ఇంగ్లండ్‌తో మ్యాచ్‌.. గాయంతో కీల‌క ప్లేయ‌ర్ దూరం! | Pratika-Rawal Ruled-Out-Test Match Vs ENG Replacement Announced | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌.. గాయంతో కీల‌క ప్లేయ‌ర్ దూరం!

Jul 8 2026 7:40 PM | Updated on Jul 8 2026 9:20 PM

Pratika-Rawal Ruled-Out-Test Match Vs ENG Replacement Announced

ఇప్ప‌టికే ఇంగ్లండ్ గ‌డ్డ‌పై టీ20 సిరీస్‌లో టీమిండియా పురుషుల జ‌ట్టు 0-2తో వెనుక‌బ‌డి ఒత్తిడిలో ఉంది. ఈ వారం చివ‌ర్లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడ‌నుంది. అయితే మ్యాచ్‌కు ముందే భార‌త జ‌ట్టుకు షాక్ త‌గిలింది. లండ‌న్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న టెస్టు మ్యాచ్‌కు భార‌త ప్లేయ‌ర్ ప్ర‌తీకా రావ‌ల్ గాయంతో దూర‌మైంది. 

ఆమె స్థానంలో టాపార్డ‌ర్ బ్యాట‌ర్‌ ప్రియా పూనియాకు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు బీసీసీఐ బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అయితే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముందు ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో  ప్ర‌తీకా రావ‌ల్ పెర్త్ వేదిక‌గా జ‌రిగిన‌ ఏకైక టెస్టు మ్యాచ్‌లో 81 ప‌రుగుల‌తో రాణించింది. ఆ త‌ర్వాత ఇండియా-ఏ వుమెన్ టీం త‌ర‌ఫున హోవ్, టాంట‌న్‌ల‌తో జ‌రిగిన అన‌ధికారిక మ్యాచ్‌ల్లోనూ ఆడింది. 

అయితే ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు ప్ర‌తీకా రావ‌ల్‌కు గాయమైంది. దీంతో ఈ మ్యాచ్‌కు దూర‌మైన‌ట్లు భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు కోచ్ అమోల్ మ‌జుందార్ తెలిపాడు. ఆమె స్థానంలో టాపార్డ‌ర్ బ్యాట‌ర్‌ ప్రియా పూనియాను జ‌ట్టులోకి తీసుకున్న‌ట్లు పేర్కొన్నాడు.

ఎవ‌రీ ప్రియా పూనియా?
2019లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన టీ20 సిరీస్ ద్వారా ప్రియా పూనియా భార‌త్ త‌ర‌ఫున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. గ‌తేడాది వ‌డోద‌ర వేదిక‌గా జ‌రిగిన వ‌న్డేలోనూ ఆడిన ప్రియా పూనియా మొత్తంగా భార‌త్ త‌ర‌ఫున 12 వ‌న్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇక టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో లీగ్ ద‌శ‌లోనే ఇంటిబాట ప‌ట్టిన టీమిండియా వుమెన్స్ ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడ‌నుంది. 

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను హ‌ర్మ‌న్ సేన‌ 1-2తో ఇంగ్లండ్‌కు కోల్పోయింది. లండ‌న్‌లోని లార్డ్స్ వేదిక‌గా జ‌రగ‌నున్న మొట్ట‌మొద‌టి మ‌హిళ‌ల టెస్టు మ్యాచ్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

ఇంగ్లండ్‌తో టెస్టుకు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్‌), యాస్తిక భాటియా (వికెట్ కీప‌ర్‌), శ్రీ చరణి, హర్లీన్ డియోల్, క్రాంతి గౌడ్, రిచా ఘోష్ (వికెట్ కీప‌ర్‌), స్నేహ్‌ రాణా, ప్రియా పునియా, జెమిమా రోడ్రిగ్స్, సయాలీ సత్ఘరే, దీప్తి శ‌ర్మ‌, నందాని శర్మ, రేణుకా సింగ్‌, ష‌ఫాలీ వ‌ర్మ‌

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement