అభిమానికి రోహిత్ క్ష‌మాప‌ణ‌.. ఎందుకంటే? | Rohit Sharma Apology For-Female Fan-Makes Special Promise Viral | Sakshi
Sakshi News home page

అభిమానికి రోహిత్ క్ష‌మాప‌ణ‌.. ఎందుకంటే?

May 23 2026 4:44 PM | Updated on May 23 2026 4:56 PM

Rohit Sharma Apology For-Female Fan-Makes Special Promise Viral

Photo Courtesy: IPL 2026

ముంబై ఇండియ‌న్స్ స్టార్ క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ త‌న అభిమానికి క్ష‌మాప‌ణ చెప్ప‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. విష‌యంలోకి వెళితే.. ముంబై ఇండియ‌న్స్ గ‌త మ్యాచ్‌ను ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ఆడింది. పూర్తి వ‌న్‌సైడ్‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో ఓట‌మి చ‌విచూసింది. 

కేకేఆర్‌కు సొంత స్టేడియం కావ‌డంతో ఆ జ‌ట్టుకు భారీగా అభిమానులు వ‌చ్చిన‌ప్ప‌టికీ, ముంబై ఇండియ‌న్స్ ఫ్యాన్స్ కూడా కొంత‌మంది ఉన్నారు. ఈ నేప‌థ్యంలో మ్యాచ్ ముగిసిన త‌ర్వాత చాలా మంది అభిమానులు ముంబై ఇండియ‌న్స్ బ‌స చేసే హోట‌ల్ ముందు ఆట‌గాళ్ల కోసం నిరీక్షించారు. ముఖ్యంగా రోహిత్ శ‌ర్మను చూడ‌డం కోసం చాలాసేపు ఎదురుచూశారు. 

అందులోనే ఒక చిన్న అమ్మాయి కూడా ఉంది. రోహిత్ బ‌య‌ట‌కు వ‌చ్చినప్ప‌టికీ ఆ అమ్మాయిని ప‌ట్టించుకోలేదు. దీంతో ఆ అమ్మాయి ఎమోష‌న‌ల్ అయ్యి ఏడ్వ‌డం ప్రారంభించింది. దీనిని వీడియో తీసిన కొంద‌రు అభిమానులు సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోను చూసిన రోహిత్ శ‌ర్మ వెంట‌నే క్ష‌మాప‌ణ‌తో కూడిన వీడియో సందేశాన్ని విడుద‌ల చేశారు. 

'టెన్ష‌న్‌, గంద‌ర‌గోళం మ‌ధ్య వీటన్నింటిని ప‌ట్టించుకోవ‌డం కాస్త క‌ష్ట‌మ‌ని రోహిత్ తెలిపాడు. అయితే నాకోసం నిరీక్షించిన చిన్న అమ్మాయిని క‌ల‌వ‌క‌పోడం బాధ‌గా అనిపించింది. నా చ‌ర్య ప‌ట్ల క్ష‌మాప‌ణ చెబుతున్నా. మ‌రో విష‌యం ఏంటంటే ఈసారి ఎప్పుడు కోల్‌క‌తాకు వ‌చ్చినా ఆ అమ్మాయిని వ్య‌క్తిగ‌తంగా క‌లిసి మాట్లాడుతాన‌ని అంద‌రికీ వాగ్దానం చేస్తున్నా.' అని రోహిత్ శ‌ర్మ‌ చెప్పుకొచ్చాడు. 

రోహిత్ ఒక అభిమానికి ఇలా క్ష‌మాప‌ణ చెబుతూ ప్ర‌త్యేకంగా వీడియో విడుద‌ల చేయ‌డంపై అభిమానులు తెగ సంతోష‌ప‌డిపోయారు. 'రోహిత్ త‌నను ఇష్ట‌ప‌డే వ్య‌క్తుల‌ను ఎప్పుడు బాధ‌పెట్ట‌డానికి ఇష్ట‌ప‌పడ‌డ‌ని' కామెంట్లు చేస్తున్నారు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ పెద్దగా రాణించ‌లేక‌పోయాడు. 13 బంతుల్లో 15 ప‌రుగులు మాత్ర‌మే చేసిన రోహిత్ సౌర‌భ్ దూబే బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 

ఈ సీజ‌న్‌లో గాయంతో ప‌లు మ్యాచ్‌లకు దూర‌మైన రోహిత్ 8 మ్యాచ్‌ల్లో 283 ప‌రుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థ‌సెంచ‌రీలున్నాయి. మ్యాచ్ విష‌యానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 147 ప‌రుగులు చేసింది. కెప్టెన్ పాండ్యా (26) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

అనంత‌రం కేకేఆర్ స్వ‌ల్ప టార్గెట్‌ను ఛేదించడానికి క‌ష్ట‌ప‌డిన‌ప్ప‌టికీ మ‌నీష్ పాండే, రోవ్‌మెన్ పావెల్ మ‌ధ్య 64 ప‌రుగుల భాగ‌స్వామ్యం కేకేఆర్‌ను విజ‌య‌తీరాల‌కు చేర్చింది. ఇప్ప‌టికే సీజ‌న్ నుంచి నిష్క్ర‌మించిన ముంబై ఇండియ‌న్స్ 13 మ్యాచ్‌ల్లో 8 పాయింట్ల‌తో 9వ స్థానంలో ఉంది. ముంబై త‌మ చివ‌రి లీగ్ మ్యాచ్‌ను రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో ఆడ‌నుంది.

చదవండి: ఎస్‌ఆర్‌హెచ్ త్రిమూర్తుల అరుదైన ఫీట్‌!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement