ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తమ రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. మంగళవారం(ఏప్రిల్ 7) గువహటి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌లో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ కీలక పోరుకు ముందు ముంబై అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అందింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు అనారోగ్యం కారణంగా దూరమైన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి కోలుకున్నాడు.
దీంతో రాజస్తాన్‌తో మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండనున్నాడు. ఈ విషయాన్ని ముంబై బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ధ్రువీకరించారు. "హార్దిక్ పాండ్యాకు ఎటువంటి గాయం కాలేదు. కేవలం అనారోగ్యం కారణంగానే గత మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు అతను పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. మంగళవారం రాజస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో పాండ్యా తప్పకుండా ఆడతాడు
మాంబ్రే ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు.
కాగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆశించినంత మేర రాణించలేకపోయింది. పాండ్యా రీఎంట్రీ ఇస్తే దీపక్ చహర్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశముంది.
ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా) : రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నమన్ ధీర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, హార్దిక్ పాండ్యా మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, శార్దూల్ ఠాకూర్, , జస్ప్రీత్ బుమ్రా


