ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ ఓటుమల పరంపర కొనసాగుతోంది. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై పరాజయం పాలైంది. ఈ ఏడాది సీజన్‌లో ముంబైకి ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం కావడం గమనార్హం. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో కొనసాగుతోంది. అయితే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా తీసుకున్న ఓ నిర్ణయంపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది.
ఏమి జరిగిదంటే?
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన మూడో ఓవర్‌లో ముంబై ర్యాన్ రికెల్టన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వెంట వెంటనే పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో ముంబై తరపున తొలి మ్యాచ్ ఆడుతున్న క్వింటన్ డికాక్, యువ ఆటగాడు నమన్ ధీర్ తమ అద్బుత బ్యాటింగ్‌తో ముంబైని ఆదుకున్నాడు. డికాక్ సెంచరీతో చెలరేగగా.. నమన్‌ధీర్ ఆర్ధ శతకంతో సత్తాచాటాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరి దూకుడు చూసి ముంబై 230కి పైగా స్కోర్ సాధిస్తుందని అంతా భావించారు.
కానీ నమన్ ధీర్ ఔటయ్యాక సీన్ రివర్స్ అయిపోయింది. నమన్ ధీర్ ఔటయ్యాక, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌ను కాదని హార్దిక్ పాండ్యా స్వయంగా క్రీజులోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాస్త ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన పాండ్యా తీవ్ర నిరాశపరిచాడు. పాండ్యా 12 బంతుల్లో కేవలం 14 పరుగులు మాత్రమే ఔటయ్యాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత ఈ లక్ష్యాన్ని పంజాబ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. తాజాగా హార్దిక్ తీసుకున్న ఈ చెత్త నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ మండిపడ్డాడు.
హార్దిక్ చెత్త కెప్టెన్సీ?
కెప్టెన్ ఎల్లప్పుడూ బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్ ఈ ఒక్క సీజన్ కాదు, గత రెండు సీజన్‌లలో కూడా ఇదే తీరును కనబరిచింది. ఈ వైఫల్యాలకు మూల కారణాలను వెతకాలి. 2013 నుంచి 2023 మధ్య కెప్టెన్‌గా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిల్స్‌ను అందించాడు. ఆ తర్వాత ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ కనీసం ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేకపోయింది.
ఇప్పుడు ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యేలా కనిపిస్తోంది. హార్దిక్ కెప్టెన్సీ బాగోలేదు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోహార్దిక్ ముందుగా బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరం ఏముంది? 12 బంతుల్లో 14 పరుగులు పరుగులు మాత్రమే చేశాడు. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌కు కేవలం ఐదు బంతులు మాత్రమే లభించాయి. ఒకవేళ రూథర్‌ఫోర్డ్ కూడా అన్ని బంతులు ఆడి ఉంటే, అతను 3-4 సిక్సర్లు కొట్టి ఉండేవాడు. అంతేకాకుండా జస్ప్రీత్ బుమ్రాతో తొలి ఓవర్ వేయించాల్సింది.
ఇలా ముంబై ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన కెప్టెన్సీతో పంజాబ్‌ను విజయ పథంలో నడిపిస్తుంటే, ముంబై ఇండియన్స్ కెప్టెన్ మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఇందుకు ఒకే పరిష్కరం ఉంది. హార్దిక్ వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పుకోని, ఆ బాధ్యతను తిరిగి రోహిత్‌కు అప్పగించాలని నేను భావిస్తున్నాను," అని తివారీ క్రిక్‌బజ్ డిబేట్‌లో పేర్కొన్నాడు.
కాగా ఈ ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ హార్దిక్ సీజన్ మధ్యలోనే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక ఇది ఇలా ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ వైఫల్యం కూడా ముంబై జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. బుమ్రా ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా సాధించలేదు. వికెట్ల విషయం పక్కన పెడితే పరుగులను కట్టడం చేయడంలో బుమ్రా విఫలమవుతున్నాడు.
చదవండి: IND vs IRE: సూర్యకు షాక్..! టీమిండియా కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్?


