లక్నోపై ముంబై ఇండియన్స్‌ గెలుపు | IPL 2026, Match 47: Mumbai Indians vs LSG Updates and Highlights | Sakshi
Sakshi News home page

లక్నోపై ముంబై ఇండియన్స్‌ గెలుపు

May 4 2026 7:16 PM | Updated on May 4 2026 11:22 PM

IPL 2026, Match 47: Mumbai Indians vs LSG Updates and Highlights

లక్నోపై ముంబై ఇండియన్స్‌ గెలుపు
ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 4) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడ్డాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నోపై ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా.. ముంబై ఇండియన్స​్‌ మరో 8 బంతులు మిగిలుండగానే (18.4 ఓవర్లు) 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

రోహిత్‌ శర్మ (84) ఔట్‌
13.6వ ఓవర్‌- 44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసిన అనంతరం రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. 

విధ్వంసం సృష్టించి ఔటైన రికెల్టన్‌
10.5వ ఓవర్‌- రికెల్టన్‌ 32 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసి మొహిసిన్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఇంగ్లిస్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 

దంచికొడుతున్న రోహిత్‌, రికెల్టన్‌
229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. తొలి ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా ఏకంగా 71 పరుగులు చేశారు. రోహిత్‌ శర్మ (36), రికెల్టన్‌ (34) దంచికొడుతున్నారు. 

లక్నో భారీ స్కోర్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. నికోలస్‌ పూరన్‌ (21 బంతుల్లో 63; ఫోర్‌, 8 సిక్సర్లు), మిచెల్‌ మార్ష్‌ (25 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో లక్నో ఇంకా భారీ స్కోర్‌ సాధించేలా కనిపించింది. 

అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో స్కోర్‌ నెమ్మదించింది. ఆఖర్లో ఎయిడెన్‌ మార్క్రమ్‌ (25 బంతుల్లో 31 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌), హిమ్మత్‌ సింగ్‌ (31 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతగా ఆడి, ఊహించినంత కాకపోయినా ఓ మోస్తరు స్కోర్‌ అందించారు. 

మిగతా బ్యాటర్లలో జోష్‌ ఇంగ్లిస్‌ 13, కెప్టెన్‌ పంత్‌ 15, అరంగేట్రం ఆటగాడు అక్షత్‌ రఘువంశీ 11 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో కార్బిన్‌ బాష్‌ 2 వికెట్లు తీయగా.. ఘజన్‌ఫర్‌, విల్‌ జాక్స్‌, రఘు శర్మ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

ఒక్కసారి కుదుపు
పూరన్‌ క్రీజ్‌లో ఉన్నంత సేపు అతి భారీ స్కోర్‌ దిశగా సాగిన లక్నో.. అతను ఔట్‌ కాగానే ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. రెండు పరుగుల వ్యవధిలో (123-125) పూరన్‌తో పాటు మిచెల్‌ మార్ష్‌ (44) కూడా ఔటయ్యాడు. 

ఆ కొద్దిసేపటికే (148, 160 పరుగుల వద్ద) రిషబ్‌ పంత్‌ (15), అక్షత్‌ రఘువంశీ (11) కూడా పెవిలియన్‌ బాట పట్డారు. 13 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్‌ 164-5గా ఉంది. మార్క్రమ్‌ (10), హిమ్మత్‌ సింగ్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. ముంబై బౌలర్లలో కార్బిన్‌ బాష్‌ 2, ఘజన్‌ఫర్‌, విల్‌ జాక్స్‌, రఘు శర్మ తలో వికెట్‌ తీశారు.

పంత్‌ ఔట్‌
10.4వ ఓవర్‌- విల్‌ జాక్స్‌ బౌలింగ్‌లో రికెల్టన్‌కు క్యాచ్‌ ఇచ్చి రిషబ్‌ పంత్‌ (15) ఔటయ్యాడు.

ఒకే ఓవర్‌లో 2 వికెట్లు కోల్పోయిన లక్నో
8.5వ ఓవర్‌- కార్బిన్‌ బాష్‌ బౌలింగ్‌ నమన్‌ ధిర్‌కు క్యాచ్‌ ఇచ్చి మిచెల్‌ మార్ష్‌ (44) ఔటయ్యాడు. 

రెండో వికెట్‌ కోల్పోయిన లక్నో
8.1వ ఓవర్‌- కార్బిన్‌ బాష్‌ బౌలింగ్‌లో ర్యాన్‌ రికెల్టన్‌కు క్యాచ్‌ ఇచ్చి పూరన్‌ (63) ఔటయ్యాడు.

దంచికొడుతున్న  లక్నో..
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ దంచికొడుతుంది. ఏడు ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్‌ నష్టానికి 106 పరుగులు చేసింది. పూరన్‌ (47), మిచెల్‌ మార్ష్‌ (43) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 15 పరుగులు చేసిన జోస్‌ ఇంగ్లిస్‌ గజన్‌ఫర్‌ బౌలింగ్‌లో సూర్యకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 4) జరుగుతున్న 47వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా స్వల్ప అస్వస్థత కారణంగా ఈ మ్యాచ్‌లో ఆడటం​ లేదని స్కై తెలిపాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ కూడా బరిలోకి దిగుతున్నాడు. 

హిట్‌మ్యాన్‌ గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ కోసం​ ముంబై మరో మార్పు కూడా చేసింది. ట్రెంట్‌ బౌల్ట్‌ స్థానంలో కార్బిన్‌ బాష్‌ తుది జట్టులోకి వచ్చాడు.

తుది జట్టు..

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, మహమ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, AM ఘజన్‌ఫర్, రఘు శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement