గర్జించిన శ్రేయస్‌, ప్రబ్‌సిమ్రన్.. పంజాబ్ విజయం | IPL 2026: Punjab Kings Won-By 7 Wickets Vs Mumbai Indians | Sakshi
Sakshi News home page

గర్జించిన శ్రేయస్‌, ప్రబ్‌సిమ్రన్.. పంజాబ్ విజయం

Apr 16 2026 11:08 PM | Updated on Apr 16 2026 11:29 PM

IPL 2026: Punjab Kings Won-By 7 Wickets Vs Mumbai Indians

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో జోరు కనబరుస్తోంది. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ (80 నాటౌట్‌), శ్రేయస్ అయ్యర్ (65) వీరవిహారం చేయడంతో 196 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.3 ఓవర్లలోనే ఛేదించడం విశేషం. 

ముంబై బౌలర్లలో గజన్‌ఫర్ 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల నష్టానికి 195 ప‌రుగులు చేసింది. క్వింట‌న్ డికాక్ (112 నాటౌట్‌) అజేయ శ‌త‌కంతో అద‌ర‌గొట్ట‌గా.. న‌మ‌న్ ధిర్ అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. ఒక ద‌శ‌లో డికాక్, న‌మ‌న్ ధిర్‌ల జోరుతో ముంబై ఇండియ‌న్స్ 200 ప్ల‌స్ ప‌రుగులు చేస్తుంద‌నిపించింది. 

కానీ న‌మ‌న్ ధిర్ ఔటైన త‌ర్వాత వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ముంబై 195 ప‌రుగుల వ‌ద్దే ఆగిపోయింది. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయ‌గా, యాన్సెన్‌, శ‌శాంక్ సింగ్ చెరొక వికెట్ ప‌డ‌గొట్టారు. ఇక ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు ప్రబ్‌సిమ్రన్‌, శ్రేయస్ అయ్యర్  పోటీపడి మరీ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. 

పంజాబ్ దూకుడు ముందు ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ముంబై బౌలర్లలో బుమ్రా సహా అందరూ దారాళంగా పరుగు లిచ్చుకున్నారు. సీజన్‌లో పంజాబ్ వరుసగా నాలుగో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలతో 9వ స్థానంలో కొనసాగుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement