ముంబైపై ఘన విజయం.. కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం | IPL 2026: Kolkata register 4-wicket win, stay alive in playoffs race | Sakshi
Sakshi News home page

IPL 2026: ముంబైపై ఘన విజయం.. కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం

May 21 2026 12:47 AM | Updated on May 21 2026 12:47 AM

IPL 2026: Kolkata register 4-wicket win, stay alive in playoffs race

ఐపీఎల్‌-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ గెలుపుతో  కేకేఆర్ త‌మ ప్లే ఆఫ్స్ ఆశ‌ల‌ను సజీవంగా ఉంచుకోగల్గింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌ 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.

ముంబై ఇన్నింగ్స్‌లో టాపర్డర్‌, మిడిలార్డర్‌ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బ్యాటర్లలో హార్దిక్‌ పాండ్యా(26), కార్భిన్‌ బాష్‌(32) రాణించారు. కేకేఆర్‌ బౌలర్లలో సౌరభ్ దూబే, కామోరూన్‌ గ్రీన్‌, కార్తీక్‌ త్యాగి తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం  148 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 6 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో చేధించింది. 

కేకేఆర్‌ బ్యాటర్లలో మనీష్‌ పాండే(45) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రావ్‌మన్‌ పావెల్‌(40) రాణించాడు ముంబై బౌలర్లలో కార్భిన్‌ బాష్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్‌ చాహర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ఘజన్‌ఫర్‌ తలా వికెట్‌  సాధించారు.

కేకేఆర్ ఫ్లే ఆఫ్స్ చేరాలంటే?
ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో కేకేఆర్(13) ఆరో స్దానంలో ఉంది. కేకేఆర్ త‌మ ఆఖ‌రి మ్యాచ్‌లో మే 24న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ భారీ విజ‌యం సాధిస్తే 15 పాయింట్ల‌తో ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. 

అంతేకాకుండా కేకేఆర్ భ‌వితవ్యం రాజ‌స్తాన్‌, పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌ల ఫ‌లితాల‌పై కూడా ఆధార‌ప‌డి ఉంది. పంజాబ్‌, రాజ‌స్తాన్ కూడా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి. ఈ రెండు జ‌ట్లు త‌మ త‌దుపరి మ్యాచ్‌లో ఓడిపోయి, ఢిల్లీపై కేకేఆర్ గెలిస్తే వారి ప్లే ఆఫ్ బెర్త్ ఖ‌రారు చేసుకుంటుంది.
చదవండి: పాక్ మాజీ క్రికెట‌ర్‌కు బంప‌రాఫ‌ర్‌.. ఐపీఎల్‌కు అర్హత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement