'వావ్‌ వాట్ ఏ ప్లేయర్‌.. ఏ మాత్రం మారలేదు' | Justin Langer left stunned by Rohit Sharmas masterclass in MI’s record IPL 2026 chase | Sakshi
Sakshi News home page

IPL 2026: 'వావ్‌ వాట్ ఏ ప్లేయర్‌.. ఏ మాత్రం మారలేదు'

May 5 2026 2:55 PM | Updated on May 5 2026 3:14 PM

 Justin Langer left stunned by Rohit Sharmas masterclass in MI’s record IPL 2026 chase

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో సోమ‌వారం ఏకానా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐదు  మ్యాచ్‌ల త‌ర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ త‌న లోని క్లాస్‌ను మ‌రోసారి చూపించాడు.

229 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో హిట్‌మ్యాన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. మ‌రో ఓపెన‌ర్ ర్యాన్ రికెల్ట‌న్‌తో క‌లిసి స్కోర్ బోర్డును రోహిత్ ప‌రుగులు పెట్టించాడు. రోహిత్ కేవ‌లం 44 బంతుల్లోనే 6 ఫోర్లు, 7 సిక్స్‌ల‌తో 84 ప‌రుగులు చేశాడు. 

39 ఏళ్ల వయసులోనూ ఏ మాత్రం అత‌డి బ్యాటింగ్ త‌గ్గ‌లేద‌ని ఈ ఇన్నింగ్స్ చూస్తే మ‌నకు అర్ధ‌మ‌వుతోంది. ఓవ‌రాల్‌గాఈ సీజన్‌లో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన రోహిత్, 174.01 స్ట్రైక్ రేటుతో 221 పరుగులు సాధించాడు. ఈ నేప‌థ్యంలో రోహిత్ శ‌ర్మ‌పై ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ హెడ్ కోచ్ జ‌స్టిన్ లాంగ‌ర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

"వాట్ ఏ ప్లేయ‌ర్‌.. వాట్ ఏ ప్లేయ‌ర్‌. రోహిత్ శ‌ర్మ ఒక అద్భుత‌మైన ఆట‌గాడు. గతంలో ఆస్ట్రేలియా కోచ్‌గా ఉన్నప్పుడు ప్రత్యర్థిగా అత‌డి స‌త్తాను చూశాను. ఇప్పుడు ఎల్ఎస్‌జీ కోచ్‌గా అదే చూస్తున్నాను. అత‌డి బ్యాటింగ్‌లో ఏ మాత్రం మార్పు రాలేదు. ప్ర‌పంచంలోని గొప్ప ప్లేయ‌ర్లు అంద‌రిని చూసేందుకు ఐపీఎల్ ఒక వేదిక" అని లాంగ‌ర్ పేర్కొన్నాడు.

కాగా రోహిత్ శ‌ర్మ‌కు ఆస్ట్రేలియాపై గొప్ప రికార్డు ఉంది. ముఖ్యంగా వైట్‌బాల్ క్రికెట్‌లో ఆసీస్ బౌల‌ర్ల‌కు రోహిత్ చుక్క‌లు చూపించేవాడు. ఆస్ట్రేలియాలోని బౌన్సీ పిచ్‌ల‌పై సైతం రోహిత్ త‌న‌దైన శైలిలో చెల‌రేగిపోయేవాడు.
చదవండి: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. ఇంటికి వెళ్లిపోయిన కెప్టెన్‌?
 

Advertisement
 
Advertisement
Advertisement