టరీఇక ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. ఆదివారం వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది.రోహిత్ శర్మ(78), ర్యాన్ రికెల్టన్ (81) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో జట్టును విజయతీరాలకు చేర్చారు. 2012 తర్వాత ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం ఇదే మొదటిసారి.చదవండి: PSL: వద్దు అన్నా.. హోటల్‌కు తీసుకెళ్లారు! చిక్కుల్లో స్టార్ క్రికెటర్లు -
సూర్యను ఎందుకు పక్కన పెట్టారు..?
ఐపీఎల్-2026 సీజన్‌ను ముంబై ఇండియన్స్ ఘనంగా ఆరంభించింది. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై విజయాన్ని అందుకుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 221 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(78), ర్యాన్ రికెల్టన్(81) తమ అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టుకు విజయాన్ని అందించారు. కాగా ఈ మ్యాచ్‌లో ముంబై గెలిచినప్పటికి.. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు స్టార్టింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. అతడు ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ సబ్‌గా కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే వచ్చాడు. దీంతో సూర్య గాయపడ్డాడా? అన్న సందేహం అందరిలోనూ నెలకొంది. అయితే సూర్యను పక్కన పెట్టడానికి గల అసలు కారణాన్ని మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్దనే వెల్లడించాడు. సూర్యను కేవలం ఫిట్నెస్ జాగ్రత్తలలో భాగంగానే తుది జట్టులో ఆడించలేదని జయవర్ధనే స్పష్టం చేశాడు."మేము అనవసరమైన కథనాలను సృష్టించకూడడు అనుకుంటున్నాము. మా జట్టులోని ప్రతీ ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు. సూర్య కాస్త ఆలస్యంగా మా జట్టుతో చేరాడు. అయితే అతడి కాలి గజ్జల్లో స్వల్పంగా పట్టేసినట్లు ఉంది. దీంతో ఫీల్డింగ్ చేసేటప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అందుకే ఈ రోజు అతడికి విశ్రాంతి ఇచ్చాము. చివరి నాలుగు ఓవర్లలో తను ఫీల్డింగ్‌కు వచ్చేందుకు స్కై సిద్దమయ్యాడు. కానీ నేనే వద్దన్నాను. మా తదుపరి మ్యాచ్‌కు ఇంకా ఐదు రోజుల సమయం ఉంది. అప్పటికి సూర్య పూర్తి సిద్దంగా ఉంటాడని" జయవర్ధనే పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక ముంబై తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 4న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్లతో తలపడనుంది. చదవండి: PSL: వద్దు అన్నా.. హోటల్‌కు తీసుకెళ్లారు! చిక్కుల్లో స్టార్ క్రికెటర్లు -
అంతుచిక్కని శార్దూల్ ఠాకూర్!
శార్దూల్ ఠాకూర్.. ఆల్‌రౌండర్‌గా టీమిండియాకు కొన్ని మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. అయితే శార్దూల్ ఒక ఫాస్ట్ బౌలర్ కాదు.. స్వింగ్ బౌలర్ అంతకన్నా కాదు. అతడి బౌలింగ్‌లోనూ పెద్దగా వైవిధ్యత కనిపించదు. కానీ జట్టుకు అవసరమైనప్పుడల్లా వికెట్లు తీస్తూ విజయాల్లో భాగమవుతూ వస్తున్నాడు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టడంలో శార్దూల్ ఠాకూర్ కీలకపాత్ర పోషించాడు. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో స్టార్ బౌలర్ బుమ్రా బౌలింగ్ తేలిపోయిన చోట శార్దూల్ మాత్రం 3 కీలక వికెట్లు పడగొట్టి కేకేఆర్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకొని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకున్నాడు.అయితే శార్దూల్ ఠాకూర్ టీ20 క్రికెట్లో పవర్ ప్లే, మిడిల్, డెత్ ఓవర్లలో ఎక్కడైనా బౌలింగ్ చేయడంలో సమర్థుడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లనూ పవర్ ప్లేలో ఒకటి, మిడిల్ ఓవర్లలో ఒకటి, డెత్ ఓవర్లలో ఒకటి ఇలా మూడు వికెట్లు తీశాడు. సాధారణంగా ఒక బౌలర్ వికెట్లు తీస్తూ ఫామ్‌లో ఉన్నట్లయితే అతడితో వరుస ఓవర్లు వేయించి ప్రత్యర్థిని దెబ్బతీయాలని చూస్తారు. కానీ శార్దూల్ మాత్రం తాను ఆడే జట్టు కెప్టెన్‌కు బౌలింగ్ విషయమై ముందే క్లారిటీ ఇస్తాడట. అందుకే కెప్టెన్లకు అవసరమైనప్పుడు బౌలింగ్‌కు వచ్చి వికెట్లు తీయడం శార్దూల్‌లో ఉన్న ప్రత్యేకత. అంతేకాదు శార్దూల్ తన బౌలింగ్‌లో ఒకే రకం శైలిని ఎక్కువసార్లు ఉపయోగించు. సీమ్, పేస్‌ను మిక్స్ చేస్తూ వచ్చే స్లోపేస్ బంతులను ప్రత్యర్థి బ్యాటర్లు ఆడేందుకు ఇబ్బంది పడుతుంటారు. తాజాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ శార్దూల్ దానినే ఫాలో అయ్యాడు. అందుకే ఫిన్ అలెన్, అజింక్యా రహానే, కామెరూన్ గ్రీన్‌లు ఔటైన విధానం పరిశీలిస్తే శార్దూల్ బౌలింగ్‌పై మరింత స్పష్టత వస్తుంది. ఇక 2012 వరకు ముంబై ఇండియన్స్‌కు నెట్‌బౌలర్‌గా ఉన్న శార్దూల్ ఇప్పుడు అదే జట్టుకు బుమ్రా తర్వాత ప్రధాన బౌలర్‌గా మారిపోయాడు. 2015 నుంచి ఐపీఎల్ ఆడుతున్న శార్దూల్ పదేళ్లలో ఆరుజట్లు మారాడు. పదేళ్ల తర్వాత కానీ సొంత జట్టుకు ఆడే అవకాశం రాలేదు. తాజాగా వచ్చిన అవకాశాన్ని శార్దూల్ రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ టీమిండియా తరఫున 13 టెస్టుల్లో 377 పరుగులు, 33 వికెట్లు; 47 వన్డేల్లో 329 పరుగులు, 65 వికెట్లు; 25 టీ20ల్లో 69 పరుగులు సహా 33 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ కెరీర్లో 106 మ్యాచ్‌లాడి 325 పరుగులు చేయడంతో పాటు 110 వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by IPL (@iplt20)చదవండి: ‘ఆ విషయం క్రికెట్ ఆస్ట్రేలియాను అడగండి’ -
IPL 2026: ముగ్గురు మొనగాళ్లు!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమై రెండు రోజులే అయినప్పటికీ రెండు మ్యాచ్‌ల్లోనూ చేజింగ్ చేసిన జట్లే గెలవడం అభిమానులకు కిక్ ఇస్తోంది. అంతకంటే ఎక్కువ కిక్ ఇస్తున్న వార్త ఏదైనా ఉందంటే.. టీమిండియా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానే, విరాట్ కోహ్లీల బ్యాటింగ్ అని చెప్పొచ్చు. 40 ఏండ్లకు దగ్గర్లో ఉన్న ఈ ముగ్గురు మొనగాళ్లు బ్యాటింగ్‌లో అద్భుతాలు చేస్తున్నారు. ఈ సీజన్లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఈ త్రయం తమ ప్రదర్శనతో అదరగొట్టారు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లీలు పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికితే.. జట్టులో అవకాశాల్లేక టీ20 క్రికెట్ ఆడే అవకాశం రహానే ఎప్పుడో కోల్పోయాడు. కానీ తాజాగా ప్రారంభమైన ఐపీఎల్ 19వ సీజన్లో మాత్రం తమ బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానులను అలరిస్తున్నారు. ఈ ముగ్గురూ ఇలాగే ఆడుతూ పోతే రాబోయే మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలే అని చెప్పొచ్చు.రోహిత్ శర్మ..భారత కెప్టెన్‌గా 2024 టీ20 ప్రపంచకప్‌ను అందుకున్న రోహిత్ శర్మ ఆ తర్వాత ఆ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ జనవరిలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడాడు. ఆ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ లేదు. మూడు వన్డేలు కలిపి కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఇవాళ ఐపీఎల్లో మాత్రం తొలి మ్యాచ్‌లోనే రోహిత్ శర్మ విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో 38 బంతుల్లోనే 78 పరుగులు చేసిన రోహిత్ అలవోకగా బంతులను బౌండరీ అవతలకు పంపిస్తూ పాత హిట్‌మ్యాన్‌ను గుర్తు చేశాడు. రికిల్టన్ కంటే ముందే ఔటైనప్పటికీ ఫోర్లు, సిక్సర్లతో కేకేఆర్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముఖ్యంగా మ్యాచ్‌లో రోహిత్ ఫుట్‌వర్క్ అద్భుతమని చెప్పొచ్చు. ఎక్కడా చిన్న తప్పిదం లేకుండా ఇన్నింగ్స్ ఆసాంతం మంచి టైమింగ్‌తో షాట్లు ఆడాడు. తొలి మ్యాచ్‌తోనే ఫామ్ అందుకున్న రోహిత్ నుంచి సీజన్ ముగిసేలోపు మరిన్ని అద్భుత ఇన్నింగ్స్‌లు వచ్చే అవకాశముంది. View this post on Instagram A post shared by IPL (@iplt20)విరాట్ కోహ్లీ..కోహ్లీది కూడా అచ్చం రోహిత్ స్టోరీనే. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడైన కోహ్లీ రోహిత్‌తో కలిసి ఏకకాలంలో టీ20లకు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ కోహ్లీ అదరగొట్టాడు. ఆ సిరీస్‌లో కోహ్లీ 3 మ్యాచ్‌ల్లో 240 పరుగులు సాధించి భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తాజాగా అదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కంటిన్యూ చేశాడు. ఐపీఎల్ 19వ సీజన్లో ఎస్ఆర్హెచ్తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరు స్టార్ కోహ్లీ చివరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. కోహ్లీ (38 బంతుల్లో 69 నాటౌట్) చేజింగ్‌లో తనను కొట్టేవారు లేరని మరోసారి నిరూపించాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. సీజన్ ఆద్యంతం కోహ్లీ ఇదే దూకుడు ప్రదర్శిస్తే ఆరెంజ్ క్యాప్ కూడా సొంయ్యే అవకాశం లేకపోలేదు. View this post on Instagram A post shared by IPL (@iplt20)అజింక్యా రహానే..రోహిత్, కోహ్లీలు రెండేళ్ల కిందట టీ20లకు వీడ్కోలు పలికితే రహానే టీమిండియా తరఫున తన చివరి టీ20 ఆడి దాదాపు పదేళ్లు కావొస్తోంది. రహానే 2016లో వెస్టిండీస్‌తో చివరి టీ20 ఆడాడు. అప్పటి నుంచి టెస్టుల్లో కొన్నాళ్లు ఆడిన రహానే ఇప్పుడు అవకాశాలు లేవు. దీంతో ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్న రహానే గత రెండు, మూడు సీజన్లలో ఆట స్వరూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. రహానేను ఎక్కువగా టెస్టు క్రికెట్లో చూడడం వల్ల అతడి నుంచి నెమ్మదైన ఆటనే అభిమానులు ఊహించేవారు. కానీ ఐపీఎల్లో రహానే ఆడుతున్న తీరు షాక్ కలిగిస్తోందని చెప్పొచ్చు. తాజాగా ఐపీఎల్ 19వ సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రహానే కేకేఆర్ కెప్టెన్‌గా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 67 పరుగులు చేసిన రహానే ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. గతంలో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడినప్పుడు కూడా రహానే ఇదే దూకుడును ప్రదర్శించి సరికొత్త ఆటను రుచి చూపించాడు. మొత్తంగా టీమిండియా సీనియర్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేలు ఒక్క మ్యాచ్‌తోనే ఆటలో మొనగాళ్లమని నిరూపించుకున్నారు.చదవండి: ‘14 ఏండ్లకు మమ్మల్ని కరుణించాడు’ -
కోల్ కతాపై ముంబై ఇండియన్స్ విజయం
-
కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. 2012 సీజన్ తర్వాత తాము ఆడిన తొలి మ్యాచ్‌లో విజయాన్ని అందుకొని సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. క్రీజులో తాను ఉన్నాడంటే పరుగులు రావాల్సిందే. 38 బంతుల్లో 78 పరుగులు చేసిన రోహిత్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ నేపథ్యంలోనే తన సహచరుడు, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును రోహిత్ శర్మ బద్దలుకొట్టాడు. టీ20 క్రికెట్లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ తొలి స్థానానికి చేరుకున్నాడు. గతంలో డెక్కన్ చార్జర్స్‌తో పాటు ముంబై ఇండియన్స్ తరఫున కేకేఆర్‌పై రోహిత్ శర్మ 36 మ్యాచ్‌ల్లో 1161 పరుగులు సాధించాడు. ఇక కేకేఆర్‌తో మొత్తం 36 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ డెక్కన్ చార్జర్స్ తరఫున 6 మ్యాచ్‌ల్లో 116 పరుగులు, ముంబై ఇండియన్స్ తరఫున 30 మ్యాచ్‌ల్లో 1045 పరుగులు సాధించడం విశేషం.ఇంతకముందు విరాట్ కోహ్లీ చెన్నై సూపర్‌కింగ్స్‌పై 36 మ్యాచ్‌ల్లో 1160 పరుగులు చేశాడు. తాజాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో రోహిత్ 78 పరుగులు చేయడంతో కోహ్లీ రికార్డు బ్రేక్ చేసినట్లయింది. అయితే కోహ్లీ పంజాబ్ కింగ్స్‌పై (36 మ్యాచ్‌ల్లో 1159 పరుగులు), ఢిల్లీ క్యాపిటల్స్‌పై( 32 మ్యాచ్‌ల్లో 1154 పరుగులు) సాధించాడు. అయితే ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ పంజాబ్ లేదా ఢిల్లీతో ఎప్పుడు ఆడినా ఈసారి రోహిత్ శర్మను కోహ్లీ దాటేసి మరోసారి నంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించనున్నాడు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు చేసింది. రహానే (67), రఘువంశీ (51), రింకూ సింగ్ (33 నాటౌట్) రాణించారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా, పాండ్యా ఒక వికెట్ తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రికిల్టన్ (81), రోహిత్ శర్మ (78) దూకుడుతో 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. చదవండి: అందుకే చేజింగ్ మాస్టర్ అనేది! -
ముంబై మెరిసె... నిరీక్షణ ముగిసె...
గత 13 సీజన్లుగా ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయిన ముంబై ఇండియన్స్... ఎట్టకేలకు ఆ అడ్డంకిని అధిగమించింది. 2012 తర్వాత తొలిసారి ముంబై జట్టు విజయంతో ఐపీఎల్ సీజన్‌ను ప్రారంభించింది. వాంఖడే స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన పోరులో బౌలర్ల క్రమశిక్షణకు బ్యాటర్ల దూకుడు తోడవడంతో ముంబై ఘనవిజయం సాధించింది.‘లోకల్ బాయ్’ శార్దుల్ ఠాకూర్ చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయగా... బ్యాటింగ్‌లో రోహిత్, రికెల్టన్ మెరుపులతో హార్దిక్ పాండ్యా బృందం గెలుపు బోణీ కొట్టింది. తాజా సీజన్లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 200కు మించి స్కోరు చేసినా... దానిని కాపాడుకోవడంలో విఫలమైంది. ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్‌ను ముంబై ఇండియన్స్ విజయంతో ప్రారంభించింది. ఆదివారం జరిగిన పోరులో ముంబై 6 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. పచ్చికతో కనిపించిన పిచ్ బౌలర్లకు సహకరిస్తుందనుకుంటే... వాంఖడేలో ఇరు జట్ల బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్నారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు చేసింది. అజింక్య రహానే (40 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా... అంగ్క్రిష్ రఘువంశీ (29 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక అర్ధశతకం చేశాడు. ఫిన్ అలెన్ (17 బంతుల్లో 37; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రింకూ సింగ్ (33 నాటౌట్; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 39 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (43 బంతుల్లో 81; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), రోహిత్ శర్మ (38 బంతుల్లో 78; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో విజృంభించారు. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ముంబైకిదే అత్యధిక లక్ష్య ఛేదన కావడం విశేషం. 10 ఓవర్లలో 120... అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు శుభారంభం దక్కింది. తొలి రెండు ఓవర్లలో 14 పరుగులు రాగా... మూడో ఓవర్ నుంచి మోత మొదలైంది. గజన్ఫర్ బౌలింగ్‌లో అలెన్ 4, 6, 6తో విజృంభించాడు. ఇక హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రహానే, అలెన్ దంచికొట్టారు. తొలి రెండు బంతులకు రహానే సిక్స్‌లు బాదితే... చివరి మూడు బంతులకు అలెన్ ఫోర్లు కొట్టాడు. దీంతో 26 పరుగులు వచ్చాయి. ఫలితంగా 4 ఓవర్లు ముగిసేసరికి నైట్‌రైడర్స్ 57 పరుగులు రాబట్టింది. తదుపరి ఓవర్లో రెండు ఫోర్లు రాగా... చేంజ్ బౌలర్‌గా వచ్చిన శార్దుల్ ఈ జోడీని విడదీశాడు. అయినా రహానే నిలకడగా ఆడటంతో 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 120/2తో నిలిచింది. ఆ తర్వాత ముంబై బౌలర్లు పట్టు బిగించడంతో పరుగుల రాక గగనమైంది. ముంబై కుర్రాడు అంగ్క్రిష్ రఘువంశీ చక్కటి షాట్లు ఆడినా... వైస్ కెప్టెన్ రింకూ సింగ్ ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. దీంతో చివరి 10 ఓవర్లలో కోల్‌కతా 100 పరుగులకు పరిమితమైంది. శార్దుల్ ‘లక్కీ హ్యాండ్’ 2015 నుంచి ఐపీఎల్ ఆడుతున్న శార్దుల్ ఠాకూర్ ఆరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత... ఈ సీజన్లో ముంబై గూటికి చేరాడు. దేశవాళీల్లో ముంబై జట్టుకు సారథ్యం వహించే శార్దుల్... ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో అదరగొట్టాడు. తన తొలి ఓవర్లోనే ప్రమాదకర అలెన్‌ను వెనక్కి పంపిన అతడు... రెండో ఓవర్లో గ్రీన్ (18; 1 ఫోర్, 1 సిక్స్)ను బుట్టలో వేసుకున్నాడు. ధాటిగా ఆడుతున్న రహానేను సైతం అతడే అవుట్ చేసి కోల్‌కతా మరింత భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాడు. అలవోకగా... ఐపీఎల్లో తమ అత్యధిక లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రికెల్టన్ పోటీపడి బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వరుణ్ చక్రవర్తి వేసిన ఐదో ఓవర్లో 4, 6, 4తో రఫ్ఫాడించిన రోహిత్... కార్తీక్ త్యాగీ ఓవర్లో మరో రెండు సిక్స్‌లతో 23 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో ‘హిట్‌మ్యాన్’కు ఇదే వేగవంతమైన అర్ధశతకం. మరో ఎండ్‌లో రికెల్టన్ కూడా దూకుడు కనబర్చడంతో పవర్‌ప్లేలో ముంబై 88 పరుగులు చేసింది. ఈ క్రమంలో రికెల్టన్ 24 బంతుల్లో ‘ఫిఫ్టీ’ఖాతాలో వేసుకున్నాడు. తొలి వికెట్‌కు 11.5 ఓవర్లలో 148 పరుగులు చేశాక రోహిత్ అవుట్ కాగా... ‘ఇంపాక్ట్ ప్లేయర్’ సూర్యకుమార్ యాదవ్ (16; 3 ఫోర్లు) ప్రభావం చూపలేకపోయాడు. రికెల్టన్ దురదృష్టవశాత్తు రనౌట్ కాగా... తిలక్ వర్మ (20; 4 ఫోర్లు), కెప్టెన్ హార్దిక్ (18 నాటౌట్; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేయడంతో ముంబై మరో ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది.కెప్టెన్ కామెంట్చాలా ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్‌లో విజయం సాధించాం. 13 ఏళ్ల అనంతరం సీజన్ ఆరంభ పోరులో గెలవడం ఆనందంగా ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా అనిపించింది. 220 లక్ష్యం పెద్దదేం కాదు. అందుకు తగ్గట్లే రోహిత్, రికెల్టన్ ఆరంభం నుంచే దూకుడు కనబర్చారు. శార్దుల్ ఠాకూర్ నుంచి జట్టు ఇలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. ఇక అతడి కెరీర్ ముగిసే వరకు ముంబై ఇండియన్స్‌తోనే ఉంటాడు. –హార్దిక్ పాండ్యా, ముంబై కెప్టెన్ 221 ఐపీఎల్లో ముంబైకు ఇదే అత్యధిక లక్ష్యఛేదన. 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌పై చేజ్ చేసిన 219 పరుగుల లక్ష్యం రెండో స్థానానికి చేరింది. 200కు పైగా లక్ష్యాన్ని ఛేదించడం ముంబైకిది ఆరోసారి. పంజాబ్ కింగ్స్ ఎనిమిదిసార్లు ఈ ఘనత సాధించింది.గ్రీన్ విఫలం ఐపీఎల్ 19వ సీజన్ వేలంలో భారీ ధర (రూ. 25.20 కోట్లు) పెట్టి కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 18 పరుగులే చేసిన అతడు... బౌలింగ్‌లో ఒక్క ఓవర్ కూడా వేయలేదు. » 2024 టి20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ట్రోఫీ అందించిన తర్వాత ఆడిన ఐపీఎల్లో రోహిత్ శర్మ ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా దర్శనమివ్వగా... ఇప్పుడు తాజా టి20 ప్రపంచకప్ విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ తరఫున ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగాడు. » దక్షిణాఫ్రికా స్టార్ క్వింటన్ డికాక్‌ను కాదని... అదే దేశానికి చెందిన ర్యాన్ రికెల్టన్కు ముంబై తుది జట్టులో చోటు కల్పించగా... అతడు ఐపీఎల్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరుతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. » కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్లు ఫిన్ అలెన్ (న్యూజిలాండ్), ముజరబాని (జింబాబ్వే)తో పాటు ముంబై ఇండియన్స్ ఆటగాడు గజన్ఫర్ (అఫ్గానిస్తాన్) ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్లో అరంగేట్రం చేశారు. » ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ సారథి అజింక్య రహానే కండరాలు పట్టేయడంతో నాలుగో ఓవర్లో అతడు మైదానాన్ని వీడాడు. మిగతా మ్యాచ్‌లో రింకూ సింగ్ జట్టుకు నాయకత్వం వహించాడు. 1161 ఐపీఎల్లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రోహిత్ (కోల్‌కతాపై 1161 పరుగులు) గుర్తింపు పొందాడు. విరాట్ కోహ్లి (పంజాబ్ కింగ్స్‌పై 1159 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. 190 ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన విదేశీ ప్లేయర్‌గా సునీల్ నరైన్ గుర్తింపు పొందాడు. కీరన్ పొలార్డ్ (189 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును నరైన్ సవరించాడు.స్కోరు వివరాలుకోల్కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: రహానే (సి) హార్దిక్ (బి) శార్దుల్ 67; అలెన్ (సి) తిలక్ (బి) శార్దుల్ 37; గ్రీన్ (సి) రూథర్‌ఫోర్డ్ (బి) శార్దుల్ 18; రఘువంశీ (సి) తిలక్ (బి) హార్దిక్ 51; రింకూ (నాటౌట్) 33; రమణ్‌దీప్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 220. వికెట్ల పతనం: 1–69, 2–109, 3–145, 4–205. బౌలింగ్: బౌల్ట్ 4–0–38–0; హార్దిక్ 3–0–39–1; గజన్ఫర్ 4–0–51–0; బుమ్రా 4–0–35–0; శార్దుల్ 4–0–39–3; మార్కండే 1–0–16–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (రనౌట్) 81; రోహిత్ (సి) అనుకూల్ (బి) అరోరా 78; సూర్యకుమార్ (సి) రింకూ (బి) కార్తీక్ 16; తిలక్ (సి) (సబ్) మనీశ్ (బి) నరైన్ 20; హార్దిక్ (నాటౌట్) 18; నమన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–148, 2–179, 3–184, 4–215. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–52–1; ముజరబాని 3–0–34–0; వరుణ్ చక్రవర్తి 4–0–48–0; కార్తీక్ త్యాగి 4–0–43–1; నరైన్ 3–0–30–1; అనుకూల్ రాయ్ 1.1–0–15–0. -
ముంబై ఇండియన్స్ ‘ట్రిపుల్ సెంచరీ’
ముంబై: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా ముంబై ఇండియన్స్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. 300 టి20 మ్యాచ్‌లు ఆడిన తొలి భారతీయ జట్టుగా గుర్తింపు పొందింది. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి (2008) కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ ఐదుసార్లు టైటిల్ సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై జట్టు 2013, 2015, 2017, 2019, 2020లలో విజేతగా నిలిచింది. ఆ తర్వాత ముంబై జట్టు మరోసారి ఐపీఎల్ టైటిల్‌ను సాధించడంలో విఫలమైంది. గత ఏడాది ముంబై జట్టు క్వాలిఫయర్–2లో పంజాబ్ కింగ్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఇక అత్యధిక టి20 మ్యాచ్‌లు ఆడిన జట్ల జాబితాలో పాకిస్తాన్ జాతీయ జట్టు, సోమర్సెట్ కౌంటీ క్రికెట్ క్లబ్ జట్టు 303 మ్యాచ్‌లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. 296 మ్యాచ్‌లతో హాంప్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ నాలుగో స్థానంలో, 287 మ్యాచ్‌లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదో స్థానంలో ఉన్నాయి. -
రోహిత్, రికెల్టన్ విధ్వంసం.. కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్ గెలుపు
ఐపీఎల్ 2026లో భాగంగా కేకేఆర్‌తో ఇవాళ (మార్చి 29) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేయగా.. ముంబై ఇండియన్స్ మరో 5 బంతులు మిగిలుండగానే (19.1 ఓవర్లలో) 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.రోహిత్ శర్మ (38 బంతుల్లో 78; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), ర్యాన్ రికెల్టన్ (43 బంతుల్లో 81; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకాలతో ముంబై గెలుపును ఖరారు చేయగా.. ఆతర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (8 బంతుల్లో 16; 3 ఫోర్లు), తిలక్ వర్మ (14 బంతుల్లో 20; 4 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (11 బంతుల్లో 18 నాటౌట్; 3 ఫోర్లు), నమన్ ధిర్ (2 బంతుల్లో 5 నాటౌట్; ఫోర్) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, సునీల్ నరైన్ తలో వికెట్ తీయగా.. రికెల్టన్ను అనుకూల్ రాయ్ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు.అంతకుముందు రహానే (40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 67 పరుగులు), ఫిన్ అలెన్ (17 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు), అంగ్క్క్రిష్ రఘువంశీ (29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు), రింకూ సింగ్ (21 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 33 నాటౌట్) సత్తా చాటడంతో కేకేఆర్ భారీ స్కోర్ చేసింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో కెమరూన్ గ్రీన్ (18) ఒక్కడే నిరాశపరిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (4-0-39-3), ట్రెంట్ బౌల్ట్ (4-0-38-0) అద్భుతంగా బౌలింగ్ చేయగా..హార్దిక్ పాండ్యా ఓ వికెట్ తీశాడు. -
IPL 2026: రోహిత్ శర్మ ఉగ్రరూపం.. సరికొత్త చరిత్ర
ఐపీఎల్ 2026లో భాగంగా కేకేఆర్‌తో ఇవాళ (మార్చి 29) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చెలరేగిపోతున్నాడు. కేవలం 23 బంతుల్లోనే అర్ద సెంచరీ (3 ఫోర్లు, 5 సిక్సర్లు) పూర్తి చేసి ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ భారీ రికార్డు నెలకొల్పి, చరిత్ర సృష్టించాడు.కేకేఆర్‌తో మ్యాచ్ అంటేనే పూనకం వచ్చినట్లు ఊగిపోయే హిట్‌మ్యాన్, మరోసారి అదే తరహా ప్రదర్శనతో రెచ్చిపోయి, ఐపీఎల్ చరిత్రలో ఈ ఫ్రాంచైజీపై అత్యధిక పరుగులు (36 మ్యాచ్‌ల్లో 1094 పరుగులు, 6 అర్ద సెంచరీలు, ఓ సెంచరీ) చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు డేవిడ్ వార్నర్ (1093 పరుగులు) పేరిట ఉండేది. ఈ జాబితాలో రోహిత్, వార్నర్ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి (1021), శిఖర్ ధవన్ (907), సురేశ్ రైనా (829) ఉన్నారు.ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీఈ మ్యాచ్‌లో రోహిత్ చేసిన 23 బంతుల హాఫ్ సెంచరీ, ఐపీఎల్లో అతనికి వేగవంతమైందిగా నిలుస్తుంది. అతని గత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ 25 బంతుల్లో వచ్చింది. 2015 ఎడిషన్ ఫైనల్లో సీఎస్కేపై ఈ ఫీట్ సాధించాడు.మరో మైలురాయిఈ హాఫ్ సెంచరీతో రోహిత్ ఐపీఎల్లో మరో మైలురాయిని తాకాడు. ఈ హాఫ్ సెంచరీ అతనికి ఐపీఎల్లో 50వది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతని కంటే ముందు విరాట్ కోహ్లి (72), డేవిడ్ వార్నర్ (66), శిఖర్ ధవన్ (53) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. కేకేఆర్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ దూసుకుపోతుంది. 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 110 పరుగులు చేసి, లక్ష్యానికి మరో 111 పరుగుల దూరంలో ఉంది. రోహిత్ శర్మ (59), రికెల్టన్ (50) అర్ద సెంచరీలు పూర్తి చేసి ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు.అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. రహానే (67), రఘువంశీ (51) అర్ద సెంచరీలతో రాణించగా.. రింకూ సింగ్ (33 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో ఫిన్ అలెన్ (37) సైతం మెరుపులు మెరిపించాడు. భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న కెమరూన్ గ్రీన్ (18) దారుణంగా విఫలం కాగా.. రమన్‌దీప్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (4-0-39-3), ట్రెంట్ బౌల్ట్ (4-0-38-0) అద్భుతంగా బౌలింగ్ చేయగా..హార్దిక్ పాండ్యా ఓ వికెట్ తీశాడు. -
IPL 2026: రెచ్చిపోయిన రహానే.. కేకేఆర్ భారీ స్కోర్
ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మార్చి 29) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ భారీ స్కోర్ చేసింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.రెచ్చిపోయిన రహానేకేకేఆర్ కెప్టెన్ రహానే లేటు వయసులో రెచ్చిపోయి, కేకేఆర్‌కు మెరుపు ఆరంభాన్ని అందించాడు. కేవంల 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతను.. మొత్తంగా 40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేశాడు. రహానేకు జతగా ఓపెనింగ్ చేసిన ఫిన్ అలెన్ కూడా చెలరేగిపోయాడు. కేవలం 17 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు.25 కోట్ల ప్లేయర్ అట్టర్ ప్లాప్ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచిన కెమరూన్ గ్రీన్ దారుణంగా విఫలమయ్యాడు. అలెన్ ఔటయ్యాక వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన గ్రీన్.. 10 బంతుల్లో బౌండరీ, సిక్సర్ సాయంతో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సీజన్ వేలంలో కేకేఆర్ గ్రీన్‌ను రూ. 25.20 కోట్ల భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది.రాణించిన రఘువంశీగ్రీన్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన అంగ్క్క్రిష్ రఘువంశీ ఆరంభంలో కాస్త నిదానంగా ఆడినా, ఆతర్వాత బ్యాట్ ఝులిపించాడు. 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. రఘువంశీ మెరుపుల కారణంగానే కేకేఆర్ 200 పరుగుల మార్కును దాటగలిగింది.పర్వాలేదనిపించిన రింకూ ఇన్నింగ్స్ చివర్లో బరిలోకి దిగిన రింకూ సింగ్ తన సహజ శైలిలో మెరుపు బ్యాటింగ్ చేయనప్పటికీ పర్వాలేదనిపించాడు. 21 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 33 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (4-0-39-3), ట్రెంట్ బౌల్ట్ (4-0-38-0) అద్భుతంగా బౌలింగ్ చేయగా..హార్దిక్ పాండ్యా ఓ వికెట్ తీశాడు. -
కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం
221 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ (38 బంతుల్లో 78; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), ర్యాన్ రికెల్టన్ (43 బంతుల్లో 81; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకాలతో ముంబై గెలుపును ఖరారు చేశారు. అంతకుముందు రహానే (40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 67 పరుగులు), ఫిన్ అలెన్ (17 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు), అంగ్క్క్రిష్ రఘువంశీ (29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు), రింకూ సింగ్ (21 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 33 నాటౌట్) సత్తా చాటడంతో కేకేఆర్ భారీ స్కోర్ చేసింది.రికెల్టన్ (81) ఔట్15.2వ ఓవర్- 184 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. అనుకూల్ రాయ్ అద్భుతమైన త్రో వేయడంతో ర్యాన్ రికెల్టన్ (81) ఔటయ్యాడు.సూర్యకుమార్ యాదవ్ (16) ఔట్14.2వ ఓవర్-179 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో రింకూ సింగ్ క్యాచ్ పట్టడంతో సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యాడు. రోహిత్ శర్మ 78 (38) ఔట్11.5వ ఓవర్- 148 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. వైభవ్ అరోరా బౌలింగ్‌లో అనుకూల్ రాయ్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ ఔటయ్యాడు. రికెల్టన్కు (67) జతగా సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లోకి వచ్చాడు.లక్ష్యం దిశగా దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్కేకేఆర్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ దూసుకుపోతుంది. 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 110 పరుగులు చేసి, లక్ష్యానికి మరో 111 పరుగుల దూరంలో ఉంది. రోహిత్ శర్మ (59), రికెల్టన్ (50) అర్ద సెంచరీలు పూర్తి చేసి ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు.ముంబై ఇండియన్స్ టార్గెట్ ఎంతంటే..?టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. రహానే (67), రఘువంశీ (51) అర్ద సెంచరీలతో రాణించగా.. రింకూ సింగ్ (33 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో ఫిన్ అలెన్ (37) సైతం మెరుపులు మెరిపించాడు. భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న కెమరూన్ గ్రీన్ (18) దారుణంగా విఫలం కాగా.. రమన్‌దీప్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (4-0-39-3), ట్రెంట్ బౌల్ట్ (4-0-38-0) అద్భుతంగా బౌలింగ్ చేయగా..హార్దిక్ పాండ్యా ఓ వికెట్ తీశాడు.నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్18.3వ ఓవర్- 205 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి రఘువంశీ (51) ఔటయ్యాడు. రహానే (67) ఔట్13.3వ ఓవర్- 146 పరుగుల వద్ద కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో హార్దిక్‌కు క్యాచ్ ఇచ్చి రహానే (67) ఔటయ్యాడు. రఘువంశీకి (17) జతగా రింకూ సింగ్ క్రీజ్‌లోకి వచ్చాడు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. గ్రీన్ ఔట్8.5 ఓవర్- 109 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో రూథర్‌ఫోర్డ్‌కు క్యాచ్ ఇచ్చి కెమరూన్ గ్రీన్ (18) ఔటయ్యాడు. రహానేకు (49) జతగా రఘువంశీ క్రీజ్‌లోకి వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్5.2 ఓవర్- 69 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ఫిన్ అలెన్ (37) ఔటయ్యాడు. రహానేకు (28) జతగా గ్రీన్ క్రీజ్‌లోకి వచ్చాడు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (మార్చి 29) జరుగుతున్న ఐపీఎల్ 2026 రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లు..ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్‌కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, AM ఘజన్ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాకేకేఆర్: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ -
తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించనున్న ముంబై ఇండియన్స్
ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. ఆదివారం వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ ముంబై తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు ఒక అద్భుతమైన మైలు రాయిని అందుకోనుంది. ముంబై జట్టుకు ఇది 300వ టీ20 మ్యాచ్ కావడం గమానర్హం. తద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో 300 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీగా ముంబై సరికొత్త రికార్డు సృష్టించనుంది.కాగా ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో తమకంటూ కొన్ని ప్రత్యేక పేజీలను లిఖించుకుంది. ముంబై జట్టు ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు ఐదు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచింది. తద్వారా అత్యధిక సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టుగా సీఎస్కేతో కలిసి సంయుక్తంగా ముంబై అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన 299 మ్యాచ్‌లలో 162 విజయాలు నమోదు చేసింది. ఓవవరాల్‌గా అత్యధిక టీ20లు ఆడిన జాబితాలో ముంబై ఇండియన్స్ మూడో స్ధానంలో నిలిచింది. మొదటి స్దానంలో పాకిస్తాన్(303) ఉండగా, రెండో సోమర్సెట్(303) కొనసాగుతోంది.అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన టాప్-5 ఐపీఎల్ జట్లుముంబై ఇండియన్స్-299రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-287కోల్‌కతా నైట్‌రైడర్స్-281చెన్నై సూపర్ కింగ్స్-277ఢిల్లీ క్యాపిటల్స్-274చదవండి: SA vs NZ: ఉత్కంఠ పోరు.. చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిచిన సౌతాఫ్రికా -
ఫేవరెట్‌గా ముంబై.. భయం గుప్పిట్లో కేకేఆర్!
ఐపీఎల్ 19వ సీజన్లో ఇవాళ ముంబై ఇండియన్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా ముంబై కనిపిస్తున్నప్పటికీ కేకేఆర్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. కానీ రెండు జట్లలో కేకేఆర్‌పై ఒత్తిడి కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే ముంబైని వారి సొంత గ్రౌండ్లో కేకేఆర్ ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే ఓడించగలిగింది. వాంఖడేలో ఇరు జట్ల మధ్య 12 మ్యాచ్‌లు జరిగితే 10 సార్లు ముంబై విజయం సాధించడం విశేషం. అయితే ఈసారి దానిని తిరగరాసి విజయంతో సీజన్‌ను ఆరంభించాలని కేకేఆర్ ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు ముంబై టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతున్నప్పటికీ, దాదాపు ప్రతీ ఐపీఎల్ సీజన్‌ను ముంబై ఓటమితోనే ప్రారంభించిన దాఖలాలున్నాయి. మరి ఈసారి తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించి దానికి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. ముంబై ఇండియన్స్ ఐదుసార్లు (2013, 2015, 2017, 2019, 2020) చాంపియన్స్‌గా నిలిచింది. 2020లో చివరిసారి ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై అప్పటినుంచి ఆరో టైటిల్ కోసం నిరీక్షిస్తూనే వస్తోంది. మూడుసార్లు (2012, 2014, 2024) ఐపీఎల్ విజేతగా నిలిచిన కేకేఆర్ మరో టైటిల్ కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. 2008 ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి చూసుకుంటే ఇప్పటిరవరకు 35 సార్లు తలపడగా ముంబై 24 సార్లు నెగ్గితే, కేకేఆర్ 11 సార్లు విజయం సాధించింది. బలబలాల విషయానికొస్తే.. కేకేఆర్‌తో పోలిస్తే ముంబై బ్యాటింగ్ లైనప్ కాస్త బలంగా ఉంది. ఇటీవలే టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలోని నలుగురు (పాండ్యా, సూర్యకుమార్, తిలక్ వర్మ, బుమ్రా) ముంబై జట్టులో ఉండడం బలమని చెప్పొచ్చు. వీరితో సహా రూథర్‌ఫోర్డ్, రికిల్టన్లతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్లుగా మయాంక్ లేదా శార్ధూల్ కూడా కీలకం కానున్నారు. బౌలింగ్‌లో బుమ్రా మరోసారి కీలకం కానుండగా, కివీస్ మాజీ బౌలర్ బౌల్ట్ కూడా ప్రమాదకారే.ఇక కేకేఆర్ బ్యాటింగ్ విషయానికొస్తే రహానే, సునీల్ నరైన్, సీఫెర్ట్, రఘువంశీ, రింకూ సింగ్‌తో పాటు ఆల్‌రౌండర్లు రమణ్‌దీప్, కామెరున్ గ్రీన్‌లు కీలకం కానున్నారు. బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, ముజరబానీ కీలకం. కేకేఆర్‌పై రోహిత్ శర్మ 127 స్ట్రైక్‌రేట్‌తో 967 పరుగులు సాధించగా, సునీల్ నరైన్ ముంబైతో ఆడిన మ్యాచ్‌ల్లో 26 వికెట్లు పడగొట్టాడు.ముంబై తుది జట్టు అంచనా: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, రియాన్ రికిల్టన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్, రూథర్‌ఫోర్డ్, నమన్ ధిర్, గజన్ఫర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రాఇంపాక్ట్ ప్లేయర్లు: మయాంక్ మార్కండే/ శార్దూల్ ఠాకూర్కేకేఆర్ తుది జట్టు అంచనా: అజింక్యా రహానే (కెప్టెన్), సునీల్ నరైన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్‌కీపర్)/ ఫిన్ అలెన్, కామెరున్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, ముజరబానీఇంపాక్ట్ ప్లేయర్స్: రాహుల్ త్రిపాఠి/ కార్తిక్ త్యాగి చదవండి: ‘బౌలర్ల వైఫల్యం మా కొంపముంచింది’ -
ముంబై ఇండియన్స్‌కు ఓ గుడ్ న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్
ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ అందింది. మొన్నటివరకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి ముంబై జట్టులో చేరాడు. వాంఖడే స్టేడియంలో ముంబై ట్రైనింగ్ క్యాంపులో బుమ్రా కన్పించకపోవడంతో ఏమైనా గాయపడ్డాడా? అన్న అనుమానాలు తలెత్తాయి.కానీ బుమ్రా ఇప్పుడు జట్టుతో చేరి ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాడు. మార్చి 29న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగనున్న ముంబై తొలి మ్యాచ్‌లో బుమ్రా బరిలోకి దిగనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు కీలక ఆటగాళ్లు విల్ జాక్స్, మిచెల్ శాంట్నర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ను పూర్తి చేసుకున్న శాంట్నర్ ఇంకా న్యూజిలాండ్‌లోనే ఉన్నాడు.మరోవైపు టీ20 ప్రపంచకప్-2026లో నాలుగు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న విల్ జాక్స్ కూడా ఇంకా ముంబై జట్టుతో చేరలేదు. దీంతో తుది జట్టులో కరేబియన్ ఆల్‌రౌండర్ షేర్ఫన్ 4 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకుని ఫామ్‌లో ఉన్నాడు. అతడి స్థానంలో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.తొలి మ్యాచ్‌లో ముంబై గెలుస్తుందా?కాగా ముంబై ఇండియన్స్‌కు తొలి మ్యాచ్ గండం పొంచి ఉంది. 2012 నుండి ఇప్పటివరకు ఆ జట్టు సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేదు. ఈసారి ఎలాగైనా గెలిచి ఈసెంటిమెంట్‌ను బ్రేక్ చేయాలని ముంబై భావిస్తోంది. బుమ్రా, సూర్యకుమార్, హార్దిక్, రోహిత్ వంటి స్టార్ ఆటగాళ్లతో ముంబై ఇండియన్స్ పటిష్టంగా కన్పిస్తోంది.చదవండి: పెళ్లిపీటలెక్కనున్న కావ్య మారన్? -
అసలు నిన్ను గుర్తుపట్టనే లేదు: షాకైన నీతా అంబానీ
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ గత కొంతకాలంగా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. అంతర్జాతీయ క్రికెట్లో మరికొంతకాలం కెరీర్ పొడిగించుకునే క్రమంలో ఇప్పటికే దాదాపు పది కిలోల బరువు తగ్గాడు. అంతటితో ఆగకుండా మరింత సన్నబడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.స్లిమ్‌గా మారిన రోహిత్ శర్మ ఈ క్రమంలో మునుపటి కంటే మరింత స్లిమ్‌గా మారిన రోహిత్ శర్మ లుక్ (Rohit Sharma Transformation) చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ సహ యజమాని నీతా అంబానీ సైతం రోహిత్లో వచ్చిన మార్పు చూసి ఫిదా అయ్యారు. కాగా ఐపీఎల్-2026 టోర్నీకి శనివారం తెరలేవనున్న సంగతి తెలిసిందే.బెంగళూరు వేదికగా ఆర్సీబీ- సన్‌రైజర్స్ (RCB vs SRH) మ్యాచ్‌తో టోర్నీ మొదలుకానుండగా.. మార్చి 29న ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఎదుర్కోనుంది. ఈ క్రమంలో వాంఖడేలో ముంబై ఇండియన్స్ జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా.. నీతా అంబానీ వచ్చి ఆటగాళ్లను పలకరించారు.నేనసలు నిన్ను గుర్తుపట్టనే లేదుఈ సందర్భంగా ముంబై కోచింగ్ సిబ్బంది, ఆటగాళ్లతో కరచాలనం చేసిన ఆమె.. రోహిత్ శర్మను చూసి షాకయ్యారు. ‘‘ఓరి దేవుడా!.. రోహిత్ నేనసలు నిన్ను గుర్తుపట్టనే లేదు. నువ్వు కుర్రాడిలా కనిపిస్తున్నావు’’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందుకు రోహిత్ నవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వన్డేలలో కొనసాగుతున్న రోహిత్కాగా 38 ఏళ్ల రోహిత్ శర్మ ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికాడు. వన్డే వరల్డ్‌కప్-2027లొ టీమిండియాకు ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. కెప్టెన్ హోదాలో భారత్‌కు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను రోహిత్ అందించాడు. అయితే, చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత బీసీసీఐ అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. దీంతో ఆటగాడిగా జట్టులో కొనసాగుతున్నాడు రోహిత్. కాగా ముంబైకి ఐదుసార్లు టైటిల్ అందించిన దిగ్గజ కెప్టెన్ రోహిత్.. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా సారథ్యంలో జట్టులో కొనసాగుతున్నాడు.చదవండి: IPL 2026: కుర్ర క్రికెటర్లపైనే అందరి దృష్టి!Mrs. Nita Ambani met the squad during training ahead of the start of TATA IPL 2026! 💙 pic.twitter.com/r2Gy9NaDOc— Mumbai Indians (@mipaltan) March 27, 2026 -
బుమ్రా స్థానంలో ఆకాశ్ మధ్వాల్!
ఐపీఎల్ 2026 సీజన్ ఇవాళ షురూ కానుంది. మండు వేసవిలో రెండు నెలల పాటు సాగనున్న క్రికెట్ వినోదం అభిమానుల్లో జోష్ నింపింది. అయితే ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ 2020 తర్వాత మళ్లీ ఆ స్థాయి ఆటను ప్రదర్శించడంలో విఫలమవుతూ వస్తోంది. ఈసారి కప్ కొట్టాలనే బలమైన సంకల్పంతో బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో మార్చి 30న ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో ఆడనుంది. ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఇంకా జట్టుతో చేరలేదు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను బుమ్రా శుక్రవారం సందర్శించాడు. ఆ తర్వాత బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో మెడికల్‌స్టాఫ్ పర్యవేక్షణలో బుమ్రా బౌలింగ్ సాధన చేశాడు. దీంతో కేకేఆర్‌తో జరగబోయే మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ బుమ్రా కేకేఆర్‌తో మ్యాచ్‌కు దూరమైతే మాత్రం ఆకాశ్ మధ్వాల్ ముంబై తుది జట్టులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఐపీఎల్ మినీ వేలంలో ఆకాశ్ మధ్వాల్‌ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. కానీ శుక్రవారం రాత్రి మాత్రం ముంబై జట్టుకు నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు. ఇదే సమయంలో రోహిత్ శర్మ అక్కడికి రావడం, రోహిత్‌ను చూసిన ఆకాశ్ మధ్వాల్ రెండు చేతులు జోడించి దండం పెట్టడం కనిపించింది. దీనికి బదులుగా రోహిత్ అతన్ని హగ్ చేసుకొని ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ప్రస్తుతానికి నెట్ బౌలర్‌గా ఉన్న ఆకాశ్ మధ్వాల్ కచ్చితంగా బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడానికే ముంబై యాజమాన్యం అతన్ని తీసుకొచ్చిందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే మరో బౌలర్ అథర్వ అంకోలేకర్ కూడా దూరమవ్వడంతో ముంబై జట్టుకు ఇబ్బంది ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ మధ్వాల్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆకాశ్ మధ్వాల్ గతంలో (2023, 2024 సీజన్లు) ఇదే ముంబై ఇండియన్స్ తరఫున 13 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. అయితే 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఐదు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయడం ద్వారా ఆకాశ్ మధ్వాల్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత సీజన్‌కు రాజస్థాన్ రాయల్స్ ఆకాశ్‌ను జట్టులోకి తీసుకుంది. 2025 సీజన్లో ఆకాశ్ రాజస్థాన్ తరఫున నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత రాజస్థాన్ జట్టు విడుదల చేయగా ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు జరిగిన మినీ వేలంలో ఆకాశ్ మధ్వాల్ అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు.చదవండి: గాయాలతో సతమతం.. ఆటకు గుడ్‌బైWe are sure you were not expecting this meet up 🥹💙 pic.twitter.com/MBbC2wMEAT— Mumbai Indians (@mipaltan) March 27, 2026 -
హార్దిక్ పాండ్యా మంచి మనసు.. ఆ 11 మందికి?
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్, భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన మంచి మనసును చాటుకున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలోని గ్రౌండ్ స్టాఫ్ ఒక్కొక్కరికి రూ.10,000 రూపాయల రివార్డును అందజేశాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026కు ముందు హార్దిక్ పాండ్యా వాంఖడే స్టేడియంలో తీవ్రంగా శ్రమించాడు. ఆ సమయంలో గ్రౌండ్ స్టాఫ్ తమ పనివేళల కంటే అదనంగా శ్రమించి హార్దిక్ ప్రాక్టీస్‌కు సహకరించారు. దీంతో వారందరికీ నగదు బహుమతి ఇస్తానని పాండ్యా మాటిచ్చాడు.ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం హార్దిక్ వారిని వ్యక్తిగతంగా కలిసి మొత్తం 11 మందికి చెక్కులను అందజేశాడు. అయితే తొలుత ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు ఇచ్చారని ప్రచారం జరిగినప్పటికీ, వాస్తవానికి అది రూ. 10,000 మాత్రమే అని తేలింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో గ్రౌండ్ స్టాప్ కష్టాన్ని గుర్తించింనందుకు పాండ్యాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇక టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన హార్దిక్.. ఇప్పుడు ఐపీఎల్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. ముంబై ఇండియన్స్ జట్టును పాండ్యా నడిపించనున్నాడు. ముంబై తమ తొలి మ్యాచ్‌లో మార్చి 29 వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.చదవండి: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఆ సిరీస్‌తో ఎంట్రీ? -
బుమ్రాకు సంబంధించి బిగ్ న్యూస్
ఐపీఎల్ 2026 ప్రారంభానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండగా.. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సంబంధించిన ఓ విషయం అభిమానులను తెగ కంగారు పెట్టింది. ఇటీవల బుమ్రా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు (CoE) వెళ్లగా.. అతనికి గాయమైందేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందారు. తాజాగా అలాంటిదేమీ లేదని తేలడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. బుమ్రా కేవలం ఫిట్నెస్ చెక్ కోసమే CoEకి వెళ్లాడని కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం బుమ్రా పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడని, తొలి మ్యాచ్ నుంచే అందుబాటులో ఉంటాడని స్పష్టమైంది.కాగా, ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుండగా.. ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను ఆ మరుసటి రోజు (మార్చి 29) ఆడనుంది. వాంఖడేలో జరిగే మ్యాచ్‌లో ఎంఐ.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.ఇదిలా ఉంటే, గత సీజన్లో ముంబై ఇండియన్స్ ఆదిలో వరుస పరాజయాలు ఎదుర్కొన్నా, ఆఖరి మ్యాచ్‌ల్లో అనూహ్యంగా పుంజుకొని ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది (నాలుగో స్థానం). అయితే క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ చేతుల్లో ఓడి లీగ్ నుంచి నిష్క్రమించింది. బుమ్రా రాకతో మారిన ఫేట్గత ఎడిషన్‌లో బుమ్రా తొలి నాలుగు మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడం ముంబై ఇండియన్స్‌ను చాలా ప్రభావితం చేసింది. బుమ్రా రాకతో ఎంఐ తిరిగి గాడిలో పడి క్వాలిఫయర్-2 వరకు చేరింది. ఆ సీజన్లో బుమ్రా 12 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసి ముంబై ఇండియన్స్‌కు జీవం పోశాడు. ఊరిస్తున్న ఆరో టైటిల్తాజాగా బుమ్రా భారత్ తరఫున టీ20 వరల్డ్‌కప్‌లోనూ అద్భుత ప్రదర్శనలు చేసి జోరుమీదున్నాడు. బుమ్రా ఫామ్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు ఆరో ఐపీఎల్ ట్రోఫీని ఊరిస్తుంది. బుమ్రా తన సామర్థ్యం మేరకు రాణించగలిగితే ఈ సీజన్లోనూ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు తప్పక చేరుతుంది. ఉరకలేస్తుంది..!ఈ సీజన్లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్ యువకులు, అనుభవజ్ఞులతో ఉరకలేస్తుంది. తాజాగా భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ యాదవ్, ఆ జట్టులో సభ్యులైన తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా ఇదే జట్టులో ఉన్నారు. వీరికి వెటరన్ డాషింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ కూడా తోడున్నాడు. వారి ప్రదర్శనల కోసం ఎదురుచూపు..!వీరు కాకుండా ఈ సీజన్‌తోనే ముంబై ఇండియన్స్ పంచన చేరిన షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, విల్ జాక్స్ లాంటి భారీ హిట్టర్ల ప్రదర్శనల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
ముంబై తుది జట్టు ఇదే.. విధ్వంసకర ఆటగాడికి నో ఛాన్స్?
ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ కోసం సిద్దమవుతోంది. గత సీజన్లో ఫైనల్‌కు చేరుకుండానే ఇంటిముఖం పట్టిన ముంబై ఇండియన్స్.. ఈసారి ఎలాగైనా ఛాంపియన్‌గా నిలవాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై జట్టు వాంఖడే స్టేడియంలో తీవ్రంగా శ్రమిస్తోంది.అయితే ముంబై శిక్షణ శిబిరంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంకా చేరకపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే తొలి మ్యాచ్ సమయానికి మాత్రం బుమ్రా అందుబాటులో ఉంటాడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 29న వాంఖడే స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తుది జట్టును భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ఎంచుకున్నాడు.ఓపెనర్లగా రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్‌లకు అతడు అవకాశమిచ్చాడు. అదేవిధంగా ఫస్ట్ డౌన్లో సూర్యకుమార్ యాదవ్, తర్వాతి ఆర్డర్లో తిలక్ వర్మకు చోటు దక్కింది. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో విల్ జాక్స్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంట్నర్‌లను బద్రీనాథ్ ఎంపిక చేశాడు. ఫినిషర్‌గా నమన్ ధీర్‌కు ఛాన్స్ లభించింది.ఇక ఫాస్ట్ బౌలర్లగా దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా,ట్రెంట్ బౌల్ట్ త్రయంతో బద్రీనాథ్ వెళ్లాడు. అయితే ఈ జట్టులో వెస్టిండీస్ హిట్టర్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌కు మాత్రం అతడు అవకాశం ఇవ్వలేదు. రూథర్‌ఫోర్డ్ ట్రేడ్ రూపంలో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు వచ్చాడు. అతడు ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. జాతీయ జట్టుతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో కూడా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు.బద్రీనాథ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ తుది జట్టు ఇదేరోహిత్ శర్మ, క్వింటన్ డి కాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా -
జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది?
ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు భారత పేస్ గుర్రం, ముంబై ఇండియన్స్ స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడా? అంటే అవునానే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆరంభానికి ఇంకా కేవలం ఐదు రోజులు మాత్రమే ఉన్నప్పటికి బుమ్రా ఇంకా ముంబై ఇండియన్స్ శిబిరంలో చేరలేదు.టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆటగాళ్లు గాయపడినప్పుడు లేదా ఫిట్నెస్ పరీక్షల కోసం మాత్రమే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్తారు. కానీ బుమ్రా ఇప్పుడు సీఓఈకు ఏదైనా గాయం వల్ల లేదా సాధారణ చెకప్ కోసమా వెళ్లాడా అన్నది ఇంకా స్పష్టత లేదు.ముంబై ఇండియన్స్ నుంచి కూడా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్దనే ఇటీవల మాట్లాడుతూ.. ప్రపంచ కప్ ఆడిన ఆటగాళ్లందరికీ తగినంత విరామం ఇచ్చామని, వారందరూ మార్చి 22 నాటికి జట్టుతో చేరుతారని చెప్పాడు.కానీ బుమ్రా మాత్రం ఇంకా ప్రాక్టీస్ సెషన్లకు హాజరుకాలేదు. ప్రస్తుతం ఇదే విషయం క్రికెట్ వర్గాల్లో చర్చానీయాంశమైంది. ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 29న వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్కు గుడ్ న్యూస్.. యార్కర్ల కింగ్ వచ్చేస్తున్నాడు -
పాండ్యా కెప్టెన్సీ వదులుకోవాలి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌ది ఘనమైన చరిత్ర. ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిల్స్ కొల్లగొట్టిన ముంబై ఇండియన్స్‌కు అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుంది. 2020లో చివరిసారి చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ అప్పటినుంచి మరోసారి టైటిల్ గెలవలేకపోయింది. నాలుగేళ్లలో మూడుసార్లు లీగ్ దశకే (2021, 2022, 2024) పరిమితమైన ముంబై 2023, 2025 సీజన్లో మాత్రం ప్లేఆఫ్స్ చేరింది. కానీ ఆరోసారి టైటిల్ మాత్రం గెలుచుకోలేకపోయింది. ముంబై టైటిల్ గెలిచిన ఐదుసార్లు కెప్టెన్‌గా రోహిత్ శర్మనే ఉన్నాడు. టీమిండియా కెప్టెన్‌గా విజయవంతమైన హిట్‌మ్యాన్ ఐపీఎల్‌లోనూ నాయకుడిగా అదే తరహా విజయాన్ని అందుకున్నాడు. అయితే 2024లో గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌లో చేరాడు. పాండ్యాకు బాధ్యతలు..ఆ సీజన్లో రోహిత్‌ను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించి పాండ్యాను కెప్టెన్ చేశారు. అప్పట్లో రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అభిమానుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. మైదానంలోనే హార్దిక్ పాండ్యాను గేలి చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. దీనికి తోడు ముంబై ఇండియన్స్ 2024 సీజన్లో వరుస పరాజయాలతో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. పెరిగిన విమర్శలు..దీంతో పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు పెరిగిపోయాయి. అయితే 2025 సీజన్లో ముంబై పరిస్థితి కాస్త కుదుటపడింది. పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరుకుంది. అయితే ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు కూడా మరోసారి కెప్టెన్సీ విషయంలో ముంబై అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేశారు. పాండ్యా స్థానంలో సూర్యకుమార్ లేదా రోహిత్ శర్మకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ బ్యాటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ముంబై ఇండియన్స్కెప్టెన్సీ విషయమై కీలక వ్యాఖ్యలు చేశాడు. పాండ్యా తన కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకుమార్‌కు అప్పగిస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. ‘కెప్టెన్సీ మార్పుతోనే ముంబై ఇండియన్స్ గాడిన పడుతుందేమో. కెప్టెన్సీ విషయంలో జట్టు యాజమాన్యం రోహిత్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యాలతో కలిసి ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తే బాగుంటుంది. నిజానికి పాండ్యా మంచి కెప్టెనే కావొచ్చు.. కానీ జట్టులో భారత్‌కు రెండు టీ20 ప్రపంచకప్‌లు అందించిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లు ఉన్నారు. నాయకత్వ మార్పు జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాబట్టి ముంబై యాజమాన్యం ఈ విషయంపై మరోసారి ఆలోచించాలి. కెప్టెన్ మారితే జట్టు అదృష్టం మారే అవకాశం లేకపోలేదు. అందుకే సూర్యకుమార్‌కు పాండ్యా స్వచ్ఛందంగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది.సూర్య అయితే బాగుంటుంది..అయితే కెప్టెన్ ఎవరనే అంతిమ నిర్ణయం ఫ్రాంచైజీదే. పాండ్యాను కాదనుకుంటే సూర్యకుమార్‌కు బాధ్యతలు అప్పగించొచ్చు. కానీ అది ముంబై ఇండియన్స్ అంతర్గత వ్యవహారం. కాబట్టి వాళ్లంతా కలిసి కూర్చోని మాట్లాడుకొని సమస్యకు ముగింపు పలకాలి. నా వరకు సూర్యకుమార్ కెప్టెన్‌గా జట్టును సమర్థంగా నడిపించగలడు’ అని చెప్పుకొచ్చాడు. ఇటీవలే టీమిండియాకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ అందించాడు. దీంతో హార్దిక్‌పాండ్యా స్వచ్ఛందంగా కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకుమార్‌కు అప్పగించాలని బీసీసీఐ మాజీ సెలెక్టర్లు కూడా పిలుపునిచ్చారు. ఇక ఐపీఎల్ 19వ సీజన్లో ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 29న కేకేఆర్‌తో ఆడనుంది.చదవండి: పీఎస్ఎల్ద్దు.. ఐపీఎల్ ముద్దు! -
ముంబై మురిపించేనా!
ఎనిమిదేళ్ల వ్యవధిలో ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచి సంచలనం సృష్టించిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమవుతోంది. గత ఐదు సీజన్లలో కనీసం ఒక్కసారీ ఫైనల్ చేరలేకపోయిన హార్దిక్ పాండ్యా బృందం... ఆరో టైటిల్ వేటకు సిద్ధమైంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్, తిలక్ వర్మ, డికాక్, సాంట్నర్, బౌల్ట్, బుమ్రా ఇలా జట్టు మొత్తం స్టార్లతో నిండి ఉండగా... వీరంతా కలిసికట్టుగా కదంతొక్కాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఇటీవల టీమిండియా టి20 ప్రపంచకప్ నిలబెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా, సూర్యకుమార్, హార్దిక్, తిలక్ ఫుల్‌ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ బలాబలాలను పరిశీలిస్తే... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక టైటిల్స్ సాధించిన రెండు జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ గత ఐదేళ్లుగా ట్రోఫీ కోసం పరితపిస్తోంది. క్షణాల్లో మ్యాచ్‌ను మలుపు తిప్పగల స్టార్లు... బంతిని అదే పనిగా బౌండరీకి తరలించగల హిట్టర్లు... రెప్పపాటులో వికెట్లను పడగొట్టగల బౌలర్లు... ఇలా జట్టులో అన్నీ ఉన్నా ఆరో టైటిల్ మాత్రం దరిచేరడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో వివిధ జట్లకు సారథ్యం వహించిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, సాంట్నర్ ఇలా నాయకులతో నిండి ఉన్న జట్టును ఈ సీజన్లో హార్దిక్ ఎలా నడిపిస్తాడనేది కీలకం. లీగ్ ఆరంభం నుంచే సచిన్, పాంటింగ్ వంటి స్టార్ ఆటగాళ్లతో నిండి ఉన్న ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ 2013లో తొలిసారి ట్రోఫీ అందించాడు... ఆ తర్వాత అతడి సారథ్యంలోనే 2015, 2017, 2019, 2020లో ముంబై జట్టు విజేతగా నిలిచింది. కానీ అక్కడి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయిన ముంబై... ఈ సీజన్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాలని భావిస్తోంది. ప్లేయర్లను తీర్చిదిద్దడంలో మంచి అనుభవమున్న ముంబై ఫ్రాంచైజీ... 2026 వేలంలో దక్షిణాఫ్రికా విధ్వంసక ఓపెనర్ డికాక్, విండీస్ హిట్టర్ రూథర్‌ఫర్డ్‌ను అతి తక్కువ ధరకే దక్కించుకుంది. హెడ్ కోచ్ జయవర్ధనే ఈ ఇద్దరి సేవలను ఎలా వినియోగించుకుంటాడనేది ఆసక్తికరం. రోహిత్ ‘ఇంపాక్ట్ ప్లేయర్’గానే... ముంబై జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. వన్డేల్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘హిట్‌మ్యాన్’ ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించాడు. రోహిత్‌తో కలిసి డికాక్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా... తిలక్‌వర్మ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, నమన్లతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్‌ను ప్రత్యర్థి నుంచి లాగేసుకోవడంలో వీరికి అపార అనుభవం ఉంది. బ్యాటింగ్ ఆర్డర్లో ఒక్క డికాక్ మినహా మిగిలిన వాళ్లంతా భారత ఆటగాళ్లే కావడంతో... విదేశీ ఆటగాళ్ల సేవలను వినియోగించుకునే విషయంలో ఫ్రాంచైజీకి మంచి వెసులుబాటు ఉంది. ఈ కోటాలో డికాక్, రికెల్టన్, రూథర్‌ఫర్డ్, సాంట్నర్, విల్ జాక్స్, బాష్, ట్రెంట్ బౌల్ట్, ఘజన్ఫర్ అందుబాటులో ఉండగా... డికాక్, జాక్స్, సాంట్నర్, బౌల్ట్ తుదిజట్టులో ఉండటం ఖాయమే. పరిస్థితులను బట్టి రూథర్‌ఫర్డ్, ఘజన్‌ఫర్‌ను పరిశీలించవచ్చు. బుమ్రాపైనే భారం... టీమిండియా వరుసగా రెండోసారి టి20 ప్రపంచకప్ కైవసం చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన బుమ్రాపైనే ముంబై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్‌గా మన్ననలు అందుకుంటున్న అతడు స్థాయికి తగ్గట్లు రాణిస్తే జట్టుకు తిరుగుండదు. బౌల్ట్, దీపక్ చాహర్ నుంచి అతడికి సహకారం అందితే ముంబైను ఆపడం ప్రత్యర్థులకు కష్టతరమే. తాజా టి20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్‌తో పాటు న్యూజిలాండ్ కెపె్టన్ సాంట్నర్ స్పిన్ భారం మోయనున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బౌలింగ్‌లో అవసరమైతే మయాంక్ మార్కండే, అశ్వని కుమార్, శార్దుల్ ఠాకూర్ అందుబాటులో ఉన్నారు. గత 13 సీజన్లను ముంబై జట్టు పరాజయంతో ప్రారంభించింది. ఈసారి ఓటమితో కాకుండా గెలుపుతో బోణీ కొడుతుందో లేదో చూడాలి. ముంబై ఇండియన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెపె్టన్), రోహిత్, సూర్యకుమార్, రాబిన్ మిన్జ్, రూథర్‌ఫర్డ్, రికెల్టన్, డికాక్, దానిశ్, తిలక్, నమన్ ధీర్, సాంట్నర్, రాజ్ బావా, అథర్వ, మయాంక్ రావత్, కార్బిన్ బాష్, విల్ జాక్స్, శార్దుల్, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే, దీపక్ చాహర్, అశ్వని కుమార్, రఘుశర్మ, ఇజహార్, ఘజన్ఫర్, బుమ్రా.ముంబై ఇండియన్స్ గణాంకాలుఆడిన మ్యాచ్‌లు 277 గెలిచినవి 153 ఓడినవి 124 అత్యుత్తమ ప్రదర్శన: చాంపియన్ (2013, 2015, 2017, 2019, 2020), రన్నరప్ (2010). -
'అతడితో జాగ్రత్త.. స్టార్ బ్యాటర్లను సైతం భయపెట్టగలడు'
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్-2026 సీజన్‌కు రంగం సిద్దమైంది. మార్చి 28 నుంచి ఈ వరల్డ్ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ పేసర్ మహమ్మద్ ఇజార్‌పై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇజార్‌ను తక్కువగా అంచనా వేయొద్దని బ్యాటర్లను పఠాన్ హెచ్చరించాడు.కాగా గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలో బిహార్‌కు చెందిన 22 ఏళ్ల మహమ్మద్ ఇజార్‌ను ముంబై ఇండియన్స్ రూ.30 లక్షల కనీస ధరకు దక్కించుకుంది. ఎడమచేతి వాటం పేసర్ అయిన ఇజార్.. దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడిని ముంబై వంటి పెద్ద ఫ్రాంచైజీ తమ జట్టులోకి తీసుకుంది."ముంబై ఇండియన్స్‌లో ఇప్పటికే ట్రెంట్ బౌల్డ్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్ వంటి ప్రధాన పేసర్లు ఉన్నారు. ఇప్పుడు మహ్మద్ ఇజార్ రూపంలో మరో పేస్ సంచలనం ముంబై జట్టులోకి వచ్చాడు. అతడు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఇజార్ 'బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్' స్లోయర్ డెలివరీలు అద్భుతంగా బౌలింగ్ చేయగలడు.అతడి బౌలింగ్ యాక్షన్ కూడా చాలా బాగుంది. ఇజార్ 135 కిలోమీటర్ల వేగంతో షార్ట్ బాల్స్, ఫుల్లర్ లెంగ్త్ డెలివరీలు కూడా సంధించగలడు. ముఖ్యంగా స్లో బాల్స్ వేయడం అతడి స్పెషాలిటీ. ఆ బంతులతో ఎలాంటి బ్యాటర్‌నైనా అతడు ముప్పుతిప్పలు పెట్టగలడు.గతసీజన్లో యువ పేసర్ అశ్విన్ కుమార్ అద్భుతంగా రాణించాడు. కాబట్టి అందరి దృష్టి అతడిపై ఉంటుంది. కానీ ఇజార్‌ను కూడా తక్కువ అంచనా వేయకండి" అని పఠాన్ తన యూట్యూబ్ ఛానల్లలో పేర్కొన్నాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఇప్పటివరకు కేవలం 5 టీ20లు మాత్రమే ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఐపీఎల్ వంటి మహా వేదికపై సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు.చదవండి: Dinesh Karthik: 40 ఏళ్ల వయసులో తండ్రైన దినేష్ కార్తీక్ -
రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తిరిగి అభిమానులను అలరించేందుకు సిద్దమవతున్నాడు. ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున హిట్‌మ్యాన్ బరిలోకి దిగనున్నాడు. ఈ ఏడాది సీజన్ కోసం రోహిత్ పూర్తి స్థాయిలో టీమ్‌తో కలిసి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. మంగళవారం నెట్స్‌లో రోహిత్ తీవ్రంగా శ్రమించాడు. అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆరంభానికి ముందు రోహిత్ అభిమానులకు ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్ మహేలా జయవర్ధనే గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్-19వ సీజన్లో రోహిత్ శర్మను 'ఇంపాక్ట్ ప్లేయర్'గా ఉపయోగించే ఆలోచన లేదని, అతను పూర్తిస్థాయి ఆటగాడిగా మైదానంలో ఉంటాడని జయవర్ధనే స్పష్టం చేశాడు.కాగా గత సీజన్లో రోహిత్ చాలా మ్యాచ్‌లలో ఇంపార్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసి, మిగితా సమయంలో డగౌట్లో ఉండేవాడు. కానీ ఇప్పుడు ఫీల్డ్‌లో కూడా తన అనుభవాన్ని కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పంచుకోనున్నాడు."గతేడాది రోహిత్ శర్మ చిన్న చిన్న గాయాలతో బాధపడ్డాడు. అందుకే అతడిని మేము ఇంపాక్ట్ సబ్‌గా ఉపయోగించాము. వర్క్‌లోడ్ మేనెజ్మెంట్లో భాగంగానే విశ్రాంతి ఇచ్చాము. మైదానంలో ఉన్నా లేకపోయినా అతడి ప్రభావం జట్టుపై కచ్చితంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది సీజన్లో మాత్రం రోహిత్‌ను కచ్చితంగా ఎక్కువ సమయం మైదానంలోనే ఉంచుతాము.అయితే జట్టులో ఎక్కువ మంది ఆల్‌రౌండర్ల ఉన్నందున.. మ్యాచ్ పరిస్థితుల బట్టి ఇంపాక్ట్ ప్లేయర్‌ను రోటేట్ చేస్తాము" అని ఓ ఇంటర్వ్యూలో జయవర్ధనే పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 29న కేకేఆర్‌తో తలపడనుంది.చదవండి: T20 WC: డీఎస్పీగా సంజూ శాంసన్!? -
రోహిత్ సాధన షురూ...
ముంబై: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెరో ఐదు టెటిల్స్తో అగ్ర స్థానంలో ఉన్నాయి. అయితే గత ఐదు సీజన్లలో ముంబై ప్రదర్శన ఆశించినంత మెరుగ్గా లేదు. 2020లో ట్రోఫీని అందుకున్న తర్వాత టీమ్ పెద్దగా ఆకట్టుకోలేదు. మూడు సీజన్లలో ‘ప్లే ఆఫ్స్’కు చేరడంలో విఫలమైన జట్టు... మిగిలిన రెండు సందర్భాల్లో నాలుగో స్థానానికే పరిమితమైంది. ప్రస్తుత జట్టుతో 2026లోనైనా జట్టు రాత మారుతుందా అనేది చూడాలి. ఈ నేపథ్యంలో ముంబై స్టార్ బ్యాటర్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి స్థాయిలో టీమ్‌తో కలిసి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ చివరి సారి మైదానంలోకి దిగాడు. ఆ సిరీస్‌లో అతను వరుసగా 26, 24, 11 పరుగులు చేశాడు. ఇప్పుడు మళ్లీ బ్యాట్ పట్టి ఐపీఎల్ కోసం అతను సన్నద్ధమవుతున్నాడు. మంగళవారం సాధనలో అతను సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో గడిపాడు. బౌలర్లందరినీ అలవోకగా ఎదుర్కొంటూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా రోహిత్ గతంలో కంటే పూర్తి ఫిట్‌గా, చురుగ్గా కనిపిస్తుండటం విశేషం. 2025 సీజన్లో రోహిత్ 15 ఇన్నింగ్స్‌లలో 149.28 స్ట్రయిక్ రేట్‌తో 418 పరుగులు సాధించాడు. టీమ్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే పర్యవేక్షణలో జట్టు ఆటగాళ్ల ప్రాక్టీస్ సాగింది. -
విసిగిపోయాం.. రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా వార్నింగ్!?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్రకెక్కింది. రోహిత్ శర్మ సారథ్యంలో 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ట్రోఫీని ముద్దాడింది.ఆరో టైటిల్ కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న ముంబై (MI) ఈసారి ఎలాగైనా చాంపియన్‌గా నిలవాలని పట్టుదలగా ఉంది. కాగా గతేడాది పద్నాలుగింట ఎనిమిది గెలిచిన ముంబై నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.హార్దిక్‌కు పగ్గాలుఇదిలా ఉంటే... 2024లో గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను ముంబై తమ కెప్టెన్‌గా నియమించింది. దీంతో రోహిత్ శర్మను తొలగించి అతడి స్థానంలో హార్దిక్‌కు పగ్గాలు ఇవ్వడం పట్ల సొంతజట్టు అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్దిక్‌ను మైదానం లోపల, వెలుపలా తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు.ఈసారి మంచి మార్కులేఆ ఏడాది ముంబై మరీ దారుణంగా పద్నాలుగుకు నాలుగు మ్యాచ్‌లే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదోస్థానానికే పరిమితమైంది. అయితే, గతేడాది ప్లే ఆఫ్స్ చేర్చిన హార్దిక్ కెప్టెన్సీకి మంచి మార్కులే పడ్డాయి. మరోవైపు.. గత సీజన్లో రోహిత్ శర్మ ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలో దిగాడు. మొత్తంగా 15 ఇన్నింగ్స్‌లో కలిపి 418 పరుగులు సాధించాడు.రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా వార్నింగ్!?ఈ పరిణామాల నేపథ్యంలో హార్దిక్ పాండ్యా- రోహిత్ శర్మకు సంబంధించి ఓ వదంతి పుట్టుకొచ్చింది. రోహిత్ ప్రదర్శన పట్ల అసంతృప్తితో ఉన్న హార్దిక్ అతడికి వార్నింగ్ ఇచ్చాడని దాని సారాంశం. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ఓ నెటిజన్.. ‘‘ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందు హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మకు గట్టిగానే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.ఒకవేళ ఈసారి రోహిత్ శర్మ ప్రదర్శన సరిగ్గా లేకపోతే.. తాను సహించే ప్రసక్తే లేదని మేనేజ్మెంట్కు తేల్చి చెప్పాడు. యాజమాన్యం కూడా గత 10-12 ఏళ్లుగా రోహిత్ బ్యాటింగ్‌తో విసిగిపోయి ఉంది. అతడి స్ట్రైక్‌రేటు 120 కూడా దాటడం లేదు. ఎక్కువ మొత్తం అందుకుంటున్న ఆటగాడి నుంచి ఈ ప్రవర్తన మేము ఊహించలేదని వాపోతోంది’’ అని పేర్కొన్నారు.స్పందించిన ముంబైఈ ట్వీట్ వైరల్ కాగా.. ముంబై ఇండియన్స్ తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి స్వయంగా స్పందించింది. ‘‘అవునా.. ఏదైనా జరగొచ్చు’’ అంటూ నవ్వుతున్న ఎమోజీ జోడించి.. ఎవరికిష్టం వచ్చినట్లు వారు రాస్తారు అన్న అర్థంలో రూమర్లను కొట్టిపారేసింది. చదవండి: IPL 2026: సీఎస్కేను కోర్టుకీడ్చిన కావ్యా మారన్!Kuch bhi! 😂 https://t.co/lEiFBgaEoh pic.twitter.com/SYw1im5Mfi— Mumbai Indians (@mipaltan) March 13, 2026 -
చరిత్ర సృష్టించిన ట్రెంట్ బౌల్ట్
న్యూజిలాండ్ వెటరన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌కు ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలో ఎవరికీ దక్కని అరుదైన అవకాశం దక్కింది. ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో ప్రతి ఫ్రాంచైజీకి ఎంపికైన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్.. మేజర్ లీగ్ క్రికెట్లో ఎంఐ న్యూయార్క్.. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఎంఐ ఎమిరేట్స్.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన బౌల్ట్.. తాజాగా ద హండ్రెడ్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అయిన ఎంఐ లండన్‌కు ఎంపికయ్యాడు. బౌల్ట్‌ను ఇవాళ (మార్చి 12) జరిగిన వేలంలో ఎంఐ లండన్ లక్ష స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 1.23 కోట్లు) సొంతం చేసుకుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. బౌల్ట్ ఇప్పటివరకు ప్రాతినిథ్యం వహించిన ప్రతి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో టైటిల్ నెగ్గాడు. ఇందులో మరో విశేషమేమిటంటే.. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల తరఫున అతనాడిన ప్రతి ఫైనల్లోనూ అతని జట్టు నెగ్గింది.ఇదిలా ఉంటే, హండ్రెడ్ లీగ్‌లో తొలిసారి ఆటగాళ్ల వేలం జరుగుతుంది. ఈ సీజన్ (2026) నుంచే ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. దీనికి ముందు ఆటగాళ్ల ఎంపిక డ్రాఫ్ట్ ద్వారా జరిగేది. ఈ సీజన్‌తో తొలిసారి ఐపీఎల్ తరహా వేలం జరుగుతుంది. నిన్న (మార్చి 11) మహిళల విభాగం వేలం పూర్తి కాగా.. ఇవాళ (మార్చి 12) పురుషుల వేలం జరుగుతుంది. మొత్తం 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీపడుతున్నాయి.ఇప్పటివరకు జరిగిన పురుషుల వేలంలో ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్స్ అత్యధికంగా 3.9 లక్షల స్టెర్లింగ్ పౌండ్లు (లండన్ స్పిరిట్) దక్కించుకున్నాడు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ. 4.8 కోట్లు. కోల్స్ తర్వాత అత్యధిక ధర జోర్డన్ కాక్స్‌కు దక్కింది. అతన్ని వెల్ష్‌ఫైర్ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది.ఈ వేలంలో మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ లీగ్‌లోని తమ సిస్టర్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ లీడ్స్ కోసం పాకిస్తానీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను (1.9 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 2.34 కోట్లు)) ఎంపిక చేసుకుంది. ఈ లీగ్ వేలంలో మొత్తం 13 మంది పాక్ ఆటగాళ్లు బరిలో నిలువగా.. అబ్రార్‌తో పాటు వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ మాత్రమే అమ్ముడుపోయారు. ఉస్మాన్ తారిక్‌ను బర్మింగ్హమ్ ఫీనిక్స్ 1.4 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది. -
ఢిల్లీ గెలిస్తే ‘ఎలిమినేటర్’కు అర్హత
వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఓడిపోవడం ఢిల్లీ క్యాపిటల్స్ అవకాశాల్ని మెరుగుపరిచాయి. టోర్నీలో మూడు సార్లు రన్నరప్‌గా నిలిచిన క్యాపిటల్స్‌కే ‘ఎలిమినేటర్’ చాన్స్ ఉంది. నేడు యూపీ వారియర్స్‌తో జరిగే చివరి లీగ్ పోరులో ఢిల్లీ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా నేరుగా గుజరాత్ జెయింట్స్‌తో ఎలిమినేటర్ ఆడే అర్హత సాధిస్తుంది. అయితే ఓడినా ముందంజ వేసేందుకు స్వల్ప అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో ముంబై, ఢిల్లీకి ప్రస్తుతం సమానంగా 6 పాయింట్లు ఉన్నాయి. అయితే ముంబైకంటే ఢిల్లీ రన్‌రేట్ చాలా తక్కువగా ఉంది. రన్‌రేట్ మైనస్‌లో ఉంది. అయితే నెట్ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంటే ఢిల్లీ ముందుకెళుతుంది. షఫాలీ, లిజెల్లీ, లారా వోల్వార్డ్‌లతో కూడిన టాపార్డర్ ధాటిగా పరుగులు చక్కబెడితే యూపీపై భారీస్కోరును సునాయాసంగానే సాధించవచ్చు. కెపె్టన్ జెమీమా, మరిజాన్, నికీ ప్రసాద్‌లు కూడా ధనాధన్ ఆట ఆడేయగలరు. బౌలింగ్‌లో షినెల్ హెన్రీ, మరిజాన్, నందిని, శ్రీచరణిలు ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు అట్టడుగున ఉన్న యూపీ కేవలం రెండే మ్యాచ్‌ల్లో గెలిచింది. -
రాణించిన గార్డ్నర్, వేర్హమ్.. గుజరాత్ స్కోర్ ఎంతంటే..?
డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (జనవరి 30) జరుగుతున్న కీలక మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ ఓ మోస్తరు స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ (46), అనుష్క శర్మ (33), సోఫీ డివైన్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ఆఖర్లో జార్జియా వేర్హమ్ (44 నాటౌట్) బ్యాట్ ఝులిపించింది. భారతి ఫుల్మాలి 5 పరుగులతో అజేయంగా నిలిచింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో బెత్ మూనీ (5) మినహా ప్రతి ఒక్కరు ఓ మోస్తరు స్కోర్ చేశారు. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ (4-0-26-2) అద్భుతంగా బౌలింగ్ చేసింది. షబ్నిమ్ ఇస్మాయిల్ (4-0-29-1), నాట్ సీవర్ బ్రంట్ (4-0-36-1) కూడా పర్వాలేదనిపించారు. హేలీ మాథ్యూస్ (4-0-40-0), వైష్ణవి శర్మ (2-0-21-0) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. అమన్‌జోత్ కౌర్ (2-0-13-0) పర్వాలేదనిపించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ తర్వాత రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి నేరుగా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ప్రస్తుతం మిగిలిన రెండు బెర్త్‌ల కోసం గుజరాత్‌తో పాటు ముంబై ఇండియన్స్ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), ఢిల్లీ క్యాపిటల్స్ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) పోటీ పడుతున్నాయి. యూపీ వారియర్జ్ 7 మ్యాచ్‌ల్లో రెండే విజయాలతో టేబుల్ చివరి స్థానంలో ఉంది. -
ఫైనల్లో ఆర్సీబీ.. మరి ఆ రెండు బెర్తులు దక్కేదెవరికి?
మహిళల ప్రీమియర్ లీగ్-2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఈ ఏడాది సీజన్లో ఇంకా కేవలం రెండు లీగ్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ టోర్నీలో భాగంగా గురువారం యూపీ వారియర్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పుడు మరో రెండు స్ధానాల కోసం నాలుగు జట్లు పోటీ పడతున్నాయి. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.పాయింట్ల పట్టికలో ఆర్సీబీ(12) అగ్రస్ధానంలో ఉంది. ఆ తర్వాత స్దానంలో గుజరాత్ జెయింట్స్(8 పాయింట్లు), ముంబై ఇండియన్స్(6), ఢిల్లీ క్యాపిటల్స్(6), యూపీ వారియర్స్(4) ఉన్నాయి.గుజరాత్ జెయింట్స్గుజరాత్ జట్టు శక్రవారం వడోదర వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిస్తే మిగితా జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తోంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం యూపీ వారియర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఫలితం వరకు ఎదురు చూడాలి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోతే గుజరాత్‌కు ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశముంటుంది.ముంబై ఇండియన్స్గుజరాత్తో జరిగే మ్యాచ్ ముంబై జట్టుకు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే పాయింట్ల పరంగా గుజరాత్‌తో సమంగా నిలుస్తోంది. అయితే గుజరాత్(-0.271) కంటే ముంబై(+0.146) రన్‌రేట్ మెరుగ్గా ఉన్నుందన హర్మన్ సేన ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.ఢిల్లీ క్యాపిటల్స్జేమీమా రోడ్రిగ్స్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ చివరి మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ భారీ విజయం సాధించాలి. అదేవిధంగా ముంబై వర్సెస్ గుజరాత్ మ్యాచ్ ఫలితం కూడా ఢిల్లీ ప్లే ఆఫ్ రేసును ప్రభావితం చేస్తుంది. ఢిల్లీ రన్‌రేట్ ప్రస్తుతం -0.164 ఉంది. భారీ విజయం సాధిస్తేనే 2 పాయింట్లతో పాటు రన్‌రేట్ కూడా గణనీయంగా మెరుగపడుతోంది.యూపీ వారియర్స్ఇక యూపీ వారియర్స్ ప్లే ఆఫ్స్ చేరే దారులు దాదాపు మూసుకుపోయినట్లే. యూపీ ఖాతాలో ప్రస్తుతం 4 పాయింట్లే ఉన్నాయి. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో యూపీ భారీ విజయం సాధించాలి. అలాగే ముంబై ఇండియన్స్ గుజరాత్‌తో మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోవాలి. అప్పుడు 6 పాయింట్లతో ముంబై, యూపీ, ఢిల్లీ సమంగా నిలుస్తాయి. ఆ సమయంలో రన్‌రేట్ ఆధారంగా మూడింటిలో ఓ జట్టు ఫ్లేప్స్లో అడుగుపెడుతోంది -
రిచా మెరుపులు వృథా.. ఆర్సీబీపై ముంబై విజయం
మహిళల ప్రీమియర్ లీగ్-2026లో వరుసగా మూడు పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్ గెలుపు బాట పట్టింది. సోమవారం వడోదర వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. దీంతో హర్మన్ సేన తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ముంబై స్టార్ ఆల్‌రౌండర్ నటాలీ స్కివర్ బ్రంట్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన ప్లేయర్‌గా స్కివర్ రికార్డులెక్కింది. 57 బంతులు ఎదుర్కొన్న స్కివర్ 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హీలీ మాథ్యూస్(56) హాఫ్ సెంచరీతో సత్తాచాటింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 131 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆర్సీబీ బౌలర్లలో లారెన్ బెల్ రెండు, శ్రేయంకా పాటిల్, ఎన్డి క్లార్క్ తలా వికెట్ సాధించారు.రిచా విధ్వంసం..అనంతరం భారీ లక్ష్య చేధనలో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేసింది. టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికి రిచా ఘోష్ మాత్రం విధ్వంసం సృష్టించింది. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిచా.. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగింది.కేవలం 49 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 90 పరుగులు చేసింది. సహచరుల నుంచి సహకారం లభించకపోవడంతో ఆర్సీబీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ముంబై బౌలర్లలో మాథ్యూస్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇస్మాయిల్, అమీలియా కేర్ తలా రెండు వికెట్లు సాధించారు. -
చరిత్ర సృష్టించిన బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంచైజీ
బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంచైజీ పెర్త్ స్కార్చర్స్ ఫ్రాంచైజీ టీ20 లీగ్‌ల చరిత్రలో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2025-26 ఎడిషన్ విజేతగా నిలవడం ద్వారా ఆరోసారి బీబీఎల్ టైటిల్‌ను ఎగరేసుకుపోయిన ఈ ఫ్రాంచైజీ.. ఓ టీ20 లీగ్‌లో అత్యధిక టైటిళ్లు గెలిచిన ఫ్రాంచైజీగా చరిత్ర సృష్టించింది. తాజా టైటిల్‌కు ముందు స్కార్చర్స్ ఐదు టైటిళ్లతో ఐపీఎల్ ఫ్రాంచైజీలైన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌తో సమంగా ఉండింది. సీఎస్కే 2010, 2011, 2018, 2021, 2023 ఎడిషన్ల ఐపీఎల్ టైటిళ్లు సాధించగా.. ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020 ఎడిషన్లలో ఐపీఎల్ టైటిళ్లు ఎగరేసుకుపోయింది.స్కార్చర్స్ విషయానికొస్తే.. తాజా బీబీఎల్ టైటిల్‌తో ఈ ఫ్రాంచైజీ గుర్తింపు పొందిన టీ20 లీగ్‌ల చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ 2014, 2015, 2017, 2022, 2023, 2026 ఎడిషన్లలో బీబీఎల్ టైటిళ్లు సాధించింది. జనవరి 25 జరిగిన ఫైనల్లో స్కార్చర్స్ సిడ్నీ సిక్సర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.టీ20 లీగ్‌ల చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలు పెర్త్ స్కార్చర్స్ (బిగ్‌బాష్ లీగ్)- 6ముంబై ఇండియన్స్, సీఎస్కే (ఐపీఎల్)- 5కొమిలా విక్టోరియన్స్ (బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్)- 4జాఫ్నా కింగ్స్ (లంక ప్రీమియర్ లీగ్)- 4ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్ (పాకిస్తాన్ సూపర్ లీగ్)- 3ఓవల్ ఇన్విన్సిబుల్స్ (హండ్రెడ్ లీగ్)- 3సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ (సౌతాఫ్రికా టీ20 లీగ్)- 3ముంబై ఇండియన్స్, సీఎస్కే (ఛాంపియన్స్ లీగ్ టీ20)- 2ఎంఐ న్యూయార్క్ (మేజర్ లీగ్ క్రికెట్)- 2బిగ్‌బాష్ లీగ్ 2025-26 ఫైనల్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్.. జై రిచర్డ్స్ (4-0-32-3), డేవిడ్ పేన్ (4-0-18-3), మహ్లి బియర్డ్‌మన్ (4-0-29-2), ఆరోన్ హార్డీ (3-0-16-1), కూపర్ కన్నోల్లీ (3-0-14-0) ధాటికి 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. సిక్సర్స్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్, జోష్ ఫిలిప్, కెప్టెన్ మోసస్ హెన్రిక్స్ తలో 24 పరుగులు చేయగా.. జోయల్ డేవిస్ 19, లచ్లాన్ షా 14 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను స్కార్చర్స్ ఆచితూచి ప్రారంభించింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (44), ఫిన్ అలెన్ (36) నిదానంగా ఆడినా, లక్ష్యానికి దగ్గర చేశారు. మిగతా కార్యక్రమాన్ని జోష్ ఇంగ్లిస్ (29 నాటౌట్) పూర్తి చేశాడు. ఇంగ్లిస్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. మరో 15 బంతులు మిగిలుండగానే స్కార్చర్స్ విజయతీరాలకు చేరింది. సిక్సర్స్ బౌలర్లలో సీన్ అబాట్ (4-0-19-2), మిచెల్ స్టార్క్ (4-0-33-1), జాక్ ఎడ్వర్డ్స్ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. -
బెంగళూరు గెలిస్తే నేరుగా ఫైనల్‌కు... నేడు ముంబై ఇండియన్స్‌తో ‘ఢీ’
వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుస విజయాలకు బ్రేక్ పడినప్పటికీ నేరుగా ఫైనల్ చేరే అవకాశాలైతే బోలెడున్నాయి. ఇప్పటికే పాయింట్ల పట్టికలో 5 విజయాలతో అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ జట్టు... డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో నేడు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే ఎంచక్కా టైటిల్ పోరుకే అర్హత సాధిస్తుంది. ఐదు జట్ల మధ్య జరుగుతున్న ఈ లీగ్‌లో పాయింట్ల పట్టికలో ‘టాప్’లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ నిలకడలేని ప్రదర్శనతో అగచాట్లు పడుతోంది. ఈ మ్యాచ్ ఆర్సీబీ కంటే ముంబైకే కీలకం కానుంది. ఇది కూడా ఓడితే ఓ రకంగా ప్లేఆఫ్స్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ బృందం స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరుకు వరుసగా మరో పరాజయాన్ని రుచి చూపించేందుకు బరిలోకి దిగుతోంది.రాత్రి 7.30 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, జియో హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. -
ఢిల్లీని గెలిపించిన జెమీమా
వడోదర: జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) కెప్టేన్ ఇన్నింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలిపించింది. దీంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ ఖాతాలో రెండో విజయం చేరింది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. నాట్ సీవర్ బ్రంట్ (45 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టేన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 41; 7 ఫోర్లు) రాణించారు.21 పరుగుల వద్దే ఓపెనర్లు సజన (9), హేలీ మాథ్యూస్ (12) నిష్క్రమించగా... హర్మన్, బ్రంట్ మూడో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. క్యాపిటల్స్ బౌలర్లలో తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు లీజెల్లి లీ (28 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్), షఫాలీ వర్మ (29; 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 63 పరుగులతో చక్కని ఆరంభమిచ్చారు. ముంబైకిది ‘హ్యాట్రిక్’ పరాజయం. ఈ సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన హర్మన్ బృందం కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే గెలిచింది. డబ్ల్యూపీఎల్‌లో నేడు విశ్రాంతి దినం. గురువారం జరిగే మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతుంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సజన (బి) నందిని 9; హేలీ మాథ్యూస్ (బి) మరిజాన్ కాప్ 12; నాట్ సీవర్ (నాటౌట్) 65; హర్మన్‌ప్రీత్ (సి) హామిల్టన్ (బి) శ్రీచరణి 41; నికోలా కేరీ (సి) స్నేహ్ రాణా (బి) శ్రీచరణి 12; అమన్‌జోత్ (సి) లీజెల్లి (బి) శ్రీచరణి 3; సంస్కృతి (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–21, 2–21, 3–99, 4–130, 5–134.బౌలింగ్: మరిజాన్ 4–0–8–1, హామిల్టన్ 4–0– 36–0, నందిని శర్మ 4–0–36–1, శ్రీచరణి 4–0– 33–3, స్నేహ్ రాణా 3–0–27–0, షఫాలీ వర్మ 1–0–14–0ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: షఫాలీ (బి) వైష్ణవి 29; లీజెల్లి లీ (స్టంప్డ్) రహిలా (బి) అమన్‌జోత్ 46; వోల్వార్డ్ (రనౌట్) 17; జెమీమా (నాటౌట్) 51; మరిజాన్ కాప్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–63, 2–84, 3–118.బౌలింగ్: షబి్నమ్ 4–0–26–0, నికోలా 1–0–13–0, నాట్ సీవర్ 4–0–42–0, సంస్కృతి 1–0–13–0, అమన్‌జోత్ 3–0–21–1, వైష్ణవి 4–0–20–1, హేలీ 2–0–19–0. -
చెలరేగిన బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబై ఇండియన్స్
మహిళల ఐపీఎల్ 2026లో (WPL) ఇవాళ (జనవరి 20) ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలకమైన మ్యాచ్ జరుగుతుంది. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్ మారిజాన్ కాప్ (4-0-8-1) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. కాప్‌తో పాటు శ్రీ చరణి (4-0-33-3), నందిని శర్మ (4-0-36-1) కూడా సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. లూసీ హ్యామిల్టన్ (4-0-36-0), స్నేహ్ రాణా (3-0-27-0) ఓ మోస్తరు ప్రదర్శన చేశారు. షఫాలీ వర్మ ఓ ఓవర్ వేసి 14 పరుగులు సమర్పించుకుంది. ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో నాట్ సీవర్ బ్రంట్ (65 నాటౌట్) అజేయ అర్ద శతకంతో రాణించింది. ఆమెకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41) సహకరించింది. వీరిద్దరు సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా ప్లేయర్లలో సంజీవన్ సజనా (9), హేలీ మాథ్యూస్ (12), నికోలా కేరీ (12), అమన్‌జోత్ కౌర్ (3) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. ఆఖర్లో సంస్కృతి గుప్త (10 నాటౌట్) బ్యాట్ ఝులిపించింది.కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి, ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.పేరుకు రెండో స్థానంలో ఉన్నా, ముంబైకి ఈ స్థానం గ్యారెంటీ కాదు. ఎందుకంటే మరో రెండు జట్లు కూడా సమాంతర పాయింట్లు కలిగి ఉన్నాయి. యూపీ వారియర్జ్, గుజరాత్ జెయింట్స్ కూడా ఐదు మ్యాచ్‌ల్లో తలా రెండేసి విజయాలు సాధించి మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఆడిన 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో పాటు, మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికొస్తే.. 4 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో చివరి స్థానంలో ఉంది. -
ముంబై ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ
డబ్ల్యూపీఎల్ 2026 ఎడిషన్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు పెద్దగా కలిసొస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నా, మరో రెండు జట్లు కూడా సమాంతర పాయింట్లు కలిగి ఉండటంతో ఈ స్థానానికి గ్యారెంటీ లేదు. యూపీ వారియర్జ్, గుజరాత్ జెయింట్స్ కూడా ఐదు మ్యాచ్‌ల్లో చెరో రెండు విజయాలు సాధించి, ముంబై ఇండియన్స్‌తో పాటు 4 పాయింట్లు ఖాతాలో కలిగి ఉన్నాయి. ఆడిన 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో పాటు, మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరో జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో చివరి స్థానంలో ఉంది.ఈ ఎడిషన్‌లో ఆశించిన విజయాలు సాధించలేకపోతున్న ముంబై ఇండియన్స్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వికెట్‌కీపింగ్ బ్యాటర్ జి కమిలిని గాయం బారిన పడి ఎడిషన్ మొత్తానికి దూరమైంది. ఆమె స్థానాన్ని ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఎడమచేతి వాటం స్పిన్నర్ వైష్ణవి శర్మతో భర్తీ చేసింది.17 ఏళ్ల కమిలిని ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ముంబై ఇండియన్స్‌కు నమ్మదగిన బ్యాటర్‌గా ఉండింది. ఆమె లేని లోటు ఎంఐ బ్యాటింగ్ ఆర్డర్‌ను ప్రభావితం చేయవచ్చు.వైష్ణవి శర్మతో భర్తీ 20 ఏళ్ల వైష్ణవి శర్మను ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలతో జట్టులోకి తీసుకుంది. వైష్ణవి 2025 అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో కీలక సభ్యురాలు. ఇటీవలే ఆమె టీమిండియా తరఫున కూడా అరంగేట్రం చేసింది. డబ్ల్యూపీఎల్‌కు ముందు శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైష్ణవి ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించింది. డబ్ల్యూపీఎల్ తర్వాత జరిగే ఆస్ట్రేలియా పర్యటనకు సైతం వైష్ణవి ఎంపికైంది. వైష్ణవి చేరికతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగం బలపడనుంది. ముంబై ఇండియన్స్ ఇవాళ (జనవరి 20) ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.ప్లే ఆఫ్స్ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఆ జట్టుకు చాలా కీలకం. -
ముంబైపై యూపీ వారియర్స్ ఘన విజయం
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో ముంబై ఇండియన్స్ మూడో ఓటమి చవిచూసింది. శనివారం నవీ ముంబై వేదికగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో ముంబై ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. లానింగ్ కేవలం 45 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసింది. ఆమెతో పాటు యువ బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ సైతం దుమ్ములేపింది. లిచ్‌ఫీల్డ్ 37 బంతుల్లో 61 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ 3 వికెట్లు పడగొట్టగా.. స్కివర్ బ్రంట్ రెండు, నికోలా కారీ,మాథ్యూస్, అమన్‌జ్యోత్ కౌర్ తలా వికెట్ సాధించారు.పోరాడిన ఓడిన ముంబై..అనంతరం లక్ష్య చేధనలో ముంబై ఘనమైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు హేలీ మథ్యూస్(13), సజన(10) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత స్టార్ ప్లేయర్లు హర్మన్‌ప్రీత్ కౌర్ (15), నాట్ స్కివర్-బ్రంట్ (15) నిరాశపరిచారు.చివర్లో అమేలియా కెర్(49 నాటౌట్) అమంజోత్ కౌర్(41) పోరాడినప్పటికీ జట్టును మాత్రం విజయ తీరాలకు చేర్చలేకపోయారు. యూపీ బౌలర్లలో శిఖా పాండే రెండు వికెట్లు పడగొట్టగా.. క్రాంతి గౌడ్, ఎకిలిస్టోన్, దీప్తీ శర్మ తలా వికెట్ సాధించారు. కాగా ఈ టోర్నీలో యూపీతో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ముంబై ఓటమి పాలైంది.చదవండి: కివీస్‌తో మ్యాచ్ వరల్డ్ ఫైనల్ లాంటిది: మహ్మద్ సిరాజ్ -
లానింగ్, లిచ్‌ఫీల్డ్ మెరుపులు.. ముంబై ముందు భారీ టార్గెట్
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026లో భాగంగా నవీ ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీవారియర్స్ బ్యాటర్లు మెరిశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ముఖ్యంగా యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ విధ్వంసం సృష్టించింది.ఈ ఆసీస్ లెజెండ్ ముంబై బౌలర్లను ఉతికారేసింది. కేవలం 45 బంతులు మాత్రమే ఎదుర్కొన్న లానింగ్ 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70 పరుగులు చేసింది. ఆమెతో పాటు ఫీభీ లిచ్‌ఫీల్డ్ మెరుపులు మెరిపించింది. 37 బంతుల్లో7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61 పరుగులు చేసింది. ఆఖరిలో హర్లీన్ డియోల్(25), ట్రయాన్(21) రాణించారు. ముంబై బౌలర్లలో అమీలియా కేర్ మూడు వికెట్లు పడగొట్టగా.. ట్ స్కివర్ బ్రంట్ రెండు, హీలీ మాథ్యూస్, అమన్‌జ్యోత్ కౌర్ తలా వికెట్ సాధించారు.తుది జట్లుయుపీ వారియర్జ్: కిరణ్ నవ్‌గిరే, మెగ్ లానింగ్ (కెప్టెన్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, హర్లీన్ డియోల్, శ్వేతా సెహ్రావత్ (వికెట్ కీపర్), క్లో ట్రయాన్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోభనా జాయ్, శిఖా పాండే, క్రాంతి గౌడ్ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, గుణాలన్ కమలిని(వికెట్ కీపర్), అమేలియా కెర్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమంజోత్ కౌర్, నికోలా కారీ, సజీవన్ సజన, సంస్కృతి గుప్తా, నల్లా క్రాంతి రెడ్డి, త్రివేణి వశిష్ట -
యూపీతో మ్యాచ్.. ముంబై తరపున తెలుగు అమ్మాయి అరంగేట్రం
మహిళల ప్రీమియర్ లీగ్-2026లో హైవోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఈ టోర్నీలో భాగంగా నవీ ముంబై వేదికగా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి నల్లా క్రాంతి రెడ్డి ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేసింది. అదేవిధంగా స్టార్ పేసర్ ఇస్మాయిల్‌కు ముంబై విశ్రాంతి ఇచ్చింది. ఆమె స్ధానంలో హేలీ మాథ్యూస్ తుది జట్టులోకి వచ్చింది. యూపీ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు.కాగా యూపీ వారియర్స్ తమ చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇప్పుడు అదే జోరును ఈ మ్యాచ్‌లో కూడా కొనసాగించాలని లానింగ్ సేన ఉవ్విళ్లూరుతోంది.తుది జట్లుయుపీ వారియర్జ్: కిరణ్ నవ్‌గిరే, మెగ్ లానింగ్ (కెప్టెన్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, హర్లీన్ డియోల్, శ్వేతా సెహ్రావత్ (వికెట్ కీపర్), క్లో ట్రయాన్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోభనా జాయ్, శిఖా పాండే, క్రాంతి గౌడ్ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, గుణాలన్ కమలిని(వికెట్ కీపర్), అమేలియా కెర్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమంజోత్ కౌర్, నికోలా కారీ, సజీవన్ సజన, సంస్కృతి గుప్తా, నల్లా క్రాంతి రెడ్డి, త్రివేణి వశిష్ట -
పోలార్డ్ రాక.. మారిన ముంబై ఇండియన్స్ ఫేట్
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి అనూహ్య పరాజయాలు ఎదుర్కొని ఎలిమినేషన్ అంచున ఉన్న ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌కు (MI Cape town) దిగ్గజ టీ20 ఆటగాడు కీరన్ పోలార్డ్ జీవం పోశాడు. రెగ్యులర్ కెప్టెన్ రషీద్ ఖాన్ జాతీయ విధుల కోసం జట్టును వీడటంతో, అతని స్థానాన్ని భర్తీ చేసిన పోలీ.. నిన్న (జనవరి 16) సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌పై ఎంఐ గెలుపులో తనవంతు పాత్ర పోషించాడు.అప్పటికి 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండిన కేప్‌టౌన్.. పోలార్డ్ రాకతో తిరిగి గెలుపు ట్రాక్ ఎక్కింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. పార్ల్ రాయల్స్, సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్, ప్రిటోరియా క్యాపిటల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. చివరి బెర్త్ కోసం ఎం కేప్‌టౌన్, జోబర్గ్ సూపర్ కింగ్స్, డర్బన్ సూపర్ జెయింట్స్ పోటీపడుతున్నాయి.సన్‌రైజర్స్‌పై పోలార్డ్ తొలుత బంతితో (2-0-9-0), ఆతర్వాత బ్యాట్‌తో (14 బంతుల్లో 20; 2 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో కేప్‌టౌన్ ఈస్ట్రన్‌కేప్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్రన్‌కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేయగా.. కేప్‌టౌన్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. నాలుగు వికెట్లతో సత్తా చాటిన కేప్‌టౌన్ ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.బాష్‌తో పాటు ట్రెంట్ బౌల్ట్ (4-0-28-3), రబాడ (3-0-20-1), జార్జ్ లిండే (4-0-34-1) సత్తా చాటడంతో ఈస్ట్రన్‌కేప్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆఖర్లో మార్కో జన్సెన్ (42) రాణించడంతో ఆ జట్టు ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈస్ట్రన్‌కేప్‌లో స్టార్ బ్యాటర్లు డికాక్ (0), బెయిర్‌స్టో (15), స్టబ్స్ (4) విఫలయ్యారు.ఛేదనలో కేప్‌టౌన్ కూడా తడబడింది. జన్సెన్ (4-0-23-2), ముత్తుసామి (3.2-0-25-2), నోర్జే (4-0-29-1), మిల్నే (3-0-26-1), కోల్స్ (2-0-13-1) సత్తా చాటి కేప్‌టౌన్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. అయితే కీలక దశలో లిండే (31), పోలార్డ్ (20) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి కేప్‌టౌన్‌ను గెలిపించారు. అంతకుముందు రిజా హెండ్రిక్స్ (41) రాణించాడు. ఫలితంగా కేప్‌టౌన్ అతికష్టం మీద గట్టెక్కింది.


