రోహిత్‌ శర్మ అత్యంత చెత్త రికార్డు | MI Batter Rohit Sharma Worst Record Most-Ducks In IPL History | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మ అత్యంత చెత్త రికార్డు

May 24 2026 7:55 PM | Updated on May 24 2026 8:10 PM

MI Batter Rohit Sharma Worst Record Most-Ducks In IPL History

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ స్టార్ రోహిత్ శ‌ర్మ నిరాశ‌ప‌రిచాడు. జోఫ్రా ఆర్చ‌ర్ బౌలింగ్‌లో ధ్రువ్ జురేల్‌కు క్యాచ్ ఇచ్చిన‌ రోహిత్ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో రోహిత్ శ‌ర్మ అత్యంత చెత్త రికార్డు మూట‌గ‌ట్టుకున్నాడు. 

ఈ డకౌట్‌తో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సార్లు సున్నా పరుగులకే అవుట్ అయిన ఆటగాడిగా గ్లెన్ మాక్స్‌వెల్‌తో కలిసి రోహిత్ శర్మ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ ఐపీఎల్‌లో ఇప్పటివరకు మొత్తం 19 సార్లు డకౌట్ అయ్యాడు. 

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన గ్లెన్ మాక్స్‌వెల్‌ కూడా 19 డకౌట్లతో రోహిత్ శర్మతో పాటే మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. వీరి తర్వాత దినేష్ కార్తీక్, సునీల్ నరైన్ చెరో 18 డకౌట్లతో రెండో స్థానంలో ఉన్నారు. అలాగే స్పిన్ బౌలర్లు పియూష్ చావ్లా, రషీద్ ఖాన్ లు కూడా చెరో 16 సార్లు సున్నా పరుగులకే అవుట‌య్యి ఆ త‌ర్వాతి స్థానాల్లో కొన‌సాగుతున్నారు.

మ్యాచ్ విష‌యానికొస్తే ముంబై ఇండియ‌న్స్‌పై రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 30 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది. 

అనంత‌రం ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. ముంబైపై విజ‌యంతో రాజ‌స్తాన్ ప్లేఆఫ్స్ చేరుకోగా ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న పంజాబ్‌, కేకేఆర్‌లు కూడా లీగ్ ద‌శ‌లోనే ఇంటిబాట ప‌ట్టాయి.

చదవండి: 'మోసగాడు.. వచ్చాడు 18 కోట్లు ప‌ట్టుకెళ్లాడు!'

Advertisement
 
Advertisement
Advertisement