‘ఇది జట్టు వైఫల్యం.. ఆ ముగ్గురినే నిందించలేం’ | Mumbai Indians Coach Explains Why Bumrah, Surya And Tilak Struggling With Poor Form, Read Story Inside | Sakshi
Sakshi News home page

‘ఇది జట్టు వైఫల్యం.. ఆ ముగ్గురినే నిందించలేం’

May 3 2026 3:12 PM | Updated on May 3 2026 4:43 PM

Mumbai Indians Coach-Explains Why Bumrah-Surya-Tilak-Struggling

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో  ముంబై ఇండియ‌న్స్ ఆట దాదాపు ముగిసిన‌ట్లే. ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవ‌లం రెండు విజ‌యాలు మాత్ర‌మే న‌మోదు చేసిన ముంబై ఇండియ‌న్స్ ప్లేఆఫ్ చేరే అవ‌కాశాలు కోల్పోయింది. పాయింట్ల పట్టిక‌లో 9వ స్థానంలో కొన‌సాగుతుంది. శ‌నివారం సీఎస్‌కే చేతిలో ఓట‌మి చ‌విచూసిన త‌ర్వాత ముంబై ఇండియ‌న్స్ విష‌యంలో ఒక అంశం చ‌ర్చ‌కు దారి తీసింది. 

టీమిండియాకు ఆడుతున్న ఆట‌గాళ్ల‌లో ఎక్కువ మంది ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టులోనే ఉన్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా స‌హా రోహిత్ శ‌ర్మ‌, బుమ్రా, సూర్య‌కుమార్ యాద‌వ్‌, తిల‌క్ వ‌ర్మ‌లు కీల‌క ఆట‌గాళ్లు. ఇందులో రోహిత్ గాయంతో డ‌గౌట్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఇక మిగిలిన ఆట‌గాళ్ల‌లో కెప్టెన్ పాండ్యా సంగ‌తి ప‌క్క‌న‌బెడితే సూర్య‌కుమార్‌, తిల‌క్ వ‌ర్మ‌, బుమ్రాలు దారుణంగా విఫ‌ల‌మ‌వ్వ‌డం ముంబై కొంప ముంచుతుంది. 

ఈ సీజ‌న్‌లో బుమ్రా ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున 9 మ్యాచ్‌లాడి కేవ‌లం మూడు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక సూర్య‌కుమార్ పేల‌వ ఫామ్ ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. తొమ్మిది మ్యాచ్‌లు క‌లిపి కేవ‌లం 20 స‌గ‌టుతో ప‌రుగులు సాధించాడు. తిల‌క్ వ‌ర్మ సెంచ‌రీ సాధించిన‌ప్ప‌టికీ ఆ మురిపెం ఒక్క మ్యాచ్‌కే ప‌రిమిత‌మైంది. ఈ ముగ్గురు అగ్ర‌శ్రేణి ఆట‌గాళ్లు విఫ‌లం కావ‌డంపై ముంబై ఇండియ‌న్స్ హెడ్ కోచ్ మ‌హేల జ‌య‌వ‌ర్ద‌నే స్పందించాడు. 

సీఎస్‌కేతో మ్యాచ్ అనంత‌రం ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో జ‌య‌వ‌ర్ద‌నే మాట్లాడాడు. ‘నిజానికి ఈ ముగ్గురి వ‌ల్లే ముంబై ఇండియ‌న్స్ దారుణ ఆట‌తీరు ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని చెప్ప‌లేం. ఎందుకంటే సూర్య‌, తిల‌క్‌, బుమ్రాలు ఇప్ప‌టికే వారేంటో నిరూపించుకున్నారు. ఒక్క‌సారి సూర్య‌కుమార్ ట‌చ్‌లోకి వ‌స్తే ఎంత డేంజ‌ర్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే అత‌డు కుదురుకోవ‌డానికి రెండు, మూడు ఇ న్నింగ్స్‌లు చాలు. 

కానీ ఈ సీజ‌న్‌లో మాకు ఆ స‌మ‌యం దాటిపోయింది. ఇక తిల‌క్ వ‌ర్మ ఇంకా నేర్చుకునే ద‌శ‌లోనే ఉన్నాడు. త‌న‌దైన రోజున ధాటిగా ఆడ‌గ‌ల స‌త్తా ఉన్న తిల‌క్ వ‌ర్మ అనుభ‌వం పెరిగిన కొద్దీ ఆట‌లో మ‌రింత రాటుదేలుతాడ‌న్న నమ్మ‌కం నాకుంది. అయితే తిలక్ వ‌ర్మ టీ20 క్రికెట్‌లో అన్ని ర‌కాల పాత్ర‌ల‌ను పోషిస్తున్నాడు. టీ20 క్రికెట్ ఆడ‌డం అంత ఈజీ కాదు. ఒక్కోసారి ప‌రిస్థితి చేయి దాటిపోతుంది. బుమ్రా రాణించ‌క‌పోవ‌డం వ‌ల్ల ముంబై ఇండియ‌న్స్‌ను ఇబ్బంది పెట్టే అంశం. 

కానీ బుమ్రా ఒక్క‌డే కాదు ముంబై బౌల‌ర్లంతా క‌లిసిక‌ట్టుగా ఆడ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. మిగ‌తా బౌల‌ర్లు కూడా వికెట్లు తీస్తే బుమ్రాపై ఒత్తిడి త‌గ్గ‌డంతో పాటు వికెట్లు తీసే అవ‌కాశ‌ముంటుంది.’ అని చెప్పుకొచ్చాడు.

చదవండి: అదే జ‌రిగితే ప్లేఆఫ్స్‌కు ముంబై ఇండియ‌న్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement